ద్రవ్యోల్బణం వెంటాడుతున్నా ఆంధ్రప్రదేశ్‌ ప్రగతిపథంలోనే.. | Andhra Pradesh Is Still On The Path Of Progress Despite The Inflation | Sakshi
Sakshi News home page

ద్రవ్యోల్బణం వెంటాడుతున్నా ఆంధ్రప్రదేశ్‌ ప్రగతిపథంలోనే..

Published Thu, Nov 9 2023 4:40 PM | Last Updated on Thu, Nov 9 2023 4:53 PM

Andhra Pradesh Is Still On The Path Of Progress Despite The Inflation - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయం, కార్మికరంగం.. ఇలా ఏ రంగంలో చూసిన గతంతో పోలిస్తే అభివృద్ధి చెందింది. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నా.. ద్రవ్యోల్బణం వెంటాడుతున్నా దేశంలోని కొన్ని రాష్ట్రాలు తిరిగి వాటి పూర్వస్థితి కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాయి. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నో రంగాల్లో ముందుంది.

  • రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు స్థాపించాలంటే వివిధ శాఖల అనుమతులు అవసరం అవుతాయి. అవి పొందాలంటే యాజమాన్యాలకు కొంత శ్రమతో కూడుకున్న వ్యవహరం. అయితే వీటన్నిటినీ కేంద్రీకృతం చేసి ఇండస్ట్రీయల్ సింగిల్ విండో క్లియరెన్స్‌ను అమలులోకి తెచ్చిన వాటిల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి రాష్ట్రం.
  • 2023-24 సంవత్సరానికిగాను స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.14,49,501 కోట్లుగా ఉంది. ఇది చంద్రబాబు పాలన ముగిసిన 2018-19కి గాను రూ.8,70,849 కోట్లుగా ఉండేది. గడిచిన ఈ కొన్నేళ్లలో ఇది దాదాపు 65 శాతం ఎక్కువ.
  • 2021-22లో స్థూల విలువ ఆధారిత (జీవీఏ)వృద్ధి 18.47%గా ఉంది.
  • దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా, నాణ్యమైన మౌలిక సదుపాయాలను సృష్టించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. అక్టోబర్ 2019 నుంచి మార్చి 2023 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చిన విదేశీ సంస్థాగత పెట్టుబడులు రూ.6వేల కోట్లు. 
  • 2023లో రాష్ట్ర సరుకుల ఎగుమతులు రూ.1.58లక్షల కోట్లు. ఇందులో గరిష్ఠంగా సముద్ర ఉత్పత్తుల వల్ల దాదాపు 13.62% వాటా చేకూరింది.
  • కొత్త పారిశ్రామిక విధానం ద్వారా రూ.22,282.16 కోట్లతో భారీ, మెగా పారిశ్రామిక ప్రాజెక్టులు స్థాపించేలా ప్రభుత్వం కృషిచేసింది. 
  • టీడీపీ హయాంలో పరిశ్రమల అభివృద్ధిలో 27వ స్థానానికి దిగజారిన రాష్ట్రం ప్రస్తుతం మూడో స్థానానికి ఎగబాకింది.
  • ఏప్రిల్ 2023 నాటికి, ఆంధ్రప్రదేశ్ మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 26,675.73 మెగావాట్లు. 
  • సోలార్ పవర్, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల అభివృద్ధి కోసం రాష్ట్రం ప్రత్యేక చట్టాలను చేసింది.
  • తలసరి ఆదాయంలో చంద్రబాబు హయాంలో 17 స్థానంలో నిలిచిన రాష్ట్రం ప్ర​స్తుతం 9వ స్థానానికి ఎదిగింది.
  • టీడీపీ ప్రభుత్వకాలంలో కేవలం 34000 ఉద్యోగాలు ఇచ్చారు. కానీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4.93లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. అందులో 2.13లక్షల శాశ్వత కొలువులు ఉ‍న్నాయి.
  • వ్యవసాయంలో రాష్ట్రం మైనస్‌ 6.5శాతంతో  టీడీపీ కాలంలో అధ్వానంగా మారింది. అదే 2021-22కు గాను 8.2 శాతం వృద్ధి చెందింది. దాంతో వ్యవసాయ వృద్ధిలో దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. 2022-23కుగాను వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.13,640 కోట్లు కేటాయించారు.
  • నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా 24,620 పాఠశాలల్లోని వసతులను మెరుగుపరిచారు. 
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement