సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను అనేక దేశాల్లోని ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం అక్కడి బే ఏరియా, డల్లాస్, అట్లాంటా, న్యూయార్క్, న్యూజెర్సీ తదితర ప్రాంతాల్లో ఎన్నారైలు వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా భారీఎత్తున కేక్‌లు కట్‌చేసి.. విందు భోజనాలతో ఘనంగా నిర్వహించారు. అలాగే.. బ్రిటన్‌లోనూ అంగరంగ వైభవంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి.
లండన్ ఈస్ట్ హాంలో వైఎస్సార్‌సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్‌చింతా ప్రదీప్, ఓబుల్‌రెడ్డి పాతకోట అధ్యక్షతన నిర్వహించిన జగన్ జన్మదిన వేడుకల్లో ఆ దేశం నలుమూలల నుంచి జగన్ అభిమానాలు భారీఎత్తున పాల్గొని అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా చింతా ప్రదీప్ మాట్లాడుతూ.. ఒకటే జీవితం, ఒక్కటే రాజకీయ పార్టీ, ఒక్కడే నాయకుడు వైఎస్ జగన్ అని చెప్పడంతో జై జగన్ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ విమలారెడ్డి తనయుడు యువరాజ్‌రెడ్డి ఆన్‌లైన్‌లో యూకేలోని అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.
ఎన్నారైలకు అభినందనలు : చెవిరెడ్డి
అనేక దేశాల్లో భారీఎత్తున వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించిన ఎన్నారైలను ఆ పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభినందించారు. జగన్ పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలతో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం తథ్యమని.. జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయమని చెప్పారు.
సింగపూర్‌లోనూ సంబరాలు..
వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు సింగపూర్‌లో కూడా ఆదివారం ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సింగపూర్ వైఎస్సార్‌సీపీ కన్వీనర్ మురళీకృష్ణారెడ్డి, అడ్వైజర్ కోటిరెడ్డి, మలేసియా కన్వీనర్ భాస్కర్‌రెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో జగన్ అభిమానులు పాల్గొన్నారు. సంక్షేమ పాలన అందించడంలో తండ్రిని మించిన తనయుడిగా.. అన్ని వర్గాల ప్రజలకు ఆప్తబంధువుగా.. విద్య, వైద్యం, పోర్టులు నిర్మించి అభివృద్ధికి బాటలు వేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపారని జగన్‌ను కొనియాడారు.
మరిన్ని ఎన్‌ఆర్‌ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!
దుబాయ్‌లో అత్యంత వైభవంగా..
ఇక యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరావు, వైఎస్సార్‌సీపీ ఎన్నాౖరె కమిటీ సలహాదారు ప్రసన్న సోమిరెడ్డి, వైఎస్సార్‌సీపీ యూఏఈ కో–కన్వీనర్ మైనర్ బాబు, తదితరుల ఆధ్వర్యంలో దుబాయ్‌లోని హోటల్ విస్తాలో నిర్వహించిన వేడుకల్లో ఆ దేశం నలుమూల నుంచి అభిమానులు భారీఎత్తున పాల్గొన్నారు. అనంతరం.. కారుమూరి నాగేశ్వరావు తదితర వక్తలు జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా శక్తివంచన లేకుండా పనిచేసి వైఎస్సార్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించుకుని.. వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా చేద్దామని పిలుపిచ్చారు. మరోవైపు.. కెనడా, ఖతార్, నెదర్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా (మెల్‌బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్), జర్మనీ తదితర దేశాల్లోనూ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు
Comments
Please login to add a commentAdd a comment