సెయింట్ లూయిస్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా అమెరికా సెయింట్ లూయిస్‌లో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కో ఆర్డినేటర్ పమ్మి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైఎస్ఆర్సీపీ, వైఎస్ జగన్ నినాదాలతో హోరెత్తించారు. వేడుకల అనంతరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగనేనంటూ వ్యాఖ్యానించారు. ఈ వేడుకల్లో గోపాల్ రెడ్డి, నవీన్ గూడవల్లి, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment