YS Rajasekhara Reddy Vardhanthi
-
మరపురాని మహానేత.. ఇడుపులపాయంలో నివాళులర్పించిన జననేత (ఫొటోలు)
-
ప్రజల బాగు కోరిన పాలకుడు
ముఖ్యమంత్రి పదవిని లక్కీ లాటరీలా పొందినవారు కొందరు, పైరవీలతో చేజిక్కించుకున్నవారు కొందరు, తెలివిగా పావులు కదిపి సాధించినవారు కొందరు... ఈ కేటగిరీల్లో కాంగ్రెస్ ఏలుబడిలోని రాష్ట్రాల్లో ఎందరినో చూశాం. పూర్తి ప్రజాదరణతో ఒకే ఒక్కడై నిలిచి, గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన వ్యక్తి... కాదు శక్తి... డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే! జమ్మలమడుగులో పుట్టి, స్వగ్రామం పులివెందులలో, బళ్లారిలో చదివి, గుల్బర్గాలో మెడిసిన్ చేసి డాక్టరుగా పులివెందులలో రూపాయి డాక్టరుగా ఊరి జనానికి చేరువయ్యారు. చిన్ననాటి నుండీ గాంధీ, నెహ్రూలపై పెరుగుతూ వస్తున్న అభిమానం ఆయనను కాంగ్రెస్‌కు చేరువ చేసింది. పులివెందుల డిగ్రీ కాలేజీ స్థాపించి విద్యాభివృద్ధికీ, 20 పడకల ఆసుపత్రి నిర్మించి, పేదలకు ఉచిత వైద్యం చేసి ఊరి చుట్టుపక్కల ప్రజలకూ దగ్గరయ్యారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడై 1978లో కాంగ్రెస్ చీలిక రాగా ‘రెడ్డి కాంగ్రెస్’ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రతిసారీ గెలుస్తూ వచ్చారు. యువజన సర్వీసులు, ఎక్సైజ్, విద్యా శాఖలకు మంత్రిగా పనిచేశారు. రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో తన నాయకత్వంలో 91 స్థానాలు గెలుచుకుని ప్రతిపక్ష నాయకుడిగా సత్తా చాటారు. 2004 ఎన్నికలకు ఏడాది ముందు జనంలోకి వెళ్ళారు. ఆ ఏడాది ఏప్రిల్ 3న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పాదయాత్రకు శ్రీకారం చుట్టి, ఆంధ్రప్రదేశ్ చివరి గ్రామం ఇచ్ఛాపురం వరకూ దాదాపు 1600 కిలోమీటర్లు వైఎస్ పాదయాత్ర చేశారు. దారి పొడవునా, గ్రామ గ్రామాన ప్రజల కష్టనష్టాలను కళ్ళారా చూశారు. చెవులారా విన్నారు. భగ్గున మండుతున్న ఎండల్లో కాలినడకలో ప్రజలు ఎన్నెన్ని అవస్థలు పడుతున్నారో గమనించారు.ఓ పక్క కరువు, మరోవంక గంజినీళ్లకు కూడా నోచుకోని అభాగ్యులు, విద్యుత్ కొరత వల్ల బోర్లు పనిచేయక అచేతనులైన రైతన్నల దౌర్భాగ్య స్థితి, నిరుద్యోగుల నిస్తేజం... ఇవన్నీ ఆయనను కొత్త మనిషిగా తీర్చిదిద్దాయి. ‘ఇందిరమ్మ రాజ్యం’ తెస్తాననీ, అన్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తాననీ ప్రజలకు మాటిచ్చారు. నమ్మకం కలిగించారు. వ్యవసాయ ప్రధానమైన గ్రామీణ ప్రజలకు విద్యుత్ చార్జీలు భారం కావడం, ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియని కరెంటు సరఫరా ప్రాథమిక అవరోధంగా గుర్తించి ‘ఉచిత విద్యుత్’ హామీ ఇచ్చి ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఆ ఫైలు పైనే చేస్తానన్నారు. సరిగా పండక, అరకొర దిగుబడి తెగనమ్మితే పెట్టుబడి ధర కూడా రాక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న వార్తలు విని, చదివి ఆయన చలించి పోయారు. వివిధ వర్గాల ప్రజల జీవన్మరణ సమస్యలను ఎలాగైనా సరే పరిష్కరించాలని నిశ్చయించుకున్నారు. పాదయాత్ర క్రమంలో రాజమండ్రి నగరం వచ్చాక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజుల విశ్రాంతి అనంతరం మళ్ళీ నిర్విరామంగా ఇచ్ఛాపురం వరకూ నడక సాగించి, 64 రోజుల పాదయాత్ర (3 రోజుల విరామంతో కలిపి 67 రోజులు) లక్ష్యం పూర్తి చేశారు.అంతలో 2004 ఎన్నికల నగారా మోగింది. వైఎస్ హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. అంతకు పదేళ్ళ ముందు 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. కొద్దికాలానికే ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుణ్ణి చేసి, తెలుగుదేశం పార్టీని హైజాక్ చేసి, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు చంద్రబాబు. అలాంటి చంద్రబాబు బీజేపీ ఆసరా తోడై, 1999లో మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టారు. ప్రజలంటే గొఱె<లనీ, ఎన్నికలంటే కాస్త పేరున్న పార్టీతో జతకట్టి సునాయాసంగా గెలవచ్చనీ పాత అనుభవ పాఠాల ద్వారా నమ్మి, ఈసారి 2004 ఎన్నికల బరిలోనూ దూకారు. అలిపిరి మందుపాతర పేలుడులో త్రుటిలో బతికి బయటపడిన ఘటన సానుభూతి తెచ్చి గెలిపిస్తుందని నమ్మారు. సానుభూతి చల్లారకుండా ముందస్తు ఎన్నికలకు చంద్రబాబు దిగారు. ప్రచార పర్వంలో ఎక్కడా సానుభూతి జాడలేదు సరికదా ప్రజాగ్రహం ఎదురైంది. కాంగ్రెస్ అఖండ విజయం, వైఎస్ ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగిపోయాయి.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2004 మే 14న హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు వైఎస్. ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. అది మొదలు ప్రజలకు ఎలా మేలు చేయాలన్న ఆలోచన తప్ప ఆయనకు మరొకటి లేదు. రైతులకు సహకార రుణమాఫీ కోసం కేంద్రాన్ని ఒప్పించారు. పీకల లోతు అప్పుల్లో మునిగి ఉన్న రైతులకు రుణ విముక్తి కలిగించారు. ‘ఆరోగ్యశ్రీ’తో అత్యంత ఖరీదైన వైద్యాన్ని నిరుపేదలకు అందించారు. పేదరికం కారణంగా పౌష్టికాహార లోపంతో గుండెజబ్బుల బారిన పడిన పసిపిల్లలకు ఉచిత శస్త్రచికిత్సలు చేయించారు.‘108 వాహనం’ ద్వారా అత్యవసర అంబులెన్సు వాహనాలను రాష్ట్రమంతటా అందుబాటులోకి తెచ్చారు. బీసీ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య కోసం ‘ఫీజు రీ–ఇంబర్స్మెంట్’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ముస్లిమ్ మైనారిటీ విద్యార్థులకు 4 శాతం రిజర్వేషన్లతో ఇంజనీరింగ్ విద్యను అందించారు. ‘జలయజ్ఞం’తో భారీ, మధ్యతరహా, చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులను రాష్ట్రం నలుమూలలా విస్తరించే పథకాలకు శ్రీకారం చుట్టారు. కోటి ఎకరాల సాగుభూమితో రాష్ట్రం అన్నపూర్ణగా విరాజిల్లాలని పట్టుదలతో కృషి చేసారు. అంతకు ముందు నామమాత్రంగా ఉండే వికలాంగ, వృద్ధాప్య పింఛన్లను ఇబ్బడిముబ్బడిగా పెంచారు. ఎస్సీ, ఎస్టీ పథకాల రుణమాఫీతో ఊరట కలిగించారు.‘ఇందిరమ్మ ఇళ్ల’ను ‘ఇందిరమ్మ ఊళ్ళు’ అనేలా గణనీయంగా నిర్మించారు. ప్రకృతి కూడా పరవశించిందేమో... హర్షాతిరేకంతో వర్షాలను చాలినంతగా రాష్ట్రమంతటా కురిపించింది. గ్రామదేవతల, దేవాలయ ఉత్సవాలు ఊరూరా పునః ప్రారంభమయ్యాయి. దేశం ఆంధ్రప్రదేశ్ వైపు తల తిప్పి చూడసాగింది. కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు సైతం ‘ఆరోగ్యశ్రీ’తో పాటు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన మరికొన్ని పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేశారు. 2009 ఎన్నికల్లోనూ వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకుంది. రెండోసారి ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని అధిష్ఠించి, మరింత జాగరూకతతో సాగుతూ, పథకాల అమలు తీరు ఎలా ఉందో ప్రజల నుండి నేరుగా తెలుసుకోవాలన్న కోరికతో ‘రచ్చబండ’ ప్రవేశపెట్టారు. తొలి సమావేశానికి హాజరవడానికి హెలికాప్టర్లో చిత్తూరు జిల్లాకు పోయే క్రమంలో వాతావరణం ప్రతికూలించింది. కంట్రోల్ రూముతో సంబంధాలు తెగిపోయాయి. మరునాడు ఊహించని విషాద వార్త వెల్లడైంది. ‘నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కూలిపోయింది. వైఎస్ ఇకలేరు’! ఈ వార్తను తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా సుమారు 700 గుండెలు ఆగిపోయాయి. ఇంతగా ప్రేమను పొందిన నాయకుడు చరిత్రలో మరొకరు లేరు. 2009 సెప్టెంబరు 3వ తేదీ జన హృదయ విజేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇక లేరని లోకానికి తెలిసిన రోజు. అదే రోజు గణేశ నిమజ్జనం. ‘గణేశ్ మహరాజ్‌కీ జై’, ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో, పిల్లలు, పెద్దలు సహా అశేష జనసందోహంతో, నృత్యాలు, ఆటపాటలు, టపాసుల, డప్పులు, ఆర్కెస్ట్రాల కోలాహలంతో 24 గంటలపాటు నిర్విరామంగా సాగాల్సిన హైదరాబాద్ గణేశ్ నిమజ్జనోత్సవం అంతే జనంతో నిర్వికారంగా, ఎటువంటి ఆర్భాటం లేకుండా ఒక మహా మౌనప్రదర్శన అన్నట్టుగా సాగిపోయింది. లెక్కకు మిక్కిలిగా పూనుకున్నా జరగదనిపించే ఆ సంఘటన ఆ జననేత పట్ల గొప్ప గౌరవానికి తార్కాణం. ‘పథకాలంటే ఇవీ, పరిపాలన అంటే ఇదీ, పాలకుడంటే ఇలా...’ అని మామూలు వ్యక్తుల నుండి మేధావుల దాకా అనుకునేలా సాగిన ఆయన రాష్ట్ర నాయకత్వ హయాం ‘న భూతో న భవిష్యతి!’తిరుమలగిరి సురేందర్ – వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ -
జనం గుండెల్లో నిండిన దేవుడు
ప్రజా సంక్షేమం కోసం అనుక్షణం పరితపించిన నాయకుడాయన. పేదవాడి ముఖంపై చిరునవ్వు వెలిగించడానికి నిరంతరం శ్రమించిన కార్మికుడాయన. జలయజ్ఞంతో రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చిన కర్షక భగీరథుడాయన. సర్కారీ పాలనలోనే కాదు... స్నేహంలోనూ, సాయంలోనూ వై.ఎస్. రాజశేఖరరెడ్డిది ఓ అరుదైన వ్యక్తిత్వం. మనుషుల గుండెల్లో చిరకాలం చెరిగిపోని సంతకం. జనహృదయ విజేత వైఎస్ 2009లో అకాల మరణం చెందినప్పుడు ఆయన ఆప్తుడు, నాటి కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్‌కుమార్ తన గుండె లోతుల్లో నుంచి ‘సాక్షి’తో పంచుకున్న అనుభవాల మాలిక ఈ వ్యాసం. నేడు వైఎస్ 15వ వర్ధంతి సందర్భంగా నాటి కథనాన్ని నవతరం పాఠకుల కోసం మరోసారి అందిస్తున్నాం.గాంధీభవన్‌లో మీటింగ్... పీసీసీ అధ్యక్షులు ఎం. సత్యనారాయణరావు గారు, సీఎల్పీ లీడర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డిగారు కూర్చున్నారు. ఏదో అర్జంట్ మీటింగ్! అందుబాటులో ఉన్న నాయకులందరినీ పిలిచారు. ప్రెసిడెంట్ గారి రూంలోనే మీటింగ్. ముప్పై కుర్చీల దాకా వేశారు. నేను బాగా చివరి వరుసలో మూలగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను. ‘అరుణ్! ముందుకు రావయ్యా... ఇక్కడ ఖాళీగా ఉంది గదా!’ అంటూ ముందు వరుసలో కూర్చోమని ఆహ్వానించారు సత్యనారాయణ గారు. ‘ఎందుకు సార్... మళ్లీ ఎవరైనా పెద్ద లీడరొస్తే లేచి వెనక్కి రావాలి. ఇక్కడ కూర్చుంటే ఎవ్వరొచ్చినా లేవక్కర్లేదు’ అన్నాను నవ్వుతూ. అన్ని సీట్లూ నిండిపోయాయి. మీటింగ్ ప్రారంభమైంది. ఏదో నోట్ చేయాల్సిన అవసరమొచ్చింది. ‘అరుణ్! ముందుకు రావయ్యా!’ అంటూ వైఎస్ గారి పక్కనే కుర్చీ వేయించి నన్ను కూర్చోపెట్టారు. నేను, వైఎస్ గారితో అన్నాను... ‘చూశారా సార్! టైం వచ్చినప్పుడు చివరాఖర్న కూర్చున్నా తీసుకొచ్చి ముందు కూర్చోపెడ్తారు.’ ‘అవును అరుణ్! ఇది బైబిల్లో ఉంది... తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును’. నా జీవితంలో మర్చిపోలేని సందేశమిది. అప్పట్నుంచి నేనేనాడూ నా గురించి నేను గొప్పగా ఊహించుకోలేదు. ఎవరైనా పొగుడుతుంటే వైఎస్ గారి వాక్యమే గుర్తుతెచ్చుకుంటూ ఉండేవాడిని. 2009 ఎన్నికల ఫలితాలపై వైఎస్ మాట్లాడుతూ, ‘ప్రజలు మాకు పాస్ మార్కులే వేశారు. ఇది ఘన విజయంగా నేను భావించడం లేదు. గర్వం వీడి అణకువతో ప్రజలకు దగ్గరకండి’ అంటూ తనను తాను తగ్గించుకుంటున్నప్పుడు ఆయన మరింత హెచ్చించబడతాడనే అనుకున్నాను గానీ ఆ హెచ్చు మరీ ఇంత ఎక్కువగా ఉంటుందనీ... ఎవరికీ అందనంత ఎత్తులోకి వెళ్లిపోతారనీ కలలోనైనా ఊహించుకోలేదు. ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి నాయకులొస్తే వారి ఉపన్యాసాలను నేను అనువదించాలి. ఈ విషయంలో మాత్రం ఇంకెవర్నీ ఒప్పుకునేవారు కాదు వైఎస్ గారు! చాలాసార్లు కొందరు నాయకులు లోపల్లోపల గొణుక్కుంటూ ఉండేవారు ‘వీడే చెయ్యాలా ట్రాన్స్లేషన్... ఆ మాత్రం అనువాదకులు మనూళ్లో లేరా...’ అని!! కొన్నిసార్లు బాహాటంగా పత్రికల్లోనే విమర్శించారు. రాజీవ్‌గాంధీ, మన్మోహన్సింగ్, రాహుల్ గాంధీ – ఎవరొచ్చినా వారితోపాటు వేదిక మీద నాకూ కుర్చీ వేసేవారు! నాకన్నా సీనియర్లు, మంత్రులు, పెద్ద నాయకులు ఎంతోమంది కింద కూర్చోవటం, కేవలం అనువాదకుడినైన కారణంగా నేను వేదిక మీద కూర్చోవటం కొంతమందికి మింగుడుపడేది కాదు. కానీ ట్రాన్స్లేషన్ విషయంలో మాత్రం వైఎస్ కాంప్రమైజ్ అయ్యేవారు కారు. రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం అనంతపూర్‌లో ప్రారంభించారు. ప్రధాని మన్మోహన్సింగ్, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రçఘువంశప్రసాద్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి మణిశంకర్ అయ్యర్ ప్రసంగించారు. నన్ను సోనియాగాంధీ గారికి కేటాయించి, మిగతా ముగ్గురికీ ఇంకో ముగ్గురు నాయకులను ట్రాన్స్లేషన్కి ఏర్పాటు చేశారు. సరిగ్గా అందరూ స్టేజీ మీద కూర్చున్నాక వైఎస్ గారికి ఈ ఏర్పాటు సంగతి తెలిసింది. ఆయన ససేమిరా అంగీకరించలేదు. మొత్తం నలుగురికీ నేనే అనువాదం చెయ్యాలన్నారు. ‘సుమారు నలుగురు మాట్లాడేదీ ఒకటే ఉంటుంది. మళీ మళ్లీ అదే నేనొక్కడినే రిపీట్ చేస్తే జనానికి బోర్ కొడ్తుందేమో సార్’ అన్నాను. ‘చెప్పినట్టు చెయ్! నో మోర్ ఆర్గ్యుమెంట్!’ అన్నారు. నలుగురి స్పీచ్‌లూ నేనే అనువదించాను. ‘ఇంటర్ ప్రెటేషన్ కావాలి, ట్రాన్స్లేషన్ కాదు. లక్షల మంది పాల్గొన్న సభ, ఎక్స్పెరిమెంట్లు చేయటం పద్ధతి కాదు’ అన్నారాయన. నాకు అప్పుడు పదేళ్ల క్రితం జరిగిన ఒక అనువాద సంఘటన గుర్తుకొచ్చింది. విశాఖలో గాజువాక దగ్గర రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ. రాజేష్ పైలట్, అహ్లూవాలియా, వైఎస్, ద్రోణంరాజులతో కలిసి కార్లలో గాజువాక వెళ్తున్నాం. రాజీవ్‌గాంధీ చిరునవ్వు ముఖంలో మృత్యుకళ ప్రవేశపెట్టడం ఆ దేవుడి వల్ల కాలేదనీ... అందుకే అందమైన ఆ ముఖం నిర్జీవమైనప్పుడు ఎలాగుంటుందో చూపించలేని ఆ దేవుడు, అసలు ఆ ముఖమే లేకుండా చేసేశాడని వైఎస్ గారితో చెప్పాను. ఆ రోజుల్లో వైఎస్‌తో ఉండవల్లి ఈ మాటలు రాజశేఖరరెడ్డి గారి స్పీచ్‌లో చెప్పమన్నాను. ఆయన వద్దన్నారు. ‘ఇంత వివరంగా నువ్వే చెప్పగలవు. నువ్వే చెప్పు’ అన్నారు. ‘సార్! నేను అనువాదకుణ్ణేగానీ వక్తను గాను. రాజేష్ పైలట్, లేదా అహ్లూవాలియానో ఈ మాటలంటే నేను అనువదించగలను గానీ వాళ్లనకుండా నేనెలా చెప్తాను’ అన్నాను. ‘అక్కడికేదో వాళ్లు చెప్పింది మాత్రమే నువ్వు చెబుతున్నట్టు పోజు పెట్టకోయ్... అయినా నువ్వు చేసేది భావానువాదం, భాషానువాదం కాదు! భావం మారకుండా ఈ పదాలు జొప్పించు’ అన్నారు వైఎస్. అహ్లూవాలియా మాట్లాడుతూ రాజీవ్ మరణాన్ని విశ్లేషిస్తుండగా... నేను అనువాదం చేస్తూ, పైన చెప్పిన నాలుగు మాటలూ కలిపేశాను. సభలో ఊహించని రెస్పాన్స్. వైఎస్ గారు మీటింగ్ అయిపోయాక నా భుజం తట్టారు. ఇప్పుడనిపిస్తోంది... ఎప్పుడూ నవ్వుతూ ఉండే వైఎస్ ముఖంలో సైతం మృత్యువును ప్రవేశపెట్టడం ఆ భగవంతుని వల్ల కాలేదనీ, అందుకే హెలికాప్టర్ ప్రమాదంలో ఛిన్నాభిన్నమైన ఆ శరీరం కోట్లాదిమంది అభిమానుల ఆఖరి చూపులకు కూడా నోచుకోలేదని!ఇద్దరు మనుష్యుల మధ్య సంబంధాలు... ఇచ్చిపుచ్చుకోవటాలతో బలపడుతుంటాయి. ఒకరికొకరు సహాయపడుతూ ఆప్తులవుతారు. వైఎస్ గారితో నా సంబంధం తల్చుకుంటే... నాకు ఆశ్చర్యమేస్తుంది! ఎప్పుడూ ఆయన వల్ల నాకు జరిగిన ఉపకారాలే తప్ప... నా నుంచి ఆయన కోసం వీసమెత్తు కంట్రిబ్యూషన్ కూడా లేదు. కనీసం వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేయడానికి కూడా... కావల్సిన కులబలం, ధనబలం లేని నన్ను రెండుసార్లు అసెంబ్లీకి, రెండుసార్లు పార్లమెంట్కీ పోటీ చేయించారు. ఎక్కడో లక్షలాదిమంది మధ్య నుంచొని రాజీవ్‌గాంధీ ఉపన్యాసానికి చప్పట్లుకొట్టే స్థాయి కాంగ్రెస్ కార్యకర్తనైన నన్ను సాక్షాత్తూ ఆ రాజీవ్‌గాంధీ పక్కనే నిలబెట్టారు. అగ్రనాయకులందరూ అడ్డుపడ్డా... నేనే బాగా అనువదిస్తానని, వారితో వాదించి – వారిని వారించి నాకు ఢిల్లీ స్థాయి నాయకులందరి పక్కనా ఉండే స్థాయి కల్పించారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ స్థాయి నాయకులు నన్ను పేరెట్టి పిలిచే స్థానంలోకి పంపించారు. నేనేనాడూ ఆయన్ని ‘నాకిది కావాల’ని అడగలేదు. మొన్నటి (2009) ఎన్నికలకు మూడు నెలల ముందు మాత్రం ధైర్యం చేసి ఒక్క రిక్వెస్ట్ చేశాను... ‘ఈసారి ఎన్నికల్లో నన్ను పోటీ చేయించవద్ద’ని! అప్పటికే రామచంద్రరావు గారి దగ్గర ఈ ప్రతిపాదన చేసి చాలా తిట్టించుకున్నాను. అందుకే వైఎస్ గారితో నెమ్మదిగా ఈ విషయం చెప్పాను. హైదరాబాద్ శివార్లలో ఒక సభకు హాజరవ్వటానికి బయలుదేరుతున్న వైఎస్, తనతో పాటు కారెక్కమన్నారు. సుమారు ఇరవై నిమిషాల ప్రయాణం. దారిలో ఆయనకి ఎక్స్ప్లైన్ చేశాను. ఈసారి నాకెంత ప్రతికూల పరిస్థితులున్నాయో... నేను నెగ్గటం ఎంత అసాధ్యమో వివరించాను. ‘ఇప్పుడు నువ్వు పోటీ చేయకపోవడం కరెక్ట్ డెసిషన్ కాదు. నువ్వు చెప్పిందంతా నిజమే, అయినా నువ్వే గెలుస్తావు... డోంట్ వర్రీ గాడ్ ఈజ్ దేర్’ అన్నారు వైఎస్. అది 2009 సెప్టెంబర్ 3. ఆ రోజు వినాయక నిమజ్జనం. హైదరాబాద్ నగరమంతా అల్లకల్లోల సునామీ సముద్రంలా ఉండేరోజు. వైఎస్ మరణవార్త నెమ్మది నెమ్మదిగా జనానికి చేరుతోంది. నిశ్శబ్దంగా నిమజ్జనం ప్రారంభమయ్యింది. ప్రతి ముఖంలో దుఃఖం, ఎంతోమంది మహానాయకుల మరణవార్తల్ని విన్నాం, కళ్లారా చూశాం. ‘ఆ వార్త వినగానే గుండె పగిలింది’ అంటూ చాలాసార్లు అంటుంటాం. ఇంతకాలం ఇదొక పద ప్రయోగమే... మహా అయితే పదాలంకారమో అనుకున్నాగానీ... నిజంగా గుండె పగిలి చచ్చిపోయేంత దుఃఖం ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంట్లో అందొచ్చిన కొడుకు చచ్చిపోతే ఏడ్చినట్టుగా ఏడుస్తున్న వృద్ధులు... ‘రేపు నా బిడ్డల పరిస్థితేమి’టంటూ పిల్లల తల్లులు... ఫ్రీగా ఇంజనీరింగ్ చదువుకుంటున్న విద్యార్థులు... రాష్ట్రమంతా వెక్కివెక్కి ఏడ్చింది. కొన్ని వందల గుండెలు నిజంగానే పగిలిపోయాయి. యాక్సిడెంట్ కన్ఫర్మ్ అయి వైఎస్ మృతదేహాన్ని గుర్తించారని తెలిసిపోయాక, సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి గారి ఫ్లోర్‌లోకి వెళ్లాను. ఆయనతో నాకున్న సంబంధం, ఆయన నాపై చూపిన ప్రేమాభిమానాలూ మనసులో రీళ్లు తిరగసాగాయి. ఒక మాట దగ్గర రీల్ ఆగిపోయింది. ‘డోంట్ వర్రీ,,, గాడ్ ఈజ్ దేర్.’ నేను తప్పుగా విన్నాను ఆయనన్న మాట... ‘డోంట్ వర్రీ గాడ్ ఈజ్ హియర్!’ అని అయి ఉంటుంది. నేనుండగా నీకెందుకు వర్రీ!! నా సంకల్పమే నీకు దైవం. నా బలమే నీకు దైవబలం. ఇంకా తెలియలేదా అరుణ్... నేనెవరినో!!వైఎస్ గారితో నేను మాట్లాడిన మాటలు, వెటకారాలు, వేళాకోళాలు, జోకులూ అన్నీ గుర్తుకొచ్చి నెమ్మదిగా వెన్నులో వణుకు పుట్టింది. ఆయనతో మాట్లాడేటప్పుడు ఏమి అనాలనిపిస్తే అది అనేసేవాడిని. ఎవరేమనుకుంటారో, అనొచ్చో–లేదో... అని ఏనాడూ సంకోచించలేదు. ఎన్నిసార్లు నా మాటలు ఆయనకు నచ్చకపోయి ఉండొచ్చో... ఎన్నిసార్లు ఆయనకు నా మాటల వల్ల బాధ కలిగిందో... హఠాత్తుగా నాకు ‘భగవద్గీత’లోని ఒక శ్లోకం (11: 42) గుర్తుకొచ్చింది. అర్జున ఉవాచ :‘‘యచ్చావహా సార్థ మసత్కృతోసివిహార శయ్యాసన భోజనేషుఏకోథ వాప్యచ్యుత తత్సమక్షంతత్ క్షామయే త్వామహ మప్రమేయమ్’’ (విశ్వరూప సందర్శన యోగం)‘‘కృష్ణా! నాశరహితా! నీ ఈ మహిమ తెలియక పొరపాటున గానీ, చనువు వల్ల గానీ ఓ కృష్ణా, ఓ యాదవా, ఓ సఖా అని అలక్ష్యముగా నేనేమి అన్నానో... విహారము సల్పునపుడుగానీ, పరుండునప్పుడుగానీ, కూర్చుండునప్పుడు గానీ, భుజించినప్పుడు గానీ, ఒక్కడవుగా ఉన్నప్పుడుగానీ, ఇతరుల యెదుట పరిహాసముగా గానీ ఏ విధంగా ప్రవర్తించితినో నా అపరాధములన్నీ అప్రమేయుడవగు నీవు క్షమించమని వేడుకొనుచున్నాను.’’తండ్రీ! ఓ రాజశేఖరరెడ్డీ! నన్ను క్షమించు... అనుగ్రహించు!!ఉండవల్లి అరుణ్‌కుమార్ – వ్యాసకర్త ప్రముఖ రాజకీయ నాయకుడు, పార్లమెంట్ మాజీ సభ్యుడు -
దుబాయ్‌లో ఘనంగా వైఎస్సార్ 14వ వర్థంతి వేడుకలు
యుఏఈ దుబాయ్: యుఏఈ దేశంలోని దుబాయ్ పట్టణంలో దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ 'వైఎస్ రాజశేఖర రెడ్డి' 14వ వర్ధంతి వేడుకలను వైఎస్సార్సీపీ యుఏఈ కమిటీ కన్వీనర్ సయ్యద్ అక్రం బాషా అండ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించినారు. ఈ సందర్భంగా సయ్యద్ అక్రం బాషా మాట్లాడుతూ.. దివంగత మహానేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి పరిపాలన ఒక స్వర్ణయుగం లాంటిదని ఆయన పరిపాలనలో బడుగు బాలహీన వర్గాల ప్రజలు సఖ సంతోషాలతో వున్నారని పేద ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేసిన అపర భగీరథుడు, జలయగ్నం సృస్టికర్త, ఆరోగ్య శ్రీ ప్రదాత, విధ్యాదాత, ఉచిత విద్యుత్ పధకం, ఫీజు రీయంబ్రస్మెంట్, ఇలా ఎన్నో పధకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఏకైక ముఖ్య మంత్రి. ముస్లింలకు ప్రభుత్వ విద్య ఉద్యోగ రంగాలలో 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వారిదేనని, వారు చనిపోయోటప్పుడు కూడా ప్రజల సంక్షేమం కొరకు పాటు పడ్డారని, రాజన్న భౌతికంగా మన ముందు లేకపోయిన తెలుగు ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో యుఏఈ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. -
అట్లాంటా: వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బొత్స
అట్లాంటా: వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైయస్ఆర్సీపీ శ్రేణులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. దివంగత మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. ఇక అమెరికాలో సైతం వైఎస్సార్సీపీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అట్లాంటాలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో విద్యాశాఖమంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొని దివంగత మహానేతకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహానేతతో తన అనుబంధాన్ని, ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక కార్యక్రమలు పేదల జీవితాలను ప్రభావితం చేసిన తీరును బొత్స సత్యనారాయణ ప్రస్తావించారు. సమాజం బాగుండాలంటే ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదవాలి, నిరుపేదలు తమ పిల్లలను డాక్టర్లు, ఇంజినీర్లుగా చూడాలని దివంగత వైయస్ఆర్ ఆనాడే తపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి లక్షలమంది పేద పిల్లలను ఉచితంగా చదివించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా చదువుకున్న ఎంతో మంది పిల్లలు నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఎంఎన్సీల్లో పెద్ద ఉద్యోగాలు చేస్తూ జీవితంలో గొప్పగా స్థిరపడ్డారని పేర్కొన్నారు. దేశానికే ఆదర్శం.. నాడు మహానేత వైఎస్సార్ చదువుల కోసం రెండు అడుగులు వేస్తే నేడు ముఖ్యమంత్రి జగన్ అదే స్ఫూర్తితో నాలుగడుగులు ముందుకు వేశారన్నారు. సీఎం జగన్ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం విద్యను ప్రధాన అంశంగా గుర్తించి అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. నాడు-నేడు, డిజిటల్ బోధనలు, విద్యాకానుక, అమ్మఒడి, గోరు ముద్ద వంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవని, ఏపీ విద్యారంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. కార్యక్రమం అనంతరం, ప్రవాస ఆంధ్రులతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర- దేశ ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు ఇతర అంశాలపై ఎన్నారైలతో ముచ్చటించారు. ఆ ఘనత వైఎస్సార్‌దే కనిగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీ, 108 వంటి అద్భుతమైన కార్యక్రమాల ద్వారా దివంగత వైయస్ఆర్ ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచారని, పేదలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ఘనత వైయస్ఆర్దే అని అన్నారు. ఆయన సంక్షేమ పథకాల స్పూర్తితో మన దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలూ ఆరోగ్య శ్రీ వంటి పథకాలు ప్రవేశపెట్టాయన్నారు. వైయస్ జగన్ తండ్రిని మించిన తనయుడు.. ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ మాట్లాడుతూ విశ్వసనీయతకు, మంచితనానికి మారుపేరు డాక్టర్ వైయస్ఆర్ అన్నారు. 14 ఏళ్ల తర్వాత కూడా ప్రజలకు వైయస్ఆర్ పై ఉన్న అభిమానం చెక్కుచెదర్లేదని, తెలుగు నేలపై ఆయన పేరు, ఆయన ప్రవేశపెట్టిన అజరామరంగా కీర్తింపబడతాయని పేర్కొన్నారు. ఆ మహానేత దారిలోనే ప్రయాణిస్తున్న వైయస్ జగన్ తండ్రిని మించిన తనయుడిగా ఏపీని తీర్చిదిద్దుతున్నారని అన్నారు. 4 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని విప్లవాత్మక మార్పులను సీఎం వైయస్ జగన్ తీసుకొచ్చారని, ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ ఉండటం మన అదృష్టం అని రత్నాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో IIIT మాజీ ప్రిన్సిపాల్ కృష్ణా రెడ్డి వైయస్ఆర్ గొప్పతనాన్ని పద్యరూపంలో చెప్పడం అలరించింది. సీఎం సలహాదారు ( విద్య ) కుమార్ అన్నవరపు కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అట్లాంటాలో నివాసముంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైఎస్సార్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదీ చదవండి: స్మృత్యంజలి -
స్మృత్యంజలి
సాక్షి కడప : దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో ఇడుపులపాయలోని డాక్టర్ వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఇడుపులపాయలోని డాక్టర్ వైఎస్సార్ సమాధి ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రధానంగా రెవరెండ్ పాస్టర్లు ఆనంద్‌బాబు, నరేష్‌బాబు, మృత్యుంజయరావులు అక్కడనే ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ౖవైఎస్సార్తో తమకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. ఎప్పటికీ మరిచిపోలేని మహానేతగా వైఎస్సార్ మిగిలిపోయారని... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికూడా సంక్షేమ పథకాలను అన్ని వర్గాలకు అందిస్తూ పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారని పాస్టర్లు కొనియాడారు. ప్రార్థన కార్యక్రమం సందర్భంగా వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ సమాధి ఘాట్ వద్ద వైఎస్సార్‌ను తలుచుకుని కొద్దిసేపు భావోద్వేగానికి గురయ్యారు. ప్రార్థనల్లో డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్‌బాషా, జిల్లా ఇన్చార్జిమంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తుడా చైర్మన్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియాఖానమ్, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, డాక్టర్ సుద, టీజే సుధాకర్‌బాబు, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, కడప నగర మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్సీలు పి.రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు వైఎస్ కొండారెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ అభిషేక్‌రెడ్డి, యువ నాయకులు అర్జున్‌రెడ్డి, మైదుకూరు సమన్వయకర్త నాగిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఇరగంరెడ్డి తిరుపేలరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పి.శివ ప్రసాద్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గిరిధర్‌రెడ్డిలు పాల్గొన్నారు. ప్రార్థనలనంతరం వైఎస్సార్ వర్దంతి సందర్బంగా ఘాట్ వద్ద అందరూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ప్రజాప్రతినిధులు, ప్రజలతో కాసేపు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ ప్రాంగణంతోపాటు హెలిప్యాడ్ వద్ద కొద్దిసేపు ప్రజలతో మమేకమయ్యారు. అలాగే సీఎం వైఎస్ జగన్, మంత్రులను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పేరుపేరునా పలకరించారు. ప్రజలతో కాసేపు సమస్యలపై వినతులు స్వీకరించారు. ప్రార్థనలనంతరం నేరుగా వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కాసేపు గడిపారు. ముఖ్యమంత్రి వైఎస్సార్ గెస్ట్‌హౌస్ వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అలాగే బ్రహ్మకుమారీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాఖీలు కట్టారు. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్‌బాషా, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, ప్రొద్దుటూరు, చంద్రగిరి ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ గణేష్‌కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్ఎస్ ప్రవీణ్‌చంద్, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ నరేన్ రామాంజురెడ్డిలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇడుపులపాయ హెలిప్యాడ్ వద్ద టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవివాష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రయ్య,రామసుబ్బారెడ్డి ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట ముఖ్య కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కె.నాగేశ్వరరెడ్డిలు ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపధ్యంలో జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
వైఎస్సార్ కోసం చెప్పాలంటే... ఎంతైనా సరిపోదు
వైఎస్సార్ కోసం చెప్పాలంటే...కొన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు ఆయన కోసం మాట్లాడుకుంటే..ఆయన్ను అభిమానించే వారికి కొన్ని గంటల సమయం సరిపోదు ఎందుకంటే...వైఎస్సార్...ఓ లెజెండ్ భారతదేశ రాజకీయాల్లోనే ఓ ధ్రువ తార రాజకీయానికే రాజసం నేర్పిన మహానేత రాజనీతికి విశ్వసనీయతను నేర్పిన ప్రజానేత పేదల తలరాతలను మార్చిన విధాత ఒక్క మాటలో చెప్పాలంటే...వైఎస్సార్...అంటే పేరు కాదు....బ్రాండ్ ఆ బ్రాండ్ ఎంత గొప్పదంటే....ఈరోజు ఆయన మరణించి పదమూడేళ్లయినా... ఆయన కోసం తల్చుకోగానే మనందరి కళ్లల్లో కన్నీళ్ల సుడులు తిరుగుతాయి...అంత గొప్ప బ్రాండ్. వైఎస్సార్ అసలు వైఎస్సార్ ని ఎందుకు ప్రజలు ఇలా గుండెల్లో పెట్టుకుని దేవుడిలా పూజిస్తున్నారో...మనం ఆలోచిస్తే...ఆయన ఆదర్శవంతమైన ప్రస్థానమే అందుకు కారణం అని నేను చెప్పగలను 2004 వరకు ఈ రాష్ట్రంలోని...హిందువులు...క్రైస్తవులు...ముస్లింలు... ఇలా అన్ని మతాల వాళ్లు...రోజూ తమ దేవుళ్లకు పూజిస్తునే ఉండే వారు.. దేవుడా నా బిడ్డకు చదువునివ్వు...నా బిడ్డకు ఆరోగ్యాన్నివ్వు... ఈ ఏడాది నా పొలాన్ని పండించు... అని అన్ని మతాల పేదలు, రైతులు, ప్రజలు చేయని పూజలు లేవు... వాళ్ల పూజలన్నింటినీ విన్న దేవుళ్లు అందరూ కలిసి...తమ ప్రతినిధిగా వైఎస్సార్ ని పంపారేమో...అన్నట్టుగా..ఆయన పాలన సాగించారు... దేవుడు పాలన...రాముడి పాలన కోసం...చరిత్రలో విన్నాం...కానీ వై ఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే...ప్రత్యక్షంగా చూశాం.. ప్రతీ గడపకి...ప్రతీ గుండెకి తన పాలనను అందించిన ముఖ్యమంత్రి వైఎస్సార్ కనుకనే.. అందుకే దేవుడిలాంటి పాలన వైఎస్సార్...పాలన...అని ఇప్పటికీ...మనం చెప్పుకుంటాం... వైఎస్సార్...అంటే తెలుగు ప్రజల ఎమోషన్... వైఎస్సార్ అంటే తెలుగు ప్రజలకి ఎఫెక్షన్.. సెప్టెంబర్ 2....2009 న... తెలుగు ప్రజలకు...అభివ్రుద్ధి, సంక్షేమం అన్న కథను చెబుతూ...చెబుతూ...శాశ్వత నిద్రలోకి వై ఎస్సార్ వెళ్లిపోయారు... 10 కోట్ల మంది తెలుగు వాళ్లు...కట్టుకున్న ఆశల సౌధం...క్షణాల్లో కుప్పకూలిపోయింది.... ఈ దేశ చరిత్రలో....ఓ పెద్ద రాజకీయ విషాదం ....వై ఎస్సార్ మరణం... దేశంలోని ప్రతిపక్ష నాయకులను సైతం...కన్నీళ్లు పెట్టించిన గొప్ప యుగపురుషుడు...వైెఎస్సార్ వైఎస్సార్ కి మరణం లేదు... ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పేదోడికి జబ్బు చేస్తే. డబ్బు లేకుండా వైద్యం చేశారు రూపాయి డాక్టరున్నంత వరకు... ఒక్క రూపాయి అవసరం లేదని నిరూపించారు ఆరోగ్యశ్రీ తో కోట్ల మందికి ఆయుష్సు పోశారు చిల్లుపడ్డ చిన్నారుల గుండెలకు ప్రాణం పోశారు చావుతో పోరాడే ప్రతీ పేదోడిని గెలిపించారు గంజి నీళ్లకు గతిలేనోళ్ల గడపల్లో గ్రాడ్యువేట్లను ఇచ్చారు ఉన్నోడికే సొంతమైన ఉన్నత విద్యను ఊరందరికీ ఉచితంగా ఇచ్చారు ఆసరా లేని అవ్వా తాతలకు ఆదుకునేలా ఫించనిచ్చారు గుడిసెల్లో జీవితాన్ని గడిపేవాళ్లకి ఇందిరమ్మ ఇళ్లిచ్చారు పావలా వడ్డీ తో అక్క చెల్లెల్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు గడప గడపను...గుండె గుండెకు తన పథకాలతో పలకరించారు అంత గొప్ప ప్రజా నాయకుడికి మరణం ఉంటుందా...? ఆయన ప్రజల గుండెల్లో మాత్రం శాశ్వతంగా జీవించే ఉంటారని గర్వంగా చెప్పగలను ఇంత గొప్పగా పాలించి...పేదల తలరాతలను మార్చారు కాబట్టే వైఎస్సార్ మరణించారన్న వార్త వినగానే... కోట్లాది మంది ప్రజల ఊపిరి బరువైపోయింది... వైఎస్సార్ ని అభిమానించే గుండెలు పగిలిపోయాయి.. వైఎస్సార్ ఉన్నారులే అని ధీమాగా ఉన్న ప్రజల నమ్మకం నేలకొరిగిపోయింది... ఆంధ్రప్రదేశ్‌ని అగ్రగామి రాష్ట్రంగా నడిపిస్తున్న వై ఎస్సార్ ప్రయాణం ఆగిపోయింది... కానీ ఆ గుండెల్లో ధైర్యం నింపుతూ....మన నాయకుడు జగనన్న...తెలుగు ప్రజలకు అండగా నేనుంటాను అని ముందుకొచ్చారు పులి కడుపున పులే పుడుతుంది,...అన్నట్టు వైఎస్సార్ బిడ్డ...వైఎస్సార్ బ్లడ్...మన పులివెందుల పులి...జగనన్న మనందరి కోసం అండగా నిలబడ్డాడు తన తండ్రి ఆశయ సాధాన కోసం...ఎన్నో కష్టాలను, కక్ష సాధింపులను ఎదుర్కొన్నాడు వైఎస్సార్ మరణించాక....ఆ కుటుంబాన్ని సోనియా గాంధీ...నడి రోడ్డున పడేయాలని చూసింది... కానీ ఈ రోజు అదే కుటుంబం....అదే సోనియా గాంధీ...కళ్ల ముందే మళ్లీ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద మూడు రంగుల జెండాను ఎగరేసి...ఇది గో వై ఎస్సార్ పాలన అని....తలెత్తుకుని నిలబడ్డాడు మన జగనన్న... ఢిల్లీ పెద్దలు....ఆంధ్రా గెద్దలు....కలిసి కుమ్మక్కై కుట్రలు చేసి...జగనన్నను అక్రమంగా జైలులో పెట్టారు... ఆ రోజే చెప్పాం.....జైలు గోడలు బద్దలు కొట్టి మరీ...వైఎస్సార్ పాలన తెచ్చుకుంటామని... ఈ రోజు...ఆ అక్రమ నిర్భంధాలను ఛేదించి....అక్రమంగా కేసులు పెట్టిన వాళ్లకు గూబ గుయ్యి మనేలా రీ సౌండ్ విక్టరీ ని సాధించి చూపించారు మన జగనన్న కాంగ్రెస్ పార్టీ కుట్రలు...సోనియా గాంధీ కక్ష సాధింపులు...పరాకాష్టకు చేరిన సందర్భంలో.. అప్పుడు జగనన్న....ఒక మాట చెప్పారు... వైఎస్సార్ ని అభిమానించే ప్రతీ గుండె చప్పుడు ఒక్కటవుతుంది... ఓ ఉప్పెన పుడుతుంది...ఆ ఉప్పెనలో కొట్టుకుపోతారు....వీళ్లంతా....అని చాలా ఎమోషనల్ గా మాట్లాడారు... నిజంగానే....ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదేళ్ల తరువాత...వై ఎస్సార్ ని అభిమానించే గుండెల చప్పుడు ఒక్కటయ్యింది... గత ఎన్నికల్లో ఓ రాజకీయ ఉప్పెన పుట్టించాయి.... అందుకే 151 ఎమ్మెల్యే సీట్లు...22 ఎంపీ సీట్లతో విజయ ఢంకా మోగించారు జాతీయ పార్టీలు కు సింగిల్ సీటు కూడా రాలేదు.. 40 ఏళ్ల రాజకీయ అనుభవానికి ి40 సీట్లు కూడా రానివ్వలేదు.. ప్యాకేజీ పార్టీల అధ్యక్షులకు సైతం అడ్రస్ లేకుండా చేశారు... దేశమంతా మోడీ గాలి వీస్తే...ఆంధ్రా లో మాత్రం...జగనన్న ఫ్యాన్ గాలి వీచింది... అదీ జగన్మోహన్ రెడ్డి పవర్....వైఎస్సార్ అభిమానుల పవర్... అందుకే గర్వంగా చెప్తున్నా....వైఎస్సార్ పాలన మళ్లీ వచ్చింది అని... వైఎస్సార్ మనమధ్య లేకపోయినా....వైఎస్సార్ వారసుడు మనతో ఉన్నాడు వైఎస్సార్ ప్రాణం మనతో లేకపోయినా...వైఎస్సార్ పాలన మనతో ఉంది స్వర్గంలో ఉన్న వైఎస్సార్ సైతం...గర్వపడేలా ఈరోజు జగనన్న 50 నెలల పాలన సాగింది వైఎస్సార్ మరణించినా...ఆయన ఆశయం..ఆయన సంకల్పం జగనన్న ఉన్నంత వరకు మరణించదని ఈ నాలుగున్నారేళ్ల పాలనతో నిరూపించారు మన జగనన్న One and only... Ysr....Forever ఇట్లు.. నిద్దాన సతీష్, వై ఎస్సార్ అభిమాని గాజులరేగ, విజయనగరం -
ఉచిత విద్యుత్ వైఎస్సార్ మానసపుత్రిక: దిగ్విజయ్ సింగ్
హైదరాబాద్: వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకున్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్. హైదరాబాద్‌లో రైతే రాజైతే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దిగ్విజయ్ సింగ్, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ ముక్కుసూటి మనిషి.వైఎస్సార్‌తో నా అనుబంధం విడదీయరానిది. పార్టీ నిర్మాణంలో యుక్త వయస్సు నుంచే వైఎస్సార్ కీలకం గా పనిచేసారు. ఉచిత విద్యుత్ వైఎస్సార్ మానసపుత్రిక. ఇందిరమ్మ ఇళ్ళు వైఎస్సార్ చలువే.. అవే విధానాలను జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్నారు. నక్సలైట్లతో చర్చలు జరిపి జనజీవన స్రవంతి లోకి తీసుకురావడంలో వైఎస్సార్ కీలక భూమిక పోషించారు. 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే జలయజ్ఞంకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ మరణించకుండా ఉంటే తెలుగు రాష్ట్రాలు మరోలా ఉండేవి. శత్రువులు కూడా మెచ్చేగుణం వైఎస్సార్‌కు ఉంది. రాజశేఖర్ రెడ్డి దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను. వైఎస్సార్ బతికి ఉంటే బీజేపీ తీసుకువచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ లో ధర్నా కు దిగేవాడు. వైఎస్సార్ లేకపోయి ఉంటే 2004,2009లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడకపోయేది. వైఎస్సార్ బతికి ఉంటే దేశంలో ఇప్పుడు ఉన్న విపత్కర పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడే వారు.’ అని తెలిపారు. వైఎస్సార్ అందరి అభిప్రాయాలను గౌరవించేవారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ తో నేను రాజకీయంగా విభేదించొచ్చు. కానీ వైఎస్సార్ అమలు చేసిన ఆర్థిక, వ్యవసాయ విధానాలు అందరికీ ఆదర్శం. నేను హైకోర్టు జస్టిస్ గా ఉన్న సమయంలో ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా..రాజ్యాంగ వ్యవస్థ ల ఒత్తిడి చేయలేదు. సుధీర్ఘ కాలం పోరాడి సీఎం అయిన వ్యక్తి కాబట్టి.. వైఎస్సార్ అందరి అభిప్రాయాలను గౌరవించేవారు. కాంగ్రెస్ అదిష్టానం పై ఒత్తిడి తీసుకొచ్చి మ్యానిఫెస్టో లో ఉచిత విద్యుత్ చేర్చారు. జాతీయ పార్టీ లకు ప్రాంతియ ప్రయోజనం అవసరం లేదా అనివైఎస్సార్ ప్రశ్నించారు.జాతీయ పార్టీ లో ఉన్నా ప్రాంతియ స్పృహ ఉన్న వ్యక్తి వైఎస్సార్’ అని కొనియాడారు. చదవండి: ఇడుపులపాయలో వైఎస్సార్‌కు సీఎం జగన్ నివాళి -
వైఎస్సార్ వర్ధంతి: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ప్రత్యేక ప్రదర్శన
వైఎస్సార్.. ఆ పేరు ఓ ప్రభంజనం. నవ్వులో స్వచ్ఛత.. పిలుపులో ఆత్మీయత.. మాట తప్పని, మడమ తిప్పని గుణంతో ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రపంచీకరణ విధానాల యుగంలో అభివృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో మేళవించి చూపిన మహోన్నత నాయకుడు వైఎస్సార్. మహానేతను కోల్పోయి 14 ఏళ్లు గడిచిపోయాయి. కానీ ఆ జ్ఞాపకాలు చెరిగిపోలేదు..ఆ రూపం చెదిరిపోలేదు. ఇక, మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా న్యూయర్ టైమ్స్ స్వ్కేర్‌లో ప్రత్యేక ప్రదర్శన చేపట్టారు. చెదరని జ్ఞాపకం మహానేత వైఎస్సార్ 14వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అని ప్రదర్శించారు. అవధుల్లేని అభిమానం 🙏🏻 In Texas 🔥#YSRVardanthi #JoharYSR pic.twitter.com/1ilcV1iMi4 — Jagananna Connects (@JaganannaCNCTS) September 2, 2023 ఇది కూడా చదవండి: వైఎస్సార్ ఎప్పటికీ మనతోనే ఉంటారు: సజ్జల -
వైఎస్సార్ ఎప్పటికీ మనతోనే ఉంటారు: సజ్జల
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మహానేత వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహానేతతో తమ జ్ఞాపకాలను నేతలు గుర్తుచేసుకున్నారు. కోట్లాది మంది ప్రజల హృదయాల్లో వైఎస్సార్ సుస్థిరస్థానం సంపాదించుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్ ఎప్పటికీ మనతోనే ఉంటారు. వైఎస్సార్ మనసున్న నాయకుడు. మనసుతో పాలన చేసిన మహానేత వైఎస్సార్. వైఎస్సార్ అడుగుజాడల్లోనే సీఎం జగన్ పాలన చేస్తున్నారని సజ్జల అన్నారు. ‘‘వైఎస్సార్, వైఎస్ జగన్ పాలనలో ఉండటం మన అదృష్టం. అందరూ బావుండాలని కోరుకునే వ్యక్తి వైఎస్సార్. మనసున్న వ్యక్తి పాలకుడైతే ప్రజలు సంతోషంగా ఉంటారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో.. సీఎం జగన్ సంక్షేమ పాలనలో రాష్ట్రంలో 60 శాతానికిపైగా ప్రజలు తిరిగి వైఎస్సార్సీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తుడా సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి భూమన నివాళులర్పించారు. వైఎస్సార్ మనల్ని విడిచి 14 ఏళ్లు అయినా ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేక పోతున్నారనీ, ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు. ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా వైఎస్సార్: మంత్రి పెద్దిరెడ్డి వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తిరుపతిలో క్యాంప్ కార్యాలయంలో ఆయన విగ్రహానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సంక్షేమ పాలన అందించిన వైఎస్సార్ ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో.. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కంట్రోల్ రూం వద్ద వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి , డిప్యూటీ మేయర్లు, వైసీపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
నాన్నా.. మీ ఆశయాలే నన్ను నడిపిస్తున్నాయ్: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: దివంగత మహానేత వైస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావోద్వేగంగా స్పందించారు. ‘‘నాన్నా... మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది’’ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారాయన. భౌతికంగా మా మధ్య లేకపోయినా.. ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి సందర్భంగా మీకు ఘనంగా నా నివాళులు నాన్నా అంటూ ట్వీట్లో పేర్కొన్నారాయన. నాన్నా… మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి… pic.twitter.com/Fq1Ngg4f5Q — YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2023 ఇక వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయకు కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్ అభిమానగణం తరలివెళ్తోంది. సీఎం జగన్ కూడా వైఎస్సార్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులు అర్పించనున్నారు. -
ఆ పేరు నేటికీ వినిపిస్తుంటుంది: గవర్నర్ అబ్దుల్ నజీర్
సాక్షి, కృష్ణా: దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఘనంగా నివాళి అర్పించారు. ఈ మేరకు శనివారం గవర్నర్ కార్యాలయం అధికారిక ఎక్స్(ట్విటర్) హ్యాండిల్ ఆయన సందేశం ఉంచింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దార్శనికత కలిగిన నాయకుడు. రైతులు, పేద, అణగారిన వర్గాల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ఆయన పేరుగాంచారు. అందుకే ఆ పేరు నేటికీ వినిపిస్తుంటుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఆయన అమలు చేసిన ప్రజా-స్నేహపూర్వక సంక్షేమ కార్యక్రమాలకు ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు అని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. Governor of Andhra Pradesh Sri S. Abdul Nazeer offered rich tributes to Dr. Y.S. Rajasekhara Reddy, Former Chief Minister in united Andhra Pradesh, on his death anniversary. pic.twitter.com/JgSHCGOgxR — governorap (@governorap) September 2, 2023 -
YSR: నా అనుకున్న వాళ్లకోసం ఎంతవరకైనా
సాక్షి, అమరావతి: ‘నా అనుకున్న వాళ్ల కోసం ఎంతవరకైనా వెళ్లే గొప్ప వ్యక్తిత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిది. అనుకున్నది సాధించడానికి ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కొనే ధైర్యం ఆయన నైజం. ఆయన నవ్వుతూ ఉండేవాడు. మమ్మల్ని కూడా నవ్వుతూ ఉండమనేవారు. ఒక్కోసారి చిన్నపిల్లాడిలా మారిపోయేవారు. నా లాంటి ఎందరికో రాయకీయ పునాదులు వేసిన నాయకుడు’ అంటూ మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్. ‘వైఎస్సార్ కేవలం మంచి వాడే కాదు.. అంతకు మించిన వాడు’ అని ‘సాక్షి’కి చెప్పారు. వైఎస్సార్ తనను ఎంతగానో ప్రోత్సహించేవారని తెలిపారు. చదవండి: Johar ysr: అజేయుడు -
YSR : ఇడుపులపాయలో వైఎస్సార్‌కు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి/ వైఎస్సార్: దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. సతీసమేతంగా ఇడుపులపాయ వెళ్లిన సీఎం జగన్.. తల్లి వైఎస్ విజయమ్మ, మరికొందరు కుటుంబ సభ్యులు, మంత్రులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన తన ట్విటర్ ఖాతాలో తండ్రి వైఎస్సార్‌ను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు నాన్నా… మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి… pic.twitter.com/Fq1Ngg4f5Q — YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2023 ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, రఘురామిరెడ్డి, పీజేఆర్ సుధాకర్ బాబు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి, మేయర్ సురేష్ బాబు హాజరయ్యారు. చదవండి: Johar ysr: అజేయుడు -
ప్రతి మది మందిరమే!
సాక్షి ప్రతినిధి కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ప్రభుత్వ పథకాలు ఇప్పటికీ, ఎప్పటికీ మరువరానివి. ఫీజురీయింబర్స్‌మెంటు పథకం పేదల తలరాతలు మార్చివేసింది. అనారోగ్యపాలైతే వల్లకాడే దిక్కుగా ఉన్న పేదలకు ఆరోగ్యశ్రీ పథకంతో పునర్జన్మ కల్పించింది. ఇళ్లు లేని నిరుపేదలందరీకి గూడు కల్పించి వైఎస్సార్ వారి పాలిట కల్పవృక్షంలా నీడనిచ్చారు. అణగారిన వర్గాల ఉన్నతి కోసం రిజర్వేషన్లు కల్పించి చరిత్రను తిరగరాశారు. అరుగాలం శ్రమించినా ఫలితం దక్కని రైతన్నకు దన్నుగా నిలిచారు. వృద్ధులకు పెద్దకొడుకుగా, వితంతువులకు సోదరుడిగా... ఇలా చెప్పుకుంటూపోతే ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాలకు ఏదో ప్రయోజనం కల్పించిన ఘనత ఆయన సొంతమైంది. ఓవైపు పన్నులు లేకుండా మరోవైపు సంక్షేమ పాలన చేపట్టి, ప్రభుత్వ పాలనంటే ఇలా ఉండాలని భవిష్యత్ తరాలకు ఆయన ఆదర్శప్రాయుడుగా నిలిచారు. వెరసి ప్రతి హృదయము మందిరమే అయ్యిందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అరుదైన నాయకుడు.... అచ్చతెలుగుదనం ఉట్టిపడే పంచెకట్టు, నడకలో ఠీవి, నమ్ముకున్న వారిని ఆదరించేగుణం, మాట తప్పని.. మడమ తిప్పని నైజం, అన్నదాతలు, కార్మిక, కర్షకుల కోసం పరితపించే గుణం, వీటన్నీంటికీ మించి మోముపై చిరునవ్వు... ఈ లక్షణాలన్నీ కలగలిపి పుణికి పుచ్చకున్న నాయకుడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. అనంతపురం నుంచి అదిలాబాద్ వరకూ, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఆ పేరు ఉచ్ఛరిస్తేనే మనస్సు పులికిస్తుంది. అందుకు కారణం రాజకీయాలకు అతీతంగా పేదలను ప్రేమించడం, వర్గాలకు, పార్టీలకు, ప్రాంతాలకతీతంగా సమగ్రాభివృద్ధి చేయాలనే తపన ఉండ డం. ప్రజల కోసం, ఎంతటి కష్టాన్నైనా భరించి సంక్షేమ పాలన చేపట్టడం. దాంతో మరుపురాని జ్ఞాప కంగా ప్రజానీకం గుండెలోతుల్లో కొలువయ్యారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతి శనివారం ప్రజానీకం ఘనంగా చేపట్టేందుకు సన్నహాలు చేసుకున్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. తండ్రిని మించి ఆరోగ్యశ్రీ అమలు... పేదల మదిలో వైఎస్ రాజశేఖరరెడ్డి సుస్థిర స్థానం సంపాదించారు. నేను సైతం పేదల పక్షపాతినేని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రుజువు చేశారు. తండ్రి కంటే రెండు అడుగులు ముందుంటానని స్వతహాగా వెల్లడించిన ఆయన ఆరోగ్యశ్రీని మరింత పటిష్టం చేసే దిశగా చర్యలు చేపట్టారు. 3,255 రోగాలను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిఽధిలోకి తీసుకొచ్చారు. రూ.5లక్షల వరకు ఆదాయం ఉన్న కుటుంబాలను సైతం ఆరోగ్యశ్రీ పథకంలోకి వర్తించేలా పథకాన్ని రూపొందించారు. మరోవైపు ఆరోగ్య ఆసరా పథకాన్ని తీసుకొచ్చారు. జబ్బుల బారిన పడిన వారి జీవనానికి ఎలాంటి ఆటంకం తలెత్తకుండా రోజుకు రూ.225 చెల్లించేలా పథక రచన చేశారు. ఇప్పటి వరకూ జిల్లాలో రూ.550 కోట్లు వ్యయం భరించి 2.6లక్షల మందికి వివిధ వైద్య సేవలు ఉచితంగా అందించారు. ఆరోగ్య ఆసరా ద్వారా 1.2లక్షల మందికి సుమారు రూ.58 కోట్లు పైగా అందజేశారు. జిల్లా సమగ్రాభివృద్ధికి విశేష కృషి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు పాలకుల వివక్షతతో అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయిన కడప జిల్లా ఐదేళ్ల వైఎస్ హయాంలో సమగ్రాభివృద్ధి సాధించింది. ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకొచ్చేందుకు యోగి వేమన యూనివరిర్సటీ, జేఎన్టీయూ ఇంజినీరింగ్, పశువైద్య విద్య కళాశాలలను నెలకొల్పారు. జిల్లా కేంద్రంలో రిమ్స్ వైద్య కళాశాల, 750 పడకల రిమ్స్ ఆస్పత్రి, దంత వైద్యశాల నిర్మించారు. ట్రిపుల్ ఐటీ, ఐజీ కార్ల్ (పశు పరిశోధన కేంద్రం), దాల్మియా సిమెంటు కర్మాగారం, గోవిందరాజా స్పిన్నింగ్ మిల్స్, భారతి సిమెంటు కర్మాగారం, సజ్జల పాలిమర్స్ లాంటి పరిశ్రమలను నెలకొల్పారు. జలయజ్ఞం ద్వారా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను పరుగులు పెట్టించారు. సుమారు రూ. 12 వేల కోట్లతో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేశారు. గాలేరు– నగరి సుజల స్రవంతి, గండికోట కెనాల్, టన్నల్, గండికోట వరద కాల్వ, గండికోట ఎత్తిపోతల పథకాలను వైఎస్సార్ హయాంలో రూపొందించినవే. మైలవరం ఆదునీకరణ, సర్వరా యసాగర్, వామికొండ ప్రాజెక్టు, సీబీఆర్, పీబీసీ, పైడిపాళెం, వెలిగల్లు, తెలుగుగంగ ప్రాజెక్టు పనులు చకచకా సాగించారు. అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాదే తెలుగుగంగ పనులను పూర్తి చేసి కృష్ణా జిల్లాలతో బ్రహ్మంసాగర్‌లో నింపి ఘనత సాధించారు. మెట్ట ప్రాంతాలల్లో కృష్ణా జలాలు పారుతున్నాయంటే అది ఆనాటి వైఎస్సార్ చలువే. ఎవరు ఏది అడిగినా కాదనకుండా అభయమిచ్చారని జిల్లావాసులు ఇప్పటికీ కొనియాడుతున్నారు. ప్రొద్దుటూరులోని శ్రీనివాసనగర్‌లో నివాసం ఉంటున్న పెనుగొండ రామశేషయ్య లారీ డ్రైవర్. ముగ్గురు కుమార్తెలు, అందరూ పనికి వెళ్తేగానీ పూట గడవని పరిస్థితి. 2008లో రామశేషయ్యకు గుండె నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. ప్రయివేట్ ఆస్పత్రికి వెళ్లగా గుండెపోటు అని ని ర్ధారించారు.ఆపరేషన్ చేయించాలన్నారు. చే తిలో చిల్లిగవ్వకూడా లేకపోవడంతో ఏమి చే యాలో పాలుపోలేని స్థితి.వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కింద తిరుపతి లోని స్విమ్స్ ఆస్పత్రిలో ఉచితంగా గుండె ఆపరేషన్ చేశారు. ఎన్ని జన్మలెత్తినా వైఎస్సార్ రుణం తీర్చుకోలేమని రామశేషయ్య అంటున్నారు. ప్రొద్దుటూరులోని సంజీవనగర్‌లో నివాసం ఉంటున్న చౌటపల్లె ఆదినారాయణరెడ్డి దంపతులకు 2008లో ఒకే నెలలో ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేశారు. ఏప్రిల్‌లో ఆయనకు గుండెపోటు రావడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక వైద్యం చేసి వెంటనే హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. అక్కడి మెడిసిటి హాస్పిటల్లో ఆపరేషన్ చేసి స్టంట్ వేశారు. నేను ఆరోగ్యంగా ఉన్నానంటే ౖవైఎస్సార్ పెట్టిన భిక్షేనని ఆదినారాయణరెడ్డి చెబుతున్నారు. అదే నెలలో వెంకటసుబ్బమ్మకు ఆరోగ్యశ్రీ కింద థైరాయిడ్ ఆపరేషన్ జరిగింది. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయడంతో భార్యాభర్తలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. -
మహానేత జ్ఞాపకాల్లో.. మన విశాఖ
వైఎస్సార్.. ఆ పేరు ఓ ప్రభంజనం. నవ్వులో స్వచ్ఛత.. పిలుపులో ఆత్మీయత.. మాట తప్పని, మడమ తిప్పని గుణంతో ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రపంచీకరణ విధానాల యుగంలో అభివృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో మేళవించి చూపిన మహోన్నత నాయకుడు వైఎస్సార్. మహానేతను కోల్పోయి 14 ఏళ్లు గడిచిపోయాయి. కానీ ఆ జ్ఞాపకాలు చెరిగిపోలేదు..ఆ రూపం చెదిరిపోలేదు. మహానేత వైఎస్సార్ మానస పుత్రికగా విశాఖ నగరం.. ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఉజ్వలంగా వెలుగొందుతోంది. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా విశాఖలో మహానేత చేపట్టిన అభివృద్ధి.. సంక్షేమాన్ని గుర్తు చేసుకుందాం.. సాక్షి, విశాఖపట్నం: 2004.. ఉమ్మడి విశాఖ జిల్లా అన్ని రంగాల్లో సంక్షోభ వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతోంది. నగరంలో తాగునీటి సమస్య, అచ్యుతాపురం సెజ్ ఏర్పాటుకు భూసేకరణ, పరవాడ ఫార్మాసిటీ భూ వివాదాలు, గంగవరం పోర్టు భూ సేకరణ సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. స్టీల్ ప్లాంట్, బీహెచ్‌పీవీ, షిప్‌యార్డులు నష్టాల ఊబిలో కూరుకుపోయి మూసివేసే పరిస్థితి ఏర్పడింది. వీటి పరిష్కారమే లక్ష్యంగా 2005 జనవరిలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విశాఖలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఒక్కో సమస్యకు సానుకూల పరిష్కారం చూపించారు. నగరంలో మంచినీటి సమస్య పరిష్కారంతో పాటు అచ్యుతాపురం, ఫార్మా సెజ్‌లకు భూముల ధర నిర్ణయించడంతో పాటు పునరావాస ప్యాకేజీలు ప్రకటించారు. నష్టాల్లో ఉన్న స్టీల్‌ప్లాంట్‌ను గట్టెక్కించి రెండో దశను విస్తరించాలని నిర్ణయించారు. భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్(బీహెచ్‌పీవీ)ని భెల్(బీహెచ్ఈఎల్)లో విలీనం చేశారు. షిప్‌యార్డును రక్షణ శాఖలో విలీనం చేసి పునరుజ్జీవం కల్పించారు. అదే సమావేశంలో విశాఖలో ఐటీకి అభివృద్ధి బాటలు వేశారు. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజా నాయకుడిగా మన్ననలు అందుకున్నారు. ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104, ఆరోగ్యశ్రీ, గృహనిర్మాణం, జలయజ్ఞం.. ఇలా ఎన్నో పథకాలను విజయవంతంగా అమలు చేశారు. మరుపురాని మహానేత గురుతులివీ.. ► వైఎస్సార్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌ను 2005 నవంబర్ 22న మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ)గా మార్పు చేస్తూ.. గ్రేటర్ హోదా కల్పించారు. అప్పటి వరకు 111 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న విశాఖ 540 చ.కి.మీ విస్తీర్ణంతో మహా విశాఖగా అవతరించింది. 2013లో భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలు విలీనమయ్యాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో 10 పంచాయతీలను గ్రేటర్లో విలీనం చేసి.. 98 వార్డులుగా విస్తరించారు. ► జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునర్ని ర్మాణ పథకం(జేఎన్ఎన్యూఆర్ఎం)లో విశాఖ నగరాన్ని చేర్పించడంలో వైఎస్సార్ కీలక పాత్ర పోషించారు. ఆయన చొరవతో నగరానికి రూ.1,885 కోట్ల విలువైన పనులు దక్కాయి. సింహాచలం, పెందుర్తి బీఆర్టీఎస్ కారిడార్లు, ఆశీల్‌మెట్ట ఫ్లైఓవర్, విలీన గ్రామాలకు తాగునీటి సౌకర్యం, భూగర్భ మురుగు నీటి వ్యవస్థ, మౌలిక సదుపాయాల కల్పన మొదలైన 20 ప్రాజెక్టులను వైఎస్సార్ తీసుకొచ్చారు. ► విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా తీసుకొచ్చింది వైఎస్సారే. దాంతో విమాన సర్వీసులు గణనీయంగా పెరిగాయి. విదేశాలకు కూడా ఇక్కడ నుంచి విమానాలు ఎగిరాయి. ఆ ఒరవడి కొనసాగిస్తూ ఇటీవల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ► గోదావరి నీటిని విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చాలన్న సంకల్పంతోనే పోలవరం ఎడమ కాలువను నిర్మించారు. తాండవ, రైవాడ, పెద్దేరు, కోనాం ప్రాజెక్టుల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. ఏలేరు నీటిని మళ్లించడం ద్వారా స్టీల్‌ప్లాంట్ నీటి సమస్యను పరిష్కరించారు. ► నగరంలోని నిరుపేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో రాజీవ్ గృహకల్ప ఇళ్లకు శ్రీకారం చుట్టారు. నగర పరిధిలో సుమారు లక్షకుపైగా పునరావాస, పూర్‌సెటిల్‌మెంట్ కాలనీ ఇళ్లు నిర్మించారు. రాజీవ్ గృహకల్ప ద్వారా రూ.650 కోట్లతో 15,320 ఇళ్లు, జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా రూ.600 కోట్లతో 15 వేల గృహాలు, వాంబే కింద రూ.400 కోట్లతో 9 వేల ఇళ్ల నిర్మాణం చేశారు. మధురవాడలో గృహ సముదాయాలు ఆయన చేతుల మీదుగానే ప్రారంభమయ్యాయి. ► ఐటీ ప్రగతి ఒక్క హైదరాబాద్‌కే పరిమితం కాకుండా వికేంద్రీకరణ జరగాలని వైఎస్ భావించారు. విశాఖలో 3 కొండలు, కొండల కింద ఉన్న సుమారు 100 ఎకరాల పల్లపు ప్రాంతాన్ని ఎంపిక చేశారు. కనీసం 100 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే ఐటీ కంపెనీలకు మాత్రమే అవకాశమిచ్చి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ప్లాట్లుగా డివైడ్ చేసి అందించారు. వైఎస్ ఆలోచనలను మెచ్చి సుమారు 200 కంపెనీలు ముందుకొచ్చాయి.కొద్ది కాలంలోనే 70 శాతం కంపెనీలు కార్యకలాపాలను ప్రారంభించాయి. సత్యం, విప్రో కంపెనీలూ విశాఖలో తమ శాఖలను విస్తరింపజేశాయి. అలా.. వైజాగ్‌ను ఐటీ హబ్‌గా మార్చేందుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. వైఎస్సార్ మరణం తర్వాత.. దాదాపు పదేళ్లు విశాఖ ప్ర‘గతి’తప్పింది. మళ్లీ 2019 తర్వాత ఐటీ ప్రగతి మళ్లీ పట్టాలెక్కింది. కొత్తగా ఇన్ఫోసిస్ తమ కార్యకలాపాలు ప్రారంభించింది. అదానీ డేటా సెంటర్‌కు ఇటీవలే సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలందించేందుకు 2006లో విమ్స్‌కు వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. 1130 పడకలు, 21 సూపర్ స్పెషాలిటీ బ్లాకులతో రూ.250 కోట్లతో విమ్స్ ఆస్పత్రి నిర్మాణానికి 2007లో శంకుస్థాపన చేశారు. ఆయన మరణాంతరం అనేక పరిణామాల తర్వాత 2016 ఏప్రిల్‌లో విమ్స్ అందుబాటులోకి వచ్చింది. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో చంద్రబాబు ప్రభుత్వం.. విమ్స్‌ను ప్రైవేట్‌పరం చేసేందుకు కుయుక్తులు పన్నింది. అప్పుడే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ సీపీ ఈ ప్రయతాన్ని అడ్డుకుంది. కోవిడ్ సమయంలో విమ్స్ స్టేట్ కోవిడ్ హాస్పిటల్‌గా విశేష సేవలందించింది. -
మెట్టనేలలో గలగల..
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఎన్నాళ్లయినా...ఎన్నేళ్లయినా...అభివృద్ధిలో పెద్దాయన అడుగు జాడలు తీపి గుర్తులుగా మిగిలిపోయాయి. మాట అంటే చాలు ఎంత కష్టమైనా కడదాకా నిలిచే మనస్తత్వం మహానేత రాజశేఖరరెడ్డి సొంతం. ఆయన హయాంలో చేపట్టిన అభివృద్ధి ఫలాలు ఈ జిల్లాపై చూపించిన అభిమానానికి నిలువెత్తు నిదర్శనాలు. 1475 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా జిల్లాకు వచ్చినప్పుడు వైఎస్సార్ జిల్లా వాసులు బాధలను ప్రత్యక్షంగా చూశారు. తాను సీఎం అయ్యాక ఈ సమస్యలన్నింటిపైనా శ్రద్ధ చూపించారు. నాడు చూపించిన పరిష్కార మార్గాలే ఇప్పటి తరానికి బాటలు వేశాయి. ముఖ్యంగా అన్నదాతల కష్టాలు తెలుసుకుని అధికారంలోకి రాగానే పరిష్కారానికి కృషి చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జిల్లాలోని మెట్ట ప్రాంత రైతు సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం చూపారు. నేడు(శనివారం) వైఎస్ వర్థంతి. ఈ సందర్భంగా జిల్లా ప్రజానీకం ఆయన్ను మననం చేసుకుంటున్నారు. రెండు పంటల స్థాయికి.. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో ఇప్పుడు రెండు పంటలకు సాగునీరు పుష్కలంగా అందుతుందంటే నాడు వైఎస్సార్ దార్శనికతే కారణం. ఆయన రూపకల్పన చేసిన నీటి ప్రాజెక్టులే ఇందుకు తార్కాణం. వైఎస్సార్ అధికారంలోకి రాక మునుపు ఈ ప్రాంతంలో ఒక పంట పండటమే గొప్ప. అలాంటిది ఆయన చూపిన దారితో రెండు పంటలు పండించే స్థితికి మెట్ట ప్రాంత భూములు చేరుకున్నాయి. ఇది మహానేత పుణ్యమే అంటారు ఇక్కడి రైతులు. తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాలలో బీడు భూములలో బంగారం పండుతోందంటే అది వైఎస్ చలవే. అందుకే ఇన్నేళ్లయినా రైతులు వైఎస్సార్‌ను దైవంగా గుండెల్లో నింపుకున్నారు. సీఎం అయ్యాక తమ ప్రాంతం సుభిక్షమైందని చెబుతుంటారు. మచ్చుకు కొన్ని .. ● మెట్ట ప్రాంత రైతులకు ఏళ్ల తరబడి సమస్య తోట వెంకటాచలం పుష్కర ఎత్తి పోతల పథకం. ఒకేసారి రూ.600కోట్లు వెచ్చించి లక్షన్నర ఎకరాల్లో సాగునీరందించడంలో మహానేత సఫలీకృతమయ్యారు. ● గత పాలకుల హామీకే పరిమితమైన తాండవ ప్రాజెక్టును వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.52 కోట్లతో ఆధునీకరించారు. కుడి,ఎడమ కాలువలు, పిల్ల కాలువలకు శాశ్వత పరిష్కారం చూపించారు. ● రూ.120 కోట్లతో పిఠాపురం బ్రాంచ్ కెనాల్, రూ.132కోట్లతో ఏలేరు ఆధునీకరణకు శ్రీకారం చుట్టి రైతుల పక్షపాతిగా నిలిచారు. ● జంట మున్సిపాలిటీలు సామర్లకోట, పెద్దాపురం ప్రజల దాహార్తిని తీర్చి వారి హృదయాల్లో చెరగని ముద్రవేశారు.రూ.15 కోట్లతో మంచినీటి ట్యాంకర్లు, రూ.12 కోట్లతో పెద్దాపురంలో రాజీవ్ గృహకల్ప, రూ.25 కోట్లతో పేదల ఇళ్ల నిర్మాణంతో ప్రయోజనం పొందిన లబ్థిదారులు ఇప్పటికీ రాజశేఖరరెడ్డిని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ● రూ.5 కోట్లతో తాండవపై మినీ అనకట్టలను నిర్మించి తమకు దాహం తీర్చిన దివంగత నేతను తుని ప్రజలు ఎప్పటికీ గుర్తు తెచ్చుకుంటున్నారు. ● ఎక్కడో రంపచోడవరం ఏజెన్సీలో ముసురుమిల్లి ప్రాజెక్టు నుంచి 10 వేల ఎకరాలకు సాగునీరు అందించి గోకవరం మండల రైతుల కళ్లల్లో సంతోషాన్ని నింపారు. గోకవరం రైతుల కడగండ్లతో చలించిన వైఎస్ తాను సీఎం అయ్యాక రూ.205 కోట్లతో ఈ ప్రాజెక్టు పనులు వడివడిగా చేపట్టారు. ఈ మండల రైతులు వైఎస్‌ను ఇప్పటికీ స్మరించుకుంటారు. -
మరపురాని మహానేత వైఎస్సార్.. ది లెజెండ్
వైఎస్సార్ .. ఆ పేరు వినపడగానే తెలుగునేల మీద ప్రతి గుండె స్పందిస్తుంది. మహానుభావుడు.. అంటూ ఆయన జ్ఞాపకాలను తడుముకుంటుంది. మరపురాని మహానేత వైఎస్సార్.. ది లెజెండ్. 2009.. సెప్టెంబర్ 2. ఒక దుర్దినం. తెలుగుజనం గుండెమీద బండ పడ్డ దినం. నిరంతరం తమ గురించి, తమ మేలు గురించి ఆలోచించే ఓ పాలకుడిని కోల్పోయిన రోజు. పదమూడేళ్లు గడిచిపోయాయి. ఆ జ్ఞాపకాలు చెరిగిపోలేదు. ఆ రూపం చెదిరిపోలేదు. ఆ నవ్వుల రేడు...సంక్షేమసారధి లేడుగానీ ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయాడు. జోహార్ వైఎస్సార్. వర్షం గురించి కలవరించే మనిషి. ఊరూరా వర్షం లెక్కలు వేసుకునే ముఖ్యమంత్రి. జలసిరులతో పంటలు బాగా పండాలని, రైతన్నల గడపల్లో సంతోషం వెల్లివిరియాలన్నది నిరంతర తపన. వైఎస్సార్ దగ్గర పనిచేసిన అధికారులు తరచూ గుర్తు చేసుకునే విషయమిది. వర్షం పడుతుంటే కిటికీ పక్కన చేరి హర్షాతిరేకం ప్రకటించే వైఎస్సార్ కన్నా రైతుబంధువు ఎవరుంటారు? పదమూడేళ్ల క్రితం ఆ సెప్టెంబర్ 2న కూడా అదే రోజు. మేఘాలు పట్టాయి. రాజన్న ప్రజాబాట పట్టారు. రచ్చబండలో ప్రజాసమస్యలను నేరుగా తెలుసుకోవాలని బయలు దేరారు. వర్షం మొదలయిందో.. ముందే దుశ్శకునం పలికిందో ఆకాశం భోరుమంది. వైఎస్సార్ పయనిస్తున్న హెలికాప్టర్ పావురాలగుట్టలో కూలింది. అంతా అన్వేషణ. రాజన్న తిరిగొస్తాడన్న ఆశ. ఆయన రాలేదు. తిరిగిరాని లోకాలకు మరలిపోయిన రాజన్న ఇక లేడన్న చేదునిజం భరించడానికి వేలాది గుండెలకు సాధ్యం కాలేదు. ఆ దుఃఖసాగరంలోనే మునిగిపోయిన జీవితాలెన్నో... గుండెలాగిపోయిన బతుకులెన్నో.. కాలం ఆగిపోలేదు. కదలిపోతూనే వుంది. పదమూడేళ్లపోయినా రాజన్న స్మృతులు చెరిగిపోలేదు. ఎక్కడ సంక్షేమ ఫలాలు అందుతున్నా. ఎక్కడ అభివృద్ది జాడలు కనిపించినా...ప్రాజెక్టులు కనిపించినా రాజన్న పేరే తలపుకొస్తుంది. తన ముందు తన తర్వాత కూడా ఏ నాయకుడూ తలపెట్టలేనని పథకాలను ప్రవేశపెట్టిన ఆ ఘన చరిత్ర చరిత్ర పుటల్లో చెరగని ముద్ర. రాష్ట్ర రాజకీయ చరిత్రలో వైయస్ రాజశేఖరరెడ్డిది బలమైన ముద్ర. ఆయన జీవితం ప్రజలతో ముడిపడిపోయింది. అది విడదీయలేని బంధం. అంతే కాదు, వైఎస్సార్ హయాంలో ప్రతి పేదకుటుంబానికి జరిగిన మేలెంతో ఉంది. అటు విద్యారంగంలోనూ, ఇటు వైద్యరంగంలోనూ, వ్యవసాయరంగంలోనూ వైయస్సార్ ప్రజలకు చేసిన మేలెంతో! హిమగిరి ఎవరెస్టే అందుకు ప్రామాణికం. ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నది ముఖ్యం అన్నది.. వైఎస్సార్ జీవనసిద్దాంతం. అందుకు అనుగుణంగానే ఆయన జీవించారు. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారు. సువిశాల ఆంధ్రప్రదేశ్ ప్రగతిని కలవరించి, పలవరించారు. రాష్ర్టరూపురేఖలను తీర్చిదిద్దే క్రమంలో నిరంతరం శ్రమించారు. హరితాంధ్రప్రదేశ్‌ను స్వప్నించారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్‌కోసం అద్భుతాలు చేశారు. ఆదర్శాంధ్రప్రదేశ్ సాధనలో విప్లవాత్మకమార్పులకు శ్రీకారం చుట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఓ దార్శనికుడు. పేదబిడ్డల పెద్దచదువులకు పేదరికం అడ్డు కాకూడదని వైయస్..తన పాదయాత్ర దారిలోనే సంకల్పించారు. చదువులు చదివితే..ఉద్యోగాల్లో స్థిరపడితే, ఆ పేదింట తలరాతే మారిపోతుందన్నది ఆయన దార్శనికత. ఆలోచనను అద్భుతరూపంలో తీర్చిదిద్దారు. ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా పేదింటబిడ్డల పెద్దచదువులకు దీపం వెలిగించారు. వైయస్సార్ హయాంలో లక్షలాది మంది పేదింటబిడ్డలు ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు. తమ తలరాతలే మార్చుకోవడమే కాదు, కుటుంబాల తలరాతలు మార్చారు. ఆ పథకం లబ్దిపొందిన కుటుంబాల్లో నేటికీ వైయస్సార్‌ను తలచుకోనిదే పొద్దుగడవదు. ఆ మహానుభావుడి చలవే ఇదంతా.. అన్నది లబ్దదారుల గడపల్లో ఓంకారమైన ధ్వనిస్తుంటుంది. నిరుపేదల సంజీవని రాజీవ్ ఆరోగ్యశ్రీ. అనారోగ్యం ఎవరికైనా ఒకే విధమైన బాధ కలిగిస్తుంది. కానీ పేదవాడికి అది పెనుశాపమై పీడిస్తుంది. వైయస్‌కు ముందు పేదల అనారోగ్యబాధల గురించి పెద్దగా ఆలోచించిన నాయకులు లేరు. బీద,బిక్కి, అనారోగ్యం పాలైతే ఆదుకునే నాథుడే కరువయ్యారు. ఒక డాక్టర్‌గా రోగి బాధ తెలిసిన డాక్టర్ రాజశేఖరరెడ్డి, పేదలకు ఆరోగ్యభద్రతపై శ్రద్దపెట్టారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట బీదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. ఈ పథకం ద్వారా నిరుపేదలకు ధనవంతులతో సమానంగా కార్పొరేటు స్థాయి ఆస్పత్రులలో ఉచితంగా వైద్యసౌకర్యాలు అందగలిగాయి. ఆ పథకం ద్వారా నాడు.. నేడు లబ్దిపొందిన.. పొందుతున్నవారు లక్షలాదిమంది. లక్షలాది కుటుంబాలకు అది పెద్ద భరోసా. ఆపదలో ఆపన్నహస్తంలా 108 అత్యవసర అంబులెన్స్ సేవలు, నడిచే వైద్యశాలగా 104 మొబైల్ ఆస్పత్రులు అందుబాటులోకి తెచ్చారు. విద్య, వైద్య రంగాల్లో వైఎస్సార్ విప్లవాత్మక పథకాలు అనితరసాధ్యమైనవి. అసలు సిసలు ప్రజానాయకుడి మాత్రమే వచ్చే ఆలోచనలవి. ఇలా ప్రజాజీవితాల్లో.. మరీ ముఖ్యంగా పేదల జీవితాల్లో వెలుగులు నింపే పథకాలెన్నో వైఎస్సార్ హయాంలో పురుడు పోసుకున్నవే. ప్రజాసంక్షేమమే శ్వాసగా జీవించినవాడు వైఎస్సార్.. ఆయన రాజకీయాల్లో వేసిన ప్రతి అడుగూ.. ఆ దిశగానే సాగాయి. ముఖ్యమంత్రిగా ఆయన తెచ్చిన సంక్షేమపథకాలు, చేసిన అభివృద్ది పనులు గుర్తు చేసుకుంటే.. ఇదంతా మరొకరి వల్ల సాధ్యమయ్యేదేనా? అనిపించకపోదు. ప్రజాసేవలో అనుక్షణం తపించిపోయిన వైయస్సార్ సంకల్పబలం ఆయనకు మాత్రమే స్వంతమైనది. ఎన్నెన్ని పథకాలు.. ఊరువాడా, పట్టణాల తలరాతలు మార్చేశాయో! రాజశేఖరుడు జననేత. వారికేం కావాలో ఆయనకు తెలుసు. ప్రజల సమస్యలు ఎలా తీర్చాలో ఆయనకు తెలుసు. అందుకే, అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిపై దృష్టి సారించారు. ప్రజాసంక్షేమమే శ్వాసగా పరిపాలన సాగించారు. అరకొరగా పథకాలను అమలు చేయడం కాకుండా.. సంతృప్తస్థాయిలో అందరికీ అన్నీ ఇవ్వాలనే సంకల్పంతో ఆయన ముందుకు సాగారు. ముఖ్యమంత్రిగా ఆయన తొలిసంతకం ఉచితవిద్యుత్తు, విద్యుత్ బకాయిల మాఫీపై సంతకం చేశారు. ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందు తొమ్మిదేళ్ల కరవు నేర్పిన పాఠాలను గుర్తుపెట్టుకున్నారు. ఆ పాఠాలతోనే జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీళ్లను ఒడిసి పట్టి రిజర్వాయర్లలో నిలిపితే, కరవు సమయంలో రైతన్నలను ఆదుకోవచ్చనే ఉద్దేశంతో, వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో 81 ప్రాజెక్టులను నిర్మించి, కోటి ఎకరాలకు నీరందంచాలన్నదే ఈ అపరభగీరధుడి లక్ష్యం. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలకు ఆయన ఇచ్చిన వరం పావలా వడ్డీ. మొదట స్వయం సహాయక సంఘాల మహిళలకే ఈ పధకాన్ని ఇచ్చినా, ఆ తర్వాత రైతులతో పాటు వివిధ వర్గాలకు కేటాయించారు. ప్రతి మహిళను లక్షాధికారిని చేస్తానన్నది రాజన్న లక్ష్యం. మహిళల ఆర్ధికస్వావలంబనే కుటుంబాల వెలుగు అన్నది ఆయన ఆలోచన. అలాగే ఏ ఆసరాలేని వృద్దులు, వితంతువులు, వికలాంగులు..ఇలా దాదాపు 70లక్షల మందకి ఫించను పథకాన్ని విస్తరించడమే కాదు, నెలనెలా అందేలా చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ ,మహిళలకు అభయహస్తం. నిరుపేదలకు రూ.2కే కిలోబియ్యం ఇలా ఎన్నెన్నో పథకాలు విజయవంతంగా అమలు చేసిన వైయస్సార్‌ను ఒకే ఒక్కడు అనక తప్పదు. కలలు అందరూ కంటారు. కానీ అవి సాకారం అయ్యేలా శ్రమించడం కొందరే చేస్తారు. ముఖ్యమంత్రిగా వైయస్సార్ ఐదేళ్ల పాలనా కాలం పాలకులకుల ఆదర్శప్రాయం. రాజశేఖరరెడ్డికి ప్రజల మనసు తెలుసు. ప్రజలకు ఏం కావాలో తెలుసు. అభివృద్ది ఎంత అవసరమో తెలుసు. దానికోసం ఏ స్థాయిలో కృషి చేయాలో తెలుసు. సమర్ధపాలనకు వైయస్సార్ కేరాఫ్ అడ్రస్. రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షనేతగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దేశస్థాయిలో గుర్తింపు పొందారు. ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా ప్రభుత్వాన్ని మెడలు వంచి పని చేయించాలో చాటి చెప్పిన రాజకీయ నాయకులలో వైయస్ చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రతిపక్షనేతగా వైయస్ ప్రజల హృదయాల్లో నాటుకొనిపోయారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. వైఎస్సార్ జనహృదయనేత.. జనహృదయాలను గెలిచిన నేతలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు అనేందుకు వైఎస్సార్ ఓ ఉదాహరణ. ఆయన ఓ లెజెండ్ ఆఫ్ పాలిటిక్స్. ముఖ్యమంత్రిగా ఉన్నా...ప్రతిపక్షంలో ఉన్నా ఆయనది ఒకే తీరు. ప్రజాసమస్యల పరిష్కారమే ఆయన ప్రధాన ఎజెండా. అనాథలను, అభాగ్యులను ఆదరిస్తూ...అభివృద్ది ఫలాలకు నోచుకోని మట్టిబిడ్డల అభివృద్దే లక్ష్యంగా పనిచేసిన జనహృదయనేత వైయస్సార్. మిన్ను విరిగి మీద పడ్డా భయపడని ధృఢమైన వ్యక్తిత్వం వైఎస్ రాజశేఖరరెడ్డిది. నమ్మినవారికి ప్రాణాలు అడ్డువేసే ఆయన వ్యక్తిత్వమే కార్యకర్తల్లో, నాయకుల్లో ఆయనకంటూ ఒక ఇమేజ్ తెచ్చింది. అత్యంత జనాకర్షణ ఉన్న నేతగాపేరు సంపాదించిపెట్టింది. పేదలు, రైతులు, చేను, చెట్టు, మట్టి, గ్రామీణం, వ్యవసాయం ఇవి వైయస్‌కు ఇష్టమైన పదాలు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ విద్యార్తులకు పెద్ద చదువులు, ఆరోగ్యశ్రీతో కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందచేసిన నిజమైన విద్యాధికుడు, డాక్టర్ వైయస్సార్. రెండురూపాయల బియ్యం, వృద్దులకు, వికలాంగులకు నెలనెలా పెన్షన్లు, అర్హులందరికీ తెల్లకార్డులు, బడుగు, బలహీనవర్గాలకు ఇచ్చిన అండదండలు, అన్నింటికీ మించి ప్రజల పట్ల, ప్రజాసేవ పట్ల ఆయనకున్న చిత్తశుద్ది, నిబద్దత తిరిగి రెండోసారి అధికారాన్ని తెచ్చిపెట్టాయి. విలువలు, విశ్వసనీయతలే ప్రాణంగా... రైతులు, సేద్యం, పేదలు, అభివృద్ది ప్రాతిపదికగా సాగిన వైఎస్ పాలనకు వరుణుడు మనసారా సహకరించారు. ఐదేళ్లు రాష్ట్రం సుభిక్షంగా ఉంది. మనుషుల్ని ప్రేమించడమెలాగో వైఎస్‌కి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు. అది ఆయనకు సహజంగా అబ్బిన గుణం. మాటంటే మాటే. పోరాటమంటే పోరాటమే. అంతే....ధైర్యం, సాహసం, పట్టుదల, రిస్క్ తీసుకోవడం, ఆలోచనలతో తాత్సారం చేయకపోవడం.. ఎప్పుడూ ఉల్లాసంగా ఉండడం, జనాన్నినమ్మడం లాంటి ప్రతేక లక్షణాలకు పెట్టింది పేరు.. వైఎస్సార్. నేను ఏ నాటికైనా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగలను. ఆ విశ్వాసం నాకుంది అని.. రాజకీయాల్లో అడుగుపెట్టిన మొదటి రోజుల్లోనే వైఎస్సార్ ఎక్కువగా అంటూ వుండేవారట. ఏనాటికైనా ముఖ్యమంత్రి కావాలని స్వప్నించిన వైఎస్.. అందుకనుగుణంగా ప్రణాళికలు ఏర్పరచుకోవడం మొదలెట్టారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉండటం అలవరచుకున్నారు. ఊరికే కలవడం కాదు, వారి కష్టసుఖాలు తెలుసుకోవడం, తనకు వీలయినంత సాయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ప్రజాసమస్యలపై నిజాయితీగా పోరాడాలన్న సిద్దాంతం వైయస్సార్‌ది. ఆ విషయంలో రాజశేఖరుడి చిత్తశుద్దిని శంకించలేనిది. మండుటెండాకాలంలో నాటి వైయస్సార్ పాదయాత్ర ఆయన్న జనహృదయాలకు మరింత దగ్గర చేసింది. అది కరువు కాలం. రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోయాయి. ఆత్మహత్యల స్థాయి దాటి ఆకలిచావులు ముంచుకొచ్చాయి. గ్రామీణులు, రైతులు, రైతు కూలీలు, చేతివృత్తులవారు, నిరుపేదలు, నిరుద్యోగులు, చిన్నచిన్న వ్యాపారులు..ఇలా అన్ని వర్గాలు, రకరకాల పీడలు, పీడనల్లో నలిగిపోయాయి. సంప్రదాయ గ్రామీణ ఆర్ధికవ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. మొత్తానికి పల్లెలు కన్నీరు పెడుతున్న వేళ వైయస్సార్ పాదయాత్రికుడయ్యారు. 1400కిలోమీటర్లకు పైగా నడిచారు. ఆ కష్ణకాలంలో ప్రజలకు నేనున్నానన్న భరోసానిచ్చారు. అధికారంలోకి రాగానే ప్రజాసంక్షేమమే పరమావధిగా పనిచేస్తానని శపథం చేశారు. వైయస్సార్‌ను జనం నమ్మారు. ఆయన్ను, ఆయన పార్టీని 2004లో అఖండ మెజారిటీతో గెలిపించారు. 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా వైయస్ఆర్ ప్రజలకు చేయని మేలంటూ లేదు. 2009 ఎన్నికల్లోనూ వైఎస్సార్ వెంటే నిలిచారు జనం. అన్ని రాజకీయపార్టీలు ఒక్కటైనా, ఒకే ఒక్కడుగా వైఎస్సార్ తన పార్టీని గెలిపించారు. రెండోసారి వైయస్సార్ ముఖ్యమంత్రి కావడం ఓ చారిత్రాత్మక ఘట్టం. ఆ తర్వాత వందరోజుల పాటే ఆయన పాలన సాగింది. విశాలాంధ్రప్రదేశ్ అదృష్టం అక్కడితో ఆగింది. వైఎస్సార్‌లాంటి ప్రజలమనిషి, ఆత్మీయమూర్తి అరుదుగా ఉంటారు. నూటికో..కోటికో ఒక్కరు అంటారే, అలాగన్నమాట. వ్యవస్థ ఏదైనా కావచ్చు. పాలకుడి విధానాల్లో స్పష్టత, ఆచరణలో చిత్తశుద్ది ఉంటే ప్రజల జీవన స్థితి ఎలా మెరుగుపడుతుందో అన్నదానికి, డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పరిపాలన ఓ ఉదాహరణ. ఆయన దూరదృష్టి, దార్శనికత భవిష్యత్తుకు మార్గదర్శి. ఆయన మహానాయకుడు. మరిచిపోలేని మన రాజన్న చిరస్మరణీయుడు. -
ఇడుపులపాయ: మహానేత వైఎస్సార్‌కు సీఎం జగన్ నివాళి (ఫొటోలు)
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, జంగా కృష్ణమూర్తి, ఎంపీ నందిగం సురేష్, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, పలు కార్పోరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు. చదవండి: మార్గనిర్దేశకుడు వైఎస్సార్.. ఆ మూడు పథకాలు సజీవ సాక్ష్యాలుగా.. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పాలకుడు ఎలా ఉండాలో చూపిన నాయకుడు వైఎస్సార్ అని, తండ్రి స్ఫూర్తితో సీఎం జగన్ ముందుకెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన నడుస్తోందన్నారు. పేదల జీవితాల్లో సీఎం జగన్ వెలుగులు తెచ్చారన్నారు. సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకే అందిస్తున్నామన్నారు. కాగా, మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా తన తండ్రిని తలుచుకుంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘‘నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. -
మహానేత వైఎస్సార్‌కు సీఎం జగన్ ఘన నివాళి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లాలో రెండోరోజు పర్యటిస్తున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించారు. సీఎంతో పాటు ఆయన కుటుంబసభ్యులు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల వైఎస్సార్‌కు నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. చదవండి: ‘ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తి’.. సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్సార్‌కు నివాళి అనంతరం పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. విడతల వారీగా సాయంత్రం వరకు పులివెందుల నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాల పై స్థానిక నాయకులు, అధికారులతో సీఎం సమీక్ష జరుపుతున్నారు. -
‘ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తి’.. సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్
సాక్షి, అమరావతి: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా తన తండ్రిని తలుచుకుంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘‘నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. చదవండి: స్ఫూర్తి సముదాయం.. ఒకేచోట అన్ని భవనాలు నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. — YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2022 -
మార్గనిర్దేశకుడు వైఎస్సార్.. ఆ మూడు పథకాలు సజీవ సాక్ష్యాలుగా..
దేశంలోని అనేక రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయడానికి కారణం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనే. దానిని 2004, మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆయన ప్రారంభించారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయడానికి కారణం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనే. దానిని 2004, మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆయన ప్రారంభించారు. దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నత విద్యను పేదలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు అమలుచేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తొలుత శ్రీకారం చుట్టిందీ వైఎస్సే. పాలకులకు వైఎస్ రాజశేఖరరెడ్డి టార్చ్‌బేరర్‌గా నిలిచారనడానికి ఈ మూడు పథకాలు సజీవ సాక్ష్యాలు. ఆ మహానేత భౌతికంగా దూరమై నేటికి సరిగ్గా 13 ఏళ్లు. సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా వైఎస్ రాజశేఖరరెడ్డి పనిచేసింది కేవలం ఐదేళ్ల మూడు నెలలే. కానీ, ఆ కొద్దికాలంలోనే తెలుగునేల ఆయన్ను కలకాలం గుర్తుంచుకునేలా సుపరిపాలన అందించారు. పాలనకు మానవత్వాన్ని జోడించి పాలకుడంటే ఇలా ఉండాలి అని దేశానికి చాటిచెప్పారు. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 1949, జూలై 8న జన్మించిన వైఎస్.. వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రిని ఏర్పాటుచేసి.. రూపాయికే వైద్యంచేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల ప్రశంసలు అందుకున్నారు. ప్రజాభ్యుదయమే పరమావధిగా.. డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైఎస్ రాజశేఖరరెడ్డి పులివెందుల నియోజకవర్గం నుంచి 1978లో రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటినుంచి తుదిశ్వాస విడిచే వరకూ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాభ్యుదయమే పరమావధిగా రాజీలేని పోరాటం చేశారు. దాంతో పులివెందుల నుంచి 1978, 1983, 1985.. కడప లోక్‌సభ స్థానం నుంచి 1989, 1991, 1996, 1998.. ఆ తర్వాత పులివెందుల నుంచి 1999, 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రజలు ఆయన్ను అజేయుడిగా నిలిపారు. పాలకులకు మార్గనిర్దేశకుడిగా.. వరుస ఓటములతో ఉమ్మడి ఏపీలో జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్‌ను వైఎస్ మండుటెండలో 1,475 కి.మీల పొడవున పాదయాత్ర చేసి ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను అర్థంచేసుకుని, నేనున్నానని భరోసా ఇచ్చిన ఆయన 2004, మే 14న సీఎంగా తొలిసారి ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఆ తర్వాత ఆయన ప్రజలను ఓటర్లుగా కాకుండా కుటుంబ సభ్యులుగా భావించారు. విద్య, వైద్యం కోసం ప్రజలు అప్పులపాలవుతుండటాన్ని పసిగట్టి.. వాటిని ఉచితంగా అందించేందుకు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టారు. చదవండి: మరో రూపంలో మహానేత అలాగే, ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించడానికి 108 సర్వీసును ప్రారంభించి లక్షలాది మందికి ప్రాణంపోశారు. ఇక అత్యంత ప్రజాదరణ పొందిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 సర్వీసులను అనేక రాష్ట్రాలు అమలుచేస్తుండటం ఆయన దార్శనికతకు నిదర్శనం. ఇక ఐదేళ్లలో సంక్షేమాభివృద్ధి పథకాలతో జనరంజక పాలన అందించిన వైఎస్.. గెలుపోటములకు తనదే బాధ్యత అని 2009 ఎన్నికల్లో ప్రకటించారు. ప్రతిపక్షాలు మహాకూటమి కట్టినా 2009 ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ ఒంటిచేత్తో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి, 2009, మే 20న రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారంచేశారు. రూ.లక్ష కోట్లతో జలయజ్ఞం.. కడలి పాలవుతున్న నదీ జలాలను ప్రాజెక్టుల ద్వారా మళ్లించి, తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. రూ.లక్ష కోట్ల వ్యయంతో కోటి ఎకరాలకు నీళ్లందించేలా ఒకేసారి 84 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నమైన పోలవరాన్ని పట్టాలెక్కించారు. 2009 నాటికే 16 ప్రాజెక్టులను పూర్తిగా.. 25 ప్రాజెక్టులను పాక్షికంగా వెరసి 41 ప్రాజెక్టుల ద్వారా 19.53 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 3.96 లక్షల ఎకరాలను స్థిరీకరించారు. ఐదేళ్లలో 23.49 లక్షల ఎకరాలకు నీళ్లందించే ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా దేశ సాగునీటి రంగంలో రికార్డును నెలకొల్పారు. దార్శనికతకు తార్కాణాలెన్నే.. ప్రపంచవ్యాప్తంగా 2007–08, 2008–09లో ఆర్థిక మాంద్యం అనేక దేశాలను అతలాకుతలం చేసింది. ఆ ప్రభావం భారత్‌పై కూడా పడింది. కానీ.. అది రాష్ట్రంపై పడకుండా వైఎస్ చేయగలిగారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదల ఇళ్ల నిర్మాణం, రహదారుల పనులు వంటి అభివృద్ధి పనులు చేపట్టి.. మార్కెట్లోకి ధనప్రవాహం కొనసాగేలా చేసి.. వాటి ద్వారా రాష్ట్రానికి పన్నులు వచ్చేలా చేసి.. మాంద్యం ముప్పు నుంచి రాష్ట్రాన్ని వైఎస్ కాపాడారని అప్పట్లో ఆర్థిక నిపుణులు ప్రశంసించారు. ఇక ఐటీకి వెన్నుదన్నుగా నిలిచి ఎగుమతులను రెట్టింపయ్యేలా చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శరవేగంగా పూర్తిచేసి హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపారు. పండగలా వ్యవసాయం.. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వైఎస్‌కు రైతుల కష్టనష్టాలు బాగా తెలుసు. అందుకే పంట పండినా.. ఎండినా రైతు నష్టపోకుండా.. వ్యవసాయాన్ని పండగలా మార్చేలా పలు కీలక నిర్ణయాలు అమలుచేశారు. ♦పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు. ♦పంటలులేక విద్యుత్ చార్జీలు కట్టలేని రైతులపై టీడీపీ సర్కార్ రాక్షసంగా బనాయించిన కేసులను ఒక్క సంతకంతో ఎత్తేశారు. ♦రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. దాదాపు 35 లక్షల పంపు సెట్లకుపైగా ఉచిత విద్యుత్‌ను అందించారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ.. ఆ తర్వాత ఏడాదికి రూ.6 వేల కోట్లకు చేరినా వెనక్కు తగ్గలేదు. ♦వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని ఎగతాళి చేసిన నేతలు కూడా అధికారంలోకి వచ్చాక.. ఆ పథకాన్ని కొనసాగించాల్సిన ♦పరిస్థితిని వైఎస్ కల్పించారు. వైఎస్ స్ఫూర్తితో దేశంలో పలు రాష్ట్రాలు సాగుకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయి. ♦ఇక పావలా వడ్డీకే రైతులకు రుణాలందించి.. పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితిని తప్పించారు. ♦నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందించారు. పంట పండినా.. ఎండినా రైతు నష్టపోకూడదనే లక్ష్యంతో పంటల బీమాను అమలుచేశారు. ఇన్çపుట్ సబ్సిడీని అందించారు. ♦పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఢిల్లీతో పోరాడారు. 2004 నుంచి 2009 మధ్య ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.550 నుంచి రూ.1,000 వరకూ పెరగడమే అందుకు నిదర్శనం. -
CM Jagan YSR Kadapa Tour: 1 నుంచి వైఎస్సార్ జిల్లాలో సీఎం పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైంది. తన పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 1 మధ్యాహ్నం 2 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 2.20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి 2.30 గంటలకు కడపకు విమానంలో బయలుదేరివెళ్తారు. కడప విమానాశ్రయం నుంచి 3.30 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 3.50 గంటలకు వేముల మండలం వేల్పులకు చేరుకుంటారు. అక్కడ 3.50 నుంచి 4.05 గంటల వరకు స్థానిక నాయకులతో మాట్లాడతారు. 4.10 గంటల నుంచి 5.10 గంటల మధ్య వేల్పుల గ్రామ సచివాలయం కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం 5.15 గంటలకు వేల్పుల నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 5.35 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఎస్టేట్ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస చేస్తారు. 2న సీఎం షెడ్యూల్.. సెప్టెంబర్ 2న ఉదయం 8.50 గంటలకు సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయ గెస్ట్‌హౌస్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరుతారు. 9 గంటల నుంచి 9.40 గంటల వరకు ఎస్టేట్‌లోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 9.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఎస్టేట్‌లోని ప్రేయర్ హాల్లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై సాయంత్రం 5 గంటల వరకు సమీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత 5.10 గంటలకు వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు. 3న షెడ్యూల్ ఇదీ.. సెప్టెంబర్ 3న ఉదయం 8.50 గంటలకు సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి కడప చేరుకుంటారు. అక్కడ నుంచి 9.20 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి వస్తారు. అక్కడ నుంచి ఉదయం 10.40 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. -
హైదరాబాద్‌లో మహానేత వైఎస్సార్ సంస్మరణ సభ
-
వాడవాడలా వైఎస్సార్‌కు నివాళులు
సాక్షి నెట్వర్క్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతిని గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. నగరాలు, పట్టణాలు, పంచాయతీల్లో వాడవాడలా వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అన్నదానాలు, వస్త్రదానాలు చేశారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. గుంటూరు జిలాలో జరిగి కార్యక్రమాల్లో మంత్రులు సుచరిత, శ్రీరంగనాథరాజు, ప్రభుత్వవిప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎంపీలు మోపిదేవి, శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి రక్తదానం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ప్రతాప్ కుమార్‌రెడ్డి, సంజీవయ్య, వరప్రసాద్‌రావు, నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహాలకు క్షీరాభిషేకం కర్నూలు జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు క్షీరాభిషేకం చేసి, రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. మంత్రి జయరాం, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, బాలనాగిరెడ్డి, కర్నూలు మేయర్ రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు వెలంపల్లి, కొడాలి నాని, ఎమ్మెల్సీ కరిమున్నీసా, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, ఉదయభాను, జగన్మో హనరావు, మేకా ప్రతాప్ అప్పారావు, కృష్ణప్రసాద్, రక్షణనిధి, సింహాద్రి రమేష్‌బాబు, జోగి రమేష్, దూలం నాగేశ్వరరావు, అనిల్‌కుమార్, పార్థసారథి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ మణిమ్మ, వైఎస్సార్సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు భవకుమార్, విజయవాడ ఈస్ట్ ఇన్చార్జి అవినాష్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీలు రెడ్డెప్ప, గురుమూర్తి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు అభినయ్‌రెడ్డి, నారాయణ, పార్టీ నగర అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. ‘అనంత’ స్మరణ అనంతపురం జిల్లా ప్రజలు వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు. మంత్రి జయరాం, ఎంపీ రంగయ్య, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, తిప్పేస్వామి, ఉషశ్రీచరణ్, పీవీ సిద్ధారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పద్మావతి, ప్రకాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు నదీమ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా లొల్లలో వైఎస్సార్ విగ్రహానికి ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రైతులు క్షీరాభిషేకం చేశారు. పంట పొలాల మధ్య 250 మంది రైతులను సత్కరించారు. రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రక్తదానం చేశారు. జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి íవిశ్వరూప్, ఎంపీలు గీత, భరత్‌రామ్, ఎమ్మెల్యే చంటిబాబు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వైఎస్సార్‌తో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వెస్లీ విగ్రహానికి పూలమాలలు వేశారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం కృష్ణదాస్, స్పీకర్ సీతారాం తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే లు వీరభద్రస్వామి, జోగారావు, వెంకట చిన అప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు, అప్పలనర్సయ్య, రాజన్నదొర, వైఎస్సార్ సీపీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ట్రైసైకిళ్ల పంపిణీ డాక్టర్ వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పేదలకు దుప్పట్లు, వికలాంగులకు ట్రైసైకిళ్లు, ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు, బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. దుగ్గిరాలలో ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఆధ్వర్యంలో డాక్టర్ అంబేడ్కర్, డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లాలో సేవా కార్యక్రమాలు జరిగాయి. విశాఖలోని వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలోను, బీచ్రోడ్డులోను వైఎస్సార్ విగ్రహాలకు ఎంపీ విజయసాయిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనందపురం మండలం కల్లివానిపాలెంలో వైఎస్సార్ విగ్రహాన్ని మంత్రి ముత్తంశెట్టి ఆవిష్కరించారు. భీమిలిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహిం చి, అన్నదానం చేశారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ మధురెడ్డి రక్తదానం చేశారు. జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్‌యాదవ్, జకియాఖానం, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రఘురామిరెడ్డి, మల్లికార్జునరెడ్డి, ప్రభుత్వ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే అమర్నా థ్‌రెడ్డి, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ దేవనాథరెడ్డి, మున్సి పల్ చైర్మన్ ఫయాజ్‌బాషా, నేతలు వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, మేడా రఘునాథరెడ్డి, మేడా భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఘాట్ వద్ద.. చెమర్చిన కళ్లతో
సాక్షి, కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కుటుంబ సభ్యులు ఘన నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముందురోజే ఇడుపులపాయ చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం 9.10 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలసి వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సీఎం సతీమణి వైఎస్ భారతి, సోదరి షర్మిల, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ తదితరులు ఘాట్ వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా సమాధి ప్రాంగణం వద్ద కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో వైఎస్సార్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సీఎం జగన్, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి, సోదరి షర్మిల, పెద్దమ్మ వైఎస్ భారతమ్మలు ఒకింత భావోద్వేగానికి గురై చెమర్చిన కళ్లతో కనిపించారు. అక్కడికి సమీపంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి సీఎంతోపాటు కుటుంబ సభ్యులంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని కుటుంబ సభ్యులతో కొద్దిసేపు గడిపారు. అల్పాహారం అనంతరం నేరుగా హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ తనను కలిసేందుకు నిరీక్షిస్తున్న వారిని పలకరించారు. ఒక్కొక్కరితో మాట్లాడుతూ సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉదయం 10.15 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ఆయన 11.10 గంటల వరకు వినతులు స్వీకరిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 11.30 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్లారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న దివంగత సీఎం వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి, సోదరి షర్మిల, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు కార్యకర్త ‘సల్మా’కు ఫోన్లో పరామర్శ అనారోగ్యంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వేంపల్లెకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త సల్మాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఫోన్లో పరామర్శించారు. పార్టీ కార్యకర్త భారతి ద్వారా సల్మా అనారోగ్యం గురించి తెలుసుకున్న సీఎం జగన్ వెంటనే వీడియో కాల్ ద్వారా ఆమెతో మాట్లాడారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పార్టీ నేత అనిల్ కుమార్తెకు నామకరణం చేసిన సీఎం లింగాల: వైఎస్సార్ జిల్లా లింగాల మండలం పెద్దకుడాల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు పెద్దమల్లు అనిల్‌కుమార్‌రెడ్డి, పెద్దమల్లు అనూషల కుమార్తెకు ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా జగతి అని నామకరణం జరిగింది. అనిల్‌కుమార్‌రెడ్డి దంపతులు ఇడుపులపాయలో ముఖ్యమంత్రిని కలిశారు. పలువురు నివాళులు.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు నివాళులర్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సోదరుడు వైఎస్ సుధీకర్‌రెడ్డి, డిప్యూటీ సీఎంలు ఎస్బీ అంజాద్‌బాషా, నారాయణస్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, గురుమూర్తి, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, జకియాఖానమ్, కత్తి నరసింహారెడ్డి, కల్పలత, గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఆర్టీïసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, పరిశ్రమలశాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, డీఐజీ వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వైఎస్సార్ సీపీ కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు కె.సురేష్‌బాబు, ఆకేపాటి అమర్నాథరెడ్డి, చక్రాయపేట ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డి, వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి తదితరులు వైఎస్సార్‌కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. -
ఏపీలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు ఫోటోలు
-
పీపుల్స్ సీఎం
-
వైఎస్ఆర్ అన్నింటికీ అతీతంగా అందరినీ అక్కున చేర్చుకున్నారు : వైఎస్ విజయమ్మ
-
పలు జిల్లాల్లో వైఎస్ఆర్ 12 వ వర్ధంతి కార్యక్రమాలు
-
మహానేత వైఎస్సార్‌కు మెగాస్టార్ నివాళులు
Chiranjeevi Tribute To YS Rajasekhara Reddy: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయకు సోషల్ మీడియా వేదికగా నివాళుల్పరించారు. 'దివంగత ముఖ్యమంత్రి, ప్రియతమ ప్రజా నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్బంగా ఆయన్ని సంస్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను' అని ట్వీట్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి , ప్రియతమ ప్రజా నాయకుడు శ్రీ వై ఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్బంగా ఆయన్ని సంస్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ .. — Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2021 చదవండి మహానేత వైఎస్సార్‌కు సీఎం వైఎస్ జగన్ నివాళి -
ఢిల్లీలోని ఏపీ భవన్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం
సాక్షి, న్యూఢిల్లీ: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆల్ ఇండియా బిసి అసోసియేషన్ అధ్యక్షుడు పోతల ప్రసాద్, ఓబిసి సెంట్రల్ కమిటీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి, ఢిల్లీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు తదితరులు వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ మరణించినా ఆరోగ్య శ్రీ ద్వారా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే ఉంటారని వారు స్మరించుకున్నారు. చదవండి: మహానేత వైఎస్సార్‌కు గవర్నర్ విశ్వభూషణ్ నివాళి -
‘వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి’
సాక్షి, చిత్తూరు: పేద ప్రజల గుండె చప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనియాడారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి పెద్దిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని గుర్తుచేశారు. అన్ని వర్గాలకు మేలు చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. వైఎస్సార్ చూపిన బాటలో సీఎం వైఎస్ జగన్ నడుస్తున్నారని పెద్దిరెడ్డి తెలిపారు. సాక్షి, పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లాలోని దుగ్గిరాల గ్రామంలో అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహాలను మంత్రి ఆళ్ల నాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తర్వాత పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్న నాయకుడు సీఎం జగన్మోహన్రెడ్డి అని అన్నారు. కరోనాను కట్టడి చేస్తూ సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారమే సీఎం జగన్ పేదలకు సంక్షేమన్ని చేరువచేశారని కొనియాడారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి మనందరికీ దూరమై నేటికీ 12ఏళ్లు గడిచాయని, ఆయన ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పధకాలతో చెరగని ముద్ర వేశారని గుర్తుచేశారు. పేదలకు కుల, మత, పార్టీ, బేధం లేకుండా సంక్షేమ పాలన అందించారని కొనియాడారు. భావితరాల భవిష్యత్‌ను ఉద్దేశించి సీఎం జగన్ పాలన అందిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ అంబేద్కర్ ఆశయాల అనుగుణంగా పాలన సాగిస్తున్నారని తెలిపారు. మేనిఫెస్టోలో 90 శాతం పథకాలు అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కు దక్కుతుందని పేర్కొన్నారు. దెందులూరు నియోజకవర్గంలో రూ. 750 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, రూ.100కోట్లతో రూర్బన్ కింద 15కొల్లేరు గ్రామాల రూపురేఖలు మారబోతోన్నాయని తెలిపారు. రూ.240 కోట్లతో ఆర్అండ్బీ కింద పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ మోషేన్ రాజు మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగిస్తున్నారని అన్నారు. పేదల గుండె చప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలో.. బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారని చెప్పారు. అదేవిధంగా ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ.. దుగ్గిరాల గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహన్ని ప్రారంభించడం శుభపరిణామమని అన్నారు. సంక్షేమ పాలనలో సువర్ణ అధ్యాయం వైఎస్సార్ పాలన అని కొనియాడారు. -
మహానేత వైఎస్సార్ వర్ధంతి.. ఐదు వేల మందికి అన్నదానం..
విజయవాడ: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దివంగత నేతను స్మరించుకుంటూ.. పలు కార్యక్రమాలను నిర్వహించారు. విజయవాడలోని గొల్లపూడిలో వైఎస్సార్సీపీ నేతలు పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వసంత, సురేష్, ధూళిపాళ్ల శ్రీనాథ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: పేదల గుండె చప్పుడు మహానేత వైఎస్సార్ -
జనం గుండెల్లో రాజన్న
-
మహానేత వైఎస్సార్‌కు గవర్నర్ విశ్వభూషణ్ నివాళి
సాక్షి, అమరావతి: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నివాళులర్పించారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఆ మహానేత తన జీవితాన్ని ప్రజల సంక్షేమానికి అంకితం చేశారన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, 104 ఆరోగ్య సేవల నుంచి ఇతర రాష్ట్రాలు కూడా స్ఫూర్తి పొందాయని గవర్నర్ ట్వీట్ చేశారు. ఇవీ చదవండి: మీ స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది నాన్న: సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ వైఎస్సార్ ఆచరణలో నుంచి ఓ మహావృక్షం పెరిగింది: సజ్జల I pay my humble tributes to former Chief Minister Dr #YSRajasekharaReddy on his Vardanthi. His flagship schemes such as #arogyasri, 108 Ambulance and 104 Health services have been replicated in other States. #YSRVardhanthi pic.twitter.com/O6wivaXeKA — Biswa Bhusan Harichandan (@BiswabhusanHC) September 2, 2021 -
వైఎస్సార్ ఆచరణలో నుంచి ఓ మహావృక్షం పెరిగింది: సజ్జల
సాక్షి, అమరావతి: పాలకుడు ఎలా ఉండాలో చూపించిన వ్యక్తి మహానేత వైఎస్సార్ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ 12వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి సజ్జల రామకృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే పార్థసారథి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, జూపూడి ప్రభాకర్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తెలుగు అకాడెమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్ ఆచరణలో నుంచి ఓ మహావృక్షం పెరిగిందన్నారు. నాన్న వేసిన అడుగుకి పదడుగులు వైఎస్ జగన్ వేశారన్నారు. వైఎస్సార్ ఆశయాలకు శాశ్వత ముద్ర ఉండేలా వైఎస్ జగన్ పాలన చేస్తున్నారన్నారు. సీఎం జగన్‌ను బలోపేతం చేస్తూ ఆయన అడుగులో అడుగు వేద్దామని పిలుపునిచ్చారు. తండ్రి బాటలో సీఎం జగన్: లక్ష్మీపార్వతి పేద ప్రజల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారని తెలుగు, సంస్కృత భాషా అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. వైఎస్సార్ మరణించినా.. ఆయన జ్ఞాపకాలు నిలిచే ఉన్నాయన్నారు. తండ్రి బాటలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుస్తున్నారన్నారు. లోకేష్ అసమర్థుడని.. ఎప్పటికీ నాయకుడు కాలేడని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు. చదవండి: మీ స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది నాన్న: సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ గుండెనిండా ‘జగనన్న’ అభిమానం: కశ్మీర్ నుంచి యాత్ర -
పేదల గుండె చప్పుడు మహానేత వైఎస్సార్: మంత్రి వెల్లంపల్లి
-
భౌతికంగా మీరు దూరం అయిన జనం మనిషిగా ఇంకా బతికే ఉన్నారు
-
పాలకుడు ఎలా ఉండాలో చూపించిన వ్యక్తి డాక్టర్ వైఎస్ఆర్
-
పేద ప్రజల గుండెచప్పుడు తెలిసిన మహానేత వైఎస్ఆర్
-
పేదల గుండె చప్పుడు మహానేత వైఎస్సార్
సాక్షి, విజయవాడ: పేదల గుండెచప్పుడు మహానేత వైఎస్సార్ అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. అందరి హృదయాలు గెలిచిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా విజయవాడ పోలీస్ కంట్రోల్ రూం వద్ద వైఎస్సార్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, దేవినేని అవినాష్, కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు, దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు. ఆరేళ్లలోనే వైఎస్సార్ 60 ఏళ్ల ప్రగతి... రాజన్న పాలన ఒక స్వర్ణయుగం అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి వైఎస్సార్ బాటలు వేశారన్నారు. ఆరేళ్లలోనే వైఎస్సార్ 60 ఏళ్ల ప్రగతి చూపారన్నారు. పుట్టపర్తి వైఎస్సార్ సీపీ కార్యాలయంలో అనంతపురం జిల్లా: పుట్టపర్తి వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మహానేత వైఎస్సార్ 12 వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఓడిసి మండలం గౌనిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. మారాలలో అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే దుద్దు కుంట పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు మైదుకూరు రోడ్డు లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోరుమామిళ్లలోని వైఎస్సార్ విగ్రహానికి పార్టీ మండల కన్వీనర్ సీఎం భాష, జిల్లా అగ్రి గోల్డ్ బాధితుల బాసట కమిటీ అధ్యక్షుడు చిత్తా విజయ్ ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగార్జున రెడ్డి, పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులు అర్పించాయి. పశ్చిమగోదావరి జిల్లా: వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఏలూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఆయన విగ్రహానికి పూల మాలలువేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొఠారి అబ్బయ్య చౌదరి, పుప్పాల వాసుబాబు, ఎమ్మెల్సీ కోయ మోషన్ రాజు, మేయర్ షేక్ నూర్జహాన్ , ఇడా చైర్మన్ ఈశ్వరి ,స్మార్ట్ సిటీ చైర్మన్ బొద్దాని అఖిల, సాహిత్య అకాడమీ చైర్మన్ పి. శ్రీలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు,పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మహానేత వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మరణం లేని మహానేత డాక్టర్ వైఎస్సార్ అని, చరిత్రలో నిలిచిపోయేలా పేదలకు సంక్షేమాన్ని అందించారని ఎమ్మెల్యే కాకాణి అన్నారు. ప్రజానేతగా జన హృదయాల్లో నిలిచిపోయారన్నారు. అలాంటి విలువలు, విశ్వసనీయతతో కూడిన పాలనను ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్నారన్నారు. పేదల పెన్నిధిగా ఎదుగుతున్న సీఎం వైఎస్ జగన్‌కి మరో ఇరవై ఏళ్లు తిరుగులేదన్నారు. -
పేద ప్రజల పాలిట దేవుడు వైఎస్ఆర్
-
రాజన్న ప్రగతి బాట: ప్రతి ఇంటి ముంగిటా ఆ అభివృద్ధి వెలుగులే
ప్రతి ఇంటి ముంగిటా ఆ అభివృద్ధి వెలుగులే... ప్రతి పేద గుండెలో ఆ నిండైన రూపమే... బీడువారిన నేలతల్లికి జలసిరులందించిన భగీరథునిలా... లయతప్పిన పేద గుండెకు ఊపిరిలూదిన దైవంలా... చదువు ‘కొన’లేక పేదింటి అక్షరం చిన్నబోతే... వయసుడిగిన నాడు ఆసరాలేక వృద్ధాప్యం ఉసూరుమంటే... ఇంటికి పెద్ద కొడుకై ఆదుకున్న ఆపన్న హస్తంలా.. ఆ మహానేత వైఎస్సార్ నిలిచారు.. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆ చెరగని జ్ఞాపకాలతో, జిల్లాకు వైఎస్సార్ అందించిన అభివృద్ధి ఫలాలపై కథనం. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నిత్యం కరువు కాటకాలతో అల్లాడుతూ.. అభివృద్ధికి నోచుకోని ప్రకాశం జిల్లాపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధికి బాటలు వేశారు. జలయజ్ఞంతో ఇక్కడి దుర్భిక్ష పరిస్థితుల్ని పారదోలేందుకు నడుంకట్టారు. వైఎస్సార్ అధికారంలోకి రాగానే జిల్లాలో 2.60 లక్షల మంది రైతులు తీసుకున్న పంట రుణాలు రూ.480 కోట్లు రుణమాఫీ చేశారు. అందులో 2.17 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులు లాభపడ్డారు. 43,572 మంది రైతులకు వారు తీసుకున్న బ్యాంకు రుణాలు ఒకే మొత్తంలో పరిష్కరించుకునే విధానాన్ని అమలు చేశారు. దీంతో రైతులు రూ.97 కోట్ల మేర లబ్ధిపొందారు. కరువుతో అల్లాడిన రైతులు 1,23,147 మందికి ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున రూ.62 కోట్లు రిలీఫ్ స్కీం కింద అందించారు. ఐదేళ్లలో ప్రాజెక్టులకు భారీగా నిధులు ►వైఎస్సార్ జిల్లాలో ప్రాజెక్టులకు భారీగా నిధులిచ్చారు. 24.37 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేలా చర్యలు చేపట్టారు. ఐదేళ్లలో అన్ని ప్రాజెక్టులకు కలిపి రూ.6,280.11 కోట్లు ఖర్చు చేశారు. ►జిల్లాలోని 63,346 మంది విద్యార్థులకు రూ.30 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. రూ.75 కోట్లు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు అందించారు. ►2004 ముందు జిల్లాలో 2.86 లక్షల మందికి పింఛన్లు ఉన్నాయి. ఇందిరమ్మ మూడు దశల కార్యక్రమాల కింద అదనంగా 1.79 లక్షల మందికి నూతనంగా పింఛన్లు మంజూరు చేశారు. పావలా వడ్డీ కింద రూ.20 కోట్లు పొదుపు గ్రూపులకు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. బ్యాంకు లింకేజి రుణాలు రూ.853 కోట్లు మంజూరు చేయించారు. ►జిల్లాలో 7.19 లక్షల మందికి ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు అందించారు. 10,366 మందికి గుండె ఆపరేషన్లు చేయించారు. జిల్లా కేంద్రం ఒంగోలులో రిమ్స్ మెడికల్ కాలేజీ మంజూరు చేయించారు. 37.46 ఎకరాల్లో దాదాపు రూ.250 కోట్లతో మెడికల్ కళాశాల, వెయ్యి పడకల రిమ్స్ వైద్యశాలల నిర్మాణాలు చేపట్టారు. ►ఐదేళ్లలో 3,22,630 గృహాలు నిర్మించి పేదలకు అందించారు. 19,904 మంది భూమి లేని పేదలకు 31,734 ఎకరాలు పంపిణీ చేశారు. జిల్లాలో రూ.400 కోట్లతో సాగర్ కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టటంతో 4.50 లక్షల సాగర్ ఆయకట్టుకు నీరందింది. దీంతో యర్రగొండపాలెం, దర్శి, అద్దంకి, పర్చూరు, సంతనూతలపాడు, మార్కాపురం, ఒంగోలు నియోజకవర్గాల రైతులకు మేలు చేకూరింది. ►కొండపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలం చెన్నుపాడు వద్ద పాలేరు నదిపై సంగమేశ్వరం వద్ద రూ.50 కోట్లతో ప్రాజెక్టు మంజూరు చేశారు. ►దర్శి నియోజకవర్గంలో రూ.120 కోట్లతో రక్షిత మంచినీటి పథకం, రూ.2 కోట్లతో మార్కెట్ యార్డు నిర్మించారు. ► కనిగిరి నియోజకవర్గంలో రూ.175 కోట్లతో రక్షిత మంచినీటి పథకం మంజూరు చేశారు. ► కందుకూరులో రూ.110 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మించారు. రూ.80 కోట్లతో రాళ్లపాడు ప్రాజెక్టు అనుసంధానం కోసం సోమశిల ప్రాజెక్టు నుంచి ఉత్తర కాలువ నిర్మించారు. ►గిద్దలూరులో రూ.12 కోట్లతో బైరేనిగుండాల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంతో పాటు రూ.22 కోట్లతో రామన్న కతువ నిర్మించారు. ► చీరాల, పర్చూరుల్లో కృష్ణా డెల్టా ఆధునికీకరణకు రూ.2 వేల కోట్లు కేటాయించారు. చేనేతలకు 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చారు. ► అద్దంకిలో రూ.400 కోట్లతో నార్కెట్‌పల్లి, అద్దంకి, మేదరమెట్లకు రాష్ట్రీయ రహదారి నిర్మించారు. 5 వేల ఎకరాలకు సాగునీరందించే యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం మంజూరు చేశారు. ► 2004 మే నెలకు ముందు జిల్లాలో 63,559 మంది రైతుల కరెంట్ బకాయిలు రూ.59.5 కోట్లు వైఎస్సార్ రద్దు చేశారు. ఐదేళ్లలో మొత్తం 86,207 మంది రైతులు ఉచిత విద్యుత్ పొందారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్య 1.50 లక్షలకు చేరింది. ► 2019 ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రి బాటలోనే ప్రజా రంజక పాలన సాగిస్తూ వ్యవసాయానికి, మహిళాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారు. తండ్రి అడుగుజాడల్లోనే సాగుతూ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ నవరత్నాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు. -
ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ : మహానేత వైఎస్సార్‌కు సీఎం వైఎస్ జగన్ నివాళి
-
నీ జ్ఞాపకాలు మా మదిలో పదిలం.. నిన్ను ఎన్నటికీ మరువం రాజన్నా!
-
వైఎస్సార్ మనసున్న మహారాజు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ మనసున్న మహారాజు అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో వైఎస్సార్ సంస్మరణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దివంగత మహానేత వైఎస్సార్ సుపరిపాలన అందించారన్నారు. వైఎస్సార్ స్ఫూర్తితో ముందడుగు వేస్తున్నామన్నారు. తండ్రి బాటలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుస్తున్నారని తెలిపారు. ‘‘ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా పాలన చేస్తున్నాం. పార్టీలో కష్టపడిన వారందరికీ న్యాయం జరుగుతుంది. ప్రభుత్వ భూములు ప్రజలకే చెందాలన్నది మా లక్ష్యం. ఎక్కడైనా భూ ఆక్రమణలు జరిగితే ఫిర్యాదు చేయొచ్చు. అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని’’ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వ్యవసాయాన్ని పండగ చేశారు: మంత్రి అవంతి దివంగత మహానేత వైఎస్సార్ భౌతికంగా లేకపోయిన ప్రజల గుండెల్లో కొలివై ఉన్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించారని కొనియాడారు. రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా మార్చిన గొప్ప నేత అని, అభివృద్ధి విషయంలో వైఎస్సార్ రాజకీయాలు చూడలేదని మంత్రి అవంతి అన్నారు. ఇవీ చదవండి: మీ స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది నాన్న: సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ చిరునవ్వుల వేగుచుక్క -
మహానేత వైఎస్సార్‌కు సీఎం వైఎస్ జగన్ నివాళి
సాక్షి, పులివెందుల: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలసి గురువారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతి నివాళులర్పించారు. వైఎస్సార్‌ను స్మరించుకుంటూ మౌనం పాటించారు. ఇవీ చదవండి: మీ స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది నాన్న: సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ చిరునవ్వుల వేగుచుక్క (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దివంగత వైఎస్సార్: చిరునవ్వుల వేగుచుక్క
తెలుగునేల మీద ఎవరూ చెరపలేని నిఖార్సయిన చెరగని సంతకం దివంగత వైఎస్సార్. రాజకీయాలకు అతీతంగా బీదాబిక్కీ ప్రజానీకాన్ని అక్కున చేర్చుకున్నారు. అందుకే మరణానంతరం కూడా వైఎస్సార్‌ను జనం అంతలా ప్రేమిస్తున్నారు. మహానేత అంటూ పూజిస్తున్నారు. నిజంగానే మహానేత అనేది వైఎస్సార్‌కు పర్యాయపదమై పోయింది. గుండెను గుడిని చేసుకుని వైఎస్సార్‌ను దేవునిలా కొలుస్తున్నారు. ఇళ్ళలో దేవుని పటం పక్కన మహానేత ఫొటో పెట్టుకుని పూజలు చేసుకుంటున్నారు. తమ బతుకులు పండించిన దేవుడు వైఎస్సార్ అనుకుంటూ, ఆనాటి పాలనను సువర్ణ యుగంగా తలపోసుకుంటున్నారు. 2010 లో ఓ చర్చా కార్యక్రమంలో నన్ను ఓ ప్రశ్న అడిగేరు. ‘వైఎస్సార్‌ను ఇంతలా ప్రజలు ఎందుకు ఆరాధిస్తున్నారు’ అని. ‘ప్రజలను, పల్లెలను మరచిపోయిన గత పాలకుల పాలనకు భిన్నంగా, నేలతల్లినీ, పచ్చదనాన్నీ, పల్లెపట్టులనూ, రైతునీ, పాడీనీ, పంటనూ, పేదా బీదా ఆరోగ్యాన్నీ, వారి సొంత గూడునీ, పేద పిల్లల చదువునూ, పేదేళ్ల ఉన్నతినీ ఆలోచించి, వారి కోసం పాటుపడిన పాలన వైఎస్సార్‌ది కాబట్టి. బీద బిక్కీ బతుకుల్ని స్పృశించి, వారికేమి కావాలో అది చేసి చూపించేరు వైఎస్సార్ కాబట్టి జనం ఆరాధిస్తున్నారు’ అని చెప్పాను. అవును. 2004లో వైఎస్సార్ అధికారంలోకి రాకుండా ఉంటే ఏమయ్యేది? పల్లెలను, పేదోళ్ళను, రైతులను గాలికొదిలి, లేనిపోని టెక్నాలజీ భ్రమలలో, మొత్తం పాలనంతా, బడా బాబుల డాబుగా మారిపోయి ఉండేది. వైఎస్సార్ రాకతో పేదోడికి పట్టాభిషేకం చేసే పాలనకు అంకురార్పణ జరిగింది. ఆ తర్వాత వచ్చే పాలకులు కూడా తప్పని సరై పేదోడి అవసరాలను, రైతుల ఇక్కట్లను పట్టించుకోవలసిన అవసరం ఏర్పడింది. అంతటి బలమైన ముద్ర వైఎస్సార్‌ది. వైఎస్సార్ ఆశయాలే తన జెండాగా, తన పార్టీ ఎజెండాగా, తండ్రి ఓ అడుగు వేస్తే, తను మరో నాలుగడుగులు వేస్తున్న వైఎస్ జగన్ పాలనలో వైఎస్సార్ సజీవమై బ్రతికి ఉన్నారనీ, భవిష్యత్తులో కూడా బతికే ఉంటారనీ, ఘంటాపథంగా చెబుతున్నాను. – రమాప్రసాద్ ఆదిభట్ల, విశ్రాంత డైరెక్టర్ యూజీసీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, విశాఖపట్నం. మొబైల్ 93480 06669 -
మీ స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది నాన్న: సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్
సాక్షి, అమరావతి: తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భౌతికంగా దూరమై 12 ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లో సభ్యునిగా నేటికి జన హృదయాల్లో కొలువై ఉన్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తన తండ్రిని తలుచుకుంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలో అలానే నిలిచి ఉన్నాయన్నారు. ‘నేను వేసే ప్రతి అడుగులోనూ, ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది’’ అని సీఎం వైఎస్ జగన్ ట్విటర్లో పేర్కొన్నారు. ఇవీ చదవండి: మహానేత వైఎస్సార్: నిలువెత్తు సంక్షేమ రూపం నిరుపేదల గుండె దీపం నాన్న భౌతికంగా దూరమై 12ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారు.చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ,చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది#YSRForever — YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2021 -
నీవే స్ఫూర్తి.. నీదే కీర్తి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మాటిస్తే నిలబెట్టుకోవాలి. హామీ ఇస్తే ఎలాగైనా అమలు చేయాలి. కష్టాన్ని కనిపెట్టి కన్నీరు తుడవాలి.. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి నేర్పిన పాఠాలివి. ముఖ్యమంత్రిగా ఆయ న అనుసరించిన విధానాలూ ఇవే. అందుకే మరణించాక కూడా ఆయన జనం గుండెల్లో బతికున్నారు. సంక్షేమానికి ఆయన పేరునే శాశ్వత చిరునామాగా మార్చేశారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు. ఉద్దానానికి మంచినీటి ప్రాజెక్టు, కిడ్నీ పరిశోధన కేంద్రం వంటి ప్రాజెక్టులతో సిక్కోలుపై వరాలు కురిపిస్తున్నారు. వైఎస్సార్ హయాంలో.. ►శ్రీకాకుళానికి ఓ పెద్దాసుపత్రి ఉండాల్సిందేనని భావించి ప్రజలు కోరకుండానే రిమ్స్ వైద్య కళాశాలను, ఆస్పత్రిని నిర్మించారు. ►సిక్కోలు జిల్లాకు యూనివర్సిటీని అందించారు. ఎచ్చెర్లలో 2008 జూలై 25న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ ఏర్పాటు చేశారు. ఇప్పుడీ వర్సిటీ గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఉన్నత విద్యావేత్తలుగా తీర్చిదిద్దుతోంది. ►ఎచ్చెర్లలో ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేశారు. ►ప్రతి చుక్క నీటిని అందిపుచ్చుకుని, రైతుకు అందించాలని అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. 2005 మే నెలలో వంశధార స్టేజ్ 2, ఫేజ్2 ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. 20 మండలాల్లో 2.55లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు తలపెట్టారు. ►జిల్లాలోని హిరమండలం వద్ద సుమారు 10వేల ఎకరాల్లో 19 టీఎంసీల నీటి నిల్వ కోసం రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. తోటపల్లి ఫేజ్ 2 పనుల ఘనత ఆయనకే దక్కుతుంది. ►సాగునీరు, పలాస పట్టణానికి తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.123.25 కోట్లతో ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ►వంశధార, నాగావళి నదుల అనుసంధానం పనులు పూర్తయితే 2.55లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని వైఎస్సార్ అప్పట్లోనే పనులకు శ్రీకారం చుట్టారు. ►∙12,500 ఎకరాల సాగునీటి కోసం మడ్డువలస ప్రాజెక్టు స్టేజ్ 1 పనులను రూ.57.87కోట్లతో చేపట్టారు. ►నాగావళి, వంశధార నదుల వరద ఉద్ధృతి నుంచి పంట పొలాలను, ఆవాసాలను రక్షించేందుకు రూ. 300కోట్లతో కరకట్టల నిర్మాణాలకు సంకల్పించారు. ►సీతంపేట ఏజెన్సీలో 14 వేల ఎకరాల్లో 5వేల మంది గిరిజన రైతులకు పట్టాలు ఇచ్చారు. ►రైతులను ఆదుకున్న ఏకైక నేత వైఎస్సారే. 2.5లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేశారు. అప్పటికే రుణాలు చెల్లించేసిన వారికి రూ. 5వేలు చొప్పున ప్రోత్సాహం అందించారు. ►చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పేదలకు 1,80,817 ఇళ్లు మంజూరు చేసి అందులో 1,63,140ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేశారు. ►నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న సంకల్పంతో 2007లో ప్రారంభించిన ఆరోగ్యశ్రీతో వేలాది మందికి జీవం పోశారు. 938 రకాల వ్యాధులకు కార్పొరేట్ వైద్యం అందించారు. ►ప్రమాద బాధితులకు అత్యవసర సమయంలో ఆస్పత్రిలో చేర్పించి ప్రాణం నిలబెట్టవచ్చని 108 అంబులెన్స్‌లను ప్రారంభించారు. గ్రామీణులకు ప్రతి నెలా వైద్యం అందించడానికి 104 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ►పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ చదువులు అందించాలనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఉన్నత విద్యాభ్యాసానికి కొండంత అండగా నిలిచారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో బీసీ విద్యార్థులే 72 వేలకు పైగా ఉన్నారు. -
కరువు నేలపై పచ్చని సంతకం..
కృష్ణమ్మ పరవళ్లు చూసి కరువు సీమ పులకించిపోయింది. తెలుగుగంగ వేగాన్ని చూసి బీడువారిన భూమితల్లికి జీవమొచ్చింది. కేసీ జలకళతో ఆయకట్టు పచ్చదనం సింగారించుకుంది. ఎగువ నుంచి వస్తున్న నీళ్లు.. దిగువ సగిలేటిలో జల సవ్వడులు.. వెరసి నలుదిక్కులా నీళ్లే కనిపిస్తున్నాయి. వరిమళ్లు.. కేపీ ఉల్లి పంటలతో పొలమంతా నిండిపోయింది. రైతు మనసంతా ఆనందంతో ఉప్పొంగిపోతోంది. కరువు రాతను మార్చేందుకు వైఎస్సార్ చేసిన ‘జలయజ్ఞం’ .. వైఎస్ జగన్ పాలనలో పుడమి తల్లి నుదుటన పచ్చని సంతకమై నిలిచింది. సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో కరువును పారదోలే లక్ష్యంతో మహానేత వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞం నేడు రైతుల పాలిట వరంగా మారింది. మహానేత స్ఫూర్తితో.. అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం వైఎస్ జగన్ జిల్లా లోని ప్రాజెక్టుల పెండింగ్ పనులను పూర్తి చేయడంతోపాటు కొత్త సాగునీటి వనరులను నెలకొల్పి కావాల్సినంత నీటిని అందించారు. జిల్లాను సస్యశ్యామలం చేశారు. వైఎస్ జగన్ పాలన మొదలైన మూడవ ఏడు వరుసగా ప్రాజెక్టులను కృష్ణా జలాలతో నింపడంతో కేసీ కెనాల్, తెలుగుగంగ, జీఎన్ఎస్ఎస్ పరిధిలో లక్షలాది ఎకరాల్లో వరి పంట సాగవుతోంది. భూగర్భ జలాలు పెరిగి ఒట్టిపోయిన బోరు బావులకు నీళ్లు రావడంతో మెట్ట ప్రాంతాల్లో సైతం పసుపు, ఉల్లి, మిరప, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, శనగ తదితర పంటలు సాగవుతున్నాయి. గండికోటలో రికార్డు స్థాయిలో నీరు: వైఎస్ జగన్ ప్రభుత్వం కొలువుదీరాక గండికోట ప్రాజెక్టులో గతేడాది గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 26.85 టీఎంసీల సామర్థ్యం మేరకు నీటిని నిల్వ పెట్టారు. వరుసగా రెండవ ఏడు గండికోటలో ఇంతే స్థాయిలో నీటిని నిల్వ పెడుతున్నారు. అవుకు నుంచి గండికోటకు ఇటీవలే నీటిని విడుదల చేశారు. బుధవారం నాటికి అవుకు నుంచి∙7000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా గురువారం నాటికి దీనిని 9000 క్యూసెక్కులకు పెంచనున్నారు. జీఎన్ఎస్ఎస్ పరిధిలోని ఆరు ప్రాజెక్టుల పరిధిలో పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 54.297 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 42.846 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో కొనసాగితే వారం రోజుల్లోపే అన్ని ప్రాజెక్టులు నిండే అవకాశం ఉంది. ఇదే జరిగితే 2.76 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. తెలుగుగంగ పరిధిలో లక్ష ఎకరాలకు సాగునీరు: తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలోని మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లో 1.58 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఈ ఏడాది సుమారు లక్షా 19 వేల ఎకరాల్లో ఆయకట్టుకు నీళ్లించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఆగస్టు 8న తెలుగుగంగకు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. ఇప్పటికే బ్రహ్మంసాగర్ నుంచి బద్వేలు నియోజకవర్గంలోని ఎడమ, కుడికాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గ పరిధిలోని 173 చెరువులను అధికారులు నీటితో నింపారు. దిగువ సగిలేరు ప్రాజెక్టుకు తెలుగుగంగ నీటిని తరలించి బి.కోడూరు, బద్వేలు మండలాల్లో 27 చెరువులను నీటితో నింపారు. తద్వారా 13 వేల ఎకరాల ఆయకట్టులో రైతులు వరి సాగు చేస్తున్నారు. మరోవైపు బద్వేలు, పోరుమామిళ్ల పెద్ద చెరువులతోపాటు నియోజకవర్గంలోని అన్ని చెరువులకు కృష్ణా జలాలు చేరడంతో రైతులు వరితోపాటు ఉల్లి, పత్తి, మిరప పంటలను సాగు చేస్తున్నారు. కేసీ కెనాల్ పరిధిలో ఇప్పటికే 30 శాతం వరినాట్లు కేసీ కెనాల్ పరిధిలో 92 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆగస్టు 1న శ్రీశైలం నుంచి కేసీ కెనాల్‌కు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. ప్రస్తుతం కేసీ ఆయకట్టుకు రాజోలి వద్ద 700 క్యూసెక్కులు, ఆదినిమ్మాయపల్లె వద్ద 150 క్యూసెక్కులు, చాపాడు ఛానల్‌కు 150 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 30 శాతం ఆయకట్టులో వరినాట్లు వేశారు. -
మహానేత వైఎస్సార్: నిరుపేదల గుండె దీపం
‘వాని రెక్కల కష్టంబు లేనినాడు/ సస్యరమ పండి పులకింప సంశ యించు/ వాడు చెమ్మట లోడ్చి ప్రపంచమునకు/ భోజనం బెట్టువానికి భుక్తి లేదు’’. మహాకవి గుర్రం జాషువా రైతు కష్టాన్ని కవిత్వంగా చెప్పాడు. కష్టజీవుల దీనగాథను కళ్ళకు కట్టాడు. ఆ కవిత్వం, కావ్యం సాహిత్య ప్రపంచంలో నిత్యనూతనం. నేటికీ దేశంలో ఇదీ రైతు దుస్థితి. ఆంధ్రప్రదేశ్ మట్టి మీద సజీవసాక్ష్యంగా మరుపురాని మహోన్నతగాథ మరొకటి వుంది. ఇది రైతు బతుకుతో పెనవేసుకు నడిచిన ఒక మహానాయకుని సత్యయాత్ర. అదే ప్రజల గుండెల్లో రాజన్నగా ముద్రపడిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం. ఇచ్చిన మాట మీద నిలబడి పాలన చేసిన రాజన్నకి నాడు ప్రజలు హృదయపూర్వకంగా రెండోసారీ ముఖ్యమంత్రిగా పట్టం గట్టారు. పదవంటే బాధ్యత, జాతి భవితవ్యమని ఎలుగెత్తి చాటిన పాలకుడు రాజన్న. ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే పాలన. ఆయనది ప్రజాకర్షకమైన వ్యక్తిత్వమే కాదు రూపం కూడా. రచ్చబండలో పాల్గొననున్న ముఖ్యమంత్రిని మనసారా చూడాలన్న జనం ఆశలు అడియాసలై పోయాయి. కళ్ళన్నీ కన్నీరుమున్నీరైపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో రైతు కోసం, రైతు కూలీ కష్టం కోసం తన శక్తినంతా ధారబోసిన ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్కరే. ప్రతిపక్షనాయకునిగా పాదయాత్రతో ఆయన ప్రజల్ని పలకరించారు. నెర్రెలు తీసిన పంట పొలాల మాటున నెత్తురోడుతున్న బతుకుల్ని కళ్ళారా చూశారు. ఆర్థిక దుస్థితితో చదువులకు దూరమవుతున్న యువతతో మాట్లాడారు. చికిత్సకరువై చీకటిలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడుగెట్టారు. రోగుల దుస్థితి చూసి తల్లడిల్లిపోయారు. తడబడుతున్న బతుకుమాటల్ని చెవులారా విన్నారు. అన్నార్తుల ఆవేదనను ఆలకించారు. రాష్ట్ర ప్రజల కష్టాలకు ఆయనే ప్రత్యక్షసాక్షిగా నిలిచారు. అందుకే రాజన్న తనదైన అజెండా అమలు చేశారు. అన్నదాతకు అండగా నిలిచారు. ముఖ్యమంత్రిగా తొలి సంతకమే విద్యుత్ బకాయిల మాఫీ కోసం చేశారు. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌తో అండగా నిలిచి వారిలో ఆశావాదాన్ని నింపారు. ప్రజలందరికీ ప్రాణరక్షగా ‘ఆరోగ్యశ్రీ’ తెచ్చారు. మహిళల్ని అక్కచెల్లమ్మలుగా పిలిచి వారిపై అమితమైన ప్రేమ కురిపించారు. వారి సాధికారత కోసం శ్రమించారు. రాష్ట్రాన్ని సతత హరితవనంగా పరిరక్షించారు. అవసరమైన ప్రతి చోటా నీటి ప్రాజెక్టుల్ని నిర్మించారు. పంట చేలలో ప్రతి నీటిబొట్టూ రాజన్న బొమ్మను చెక్కుకుంటూ ప్రవహించిందనడంలో అతిశయోక్తి లేదు. ఆరిపోతున్న ఎన్నో గుండెదీపాలు వెలిగించిన వైద్యుడు రాజన్న. అందుకే రాజన్న పేరును ఎందరో తమ ఎదల మీద పచ్చబొట్టు పొడిపించుకున్నారు. ప్రజలకిచ్చిన మాట జవదాటలేదు. తన లక్షాన్ని నమ్మి వెంటనడిచిన స్నేహితుల్ని ప్రాణప్రదంగా ప్రేమించారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లుతున్న వేళ ఆయన మాత్రం నింగికెగసి దేశం యావత్తును శోకసంద్రంలోకి నెట్టేశారు. వైఎస్ తన అనుభవాల్నే కాదు, సంస్కర్తలనూ ఆదర్శంగా తీసుకొని పాలన చేశారు. డాక్టర్ అంబేడ్కర్ సాగించిన సామాజిక పోరాటాల్ని ఆయన గౌరవించారు. అణగారిన ప్రజల కోసం మహాత్మా ఫూలే చేబట్టిన కార్యాచరణను ఆచరించారు. అందుకే నాడు ధనిక, పేద తేడా లేకుండా మనుషుల్ని ప్రేమించారు రాజన్న. పేదరికంతో ఏ ఒక్కరి ప్రాణమూ పోకూడదని, ఏ పేదవిద్యార్థి చదువూ ఆగకూడదని ఆయన నినదించారు. నీటినీ, నింగినీ ప్రేమించిన రాజన్న మీద నాడు ప్రజలు ఉంచిన నమ్మకాన్నే నేడు జనం జగనన్న మీద పెంచుకున్నారు. తండ్రి బాటలో రెట్టింపు ఉత్సాహంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల అభివృద్ధి కోసం తన పాలనలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ప్రతిపౌరుని పరిరక్షణ బాధ్యతగా భావించి ప్రభుత్వం దూసుకుపోతోంది. రాజన్న పథకాలకు జగనన్న రక్షణకవచమై నిలిచారు. జగనన్న పల్లెపల్లెకు ఆరోగ్యశ్రీకారం చుట్టారు. వృద్ధుల చేతిలో ఫించన్ ఆసరాగా నిలిచారు. పేదల గుండెల్లో విద్యాదీపమై వెలుగులు విరజిమ్ముతున్నారు. రాజన్న పేదల పాలిట రాజైతే ఆ రాజ్యానికి సర్వసైన్యాధక్షుడై జగనన్న ధైర్యసాహసాలతో పరిరక్షిస్తున్నారనేది సత్యం. ఈ నిజాన్ని ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదిస్తున్నారు. డాక్టర్ జి.కె.డి. ప్రసాద్ వ్యాసకర్త ఫ్యాకల్టీ, జర్నలిజం విభాగం ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖ. మొబైల్ : 9393 111740 -
నేడు వైఎస్సార్ సంస్మరణ సభ
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంస్మరణసభ గురువారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరగనుంది. వైఎస్ 12వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు రావాలంటూ 300 మందికిపైగా ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. ఇందులో వైఎస్‌కు సన్నిహితులుగా మెలిగిన పలువురు రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, జర్నలిస్టులు, సినీప్రముఖులు ఉన్నా రు. వీరిలో కొందరికి విజయమ్మ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. ఆహ్వానితుల్లో పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ డి.శ్రీనివాస్, మాజీ ఎంపీలు కేవీపీ రామచందర్‌రావు, ఉండవల్లి అరుణ్‌కుమార్‌లతోపాటు మంత్రి సబితాఇంద్రారెడ్డి, పలు పార్టీల సీనియర్ నేతలు జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి బ్రదర్స్, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, దానం నాగేందర్, శ్రీధర్‌బాబు, ఎంఏ ఖాన్, సురేశ్‌షెట్కార్, డి.కె.అరుణ, జితేందర్‌రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ తదితరులున్నారని నిర్వాహకులు వెల్లడించారు. వీరితోపాటు మాజీ ఐఏఎస్ అధికారులు రమాకాంత్‌రెడ్డి, బీపీ ఆచార్య, మోహన్‌కందా, సినీప్రముఖులు చిరంజీవి, నాగార్జున, కృష్ణ, దిల్‌రాజు, పలువురు రిటైర్డ్ జడ్జీలు, జర్నలిస్టులున్నారని తెలిపారు. ఆహ్వానితుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులే ఎక్కువగా ఉన్నారని సమాచారం. ఈ సభ ఏర్పాట్లను మాజీ ఐఏఎస్ అధికారి ప్రభాకర్‌రెడ్డి, వైఎస్ వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించిన భాస్కరశర్మ పర్యవేక్షిస్తున్నారు. -
అభివృద్ధి – సంక్షేమం ఆయన పథం
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల కోసం ఎన్ని మంచి పనులు చేయవచ్చో, వారిని ఆరోగ్యవంతులుగా, ఉన్నత విద్యావంతులుగా ఎలా తీర్చిదిద్దవచ్చో.. నిరూపించి వారి హృదయాల్లో నిలిచిపోయారు. ప్రజలను కుటుంబసభ్యులుగా భావించి వారి కష్టాలు, కన్నీళ్లు.. వాటికి కారణాలు తెలుసుకుని నేనున్నానంటూ భరోసా కల్పించి.. మీకోసం ఎందాకైనా.. అంటూ నడిచి నిలిచారు. గలగలా జలాలు పారించి నోళ్లు తెరిచిన బీళ్లకు ఊపిరి పోశారు. ఆయన భౌతికంగా దూరమై నేటికి 12 ఏళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేం. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అంటూ ఆప్యాయమైన ఆయన పిలుపు చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా వైఎస్ రాజశేఖరరెడ్డి టీడీపీ ప్రభుత్వ దోపిడీ, దౌర్జన్యాలు, దాష్టీకాలపై మడమతిప్పకుండా పోరా డారు. ఆ చీకటి పాలనలో నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు నేనున్నానంటూ మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రజా ప్రస్థానం పేరుతో 1,475 కిలోమీటర్లు పాదయాత్ర చేసి భరోసా కల్పించారు. ప్రజల కష్టాలు విన్నారు. కన్నీళ్లు తుడిచారు. 2004 సాధారణ ఎన్నికల్లో ప్రజ లు బ్రహ్మరథం పట్టిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేసే ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి పునాది వేశారు. పంటలు పండక విద్యుత్ చార్జీలు కట్టలేని రైతులపై టీడీపీ సర్కార్ రాక్షసంగా బనాయించిన కేసులను ఒక్క సం తకంతో ఎత్తేశారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. దాదాపు 35 లక్షలకుపైగా పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందించారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ.. ఆ తర్వాత ఏడాదికి రూ.6 వేల కోట్లకు చేరినా ఉచిత విద్యుత్ హామీ అమలుపై వెనక్కి తగ్గలేదు. పావలా వడ్డీకే రైతులకు రుణాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించారు. పంటల బీమాను అమలు చేశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఢిల్లీతో పోరాడారు. 2004 – 2009 మధ్య ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.550 నుంచి రూ.1,000 వరకు పెరిగిందంటే.. అది ఆ యన కృషే. నదీ జలాలను తెలుగునేలకు మళ్లించి.. సుభిక్షం చేయడానికి రూ.లక్ష కోట్ల వ్యయంతో కోటి ఎకరాలకు నీళ్లందించేలా ఒకేసారి 84 ప్రాజెక్టులను జలయజ్ఞం కింద చేపట్టి.. శరవేగంగా పనులు చేసి.. నీళ్లందించి అపర భగీరథుడిగా నిలిచారు. విద్య, వైద్యం.. అందరికీ అవసరమైన విద్య, వైద్యాలను అందు బాటులోకి తీసుకొచ్చారు. పేదరికం వల్ల ఏ ఒక్క రూ ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న లక్ష్యంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి రూపకల్పన చేశారు. లక్షలాదిమంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓసీ విద్యార్థులు ఉన్నత విద్యావంతులయ్యేలా చేశారు. ఉన్నత చదువులు అందరికీ అందుబాటు లోకి రావాలని జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సమీపంలో కంది వద్ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ ఐటీ)ని ఏర్పాటు చేయించారు. బాసర, ఇడు పులపాయ, నూజివీడుల్లో ట్రిపుల్ ఐటీలను ఏర్పా టు చేశారు. వైద్యానికి డబ్బులేక ఏ ఒక్కరూ ఇబ్బం ది పడకూడదనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆవిష్కరించారు. క్యాన్సర్, గర్భకోశవ్యాధులు, గుండె జబ్బులు తదితర 942 వ్యాధులకు చికిత్స అందించేలా ఆరోగ్యశ్రీని రూపొందించి ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు ఉచితంగా దక్కేలా చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోను మహానేత వైఎస్ రూపకల్పన చేసిన ఆరోగ్యశ్రీ పథకం వివిధ పేర్లతో అమలవుతోందంటే ఆయన దార్శనికత అర్థమవుతోంది. ఫోన్ చేసిన నిమిషాల్లోనే ప్రత్యక్షమయ్యే 108 అత్యవసర అంబులెన్స్ సర్వీసులు, 104 వైద్యసేవలకు ఆయనే శ్రీకారం చుట్టారు. తనయుడు.. మరో రెండడుగులు ముందుకు ప్రజల సంక్షేమం కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకేస్తే.. ఆయన కొడుకుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జనం అభ్యున్నతి కోసం రెండడుగులు ముందుకేస్తున్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు తోడ్పాటును అందించేందుకు రైతుభరోసా కేంద్రాలను (ఆర్బీకేలను) ఏర్పాటు చేశారు. వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నారు. రైతుకు అన్నింటా సాయంగా నిలుస్తున్నారు. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. వైద్యరంగంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్–19ను వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో చేర్చారు. కొత్తగా 16 వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో వైద్యవ్యవస్థను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. -
ఆప్యాయంగా పలకరిస్తూ..
సాక్షి ప్రతినిధి, కడప/పులివెందుల: తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం వైఎస్సార్ కడప జిల్లాకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి జగన్ వారిని పేరుపేరున సాదరంగా పలకరించారు. సాయంత్రం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో సతీమణి వైఎస్ భారతితో కలిసి బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్ 5.10 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి 5.35 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 5.50కి ఇడుపులపాయ హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. 6.30 గంటల వరకు అక్కడున్న వారిని ఆప్యాయంగా పలకరించి వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం ఇడుపులపాయ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బిజేంద్రనాథరెడ్డి, కలెక్టర్ వి.విజయరామరాజు, పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి తదితరులున్నారు. నేడు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా గురువారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సభ్యులతో కలసి నివాళులర్పించనున్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి తిరిగి తాడేపల్లి బయలుదేరి వెళతారు. ఇడుపులపాయకు చేరుకున్నవైఎస్ విజయమ్మ, షర్మిల వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కుమార్తె, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల, కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం ఇడుపులపాయకు చేరుకున్నారు. గురువారం ఉదయం వైఎస్సార్ ఘాట్‌లో నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొంటారు. -
మహానేత వైఎస్సార్: నిలువెత్తు సంక్షేమ రూపం
తన పంటకు మా ముఖ్యమంత్రి ఉన్నాడనే భరోసా రైతుకూ, తన వైద్యానికి మా ముఖ్యమంత్రి ఉన్నాడనే భరోసా రోగికీ, మా పిల్లల చదువుకు మా ముఖ్యమంత్రి ఉన్నాడనే భరోసా తల్లితండ్రులకూ, తలెత్తుకుని నడిచే సాధికారత మహిళలకూ, శేషజీవితానికి దిగుల్లేదనే భరోసా వృద్ధులకూ కల్పించిన గొప్ప మానవీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. జలయజ్ఞంతో బీడుభూములను సస్యశ్యామలం చేశారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలిచారు. రెండవ హరిత విప్లవాన్ని కలగన్నారు. అభివృద్ధి, సంక్షేమం తన రెండు కళ్లుగా పాలన సాగించారు వైఎస్. కేవలం ఐదేళ్ల మూడు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి. అయినా ప్రజా సంక్షేమం కోసం ఎవరూ చేయలేని పనులు చేశారు. రాజకీయ నాయకుడిగా తొలి రోజులలోనే అసెంబ్లీలో విస్పష్టంగా సాగునీటి అవసరం గురించి మాట్లాడారు. ‘నేను యువకుడిగా కోస్తా ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ కాలువలలో పారుతున్న నీటిని చూసి కరువు ప్రాంతాలకు కూడా ఇలా నీటిని తీసుకుని వెళ్ళాలనే సంకల్పం నాలో ఏర్పడింది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రాయలసీమకు నీళ్ళివ్వమని నేను అడిగితే, దోసిలి పట్టు పోస్తానని ఎగతాళిగా మాట్లాడారు. ఆ రోజున నా సంకల్పం మరింత బలపడింది’ అన్నారు వైఎస్. ఆ సంకల్పబలం నుండి ఉద్భవించిందే మహత్తరమైన జలయజ్ఞం. సాగునీటి వనరుల అభివృద్ధి మొదలైన కృష్ణదేవరాయల పాలన నుండి వైఎస్ ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి వనరులు ఉన్న భూమి 80 లక్షల ఎకరాలు మాత్రమే. ఈ పరిస్థితిలో లక్ష కోట్లతో కోటి ఎకరాలకు నీరు అందిస్తానని ఆయన జలయజ్ఞం ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదట ప్రారంభించిన ప్రాజెక్టు పులిచింతల. కానీ మొదట పూర్తయ్యింది నిజామాబాద్ జిల్లాలోని అలీసాగర్. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేర్లు పెట్టినా ఏమాత్రం కూడా పనులు జరగని హంద్రీ–నీవా సుజల స్రవంతి, గాలేరు–నగరి సుజల స్రవంతులకు అవే పేర్లు కొనసాగించడం, ప్రకాశం జిల్లాలోని కరువు ప్రాంతానికి జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టుకు కమ్యూనిస్టు నాయకుడు పూల సుబ్బయ్య పేరు పెట్టడం, కృష్ణా డెల్టా రైతుల చిరకాల స్వప్నమైన పులిచింతలకు కృష్ణా డెల్టా వాసి, ఆంధ్రప్రదేశ్ గర్వించే ఇంజనీర్ కె.ఎల్.రావు పేరు పెట్టడం ఆయన రాజకీయ విజ్ఞతకు నిదర్శనం. అలాగే ఆంధ్రరాష్ట్రానికి వరం, పోలవరం. ఈ ప్రాజెక్టు విషయంలో ఆయన కృషి మరువలేనిది. దీనికోసం గోదావరి జిల్లా వాసులు పోలవరం సాధనా సమితి పేరుతో అనేక ఉద్యమాలు చేసి చివరికి అది అసాధ్యం అనుకున్న తరుణంలో– అన్ని అనుమతులు సాధించి, ప్రాజెక్టును ప్రారంభించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే 70 శాతం పనులు పూర్తి చేయడం ఆయన కార్య శూరత్వానికి నిదర్శనం. 2004లో వైఎస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే నాటికి వ్యవసాయ రంగం కుదేలైంది. రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి. అయినా రైతులను ఆదుకోకపోగా ఈ విషయమై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎగతాళిగా మాట్లాడారు. కానీ వైఎస్ సీఎంగా మే నెల రెండవ వారంలో ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ మొదటి వారంలోనే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు అనా«థలు కాకూడదని రెండు లక్షల రూపాయల పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతుకు వెన్నెముక. రైతులు అప్పుల కట్టలేక సహకార సంఘాలు దివాలా తీసే పరిస్థితిలో వైద్యనాథన్ కమిటీ సిఫారసులు అమలు చేసి రూ.1,800 కోట్ల సాయం అందించారు. పూర్తి నష్టాలలో ఉన్న సంఘాలను పక్క సహకార సంఘంలో కలిపి సహకార వ్యవస్థను కాపాడారు. పావలా వడ్డీకే రైతులకు పంట రుణాలు అందించారు. ఒక ప్రాజెక్టు కట్టి ఒక ఎకరానికి నీరివ్వాలంటే ప్రభుత్వానికి లక్షలలో ఖర్చు అవుతుంది. పైగా నిర్వహణ భారం ప్రభుత్వానిదే. అదే భూగర్భ జలాలకైతే రైతు స్వయంగా బోరు వేయించుకోవడమో, బావి తవ్వడమో చేస్తాడు. దానికోసం అప్పు తెచ్చుకుంటాడు. దానికి అవసరమైన పూర్తి బరువు అతడే మోస్తాడు. ఈ తర్కం ఆధారంగా వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని వైఎస్ సంకల్పించారు. కానీ అది జరిగేపని కాదని కొందరు వ్యంగ్యంగా మాట్లాడారు. అయినా ఆయన పట్టు వీడలేదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చి చూపారు. ఆ పథకం దేశానికే ఆదర్శమై ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లోనూ అమలవుతోంది. వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నప్పటికీ, వ్యవసాయ విధానాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. అందువలన కేంద్ర–రాష్ట్రాల సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలని గుర్తించి ఆయన చైర్మన్‌గా, సోమయాజులు వైస్ చైర్మన్‌గా అగ్రికల్చర్ టెక్నాలజీ మిషన్ ఏర్పాటు చేశారు. 2006లో దాని ప్రారంభోత్సవం సందర్భంగా– ‘నీటిపారుదల, గిట్టుబాటు వ్యవ సాయ మూలంగానే రెండవ హరిత విప్లవం సాధ్యమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశానికే అన్నపూర్ణగా తీర్చిదిద్దడం నా లక్ష్యం’ అని ప్రకటించారు. అది ఆయన ఆత్మవిశ్వాసానికి సూచిక. వ్యవసాయంలో ఉత్పత్తి వ్యయం ఎక్కువ. పండించిన పంటను లాభసాటి ధరకు అమ్ముకుంటేనే రైతుకు ఆదాయం వస్తుంది. పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా మద్దతు ధరలు లేవని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవి పెరిగేలా చేశారు. కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించడానికి కారణం వైఎస్ ప్రోద్బలమే. సన్న, చిన్నకారు రైతులు, కౌలు రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణాలు విద్య, వైద్యం ఖర్చు. అందుకే గొప్ప పథకాలైన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104 అమలు చేశారు. ఒక్క రూపాయి పన్ను పెంచకుండా, ఒక్క రూపాయి కొత్త పన్ను వెయ్యకుండా సంక్షేమ పథకాలన్నీ అర్హులందరికీ అందించారు. రాజశేఖరరెడ్డి పాలనలో రైతులకు భూములు అమ్ముకోవలసిన అగత్యం పట్టలేదు. వారి ఆదాయాలు పెరిగాయి. దీని ఫలితంగా వ్యవసాయ కార్మికులు, చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారుల ఆదాయం కూడా పెరిగింది. ప్రకృతి ప్రేమికులు పాలకులుగా ఉంటే ప్రకృతిమాత సహకారం ఉంటుంది. ఇందుకు నిదర్శనం ఆయన పాలన సాగించిన ఐదేళ్లపాటు సకాలంలో వర్షాలు పడ్డాయి. ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. సంక్షేమ రాజ్యం సాక్షాత్కరించింది. వ్యాసకర్త: ఎం.వి.ఎస్. నాగిరెడ్డి రైతు విభాగం అధ్యక్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ -
పీపుల్స్ సీఎం
-
నేడు ఇడుపులపాయకు సీఎం వైఎస్ జగన్
-
ఇడుపులపాయకు చేరుకున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: రెండు రోజుల వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇడుపులపాయ హెలిప్యాడ్ వద్ద నేతలు, ప్రజలను కలిసిన సీఎం జగన్.. సమస్యలపై వారి నుంచి వినతులు స్వీకరిస్తూ ఆప్యాయంగా పలకరించారు. బుధవారం రాత్రి ఇక్కడి గెస్ట్‌హౌస్‌లో సీఎం వైఎస్ జగన్ బస చేస్తారు. అంతకుముందు కడప విమానాశ్రయంలో సీఎం జగన్‌కు జిల్లా కలెక్టర్ విజయరామ రాజు, ఎస్పీ అన్బురాజన్ ఎమ్మెల్యే లు రవీంద్రనాధ్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రయ్య, అధికారులు స్వాగతం పలికారు. గురువారం తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని ఉదయం 9.35 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ నివాళులర్పిస్తారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. తార్వత పార్టీ నాయకులతో మాట్లాడి.. తిరిగి అక్కడి నుంచి బయల్దేరి, మధ్యాహ్నం 12.45కు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. చదవండి: విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు అండగా నిలవాలి: సీఎం జగన్ -
సంక్షేమమే శ్వాసగా....అభివృద్దే ధ్యాసగా
-
ప్రజల హృదయాల్లో చెరగని రూపం
-
సీఎం జగన్ రెండు రోజుల కడప జిల్లా పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (బుధవారం), ఎల్లుండి(గురువారం) వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కడప బయలుదేరనున్నారు. సాయంత్రం 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకుని పార్టీ నాయకులతో మాట్లాడి, వైఎస్సార్ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బస చేస్తారు. గురువారం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొని నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత పార్టీ నాయకులతో సీఎం జగన్ భేటీ అవుతారు. అదే రోజు ఉదయం 11.30 గంటలకు కడప ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 12.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి: మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : మేకపాటి గౌతమ్ రెడ్డి -
దివంగత సీఎం వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం
సెప్టెంబర్ 2 న దివంగత మహానేత వైస్సార్ వర్ధంతిని పురష్కరించుకుని ముందస్తుగా ఘన నివాళులు అర్పించారు ఆస్ట్రేలియా లోని ప్రవాస భారతీయులు.బ్రిస్బేన్ నగరంలో జరిగిన ఈ కార్యక్రంమలో పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ వైస్సార్ గారు చిరస్మరణీయుడన్నారు. డాక్టర్ వైఎస్సార్ చేసిన గొప్ప పనులు చరిత్ర పుటల్లో నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్ఆర్టీ ఆస్ట్రేలియా కోఆర్డినేటర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి , రామకృష్ణ రెడ్డి వల్లూరి ,బిజివేముల రఘు రెడ్డి, కర్రి శ్రీనివాస్ ,అల్లం యుగంధర్ రెడ్డి , కోట శ్రీనివాస్‌రెడ్డి, కనుబుద్ది సురేష్, గాదె విజయేందర్, కిషోర్, చాగంటి వంశీ, బొమ్మిరెడ్డి జస్వంత్, మందా రామకృష్ణారెడ్డిలతో పాటు పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు. ఈ కార్యకమంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, ముస్తఫా, బియ్యపు మధుసూధన్‌రెడ్డి, ఏపీఎన్ఆర్టీ చైర్మన్ వెంకట్ మేడపాటి , చల్లా మధు తదితరులు మాట్లాడారు. నిర్వాహకులను అభినందించారు. చదవండి : Veena Reddy: ఆ ఘనత సాధించిన భారత సంతతి తొలి వ్యక్తిగా.. -
వాషింగ్టన్ డీసీలో వైఎస్సార్‌కు ఘననివాళి
వాషింగ్టన్ డీసీ (వర్జీనియా): అవిభజిత ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీ మెట్రో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం(ఇండియా కాలమానము ప్రకారం శనివారం ఉదయం) ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ఛార్జ్ శశాంక్‌రెడ్డి, సత్య పాటిల్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ అమెరికా సలహాదారు రమేష్‌రెడ్డి వల్లూరు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. సామాజిక దూరం పాటిస్తూ మహానేత వైఎస్సార్‌కి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అమెరికా సలహాదారు రమేష్‌రెడ్డి వల్లూరు మాట్లాడుతూ.. స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి మాట తప్పని, మడమ తిప్పని రాజకీయ నేత అని కొనియాడారు. ప్రజల సంక్షేమానికి కట్టుబడి విద్యకు, వ్యవసాయానికి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చిన మహానాయకుడని గుర్తుచేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తన తండ్రి రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన కుమారుడిగా వైఎస్ జగన్ రెండు అడుగులు ముందుకు వేస్తానని చెప్పారని, మాట నిలుపుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. సంక్షేమాభివృద్ధి పథకాల అమలులో టార్చ్ బేరర్ (మార్గ నిర్దేశకుడు)గా నిలిచిన వైఎస్ రాజశేఖరరెడ్డి అమరుడై 11 ఏళ్లు గడిచిపోయాయని, ఆ మహానేత దిశా నిర్దేశం చేసిన మార్గంలోనే గత 16 నెలలుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక రీతిలో సంక్షేమాభివృద్ధి పథకాలను పరుగులు పెట్టిస్తూ.. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలుపుకునే దిశగా చర్యలు చేపట్టడాన్ని హర్షించారు. వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ఛార్జ్ శశాంక్‌రెడ్డి మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల గుండెల్లో చిరంజీవిగా మిగిలిపోయారని ప్రశంసించారు. రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ సంక్షేమ పధకాల ద్వారా ప్రజలతో మమేకమైయ్యారని చెప్పారు. ప్రతి ఊరు బాగుండాలని కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలు చూడకుండా సంక్షేమం కోరుకునే వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు నినాద్‌రెడ్డి అన్నవరం, నాటా నాయకులు సత్య పాటిల్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, సుజిత్ మారం, రామిరెడ్డి , సునీల్, మదన గళ్ల, అర్జున్ కామిశెట్టి, వినీత్ లోక, పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. -
మెంఫిస్ నగరంలో మహానేతకు ఘన నివాళి
టేనస్సీ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ తాతా రాజశేఖర్‌రెడ్డి మెంఫిస్ నగరంలో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కార్యనిర్వాహక వర్గం నాయకులు జైపాల్‌రెడ్డి, వీరమోహన్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, రాజా చెన్నం, రమేష్ సనపాల, సూర్యరెడ్డి, విజయ్‌రెడ్డి చిట్టెం, వైఎస్సార్ అభిమానులు పాల్గొని నివాళులు అర్పించారు. వైఎస్సార్ తన పాలనలో ప్రజల కోసం పలు సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టారని, పేద బలహీన వర్గాల సంక్షేమం కోసం అనుక్షణం పరితపించారని గుర్తు చేసుకున్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, అన్నదాతలకు ఉచిత కరెంట్, జలయజ్ఞం ద్వారా సాగునీరు అందించిన తీరును స్మరించుకున్నారు. వైఎస్సార్ పాలనని తలపిస్తూ రాజన్న ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలు ప్రవేశపెడుతున్న విధానం, విద్యార్థి దశ నుంచే నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న తీరును కొనియాడారు. మరిన్ని కాలాలపాటు జగనన్న ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షించారు. -
వైఎస్సార్ 11వ వర్థంతి: ఆక్లాండ్‌లో రక్తదాన శిబిరం
న్యూజిలాండ్ : మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని పురష్కరించుకుని న్యూజిలాండ్ వైఎస్సార్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం నివాళులు అర్పించింది. సెప్టెంబర్ 2వ తేదీన ఆనంద్ ఎద్దుల నాయకత్వంలో ఆక్లాండ్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్ ఎద్దుల, సుష్మిత చిన్నమలరెడ్డి, సమంత్ దాగెపూడి, శివ గండ, మనోజ్ అల్లం, విజయ్ ఆల్ల, గీతా ఇందూరి, ప్రణవ్ అన్నమరాజు, శ్రీనివాస్ గోట్ల, వినయ్ చంద్రపతి, శ్రద్ధా సాయిలు రక్తదానం చేశారు. న్యూజిలాండ్ వైఎస్సార్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం సభ్యుల కృషిని ఏపీ ఉమెన్స్ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలు అభినందించారు. -
వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ వర్గీయుల దాడి
నాదెండ్ల(చిలకలూరిపేట) : వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి కార్యక్రమాన్ని ముగించుకుని ఇళ్లకు తిరిగి వెళ్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు కత్తులు, రాడ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారు. గుంటూరు జిల్లా నాదెండ్లలోని చినమాలపల్లెలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ముగ్గురు వైఎస్సీర్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. నాదెండ్లలో మహానేత వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి వెళ్తుండగా తమ ఇళ్లపై బాణసంచా కాల్చి వేశారంటూ టీడీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. అంతేకాకుండా కత్తులతో దాడికి తెగబడ్డారు. (నెల్లూరులో బాలుడి కిడ్నాప్ కలకలం) ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వలేరు రాజేష్, రాఘవ, రాజారావులకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ కేవీ నారాయణరెడ్డి ఆసుపత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన 11 మంది టీడీపీ వర్గీయులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రోద్బలంతోనే టీడీపీ వర్గీయులు దాడికి తెగబడ్డారని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. (వరకట్న వేధింపులకు మహిళ మృతి ) -
ప్రజాబాంధవుడు వైఎస్ఆర్
సాక్షి, ఖమ్మం: మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి 11వ వర్థంతిని నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు తుమ్మ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ముస్తాఫనగర్‌లో గల పార్టీ పట్టణ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీచౌక్‌లో గుండపునేని ఉదయ్‌కుమార్, ఎస్కె.నజీర్‌ల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మ అప్పిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ చేసిన మంచి పనులే నేడు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాయని, ఎప్పటికీ ప్రజాబాంధవుడిగా నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు, రాష్ట్ర కార్యదర్శులు మందడపు వెంకట్రామిరెడ్డి, ఆలస్యం సుధాకర్, వేమిరెడ్డి రోశిరెడ్డి, జిల్లా కార్యదర్శులు గాదె వీరా రెడ్డి, మర్రి శ్రీనివాసరావు, పట్టణ అధికార ప్రతినిధి అమర్లపుడి బాలశౌరి, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు ఆదూరి రాజవర్ధన్‌రెడ్డి, రాజా, మొగిలి శ్రీను, పేర్ని త్రివేణి, వాలూరి సత్యనారాయణ, ప్రకాశ్‌రావు, ఎనిక స్వామి, పాసంగులపాటి రాఘవ, మాస్టర్ శ్రీను పాల్గొన్నారు. 13వ డివిజన్లో.. 13వ డివిజన్ కొత్తూరు గ్రామంలో మందడపు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతిని నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు లక్కినేని సుధీర్‌బాబు హాజరై నివాళుర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఆలస్యం సుధాకర్, వేమిరెడ్డి రోశిరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు తుమ్మా అప్పిరెడ్డి, యువజన విభాగం అధ్యక్షులు ఏ.రాజవర్ధన్‌రెడ్డి, నగర అధికార ప్రతినిధి అమర్లపుడి బాలశౌరి, డివిజన్ అధ్యక్షులు కొవ్వూరి శ్రీనివాసరావు, పీ.పాపయ్య, కె.సత్యనారాయణరెడ్డి, ఎం.రామకృష్ణారెడ్డి, పి.వెంకటేశ్వర్లు, పి.సీతారాములు, వేముల వెంకమ్మ, కె.సిలవరాజు, జి.భా స్కర్‌రావు, పి.సాంబయ్య, వెంకటయ్య, పి.వెంకటయ్య, జి.చిన్నగోపయ్య, పి.ధనమూర్తి, సిరిగిరి కృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 15వ డివిజన్లో.. సంబానినగర్ 15వ డివిజన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆలస్యం సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు, రాష్ట్ర కార్యదర్శులు మందడపు వెంకట్రామిరెడ్డి, వేమిరెడ్డి రోశిరెడ్డి, పట్టణ అధ్యక్షులు తుమ్మా అప్పిరెడ్డి, 15వ డివిజన్ అధ్యక్షులు బోనగిరి వెంకటరమణ, డివిజన్ పార్టీ సలహాదారు నాగుబండి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఆలస్యం రవి, సింగిరి పుల్లారెడ్డి జమలాపురం రామకృష్ణ, మర్రి శ్రీనివాస్, వెంకటాచారి, పాపాచారి, ఎస్కె.ఫరీద్, ఆలస్యం నర్సయ్య, ఎస్కె.ఖుర్దూస్, కోటియావ్, రాజుయాదవ్, బొల్లిని నాగరాజు, ఆటో ప్రసాద్ పాల్గొన్నారు. మహోన్నత వ్యక్తి వైఎస్ఆర్: పువ్వాళ్ల ఖమ్మంసహకారనగర్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు ఉచి తంగా వైద్య సేవలు అందించేలా కృషి చేసిన మహోన్నత వ్యక్తి వైఎస్ఆర్ అన్నారు. అనంతరం రాపర్తినగర్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమాల్లో పార్టీ నగర అధ్యక్షులు ఎండీ జావీద్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగండ్ల దీపక్‌చౌదరి, మైనార్టీ సెల్ చైర్మన్ ఎండీ తాజుద్దీన్, నాయకులు గోపాల్, సైదులు వెంకటనారాయణ, రజిని తదితరులు పాల్గొన్నారు. అల్లీపురంలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు రఘునాథపాలెం: నగరంలో సాగర్ కాల్వకట్టపై ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ జిల్లా నాయకుడు పత్తిపాటి అప్పారావు, సొసైటీ డైరెక్టర్ గుండె ఆదినారాయణ, గద్దల నాగేశ్వరరావు, సామినేని ముత్తయ్య, పత్తిపాటి వీరయ్య, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పుఠానితండాలో వైఎస్ఆర్ విగ్రహానికి అభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. మూడు చిన్నా, మూడు శ్యామ్, సునావత్ నందారెడ్డి పాల్గొని నివాళులర్పించారు. కామేపల్లి మండలంలో.. కామేపల్లి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్థంతిని బుధవారం గోవింద్రాల, పండితాపురం, కామేపల్లి, ముచ్చర్ల, జాస్తిపల్లి, మద్దులపల్లి, బాసిత్‌నగర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గింజల నర్సింహారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు బానోత్ వెంకటప్రవీణ్‌కుమార్‌నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళలు అర్పించారు. గోవింద్రాలలో అన్నదానం చేశారు. మద్దులపల్లి, ముచ్చర్ల గ్రామాల్లో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు రుద్ర హనుమంతరావు ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు మద్దినేని రమేష్, ఎంపీటీసీలు రాంరెడ్డి జగన్నాథరెడ్డి, మాళోత్ శంకర్, నాయకులు దేవెండ్ల రామకృష్ణ, రాంరెడ్డి ప్రదీప్‌రెడ్డి, ఆర్.కవిరాజు, డి.అనురాధ, ఆర్.రమేష్‌రెడ్డి, ఎం.భావ్‌సింగ్, శివ, మోహన్, ప్రేమ్‌కుమార్, రాయల భాస్కర్‌రావు, వేణు, బి.ఉపేందర్. జె.లింగయ్య, డి.వెంకటేష్, నాగరాజు, బి.దేవీలాల్, సక్రాం పాల్గొన్నారు. -
అమెరికా: మహానేతకు ఘన నివాళులు
న్యూయార్క్ : మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనను స్వర్ణయుగంగా భావిస్తూ.. ఆయన స్ఫూర్తి, అలోచనలతో ఏర్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జననేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన పేద ప్రజలు, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి అన్ని విధాలుగా అవిశ్రామంగా పనిచేస్తుందని అమెరికాలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ అన్నారు. బుధవారం వైఎస్సార్ 11వ వర్ధంతిని పురష్కరించుకుని ఘన నివాళులు అర్పించారు. సీఎం వైఎస్ జగన్‌ని తండ్రిని మించిన తనయుడుగా యావత్ భారత దేశం కొనియాడుతుందన్నారు. -
మహానేత స్ఫూర్తితోనే వైఎస్ జగన్ పరిపాలన
సాక్షి, అమరావతి: నమ్ముకున్న జనం కోసం ఎంత దూరమైనా పోరాడే తత్వం గల మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని, మాట మీద నిలబడే మనిషిగా ఆయన పేరు తెచ్చుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రభుత్వ వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సరిగ్గా అదే స్ఫూర్తితో ఆయన కుమారుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ 11వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ.. ► తెలుగు వారందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయేలా అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన మహావ్యక్తి వైఎస్సార్ అన్నారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే.. ► వైఎస్సార్ మరణించి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన కోసం పరితపిస్తూ ఎన్నో గుండెలు ఆగిపోయాయి. ఆయన్ను గుర్తు చేసుకుంటే చాలు అందరి కళ్లూ చెమరుస్తాయి. ► బహుశా ఆధునిక చరిత్రలో ఇంతగా వ్యవస్థను ప్రభావితం చేసి, కోట్లాది మంది ప్రజల అభిమానం చూరగొన్న వ్యక్తి మరొకరు లేరు. ఆయన జీవితం నేడు రాజకీయాల్లో ఎందరికో ఆదర్శం. వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో వైఎస్సార్ రాణించారు. ► వైఎస్సార్ అందించిన పరిపాలన, ఆయన వ్యక్తిత్వం లక్షలాది మందిని కార్యకర్తలుగా చేస్తే, అదే రీతిన నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్‌ప్రజా జీవితంలో తీసుకున్న సంచలన నిర్ణయాలు, వైఎస్సార్సీపీ స్థాపన, సుదీర్ఘ పాదయాత్ర, 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లను గెలుపొందడం.. ఇదంతా ఒక చరిత్ర. ► వైఎస్సార్ జీవితం, ఆయన పరిపాలనే సిద్ధాంతంగా ఆయన ఆలోచనలే మార్గదర్శకాలుగా వాటిని మరింత గొప్పగా ముందుకు తీసుకు పోయేందుకు ముఖ్యమంత్రి జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆ మహానేతకు మరణం లేదు. అందరం ఆయన అడుగుజాడల్లో నడవాలి. సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ► విజయవాడలోని కంట్రోల్ రూం వద్ద ఉన్న వైఎస్సార్ పార్క్‌లో రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి నిర్వహించారు. వైఎస్సార్ కాంస్య విగ్రహానికి రాష్ట్ర మంత్రులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ► విశాఖలో జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, మాధవి, ఎమ్మెల్యే అదీప్‌రాజ్ తదితరులు వైఎస్‌కు నివాళులర్పించారు. మంత్రులు, నేతల ఘన నివాళి ► అంతకు ముందు పార్టీ కార్యాలయంలో సజ్జలతో సహా ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాస్, గుమ్మనూరు జయరాం, ఎంపీలు నందిగం సురేష్, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డి వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ► కార్యాలయం కూడలిలో ఉన్న వైఎస్సార్ నిలువెత్తు విగ్రహానికి ముఖ్య నేతలంతా పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మంత్రులు పేద మహిళలకు దుస్తులు పంపిణీ చేశారు. కేంద్ర కార్యాలయ వ్యవహారాల పర్యవేక్షకుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. -
వైఎస్సార్‌కు స్మృత్యంజలి
సాక్షి, కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. బుధవారం వైఎస్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పిస్తున్న సీఎం జగన్, విజయమ్మ, భారతీ రెడ్డి, ఇతర కుటుంబసభ్యులు ► సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణమ్మ, వైఎస్ సోదరులు వైఎస్ రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్ సుధీకర్‌రెడ్డి తదితరులు ఉదయం 8.50 గంటలకు ఘాట్ వద్దకు చేరుకున్నారు. ► పాస్టర్ రెవరెండ్ నరేష్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్‌ను స్మరించుకోవడంతోపాటు ప్రజలకు జరిగిన మేలును గుర్తు చేసుకున్నారు. ► వైఎస్ అందించిన విధంగానే ఆయన తనయుడు రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అదే సందర్భంలో వైఎస్ సతీమణి వైఎస్ విజయమ్మ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ► ప్రత్యేక ప్రార్థనల అనంతరం సీఎం వైఎస్ జగన్‌తోపాటు తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, వైఎస్ జగన్ అత్తమామలు ఈసీ సుగుణమ్మ, ఈసీ గంగిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు వైఎస్ ఘాట్ వద్ద పూల మాలలు ఉంచి అంజలి ఘటించారు. ► డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్‌బాషా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ప్రసాద్‌రాజు, కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సురేష్‌బాబు, ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాలరెడ్డి, జకియాఖానమ్, చక్రాయపేట ఇన్చార్జ్ వైఎస్ కొండారెడ్డి, పరిశ్రమల మౌలిక సదుపాయాలు..పెట్టుబడి సలహాదారు రాజోలి వీరారెడ్డి, కలెక్టర్ హరి కిరణ్, డీఐజీ వెంకట్రామిరెడ్డి, ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, జేసీ గౌతమి, వైఎస్ స్నేహితుడు అయ్యపురెడ్డి సతీమణి సరళాదేవి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ► అందరూ కొద్దిసేపు వైఎస్సార్‌ను స్మరించుకుంటూ మౌనం పాటించారు. సమీపంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి సీఎం వైఎస్ జగన్‌తోపాటు కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ► ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్ వద్ద పులివెందులకు చెందిన జ్యోతి తన బిడ్డను ఆశీర్వదించాలని కోరగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ భారతిరెడ్డిలు బిడ్డను ఒడిలోకి తీసుకుని ఆశీర్వదించారు. హెలిప్యాడ్ వద్ద సీఎం ప్రజల వినతులు స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి విజయవాడకు బయలుదేరారు. పులివెందులకు చెందిన జ్యోతి బిడ్డను ఎత్తుకొని ఆశీర్వదిస్తున్న సీఎం వైఎస్ జగన్ దంపతులు మహానేత జ్ఞాపకాలకు, పథకాలకు ఎప్పటికీ మరణం ఉండదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ మహానేత వైఎస్సార్ శరీరానికి మరణం ఉంటుంది కానీ, ఆయన జ్ఞాపకాలు, పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. తన తండ్రి 11వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ఆయన ట్విట్టర్లో... ‘నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు. ఆ మహానేత శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆయన జ్ఞాపకాలకు, పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదు. నా ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
వైఎస్‌కు ఘనంగా నివాళి
సాక్షి,హైదరాబాద్: దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్‌లో పంజగుట్ట సర్కిల్లోని వైఎస్సార్ విగ్రహానికి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఇతరనాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు వైఎస్సార్‌ను స్మరించుకునే రోజని, ఉమ్మడి ఏపీలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. వైఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతీ గుడిసెకు, గుండెకు చేరుకోవడంతో ప్రజలకు మహానేత చిరస్థాయిగా గుర్తుండిపోతారని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించేందుకు, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలుకు ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. అక్కడ అమలు చేస్తున్న పథకాలను తెలంగాణలోనూ చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, బి.సంజీవరావు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వెల్లాల రాంమోహన్, సేవాదళ్ అధ్యక్షుడు బండారు వెంకటరమణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యాడ మహేష్‌కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు అమృతసాగర్, నేతలు జస్వంత్‌రెడ్డి, పిట్టా రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల హృదయాల్లో చెరగని స్థానం వైఎస్సార్‌కు కాంగ్రెస్ నివాళి సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేదల సంక్షేమమే పరమావధిగా పనిచేసి ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించారని పలువురు కాంగ్రెస్ నేతలు కొనియాడారు. వైఎస్సార్ 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్, అసెంబ్లీలోని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) కార్యాలయాల్లో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ నాయకులు మల్లు రవి, బొల్లు కిషన్, అఫ్జలుద్దీన్, కుమార్ రావ్, ప్రేమ్ లాల్ తదితరులు పాల్గొన్నారు. సీఎల్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. -
బెంగళూరులో వైఎస్సార్‌కు ఘన నివాళి
సాక్షి, బెంగళూరు : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి పురస్కరించుకొని ఆయనను బెంగళూరులోని తెలుగు ప్రజలు స్మరించుకున్నారు. ఇడమకంటి లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయ కళామందిరంలో సంస్మరణ సభ నిర్వహించి వైఎస్సార్‌కు ఘన నివాళులర్పించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు కేసీ రామ్మూర్తి, కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ రాధాకృష్ణరాజు, డాక్టర్ బలవీరారెడ్డి, ధనుంజయరెడ్డి, సుదాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దివంగత నేత వైఎస్సార్ సతీమణి విజయమ్మ రచించిన ‘నాలో నాతో వైఎస్సార్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేసీ రామ్మూర్తి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజకీయక్షేత్రంలో ధీమంత నాయకునిగా చెరగని ముద్రవేసిన వైఎస్సార్.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని కొనియాడారు. ఆయన చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా యావత్ భారతదేశం అనుసరిస్తుందని ప్రశంసించారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. దివంగత రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాల వలే తాము ఎమ్మెల్యేలుగా గెలిచామని చెప్పారు. ఆ మహనీయుడు వేసిన బాటే తమకు మార్గదర్శకమని, ఆయన బాటలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారని కొనియాడారు. ఇక సభను ప్రారంభించిన తెలుగు విజ్ఞానసమితి అధ్యక్షుడు డాక్టర్ రాధాకృష్ణరాజు మాట్లాడుతూ..భారతదేశ చరిత్రలో స్వయంకృషితో, ప్రతిభతో ఎదిగి ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా అయింది కేవలం ఎంజీఆర్, ఎన్టీఆర్, వైఎస్సార్ మాత్రమేనని పేర్కొన్నారు. వైఎస్సార్ స్వయం కృషితో ఎదిగారుకాబట్టే.. ఇప్పటికీ ఆయన పేరుతో స్థాపించిన రాజకీయపార్టీ అధికారంలో ఉందని ప్రశంసించారు. వైఎస్సార్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాల ప్రతిఫలమే నేడు వైస్సార్సీపీని అధికారంలోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ‘నాలో నాతొ వైఎస్సార్’ పుస్తకాన్ని సభకు పరిచయం చేసిన పూర్వ ఉపకులపతి, డాక్టర్ బలవీరారెడ్డి మాట్లాడుతూ.. విజయమ్మ రాసిన పుస్తకం సామాన్యుడిని కూడా వైఎస్సార్‌కు దగ్గర చేసేలా ఉందన్నారు. వైఎస్సార్ రాజకీయ వ్యక్తిత్వానికి నిలువుటద్దం ఈ పుస్తకం అని కొనియాడారు. ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్, హీందీ భాషల్లో కూడా అనువాదం చేసి దేశ ప్రజలతో పాటు, భావితరాలకు వైఎస్సార్ గొప్పతనాన్ని తెలియజేయాలని అభిప్రాయపడ్డారు. -
‘వైఎస్సార్ పాలనలో లబ్ధి పొందని గడప లేదు’
సాక్షి, కృష్ణా : అనేక సంక్షేమ పథకాలతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారని పెనమలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. నేడు వైఎస్సార్ తమ మధ్య లేకపోవడం ప్రతి పేదవాడికి తీరనిలోటు అని పేర్కొన్నారు. బుధవారం వైఎస్సార్ 11వ వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ నియోజకవర్గంలో పార్టీలకతీతంగా అందరూ వైఎస్సార్‌కు ఘనమైన నివాళులు ఆర్పిస్తున్నారని తెలిపారు. ఆయన పాలనలో రాష్ట్రంలో లబ్ధి పొందని ఇంటి గడప లేదని వ్యాఖ్యానించారు. (ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోంది) కుల,మత,పార్టీలు చూడకుండా పేదవారందరికి పధకాల ద్వారా మేలు చేశారని పార్థసారధి గుర్తు చేసుకున్నారు. పేదవాడి చదువుకై విప్లవాత్మక ఆలోచన చేసి..పేద పిల్లలు చదివితే ఆ కుటుంబాల అభివృద్ధి చెందుతాయని ఫీజు రీయింబర్స్మెంట్ తెచ్చారన్నారు. పేదలందరికి ఇళ్ళు కట్టించిన గొప్ప వ్యక్తి, మొదటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కీర్తించారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారికోసం ఆరోగ్య శ్రీ తీసుకు వచ్చారని, దీని వల్ల పేదోడు కూడా కోటేశ్వరుడితో సమానంగా వైద్యం పొందేలా చేశారని కొనియాడారు.(‘పశ్చిమ’ తీరం.. అభివృద్ధి సమీరం) ‘మన అదృష్టం కొద్ది ఆయన తనయుడు మన ముఖ్యమంత్రిగా వచ్చి ఆయన ఆశయాలు నెరవేర్చుతున్నారు. నాన్న ఒక్క అడుగు వేస్తే రెండడుగులు వేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట ఇచ్చారు. చెప్పిన రీతిలోనే తండ్రి రీయింబర్స్మెంట్ తీసుకు వస్తే తనయుడు అమ్మ ఒడితో పేదలకు అండగా నిలబడ్డారు. తండ్రి 45 లక్షల ఇళ్లు కడితే విభజిత రాష్టంలో 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. పేదల పాలిట నిజమైన దేవుడు జగన్మోహన్రెడ్డి’ అని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. (రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు) -
ఏ సీఎం కూడా ఆయనలా చేయలేదు: మంత్రి
సాక్షి, పశ్చిమ గోదావరి: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. బుధవారం వైఎస్సార్ 11వ వర్థంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలోని రాజాశేఖరరెడ్డి విగ్రహాంతో పాటు కొవ్వూరు పట్టణంలోని ఆయన విగ్రహాలకు మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదే విధంగా పేదలకు వస్త్రాలు పంపిణీ చేయడమే కాకుండా వృద్ధులకు పండ్లు,రొట్టెలు పంచారు. అలాగే టీడీపీకి చెందిన పలువురు కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ హయాంలో చాలా మంది ముఖ్యమంత్రులు పని చేశారన్నారు. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల కోసం పని చేసినట్లుగా ఏ సీఎం కూడా చేయలేదన్నారు. తండ్రి అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుస్తున్నారని, తండ్రిలాగే పేదల పక్షపాతిగా ఆయన పని చేస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. -
చిన్నారికి సీఎం దంపతుల ఆశీర్వాదం
సాక్షి, వైఎస్సార్ కడప: సంక్షేమ సారథిగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా నేతగా మన్ననలందుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఆప్తుడిగా మారి చేయూతనందిస్తున్నారు. ప్రజా రంజక పాలనతోపాటు తన వద్దకు వచ్చే అభిమానులను చిరునవ్వుతో పలకరిస్తూ తండ్రిని తలపిస్తున్నారు. ఇక ఇడుపులపాయలో మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ పార్టీ కార్యకర్తలు, స్థానికులతో మాట్లాడారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈక్రమంలోనే జ్యోతి అనే మహిళా అభిమాని సీఎం జగన్ దంపతులను కలుసుకుని తన బాబును ఆశీర్వదించాలని కోరారు. సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి చిన్నారిని చేతుల్లోకి తీసుకుని ఆశీర్వదించారు. (చదవండి: అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్) -
తెలంగాణ వ్యాప్తంగా మహానేతకు ఘన నివాళులు
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం తెలంగాణ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, కాంగ్రెస్ నేతలు, ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు. నగరంలోని పంజాగుట్ట సర్కిల్లో డాక్టర్ వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాన్నివైఎస్సార్‌సీపీ నేతలు నిర్వహించారు. తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రపుల్‌రెడ్డి, అమృతాసాగర్ పాల్గొన్నారు. హైదరాబాద్: పంజాగుట్ట సర్కిల్లో డాక్టర్ వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మల్లురవి, అంజన్‌కుమార్ యాదవ్, ఫిరోజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ సేవలు చిరస్మరణీయని కొనియాడారు. సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి కాంగ్రెస్‌పార్టీ శాసనసభ పక్షనేత మల్లు భట్టి విక్రమార్క పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, అభిమానులు పాల్గొన్నారు. కరీంనగర్: మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ కార్యాలయంలో వైఎస్సార్ చిత్ర పటానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు పాల్గొన్నారు. జగిత్యాల: మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు వైఎస్సార్ అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కరీంనగర్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డితో పాటు పార్టీ నాయకులు పూల మాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ చౌక్‌లో వైఎస్సార్ చిత్ర పటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పూల మాల వేసి నివాళులర్పించారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన స్వగృహంలో వైఎస్సార్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైస్సార్ సేవలను కొనియాడారు. మహానేత వైఎస్సార్ మన నుంచి దూరమై పదకొండు సంవత్సరాలు అవుతోందని, ఆయన చేసిన మేలు ప్రజలు మరవలేక పోతున్నారని తెలిపారు. మరువలేని మరపురాని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో ఉన్నారని, అలాంటి నాయకుడిని మళ్లీ చూడలేమని తెలిపారు. వైఎస్సార్‌ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి కార్యకర్త పని చేయాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి డీసీసీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. జిల్లాలోని మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి మంథని కాంగ్రెస్‌పార్టీ నాయకులు పూల మాల వేసి నివాళులర్పించారు. గద్వాల: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా గద్వాలలోని వైఎస్సార్ విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి పూల మాల వేసి నివాళులు అర్పించారు. వనపర్తి: జిల్లాలోని వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. నారాయణపేట: మక్తల్ మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పార్టీ నాయకులు పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నాగర్ కర్నూల్: కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఘనంగా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల వద్ద అభిమానులు నివాళులు అర్పించారు. కొల్లాపూర్‌లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వైఎస్సార్సీపీ నాయకులు రామకృష్ణ, వెంకట్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు. ఎంపీడీఓ కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రాము యాదవ్ పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ టౌన్ ప్రెసిడెంట్ కొండూరు ప్రమోద్ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ, బూర్గంపాడు మండలంలోని సారపాకలో మాజీ ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ 11వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జిల్లా వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షుడు కొల్లు వెంకటరెడ్డి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం: దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా సత్తుపల్లి పట్టణంలోని వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పూల మాల వేసి నివాళులర్పించారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా మధిరలో ఆయన విగ్రహానికి వైఎస్సార్సీపీ నాయకులు ఉమా మహేశ్వర్‌రెడ్డి, అజాద్, ధర్మయ్య, మస్తాన్ పాషా పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. -
ఇచ్ఛాపురంతో విడదీయలేని అనుబంధం
చెరిగిపోని సంక్షేమ సంతకం.. చెదిరిపోని మధుర జ్ఞాపకం.. పాలించింది ఐదేళ్లే అయినా తరతరాలు తలచుకునేలా రామరాజ్యాన్ని అందించిన మహానుభావుడు. రాజకీయాలతో సంబంధం లేని.. జెండాలతో నిమిత్తం లేని అజెండా ఆయనది. అందరికీ మంచి జరగాలన్నదే ఆయన ఆశయం. మిత్రుడికే కాదు శత్రువుకు సైతం మేలు చేయాలన్నదే ఆయన నైజం. అందుకే అందరి మనసులను గెలిచాడు. చిరంజీవిగా నిలిచాడు. సాక్షి, శ్రీకాకుళం: మానవత్వం, దయాగుణం ఉన్న మహా మనీషి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో వైఎస్సార్‌ను చూస్తే తెలుస్తుంది. ఆరోగ్యవంతంగా రాష్ట్రం ఉన్నప్పుడే అభివృద్ధి పథంలో పయనిస్తుందని నమ్మిన మహా వ్యక్తి ఆయన. రాజకీయంగా ఎక్కడ కనుమరుగైపోతామోనన్న భయంతో కొందరు ఆరోగ్యశ్రీపై రకరకాల విమర్శలు చేసినా వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వ నిధులను కార్పొరేట్ ఆసుపత్రులకు దోచిపెడుతున్నారని అరిచినా పట్టించుకోలేదు. నిరాటంకంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి లక్షలాదిమంది ప్రాణాలు నిలిచారు. దేశంలోనే ఒక అద్భుత పథకంగా చూపించారు. మాట ఇచ్చామంటే నిలబడాలి. మాట మీద నిలబడ్డ వాడే నాయకుడు. ఇచ్చిన హామీలనే కాకుండా పరిస్థితులకు తగ్గట్టుగా, ప్రజా అవసరాల దృష్ట్యా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేసినవాడే ప్రజా నాయకుడవుతారు. అలా కావాలంటే దయాగుణం, మానవత్వం, స్పందించేతత్వం ఉండాలి. అవన్నీ ఉంటూ ప్రజల బాధలకు పరిష్కారం చూపినవాడే మంచి పాలకుడిగా భావిస్తారు. అదంతా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిలో కన్పించింది. ఆయనున్నంతకాలం ప్రజల మేలుకోరి పనిచేశారు. ‘పాదయాత్రలో గుర్తించిన సమస్యలకు పరిష్కారం చూపడమే కాకుండా ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన ఘనత వైఎస్‌కే దక్కింది. హామీ ఇవ్వకుండా కూడా అనేక పథకాలు ప్రవేశ పెట్టి ప్రజానేత అయ్యారు. జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. చెరపలేని సంతకంగా... చెరిగిపోని జ్ఞాపకంగా అందరిలోనూ చిరస్మరణీయుడయ్యాడు. ఇప్పుడా మహానేత బాటలోనే ఆయన తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుస్తున్నారు. నమ్మిన సిద్ధాంతంతో... వైఎస్సార్ ఆశయ సాధనతో... పేద ప్రజల కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. జిల్లాలో రాజన్న జాడలివి.. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకే విశాఖపట్నానికి పరుగులు తీసే చిక్కోలు ప్రజలకు ఓ పరిష్కారం చూశారు. శ్రీకాకుళానికి ఓ పెద్దాసుపత్రి ఉండాల్సిందేనని భావించి ప్రజలు కోరకుండానే ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేశారు. మంజూరు ప్రకటన చేయడమే కాకుండా రూ. 119 కోట్లు కేటాయించారు. 300 పడకల జిల్లా కేంద్ర ఆసుపత్రిని 500 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. ఏటా జిల్లా నుంచి వందల మంది వైద్యులను తయారు చేసే సంస్థను జిల్లాలో పెట్టారు. శంకుస్థాపన, ప్రారంభోత్సవం రెండూ ఆయన చేతుల మీదుగానే జరిగాయి. 13 ఆధునిక వసతులతో కూడిన భవనాలను మంజూరు చేశారు. కానీ వైఎస్సార్ మరణం తర్వాత దాని కోసం పట్టించుకున్న నాథుడు కరువయ్యాడు. మళ్లీ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రిమ్స్‌లో అభివృద్ధి అడుగులు పడుతున్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రాణంపోసుకున్నవారు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత విద్య అభ్యసించిన విద్యార్థులు వైఎస్సార్ పటాన్ని ఇంట్లో పెట్టుకొని పూజించుకుంటారు. విశ్వవిద్యాలయం ఆయన పుణ్యమే సిక్కోలు జిల్లాకు 1980 నుంచి గ్రామీణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఉద్యమాలు జరిగాయి. ప్రభుత్వాలు అనేక కమిటీలు కూడా వేశాయి. కానీ విశ్వవిద్యాలయం ఏర్పాటు కాలేదు. ప్రతీ జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని వైఎస్సార్ భావించారు. ఆ ఆలోచనకు ప్రతిరూపంగా ఎచ్చెర్లలోని బీఆర్‌ఏయూ యూనివర్సిటీ ఏర్పాటైంది. 2008 జూలై 25న డాక్టర బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడీ వర్సిటీ గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఉన్నత విద్యావేత్తలుగా తీర్చిదిద్దుతున్నది. రైతు పక్షపాతిగా.. నదులున్నా పొలాలు తడవని పరిస్థితి. భూములున్నా సాగు చేసుకోలేని దుస్థితి. సాగు చేద్దామని భావించినా అప్పు పుట్టని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకున్న ఏకైక నేత వైఎస్సారే. 2.50 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేశారు. అప్పటికే రుణాలు చెల్లించేసిన వారికి రూ.5 వేలు చొప్పున ప్రోత్సాహం అందించారు. అంతటితో ఆగకుండా ప్రతీ చుక్కనీటిని అందిపుచ్చుకుని, రైతుకు అందించాలని కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా తోటపల్లి ఫేజ్ 2, వంశధార రెండో దఫా ప్రాజెక్టును, టెక్కలి నియోజకవర్గంలోని ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 2005 మే నెలలో వంశధార స్టేజ్ 2, ఫేజ్ 2 ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. 20 మండలాల్లో 2.55 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు తలపెట్టారు. వంశధార రిజర్వాయర్ నిర్మాణానికి రూ.970 కోట్లు విడుదల చేశారు. హిరమండలం వద్ద సుమారు 10 వేల ఎకరాల్లో 19 టీఎంసీల నీటి నిల్వ కోసం చేపట్టిన వంశధార రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే రైతులకు సాగునీటి కష్టాలు తీరినట్టే. వంశధార కుడి, ఎడమ కాలువలతో పాటు వంశధార, నాగావళి నదుల అనుసంధానం పనులు పూర్తయితే 2.55 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని వైఎస్సార్ అప్పట్లో పనులకు శ్రీకారం చుట్టారు. 12,500 ఎకరాల సాగునీటి కోసం మడ్డువలస ప్రాజెక్టు స్టేజ్ 1 పనులను రూ.57.87 కోట్లతో చేపట్టారు. సాగునీరు, పలాస పట్టణానికి తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ. 123.25 కోట్లతో ఆఫ్‌షోర్ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. నాగావళి, వంశధార నదుల వరద ఉద్ధృతి నుంచి పంట పొలాలను, ఆవాసాలను రక్షించేందుకు రూ.300 కోట్లతో కరకట్టల నిర్మాణాలకు సంకల్పించారు. సీతంపేట ఏజెన్సీలో 14 వేల ఎకరాల్లో 5 వేల మందికి గిరిజన రైతులకు పట్టాలు ఇచ్చారు. పేదలకు లక్షా 80 వేల సొంతిళ్లు పేదలకు సొంతింటి కల నెరవేర్చారు. పక్కా స్థలమిచ్చి గూడు కట్టారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2006–07 నుంచి వరుస మూడేళ్లు ఇందిరమ్మ ఇళ్లు పథకం పేరిట పేదలందరికీ కుల, మత, వర్గ, రాజకీయ భేదాలు లేకుండా ఇళ్లను అందించారు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బు సరిపడని లబ్ధిదారులు డ్వాక్రా సంఘాల్లో ఉంటే వారికి మరో రూ.20 వేలు అదనంగా బ్యాంకుల నుంచి రుణం ఇప్పించి పక్కా ఇళ్లను నిర్మించకునేందుకు ప్రోత్సహించారు. ఇందిరమ్మ పథకం కింద 2006–07లో 71,141 ఇళ్లను, 2007–08లో 70,435 ఇళ్లను మంజూరు చేసి వాటిలో 61,754 ఇళ్లను పూర్తి చేశారు. మూడో విడతగా 42,800 ఇళ్లను మంజూరు చేయగా 39,240 ఇళ్లను నిర్మించి మూడేళ్లలో చరిత్రలో ఎక్కడా లేని విధంగా లక్షా 80 వేల 817 ఇళ్లు మంజూరు చేసి అందులో లక్షా 63 వేల 140 ఇళ్లను పూర్తి చేసిన ఘనత వైఎస్సార్‌కు దక్కింది. ఇచ్ఛాపురంతో విడదీయలేని అనుబంధం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఓ ప్రభంజనం. ప్రజల బాధలు వింటూ, కన్నీళ్లు తుడుస్తూ సాగిన ప్రజాప్రస్థానం ఓ చరిత్ర. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించి వైఎస్సార్ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో తన యాత్ర ముగించారు. అందుకు గుర్తుగా అక్కడ విజయస్థూపం నిర్మించారు. 2003 ఏప్రిల్ 9న పాదయా త్ర ముగింపు రోజున స్థూపాన్ని ఆవిష్కరించారు. వైఎస్సార్ తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కుమార్తె వైఎస్ షర్మిల పాదయాత్రల ముగింపునకు కూడా ఇదే వేదిక కావడం విశేషం.