సంక్షేమం కోసం అభివృద్ధిని పక్కనబెట్టినా, అభివృద్ధి పేరుతో సంక్షేమాన్ని విస్మరించినా కష్టమే. ‘నాలుగు బిల్డింగ్‌లు కట్టినంత మాత్రాన అభివృద్ధికాదు, నిన్నటి కంటే ఈ రోజు బాగుండటం, ఈ రోజు కంటే రేపు బాగుంటుందనే నమ్మకం కలిగించగలిగితే దాన్నే అభివృద్ధి అంటారు’ అనే కొత్త నిర్వచనంతో జగన్ ప్రభుత్వం దూసుకెళ్లింది. ఆర్భాటాలకు తావులేకుండా పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందువరుసలో నిలిపిన అనితర సాధ్యుడు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా..
రూ.13.11 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు
అభివృద్ది అంటే ఒక్కరోజులో సాధ్యపడేది కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాల అభివృధి, ఉపాధి కల్పన, పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడం, పారిశ్రామిక పాలసీలను సులభతరం చేస్తూ.. రాష్ట్ర అభివృధికి అనుగుణంగా ఆ చట్టాలను మారుస్తూ.. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించారు. అప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేశారు. వేగంగా ఉత్పత్తి ప్రారంభించేలా పారిశ్రామికవేత్తలు అడుగులు వేశారు. గత ప్రభుత్వం హయాంలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు(జీఐఎస్)లో భాగంగా రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు కుదిరాయి. ఆ యూనిట్లలో ప్రధానంగా గ్రీన్‌ల్యామ్, డీపీ చాక్లెట్స్, అగ్రోవెట్, సీసీఎల్ ఫుడ్ అండ్ బేవరిజెస్, గోద్రెజ్ అగ్రోవెట్, ఆర్‌ఎస్‌బీ ట్రాన్స్ మిషన్స్, సూక్మా గామా, ఎల్‌ఎల్‌పీ.. వంటి సంస్థలు ఉన్నాయి.
ఎన్నో ప్రాజెక్ట్‌ల నిర్మాణ పనులు
ఇవే కాకుండా రూ.1,29,832 కోట్ల విలువైన మరో 87 యూనిట్లకు భూ కేటాయింపు పూర్తయి నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ కంపెనీల ద్వారా మరో 1,31,816 మందికి ఉపాధి లభించనున్నట్లు అప్పటి ప్రభుత్వం తెలిపింది. అదనంగా 194 యూనిట్లు డీపీఆర్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాయి. అప్పట్లో సుమారు రూ.2,400 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ పనులకు భూమి పూజ, వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ రంగం సిద్ధం చేసింది. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన సుమారు 12కు పైగా ప్రాజెక్టులను అభివృద్ధి చేశారు.
మెరుగైన ప్రణాళికలు
ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 5వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రూ.280 కోట్లతో సిగాచీ ఇండస్ట్రీస్ ఫార్మా యూనిట్‌ను గత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని యోచించింది. అక్కడే రూ.90 కోట్లతో ఆర్‌పీఎస్ ఇండస్ట్రీస్ న్యూట్రాస్యూటికల్స్ తయారీ యూనిట్‌ను కూడా సిద్ధం చేయాలని చూసింది. అందులో భాగంగా ఈ రెండు యూనిట్ల నిర్మాణ పనులను వర్చువల్‌గా ప్రారంభించింది. నంద్యాల వద్ద రూ.550 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమైంది. వీటితో పాటు మరికొన్ని యూనిట్లను ప్రారంభించడానికి మెరుగైనా ప్రణాళికలతో పరిశ్రమల శాఖ అధికారులు కసరత్తు చేశారు.
ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై పన్ను మినహాయించేనా?
జగన్ హయాంలో ఏపీ నంబర్ వన్
జగన్‌మోహన్ రెడ్డి హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉంది. అధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈ రంగానికి మాజీ సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. సుమారు రూ.263 కోట్ల వ్యయంతో 18 చోట్ల పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్‌ఎఫ్‌సీ)లను అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ప్రతి జిల్లాకు కనీసం రెండు ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పని చేశారు. జగన్ హయాంలో రాష్ట్రంలో 3.87 లక్షల ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటైనట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంతకుముందు టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈల సంఖ్య 1,93,530 మాత్రమే ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment