అట్లాంటాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు | Sankranti Celebration Held Under Gata In America | Sakshi
Sakshi News home page

గాటా ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

Published Fri, Jan 24 2020 8:34 PM | Last Updated on Fri, Jan 24 2020 9:06 PM

Sankranti Celebration Held  Under Gata In America - Sakshi

అట్లాంటా: అమెరికాలోని గ్రేటర్ అట్లాంటా తెలుగు సంఘం (గాటా) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. దేసానా మిడిల్ స్కూల్‌ల్లో ఆదివారం గాటా సంక్రాంతి సంబరాలను నిర్వహించింది. ఈ కార్యాక్రమంలో గాటా వ్యవస్థాపకులు గిరీష్‌ మేకా, కో ఆర్టీనేటర్‌ సాయి గొర్రేపాటితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఈ సంబరాల్లో భాగంగా మహిళాలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు కైట్‌ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా పలు డ్యాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా నృత్య కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. కాగా, ఈ కార్యక్రమంలో పిల్లలు చేసిన నటరాజా నాట్యంజలి, కూచిపూడి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

ఇక గాటా చీఫ్‌ కో ఆర్డినేటర్‌ సాయి గొర్రేపాటి మాట్లాడుతూ, తమ కొత్త కార్యనిర్వాహక బృందం సభ్యులు నవీన్‌ మర్రి, ఉదయ్‌ ఏటూరు, సుబ్బారెడ్డి, కిషన్‌ దేవునూరి, సిదార్థ అబ్బాగారి, స్వప్న కాస్వా, లక్ష్మి సానికొమ్ము, సరిత చెక్కిల్ల, సరిత శనిగరపు, వాసవి చిత్తలూరిలను సభకు పరిచయం చేశారు. చివరగా గాటా వ్యవస్థాపకులు గిరీష్‌ మేకా మాట్లాడుతూ, రంగోలి, కిడ్స్‌ కైట్ ఫ్లయింగ్‌ విజేతలకు బహుమతులను స్పాన్సర్‌ చేసిన నవీన్‌, కిషన్‌, సుబ్బారెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కార్యక్రమానికి  వాలంటీర్లుగా వ్యవహరించి విజయవంతం చేసిన గోవర్ధనానంద్ జగన్నాథ్‌ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మే నెలలో జరగబోయే గాటా పదవ వార్షిక వేడుకలను ప్రతిఒక్కరూ రావాలని ఆహ్వానం పలికారు. అనంతరం భారత జాతీయ గీతం ‘జన గణ మన’ తో కార్యక్రమాన్ని ముగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement