ప్రజాబాంధవుడు వైఎస్‌ఆర్‌ | YS Rajasekhara Reddy Death Anniversary Celebrations In Khammam | Sakshi
Sakshi News home page

వాడవాడలా వైఎస్సార్‌ వర్ధంతి

Published Thu, Sep 3 2020 11:15 AM | Last Updated on Thu, Sep 3 2020 11:20 AM

YS Rajasekhara Reddy Death Anniversary Celebrations In Khammam - Sakshi

నగర పార్టీ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న లక్కినేని సుధీర్‌బాబు, అప్పిరెడ్డి

సాక్షి, ఖమ్మం‌: మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి 11వ వర్థంతిని  నగర వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు తుమ్మ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ముస్తాఫనగర్‌లో గల పార్టీ పట్టణ కార్యాలయంలో వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీచౌక్‌లో గుండపునేని ఉదయ్‌కుమార్, ఎస్‌కె.నజీర్‌ల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మ అప్పిరెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ చేసిన మంచి పనులే నేడు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాయని, ఎప్పటికీ ప్రజాబాంధవుడిగా నిలిచిపోయారన్నారు.  కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు, రాష్ట్ర కార్యదర్శులు మందడపు వెంకట్రామిరెడ్డి, ఆలస్యం సుధాకర్, వేమిరెడ్డి రోశిరెడ్డి, జిల్లా కార్యదర్శులు గాదె వీరా రెడ్డి, మర్రి శ్రీనివాసరావు, పట్టణ అధికార ప్రతినిధి అమర్లపుడి బాలశౌరి, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు ఆదూరి రాజవర్ధన్‌రెడ్డి, రాజా, మొగిలి శ్రీను, పేర్ని త్రివేణి, వాలూరి సత్యనారాయణ, ప్రకాశ్‌రావు, ఎనిక స్వామి, పాసంగులపాటి రాఘవ, మాస్టర్‌ శ్రీను పాల్గొన్నారు. 

13వ డివిజన్‌లో.. 
13వ డివిజన్‌ కొత్తూరు గ్రామంలో మందడపు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ వర్ధంతిని నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు లక్కినేని సుధీర్‌బాబు హాజరై  నివాళుర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.  పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఆలస్యం సుధాకర్, వేమిరెడ్డి రోశిరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు తుమ్మా అప్పిరెడ్డి, యువజన విభాగం అధ్యక్షులు ఏ.రాజవర్ధన్‌రెడ్డి, నగర అధికార ప్రతినిధి అమర్లపుడి బాలశౌరి, డివిజన్‌ అధ్యక్షులు కొవ్వూరి శ్రీనివాసరావు, పీ.పాపయ్య, కె.సత్యనారాయణరెడ్డి, ఎం.రామకృష్ణారెడ్డి, పి.వెంకటేశ్వర్లు, పి.సీతారాములు, వేముల వెంకమ్మ, కె.సిలవరాజు, జి.భా స్కర్‌రావు, పి.సాంబయ్య,  వెంకటయ్య, పి.వెంకటయ్య, జి.చిన్నగోపయ్య, పి.ధనమూర్తి, సిరిగిరి కృష్ణారెడ్డి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 

15వ డివిజన్‌లో..
సంబానినగర్‌ 15వ డివిజన్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆలస్యం సుధాకర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.   జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు, రాష్ట్ర కార్యదర్శులు మందడపు వెంకట్రామిరెడ్డి, వేమిరెడ్డి రోశిరెడ్డి, పట్టణ అధ్యక్షులు తుమ్మా అప్పిరెడ్డి, 15వ డివిజన్‌ అధ్యక్షులు బోనగిరి వెంకటరమణ, డివిజన్‌ పార్టీ సలహాదారు నాగుబండి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఆలస్యం రవి, సింగిరి పుల్లారెడ్డి జమలాపురం రామకృష్ణ, మర్రి శ్రీనివాస్, వెంకటాచారి, పాపాచారి, ఎస్‌కె.ఫరీద్, ఆలస్యం నర్సయ్య, ఎస్‌కె.ఖుర్దూస్, కోటియావ్, రాజుయాదవ్, బొల్లిని నాగరాజు, ఆటో ప్రసాద్‌  పాల్గొన్నారు. 

మహోన్నత వ్యక్తి వైఎస్‌ఆర్‌: పువ్వాళ్ల 
ఖమ్మంసహకారనగర్‌: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ  ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు ఉచి తంగా వైద్య సేవలు అందించేలా కృషి చేసిన మహోన్నత వ్యక్తి వైఎస్‌ఆర్‌ అన్నారు. అనంతరం రాపర్తినగర్‌ సెంటర్‌లోని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమాల్లో పార్టీ నగర అధ్యక్షులు ఎండీ జావీద్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నాగండ్ల దీపక్‌చౌదరి, మైనార్టీ సెల్‌ చైర్మన్‌ ఎండీ తాజుద్దీన్, నాయకులు గోపాల్, సైదులు వెంకటనారాయణ, రజిని తదితరులు పాల్గొన్నారు. 

అల్లీపురంలో ఘనంగా వైఎస్‌ఆర్‌ వర్ధంతి వేడుకలు
రఘునాథపాలెం: నగరంలో సాగర్‌ కాల్వకట్టపై ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ జిల్లా నాయకుడు పత్తిపాటి అప్పారావు, సొసైటీ డైరెక్టర్‌ గుండె ఆదినారాయణ, గద్దల నాగేశ్వరరావు, సామినేని ముత్తయ్య, పత్తిపాటి వీరయ్య, ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పుఠానితండాలో  వైఎస్‌ఆర్‌ విగ్రహానికి అభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. మూడు చిన్నా, మూడు శ్యామ్, సునావత్‌ నందారెడ్డి పాల్గొని నివాళులర్పించారు.

కామేపల్లి మండలంలో..
కామేపల్లి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి  వర్థంతిని బుధవారం గోవింద్రాల, పండితాపురం, కామేపల్లి, ముచ్చర్ల, జాస్తిపల్లి, మద్దులపల్లి, బాసిత్‌నగర్‌ గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు గింజల నర్సింహారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు బానోత్‌ వెంకటప్రవీణ్‌కుమార్‌నాయక్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళలు అర్పించారు. గోవింద్రాలలో అన్నదానం చేశారు. మద్దులపల్లి, ముచ్చర్ల గ్రామాల్లో వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షులు రుద్ర హనుమంతరావు ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. కాంగ్రెస్‌ జిల్లా నాయకులు మద్దినేని రమేష్, ఎంపీటీసీలు రాంరెడ్డి జగన్నాథరెడ్డి, మాళోత్‌ శంకర్, నాయకులు దేవెండ్ల రామకృష్ణ, రాంరెడ్డి ప్రదీప్‌రెడ్డి, ఆర్‌.కవిరాజు, డి.అనురాధ, ఆర్‌.రమేష్‌రెడ్డి, ఎం.భావ్‌సింగ్, శివ, మోహన్, ప్రేమ్‌కుమార్, రాయల భాస్కర్‌రావు,  వేణు, బి.ఉపేందర్‌. జె.లింగయ్య, డి.వెంకటేష్, నాగరాజు, బి.దేవీలాల్, సక్రాం పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement