Ganesha Temple
-
వైరల్ వీడియో: గణేశుడికి మోకరిల్లి మొక్కుతున్న శునకం
-
గణేశుడికి మోకరిల్లి మొక్కుతున్న శునకం: వీడియో వైరల్
ఇటీవల కాలంలో ఉన్నటుండి మోగ జీవులు చాలా వింతగా ప్రవర్తిస్తున్నాయి. ఒక్కసారిగా మనుషుల వలే భక్తిప్రపత్తులు చాటుకుంటూ వింతగా ప్రవర్తిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఇటీవలే కోకొల్లుగా జరిగాయి. అచ్చం అలాంటి సంఘటనే ఒకటి పూణేలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఒక శునకం గణేశుడి దేవాలయం వద్ద మోకరిల్లి ప్రార్థిస్తోంది. అతని పక్కనే ఉన్న వ్యక్తి కూడా ప్రార్థిస్తున్నాడు. ఈ ఘటనను విశాల్ అనే వ్యక్తి రికార్డు చేసినట్లు తెలుస్తోంది. అతను ఇన్‌స్టాగ్రామ్‌లో 'పూణేలోని దగ్దుషేత్ గణపతి మందిర్ వద్ద ఏం జరుగుతుందో చూడండి' అని ఒక క్యాప్షన్ పెట్టి మరీ వీడియోని పోస్ట్ చేశాడు. ఆలస్యం ఎందుకు మీరు కూడా ఈ వీడియో చూసేయండి. (చదవండి: అరే! ఏం మనుషుల్రా ఇంత రాక్షసత్వమా! శునకానికి ఉరి వేసి...) -
నాష్‌విల్లేలో ఘనంగా శ్రీనివాస కల్యాణం
టేనస్సీ : నాష్‌విల్లేలోని గణేష్ ఆలయంలో శ్రీనివాస కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నాష్విల్లే(ఐసీఓఎన్)ల ఆధ్వర్యంలో ఈ నెల 17న నిర్వహించిన ఈ కల్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలతో విగ్రహాలను అలంకరించి శ్రీనివాస కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు కల్యాణ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో కల్యాణ కమిటీ సభ్యులు ఆళ్ల రామకృష్ణ రెడ్డి, నరెందర్‌రెడ్డి నూకల, సుషీల్ చంద, కిషోర్‌రెడ్డి గూడూరు, ప్రకాశ్‌రెడ్డి ద్యాప, రాధిక రెడ్డి, లావణ్య నూకల, కళ ఉప్పలపాటి, ప్రశాంతి, మంజు లిక్కి, దీప, శిరీష కేస తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్యాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా పూర్తి చేసినందుకు భక్తులకు, అతిథులకు, దాతలకు, ఆలయ పూజారి, ఆలయ బోర్డు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
నాష్‌విల్లేలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం
టేనస్సీ: నాష్‌విల్లేలోని గణేష్ ఆలయంలో శ్రీనివాస కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా), ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నాష్విల్లే(ఐసీఓఎన్)ల ఆధ్వర్యంలో గత నెల 28న నిర్వహించిన ఈ కల్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలతో విగ్రహాలను అలంకరించి శ్రీనివాస కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ కమిటీ సభ్యులు ఆల రామకృష్ణా రెడ్డి, నూకల నరేందర్ రెడ్డి, సుషీల్ చందా, గుడూరు కిశోర్ రెడ్డి, దయప ప్రకాశ్ రెడ్డి, పునీత్ దీక్షిత్, రవి కిరణ్, రాధిక రెడ్డి, నూకల లావణ్య, మంజూ లిక్కి, బూస సునీత, అరమండ్ల రాధిక, రాచకొండ సాయిరాం, కేస సిరిషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్యాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా పూర్తి చేసినందుకు భక్తులకు, అతిథులకు, దాతలకు, ఆలయ పూజారి, ఆలయ బోర్డు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాష్‌విల్లేలోని గణేష్ ఆలయం విస్తరణ పనులను గత కొన్ని ఏళ్లక్రితమే ప్రారంభించారు. ఆలయ అభివృద్ధికి దాదాపు 4 మిలియన్ల డాలర్లను ఖర్చుచేశారు. అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా), ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నాష్విల్లే(ఐసీఓఎన్) సభ్యులు పెద్ద మొత్తంలో ఆలయానికి విరాళాలు ఇచ్చారు. గత ఏడాది కూడా శ్రీనివాస కళ్యాణం వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. -
భూగర్భంలో కలిసిపోతున్న వినాయకుడి గుడి
► వర్షం వస్తే నీటిలో మునిగిపోవడమే.. ► విగ్రహాలు తొలగించి చేతులు ► దులుపుకున్న అధికారులు సీతానగరం (తాడేపల్లి రూరల్): వినాయకుడి గుడి కాలక్రమేణా భూగర్భంలో కలిసిపోతోంది. కనకదుర్గమ్మ దత్తత దేవాలయమైన సీతానగరం శ్రీకోదండరామ ఆంజనేయస్వామి ఆలయం, రాష్ట్ర దేవాలయ పరిపాలన విభాగం (సీత కార్యాలయం) మధ్య ఈ గుడి ఉంది. కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ దేవాదాయ శాఖ నిర్లక్ష్యం వల్ల వినాయకుడి గుడికి ఈ పరిస్థితి దాపురించిందంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే పుష్కరాలప్పుడన్నా దేవాదాయ శాఖ అధికారులు దేవాలయాలకు మరమ్మతులు నిర్వహించేవారు. కానీ ఈ సారి ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. మరో 70 రోజుల్లో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. సీత కార్యాలయ భవన నిర్మాణంలో భాగంగా వినాయకుడి గుడి పక్కనే 15 అడుగుల మెరక తోలారు. దీనివల్ల వర్షం కురిస్తే దేవాలయం నీటిలో మునిగిపోయే పరిస్థితి దాపురించింది. దీంతో గుడిలో ఉన్న వినాయకుడి విగ్రహం, నాగేంద్రస్వామి విగ్రహాలను తీసివేసి, పక్కనున్న ఆంజనేయ స్వామి దేవాలయంలో భద్రపరిచారు. అప్పటి నుంచి భక్తులకు ఆ విగ్రహాల దర్శన భాగ్యం కలుగడంలేదు. పుష్కరాల కోసం కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు కానీ, వినాయకుడి గుడి పునర్నిర్మాణం కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. పక్కనే ఉన్న సీత కార్యాలయానికి కోట్ల రూపాయలు వెచ్చించి అధికారులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు గార్డెన్లు, వాకింగ్ టైల్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు ఏ పని మొదలు పెట్టినా మొట్టమొదట పూజించే బొజ్జ గణపతికి ఆలయ పునర్నిర్మాణం మాత్రం అధికారులు చేపట్టడం లేదు. గత సంవత్సర కాలంలో సీత కార్యాలయానికి దేవాదాయ శాఖ మంత్రి మూడు సార్లు వచ్చారు. అయినా పక్కనే ఉన్న వినాయకుడి గుడి దుస్థితిపై స్పందించలేదు. గతంలో రూ.18 లక్షలతో వినాయక గుడిని పునర్నిర్మించాలని టెండర్లు పిలిచారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో దాన్ని అలా వదిలేయడం మన దేవాదాయ శాఖ అధికారులకే చెల్లింది. -
ముక్కంటీశా.. ఎన్నాళ్లీ అవస్థ..
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచింది శ్రీకాళహస్తి. ముక్కంటీశుని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే ఇక్కడ కనీస సదుపాయాలు లేకపోవడం భక్తులను ఇబ్బందులకు గురి చేస్తోంది. శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. విదేశాలకు చెందిన భక్తులు సైతం వస్తున్నారు. ఏడాదికి రూ.80 కోట్లకుపైగా ఆదాయం ఆలయానికి సమకూరుతోంది. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వెంట లగేజీ ఉంటోంది. దీనిని అధికారులు ఆలయంలోకి అనుమతించడం లేదు. అదే సమయంలో ఆలయం తరపున సదుపాయాలు కల్పించడం లేదు. దీంతో భక్తులు లగేజీ, సెల్ఫోన్లు, చెప్పులు భద్రపరుచుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. దీనికితోడు ఆలయ సమాచార కేంద్రం మూతపడడంతో భక్తుల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఈ క్రమంలో దళారులు పనితనం చూపుతున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి నాలుగు ప్రవేశ గోపుర ద్వారాలు ఉన్నాయి. భక్తులు భిక్షాలగోపురం, శివయ్య గోపురం, తిరుమంజన గోపురం, దక్షిణ గోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తుంటారు. భిక్షాలగోపురం ప్రధానంగా బస్సుల్లో వచ్చే భక్తులు భిక్షాల గోపురం ద్వారా ఆలయం లోపలకు ప్రవేశిస్తుంటారు. చెప్పులను భద్రపరచుకోవాలంటే ఆ గోపురాన్ని దాటి బాలజ్ఞానాంబ గోపురం వద్దకు రావాలి. అక్కడ చెప్పులు పెట్టుకునే సదుపాయం ఉన్నట్లు యాత్రికులకు తెలియదు. ఎలాగైనా తెలుసుకుని వస్తే లగేజీ పెట్టుకోమని సిబ్బంది చెబుతారు. దీంతో భిక్షాల గోపురం వద్దనే కొందరు దుకాణదారుల వద్ద లగేజీ, చెప్పులు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోవారు అవసరం లేని పూజా సామగ్రిని అంటగట్టి 300 నుంచి 350 రూపాయల వరకు పిండుకుంటున్నారు. భిక్షాలగోపురం ఒక్కచోటే ఆలయ సమాచార కేంద్రం ఉన్నప్పటికీ అందులో ఎవరూ విధులు నిర్వహించడం లేదు. వీరికి రాజకీయ అండదండలు ఉండడంతో అధికారులు పట్టించుకోవడ లేదు. దీంతో భక్తులు సమాచారం తెలుసుకోవాలంటే దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. తిరుమంజన గోపురం ఈ గోపురం సన్నిధివీధిలోని జల వినాయకుడి ఆలయం వద్ద ఉంది. వాహనాల ద్వారా వచ్చే భక్తులు దాదాపుగా ఈ మార్గం గుండానే ఆలయంలోకి ప్రవేశిస్తుంటారు. ఈ గోపురం కింద నూతనంగా సెల్‌ఫోన్, లగేజీ పెట్టుకునే ఏర్పాట్లు చేశారు. అయితే ఈ మార్గంలో చెప్పులు పెట్టుకోవడానికి అవకాశం లేదు. దీంతో భక్తులు గోపురం ముందే చెప్పులను కుప్పలు కుప్పలుగా వదిలి వెళుతున్నారు. దర్శనం తర్వాత వచ్చేసరికి వారి చెప్పులు మాయమవుతున్నాయి. శివయ్య గోపురం లాడ్జీల్లో బస చేసిన భక్తులు, ఆటో వాళ్లు తీసుకొచ్చిన వారు ఈ గోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తుంటారు. ఇక్కడ లగేజీ, చెప్పులు భద్రపరుచుకునే సదుపాయం లేదు. దీంతో వ్యాపారుల వద్ద చెప్పులు, లగేజీ పెట్టుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో వారు అడిగినంత సొమ్ము సమర్పించుకుంటున్నారు. దక్షిణ గోపురం ఈ గోపురం గుండా అత్యధికంగా భక్తులు ఆలయానికి వస్తుంటారు. ప్రధానంగా వీఐపీలు ఇదే మార్గంలో ఆలయానికి చేరుకుంటారు. ఈ గోపురం వద్ద సెల్‌ఫోన్ కౌంటర్ మాత్రమే ఉంది. లగేజీ, చెప్పులు పెట్టుకునే సదుపాయం లేదు. దీంతో ఎక్కడపడితే అక్కడ చెప్పులు వదిలిపెట్టి వెళుతుంటారు. కొందరు సుపథ మండపంలోని స్తంభాల మధ్య వదిలి వెళుతున్నారు. తమ ఇబ్బందుల పట్ల ఆలయాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం నాలుగు గోపుర మార్గాలను పరిశీలించి భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం. భిక్షాలగోపురం వద్ద, సమాచారం కేంద్రంలో సిబ్బంది పనిచేయని విషయం మా దృష్టికి రాలేదు. విచారించి చర్యలు తీసుకుంటాం. -శ్రీరామచంద్రమూర్తి, ఆలయ ఈవో