సాక్షి కడప : దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో ఇడుపులపాయలోని డాక్టర్ వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఇడుపులపాయలోని డాక్టర్ వైఎస్సార్ సమాధి ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రధానంగా రెవరెండ్ పాస్టర్లు ఆనంద్‌బాబు, నరేష్‌బాబు, మృత్యుంజయరావులు అక్కడనే ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ౖవైఎస్సార్‌తో తమకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు.
ఎప్పటికీ మరిచిపోలేని మహానేతగా వైఎస్సార్ మిగిలిపోయారని... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికూడా సంక్షేమ పథకాలను అన్ని వర్గాలకు అందిస్తూ పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారని పాస్టర్లు కొనియాడారు. ప్రార్థన కార్యక్రమం సందర్భంగా వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ సమాధి ఘాట్ వద్ద వైఎస్సార్‌ను తలుచుకుని కొద్దిసేపు భావోద్వేగానికి గురయ్యారు.
ప్రార్థనల్లో డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా, జిల్లా ఇన్‌చార్జిమంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తుడా చైర్మన్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియాఖానమ్, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, డాక్టర్ సుద, టీజే సుధాకర్‌బాబు, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, కడప నగర మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్సీలు పి.రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు వైఎస్ కొండారెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ అభిషేక్‌రెడ్డి, యువ నాయకులు అర్జున్‌రెడ్డి, మైదుకూరు సమన్వయకర్త నాగిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఇరగంరెడ్డి తిరుపేలరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పి.శివ ప్రసాద్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గిరిధర్‌రెడ్డిలు పాల్గొన్నారు. ప్రార్థనలనంతరం వైఎస్సార్ వర్దంతి సందర్బంగా ఘాట్ వద్ద అందరూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.
ప్రజాప్రతినిధులు, ప్రజలతో కాసేపు
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ ప్రాంగణంతోపాటు హెలిప్యాడ్ వద్ద కొద్దిసేపు ప్రజలతో మమేకమయ్యారు. అలాగే సీఎం వైఎస్ జగన్, మంత్రులను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పేరుపేరునా పలకరించారు. ప్రజలతో కాసేపు సమస్యలపై వినతులు స్వీకరించారు. ప్రార్థనలనంతరం నేరుగా వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కాసేపు గడిపారు. ముఖ్యమంత్రి వైఎస్సార్ గెస్ట్‌హౌస్ వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అలాగే బ్రహ్మకుమారీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాఖీలు కట్టారు.
► ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, ప్రొద్దుటూరు, చంద్రగిరి ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ గణేష్‌కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్‌ఎస్ ప్రవీణ్‌చంద్, పాడా ఓఎస్‌డీ అనిల్‌కుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ నరేన్ రామాంజురెడ్డిలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఇడుపులపాయ హెలిప్యాడ్ వద్ద టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవివాష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రయ్య,రామసుబ్బారెడ్డి ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట ముఖ్య కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కె.నాగేశ్వరరెడ్డిలు ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపధ్యంలో జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment