
టేనస్సీ : నాష్‌విల్లేలోని గణేష్ ఆలయంలో శ్రీనివాస కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నాష్‌విల్లే(ఐసీఓఎన్)ల ఆధ్వర్యంలో ఈ నెల 17న నిర్వహించిన ఈ కల్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలతో విగ్రహాలను అలంకరించి శ్రీనివాస కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు కల్యాణ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందించారు.
ఈ కార్యక్రమంలో కల్యాణ కమిటీ సభ్యులు ఆళ్ల రామకృష్ణ రెడ్డి, నరెందర్‌రెడ్డి నూకల, సుషీల్ చంద, కిషోర్‌రెడ్డి గూడూరు, ప్రకాశ్‌రెడ్డి ద్యాప, రాధిక రెడ్డి, లావణ్య నూకల, కళ ఉప్పలపాటి, ప్రశాంతి, మంజు లిక్కి, దీప, శిరీష కేస తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్యాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా పూర్తి చేసినందుకు భక్తులకు, అతిథులకు, దాతలకు, ఆలయ పూజారి, ఆలయ బోర్డు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment