celebrartions
-
మృణాల్ ఠాకూర్ ఇంట్లో పండుగ.. ఆ పాత ఫోటోలను షేర్ చేసిన బ్యూటీ
-
డాలస్‌లో ఘనంగా అక్కినేని శతజయంతి వేడుకలు..!
దాదాసాహెబ్ పురస్కార గ్రహీత, పద్మవిభూషణ్, నట సామ్రాట్, డా. అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినమైన సెప్టెంబర్ 20న డాలస్ నగరం (యాలెన్, రాధాకృష్ణ టెంపుల్ ఆడిటోరియం) లో క్రిక్కిరిసిన అక్కినేని అభిమానులందరి మధ్య అక్కినేని శతజయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, పూర్వాధ్యక్షులు రవి కొండబోలు, రావు కల్వాల, శారద ఆకునూరి, చలపతిరావు కొండ్రకుంట, డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, ధామ భక్తవత్సలు వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఏఎఫ్.ఏ ప్రస్తుత అధ్యక్షులు మురళి వెన్నం అందరికీ స్వాగతం పలికి డా. అక్కినేనితో ఉన్న సన్నిహిత అనుబంధాన్ని, గత పది సంవత్సరాలగా ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను ఉదాహరణంగా వివరించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినదర్శకులు వి.ఎన్ ఆదిత్య డా. అక్కినేనికి తొలిసారి తాను రాసుకున్న సినిమాకథను వినిపించడం, ఆయన కథ విని ఇచ్చిన సలహాలు, తన జీవితాంతం పాటించే విలువైన అంశాలు అన్నారు. విశిష్టఅతిథిగా పాల్గొన్న తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ ఛైర్మన్ మోహన్ శ్యాం ప్రసాద్ మునగాల మాట్లాడుతూ స్వయంకృషితో ఎవ్వరూ ఊహించని ఎత్తుకు ఎదిగిన ఏ.ఎన్.ఆర్ జీవితం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు.ప్రత్యేక అతిథులుగా హాజరైన పంచ సహస్రావధాని డా. మేడసాని మోహన్, అచ్చతెలుగు అవధాని డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ లు డా. అక్కినేనితో తమ అనుభవాలను పంచుకుంటూ ఆయన పెద్దగా చదువుకోలేక పోయినప్పటికీ ఆయన చేసిన విద్యాదానం ద్వారా ఎంతోమంది విద్యావంతులను సృష్టించిన మేధావి అక్కినేని అంటూ కొనియాడారు.ఈ కార్యక్రమ ముఖ్యపోషకులు, ఏ.ఎన్.ఆర్ కళాశాల, గుడివాడ పూర్వవిద్యార్ధి అయిన కిషోర్ కంచర్ల తన కళాశాల అనుభవాలను పంచుకున్నారు. అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వారి ఆధ్వర్యంలో ‘సినీ విజ్ఞాన విశారద’ ఎస్.వి రామారావు రచించిన “అక్కినేని ఆణిముత్యాలు” (అక్కినేని శతజయంతి – శతచిత్ర విశేషాలు) అనేగ్రంథాన్ని వి.ఎన్ ఆదిత్య ఆవిష్కరించారు. అక్కినేని శతజయంతి సందర్భంగా వెలువరించిన ప్రత్యేక సంచికను మోహన్ శ్యాం ప్రసాద్ ఆవిష్కరించి తొలిప్రతిని అవధాని డా. పాలపర్తికి అందజేశారు. ఈ సందర్భంగా అక్కినేని కుటుంబసభ్యులు అక్కినేని నాగార్జున, వెంకట్, నాగసుశీల, సుమంత్, సుశాంత్ లు అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలు విజయవంతం కావాలని శుభాకాంక్షలు అందజేసిన వీడియో సందేశాలను ప్రదర్శించారు.అక్కినేని చిత్రాలలోని కొన్ని పాటలకు స్త్రీ వేషధారణలో నృత్యం చేసిన పురుషుడు చంద్రశేఖర్ రెడ్డి లోకా, రషీద్‌ల జంట అందరినీ ఆకట్టుకుంది. అక్కినేని చిత్ర గీతాంజలి పేరిట మాయాబజార్, దొంగరాముడు, మాంగల్య బలం, ఆత్మీయులు, అనార్కలి, సుమంగళి, కులగోత్రాలు, ఆత్మబలం, శ్రీ రామదాసు, మనసు మాంగల్యం, రావణుడే రాముడైతే, ఇద్దరు మిత్రులు, పెళ్లి కానుక, ఏడంతస్తుల మేడ, ఆలుమగలు, ప్రేమ మందిరం, డాక్టర్ చక్రవర్తి, గాండీవం మొదలైన చిత్రాలనుండి అనేక మధురమైన గీతాలను శారద ఆకునూరి, చంద్రహాస్ మద్దుకూరి, రవి తూపురాని, నాగి పార్థసారథి, శ్రీకాంత్ లంకా, జయకళ్యాణి, సృజన ఆదూరి బృందం శ్రావ్యంగా పాడి అందరినీ అలరించారు. క్కినేని శతజయంతి ప్రత్యేక సంచికను రూపకల్పనచేసి, తీర్చిదిద్దడంలో ఎంతో సమయాన్ని వెచ్చించిన కమిటీ సమన్వయకర్త సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు, లెనిన్ బాబు వేముల మరియు దయాకర్ మాడలను పాల్గొన్న అతిథులందరినీ, నృత్య కళాకారులను, గాయనీ గాయకులను ఎ.ఎఫ్.ఎ బోర్డు సభ్యులు ఘనంగా సన్మానించారు.అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “డా. అక్కినేనిలో ఉన్న నటనకన్నా ఆయనలోని విశిష్ట లక్షణాలను అధ్యయనంచేసి అనుసరించ వలసినవి, ఏ రంగంలో ఉన్నవారికైనా ఉపయోగపడేవి ఎన్నో ఉన్నాయన్నారు.” శారద ఆకునూరి తన వందనసమర్పణలో షడ్రుచుల విందు భోజనం అందించిన బావర్చి రెస్టారెంట్ యజమాని, ఈ కార్యక్రమ ముఖ్యపోషకులు అయిన కిషోర్ కంచర్ల, మంచి వేదికను కల్పించిన రాధాకృష్ణ టెంపుల్ యాజమాన్యానికి, వీడియో, ఆడియో, ఫోటోగ్రఫీ సహకారం అందించిన వారికి, కార్యకర్తలకు ఎఎఫ్ఎ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.(చదవండి: అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ఏఎన్ఆర్ శతజయంతి వేడుకలు) -
సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు!
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను సెంగ్ కాంగ్‌లోని అరుళ్ముగు వేలు మురుగన్ జ్ఞానమునీశ్వర్ ఆలయంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ క్రోధి నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ వేడుకల్లో బాగంగా పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఆ తరువాత సింగపూర్ స్థానిక కాలమాన ప్రకారం ప్రత్యేకంగా వ్రాయించిన గంటల పంచాంగాన్ని సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ గంటల పంచాంగాన్ని ప్రముఖ జ్యోతిష పండితులు, పంచాంగ కర్తలు కప్పగన్తు సుబ్బరామ సోమయాజులు, మార్తి శివరామ యజ్ఞనారాయణ శర్మ గార్లు సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో సుమారు 500 వరకు ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులతో పాటు ఇతర రాష్ట్రాల వారు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి పులిహోర మొదలగు ప్రసాదం పంపిణి చేయడం జరిగింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా నంగునూరి సౌజన్య, జూలూరు పద్మజ, మాదారపు సౌజన్య, దీప నల్లా మరియు బసిక అనిత రెడ్డి, వ్యవరించారు. ఈ ఉగాది వేడుకలు విజయవంతంగా జరుగుటకు, అలాగే ప్రసాదానికి సహాయం అందించిన దాత లకు, స్పాన్సర్సకు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి టీసీఎస్ఎస్ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్ కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి మొదలగు వారు భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఈ వేడుకలు ఇంతలా ఘనంగా జరగడానికి చేయూతనందించిన మై హోమ్ కంస్ట్రక్షన్ వారికి, చమిరాజ్ రామాంజనేయులు (టింకర్ టాట్స్), మన్నము శ్రీమాన్ (గరంటో అకాడమీ), రాజిడి రాకేష్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉగాది వేడుకల్లో పప్పు దుర్గా శర్మ గారి వద్ద సాంప్రదాయ నృత్యం నేర్చుకుంటున్న విద్యార్థులు రామిరెడ్డి శ్రేష్ఠ రెడ్డి, శ్రీవర్షిత రెడ్డి బండి, కంభంపాటి సాయి శాన్వి, లేష్ణ లలిత అన్నం, దేవగుప్తపు సమన్విత, కుప్పం వైష్ణవి సహస్ర, కొండపల్లి చిశితలు అష్టలక్ష్మి, దేవ దేవం భజే కీర్తనలతో ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. (చదవండి: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఉగాది ఉత్తమ రచనల పోటీ!) -
యుకెలో అంబరాన్నంటిన గోదారోళ్ళ సంక్రాంతి సంబరాలు
ఈ సంవత్సరం యుకెలో జరిగిన సంక్రాంతి సంబరాలు సుమారు 1300 మంది ఆహూతులతో లండన్ హారో లీజర్ సెంటర్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. గత కొద్ది సంవత్సరాలుగా యుకెలో తెలుగువారు నిర్వహించుకునే వేడుకలలో గోదారోళ్ళ సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక స్థానం ఉంది. గోదావరి రుచులకు, అక్కడి పిండివంటలకు, ఆప్యాయతలకు, ఆచారాలకు, సంస్కృతికి ప్రాధాన్యతనిస్తూ భోగిపళ్ళతో మొదలుకొని, గొబ్బిళ్ళు, హరిదాసు, ముగ్గులు ఇంకా ఎన్నో పాటలు, నృత్యాలు, నృత్యరూపకాలు ఆద్యంతం అలరించాయి. సంబరానికి హాజరైన వారందరినీ పేరుపేరునా మర్యాదపూర్వక పిలుపులతో ఆహ్వానించి గ్రూప్ సభ్యులు తమదైన శైలిని చాటిచెప్పారు. అరిటాకులలో సహబంతి భోజనాలు, అన్నవరం ప్రసాదం, పనసపొట్టు పులావు, కొబ్బరన్నం, మామిడికాయ పనసగింజల కూర, పొన్నగంటి పప్పు, వంకాయ పకోడీ కూర, ములక్కాడ జీడిపప్పు కూర్మ, బెల్లం మాగాయి, మజ్జిగ పులుసు, ఉసిరికాయ చారు, కంద ఆవకాయ, సొరకాయ రోటి పచ్చడి, గారెలు, పెరుగు చట్నీ, కోడి కూర, మటన్ ఫ్రై, రొయ్యల ఇగురు మొదలైన వివిధ రకాల వంటకాలను గోదారోళ్ళ గ్రూప్ సభ్యులు స్వయంగా వండి వడ్డించడం ఇందులో విశేషం. ఇవేకాక రాజమండ్రి రోజ్ మిల్క్, జున్ను వంటివి అందరినీ ఆశ్చర్యపరిచి కొస మెరుపుగా నిలిచాయి. ఈ వేడుకలకు హాజరైన వివిధ ప్రాంతాల వారు గోదారోళ్ళ రుచులతో పాటు వారి సహకారాన్ని, వెటకారాన్ని, మమకారాన్ని మెచ్చుకోవడమే కాక అక్కడ నిర్వహించిన లక్కీడ్రాలో బంగారం, వెండి మొదలైన బహుమతులను గెలుచుకొన్నారు. జంతికలు, మైసూరుపాకు మరియు కరకజ్జంతో కూడిన సారెను అందరికీ పంచడంతో ఈ వేడుకలు ఘనంగా ముగిసాయి. -
నేత్రపర్వంగా మైసూరులో దసరా
మైసూరు: కర్ణాటకలో మైసూరు పట్టణంలో దసరా ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన జంబూ సవారీ ఏనుగుల ఊరేగింపు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖుల పూజలు, వేలాది మంది జనం మధ్య గజరాజులు ప్యాలెస్ నుంచి బన్ని మండపం వరకూ సుమారు 5 కిలోమీటర్లు ఊరేగింపుగా వెళ్లి వచ్చాయి. చాముండేశ్వరి అమ్మవారి విగ్రహంతో కూడిన 750 కిలోల బరువైన బంగారు అంబారీని అభిమన్యు ఏనుగుపై ప్రతిష్టించారు. మరో 13 ఏనుగులకు సీఎం సిద్దరామయ్య, మైసూరు రాజవంశీకులు తదితరులు ప్యాలెస్ వద్ద పూజలు చేసి మధ్యాహ్నం ఊరేగింపునకు నాంది పలికారు. అంతకుముందు, సీఎం సిద్దరామయ్య నంది ధ్వజ పూజలో పాల్గొన్నారు. సాయుధ బలగాల కవాతు, మేళతాళాలు, కళాకారుల ప్రదర్శనలు, 31 జిల్లాకు చెందిన శకటాల నడుమ ఏనుగులు ముందుకు సాగాయి. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవం(నాదహబ్బ)గా దసరా వేడుకలను నిర్వహిస్తుంది. 10 రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. వీటిని తిలకించేందుకు విదేశాల నుంచీ జనం తరలివచ్చారు. Glimpse of Jumboo Savari reaching Bannimantapa and Ambaari taken back to Mysuru Palace 🙏🙏 VC : Suhas Shivaay#MysuruDasara2023 pic.twitter.com/gX3ykOOn3K — Mysuru Memes (@MysuruMemes) October 25, 2023 -
సింగపూరులో ఘనంగా తెలుగుతోరణం వేడుకలు
సింగపూరు తెలుగు టీవీ వారు నిర్వహించిన తెలుగుతోరణం తెలుగు నీతిపద్యాల పోటీ చివరి వృత్తం దాదాపు మూడు వందల ప్రేక్షకుల నడుమ, ప్రత్యక్ష ప్రసారంగా ఘనంగా నిర్వహించారు. సింగపూరు తెలుగు ప్రముఖులు డా. బి. వీ. ఆర్. చౌదరి, రాజ్యలక్ష్మి దంపతులతో పాటుగా సింగపూరు నందు ఉన్న తెలుగు సంస్థలు సింగపూరు తెలుగు సమాజం, తెలంగాణా కల్చరల్ సొసైటీ సింగపూరు, కాకతీయ సాంస్కృతిక పరివారము, శ్రీ సాంస్కృతిక కళా సారధి, పోతన భాగవత ప్రచార సమితి సంస్థల ప్రతినిధులతో పాటుగా తెలుగు సమూహాలు అయిన మనం తెలుగు, అమ్ములు, తెలుగు వనితలు, ప్రాడ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు హాజరయ్యి ఈ కార్యక్రమం ఆసాంతం వీక్షించి తమ అభినందలను తెలియచేసారు. కార్యక్రమ తదనంతరం నిర్వహకులు వారిని కృతజ్ఞతా జ్ఞాపికలతో సత్కరించారు. అదే విధంగా కార్యక్రమం అనుకున్నది మొదలు ఎందరో తమంత తాముగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమ నిర్వహణకుగా తమ వంతు సహాయ సహకారాలు అందించారు. వారిని కూడా ఈ వేదిక మీద సత్కరించడం జరిగింది. సుమారు 20 మంది చిన్నారులతో పది వారాల పాటు జరిగిన ఈ పద్యాల పోటీ సింగపూరులోనే మొట్టమొదటి తెలుగు రియాలిటీ షోగా నిలిచి ఇక్కడ ఉన్న చిన్నారులలోని తెలుగు ప్రతిభా పాటవాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఎన్నెన్నో పద్యాలు నేర్చుకుని, పద్యం చెప్పడమే కాకుండా దాని భావాన్ని, అర్ధాన్ని ఉదాహరణలతో, చిన్ని చిన్ని నీతి కథలతో సహా వివరించడం ఈ పోటీపై వారికున్న ఇష్టాన్ని, శ్రద్దను తెలియ చేసింది, ప్రేక్షకులను అలరించింది. చిన్నారుల తల్లి తండ్రులు మాట్లాడుతూ ఈ పోటీ వల్ల తమకు కూడా మరొక్కసారి ఈ నీతి పద్యాలను చదువుకునే అవకాశం కలిగిందన్నారు. దాని అర్ధాలు ఇప్పటి సమాజానికి ఎలా వర్తిస్తాయో కూడా అన్వయించుకోవడం వల్ల ఈ పోటీ తమకు కూడా జీవితానికి ఒక రివిజన్ లా అనిపించిందని చెబుతున్నారు. అలాగే ఈ కార్యక్రమం చూసిన స్పూర్తితో ఇంటి వద్ద తమ చిన్నారులు కూడా తెలుగు నీతి పద్యాలను నేర్చుకుంటున్నారు అని కార్యక్రమానికి హాజరైన తెలుగు వారు తెలియచేయడం జరిగింది. ఈ పోటీలో మొదటి స్థానంలో ఓరుగంటి రాధా శ్రీనిధి, రెండవ స్థానంలో సూదలగుంట ఆరాధ్య మూడవ స్థానంలో సింగిరెడ్డి శ్రీనిత విజేతలుగా ఎన్నికయ్యారు. విజేతలతో పాటుగా కార్యక్రమంలో పాల్గొన్న పోటీదారులందరికీ తెలుగు ప్రముఖులలు జ్ఞాపికలు అందించడంతో పాటుగా దాదాపు 3 వేల డాలర్ల వరకూ నగదు బహుమతులు కూడా అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారికీ అలాగే సాంస్కృతికి కార్యమాలు ప్రదర్శించిన వారు అందరికీ తెలుగు ప్రముఖుల చేతుల మీదుగా జ్ఞాపికలు ప్రధానం చేయడం జరిగింది. అదే విధంగా కార్యక్రమాన్ని, పోటీలో పాల్గొన్న చిన్నారులనూ దీవిస్తూ శసాయి కుమార్, తనికెళ్ళ భరణి, రారాధికా, భువన చంద్ర వంటి సినీ ప్రముఖులు పంపిన వీడియో సందేశాలను కూడా వేదిక మీద ప్రదర్శించడం జరిగింది. కార్యక్రమ నిర్వాహకులు రాధా కృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్న మాట్లాడుతూ సింగపూరు నందు ఉన్న అన్ని తెలుగు సంస్థలూ అలాగే అందరు తెలుగు ప్రముఖులూ ఒకే సారి ఈ వేదిక మీదకు వచ్చి తమకు ఆశీర్వాదాలు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అన్ని తెలుగు సంస్థల ఆశీస్సులతో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం తమ కల అని అది ఈ రోజు నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తమ తమ చదువులతో బిజీగా ఉన్నా తెలుగు భాష మీద మక్కువతో పద్యాలు నేర్చుకుని కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు, వారికి శిక్షణ ఇచ్చిన తల్లి తండ్రులకు కృతజ్ఞతలు తెలియచేసారు నిర్వాహకులు. ఇది తెలుగు భాషకు తమ వంతుగా చేసుకున్న ఒక చిన్న సేవ అని సగర్వంగా చెప్పారు. ఇంత పెద్ద వేదిక మీద ఇంతటి పెద్ద కార్యక్రమం పది భాగాలుగా నిర్వహించగలగడం అందరి తెలుగు వారి సహకారంతో మాత్రమే సాధ్యమైందన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం స్పూర్తితో ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు సింగపూరు నుంచి వస్తాయని ఆశిస్తున్నామని వాటికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ఈ నీతి పద్యాల పోటీకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన రాంబాబు పాతూరి, అపర్ణ గాడేపల్లి మరియు సౌభాగ్యలక్ష్మి తంగిరాల వారికి ధన్యవాదాలు తెలిపారు. ఆ న్యాయ నిర్ణేతలు ఈ కార్యక్రమ ప్రణాళికలో పాలుపంచుకుని పిల్లలకు అనువైన పద్యాలను ఎంపిక చేసి అందించడమే కాకుండా పిల్లలు చెప్పిన ప్రతి పద్యానికీ వివరణాత్మకమైన విశ్లేషణ చేయడమే గాక మరింత కొత్తదనంతో ఎలా నేర్చుకోవచ్చో సలహాలు అందించి వారిని ప్రోత్సహించారు. అలాగే వ్యాఖ్యాతలుగా కవిత కుందుర్తి, సుబ్బు పాలకుర్తి చిన్నారులు వేదిక మీద భయం లేకుండా పద్యాలు చెప్పేలా వారిని ఉత్సాహ పరిచి సరదా సరదా సంభాషణలతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేశారన్నారు నిర్వాహకులు రాధ కృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్నలు. (చదవండి: యూకేలో గాన గంధర్వునికి ఘనంగా సంగీత నివాళి!) -
ఏపీ భవన్లో ఘనంగా వైఎస్ జయంత్యుత్సవాలు
సాక్షి, న్యూఢిల్లీ: మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి, రైతు దినోత్సవ ఉత్సవాలను శుక్రవారం ఢిల్లీలోని ఏపీ భవన్లో ఘనంగా నిర్వహించారు. అఖిల భారత రైతు సమాఖ్య కార్యదర్శి మదన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమాఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వైఎస్ అని ఆయన కొనియాడారు. తండ్రి అడుగుజాడల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఇది కూడా చదవండి: 2024 తర్వాత బాబు ఏమైపోతాడోనని భయమేస్తోంది -
తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
-
పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
న్యూఢిల్లీ: పార్లమెంటు సెంట్రల్ హాల్లో శుక్రవారం రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకలకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు, ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నాయకత్వం వహించారు. వేడుకలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశిష్ట సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కాగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ప్రతిపక్షాలు బహిష్కరించాయి. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా ప్రతి ఏటా దేశవ్యాప్తంగా ఆ రోజున రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. చదవండి: మొదటిసారి ప్రయోగాత్మకంగా.. తగ్గేదే లేదంటున్న కర్ణాటక మహిళా పోలీసులు -
దిగ్విజయంగా కొనసాగుతున్న ఆటా నాదం పాటల పోటీలు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) నిర్వహిస్తోన్న ఆటా నాదం పాటల పోటీలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఆటా జూమ్ ద్వారా ఈ పోటీలు నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన దాదాపుగా 200 మంది గాయని గాయకులు ఈ పోటీలో పాల్గొన్నారు. అక్టోబర్ 23న ప్రిలిమినరీ రౌండ్ తో ప్రారంభించి సెమి ఫైనల్స్ నవంబర్ 6 న ముగిశాయి. సంగీత దర్శకులు, ప్లేబాక్ సింగర్ నిహాల్ కొందూరి , ప్లేబాక్ సింగర్ విజయ లక్ష్మి, సంగీత దర్శకులు సాయి శ్రీకాంత్ వెళ్లల, ప్లేబాక్ సింగర్ నూతన మోహన్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు నవంబరు 13న ఇరు తెలుగు రాష్ట్రాలనుండి పదకొండు మంది గాయని గాయకులు అభినవ్ అవసరాల, గీత మహతి పిసుపాటి, జ్యోస్న నిమ్మలపాడి, లక్ష్మి శ్రీవల్లి కాందూరి, లేఖ సదా ఫణిశ్రీ వీర,మేఘన నాయుడు దాసరి, నిగమ నెల్లుట్ల, ప్రణతి కే , సాయి శృతి పొలిశెట్టి, సాకేత్ కొమ్మజోస్యుల,వెంకట సాయి లక్ష్మి హర్షిత పాసాల ఫైనల్ రౌండ్ కు ఎంపిక అయ్యారు. గెలుపొందిన ఈ గాయని గాయకులు మ్యూజిక్ డైరెక్టర్ కోటి ప్రధాన న్యాయనిర్ణేతగా 2021 నవంబర్ 13న జరిగే ఫైనల్స్ లో పోటీపడబోతున్నారు. ఈ పోటీలో విజేతలకు 2021 డిసెంబరు 26 సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగే ఆటా వేడుకలు గ్రాండ్ ఫినాలేలో పాడే అవకాశం కల్పిస్తున్నారు. మొదటిసారి ఉత్తరాధ్యక్షులు మరియు ఆటా సేవ డేస్ మరియు ఆటా వేడుకల చైర్మన్ మధు బొమ్మినేని, పాలకమండలి సభ్యులు , సంయుక్త కార్యదర్శి, ఆటానాదం కోఆర్డినేటర్ రామకృష్ణా రెడ్డి ఆల , పాలక మండలి సభ్యులు సేవ డేస్ & ఆటా వేడుకల కో చైర్ అనిల్ బొద్దిరెడ్డి , పాలక మండలి సభ్యులు సేవ డేస్ & ఆటా వేడుకల కో చైర్ శరత్ వేముల, పాలకమండలి సభ్యులు ఆటా నాదం కోఆర్డినేటర్ శారద సింగిరెడ్డి మాతృదేశంలో ఇరు తెలుగురాష్ట్రాలలో ప్రతిభఉన్న గాయనిగాయకుల కోసం మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. -
అదరహో సదర్ సందడి.. విన్యాసాల దున్నల హడావుడి
-
ప్రముఖుల ఇంట కృష్ణాష్టమి వేడుకలు
-
హీరో సుధీర్ బాబు ఇంట్లో కృష్ణ పుట్టిన రోజు వేడుకలు, ఫొటోలు వైరల్
అల్లూరి సీతారామ రాజుగా తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయిన సూపర్ స్టార్ కృష్ణ నేటితో 78వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. హీరోగా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుని సాహసానికి మారుపేరుగా నిలిచారు ఆయన. నేడు (మే 31) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు బర్త్‌డే విషెష్ తెలుపుతున్నారు. అలాగే ఆయన తనయుడు, సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తండ్రికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ఇదిలా ఉండగా కృష్ణ చిన్నల్లుడు, హీరో సుధీర్ బాబు ఆయన జన్మదిన వేడుకలను తన ఇంటిలో గ్రాండ్‌గా ఏర్పాటు చేశాడు. కృష్ణ సతీమణి ఇందిర, మిగతా కుటుంబ సభ్యులు సమక్షంలో ఆయన కేక్ కట్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు, పెద్ద అల్లుడు గల్లా జయదేవ్, నటుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Padmini Priyadharshini (@padmini.priyadharshini.5) ఇక మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా కృష్ణకి శుభాకాంక్షలు తెలియజేశారు. “సాహసానికి మారుపేరు, మల్లెపువ్వు లాంటి మనిషి సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వారు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే సార్” అంటూ ట్వీట్లో రాసుకొచ్చాడు. సాహసానికి మారుపేరు,మల్లెపువ్వు లాంటి మనిషి సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వారు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. Happy Birthday Sir! — Chiranjeevi Konidela (@KChiruTweets) May 31, 2021 -
గెలుపు సంబరాలపై కీలక ఆదేశాలు జారీచేసిన ఈసీ
న్యూఢిల్లీ : ఎన్నికల ఫలితాల అనంతం జరిపే విజయోత్సవాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా ఉధృతి నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఐదు రాష్ట్రాల సీఎస్‌లకు భారత ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కాగా నేడు (మే 2) నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల్లోని ప్రాంతాల్లో గెలిచిన అభ్యర్థుల మద్దతుదారులు విజయోత్సవ ర్యాలీలు, రోడ్‌షోలు జరుపుకుంటున్నారు. కౌంటింగ్‌లో డీఎంకే, టీఎంసీ పార్టీ ముందజలో కొనసాగుతుండటంతో ఆ పార్టీ మద్దతుదారులు కోల్కత్తా, చెన్నైలలో వేడుకలు జరుపుకుంటున్నారు. ఈనేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలని, అతిక్రమించినవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. పనిలో అలసత్వం వహించిన సంబంధిత ఎస్‌హోచ్‌ఓను సస్పెండ్ చేయాలనే ఆదేశించింది. ప్రతి ఎఫ్ఐఆర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఐదు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు ట్విటర్లో పేర్కొంది. చదవండి: మే 2న ఎన్నికల కౌంటింగ్‌పై ఈసీ కీలక నిర్ణయం తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు: సంబరాల్లో డీఎంకే కార్యకర్తలు -
శివనామస్మరణతో మారుమోగుతున్న కీసరగుట్ట
-
ఫ్యాషన్ 2021: సౌకర్యమే స్టైల్
కరోనా కారణంగా దాదాపు పది నెలలు ఇంటి పట్టునే ఉన్నవారు కాస్తా ఇప్పుడిప్పుడే చిన్న చిన్న వేడుకలకి హాజరవడానికి సిద్ధపడుతున్నారు. 2020లో పండగలు, పార్టీలు, వేడుకలు, వైవిధ్యాలు.. అన్నీ ఇంట్లోనే. కంఫర్ట్ కోసం క్యాజువల్స్కే పరిమితం అయినా ఇక నుంచి గతం నేర్పిన పాఠాలతో కొత్తదనం నింపుకోక తప్పదు. 2021లో దుస్తుల ఎంపిక ప్రత్యేకంగా ఉంటుందనే ఆలోచనతో డిజైనర్లు సైతం ఆ దిశగా ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నారు. ఫ్యాషన్ పోకడల్లోనూ మార్పులు సంతరించుకోనున్నాయి. ఎంపికలు ప్రత్యేకంగా ఉండనున్నాయి. స్వీయ సంరక్షణ పేరిట తీసుకునే జాగ్రత్తల్లో మొదటి ఎంపిక ధరించే దుస్తులదే కాబట్టి మోర్ కేర్.. కంఫర్ట్ స్టైల్ ఈ సంవత్సరమంతా ట్రెండ్‌లో ఉండనుంది. మహమ్మారి సమయంలోనూ రాబోయే ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ డిజైనర్లైన తరుణ్ తహిలియాని, సబ్యసాచి, రోహిత్‌బాల్ వంటివారే కాకుండా వర్ధమాన డిజైనర్లు సైతం చేనేతలకు, హస్తకళలకు ప్రాముఖ్యమివ్వడం విశేషం. దేశవాళీ ఫ్యాబ్రిక్కే మొదటి స్థానం ఆభరణాల ఊసు లేకుండా ప్రింట్లున్న చేనేత దుస్తులు ఏ సీజన్‌కైనా నప్పుతాయన్నది డిజైనర్ల అభిప్రాయం. ఈ విధంగా చూస్తే దేశవాళీ కాటన్‌తో తయారైన ఫ్యాబ్రిక్ ఎంపిక పట్ల ఈ ఏడాది మరింత ఆసక్తి పెరగనుంది. ఒంటికి హాయిని, చెమటను పీల్చుకోదగినవి ఎంపికలో ముందండబోతున్నాయి. కాంతిమంతమైన రంగులు ఎంచుకున్నప్పటికి సౌకర్యానికి ప్రాధాన్యమిచ్చేలా వదులుగా ఉండే దుస్తులకే ఓటు వేయనున్నారు. లేత రంగులకే ప్రాధాన్యం.. ఇంటికే పరిమితమైన ప్రాణం బయటకు వచ్చినా కొన్నాళ్లపాటు ఇంకా సౌకర్యాన్నే కోరుకుంటుంది. అందుకే ఈ ఏడాది లేత రంగుల దుస్తులకే ప్రాధాన్యత పెరగనుంది. కంటికి, ఒంటికి హాయినిచ్చే రంగు దుస్తులు ట్రెండ్ కాబోతున్నాయి. అంతేకాదు, జెండర్ ప్రమాణాలను స్పష్టంగా చూపే గులాబీ, బ్లూ, పచ్చ, లావెండర్ రంగులు మరింత వెలుగులోకి రానున్నాయి. దుస్తుల్లో బేబీ పింక్ కలర్ ఈ దశాబ్దంలోనే ముందంజలో ఉంది. ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలు సైతం బేబీ పింక్‌లో డ్రెస్సులు, ఇతర ఉపకరణాలను రూపొందించాయి. ఇక ముందు ఇదే రంగు ముందంజలో ఉండబోతోంది. మళ్లీ మళ్లీ వాడదగిన వాటికే ఓటు గత సంవత్సరం ఫ్యాషన్ పోకడలను అప్పుడప్పుడే వదలలేం. అలాగని ఫ్యాషన్‌కి తగ్గట్టుగా మారకుండా ఉండలేం. అందుకే, సౌకర్యంతోపాటు వాడిన డ్రెస్సులను తిరిగి వాడుకునేలా చిన్న చిన్న మార్పులు చేసుకోదగిన దుస్తుల ఎంపిక ఈ ఏడాది ఉంటుంది. ఇప్పటికే వాడని దుస్తులను కొద్దిపాటి మార్పులు చేసుకుంటూ మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ధరించవచ్చు. పండగలు, పెళ్లి వేడుకలనూ ఈ మిక్స్ అండ్ మ్యాచ్‌తోనే గ్రాండ్‌గా రూపుకట్టనున్నారు. ఖర్చును కట్టడి చేయడానికి మిక్స్ అండ్ మ్యాచ్ ఒక ట్రెండ్‌గా మారనుంది. దీంట్లో భాగంగానే రెట్రో ట్రెండ్ ఉంటుంది. జిమ్ వేర్ టు క్యాజువల్ వేర్ ఆరోగ్యంగా ఉండటం, ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని తినడం, వ్యాయామశాలలకు వెళ్లడం వంటివి అత్యవసరం అయ్యాయి. దీంతో ఫ్యాషన్ వర్కౌట్ డ్రెస్సులకు డిమాండ్ పెరిగింది. వీటిలో గ్రాఫిక్ నమూనాలు, నాణ్యత గల డ్రెస్సుల ఎంపికవైపు జనం ఆసక్తి చూపుతున్నారు. వ్యాయామం కోసమే కాకుండా క్యాజువల్ వేర్‌గానూ విభిన్నంగా ఉపయోగించే దుస్తులు కూడా ఈ సంవత్సరం ట్రెండ్‌లో ఉండబోతున్నాయి. డిజైనర్ మాస్కులు డ్రెస్‌కి తగిన మాస్క్ అనేది జాబితాలో మరింత గ్రాండ్‌గా చేరిపోనుంది. కాటన్ డ్రెస్ వేసినప్పటికి, ముక్కును, నోటిని కవర్ చేసే మాస్క్ కొత్త కొత్త రూపాల్లో, డిజైనర్ టచ్‌తో వెలిగిపోనున్నాయి. ఎక్కడకు వెళ్లాలన్నా ముందు మాస్క్ తప్పనిసరి కాబట్టి వీటిమీద డిజైనర్లు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. డెనిమ్స్ ఫిట్ టు కంఫర్ట్ జీన్స్ గురించి ఆలోచన రాగానే చాలా మందిలో స్లిమ్ ఫిట్, టైట్ ఫిట్ అనేవే మెదులుతాయి. ఇక నుంచి డెనిమ్‌లోనూ కొంత వదులుగా ఉండేవి, సాగేవి, సౌకర్యానికి ప్రాముఖ్యాన్ని ఇచ్చేవాటి సంఖ్య పెరగనుంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఖాదీ ఫ్యాబ్రిక్‌కు మంచి డిమాండ్ ఉంది. ఈ విధంగా మన దేశీయ చేనేతలతో రూపొందించిన దుస్తుల మీద మందంగా ఉండే డెనిమ్ లేదా ఖాకీ కలర్ జాకెట్స్ ఇండోవెస్ట్రన్ స్టైల్‌తో ఆకట్టుకోనుంది. – నిర్మలారెడ్డి -
ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు
-
మంగళగిరిలో వైఎస్సార్ జయంతి వేడుకలు
-
టాంటెక్స్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
డల్లాస్: సూర్యుడు మకరరాశిలో చేరగానే వచ్చే పెద్ద పండగ సంక్రాంతి. ఈ పండగ తెలుగువాళ్లకు ఎంతో ఇష్టం అన్న విషయం తెలిసిందే. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను ప్రజలు ఎంతో ఘనంగా జరుగుపుకుంటారు. అమెరికాలోని తెలుగువారి కోసం.. అతిపెద్ద తెలుగు సంస్థలలో ఒకటైన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించింది. స్థానిక నిమిట్స్ హైస్కూల్లో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, చూడముచ్చటైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ కార్యక్రమంలో అచ్చమైన తెలుగు వాతావరణాన్ని ప్రతిబింబించేలా పాటలు, సంగీత, సాంస్కృతిక, నృత్య కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ సంక్రాంతి సంబరాలను ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) అధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు ఆధ్వర్యంలో కార్యవర్గ, పాలకమండలితో పాటు సమన్వయ కర్తలు తోపుదుర్తి ప్రబంద్, జొన్నలగడ్డ శ్రీకాంత్, సాంస్కృతిక సమన్వయ కర్త స్రవంతి యర్రమనేని నిర్వహించారు. ఈ కార్యక్రమం చిన్నారులు ఆలపించిన అమెరికా జాతీయ గీతంతో ప్రారంభమైంది. ఈ వేడుకలల్లో ముద్దుగారే యశోద, వందే మీనాక్షి, కృష్ణాష్టకం, మాస్ ఈజ్ గ్రేట్, చరణములే నమ్మితి అనే స్థానిక కళాకారుల నాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఈ కార్యక్రమనికి ప్రధాన వ్యాఖ్యాతగా వ్యవహరించిన సమీర ఇల్లెందుల ఆద్యంతం నవ్వుల పువ్వులు పూయించారు. గాయని, గాయకులు దామిని భట్ల, ధనుంజయ్ పాడిన పాటలు అరించాయి. టాంటెక్స్ తక్షణ పూర్వాధ్యక్షులు చినసత్యం వీర్నపు మాట్లాడుతూ.. గత ఏడాది నిర్వహించిన కార్యక్రమాల గురించి వివరించారు. సంస్థకి సేవ చేయడం తన అదృష్టమని ఆయన అన్నారు. అనంతరం 2020వ సంవత్సరానికి టాంటెక్స్ అధ్యక్షులుగా ఉన్న కృష్ణారెడ్డి కోడూరు మాట్లాడుతూ.. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సంస్థని సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం చేయకుండాదన్నారు. తమ కార్యవర్గం, పాలకమండలి, సంస్థ సభ్యులని కలుపుకొని ఈ సంస్థను సేవారంగంలో కూడా ముందుంచి ఘన చరిత్రని కాపాడడానికి నిరంతరం శ్రామికుడిగా కష్టపడతానని తెలిపారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్)ను తనకున్న అనుభవంతో, సమాజంలో ఉన్న పరిచయాలతో మరింత సేవాతత్పరత కలిగిన సంస్థగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. తర్వాత 2020 కార్యవర్గం, పాలక మండలి బృందాన్ని ఆయన సభకు పరిచయం చేశారు. సంక్రాంతి సంబరాలకి పసందైన పండుగ భోజనాన్ని వడ్డించిన బావార్చి అర్వింగ్ వారికి ఉత్తర టెక్సాస్ కార్యవర్గం, పాలక మండలి తరుఫున ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. టాంటెక్స్ వారి సంక్రాంతి సంబరాలకి విచ్చేసి ఎంతో ఓపికగా నాలుగు గంటల వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకి, అతిధులకి, పోషకదాతలకి అధ్యక్షుడు కృష్ణారెడ్డి కోడూరు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమ నిర్వహణకు స్పాన్సర్లుగా వ్యవహరించిన నిజెల్ భవన నిర్మాణ సంస్థ, శరత్ యర్రం, రాం మజ్జి, టాంటెక్స్ సంస్థ డైమండ్ పోషకదాతలైన తిరుమల్ రెడ్డి కుంభం, ప్లాటినం పోషక దాతలైన బావార్చి అర్వింగ్ ఇండియన్ రెస్టారెంట్, క్వాంట్ సిస్టమ్స్, ప్రతాప్ భీమి రెడ్డి, విక్రం జంగం, డా. పవన్ పామదుర్తి, శ్రీకాంత్ పోలవరపు, అనిల్ యర్రం, ఆనంద్ దాసరి, డీఎంఆర్ డెవలపర్స్ , గోల్డ్ పోషకదాతలైన పసంద్ విందు, మై ట్యాక్స్ ఫైలర్, రాం కొనారా, స్వదేశి రమేష్ రెడ్డి , బసేరా హరి, కిషోర్ చుక్కాల ,టెక్ లీడర్స్ దేవేంద్ర రెడ్డి, సిల్వర్ పోషకదాతలైన మురళి వెన్నం, డా.భాస్కర్ రెడ్డి సానికొమ్ము, పెంటా బిల్డర్స్, ఒమేగా ట్రావెలర్స్, అవాంట్ టాక్స్, విశ్వభారత్ రెడ్డి కంది, శ్రీకాంత్ గాలికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంకక్రాంతి వేడుకులకు సహకరించిన మీడియా పార్ట్నర్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గాయని, గాయకులు దామిని భట్ల, ధనుంజయ్‌లతో పాటుగా వ్యాఖ్యాత సమీర ఇల్లందుని సన్మానించారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా తెరవెనుక నుంచి సేవలందించిన కార్యకర్తలందరికీ తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం భారతీయ జాతీయగీతం ఆలాపనతో అత్యంత శోభాయమానంగా సాగిన సంక్రాంతి సంబరాలు ముగిశాయి. -
ఘనంగా భాష్యం బ్లూమ్స్ వార్షికోత్సవ వేడుకలు
సాక్షి, హైదరాబాద్ : మణికొండలోని భాష్యం బ్లూమ్స్ పాఠశాలలో అయిదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జాతీయస్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులను సత్కరించారు. మెరిట్ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను కూడా సత్కరించారు. స్కూల్ ప్రిన్సిపల్ పాల్ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తిని చాటిచెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. వీటిలో చిన్నారులు చేసిన నృత్యాలు, కరాటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు దోహదపడతాయని ముఖ్య అతిధులు పేర్కొన్నారు. -
అట్లాంటాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
అట్లాంటా: అమెరికాలోని గ్రేటర్ అట్లాంటా తెలుగు సంఘం (గాటా) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. దేసానా మిడిల్ స్కూల్ల్లో ఆదివారం గాటా సంక్రాంతి సంబరాలను నిర్వహించింది. ఈ కార్యాక్రమంలో గాటా వ్యవస్థాపకులు గిరీష్ మేకా, కో ఆర్టీనేటర్ సాయి గొర్రేపాటితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఈ సంబరాల్లో భాగంగా మహిళాలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు కైట్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా పలు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ల ద్వారా నృత్య కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. కాగా, ఈ కార్యక్రమంలో పిల్లలు చేసిన నటరాజా నాట్యంజలి, కూచిపూడి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక గాటా చీఫ్ కో ఆర్డినేటర్ సాయి గొర్రేపాటి మాట్లాడుతూ, తమ కొత్త కార్యనిర్వాహక బృందం సభ్యులు నవీన్ మర్రి, ఉదయ్ ఏటూరు, సుబ్బారెడ్డి, కిషన్ దేవునూరి, సిదార్థ అబ్బాగారి, స్వప్న కాస్వా, లక్ష్మి సానికొమ్ము, సరిత చెక్కిల్ల, సరిత శనిగరపు, వాసవి చిత్తలూరిలను సభకు పరిచయం చేశారు. చివరగా గాటా వ్యవస్థాపకులు గిరీష్ మేకా మాట్లాడుతూ, రంగోలి, కిడ్స్ కైట్ ఫ్లయింగ్ విజేతలకు బహుమతులను స్పాన్సర్ చేసిన నవీన్, కిషన్, సుబ్బారెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కార్యక్రమానికి వాలంటీర్లుగా వ్యవహరించి విజయవంతం చేసిన గోవర్ధనానంద్ జగన్నాథ్ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మే నెలలో జరగబోయే గాటా పదవ వార్షిక వేడుకలను ప్రతిఒక్కరూ రావాలని ఆహ్వానం పలికారు. అనంతరం భారత జాతీయ గీతం ‘జన గణ మన’ తో కార్యక్రమాన్ని ముగించారు. -
విఘ్నేష్‌కు థ్యాంక్స్ చెప్పిన నయనతార
నయనతార తన బాయ్‌ఫ్రెండ్ విఘ్నేష్ శివన్‌తో కలిసి అమెరికాలో చక్కర్లు కొడుతున్నారు. అయితే నయయనతార సోషల్‌మీడియాకు కాస్త దూరంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరు కలిసి అమెరికాలో తమ స్నేహితులతో కలిసి ఉత్సాహంగా గడిపిన ఫోటోలను విఘ్నేష్ శివన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. డెనిమ్ బ్లూ షర్ట్, బ్లాక్ లెదర్ స్కర్ట్, లూస్ హెయిర్‌తో ఉన్న నయన్ కొత్త లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతేగాక విఘ్నేష్, నయన్‌లు తమ స్నేహితులతో గడిపిన క్షణాలను వీడియో రూపంలో పంచుకున్నారు. 'థాంక్యూ అండ్ లవ్ యూ విఘ్నేష్. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. స్నేహితులతో కలిసి వేడుకను జరుపుకోవడం ఆనందం పంచిందని' నయన వెల్లడించారు. అయితే కొన్ని రోజుల క్రితం నయనతార పుట్టినరోజును న్యూయార్క్ సిటిలో ఘనంగా జరుపుకున్నారు. ఆమె పుట్టినరోజును పురస్కరించుకొని కాబోయే భర్త విఘ్నేష్ నయన్ వేలికి డైమండ్ రింగ్‌ను తొడిగారు. ఈ సందర్భంగా వారిద్దరు కలిసి న్యూయార్క్‌లో దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. ' న్యూయార్క్ సిటీ ఈరోజు నాకు చాలా అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు నా దిల్ కా లవ్ నయన్ బర్త్‌డే. ఆమె నవ్వు నా మదిని దోచుకుంటుందని ' విఘ్నేష్ పేర్కొన్నారు. మిలింద్ రౌ దర్శకత్వం వహించనున్న నేత్రికన్ తమిళ చిత్రంలో నయనతార నటిస్తుండగా, ఈ చిత్రానికి ఆమె బాయ్‌ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ మొదటిసారి నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్నారు. మరోవైపు విఘ్నేష్ శివన్ తన తదుపరి చిత్రాన్ని శివ కార్తికేయన్‌తో చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారు. -
కార్తీక వెలుగుల్లో ఇంద్రకీలాద్రి
సాక్షి, విజయవాడ: కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు దేవాలయాలు దీపాలు వెలిగించే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అందులో భాగంగా ఇంద్రకీలాద్రి కోటి దీపకాంతులతో వెలిగిపోతుంది. మల్లిఖార్జున మహామండపం నుంచి కనకదుర్గానగర్ మాడవీధుల వరుకు భక్తులు దీపాలతో అలంకరించారు. కోటి దీపోత్సవంలో వందలాది భక్తులు పాల్గొన్నారు. దుర్గామల్లేశ్వర స్వామి వారికి పూజారులు ఘనంగా జ్వాలాతోరణం నిర్వహించారు. రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ వేద మంత్రాల ఘోషతో మారుమోగుతోంది. కార్తీక పూర్ణిమ హారతి కార్యక్రమాన్ని బుద్ధవరుపు చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించింది. గోదావరి హారతి కార్యక్రమనికి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, పలువురు ప్రజాప్రతిధులు పాల్గొననున్నారు. -
వీళ్లు చాలా స్మార్ట్ గురూ..!
-
విజయనగర ఉత్సవాలు ప్రారంభం
సాక్షి, విజయనగరం: విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు శనివారం పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు ప్రారంభించారు. ఆలయం నుంచి ర్యాలీగా ప్రారంభమైన ఉత్సవాలు నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. జిల్లాలోని ఆనంద గజపతి ఆడిటోరియం ఆవరణలో ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవ కార్యక్రమాలను మంత్రులు ప్రారంభించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వివిధ కళారూపాల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఉత్సవ ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, సంబంగి చిన అప్పలనాయుడు, అప్పల నరసయ్య, రాజన్న దొర, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. విజయనగరం ఉత్సవం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఉత్సవాల నిర్వహణకు పర్యాటక శాఖ నుంచి రూ.50 లక్షలు ఇస్తూ జీవో విడుదల చేయటంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యల నగరంగా విజయనగరం వర్ధిల్లుతోందన్నారు. సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు అందేలా ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందని పేర్కొన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక అకాడమీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి కోసం నిరంతరాయంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఒక్క అక్టోబర్ నెలలోనే వాలంటీర్ల నియామకం, ఆటో డ్రైవర్లకు చేయూత, కంటి వెలుగు, రైతు భరోసా కార్యక్రమాలు ప్రారంభించామని గుర్తు చేశారు. దీపావళికల్లా ఇసుక కొరత తీర్చడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.