టేనస్సీ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ తాతా రాజశేఖర్రెడ్డి మెంఫిస్ నగరంలో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కార్యనిర్వాహక వర్గం నాయకులు జైపాల్‌రెడ్డి, వీరమోహన్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, రాజా చెన్నం, రమేష్ సనపాల, సూర్యరెడ్డి, విజయ్‌రెడ్డి చిట్టెం, వైఎస్సార్ అభిమానులు పాల్గొని నివాళులు అర్పించారు. వైఎస్సార్ తన పాలనలో ప్రజల కోసం పలు సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టారని, పేద బలహీన వర్గాల సంక్షేమం కోసం అనుక్షణం పరితపించారని గుర్తు చేసుకున్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, అన్నదాతలకు ఉచిత కరెంట్, జలయజ్ఞం ద్వారా సాగునీరు అందించిన తీరును స్మరించుకున్నారు. వైఎస్సార్ పాలనని తలపిస్తూ రాజన్న ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలు ప్రవేశపెడుతున్న విధానం, విద్యార్థి దశ నుంచే నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న తీరును కొనియాడారు. మరిన్ని కాలాలపాటు జగనన్న ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment