హోలీ వేళ ఘర్షణలు.. వాహనాలు, దుకాణాలకు నిప్పు.. పలువురికి గాయాలు | Giridih Clashes Between two Groups During Holi Procession | Sakshi
Sakshi News home page

హోలీ వేళ ఘర్షణలు.. వాహనాలు, దుకాణాలకు నిప్పు.. పలువురికి గాయాలు

Published Sat, Mar 15 2025 9:29 AM | Last Updated on Sat, Mar 15 2025 9:29 AM

Giridih Clashes Between two Groups During Holi Procession

గిరిడీహ్‌: శుక్రవారం దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు(Holi celebrations) జరిగాయి. అయితే పండుగ నేపధ్యంలో కొన్ని చోట్ల అల్లర్లు చోటుచేసుకున్నాయి. జార్ఖండ్‌లోని గిరిడీహ్‌ జిల్లాలో హోలీ వేళ ఇరు వర్గాల మధ్య ఘర్ణణలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ  సందర్భంగా అల్లరి ​మూకలు పలు వాహనాలకు, దుకాణాలకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
 

మీడియాకు అందిన వివరాల ప్రకారం గిరిడీహ్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపధ్యంలో మూడు దుకాణాలతో పాటు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు(Police) తమ బలగాలను సంఘటనా స్థలంలో మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

పోలీసు అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన ఘోడతంబాలో జరిగిందని, ఒక వర్గంవారు హోలీ రంగులు జల్లుకుంటూ ఇటు రాగానే, స్థానికులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం మొదలై, పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. 

 

ఇది కూడా చదవండి: మహాకుంభమేళాలో మాయమైన మహిళ తిరిగొచ్చిందిలా..
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement