వాడవాడలా వైఎస్సార్‌కు నివాళులు | Tributes To YS Rajasekhara Reddy All Over Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వాడవాడలా వైఎస్సార్‌కు నివాళులు

Published Fri, Sep 3 2021 5:11 AM | Last Updated on Fri, Sep 3 2021 5:11 AM

Tributes To YS Rajasekhara Reddy All Over Andhra Pradesh - Sakshi

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న సజ్జల తదితరులు

సాక్షి నెట్‌వర్క్‌: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతిని గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. నగరాలు, పట్టణాలు, పంచాయతీల్లో వాడవాడలా వైఎస్సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అన్నదానాలు, వస్త్రదానాలు చేశారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. గుంటూరు జిలాలో జరిగి కార్యక్రమాల్లో మంత్రులు సుచరిత, శ్రీరంగనాథరాజు, ప్రభుత్వవిప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, ఎంపీలు మోపిదేవి, శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి రక్తదానం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ప్రతాప్‌ కుమార్‌రెడ్డి, సంజీవయ్య, వరప్రసాద్‌రావు, నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ విగ్రహాలకు క్షీరాభిషేకం
కర్నూలు జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు క్షీరాభిషేకం చేసి, రోగులకు పండ్లు, బ్రెడ్‌ పంపిణీ చేశారు. మంత్రి జయరాం, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, బాలనాగిరెడ్డి, కర్నూలు మేయర్‌ రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి.మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు వెలంపల్లి, కొడాలి నాని, ఎమ్మెల్సీ కరిమున్నీసా, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, ఉదయభాను, జగన్మో హనరావు, మేకా ప్రతాప్‌ అప్పారావు, కృష్ణప్రసాద్, రక్షణనిధి, సింహాద్రి రమేష్‌బాబు, జోగి రమేష్, దూలం నాగేశ్వరరావు, అనిల్‌కుమార్, పార్థసారథి, విజయవాడ మేయర్‌ భాగ్యలక్ష్మి, కార్పొరేటర్‌ మణిమ్మ, వైఎస్సార్‌సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు భవకుమార్, విజయవాడ ఈస్ట్‌ ఇన్‌చార్జి అవినాష్‌ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీలు రెడ్డెప్ప, గురుమూర్తి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి మేయర్‌ డాక్టర్‌ శిరీష, డిప్యూటీ మేయర్లు అభినయ్‌రెడ్డి, నారాయణ, పార్టీ నగర అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. 

‘అనంత’ స్మరణ
అనంతపురం జిల్లా ప్రజలు వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు. మంత్రి జయరాం, ఎంపీ రంగయ్య, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, తిప్పేస్వామి, ఉషశ్రీచరణ్, పీవీ సిద్ధారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పద్మావతి, ప్రకాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు నదీమ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా లొల్లలో వైఎస్సార్‌ విగ్రహానికి ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రైతులు క్షీరాభిషేకం చేశారు. పంట పొలాల మధ్య 250 మంది రైతులను సత్కరించారు. రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రక్తదానం చేశారు.

జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి íవిశ్వరూప్, ఎంపీలు గీత, భరత్‌రామ్, ఎమ్మెల్యే చంటిబాబు, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వైఎస్సార్‌తో పాటు హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆయన చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ వెస్లీ విగ్రహానికి పూలమాలలు వేశారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం కృష్ణదాస్, స్పీకర్‌ సీతారాం తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే లు వీరభద్రస్వామి, జోగారావు, వెంకట చిన అప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు, అప్పలనర్సయ్య, రాజన్నదొర, వైఎస్సార్‌ సీపీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ట్రైసైకిళ్ల పంపిణీ
డాక్టర్‌ వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పేదలకు దుప్పట్లు, వికలాంగులకు ట్రైసైకిళ్లు, ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు, బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. దుగ్గిరాలలో ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఆధ్వర్యంలో డాక్టర్‌ అంబేడ్కర్, డాక్టర్‌ వైఎస్సార్‌ విగ్రహాలను ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లాలో సేవా కార్యక్రమాలు జరిగాయి. విశాఖలోని వైఎస్సార్‌సీపీ నగర కార్యాలయంలోను, బీచ్‌రోడ్డులోను వైఎస్సార్‌ విగ్రహాలకు ఎంపీ విజయసాయిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనందపురం మండలం కల్లివానిపాలెంలో వైఎస్సార్‌ విగ్రహాన్ని మంత్రి ముత్తంశెట్టి ఆవిష్కరించారు.

భీమిలిలోని మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహిం చి, అన్నదానం చేశారు. వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ మధురెడ్డి రక్తదానం చేశారు. జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్‌యాదవ్, జకియాఖానం, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రఘురామిరెడ్డి, మల్లికార్జునరెడ్డి, ప్రభుత్వ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, కడప మేయర్‌ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే అమర్‌నా థ్‌రెడ్డి, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్‌ దేవనాథరెడ్డి, మున్సి పల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా, నేతలు వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ అభిషేక్‌ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, మేడా రఘునాథరెడ్డి, మేడా భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement