YSR District News
-
సొంతంగా ఏ పని చేసుకోలేని వారు.. కొందరు పుట్టుకతో.. ఇంకొందరు అనారోగ్యం కారణంగా వైకల్యం బారిన పడిన వారు.. వీరంతా నిరుపేదలు. ప్రభుత్వ సాయంతోనే నాలుగు ముద్దలు నోటికాడికి వెళ్తాయన్న దివ్యాంగులు వీరు. అయితే వీరి పింఛన్లలో కోత పెట్టాలని కూటమి నిర్ణయించింది. పునః
● సదరంలో దివ్యాంగుల అగచాట్లు ● కుటుంబ సభ్యుల అపసోపాలు ● అర్హత ఉన్నా తప్పని పునఃపరిశీలన ● అందుబాటులో లేని వీల్చైర్లు, స్ట్రెచర్లు ● రిమ్స్‌లో కనీస సౌకర్యాలు కరువుకడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి సర్టిఫికెట్ల పునః పరిశీలన కోసం వస్తున్న దివ్యాంగులలో దయనీయస్థితిలో వున్నవారు లేకపోలేదు. ఇందుకు ప్రత్యక్షంగా ఈ నెల 2,3 తేదీలలో ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. మంచానికి, వీల్చైర్లకే పరిమితమై, వారి వ్యక్తిగత పనులను కూడా కుటుంబ సభ్యులపై ఆధారపడి జీవించే వారిని కూడా ‘రీ వెరిఫికేషన్’ పేరుతో నోటీసులు ఇచ్చి కడప రిమ్స్‌కు రప్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు దివ్యాంగుల జాబితాను తగ్గించే దిశగా.. రాష్ట్ర వ్యాప్తంగా వారిని మరలా ‘రీ వెరిఫికేషన్’ పేరుతో తమ సమీపంలో మెడికల్ బోర్డ్ వున్న ఆసుపత్రులకు పంపిస్తున్నారు. ప్రతి మనిషికి కనిపించగానే.. ప్రత్యక్షంగా వీరికి వికలత్వం వుందని ఇట్టే తెలిసిపోతుంది. కానీ అలాంటి వారిని కూడా వదిలిపెట్టకుండా ‘రీ వెరిఫికేషన్’ నోటీసులను ఇచ్చి వేధింపులకు గురి చేయడం ఎంత వరకు సమంజసమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● రిమ్స్ ఓపీ విభాగానికి ఎదురుగా ఏర్పాటు చేసిన షామియానా, కుర్చీలను ‘రీ వెరిఫికేషన్’కు వస్తున్న దివ్యాంగుల కోసం వినియోగిస్తున్నారు. అయితే వేసవి కాలంలో కనీసం తాగేందుకు ‘మంచినీటి’ సౌకర్యం కూడా కల్పించకపోవడం దారుణం. అసలే మూడు రోజులుగా ఓపీ క్యాంటీన్‌ను మూసివేయడం వల్ల అక్కడికి వస్తున్న రోగులకు, వారి సహాయకులకు కనీసం అల్పాహారం, టీ, కాఫీ, మజ్జిగ, నీటి సౌకర్యం కరువయ్యాయి. రిమ్స్ అధికారులు గానీ, డీఆర్డీఏ విభాగానికి చెందిన అధికారులైనా స్పందించి నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ● ఒకవైపు నానా తిప్పలు పడి అక్కడికి ‘రీ వెరిఫికేషన్’కు వస్తున్న దివ్యాంగుల పాలిట కొందరు ‘చిరుద్యోగుల’ చేష్టలు కూడా శాపంగా మారుతున్నాయి. ‘రీ వెరిఫికేషన్’ చేయించుకునేందుకు వచ్చిన వారికి ‘తప్పకుండా’ మరలా సర్టిఫికెట్‌ను యథావిధిగా చేయిస్తామని మాయమాటలను చెప్పి తమ జేబులను నింపుకొంటున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక్కో ‘రీ వెరిఫికేషన్’ సర్టిఫికెట్ కోసం వేలాది రూపాయలను వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు. వీల్‌చైర్, స్ట్రెక్చర్ల కొరత స్పష్టంగా తెలుస్తోందని పేర్కొంటున్నారు. ● దివ్యాంగుల కష్టాలు, ఇబ్బందులపై సీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. ఎవరైనా తమకు ఫిర్యాదు చేసినా, తమ దృష్టికి వచ్చినా చర్యలను తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకే ‘రీ వెరిఫికేషన్’కు దివ్యాంగులను పిలిపిస్తున్నామని వివరణ ఇచ్చారు. -
చదువుకున్నారు.. చోరీలు ఎంచుకున్నారు
బద్వేలు అర్బన్ : ఒకరు బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశారు. మరొకరు బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. ఇంకొకరేమో బీటెక్ చివరి దశలో మానేశారు. ఉద్యోగ, ఉపాధి మార్గాలు ఎంచుకుని ఉన్నతంగా ఎదగాల్సిన వీరు.. దురలవాట్లకు బానిసలుగా మారి పక్కదారి పట్టారు. చేసిన అప్పులు తీర్చేందుకు, జల్సాల కోసం చోరీల బాట పట్టారు. చివరకు ఇద్దరు పోలీసులకు చిక్కి కటకటాల పాలు కాగా, మరొకరేమో పరారీలో ఉన్నాడు. గోపవరం మండలం పి.పి.కుంట సమీపంలోని సెంచురీ పానెల్స్ పరిశ్రమ నుంచి నకిలీ పత్రాలతో ప్లేవుడ్ బోర్డులు కాజేసేందుకు యత్నించగా రూరల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శుక్రవారం స్థానిక రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఎం.నాగభూషణ్ ఇందుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. గోపవరం మండలం పి.పి.కుంట సమీపంలోని సెంచురీ పానెల్స్ పరిశ్రమ ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్లేవుడ్ బోర్డులను ఎగుమతి చేస్తుంటారు. ఇందుకోసం వివిధ ట్రాన్స్పోర్ట్ కంపెనీలతో ఒప్పందం చేసుకుని వారి ద్వారా వాహనాలను సమకూర్చుకుంటారు. ఈ క్రమంలో కలకత్తాకు చెందిన సరస్వతి ప్లేబోర్డ్ లిమిటెడ్ కంపెనీ ద్వారా సెంచురీ పానెల్స్ పరిశ్రమకు రూ.5 లక్షల విలువ చేసే 885 ప్లేవుడ్ బోర్డుల ఆర్డర్ వచ్చింది. ఇందుకు సెంచురీ పరిశ్రమ యాజమాన్యం వాహనం కోసం తమ వెబ్సైట్లో పొందుపరచగా... విజయవాడకు చెందిన ఫైన్ లాజిస్టిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాహనం సమకూర్చే హక్కును దక్కించుకుంది. అయితే అప్పటికే సంబంధిత ట్రాన్స్పోర్ట్ కంపెనీతో సంబంధాలున్న నెల్లూరు జిల్లా సీతారామపురం గ్రామం పడమటివీధికి చెందిన ఆకులమహేష్ ముందస్తు ప్రణాళికలో భాగంగా కంపెనీ తరఫున తన స్నేహితుడైన పూంగవనంశివకుమార్ ద్వారా నకిలీ ఆర్సీ, ఎఫ్‌సీ, పర్మిట్ సృష్టించి మరొక స్నేహితుడైన మనీష్ ద్వారా వేరొక వాహనానికి నంబర్ ప్లేట్ మార్చి గత నెల 20వ తేదీన సరుకును తీసుకెళ్లాడు. అయితే సరుకును కలకత్తాకు తీసుకెళ్లకుండా నెల్లూరులోని ఓ గదిలో భద్రపరిచి.. కొద్ది రోజుల తర్వాత అమ్ముకోవాలని ప్లాన్ చేసుకుని ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. కంపెనీ నుంచి సరుకు బయటికి వెళ్లినప్పటి నుంచి అన్లోడ్ చేసే వరకు వాహనాన్ని జీపీఎస్ ట్రాకింగ్ చేస్తారు. అయితే ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడంతో ట్రాకింగ్ లభించలేదు. దీంతో అనుమానం వచ్చిన కంపెనీ ప్రతినిధులు ఈ నెల 2వ తేదీన రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సీఐ ఎం.నాగభూషణ్, బి.కోడూరు ఎస్ఐ కె.సి.రాజులు సిబ్బందితో కలిసి గాలిస్తుండగా శుక్రవారం పి.పి.కుంట సమీపంలో ఆకులమహేష్, పూంగవనం శివకుమార్లను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరు పరచగా న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. ఇదే కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న మనీష్ కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా నిందితులు నెల్లూరు జిల్లా ముత్తుకూరు స్టేషన్ పరిధిలో కూడా గత నెల 25న ఇదే తరహాలో పామాయిల్ డబ్బాలను లోడ్ చేసుకుని చేర్చవలసిన పాయింట్‌కు చేర్చకుండా కాజేసే యత్నం చేసినట్లు విచారణలో తేలినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఏఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సురేష్, కానిస్టేబుళ్ళు శ్రీను, పీరయ్య తదితరులు పాల్గొన్నారు. నకిలీ పత్రాలతో ప్లేవుడ్ బోర్డులు కాజేసిన యువకులు చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు ఇద్దరు అరెస్టు, పరారీలో ఒకరు -
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6వ తేదీ నుంచి 14 వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 వరకు అంకురార్పణ శాస్త్రోక్తంగా నిర్వహిచనున్నారు. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణ ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ఆశీనులు చేస్తారు. అనంతరం టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు రాజేష్ కుమార్ ఆగమ శాస్త్రం ప్రకారం అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఆలయంలోని పుట్టమన్నును యాగశాలకు తీసుకెళ్లే కార్యక్రంమతో అంకుకార్పణ ముగుస్తుంది. రేపు ధ్వజారోహణం ఏప్రిల్ 6న ధ్వజారోహణంతో శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 7 నుండి 9 వరకు శేష వాహనసేవ జరగనున్నాయి. ● ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. గోపురాలు, కల్యాణ వేదిక, ఇతర ప్రాంతాల్లో విద్యుత్‌దీపాలు అమర్చారు. -
నేడు జగ్జీవన్‌రామ్ జయంతి
కడప సెవెన్‌రోడ్స్: బాబు జగ్జీవన్‌రాం జయంతి వేడుకను శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీ నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. నేడు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలపై సమావేశం కడప సెవెన్‌రోడ్స్: శ్రీరామ నవమి పర్వదిన సందర్బంగా ఒంటిమిట్టలో జరగనున్న బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై శనివారం మధ్యాహ్నం అక్కడి టీటీడీ భవనంలో అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు తిరుమల–తిరుపతి దేవస్థానం ఈఓ, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొంటారన్నారు. జిల్లాలోని ఇందుకు సంబంధించిన వివిధ శాఖల అధికారులు హాజరు కావాలని ఆయన కోరారు. డీఈఓ వెబ్సైట్లో జాబితా కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు యాజమాన్యాలలో పనిచేసే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు,తత్సమాన కేటగిరీల నుంచి పాఠశాల సహాయకులుగా పదోన్నతి కోసం సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా సబ్జెక్టుల వారీగా (www. kadapadeo.in) డీఈఓ వెబ్సైట్లో పొందు పరి చినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. సదరు సీనియారిటీ జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు పనిదినాల్లో సాయంత్రం 5 గంటలలోపు రాత పూర్వకంగా సరైన ఆధారాలతో డీఈఓ కార్యాలయంలో సంప్రదించాలని డీఈఓ పేర్కొన్నారు. పరిసరాల శుభ్రతతో వ్యాధులు దూరం సిద్దవటం: పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులను దూరం చేయవచ్చని జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. సిద్దవటం మండలం లోని మాధవరం–1 గ్రామంలో శుక్రవారం జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, వృద్ధులు, బాలింతలు, చిన్నపిల్లలు బయట తిరుగొద్దని సూచించారు. ప్రస్తుతం జరిగే ఎన్సీడీ–సీడీ సర్వే, ఏబీబీఏ(అభా)జనరేషన్, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకాలకు ఈ–కేవైసీ చేయించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో మాధవరం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శివకుమార్, సూపర్వైజర్లు నాగవల్లి, జ్యోతి ,రమణయ్య, ఏఎన్ఎంలు పద్మావతి, ఉమా, ఆశా వర్కర్లు సుజాత, అదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
● బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టనున్నట్లు కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. శుక్రవారం ఒంటిమిట్టలో జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. అనంతరం టీటీడీ పరిపాలన భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు.కార్యక్రమంలో కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్, టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ గుణ భూషణరెడ్డి, జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ, డీపీఓ రాజ్యలక్ష్మీ, కడప జిల్లా ఆర్టీసీ ఆర్ఎం గోపాల్ రెడ్డి, ఒంటిమిట్ట ఎంఆర్ఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
భూ సేకరణ పనులను పూర్తిచేయాలి
కడప సెవెన్‌రోడ్స్: జాతీయ రహదారుల విస్తరణ, సోలార్ పార్కుల ఏర్పాటు కోసం చేపట్టిన భూ సేకరణ, అటవీ, పర్యావరణ అభ్యంతరాలు, లీగల్ క్లియరెన్స్ ప్రక్రియలను పెండింగ్ లేకుండా...త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల విస్తరణ కోసం చేపట్టిన భూ సేకరణ ప్రక్రియ పై శుక్రవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి జేసీ అదితి సింగ్, డీఎఫ్ఓ వినీత్ కుమార్‌లతో కలిసి సంబంధిత తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ దేశంలో రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయన్నారు. అందు లో భాగంగా బెంగుళూరు–కడప–విజయవాడ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి భూసేకరణ చేస్తోందన్నారు. భూములు కోల్పోయినవారికి పరిహారం కూడా ఇస్తోందన్నారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న మూడు రకాలైన సోలార్ అనుబంధ పవ ర్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను, ఇతర అనుమతులను క్లియర్ చేయాలన్నారు. జమ్మలమడుగు, పులివెందుల ఆర్డీఓలు సాయిశ్రీ, చిన్న య్య, ఎన్ హెచ్ఏఐ ఎస్డీసి వెంకటపతి, పీడి అశోక్ కుమార్, డిప్యూటీ మేనేజర్లు వేణుగోపాల్, సుదర్శన్ కుమార్, ఆర్అండ్బీ నేషనల్ హైవే ఈఈ విజయ్ భాస్కర్ రెడ్డి, నెడ్ క్యాప్ జిల్లా అభివృద్ధి అధికారి యల్లారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. లక్ష్యాలను అధిగమించాలి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా.. అన్ని ప్రాధాన్యతా రంగాలను మరింత పటిష్టం చేసి జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో అన్ని రకాల ప్రాధాన్యతా రంగాలకు చెందిన జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా రంగాల్లో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలు, సాధించాల్సిన ప్రగతి.. తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. విత్తనాల ఉత్పత్తి, పంటల మార్పులు, మైక్రో న్యూట్రియన్స్ల పై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో చిరుధాన్యాల పంటల సాగుబడిని పెంపొందించాలని.. ఆ దిశగా రైతుల్లో అవగాహన పెంచాలన్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టం పై రిపోర్ట్ అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ శాఖ జేడీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
బద్వేలు అర్బన్ : ఇటీవల పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 4వ తరగతి విద్యార్థిని పట్ల ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మరువకముందే.. అటువంటి సంఘటన మరొకటి పునరావృత్తమైంది. పట్టణంలోని సుందరయ్యకాలనీ సమీపంలో గల ఏవీఆర్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై.. అదే పాఠశాలలో కంప్యూటర్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న పెంచలయ్య అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధిత విద్యార్థిని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారితోపాటు బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. బద్వేలు పట్టణంలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని త్యాగరాజకాలనీకి చెందిన ఓ విద్యార్థిని సుందరయ్యకాలనీ సమీపంలోని ఏవీఆర్ స్కూల్లో 6వ తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో గోపవరం మండలం అడుసువారిపల్లె గ్రామానికి చెందిన పెంచలయ్య కంప్యూటర్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అయితే కొంత కాలంగా పెంచలయ్య బాధిత విద్యార్థినితోపాటు మరికొంత మంది విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో త్యాగరాజకాలనీకి చెందిన విద్యార్థిని.. ఉపాధ్యాయుడి ఆగడాలను తట్టుకోలేక శుక్రవారం తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో తల్లిదండ్రులతోపాటు బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఇంతలో విషయం తెలుసుకున్న అర్బన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఉపాధ్యాయుడిని స్టేషన్‌కు తరలించారు. అనంతరం విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడు పెంచలయ్యపై అర్బన్ సీఐ ఎం.రాజగోపాల్ కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల కాలంలో ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థినులపై జరుగుతున్న వరుస ఘటనలతో తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాగే విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు ఇలా అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు, బంధువులు స్టేషన్‌కు తరలించిన పోలీసులు బద్వేలులోని ఏవీఆర్ స్కూల్లో ఘటన -
రైతులపై పాలకులే కాదు ప్రకృతీ పగబట్టింది. చేతికొచ్చిన పంటను.. రైతన్న నోటికాడ కూడును అమాంతం లాగేసింది. అకాల వర్షాలు.. ఈదురుగాలుల రూపంలో పచ్చని పంటను నేలమట్టం చేసింది. పచ్చని అరటిపంటే కాదు.. రైతన్నల ఆశల్నీ నేలరాల్చింది. కోటి ఆశలతో సాగు చేసిన రైతన్నకు కడగండ్ల
లింగాల: లింగాల మండలంలో గురువారం బలమైన ఈదురు గాలులకు అరటి పంట నేలకూలింది. మండలంలోని ఇప్పట్ల, అక్కులగారిపల్లె, తేర్నాంపల్లె, పెద్దకుడాల, లింగాల, లోపట్నూతల గ్రామాల్లోని అరటి చెట్లు సుమారు 30ఎకరాలలో నేలకూలాయని రైతులు వాపోతున్నారు. తన అరటితోటలో సుమారు 3వేల అరటి చెట్లు నేలకూలాయని లోపట్నూతల గ్రామానికి చెందిన బాల పుల్లయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. పంట కోతకు వచ్చిన సమయంలో ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతీస్తున్నాయని.. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని అరటి రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఉద్యాన శాఖాధికారి రాఘవేంద్రారెడ్డి స్పందిస్తూ ఆర్ఎస్కే అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారని, పంట నష్టం అంచనాలను ప్రభుత్వానికి నివేదికలు అందిస్తామన్నారు. సుమారు 30ఎకరాలలో అరటి పంట కూలిపోయిందని రూ.60లక్షల మేర పంట నష్టం సంభవించినట్లు ఆయన వెల్లడించారు. అకాలవర్షం... రైతులకు నష్టం కొండాపురం: మండల పరిధిలోని తిరుమలాయపల్లె,బుక్కపట్నం వెంకయ్య కాలువ గ్రామాల్లో గురువారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షానికి అరటి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే దశలో అనుకోకుండా అకాలవర్షం కురవడంతో పంటలు నేలకొరిగాయి. బుక్కపట్నం, తిరుమ లాయపల్లె గ్రామాల్లో మిర్చిపంటలో ఎండు మిరపకాయలకోసం ఉంచిన పొలంలో ఈదురుగాలులు వీయడంతో పండుమిరపకాయలు నేలపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే వెంకయ్యకాలువ లో అరటి కోత దశలో స్వల్పంగా అరటి మొక్కలు నెలకొరిగాయి. దీంతో ఆయా గ్రామాలల్లో రైతులకు నష్టం వాటిలింది.నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. అకాల వర్షాలు,గాలులకు కూలిన అరటితోటలు జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన రైతులు -
● బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టనున్నట్లు కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. శుక్రవారం ఒంటిమిట్టలో జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. అనంతరం టీటీడీ పరిపాలన భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు.కార్యక్రమంలో కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్, టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ గుణ భూషణరెడ్డి, జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ, డీపీఓ రాజ్యలక్ష్మీ, కడప జిల్లా ఆర్టీసీ ఆర్ఎం గోపాల్ రెడ్డి, ఒంటిమిట్ట ఎంఆర్ఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
నేడు జగ్జీవన్‌రామ్ జయంతి
కడప సెవెన్‌రోడ్స్: బాబు జగ్జీవన్‌రాం జయంతి వేడుకను శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీ నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. నేడు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలపై సమావేశం కడప సెవెన్‌రోడ్స్: శ్రీరామ నవమి పర్వదిన సందర్బంగా ఒంటిమిట్టలో జరగనున్న బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై శనివారం మధ్యాహ్నం అక్కడి టీటీడీ భవనంలో అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు తిరుమల–తిరుపతి దేవస్థానం ఈఓ, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొంటారన్నారు. జిల్లాలోని ఇందుకు సంబంధించిన వివిధ శాఖల అధికారులు హాజరు కావాలని ఆయన కోరారు. డీఈఓ వెబ్సైట్లో జాబితా కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు యాజమాన్యాలలో పనిచేసే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు,తత్సమాన కేటగిరీల నుంచి పాఠశాల సహాయకులుగా పదోన్నతి కోసం సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా సబ్జెక్టుల వారీగా (www. kadapadeo.in) డీఈఓ వెబ్సైట్లో పొందు పరి చినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. సదరు సీనియారిటీ జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు పనిదినాల్లో సాయంత్రం 5 గంటలలోపు రాత పూర్వకంగా సరైన ఆధారాలతో డీఈఓ కార్యాలయంలో సంప్రదించాలని డీఈఓ పేర్కొన్నారు. పరిసరాల శుభ్రతతో వ్యాధులు దూరం సిద్దవటం: పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులను దూరం చేయవచ్చని జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. సిద్దవటం మండలం లోని మాధవరం–1 గ్రామంలో శుక్రవారం జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, వృద్ధులు, బాలింతలు, చిన్నపిల్లలు బయట తిరుగొద్దని సూచించారు. ప్రస్తుతం జరిగే ఎన్సీడీ–సీడీ సర్వే, ఏబీబీఏ(అభా)జనరేషన్, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకాలకు ఈ–కేవైసీ చేయించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో మాధవరం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శివకుమార్, సూపర్వైజర్లు నాగవల్లి, జ్యోతి ,రమణయ్య, ఏఎన్ఎంలు పద్మావతి, ఉమా, ఆశా వర్కర్లు సుజాత, అదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సొంతంగా ఏ పని చేసుకోలేని వారు.. కొందరు పుట్టుకతో.. ఇంకొందరు అనారోగ్యం కారణంగా వైకల్యం బారిన పడిన వారు.. వీరంతా నిరుపేదలు. ప్రభుత్వ సాయంతోనే నాలుగు ముద్దలు నోటికాడికి వెళ్తాయన్న దివ్యాంగులు వీరు. అయితే వీరి పింఛన్లలో కోత పెట్టాలని కూటమి నిర్ణయించింది. పునః
● సదరంలో దివ్యాంగుల అగచాట్లు ● కుటుంబ సభ్యుల అపసోపాలు ● అర్హత ఉన్నా తప్పని పునఃపరిశీలన ● అందుబాటులో లేని వీల్చైర్లు, స్ట్రెచర్లు ● రిమ్స్‌లో కనీస సౌకర్యాలు కరువుకడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి సర్టిఫికెట్ల పునః పరిశీలన కోసం వస్తున్న దివ్యాంగులలో దయనీయస్థితిలో వున్నవారు లేకపోలేదు. ఇందుకు ప్రత్యక్షంగా ఈ నెల 2,3 తేదీలలో ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. మంచానికి, వీల్చైర్లకే పరిమితమై, వారి వ్యక్తిగత పనులను కూడా కుటుంబ సభ్యులపై ఆధారపడి జీవించే వారిని కూడా ‘రీ వెరిఫికేషన్’ పేరుతో నోటీసులు ఇచ్చి కడప రిమ్స్‌కు రప్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు దివ్యాంగుల జాబితాను తగ్గించే దిశగా.. రాష్ట్ర వ్యాప్తంగా వారిని మరలా ‘రీ వెరిఫికేషన్’ పేరుతో తమ సమీపంలో మెడికల్ బోర్డ్ వున్న ఆసుపత్రులకు పంపిస్తున్నారు. ప్రతి మనిషికి కనిపించగానే.. ప్రత్యక్షంగా వీరికి వికలత్వం వుందని ఇట్టే తెలిసిపోతుంది. కానీ అలాంటి వారిని కూడా వదిలిపెట్టకుండా ‘రీ వెరిఫికేషన్’ నోటీసులను ఇచ్చి వేధింపులకు గురి చేయడం ఎంత వరకు సమంజసమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● రిమ్స్ ఓపీ విభాగానికి ఎదురుగా ఏర్పాటు చేసిన షామియానా, కుర్చీలను ‘రీ వెరిఫికేషన్’కు వస్తున్న దివ్యాంగుల కోసం వినియోగిస్తున్నారు. అయితే వేసవి కాలంలో కనీసం తాగేందుకు ‘మంచినీటి’ సౌకర్యం కూడా కల్పించకపోవడం దారుణం. అసలే మూడు రోజులుగా ఓపీ క్యాంటీన్‌ను మూసివేయడం వల్ల అక్కడికి వస్తున్న రోగులకు, వారి సహాయకులకు కనీసం అల్పాహారం, టీ, కాఫీ, మజ్జిగ, నీటి సౌకర్యం కరువయ్యాయి. రిమ్స్ అధికారులు గానీ, డీఆర్డీఏ విభాగానికి చెందిన అధికారులైనా స్పందించి నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ● ఒకవైపు నానా తిప్పలు పడి అక్కడికి ‘రీ వెరిఫికేషన్’కు వస్తున్న దివ్యాంగుల పాలిట కొందరు ‘చిరుద్యోగుల’ చేష్టలు కూడా శాపంగా మారుతున్నాయి. ‘రీ వెరిఫికేషన్’ చేయించుకునేందుకు వచ్చిన వారికి ‘తప్పకుండా’ మరలా సర్టిఫికెట్‌ను యథావిధిగా చేయిస్తామని మాయమాటలను చెప్పి తమ జేబులను నింపుకొంటున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక్కో ‘రీ వెరిఫికేషన్’ సర్టిఫికెట్ కోసం వేలాది రూపాయలను వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు. వీల్‌చైర్, స్ట్రెక్చర్ల కొరత స్పష్టంగా తెలుస్తోందని పేర్కొంటున్నారు. ● దివ్యాంగుల కష్టాలు, ఇబ్బందులపై సీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. ఎవరైనా తమకు ఫిర్యాదు చేసినా, తమ దృష్టికి వచ్చినా చర్యలను తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకే ‘రీ వెరిఫికేషన్’కు దివ్యాంగులను పిలిపిస్తున్నామని వివరణ ఇచ్చారు. -
జిల్లా ఆస్పత్రిని పరిశీలించిన కాయకల్ప బృందం
ప్రొద్దుటూరు క్రైం : జిల్లా ఆస్పత్రిని కాయకల్ప పర్యవేక్షణ బృందం గురువారం పరిశీలించింది. జాయింట్ డైరెక్టర్ సాగర్, స్టేట్ టీబీ కార్యాలయ అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ రవీంద్రకుమార్ ఆస్పత్రిని పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల పనితీరును బట్టి కాయకల్ప అవార్డును ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా అధికారుల బృందం ఆస్పత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని వార్డులతో పాటు, ఓపీ విభాగాలను పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. అలాగే పారిశుధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్‌బాబు కాయకల్ప బృందానికి ఆస్పత్రిలో అందిస్తున్న సేవల గురించి వివరించారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ రూపానంద్, డాక్టర్ గోపాల్ పాల్గొన్నారు. -
డయేరియా రహిత జిల్లాగా మారుద్దాం
కడప సెవెన్‌రోడ్స్: డయేరియా రహిత, ఆరోగ్య సహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్నిశాఖల అధికారులు కృషి చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 15 నుంచి డయేరియా నియంత్రణ క్యాంపెయిన్ నిర్వహించాలన్నారు. నియోజకవర్గ, మండ ల, గ్రామ స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడా అతిసార కేసులు వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ అధికారులు మైక్రో ప్లాన్ అమలు చేయాలని ఆదేశించారు. పారిశుద్ద్య పర్యవేక్షణ చర్యలు చేపట్టేందుకు పబ్లిక్ హెల్త్, మున్సిపాలిటీ, ఆర్డబ్ల్యూఎ్స్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. డీఎంహెచ్ఓ నాగరాజు, నగర పాలక సంస్థ కమిషనర్ మనోజ్‌రెడ్డి, ఇన్‌ఛార్జి డీపీఓ ఖాదర్‌బాష, రిమ్స్ సూపరింటెండెంట్ రమాదేవి, ఎపిడమాలజిస్టు ఖాజా మోహిద్దీన్ పాల్గొన్నారు. 15 నుంచి జిల్లా వ్యాప్తంగా క్యాంపెయిన్ కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
ఆస్పత్రిలో రోగుల భోజన నాణ్యతపై తనిఖీ
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ వైద్యశాల(రిమ్స్)లోని రోగులకు అందిస్తున్న భోజన నాణ్యతను ఫుడ్ సేఫ్టీ అధికారులు యండి.షంషీర్ ఖాన్, డాక్టర్ ఎం.హరిత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిమ్స్ ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న భోజనం , పోషక విలువలు సంవృద్ధిగా ఉన్నాయా? లేదా అన్నది స్వయంగా పరీక్షించారు. రోగులతో మాట్లాడి అందుతున్న భోజనం గురించి వారి అభిప్రాయాలు తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఆఫ్ ది ఫుడ్ సేఫ్టీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు,ప్రైవేట్ ఆసుపత్రుల్లో డైట్ కాంట్రాక్టర్లు అందిస్తున్న భోజనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. భోజనం నాణ్యతలో ఎక్కడైనా లోపం కనబడితే తక్షణమే వాటిని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తదుపరి పైన తెలిపిన ఆసుపత్రి ముడి పదార్థాల నాణ్యత కోసం ల్యాబొరేటరీకి పంపించారు. ఈక్రమంలో డైట్ కాంట్రాక్టర్లకు తగిన సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైటిషన్ బాలాజీ నాయక్, డైట్ కాంట్రాక్టర్ ఖాజా పాల్గొన్నారు. -
ఆడపిల్లలకు చదువును దూరం చేయొద్దు
కమలాపురం : కూటమి ప్రభుత్వం ముస్లింలపై వివక్ష చూపిస్తోంది. ముస్లింలకు అండగా ఉంటాం.. ఆడపిల్లల చదువుకు చేయూతనిస్తాం.. అంటూ మాటల్లో ప్రేమ ఒలకబోస్తూ... చేతల్లో కర్కశత్వం చూపిస్తూ.. కపట నాటకమాడుతోంది. కమలాపురంలోని యూపీ ఉర్దూ స్కూల్‌ను రివర్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడమే అందుకు నిదర్శనం. కమలాపురం పట్టణ పరిధిలోని బీడీ కాలనీలో ఉన్న ఉర్దూ యూపీ స్కూల్‌ను ప్రైమరీ స్కూల్‌గా మారుస్తూ ఉత్తర్వులు అందాయి. విషయం తెలుసుకున్న స్థానికులు .. విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈఓ కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపారు. తమ కాలనీలోని యూపీ స్కూల్‌ను రివర్షన్ చేసి ఆడపిల్లలకు చదువును దూరం చేయొద్దని విద్యార్థుల తల్లిదండ్రులు మహబూబ్ బాషా, షఫీవుల్లా, హబీబున్, మాబుచాన్ తదితరులు కోరారు. ఈ విషయమై వారు ఎంఈఓకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కాలనీలో మొత్తం బీడీ కార్మికులేనని, నిరుపేదలేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 85 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలను తిరిగి రివర్షన్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యంగా తమ కాలనీలోనే ఈ పాఠశాల ఉండటంతో తమ పిల్లలు చదువుకుంటున్నారని, దీనిని ప్రైమరీ పాఠశాలగా మార్చి 6, 7 తరగతులను దూరంగా ఉన్న పాఠశాలల్లో కలిపితే తమ ఆడపిల్లలు చదువుకు దూరం అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలపై ప్రభుత్వం లక్షలు వెచ్చించి ఎంతో అభివృద్ధి చేసిందని, ఇలాంటి సమయంలో యూపీ పాఠశాలగా తీసివేయడం బాధాకరమన్నారు. చెన్నూరు మండలంలోని ఒక పాఠశాలలో కేవలం 25 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నప్పటికీ ఆ పాఠశాలను యూపీ పాఠశాలగానే కొనసాగిస్తున్నారని, మరి తమ బీడీ కాలనీలోని యూపీ పాఠశాలకు ఎందుకు రివర్షన్ ఇస్తున్నారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అనంతరం పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. విద్యార్థినుల తల్లిదండ్రుల ఆవేదన యూపీ ఉర్దూ స్కూల్ రివర్షన్పై మండిపాటు -
వైవీయూ క్యాంపస్ డ్రైవ్‌కు విశేష స్పందన
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌కు విశేష స్పందన లభించింది. ప్రముఖ బయోకాన్ మల్టీనేషనల్ కంపెనీ వైవీయూలో గురువారం చేపట్టిన ఎంపికలకు తిరుపతి, వైజాగ్, గుంటూరు, రాజమండ్రి, బాపట్ల, అన్నమయ్య, కడప జిల్లాల నుంచే కాక చత్తీస్ఘడ్, ఒడిస్సా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి 500 మంది ఇంజినీరింగ్, డిగ్రీ పీజీ అర్హత గల అభ్యర్థులు హాజరయ్యారు. వైవీయూ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ రఘునాథ్‌రెడ్డి , రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పుత్తా పద్మలు క్యాంపస్ డ్రైవ్ ప్రారంభించి మాట్లాడారు. విశ్వవిద్యాలయ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ ఆచార్య జి.విజయ భారతి ఎంపికల ప్రక్రియను సమన్వయం చేశారు. బయోకాన్ కంపెనీ క్వాలిటీ అస్సూరెన్స్ మేనేజర్ లక్ష్మినరసయ్య, హెచ్.ఆర్ విభాగ డిప్యూటీ మేనేజర్ జయప్రకాష్, ఎస్సార్ డైరెక్టర్ జయభారత్, ఆపరేషన్ హెడ్ ఎన్‌హెచ్ అశోక్, క్లస్టర్ హెడ్ రాజశేఖర్, హెచ్ఆర్ విభాగ ఆర్ శరత్ విద్యార్థులకు మౌఖిక పరీక్ష నిర్వహించారు. ఇందులో 160 మంది అభ్యర్థులను కంపెనీ ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్ ,ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్ విభాగాలలో ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యురాలు ప్రొఫెసర్ చంద్రమతి శంకర్, ప్లేస్మెంట్ సెల్ ప్రతినిధులు డాక్టర్ లలిత, డాక్టర్ గణేష్ నాయక్, డాక్టర్ సుభోస్ చంద్ర, అధ్యాపక, బోధనేతర సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. -
రిమ్స్‌లో తీరు మారదంతే..!
కడప టాస్క్‌ఫోర్స్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)తీరు మారడం లేదు. ఓపీ విభాగంలో మహిళా కంటి విభాగం(ఆప్తాలమిక్)లో గురువారం ఉదయం 10:20 గంటలైనా వైద్యులు రాకపోవడం గమనార్హం. అలాగే ఆప్తాల్మిక్, ఈఎన్టీ విభాగాలకు శ్రీరీ వెరిఫికేషన్శ్రీకు వచ్చిన రోగులు, వారి సహాయకుల క్యూలైన్ పెద్దదిగా వుండి ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడ రిజిస్టర్లలో పేర్లను నమోదు చేసేందుకు విద్యార్థులను.. ఎలాంటి ఉద్యోగి పర్యవేక్షణ లేకుండానే వారికి వదిలేయడం ఎంత వరకు సమంజసం. ● ఓపీ విభాగంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కోతుల బెడద తప్పడం లేదు. ఈ కోతుల బెడదకు ఒకవైపు చిన్నారులు, బాలింతలు, వృద్ధులు బెంబేలెత్తిపోతున్నారు. ● గైనిక్ విభాగం ఓపీ విభాగం ముందు భాగాన విరిగిపడి మూలనపడిన ఇనుపకుర్చీ నిరుపయోగంగానే పడివుంది. ● కడప జీజీహెచ్ (రిమ్స్)లో ప్రభుత్వం మంజూరు చేసిన స్టాఫ్ నర్సులు 402 కాగా వీరిలో రెగ్యులర్ స్టాఫ్ నర్సులు 62 మంది, కాంట్రాక్ట్ పద్ధతిలో 202 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా 138 స్టాఫ్ నర్సుల పోస్టులు ఖాళీగా వున్నాయి. త్వరలోనే భర్తీ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా 13 మంది స్టాఫ్ నర్సులు వివిధ ఓపీ, ఐపీ, పరిపాలనా విభాగాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేవలం కంప్యూటర్ ఆపరేటర్ (డి.ఈ.ఓ) పనులను మాత్రమే నిర్వహిస్తున్నారు. వీరికి ఎలాంటి షిఫ్ట్ డ్యూటీలు లేకపోవడం, ఆయా పోస్టింగ్‌లకే అధికారులు పరిమితం చేయడం పలురకాల ఆరోపణలకు తావిస్తోంది. ఇంకా సిటీ స్కానింగ్ విభాగంలో అటెండర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్‌గా ఐదు సంవత్సరాలుగా విధులను నిర్వహిస్తున్నాడు. తనను కంప్యూటర్ ఆపరేటర్‌గా తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. ● మరోవైపు కడప రిమ్స్ ఓపీలోని క్యాంటీన్ మూసివేత వ్యవహారం రోజురోజుకు ముదిరిపాకాన పడుతోంది. టెండర్ వేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అధికారులు ప్రస్తుత క్యాంటీన్ నిర్వాహకులను బలవంతంగా ఖాళీ చేయాలని చూస్తున్నారు. మొదటి రోజున ఏకంగా తాళళం వేసిన ఓ ప్రైవేట్ వ్యక్తి మూడవరోజున ఆ తాళం కాస్తా తీసేశాడు. మరోవైపు అధికారులు తగిన ఉత్తర్వులను ఇస్తే తాము ఖాళీ చేస్తామని ప్రస్తుత నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఓపెన్ టెండర్‌ను నిర్వహిస్తే అందరికీ మంచిదంటున్నారు. కంటి మహిళా ఓపీలో 10:20 గంటలైనా రాని వైద్యులు గైనిక్ ఓపీ ముందు మూలనపడ్డ కుర్చీ 13 మంది స్టాఫ్ నర్సులు డీఈఓ ఉద్యోగాలకే పరిమితం -
ఖాకీ వనంలో కలుపు మొక్కలు!
● ఎన్నికల అధికారికి గుండెపోటు వచ్చేలా.... తొలి రోజు వాయిదా పడిన ఎన్నిక మరుసటి రోజైన 28న నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు సమాయత్తమైతే వారిపైనే దౌర్జన్యానికి దిగి ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డికి గుండెపోటు వచ్చేలా చేశారు. ఇదంతా కూడా డీఎస్పీ సమక్షంలోనే చోటుచేసుకున్నా ఈ రోజు వరకు కేసు నమోదు కాలేదు. ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి సోదరుడు నంద్యాల అనందభార్గవరెడ్డి మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య కుమారుడు ప్రతాప్, మాజీ జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి ఎన్నికల గదిలోకి ప్రవేశించి దౌర్జన్యానికి దిగారు. టీడీపీకి చెందిన వారు ఎన్నికల అధికారి వద్ద ఉన్న డాక్యుమెంట్లను చించేశారు. కుర్చీలు ఎత్తేసి భయబ్రాంతులకు గురిచేశారు. దీంతో సదరు ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డికి గుండెపోటు వచ్చింది. ఇప్పుడా వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నా యి. ఇంత తతంగం తెరపైకి వచ్చినా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. సాక్షి ప్రతినిధి, కడప: సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితే చాలు... గోడలు దూకి మరీ అరెస్టులు చేసే పోలీసులు...ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఎన్నికల్లో దౌర్జన్యం, దాడులకు దిగితే చూస్తుండిపోయారు. వైఎస్సార్సీపీ సభ్యులపై దాడు లు చేసి.. ఫేక్ ఐడీ కార్డులతో ఎన్నికను తారుమా రు చేయాలనుకున్నా.. మౌనాన్నే ఆశ్రయించారు. ఎన్నికలు రూమ్‌లోకి వెళ్లి ఎన్నికల అధికారిపైనే దౌర్జన్యానికి దిగినా నో కేస్. చివరికి ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి సోదరుడు చేసిన దౌర్జన్యానికి ఎన్నికల అధికారికి గుండె పోటు కూడా వచ్చినా నో కేస్. ఇదీ.. కూటమి పాలనలో ఖాకీల పనితీరు. ● ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ చేయని అరాచకం లేదు. సాక్షాత్తు డీఎస్పీ ముందే ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి సోదరుడు అనందభార్గవ్రెడ్డితోపాటు పలువురు టీడీపీ నేతలు ఎన్నికల అధికారిపై దౌర్జన్యానికి దిగితే కనీసం కేసు కూడా లేదు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో టీడీపీ దౌర్జన్యకాండను కళ్లకు కట్టినట్లు బహిర్గతం చేశాయి. ఎటువంటి బలం లేని కారణంగా ఎలాగైనా ఉప సర్పంచ్ ఎన్నికను అడ్డుకునేందుకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి బంధువు లు చేయని అరాచకం లేదు. మార్చి 27న వైఎస్సార్సీపీ సభ్యులు ఎన్నికకు వస్తుంటే వారి వాహనంపై దాడి చేసి, మహిళా సభ్యులను సైతం గాయపరిచి ఎన్నికకు రాకుండా అడ్డుకున్నారు. అదే రోజు ఎలాగైనా గెలవాలని నలుగురు వ్యక్తులకు ఫేక్ ఐడీ కార్డులు సృష్టించి ఎన్నిక గదిలోకి పంపినా వారిని కనీసం అదుపులోకి కూడా తీసుకోలేదు. సాక్షాత్తు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను అపహాస్యం చేసే విధంగా వారు వ్యవహరిస్తే చట్టపరమైన చర్యల్లేవు. ఎన్నికల కమీషన్ ఆదేశాలకే దిక్కులేదు... 20 మంది వార్డు మెంబర్లు ఉన్న గోపవరం పంచాయితీలో ఉప సర్పంచ్ ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలకే జిల్లాలో దిక్కులేకుండా పోయింది. ఎన్నికకు సంబంధం లేని తెలుగుదేశం నాయకులు ఎన్నికల రూమ్‌లోకి ప్రవేశించారు. పోలీసు అధికారులు సైతం అదే వీడియోలో కన్పిస్తున్నారు. అయినా నియంత్రించలేదు. పోలీసుల కళ్లముందే దౌర్జన్యానికి దిగినా వారికి కనిపించలేదు. మరోవైపు ‘ఒక్క ఫోన్ కొడితే చాలు న్యాయం చేస్తా’మని ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ ప్రకటించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు చేపట్టిన 20 మంది వార్డు మెంబర్లు ఉన్న ఎన్నికల్లో అరాచకం తాండవించినా చట్టపరమైన చర్యలు లేకపోవడం ఎస్పీ ప్రకటనను ప్రశ్నాకర్థంగా మారుస్తోంది. ఆలస్యంగా వీడియోలు బయటకు రావడంతో చిన్న ఉప సర్పంచ్ పదవి కోసం టీడీపీ నేతలు చేసిన దౌర్జన్యకాండ వెలుగు చూసింది. ఇప్పటికై నా జిల్లా పోలీసు యంత్రాంగం చట్టాన్ని పరిరక్షించేందుకు ముందుండాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం తాపత్రయం ఎన్నికల కమీషన్ ఆదేశాలు ఉల్లంఘించినా కేసుల్లేవు గోపవరం ఉపసర్పంచ్ ఎన్నికలో ప్రజాస్వామ్యం అపహాస్యం ఫేక్ ఐడీలతో పట్టుబడినా చర్యల్లేవ్ ‘దేశం’ నేతలు కావడంతోచట్టపరమైన చర్యలకు వెనుకంజ -
జజ్జనకర జనారే.. జాతర భళారే..!
రాజంపేట టౌన్ : పట్టణంలోని బలిజపల్లెలో గురువారం గంగమ్మ జాతర సంబరం అంబరమంటింది. వేడుక బుధవారం రాత్రి నుంచే అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొలుత నిర్వహణలో భాగస్వాములైన నాపరపురెడ్డిపల్లె నిర్వాహకులు, ప్రజలు.. గంగమ్మ సోదరుడైన పోతురాజును ఊరేగిస్తూ అమ్మవారికి నవధాన్యాలు తీసుకొచ్చారు. అనంతరం గంగమ్మకు పుట్టినిల్లయిన తుమ్మల అగ్రహారం నుంచి.. ఆ గ్రామ మహిళలు పెద్దఎత్తున గండదీయలను బలిజపల్లెకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన నిర్వాహకులు, యువకులు తప్పెట్ల దరువుకు అనుగుణంగా అడుగులు వేస్తూ.. కర్రసాము విన్యాసాలు చేస్తూ, దీపావళిని తలపించేలా బాణాసంచా పేల్చుతూ చేరుకున్నారు. బలిజపల్లెలో గంగమ్మ ప్రతిమ తయారైన అనంతరం.. నిర్వాహకులు గురువారం తెల్లవారుజామున రథంలో అమ్మవారిని ఊరేగిస్తూ ప్రత్యేకంగా తయారు చేసిన వేపమండల గుడిలోకి తీసుకొచ్చి కొలువు దీర్చారు. గంగమ్మ ఊరేగింపుగా గుడిలోకి వచ్చే సమయంలో పోతురాజును ఎగిరించేందుకు భక్తులు పోటీపడ్డారు. గంగమ్మ గుడిలోకి వస్తుండగా.. వందలాది మంది భక్తులు ముద్దలు పెట్టి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు. గంగమ్మా.. కాపాడమ్మా ఈ సందర్భంగా భక్తులు ‘అమ్మా గంగమ్మ తల్లి.. మము కరుణించి కాపాడమ్మా’ అంటూ వేడుకున్నారు. గంగమ్మ గుడిలోకి చేరుకోక ముందే వేలాది మంది బలిజపల్లెకు చేరుకోవడంతో.. బలిజపల్లె గ్రామం ఇసుకవేసినా రాలనంతగా భక్తులతో నిండిపోయింది. అమ్మవారు గుడిలో కొలువు దీరాక భక్తులు ఒక్కసారిగా గంగమ్మను దర్శించుకునేందుకు త్వరపడటంతో పోలీసులు అధికారులు, సిబ్బంది అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. గంగమ్మ గుడిలో కొలువుదీరగానే జాతర ఒక్కసారిగా ఊపందుకుంది. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు కిలోమీటరు మేర భక్తుల రద్దీ కొనసాగింది. దారులన్నీ జాతర వైపే బలిజపల్లె గంగమ్మ జాతరలో అమ్మవారికి వరపడితే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందువల్ల బుధవారం రాత్రి నుంచే గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు బలిజపల్లెకు చేరుకోవడం ప్రారంభించారు. జాతరలోకి వచ్చేందుకు నాలుగువైపులాఉన్న రహదారుల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు. దీంతో పట్టణంలోని అన్ని దారులు జాతరవైపు సాగి కోలాహలంగా మారాయి. వైభవంగా బలిజపల్లె గంగమ్మ జాతర ఆకట్టుకున్న యువకుల విన్యాసాలు భారీగా తరలివచ్చిన భక్తులు గంగమ్మను దర్శించుకున్న ఆకేపాటి, పోలా జాతర సందర్భంగా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాఽథ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్‌రెడ్డి.. గంగమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. బలిజపల్లె గంగమ్మ ఎంతో విశిష్టత సంతరించుకున్న దేవత అని, గంగమ్మ బలిజపల్లె గ్రామంలో స్వయంభుగా వెలియడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. బలిజపల్లె గంగమ్మ వల్ల జిల్లాలోనే కాక రాష్ట్రంలోనూ రాజంపేటకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని తెలిపారు. గంగమ్మ కరుణతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిపించి ప్రజల, రైతుల కష్టాలు తీర్చాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎంతో ప్రసిద్ధి గాంచిన గంగమ్మ జాతరలో తాను ప్రతి ఏడాది పాల్గొని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, అమ్మవారిని వేడుకునే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతమని తెలిపారు. -
అకాల వర్షం.. అపార నష్టం
కేంద్ర కారాగాలను పరిశీలించిన జడ్జి కడప అర్బన్ : జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి.శ్రీదేవి సూచనల మేరకు జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్ తమ సిబ్బందితో కలిసి గురువారం కడప నగర శివార్లలోని పురుషుల కేంద్ర కారాగారం, మహిళల కారాగారంలోని ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి ఖైదీలతో మాట్లాడి వారి కేసు వివరాలను, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మానసిక వ్యాధిగ్రస్తులైన ఖైదీలతో మాట్లాడారు. సకాలంలో డాక్టర్ సలహాలు తీసుకుంటూ మందులు వాడాలన్నారు. అనంతరం కారాగారం పరిసరాలను, టాయిలెట్లను, వసతి గదులను, రిజిస్టర్లను పరిశీలించి తగు సూచనలను సలహాలను ఇచ్చారు. ఫిర్యాదుల పెట్టెను పరిశీలించడం జరిగినది, ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రాధాన్యతను తెలియజేశారు. కారాగారం లోపల ఖైదీల హక్కులు, ఉచిత న్యాయ సహాయము, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం మొదలగు అంశాలను వివరించారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్‌లైన్ నెంబర్ 15100 పై ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురుషుల కేంద్ర కారాగారము సూపరింటెండెంట్ రాజేశ్వరరావు, మహిళ కారాగారపు సూపరింటెండెంట్ కృష్ణవేణి, డాక్టర్లు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. కడప అగ్రికల్చర్ : పంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న అన్నదాతలపై ప్రకృతి కన్నెర్ర చేసింది. మొన్న చక్రాయపేట మండలంలో ఈదురు గాలులకు 2700 ఎకరాలకుపైగా అరటి పంట నేలవాలి దెబ్బతిని రూ.50 కోట్లకుపైగా రైతులకు నష్టం వాటిల్లింది. ఆ సంఘటన మరువకముందే మళ్లీ గురువారం సాయంత్రం ఉన్నట్లుండి కురిసిన అకాల వర్షంతోపాటు ఈదురు గాలులతో రైతులకు అపారనష్టం కలిగింది. జిల్లాలోని ఖాజీపేట, సికెదిన్నె మండలాల్లో పలువురు రైతులకు చెందిన అరటి చెట్లు నేలకొరిగాయి. దీంతో రైతులకు రూ.10 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్లు ఉద్యానశాఖ అధికారులు ప్రాథమిక పంట నష్టాన్ని అంచనా వేశారు. ఇందులో ఖాజీపేట మండలంలో 30 మంది రైతులకు సంంధించి 71.5 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా నేలకొరిగింది. దీంతో 7.15 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. అలాగే సికె దిన్నె మండలంలో 20 మంది రైతులకు సంబంధించి 35 ఎకరాల్లో ఆరటి పంట నెలకొరిగింది. దీంతో వారికి రూ. 3.5 లక్షల మేర నష్టం వాటిల్లింది. ఇలా మొత్తంగా 50 మంది రైతులకు సంబంధించి 106.5 ఎకరాల్లో అరటి పంట దెబ్బతినడంతో రూ.10.65 లక్షల నష్టం జరిగిందని ఉద్యానశాఖ అధికారులు ప్రాథమిక నష్ట పరిహారాన్ని గుర్తించారు. మార్కెట్‌యార్డులో తడిసిన పసుపు కడప మార్కెట్‌యార్డులోకి వర్షపునీరు చేరి ఎండు పసుపు తడిచి ముద్దయింది. అమ్మకం కోసం మార్కెట్‌యార్డుకు తెచ్చిన పసుపును కుప్పలుగా పోసుకుని ఉండగా.. ఉన్నట్లుండి కురిసిన వర్షంతో నీరంతా పసుపు కొమ్ముల కుప్పల అడుగుభాగంలో చేరి తడిచిపోయింది. వర్షం ప్రారంభం కాగానే పసుపు కుప్పలసై పట్టలు కప్పినా అడుగుభాగంలోకి వర్షపు నీరు చేరడంతో ఎండు కొమ్ములు తడిచాయని గోపులాపురానికి చెందిన వెంకటరెడ్డి, రామాంజనేయరెడ్డి, అప్పరాజుపల్లికు చెందిన విశ్వనాథరెడ్డి, కొత్తపేటకు చెందిన సుబ్బరాయుడులతోపాటు పలువురు రైతులు తెలిపారు. వర్షపునీటితో కొమ్ములు తడవటంతో పసుపు నాణ్యత తగ్గడంతోపాటు బరువు కూడా తగ్గుతుందని వారు వాపోయారు. తడిచిన పసుపు కొమ్ములను మళ్లీ ఆరబెట్టి అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులో సరైన వసతులు లేక పోవడంతోనే ఎండు పసుపు తడిచిందని పేర్కొన్నారు. ఈ విషయమై యార్కెట్‌యార్డు సెక్రటరీ సుజాతతో మాట్లాడగా.. పసుపు తడిచినట్లు రైతులెవరూ తమ దృష్టికి తేలేదని తెలిపారు. ఈదురు గాలులతో.. చింతకొమ్మదిన్నె : మండలంలో గురువారం మధ్యాహ్నం వీచిన ఈదురు గాలుల ధాటికి అరటి రైతులకు పెద్ద ఎత్తున నష్టం కలిగింది. నాగిరెడ్డిపల్లె, గూడావాండ్లపల్లె, బుగ్గలపల్లె, లింగారెడ్డిపల్లి తదితర గ్రామాలలో తోటలలో గెలలతో ఉన్న అరటి చెట్లు.. ఈదురుగాలికి చాలా చోట్ల నేలకొరిగాయి. అమృతపాణి రకం అరటి చెట్లు ఎత్తుగా పెరగడం వల్ల నేలపై వాలిపోయాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టి పంట సాగు చేశామని, తీరా చేతికి వచ్చే తరుణంలో ఈదురు గాలులు తమకు శాపంగా మారాయన్నారు. అరటికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లడంతో ప్రభుత్వం తమను అఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. దెబ్బతిన్న నువ్వుల కట్టె వేముల : అకాల వర్షాలతో నువ్వుల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. డిసెంబర్, జనవరి నెలలో సాగు చేసిన రైతులు.. నువ్వుల కట్టెను కోతలు కోసి కల్లాలకు తరలించారు. అక్కడ మూడు రోజులపాటు మగ్గిన తర్వాత నువ్వుల కట్టెను నూర్పిళ్ల కోసం వేశారు. ఎండలు బాగా ఉంటే రెండు, మూడు రోజులలో నువ్వుల కట్టెను తీసి వేసి.. నువ్వులను వేరు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. అయితే ఈలోగా అకాల వర్షాలు రావడంతో కల్లాల్లో ఉన్న నువ్వుల కట్టె తడిసి ముద్దమైంది. నువ్వుల కట్ట కింద ఉన్న నువ్వులు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట సాగు చేసి మూడు నెలలపాటు కాపాడుకుంటే నోటికాడికి వచ్చిన తర్వాత వర్షార్పణం కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. నేలకొరిగిన అరటి చెట్లు లబోదిబోమంటున్న రైతులు -
ప్రారంభమైన పది మూల్యాంకనం
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం గురువారం కడపలోని మున్సి పల్ హైస్కూల్ మొయిన్‌లో ప్రారంభమైంది. ఈ మూల్యాంకనానికి క్యాంపు ఆఫీసర్‌గా డీఈఓ షేక్ షంషుద్దీన్ వ్యవహరించారు. ఈ మూల్యాంకనానికి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి అన్ని సబ్జెక్టులకు సంబంధించి 1,75,934 పేపర్లు వచ్చాయి. ఈ మూల్యాంకన విధుల్లో 105 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 604 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 198 మంది స్పెషల్ అసిస్టెంట్లు పాల్గొని 12,910 పేపర్లను మూల్యాంకనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపు ఆఫీసర్, డీఈఓ షేక్ షంషుద్దీన్ మాట్లాడుతూ ఈ మూల్యాంకన ప్రక్రియ ఈ నెల 9 వరకు జరుగుతుందన్నారు. తొలి రోజు 12, 910 పేపర్లను మూ ల్యాంకనం చేశారని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ వెంకటేసు తెలిపారు. తొలి రోజు 12,910 సమాధాన పత్రాలకు మూల్యాంకనం -
విద్యార్థిని అదృశ్యం
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు పట్టణంలోని లక్ష్మీనగర్‌కు చెందిన ముత్తులూరు ప్రత్యూష (16) అనే విద్యార్థిని కనిపించడం లేదని తల్లి ప్రభావతి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రామక్రిష్ణ ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మీనగర్‌కు చెందిన ముత్తులూరు ప్రత్యూష పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో అంగడికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రానట్లు గురువారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తల్లి ప్రభావతి ఫిర్యాదు చేసింది. రేషన్‌షాపు సీజ్ కాశినాయన : మండల కేంద్రమైన నరసాపురంలోని రేషన్‌షాపును సీజ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డీటీ శివశంకర్ తెలిపారు. 25 క్వింటాళ్లు బియ్యం, 75 కేజీల చక్కెర స్టాకులో తక్కువగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. కేసు నమోదు చేసి ఈ విషయాన్ని జిల్లా అధికారులకు తెలియజేశామని పేర్కొన్నారు. అనుమానాస్పద స్థితిలో ఆటో డ్రైవర్ మృతి జమ్మలమడుగు రూరల్ : ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఎస్. మహమ్మద్ అజీజ్ (40) అనే ఆటో డ్రైవర్ అనుమానస్పదంగా మృతి చెందాడు. ఎస్ఐ బి. రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన మహమ్మద్ అజీజ్ గురువారం ప్రొద్దుటూరు నుంచి జమ్మలమడుగుకు బాడుగ కోసం వచ్చాడు. తిరిగి ప్రొద్దుటూరుకు వెలుతుండగా దానవులపాడుకు రాగానే అకస్మాత్తుగా ఆటోలోనే మృతి చెందాడు. అయితే కొంతకాలంగా అజీజ్ అనారోగ్యంతో ఉన్నట్లు సమాచారం. నకిలీ ఫోన్ పే మోసగాళ్ల అరెస్ట్ చాపాడు : నకిలీ ఫోన్ పే యాప్ ఉపయోగించి మూడు నెలలుగా జనరల్ స్టోర్‌లో మోసం చేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రైనీ డీఎస్పీ భవానీ వివరాలు వెల్లడించారు. చాపాడులోని నక్కలదిన్నె రోడ్డులో గల పెంచల నరసింహా జనరల్ స్టోర్‌లో.. చాపాడుకు చెందిన ముత్యాల శివశంకర్, లక్ష్మీపేటకు చెందిన భూమిరెడ్డి వీరాంజనేయరెడ్డి, సీతారామాపురానికి చెందిన సాయి గత మూడు నెలలుగా నకిలీ ఫోన్ పే యాప్ ద్వారా సరకులు కొనుగోలు చేస్తూ మోసానికి పాల్పడ్డారు. రూ.3 లక్షల వరకు సరకులు తీసుకెళ్లడంతోపాటు కత్తితో బెదిరించిన ఘటనపై బుధవారం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి శివశంకర్, వీరాంజనేయరెడ్డి, సాయిలను అరెస్ట్ చేసినట్లు ట్రైనీ డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి ఒక మొబైల్, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో ఎస్ఐ చిన్న పెద్దయ్య, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం
కడప సెవెన్‌రోడ్స్: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాష విమర్శించారు. బుధవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 25, 26 స్ఫూర్తికి వక్ఫ్ సవరణ బిల్లు తూట్లు పొడుస్తోందన్నారు. ప్రజాస్వామ్య, సెక్యులర్ దేశంలో ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరుల స్థాయికి దిగజార్చేందుకు ఎన్డీఏ ప్రయత్నిస్తోందన్నారు. 1954 నుంచి అమలులోకి వచ్చిన వక్ఫ్ చట్టానికి గతంలో జరిగిన సవరణలకు, నేటి సవరణలకు చాలా వ్యత్యాసముందన్నారు. గత ప్రభుత్వాలు ముస్లిం మత పెద్దలతో చర్చించాకే సవరణలు చేసిన సంగతి ఆయన గుర్తు చేశారు. మసీదులు, దర్గాలు, అషుర్ఖానాలు, స్మశానాల నిర్వహణ కోసం తమ పూర్వీకులు భూములను దానంగా ఇచ్చారని తెలిపారు. అవి అల్లాహ్‌కు సంబంధించిన ఆస్తులుగా తాము భావిస్తామన్నారు. కానీ నేటి ఎన్డీయే ప్రభుత్వం దాని అర్థాన్నే మార్చేస్తోందన్నారు. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన ఆధార పత్రాలు చూపమంటే ఎవరు చూపగలరని ప్రశ్నించారు. ఎవరు వక్ఫ్ చేయాలన్నా వారు ఐదేళ్లు ముస్లింగా ప్రాక్టీస్ చేసి ఉండాలని, ఇందుకు సంబంధించిన డిక్లరేషన్‌ను కోరడం ఏమిటంటూ ఆయన మండిపడ్డారు. వక్ఫ్ ట్రిబ్యునల్, సర్వే కమిషన్లా అధికారాలను తొలగించి కలెక్టర్లకు కట్టబెట్టడం తగదన్నారు. ఇప్పటివరకు వక్ఫ్ ఆస్తులకు సంబంధించి టైటిల్ నిర్ధారించే హక్కు వక్ఫ్ ట్రిబ్యునల్, కమిషన్‌కు మాత్రమే ఉండేదని, దాన్ని కలెక్టర్లకు కట్టబెట్టడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఎందుకంటే కలెక్టర్లు అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటారని తెలిపారు. డిఫెన్స్, రైల్వే తర్వాత వక్ఫ్ బోర్డుకే అధికంగా ఆస్తులు ఉన్నాయంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు మాట్లాడటం సహేతుకం కాదన్నారు. ప్రభుత్వం రైల్వే, డిఫెన్స్‌లకు భూములు కేటాయించింది తప్ప వక్ఫ్‌కు కేటాయించలేదన్నారు. వక్ఫ్‌బోర్డు పరిధిలో ఉన్న భూములు తమ పూర్వీకులు దానం చేసినవన్న విషయాన్ని మరవరాదన్నారు. బీజేపీ తన రాజకీయ లబ్ధికోసం దేశాన్ని ముక్కలు చేసేందుకు వక్ఫ్ సవరణ బిల్లు తెలుస్తోందని ఆరోపించారు. సవరణ బిల్లు ద్వారా వక్ఫ్‌కు ఆదాయం పెంచుతామని ప్రభుత్వం మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇప్పటివరకు వచ్చే ఆదాయంలో ముతవల్లీలు ఏడు శాతం వక్ఫ్‌కు చెల్లించేవారని, ఇప్పుడు సవరణ బిల్లులో దాన్ని ఐదు శాతానికి తగ్గించారన్నారు. ఇందువల్ల వక్ఫ్‌కు ఆదాయం తగ్గుతుందేగానీ ఎలా పెరుగుతుందో ప్రభుత్వమే చెప్పాలన్నారు. వక్ఫ్‌బోర్డులో నాన్ మైనార్టీలకు అవకాశం కల్పిస్తూ సవరణలు చేయడం అన్యాయమన్నారు. తిరుమల–తిరుపతి దేవస్థానం తదితర పాలక మండళ్లలో మైనార్టీలకు అవకాశం కల్పించనప్పుడు వక్ఫ్‌బోర్డులో ఇతరులకు ఎలా అవకాశం కల్పిస్తారని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఇఫ్తార్ విందులో ముస్లింలకు రక్షణగా ఉంటానన్న మఖ్యమంత్రి చంద్రబాబు బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా ముస్లిం ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారన్నారు. టీడీపీలోని మైనార్టీలు పునరాలోచించుకోవాలని, లేదంటే వారిని ముస్లింలు వెలివేస్తారని హెచ్చరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముస్లింల కోసం రిజర్వేషన్లను తీసుకొచ్చారని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీలకు పెద్దపీట వేశారని కొనియాడారు. మైనార్టీల సంక్షేమానికి రూ. 26 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత ఆయనదేనన్నారు. హజ్ యాత్రికుల కోసం ఎంబార్కేషన్ పాయింట్‌ను తీసుకొచ్చారన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో వక్ఫ్ సవరణ బిల్లును తమ పార్టీ వ్యతిరేకించిందన్నారు. ఈ సమావేశంలో హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌసులాజం, కార్పొరేటర్లు షఫీ, అక్బర్ అలీ, మైనార్టీ నాయకుడు బీహెచ్ ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ ఆస్తులు ముస్లింల పూర్వీకులు ఇచ్చినవి ఆధార పత్రాలు చూపాలంటే ఎలా సాధ్యం వక్ఫ్ చేయడానికి డిక్లరేషన్ కోరడం అసంబద్ధం ట్రిబ్యునల్, సర్వే కమిషన్ అధికారాల తొలగింపు తగదు బిల్లుకు మద్దతు ఇచ్చిన చంద్రబాబు మైనార్టీ ద్రోహి మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాష -
పది మూల్యాంకనానికి సర్వం సిద్ధం
● నేటి నుంచి ప్రారంభం.. 9వ తేదీ వరకు నిర్వాహణ ● ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు ● జిల్లాకు చేరిన సమాధాన పత్రాలు ● 1337 మంది సిబ్బందితో మూల్యాంకనం కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీకి ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 161 పరీక్షా కేంద్రాలలో 28,700 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలను రాశారు. కాగా.. సమాధాన పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 3వ తేదీ నుంచి కడపలోని మున్సిపల్ హైస్కూల్ మొయిన్‌లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చిన పరీక్ష పేపర్లకు కోడింగ్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. బుధవారం సాయంత్రం వరకు అన్ని సబ్జెక్టులకు కోడింగ్ ముగియగానే చివరగా సోసియల్ సబ్జెక్టుకు కోడింగ్ జరుగుతోంది. సిబ్బందికి వసతుల ఏర్పాటు... మూల్యాంకనం చేసేందుకు జిల్లావ్యాప్తంగా 1337 మంది సిబ్బందిని విధులకు ఏర్పాటు చేశారు. ఇందులో ఛీప్ ఎగ్జామినర్లు 121 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 732 మందిని, స్పెషల్ అసిసెంట్లుగా 484 మందిని ఇలా మొ త్తంగా 1337 మందిని నియమించారు. విధులకు హాజరయ్యే సిబ్బందికి అన్ని రకాల మౌలిక వసతులను ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాటు చేసింది. పక్కాగా నిబంధనలు అమలు: మూల్యాంకనంలో పాల్గొనే సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేశారు. ఈ కార్డు ఉన్న వారినే ఆ ప్రాంతంలోకి అనుమతించనున్నారు. మూల్యాంకనం జరుగుతున్న అన్ని రోజులు అటువైపు ఇతరులు రాకుండా ఆంక్షలు విధిస్తున్నారు. ● విడతల వారిగా.. ఈ ఏడాది వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1,72,172 జవాబు పత్రాలను ఇక్కడ మూల్యాంకనం చేయనున్నారు. ఇందుకోసం 1,337 మంది సబ్జెక్టు టీచర్లను విద్యాశాఖ నియమించింది. ఈ మూల్యాంకన కేంద్రంలో జిల్లా విద్యా శాఖ అధికారి క్యాంపు ఆఫీసర్‌గా, డిప్యూటీ ఈఓ రాజగోపాల్‌రెడ్డి, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్లు డిప్యూటీ క్యాంపు ఆఫీసర్లుగా, మరో ఏడు మంది అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. వీటితోపాటు ప్రతి గ్రూపునకు ఒక ఛీప్ ఎగ్జామినర్ (సీఈఓలు), ఆరుగురు సహాయ ఎగ్జామినర్లు (ఏఈలు), ఇద్దరు స్పెషల్ అసిసెంట్లు (ఎస్పీఏ) పాల్గొంటారు. ప్రతి సహాయక ఎగ్జామినర్ రోజుకు 40 పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. -
కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండటం సౌకర్యవంతం
ప్రొద్దుటూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండటం ప్రజలకు చాలా సౌకర్యవంతమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. మండలంలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీ కానపల్లె గ్రామ సచివాలయ నూతన భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అనే అంశంతో సచివాలయం, రైతు సేవా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ లను ఒకే ప్రాంగణంలో నిర్మించాలన్న ఆలోచన చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభినందిస్తున్నానన్నారు. సంపదను సృష్టించడం నాయకుడి ప్రధాన లక్షణమని, ఉన్న ఊరు సొంత ప్రాంతాన్ని చక్కపెడితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లే అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక పరిస్థితిని 4వ స్థానంలోకి తీసుకురావడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 3,260 విలేజ్ హెల్త్ క్లినిక్‌లను మంజూరు చేసిందని, ఆగిపోయిన విలేజ్ హెల్త్ క్లినిక్‌లను పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్రలో భాగంగా ప్రజలు, దాతలు భాగస్వాములతో అట్టడుగున ఉన్న పేదలను అత్యున్నతంగా ఉన్న సంపన్నుల ద్వారా అభివృద్ధి చేయడం పీ4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లు నంద్యాల వరదరాజులరెడ్డి, ఆదినారాయణరెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు, ఆర్డీఓ సాయిశ్రీ, డీఎస్పీ భావన, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు డాక్టర్ వరుణ్‌కుమార్‌రెడ్డి, సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, సంస్కృతి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘశరెడ్డి, వీఎస్ ముక్తియార్, కొనిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, తహసీల్దార్ గంగయ్య, ఎంపీడీఓ సూర్యనారాయణరెడ్డి, మండల వ్యవసాయాధికారి శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ -
లెదర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు కృషి
బద్వేలు అర్బన్ : మున్సిపాలిటీ పరిధిలోని చెన్నంపల్లె రెవెన్యూ పొలం సర్వే నెంబర్ 1580/బిలో చర్మకారుల సొసైటీకి కేటాయించిన 3.64 ఎకరాల స్థలంలో లెదర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. బుధవారం బద్వేలు పర్యటనకు వచ్చిన ఆయన ఆర్డీఓ చంద్రమోహన్, తహసీల్దారు ఉదయభాస్కర్రాజుతో కలిసి సొసైటీకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి సొసైటీ సభ్యులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత కోసం లెదర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి చర్మకారులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ లిడ్‌క్యాప్ డైరెక్టర్ రాజశేఖర్, చర్మకారుల సొసైటీ సభ్యులు, దళిత ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడి మృతి
బద్వేలు అర్బన్ : నీరు తాగేందుకు బావిలోకి దిగి ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం మండల పరిధిలోని కోనసముద్రం గ్రామంలో జరిగింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. బి.మఠం మండలం టి.రామా పురం గ్రామానికి చెందిన నాగిపోగు హృదయరాజు (32) గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఈయనకు భార్య దివ్యశ్రీతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. గొర్రెల మేత కోసం పచ్చని గ్రాసం ఉన్న గ్రామాలకు బృందాలుగా వెళుతుంటారు. ఈ క్రమంలో కోనసముద్రం సమీపంలోకి కొందరు గొర్రెల పెంపకందారులు గొర్రెలను మేత కోసం తీసుకువచ్చారు. మధ్యాహ్నం సమయంలో దాహం వేస్తుండటంతో నీరు తాగి వస్తానని చెప్పి బావి వద్దకు వెళ్లాడు. అయితే ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో తోటి కాపరులు బావిలోకి వెళ్లి చూడగా బావిలో నీటిపై తేలియాడుతూ కనిపించాడు. వెంటనే వారు బావిలోకి దిగి హృదయరాజును బయటికి తీసుకురాగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. అయితే హృదయరాజుకు ఈత రాదని తెలిసింది. నీరు తాగే సమయంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెంది ఉండవచ్చని కుటుంబ సభ్యులు, పోలీసులు భావిస్తున్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఏఎస్ఐ చంద్రమౌళి కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన దుండగుడు
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని మేకలబాలాయపల్లిలో గ్రామంలో వల్లెపు ఆశ అనే మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొని ఓ దండగుడు పరారైన సంఘటన బుధవారం జరిగింది. స్థానికులు, కలమల్ల పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉగాది పండుగ సందర్భంగా మేకలబాలాయపల్లె గ్రామంలోని బంధువుల ఇంటికి సింహాద్రిపురం మండల పరిధిలోని గురిజాల గ్రామానికి చెందిన వల్లెపు ఆశ అనే మహిళ వచ్చింది. ఈ గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా పెద్దమ్మతల్లి, దుర్గమ్మతల్లికి గ్రామ ప్రజలు బోనాలు మూడు రోజులు పాటు నిర్వహిస్తారు. బుధవారం వల్లెపు ఆశ పిల్లలకు ఐస్ కొనుక్కునేందుకు ఇంటి నుంచి బయటకు రోడ్డుపైకి వచ్చింది. ఈ సమయంలోనే ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్‌లో వచ్చి వల్లెపు ఆశ మెడలో ఉన్న సుమారు రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని ప్రొద్దుటూరు వైపు పరారయ్యాడు. వెంటనే బాధితురాలు కలమల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు సమీపంలోని సీసీ ఫుటేజ్‌లు పరిశీలించారు. కొండాపురం సీఐ మహమ్మద్‌రఫీ మాట్లాడుతూ ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు. విద్యార్థిని అదృశ్యం కడప అర్బన్ : కడప నగర శివార్లలోని సాంఘిక సంక్షేమ గిరిజన స్కూల్లో విద్యార్థిని అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న యశోద ఉదయం 7 గంటలకు హాస్టల్ నుంచి బయటకు వచ్చి అదృశ్యమైందన్నారు. విద్యార్థినికి మతిస్థిమితం సరిగా లేదని స్కూల్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశమన్నారు. -
ఆలయంలో చోరీకి యత్నం.. పట్టుకున్న గ్రామస్తులు
ముద్దనూరు : మండలంలోని కొర్రపాడు గ్రామంలోని ప్రముఖ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయ సముదాయంలో బుధవారం పట్టపగలే చోరీకి పాల్పడ్డారు. అయితే గ్రామస్తులు అప్రమత్తంగా ఉండడంతో నిందితుల్లో ఒకరని పట్టుకుని బంధించారు. మరొకరు పారిపోయినట్లు సమాచారం. గ్రామస్తుల కథనం మేరకు గ్రామంలో చెన్నకేశవ ఆలయంతో పాటు శివాలయం, రామాలయం, ఆంజనేయస్వామి ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఉగాది పర్వదినం సందర్భంగా చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి కల్యాణం చదివింపులు, ఇతర ముడుపులు, కానుకలు రూపంలో భారీగా సొమ్ము హుండీలో చేరింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇరువురు యువకులు మూడు ఆలయాల్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. చెన్నకేశవస్వామి ఆలయంలో నగదు, ఇతర ఆభరణాలను దొంగిలించే యత్నం చేశారు. ఆలయంలోని సుమారు రూ. 50 వేల నగదును ఒక వస్త్రంలో పడేసి మూట కట్టారు. ఇంతలోనే గ్రామస్తులు గుర్తించి దొంగలలో ఒకరిని పట్టుకున్నారు. మరొకరు అప్పటికే పారిపోయాడు. పట్టుబడిన నిందితుడు మైనర్‌గా గుర్తించి బంధించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టుబడిన నిందితునిది ప్రొద్దుటూరుగా గుర్తించారు. పోలీసు అధికారులు, ఆలయ ఈఓ దేవాలయాన్ని సందర్శించి చోరీ వివరాలను సేకరించారు. ఆలయంలో జరిగిన ఉత్సవాల సందర్భంగా భారీ సొమ్ము ఉంటుందనే నిందితులు ఈ చోరీకి పాల్పడి ఉంటారని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. -
సీపీఎం నేతల చుట్టూ స్థల వివాదం
సాక్షి టాస్క్‌ఫోర్స్ : కడప భగత్‌సింగ్ నగర్‌లోని విలువైన ఓ ప్రభుత్వ స్థలం విషయంలో స్థానిక ప్రజలు, సీపీఎం నాయకుల మధ్య వివాదం మళ్లీ రాజుకుంది. ఆ స్థలం తమ పట్టా అంటూ సీపీఎం జిల్లా మాజీ కార్యదర్శి నారాయణరెడ్డి ఇటీవల చదును చేయడంతో, అది గుడి స్థలమంటూ స్థానికులు అడ్డుచెప్పడంతో పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపారు. గతంలో ఇదే స్థలాన్ని లైబ్రరీ నిర్మాణం కోసం మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం చేయించిన సీపీఎం, నేడు ఆ పార్టీ మాజీ జిల్లా కార్యదర్శి ఆ స్థలం తమదేనంటుంటే మౌనముద్ర దాల్చడం చర్చనీయాంశంగా మారింది. చిలికి చిలికి ఈ అంశం ఆ పార్టీ రాష్ట్ర కమిటీ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నేత ప్రభాకర్‌రెడ్డి ఇటీవల కడపలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. స్థల వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.... చెమ్ముమియాపేట గ్రామ సర్వే నెంబరు 344 లో మున్సిపల్ ప్రాథమిక పాఠశాల దక్షిణం వైపు మూడు సెంట్ల ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది. సెంటు రూ. 20 లక్షలకు పైగా పలుకుతోంది. ఆ స్థలం విషయంలో చంద్రగిరి నారాయణ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు ఏర్పాటు చేసుకున్న గణేష్ ఉత్సవ కమిటీ, సీపీఎం నాయకుల మధ్య సుమారు పదేళ్లు గా వివాదం ఉంది. 1998 నుంచి ఆ స్థలంలో వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించేవారమని, అక్కడ సీతారామాంజనేయ ఆలయం నిర్మాణాన్ని చేపట్టేందుకు చందాలు పోగు చేసుకుని ఐరన్ ఫిల్లర్లు కూడా ఏర్పాటు చేసుకున్నారని స్థానికుల కథనం. అయితే సీపీఎం నాయకులు కొందరు ఆ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు దౌర్జన్యానికి దిగుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ 2016 డిసెంబరు 20న కడప తాలూకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే 2001–02లో అప్ప టి తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి తమ పార్టీ నా యకుడు బి.నారాయణరెడ్డి సతీమణి పి.పద్మమ్మకు ఆ స్థలాన్ని డీకేటీ పట్టాగా ఇచ్చారని సీపీఎం నాయకుల వాదన. లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు ఆమె తన స్థలాన్ని బహుమానంగా ఇచ్చారని వారు చెబుతూ దాన్ని ఆక్రమించేందుకు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీకి చెందిన కొంతమంది అక్కడ సీతారాముల విగ్రహాలు ఏర్పాటు చేసి మతపరమైన హింసను ప్రేరేపించడం ద్వారా శాంతికి విఘాతం కల్పిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ సీపీఎం నాయకుడు 2016 డిసెంబరు 31న కడప తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల నివే దిక ఆధారంగా అప్పటి కడప తహసీల్దార్ ప్రేమంత్‌కుమార్ ఆ స్థలంలోకి ఎవరూ ప్రవేశించరాదంటూ సెక్షన్ 145 సీఆర్పీసీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ స్థలం తమ పార్టీ నేత నారాయణరెడ్డి సతీమణిదంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపిన సీపీఎం నాయకులు, చెమ్ముమియాపేట వీఆర్వోకు ఇచ్చిన స్టేట్మెంట్లో ఆ స్థలం బి.సరస్వతమ్మకు ప్రభుత్వం కేటాయించగా, ఆమె అనుమతితో తాము నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించామని పరస్పర విరుద్ధంగా చెప్పడం గమనార్హం. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపాలని వీఆర్వో కోరగా, కనిపించడం లేదని చెప్పారు. తహసీల్దార్ కార్యాలయంలో కూడా అందుకు సంబంఽధించిన రికార్డులు లేవని స్పష్టం చేస్తూ చెమ్ముమియాపేట వీఆర్వో నివేదిక ఇచ్చారు. దాన్ని అప్పటి తహసీల్దార్ 2017 మే 15వ తేదీ ఆర్డీఓకు పంపారు. ఆ స్థలంలో స్థానికుల కోరిక మేరకు గుడి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలనే అర్థం స్ఫురించే విధంగా తహసీల్దార్ తన నివేదికలో రాశారు. ఈ క్రమంలో సీపీఎం జిల్లా నాయకత్వం మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీలో తీర్మానం చేయించేందుకు ప్రయత్నించింది. లైబ్రరీ కమిటీ (సుందరయ్య స్మారక కేంద్రం ట్రస్టు)కి అనుమతి ఇస్తూ జనరల్ బాడీ సమావేశం 2017 ఏప్రిల్ 19వ తేది తీర్మానం నెంబరు 155 ఆమోదించింది. అయితే గతనెల 24వ తేది సీపీఎం నాయకుడు నారాయణరెడ్డి ఆ స్థలం తనదేనంటూ జేసీబీతో చదును చేయించగా, శ్రీ సీతారామాలయ కమిటీ చైర్మన్ సి.నారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ స్థలంపై నకిలీ పట్టా సృష్టించి హార్డ్‌వేర్ షాపు యజమాని సురేంద్రారెడ్డి అనే వ్యక్తికి సీపీఎం మాజీ జిల్లా కార్యదర్శి విక్రయించారని సి.నారాయణ అనే స్థానికుడి అభియోగం. ఈ వ్యవహారంపై విచారణ జరిపి ఆ స్థలాన్ని గుడి నిర్మాణానికి కేటాయించాలని ఆయన అధికారులను కోరారు. సీపీఎం నేతల మౌన ముద్ర భగత్‌సింగ్ నగర్‌లోని ప్రభుత్వ ఖాళీ స్థలం విషయంలో ఇంత జరుగుతున్నా సీపీఎం జిల్లా నాయకులు మౌనముద్ర వహించడం విమర్శలకు తావిస్తోంది. ఒకప్పుడు అదే స్థలాన్ని లైబ్రరీ కమిటీకి కేటాయించాలని మున్సిపల్ జనరల్ బాడీలో తీర్మానం చేయించిన ఆ పార్టీ నాయకులు, నేడు అదే పార్టీకి చెందిన మాజీ జిల్లా కార్యదర్శి నారాయణరెడ్డి ఆ స్థలం తన పట్టా అని మాట్లాడుతున్నా మౌనం వహించడం వెనుక ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థలం లైబ్రరీకి కేటాయింపు కార్పొరేషన్లో తీర్మానం చేయించిన సీపీఎం నాయకులు నేడు తన పట్టా అంటున్న ఆ పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి భగత్‌సింగ్ నగర్లో స్థానికులు, సీపీఎం నేతల మధ్య ముదిరిన వివాదం -
కత్తితో దాడి చేసిన నిందితులు అరెస్టు
కమలాపురం : కత్తితో పొడిచి ముగ్గురు యువకులను గాయపరిచిన కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు కమలాపురం సీఐ ఎస్కే రోషన్, ఎస్ఐ ప్రతాప్ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గతంలో ఇందిరమ్మ కాలనీకి చెందిన షేక్ సల్మాన్ అనే యువకుడు అక్సా నగర్‌కు వచ్చి వేగంగా బైక్ నడుపుతుండగా అదే కాలనీకి చెందిన సోహైల్ యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉందని మందలించాడు. దీంతో సల్మాన్ అతనిపై కక్ష పెంచుకుని తండ్రి మహబూబ్ షరీఫ్‌తో కలసి గత నెల 31వ తేదీన సోహైల్ తన ఇంటి ముందు నిలబడి ఉండగా కావాలనే బైక్ తగిలించాడు. అతడు కిందపడిన తర్వాత కత్తితో పొడిచి బలమైన రక్తగాయం చేశాడు. అదే సమయంలో అతడిని వారించడానికి వచ్చిన షాబాజ్, రియాజ్‌లను సైతం సల్మాన్ తన తండ్రి సహకారంతో పొడిచి గాయపరిచాడు. ఈ కేసులో నిందితులను బుధవారం పట్టణ పరిధిలోని కంచి వరదరాజ స్వామి ఆలయం వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుంచి కత్తితో పాటు బైక్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కాగా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అర్ధరాత్రి వరకు పిల్లలు బయట తిరుగుతుంటే తల్లిదండ్రులు మందలించాలన్నారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
బద్వేలు అర్బన్ : బద్వేలు – మైదుకూరు రహదారిలోని తొట్టిగారిపల్లె సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. మండల పరిధిలోని కొత్తచెరువు గ్రామానికి చెందిన చరణ్, చిన్న, రాజేశ్వర్రావులు హైవే రోడ్డు పనులకు కూలీలుగా వెళుతుండేవారు. రోజూ మాదిరే పనులు ముగించుకుని స్వగ్రామానికి వెళుతున్న సమయంలో వేగంగా వచ్చి ఓ ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో ముగ్గురూ కిందపడి గాయాలు కావడంతో స్థానికులు 108కు సమాచారమిచ్చారు. అక్కడి నుంచి క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. పలుచోట్ల దొంగతనాలు వేంపల్లె : వేంపల్లెలో గుర్తు తెలియని వ్యక్తులు చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్నారు. మంగళవారం రాత్రి వేంపల్లెలోని మెయిన్ బజార్లో ఉన్న అమ్మవారిశాల అంగన్వాడీ కేంద్రానికి ఉన్న తాళాలు తీసి అంగన్వాడీ కేంద్రంలో ఉన్న 35 ప్యాకెట్ల కంది పప్పు, నాలుగు బాక్సులు (40 లీటర్ల) పాల ప్యాకెట్లను దొంగిలించినట్లు అంగన్వాడీ కార్యకర్త తెలిపారు. అలాగే జిల్లా పరిషత్ బాలుర పాఠశాల సమీపంలో ఉన్న ఇందు ట్రావెల్స్ కార్యాలయానికి ఉన్న బీగాలు పగులగొట్టి రూ.45వేల నగదుతోపాటు మూడు పాత సెల్ ఫోన్లు చోరికి గురైనట్లు బాధితుడు సురేష్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రం ఉన్న ప్రాంతంలో సాయంత్రం పూట ఎక్కువ మంది ఆకతాయిలు ఉంటారని, వారి పనై ఉంటుందని అంగన్వాడీ కార్యకర్త అనుమానం వ్యక్తం చేశారు. గత రెండు రోజుల క్రితం పులివెందుల బైపాస్ రోడ్డులో కూడా చిన్న, చిన్న దుకాణాల్లో చోరీలు జరిగినట్లు సమాచారం. అలాగే బృందావన కాలనీలో 10 బైకులలో ఉన్న పెట్రోలును దుండగులు దొంగిలించారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటో బోల్తా కొండాపురం : మండల పరిధిలోని కె.సుగుమంచిపల్లె గ్రామ సమీపంలోని నాలుగు వరుసల జాతీయ రహదారిపై ఆటో టైరు పగలడంతో అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వివరాలిలా.. మండలంలోని తిమ్మాపురం నుంచి తాడిపత్రి వైపు ప్రయాణిస్తున్న ఆటో దారి మధ్యలో కె.సుగుమంచిపల్లె గ్రామ సమీపం వద్ద జాతీయ రహదారిపై టైర్ పగలడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ముగ్గురు గాయపడటంతో 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ధర్మవరానికి చెందిన పుల్లయ్యకు తలకు తీవ్ర గాయంతో పాటు కాలు విరిగినట్లు స్థానికులు తెలిపారు. మిగిలిన ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. -
ఎవరిదీ ‘చెత్త’పని?
కడప కార్పొరేషన్ : కడపలో మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీకి అవమానం జరిగింది. నగరంలోని రాజీవ్ పార్కు ఎదురుగా ఉన్న ఆయన విగ్రహం వద్ద స్థానిక వ్యాపారులు చెత్త వేస్తున్నారు. ఎవరి వద్ద ఏర్పడిన చెత్తను వారే ఎత్తాలని నిబంధన ఉన్నా ఎవరికి వారు చెత్త ఎత్తకుండా ఇదిగో ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఎదుట వేస్తున్నారు. దీన్ని నగరపాలక సిబ్బంది కొన్ని సార్లు ఎత్తేస్తున్నా వ్యాపారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. పదే పదే వారు ఇలాగే వేయడం వల్ల నగరపాలక సిబ్బంది ఎత్తడం మానేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇలా విగ్రహం ముందు భాగమంతా చెత్తమయంగా మారింది. -
సమస్యల సాధనకు ఉద్యమిస్తాం
కడప ఎడ్యుకేషన్ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన ఆమోదయోగ్యమైన పెన్షన్ విధానం, పీఆర్సీ, ఐఆర్‌లపై ప్రభుత్వ నిర్ణయం ప్రకటించాలని ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లు రఘనాథరెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల సాధన కోసం బుధవారం రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు కడప కలెక్టరేట్ ఎదుట జిల్లా ఫ్యాప్టో చైర్మన్ ఎస్ఎండి ఇలియాస్ బాషా అధ్యక్షతన నిరసన కార్యక్రమాన్ని ర్వహించారు. ఈ సందర్భంగా రఘునాథరెడ్డి మాట్లాడుతూ సీపీఎస్, జపీపీఎస్ల స్థానంలో ఆమోదయోగ్యమైన పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి(ఐ.ఆర్) ప్రకటిస్తామన్న ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు రూ.30 వేల కోట్లు ఉండగా ఇటీవల రెండు విడతలుగా రూ.7300 కోట్లు చెల్లించారన్నారు. మిగిలిన సుమారు రూ.23 వేల కోట్ల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ, ఏఐఎస్టీఎఫ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించి, పర్యవేక్షణాధికారి పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం నిర్లిప్త ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రమైన మన రాష్ట్రంలో తెలుగు మాధ్యమం కొనసాగించాలని పోరాటం చేయాల్సి రావడం శోచనీయమన్నారు. అనంతరం కలెక్టరేట్ నుంచి మహావీర్ సర్కిల్ మీదుగా మళ్లీ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ ఏవీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ జనరల్ రాళ్లపల్లె అబ్దుల్లా, కో చైర్మెన్ వెంకటసుబ్బారెడ్డి, రామచంద్ర బాబు, మాదన విజయకుమార్, శ్యామలాదేవి, శ్రీనివాసులరెడ్డి, ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు లక్ష్మి రాజా, శ్యాంసుందర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, కె.సురేష్ బాబు, కంభం బాల గంగిరెడ్డి, జిల్లా నాయకులు సంగమేశ్వర్ రెడ్డి, బి.రాజు, వీరాంజనేయరెడ్డి, ఖాదర్ బాషాతోపాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.కలెక్టరేట్ ఎదుట కదం తొక్కిన ఫ్యాప్టో నాయకులు -
కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలి
కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తోందని, సత్వరమే పరీక్షల తేదీ ప్రకటించకుంటే నిరుద్యోగుల పక్షాన చలో విజయవాడ పిలుపునిస్తామని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముడియం చిన్ని, వీరనాల శివకుమార్ హెచ్చరించారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షల తేదీ ప్రకటించాలని కోరుతూ బుధవారం కడపలోని మహావీర్ సర్కిల్ నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో 2022లో నోటిఫికేషన్ ఇచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించి పోస్టులు భర్తీ చేయలేదన్నారు. ప్రతిపక్షంలో ఉండగా యువగళం పాదయాత్రలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లో కోర్టు కేసులు క్లియర్ చేసి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా ఇంతవరకు అతీగతీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రెబ్బ నరసింహులు, నగర కార్యదర్శి విజయ్, నగర సహాయ కార్యదర్శి శ్రీకాంత్, ఉపాధ్యక్షులు వంశీ, విద్యుత్ రామకృష్ణ, నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు. -
నేడు కలెక్టరేట్ ఎదుట నిరసన
కడప ఎడ్యుకేషన్ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ, ఐఆర్, డీఏ బకాయిల విడుదల, సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, మెడికల్ బిల్లుల రీఎంబర్స్మెంట్, కారుణ్య నియామకాలు తదితర సమస్యల సాధన కోసం ఫ్యాప్టో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు 2వ తేదీ బుధవారం కడప కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం కడపలోని ఎస్టీయూ కార్యాలయంలో నిరసన కార్యక్రమానికి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఫ్యాప్టో కార్యవర్గ సభ్యుడు సయ్యద్ ఇక్బాల్ మాట్లాడుతూ 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ ఇలియాస్ బాషా ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్ ఆర్.అబ్దుల్లా, నాయకులు ఖాదర్ బాషా, రాజశేఖర్, నరసింహారావు, సాజిద్, బాలగంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌పై టీడీపీ వర్గీయుల దాడి చెన్నూరు(వల్లూరు) : మండల కేంద్రమైన చెన్నూరులో సోమవారం రాత్రి టీడీపీ వర్గీయులు సోషల్ మీడియా యాక్టివిస్ట్ మిట్టా మాధవరెడ్డిపై దాడి చేశారు. టీడీపీ నేతలు, మద్దతుదారులు చేస్తున్న అక్రమాలను వెలుగులోకి తెస్తూ, వారి అక్రమ ధనార్జనకు అడ్డుగా మారాడనే అక్కసుతో ఆ పార్గీకి చెందిన వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వివరాలిలా.. చెన్నూరుకు చెందిన మిట్టా మాధవరెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మండలంలో టీడీపీ నేతలు, వారి అనుచరులు చేస్తున్న అక్రమాలను సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెస్తున్నాడు. అక్రమార్జనే ధ్యేయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న టీడీపీ వర్గీయులకు ఇది కంటగింపుగా మారింది. తమ ఆదాయాలకు గండి కొడుతున్నాడనే కారణంగా అతనిపై కక్ష పెంచుకున్న టీడీపీ వర్గీయులు అదును కోసం వేచి ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి చెన్నూరులోకి కొత్త రోడ్డులో గల ఒక హోటల్లో ఉన్న మాధవ రెడ్డిపై టీడీపీ వర్గీయులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మాధవరెడ్డిని పోలీసులు 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరామర్శించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాధవరెడ్డిని పరామర్శించారు. దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తనపై విచారణ
బద్వేలు అర్బన్ : పట్టణంలోని శివానగర్‌లో గల లిటిల్ ఫ్లవర్ స్కూల్లో గత నెల 29న 4వ తరగతి విద్యార్థిని పట్ల అన్వర్‌బాషా అనే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై మంగళవారం ఉప విద్యాశాఖాధికారి రాజగోపాల్‌రెడ్డి విచారణ చేపట్టారు. జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ విచారణలో భాగంగా తొలుత పాఠశాలకు వెళ్లి పాఠశాల కరస్పాండెంట్‌ను, తోటి ఉపాధ్యాయులను విచారించారు. అలాగే అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు ఎన్ని నెలలుగా పాఠశాలలో పనిచేస్తున్నాడనే విషయంపై ఆరాతీశారు. అనంతరం విద్యార్థిని తల్లిదండ్రులను విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని, విచారణలో సేకరించిన వివరాలను నివేదిక రూపంలో జిల్లా విద్యాశాఖాధికారికి అందజేస్తామని తెలిపారు. ఆయన వెంట ఎంఈఓలు చెన్నయ్య, రఘురాములు, సిబ్బంది పాల్గొన్నారు. -
కరువు మండలాల ప్రకటనలో అన్యాయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో కడప జిల్లాలోని పడమటి ప్రాంతాలను ప్రధానంగా మెట్ట ప్రాంత మండలాలను విస్మరించిందని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అన్నారు. మంగళవారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 9 మండలాల్లో తీవ్ర కరువు, 1 మండలంలో సాధారణ కరువు ఉన్నట్లు మొత్తం పది మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అయితే ఎలాంటి నీటి పారుదల సౌకర్యం లేని కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు నియోజకవర్గాల్లోని మెట్ట (వర్షాధారం) మండలాలను ప్రకటించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. కరువు మండలాల సంఖ్య పెరిగే కొద్దీ పంటల బీమా పెట్టుబడి రాయితీ పరిహారం చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే కరువు మండలాలను తగ్గిస్తూ వస్తున్నాయని ఆరోపించారు. ఉచితంగా పశుగ్రాస విత్తనాలు, పశువుల దాణా మంజూరు చేయాలన్నారు. వలసలను నివారించేందుకు ఉపాధి హామీ దినాలను పెంచాలన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కేసీ బాదుల్లా పాల్గొన్నారు. పశ్చిమ మండలాలను విస్మరించారు.. కడప జిల్లా పశ్చిమ ప్రాంతంలోని మండలాల్లో గత ఖరీఫ్, రబీ సీజన్లో అతివృష్టి, అనావృష్టితో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ఆ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దస్తగిరిరెడ్డి కోరారు. మంగళవారం నగరంలోని సీపీఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలోని రైతు సంఘాలతో గాని, వివిధ పార్టీల ప్రతినిధులతో గాని మాట్లాడకుండా, జిల్లాలోని అన్ని మండలాలు పర్యటించకుండా, రైతాంగంతో మాట్లాడకుండా, జిల్లా ఉన్నతాధికారులు ఇచ్చిన అరకొర సమాచారంతో కేంద్ర ప్రభుత్వ కరువు బృందం జిల్లాలోని 10 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిందన్నారు. ఆ మండలాల్లో కడప జిల్లా పశ్చిమ మండలాలు ఏ ఒక్కటీ లేకపోవడం దారుణమన్నారు. జిల్లా వ్యాప్తంగా 36 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు విలయతాండవం చేస్తున్నప్పటికీ, కేవలం పది మండలాలనే కరువు ప్రాంతాలుగా గుర్తించడం అన్యాయమన్నారు. -
చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే చర్యలు
పులివెందుల రూరల్ : చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని జూనియర్ సివిల్ జడ్జి ఎం.చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని పులివెందుల ప్రభుత్వ గిరిజన సమీకృత బాలికల వసతి గృహంలో మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ చిన్నపిల్లలపై రోజు రోజుకు పెరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను నిరోధించేందుకు సుప్రీంకోర్టు 2012 నవంబర్ 12వ తేదీన పోక్సో చట్టం ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ కిశోర్ కుమార్ రెడ్డి. పాలగిరి ప్రకాష్, వార్డెన్ కళావతి, పోలీసు సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. -
వామ్మో.. ఎలుగుబంటి
అట్లూరు : అట్లూరు మండల పరిధిలోని కొండూరు గ్రామంలో ఎలుగుబంటి సంచారం గ్రామస్తులను హడలెత్తిస్తోంది. అసలే ఎండలు ఆపై ఉక్కపోత తట్టుకోలేక రాత్రివేళల్లో గ్రామస్తులు ఆరుబయట నిద్ర పోతున్నారు. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజులుగా నల్లకుంట చెరువు లోని కంపచెట్ల నుంచి రాత్రి వేళల్లో ఎలుగుబంటి వీధుల్లోకి వస్తోంది. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అయితే కుక్కలు వెంటబడడంతో ఎలుగుబంటి కంపచెట్లలోకి వెళుతోందని, ఎప్పుడు ఎవరిమీద పడి దాడి చేస్తుందో అని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు.కడప ఉక్కు పరిశ్రమపై స్పందించాలిప్రొద్దుటూరు : కడప ఉక్కు పరిశ్రమపై రాయలసీమ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించాలని రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జగన్ తెలిపారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారన్నారు. 11 ఏళ్లు అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కడప ఉక్కు పరిశ్రమ గురించి పట్టించుకోవడం లేదన్నారు. కేవలం ఉక్కు పరిశ్రమను శంకుస్థాపనలకే పరిమితం చేశారన్నారు. రాయలసీమ ప్రజలను ఓట్లు, సీట్ల కోసం వాడుకుంటున్నారే తప్ప అభివృద్ధి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.ఉరి వేసుకుని యువతి ఆత్యహత్యపోరుమామిళ్ల : మండలంలోని రాజాసాహేబ్‌పేట పంచాయతీ తిరువెంగళాపురానికి చెందిన కల్లూరి రామతులసి(25) మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నట్లు ఎస్ఐ కొండారెడ్డి తెలిపారు. వివాహ సంబంధాల విషయంలో ఆమె తీవ్ర అసంతృప్తితో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తండ్రి జయరామిరెడ్డి పోలీసులకు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు.పదో తరగతి విద్యార్థిని అదృశ్యంలక్కిరెడ్డిపల్లి : మండలంలోని కాకులవరం గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థిని చివరిరోజు పదో తరగతి పబ్లిక్ పరీక్ష రాసి కనిపించలేదని బాలిక తల్లిదండ్రులు లక్కిరెడ్డిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి బాలిక కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ రవీంద్ర బాబు తెలిపారు. -
ఎండీయూ ఆపరేటర్లకు చెక్
ప్రొద్దుటూరు : రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రొద్దుటూరు మండలంలో మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) ఆపరేటర్లను కాదని చౌకదుకాణాల డీలర్ల ద్వారానే రేషన్ పంపిణీ చేసే విధంగా అధికార పార్టీ నేతలు హుకూం జారీ చేశారు. నేతల ఆదేశాలకు అధికారులు తలూపడంతో అటు కార్డుదారులతోపాటు ఇటు ఆపరేటర్లు నష్టపోతున్నారు. ప్రొద్దుటూరు మండలంలో 144 చౌకదుకాణాలు ఉన్నాయి. ఈ చౌకదుకాణాల పరిధిలో 70వేల రేషన్ కార్డుదారులు ఉన్నారు. రేషన్ తీసుకునేందుకు కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. కొన్ని ప్రాంతాలతోపాటు అసలు రేషన్ షాపులు లేని గ్రామాలు కూడా ఉన్నాయి. ఆపరేటర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటికి రేషన్ అందిస్తున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపుగా రేషన్ షాపులన్నీ టీడీపీ నేతలు దక్కించుకున్నారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తమ వర్గీయులకు రేషన్‌షాపులను ఇవ్వాలని అధికారులకు సిఫారసు లేఖలు పంపించారు. ఈ కారణంగా ప్రస్తుతం చౌకదుకాణాలన్నీ టీడీపీ వర్గీయుల చేతిలో ఉండగా ఎండీయూ ఆపరేటర్లు మాత్రం గత ప్రభుత్వంలో నియమించిన వారే ఉన్నారు. సాంకేతిక సమస్యలతోపాటు బ్యాంక్ లోన్ కారణంగా ఆపరేటర్లను తొలగించలేని పరిస్థితి ఏర్పడింది. ఆపరేటర్ల వ్యవస్థ ద్వారా తాము ఆదాయం కోల్పోతున్నామని భావించిన డీలర్లు అధికార పార్టీ నేతలను ఆశ్రయించి ఆపరేటర్లను నిలుపుదల చేస్తూ నేతల ద్వారా మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి స్వయంగా ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థ కొనసాగుతుండగా ప్రొద్దుటూరులో మాత్రమే బ్రేక్ పడింది. మా పొట్ట కొట్టకండి తమను తొలగించి తమ పొట్ట కొట్టొద్దని ఎండీయూ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులమైన తాము ప్రతి నెల ప్రభుత్వం ఇచ్చే వేతనంతో జీవనం సాగిస్తున్నామన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవచ్చని, అందరి పొట్టకొట్టడం సరైన విధానం కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆథరైజేషన్ వేస్తేనే పంపిణీ గత ప్రభుత్వంలో అమలు చేసిన నిబంధనల ప్రకారం గోడౌన్ నుంచి డీలర్లు సరుకును ప్రతి నెల తీసుకోవాల్సి ఉంటుంది. డీలర్ తీసుకున్న సరుకును ఎండీయూ ఆపరేటర్‌కు ఇవ్వడం, ఈ పాస్ మిషన్‌లో ఆథరైజేషన్ వేసి వారు కార్డుదారులకు పంపిణీ చేయడం జరుగుతోంది. ప్రతి ఎండీయూ ఆపరేటర్‌కు ప్రతినెల రూ.21వేలు వేతనం ప్రభుత్వం చెల్లిస్తోంది. డీలర్లకు చౌకదుకాణాలను అప్పగిస్తే ఎండీయూల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. వ్యాన్లన్నీ ఆపరేటర్ల పేరుతోనే ఉన్నాయి. అన్ని చోట్ల డీలర్లే పంపిణీ చేస్తున్నారు ప్రొద్దుటూరు మండలానికి సంబంధించి 43 మంది ఎండీయూ ఆపరేటర్లు ఉన్నారు. వీరిలో 26 మంది మున్సిపాలిటీ పరిధిలో ఉండగా 17 మంది మండల పరిధిలో ఉన్నారు. తొలి రోజు అన్ని చోట్ల డీలర్లే బియ్యం పంపిణీ చేశారు. ఈ విషయంపై సంబంధిత అధికారి మాట్లాడుతూ ఎండీయూ ఆపరేటర్లకు సంబంధించిన ఈ పాస్ మిషన్ ఆథరైజేషన్ ఫింగర్ వేసి డీలర్లకు అప్పగించాలని చెప్పినట్లు తెలిపారు. రేషన్ షాపుల్లో సరుకులు పంపిణీ చేయడం వల్ల కార్డుదారులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇంటింటికి రేషన్ పంపిణీ చేయాలి ఎండీయూ ఆపరేటర్ల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు యల్లయ్య, ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా ఇన్చార్జి గడ్డం నరసింహా తదితరులు మంగళవారం మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ సాయినాథ్‌రెడ్డికి వినతి పత్రం అందించారు. బడుగు బలహీన వర్గాల వారు రేషన్ షాపులకు వెళ్లి సరుకులు తీసుకోవడం కష్టంగా ఉంటుందన్నారు. వ్యవస్థను పటిష్టం చేసి సక్రమంగా ఇంటింటికి రేషన్ పంపిణీ చేయాలని కోరారు. రేషన్ షాపుల్లోనే బియ్యం పంపిణీ చేయాలని ఆదేశాలు పొట్టకొట్టొద్దంటున్న ఎండీయూ ఆపరేటర్లు ప్రొద్దుటూరులోనే అమలు కార్డుదారులకు తప్పని ఇబ్బందులు -
గతి తప్పిన రిమ్స్
కడప టాస్క్‌ఫోర్స్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్, రిమ్స్)లో వైద్యులు, ఇతర సిబ్బంది విధి నిర్వహణ గతి తప్పుతోంది. ఇక్కడ పనిచేస్తున్న వైద్యుల్లో చాలామంది తమ విధులను చిత్తశుద్ధితో నిర్వహిస్తుంటారు. వీరుగాక కొందరు వైద్యులు మాత్రం తమకు నచ్చిన, తమను మెచ్చిన వైద్యులతో కలిసి చెట్టాపట్టాలేసుకుని ‘రిమ్స్’ ప్రాంగణంలోనే తిరుగుతూ అందరినీ విస్మయానికి గురిచేస్తున్నారు. కొందరు డాక్టర్లు తమకేమీ పట్టనట్లు బయోమెట్రిక్, ఎఫ్ఆర్ఎస్ వేసిన తరువాత అలా బయటకు వెళ్లి టిఫిన్లు, కాఫీలను ముగించుకుని ఎంచక్కా 9 గంటలకు పైగా తమకు నచ్చిన సమయంలో వచ్చి విధులను నిర్వహిస్తుంటారు. మరికొందరు ఇంటి నుంచి తమ, తమ సొంతకారులో ఐపీ విభాగానికి వారి వార్డులకు వెళ్లి అక్కడ విధులను నిర్వహిస్తున్న హౌస్సర్జన్లు, పీజీలకు విధులను అప్పజెప్పి ‘హాయ్, బాయ్’ అని చెపుతూ తమదారిన తాము కారు పార్కింగ్ దగ్గరకు వచ్చేస్తారు. తరువాత రిమ్స్ ఆవరణంలోనూ, రిమ్స్ ఆవరణం చుట్టూ బైపాస్ రోడ్లలోకి వెళ్లి తమ ‘ఇష్టాలు, కష్టాలు’ పంచుకుని మరలా వైద్యాఽధికారులు రౌండ్స్‌కు వచ్చే సమయానికి ఎంచక్కా విధులకు హాజరై కాలక్షేపం చేసి సమయం పూర్తికాగానే ఎవరిదారిన వారు వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● మంగళవారం ఓపీ విభాగంలో కొన్ని విభాగాలలో హెచ్ఓడీలు, వైద్యులు ఎంచక్కా విధులకు వస్తే కొన్ని విభాగాలలో మాత్రం హౌస్సర్జన్లు, పీజీ వైద్యులు మాత్రమే వైద్యపరీక్షలను నిర్వహిస్తున్నారు. మహిళా ఆర్థోపెడిక్ విభాగానికి వైద్యులు అస్సలు అరగంటపైగా దాటినా రాకపోవడం గమనార్హం. ఈ విధులకు హాజరుకాని వైద్యులలో ఇద్దరు గతంలో బయోమెట్రిక్‌కు వేలిముద్రలు మాయం చేసి, అవి అధికారుల దృష్టికి వెళ్లడం, ప్రతి చర్యగా సదరు వైద్యులను కొన్ని నెలలపాటు కలెక్టరేట్లో విధులు నిర్వహించేలా చేసినా వారి పద్ధతిని మార్చుకోలేదనే ప్రజలు అనుకుంటున్నారు. ● పరిపాలనా విభాగంలో ఉద్యోగులకు, పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ రీ ఎంబర్స్మెంట్ ‘బిల్లులు’ మంజూరు కావాలంటే తప్పనిసరిగా ‘చేయి తడపాల్సిందే’. తమకు అనూకూలంగా పర్సెంటేజీల వంతుగా చేతులు తడిపితే కానీ ఫైళ్లు ముందుకు కదలవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులైనా, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, వైద్యులకై నా ఈ తిప్పలు తప్పడం లేదంటున్నారు. ● ఇక్కడ పనిచేస్తున్న కొన్ని విభాగాల వైద్య సిబ్బంది విధులకు సంబంధించిన డ్యూటీ చార్ట్‌లను వేయడంలో కొందరు నకిలీ విలేకరుల ప్రమేయం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొందరు మహిళా అధికారులను ఏకంగా సదరు నకిలీ విలేకరులు, ఫోన్లలో బెదిరించడం సదరు అధికారులు, మహిళా సిబ్బంది తమకు ఏమీ పట్టనట్లుగా, తాము ఎవరికై నా చెప్పుకుంటే తమ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగినట్లుగా భావిస్తూ ‘పంటి బిగువు’న ఆ వేధింపులను, వెకిలి చేష్టలను సైతం భరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే మనిషినంటూ ఓపీ క్యాంటీన్‌కు తాళం.. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఓపీలో క్యాంటీన్ సేవలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉండేవి. ఈ క్యాంటీన్‌కు వచ్చే రోగులు, వారి సహాయకులు బయటకు వెళ్లకుండానే తక్కువ ధరలకే టీ, కాఫీ, వాటర్ బాటిళ్లు, ఇతర అల్పాహార సేవలను పొందేవారు. ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది కూడా సేవలను అందుకునేవారు. కాస్త ఉపశమనం పొందేవారు. గడువు ముగిసిన తరువాత అధికారులు నిబంధనల మేరకు టెండర్లను పిలవకుండానే.. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే మనిషినంటూ ఓ వ్యక్తి వచ్చి క్యాంటీన్‌కు తాళం వేసి ఎంచక్కా వెళ్లాడు. ఓ ప్రైవేట్ వ్యక్తి వచ్చి తాను ఎమ్మెల్యే మనిషినంటూ క్యాంటీన్కున్న రెండు వాకిళ్లకు తాళాలు వేసుకుని వెళ్లడం ఎంతవరకు సమంజసమని సామాన్య ప్రజలు సైతం తప్పుపడుతున్నారు. ఈ వ్యవహారం తెలిసినా తమకేమీ పట్టనట్లు, తెలియనట్లు అధికారులు సైతం వ్యవహరించడం కొసమెరుపు. ఉదయం 9:20 అవుతున్నా విధులకు రాని ఆర్థోపెడిక్ వైద్యులు వైద్య సిబ్బంది డ్యూటీ చార్ట్‌లలో నకిలీ విలేకరుల ప్రమేయం మెడికల్ రీ ఎంబర్స్మెంట్ బిల్లుల మంజూరులో ‘చేతులు తడపాల్సిందే’ ఎమ్మెల్యే మనిషినంటూ ఓపీ క్యాంటీన్‌కు తాళాలు వేసినా పట్టించుకోని అధికారులు -
పోలీస్ స్టేషన్ ఎదుట ట్రాన్స్జెండర్ల ఆందోళన
కడప అర్బన్ : సహచర ట్రాన్స్‌జెండర్‌కు మోసం చేసిన కడప నగరం అశోక్ నగర్ చెందిన యువకుడిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కడప నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద పలువురు ట్రాన్స్జెండర్లు మంగళవారం ఆందోళన నిర్వహించారు. వివరాలు ఇలా..దేవి అనే ట్రాన్స్‌జెండర్‌ను సతీష్ అనే యువకుడు ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని చెప్పాడన్నారు. అయితే దేవి ఆరోగ్యం బాగా లేదని వదిలేశాడన్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించమని కూర్చున్నారు. ఈ ఆందోళనపై స్పందించిన కడప వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ బాధితురాలికి న్యాయం జరిగేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఫిర్యాదు చేసిన ట్రాన్స్జెండర్లతో పాటు యువకుడిని పిలిపించి సీఐ బి.రామకృష్ణ మాట్లాడారు. సమస్య సద్దుమణగడంతో వారు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో కడప ఒన్‌టౌన్ ఎస్ఐ అమర్నాథ్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఈత కొమ్మలకు భలే గిరాకీ
పులివెందుల రూరల్ : వేసవి కాలంలో ఈత కొమ్మలకు భలే గిరాకీ ఏర్పడింది. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు ఈత కొమ్మలను కొనుగోలు చేసి వాటిని అరటి మొక్కలకు అండగా ఈత కొమ్మలను నాటుతారు. పులివెందుల ప్రాంతంలో అరటిని ఎక్కువ సాగు చేయడంవల్ల అరటి పిలకలు నాటినప్పుడు ఆ పిలకలు ఎండ వేడిమి నుంచి, వివిధ రకాల అడవి జంతువుల బారి నుంచి కాపాడుకునేందుకు ఈత కొమ్మలను రైతులు అరటి పిలకల పక్కనే నాటుతారు. హిందూపురం, పెనుగొండ, సత్యసాయి, అనంతపురం ప్రాంతాల నుంచి ఈత కొమ్మలను చెట్ల నుంచి కోసుకొని వచ్చి పులివెందుల ప్రాంతంలో ఒక్కో ఈత కొమ్మను రూ.5ల చొప్పున విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా సంబేపల్లె : చిత్తూరు – కర్నూలు జాతీయ రహదారిపై సంబేపల్లె వద్ద మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా పడింది. కడప నుంచి సిలిండర్ ఫుల్ లోడుతో నిమ్మనపల్లెకు వెళుతున్న లారీ మండల కేంద్రంలోని వడ్డపల్లె క్రాస్ రోడ్డు సమీపంలోకి రాగానే అదుపు తప్పి డివైడర్ ఎక్కడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ శివకు గాయాలయ్యాయి. -
వేగంగా రెవెన్యూ సమస్యల పరిష్కారం
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో రెవెన్యూ సమస్యలు వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాల్ లో పీజీఆర్ఎస్ అర్జీలు, రెవెన్యూ సదస్సులు, రీ సర్వే, గ్రామసభలు, తదితర రెవెన్యూ సమస్యలపై కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అదితిసింగ్‌తో కలిసి జిల్లా రెవెన్యూ అధికారి, రెవెన్యూ డివిజన్ల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, పులివెందుల ఆర్డీవో చిన్నయ్య, బద్వేల్ చంద్రమోహన్, జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ, కలెక్టరేట్ ఏవో విజయ్ కుమార్ తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఐటీ పార్కు ఏర్పాటుకు స్థల పరిశీలన జిల్లాలో ఐటీ పార్కు ఏర్పాటు కోసం స్థానిక ఎమ్మెల్యే ఆర్.మాధవిరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మంగళవారం రిమ్స్ సమీపంలోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. కడప నగర శివార్లలోని పుట్లంపల్లె పంచాయతీ పరిధిలో పాలకొండ వద్ద ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమికి సంబంధించి రికార్డులు, మ్యాపులను పరిశీలించారు. చుట్టు పక్కల గతంలో ఇతరులకు కేటాయించిన ప్రభుత్వ స్థలాల వివరాలను కూడా జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, కడప తహసీల్దార్ నారాయణరెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాత కలెక్టరేట్, పాత రిమ్స్ పరిశీలన పోటీ పరీక్షలకు సంసిద్ధం అయ్యే విద్యార్థుల కోసం బీసీ వెల్ఫేర్ భవన్‌ను మరింత వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. స్థానిక పాత రిమ్స్, పాత కలెక్టరేట్లోని ప్రాంగణాలు, భవనాలను ఆయన కడప ఆర్టీవో జాన్ ఇర్విన్, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుగా పాత రిమ్స్‌లోని ఖాళీ స్థలాలు, ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పాత రిమ్స్ వెనుక భాగంలో నూతనంగా నిర్మించిన బీసీ వెల్ఫేర్ భవనాన్ని బీసీ సంక్షేమ శాఖ అధికారితో కలిసి మీటింగ్ హాలు, తరగతి గదులు, ఇతర రూములను పరిశీలించారు. అనంతరం పాత కలెక్టరేట్లోని ప్రాంగణాలు, గదులను పరిశీలించి అక్కడి గత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి భరత్ కుమార్‌రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
● వైఎస్సార్సీపీ పాలనలో ఆరంభంలోనే..
రైతులు పంటల సాగు కోసం ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖరీఫ్ ఆరంభంలోనే పెట్టుబడి సాయం (వైఎస్సార్ రైతు భరోసా) అందించి అన్నదాతలకు అండగా నిలిచింది. ఏటా క్రమం తప్పకుండా ఈ మొత్తాన్ని అందించింది. పీఎం కిసాన్ సాయం కింద రూ.6 వేలు, వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.7500 మొత్తం కలిపి ఏడాదికి రూ.13500 అందజేసింది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతు ఖాతాలకు జమ చేసింది. ఇందులో ఖరీఫ్ ప్రారంభం, రెండవది కోతల సమయం, మూడవది ధాన్యం ఇంటికి చేరే వేళ అందించారు. ఇలా వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ కింద ఐదేళ్లపాటు రూ.1191.03 కోట్లను అన్నదాతలకు అందించి అండగా నిలిచింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రాష్ట్ర వాటా కింద రూ.14 వేలు అందిస్తామని ప్రకటించింది. అంటే ఏడాదికి కేవలం రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లా రైతాంగానికి రూ. 294.67 కోట్లు అందనుంది. అలాగే గత ప్రభుత్వం కంటే అదనంగా ప్రతి రైతులకు ఏడాదికి రూ.6500 చొప్పున లబ్థి చేకూరనుంది. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 210481 మంది రైతులకు ఏడాదికి అదనంగా 136.81 కోట్లు అందనుంది. అంటే జిల్లా రైతాంగానికి రైతు భరోసా, పీఎం కిసాన్ రెండు కలిపి ఏడాదికి రూ. 431.48 కోట్లు అందనుంది. ఈ మొత్తాన్ని కూటమి ప్రభుత్వం జిల్లా రైతుల ఖాతాలకు ఏడాదికి జమ చేయాల్సి ఉంటుంది. -
మూల్యాంకనానికి వేళాయె
● పదో తరగతి పేపర్లు దిద్దేందుకు ఏర్పాట్లు పూర్తి ● 3 నుంచి 9 వరకు నిర్వహణ కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మంగళవారం ముగిశాయి. విద్యార్థులు రాసిన సమాధాన పత్రాలను దిద్దేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ వరకు ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. కడప మున్సిపల్ హైస్కూల్ (మెయిన్)లో ప్రభుత్వ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 1,80,965 పేపర్లు రానున్నాయి. జిల్లాలో 1515 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరిలో జవాబు పత్రాలకు మూల్యాంకనం నిర్వహించే అసిస్టెంట్ ఎగ్జామినర్లతోపాటు పరిశీలించేందుకు చీఫ్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్లను ఏర్పాటు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ క్యాంపు ఆఫీసర్, డిప్యూటీ డీఈఓ రాజగోపాల్‌రెడ్డి డిప్యూటీ క్యాంపు ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. మరో ఏడుగురు అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లుగా వ్యవహరించనున్నారు. ఆరుగురు ఏఈలకు ఒక సీఈ, ఇద్దరు స్పెషల్ అసిస్టెంట్లు: విద్యార్థుల సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసేందుకు ఆరుగురు చొప్పున అసిస్టెంట్ ఎగ్జామినర్లు(ఏఈ), ఒక చీఫ్ ఎగ్జామినర్తోపాటు ఇద్దరు స్పెషల్ అసిస్టెంట్లను ఒక బృందంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ బృందంలోని ఒక్కొక్క ఏఈ రోజుకు 40 సమాధాన పత్రాలను మూల్యాంకనం చేస్తారు. ఏఈలు మూల్యాంకనం చేసిన పత్రాలను సీఈలు క్షుణంగా పరిశీలిస్తారు. విద్యార్థులు రాసిన సమాధానాలు సరైనవి, కానివి పరిశీలించి వేసిన మార్కులను నిశిత పరిశీలన చేస్తారు. అదే విధంగా సమాధాన పత్రాలు, ఏఈలు వేసిన మార్కులను కూడి మొత్తం మార్కులను వేసే విధులను స్పెషల్ అసిస్టెంట్లు నిర్వహిస్తారు. నిబంధనలు అమలు పదో తరగతి మూల్యాంకనంలో పాల్గొనే సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. మూల్యాంకనం జరుగుతున్న వైపు ఇతరులు రాకుండా ఆంక్షలు విధిస్తున్నారు. విధుల్లో పాల్గొనే సిబ్బంది సెల్‌ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వెంట తీసుకెళ్లడానికి వీలు లేకుండా నిబంధనలు జారీ చేయనున్నారు. 1515 మంది సిబ్బంది ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా మూల్యాంకనానికి రానున్న దాదాపు 1,80,965 పేపర్లను మూల్యాంకనం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 1515 మంది సిబ్బందిని విధులకు ఏర్పాటు చేశారు. ఇందులో చీఫ్ ఎగ్జామినేటర్లతోపాటు అసిస్టెంట్ ఎగ్జామినర్లను కలిపి 1104 మందిని, స్పెషల్ అసిసెంట్లుగా 411 మందిని నియమించారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకనం నిర్వహించనున్నారు. విధులకు హాజరయ్యే సిబ్బందికి అన్ని రకాల మౌలిక వసతులను ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాటు చేసింది. -
గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జిగా జేసీ
కడప కల్చరల్: జిల్లా గ్రంథాలయ సంస్థకు పర్సన్ ఇన్చార్జిగా జాయింట్ కలెక్టర్‌ను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు కూడా జేసీలకు ఈ బాధ్యతలు అప్పగించారు. వైఎస్సార్ జిల్లా గ్రంథాలయ సంస్థకు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంత వరకు చైర్మన్‌ను నియమించలేదు. పరిపాలన సౌలభ్యం కోసం జేసీ అదితిసింగ్‌కు ఈ బాధ్యతలను అప్పగించారు. ఆరు నెలలపాటు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని, లేదా కొత్త చైర్మన్ నియామకం వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నేడు బీజేపీ జిల్లా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కడప కోటిరెడ్డిసర్కిల్: భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా జంగిటి వెంకట సుబ్బారెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి బత్తల పవన్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని హరిత హోటల్ సమావేశ మందిరంలో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సత్యకుమార్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారని పేర్కొన్నారు. అలాగే కూటమిలోని ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని ఆయన వివరించారు. కేజీబీవీల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం కడప ఎడ్యుకేషన్: జిల్లాలో ఉన్న 17 కేజీబీవీల్లో 6, 11 తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ నిత్యానందరాజులు తెలిపారు. అలాగే 7,8,9,10,12 తరగతులలో మిగిలి ఉన్న సీట్లకు కూడా ఏప్రిల్ 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచవ్చని ఆయన పేర్కొన్నారు. మార్చి 31వ తేదీ నాటికి 6వ తరగతిలో 600 సీట్లు, 11వ తరగతిలో 300 సీట్లు, 7వ తరగతిలో 50 సీట్లు, 8వ తరగతిలో 30 సీట్లు, 9వ తరగతిలో 25 సీట్లు, 10వ తరగతిలో 6 సీట్లు, 12వ తరగతిలో ఒక సీటు ఖాళీ ఉన్నట్లు వివరించారు. కావున అర్హులు హెచ్టిటిపిఎస్://ఏపీకేజీబీవీఎ.ఎపిసిఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా కడప వైఎస్ఆర్ సర్కిల్: రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షల తేదీ ప్రకటించాలని బుధవారం కలెక్టరేట్ వద్ద డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ తెలిపారు. నగరంలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో 2022లో 6100 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చిందని పేర్కొన్నారు. మూడేళ్లు గడుస్తున్నా పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తేదీలు ప్రకటించలేదన్నారు. ఇంతకు నిర్వహిస్తారో లేదో తెలియక అభ్యర్థులు అయోమయంలో ఉన్నారన్నారు. కూటమి అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో కానిస్టేబుల్ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి నియామకాలు చర్యలు చేపడతామని నారాలోకేష్ హామీ ఇచ్చారని, అయినా ఇంత వరకు అమలు చేయలేదని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా ధర్నా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో డీవైఎఫ్ఐ నగర కార్యదర్శి విజయ్, సహాయ కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆదర్శనీయుడు అంబేడ్కర్ కడప కార్పొరేషన్: ఆదర్శనీయుడు డాక్టర్ బీర్ అంబేడ్కర్ అని నగర మేయర్ కె.సురేష్‌బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అన్నారు. జై భీమ్ మాల మహాసేన ఆధ్వర్యంలో రూపొందించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వారోత్సవాల పోస్టర్లను వారు ఆవిష్కరించారు. మంగళవారం జై భీమ్ మాల మహాసేన అధ్యక్షుడు పి.సంపత్ కుమార్, ప్రధాన కార్యదర్శి చైతల్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 1 నుంచి 14 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యాంగంపై అవగాహన కల్పించడానికి విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంబేడ్కర్ విశిష్టతను స్కూల్ నుంచి కాలేజీ విద్యార్థుల వరకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. అంబేడ్కర్ అందరి వాడని, ఆయన అన్ని వర్గాల వారికి రాజ్యాంగం ద్వారా ఫలాలు ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ మాల మహాసేన కార్యవర్గ సభ్యులు వసంత్ పాల్గొన్నారు. -
హమ్మయ్య.. అయిపోయాయ్!
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షలు నిర్వహణ లోపాటు, ఆటుపోట్ల మధ్య ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా గత నెల 17వ తేదీన ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 1న ముగిశాయి. జిల్లాలో 161 పరీక్షా కేంద్రాల్లో 27,800 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ప్రారంభంలో ప్రశాంతంగా మొదలైనా.. తరువాత పలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 19న నిర్వహించిన హిందీ పరీక్షకు సంబంధించి కడప ప్రభుత్వ బాలికల హైస్కూల్ సెంటర్లో ఒక విద్యార్థి ఏకంగా సెల్‌ఫోన్‌ను జేబులో ఉంచుకుని హాజరయ్యాడు. దీంతో ఆ విద్యార్థిని డీబార్ చేయడంతోపాటు ఆ పరీక్ష గదిలో విధులు నిర్వర్తించిన ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశారు. అలాగే 24న గణితం పరీక్ష పశ్నాపత్రం వల్లూరు జెడ్పీ హైస్కూల్ కేంద్రంలో వాటర్‌బాయ్ వాట్సాప్ ద్వారా లీక్ అయింది. ఇందుకుగాను ఆ పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్‌తోపాటు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారితో కలిపి ముగ్గురిని సస్పెండ్ చేశారు. అలాగే ఒక విద్యార్థిని కూడా డీబార్ చేశారు. అలాగే ఈ సంఘటనకు సంబంధించి ఇన్విజిలేటర్‌తోపాటు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారితోపాటు మరో ఆరుగురిపై పోలీసు కేసులు నమోదు చేశారు. చివరిరోజు 144 మంది గైర్హాజరు చివరి రోజైన మంగళవారం సాంఘిక శాస్త్రం పరీక్షకు 144 మంది గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్‌కు సంబంధించి 27,768 మంది విద్యార్థులకు గాను 27,624 మంది హాజరయ్యారు. ప్రైవేటు విద్యార్థులకు సంబంధించి 22 మందికి గాను 19 మంది హాజరు కాగా ముగ్గురు గైర్హాజరయ్యారు. సిట్టింగ్ స్క్వాడ్ 84 పరీక్షా కేంద్రాలు, 7 స్క్వాడ్ బృందాలు 50 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా నోడల్ ఆఫీసర్ మధుసూధన్‌రావు నాలుగు, డీఈఓ షేక్ షంషుద్దీన్ 5 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ముగిసిన పదో తరగతి పరీక్షలు నిర్వహణలో పలు లోపాలు ఇద్దరు ఇన్విజిలేటర్లు, ఒక చీఫీ, డిపార్ట్మెంట్ ఆఫీసర్ సస్పెండ్ ఇద్దరు విద్యార్థులు డీబార్ -
దాల్మియాతో ఒప్పందం ప్రజలకు తెలియాలి
● భూముల సంగతి తేల్చాలి ● ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిదిరెండు నాలుకల ధోరణి●● ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు : జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిలు దాల్మియా యాజమాన్యంతో ఎటువంటి ఒప్పందం చేశారో.. ప్రజలందరికీ బహిర్గతం చేస్తే బాగుంటుందని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో చిన్న కొమెర్ల, నవాబుపేట, దుగ్గనపల్లి రైతులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి దాల్మియా పరిశ్రమపై రెండు నాలుకల ధోరణి అవలంబిస్తున్నారన్నారు. దాల్మియా ప్రజాభిప్రాయ సేకరణలో వారిని బయటపడేసే విధంగా వ్యవహరించారు. బయటికి వచ్చి ప్రజల సమస్యలు పరిష్కారం చేయనిదే రెండో ప్లాంట్ ముందుకు పోదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జడ్జి ముందు సాక్ష్యం చెబితే బాధితులకు న్యాయం జరుగుతుందని.. అలా కాకుండా ప్రజాభిప్రాయ సేకరణలో కలెక్టర్ ముందు తప్పుడు సాక్ష్యం చెప్పి, బయటికి వచ్చి న్యాయం చేస్తామనడం రైతులను నట్టేట ముంచడమే అవుతుందన్నారు. దాల్మియా ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు తమ సమస్యలన్నీ వివరించారని తెలిపారు. అయినా జిల్లా కలెక్టర్ ముంపునకు గురి అయ్యే భూముల గురించి ఒక్కమాటకూడ చెప్పలేదన్నారు. దాదాపు 400 ఎకరాల భూమి మునకకు గురి అయితే ప్రస్తుతం ఆభూముల్లో సాగుచేయలేని స్థితి ఉందన్నారు. నిజంగా జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలని ఉంటే దాల్మియా యాజమాన్యంతో భూములను కొనుగోలు చేసిన తర్వాతనే.. రెండో ప్లాంట్ ముందుకు వెళ్లాలని, విస్తరణ కోసం పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించాలన్నారు. శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి రైతులకు నిజంగా న్యాయం చేయాలనే ఆలోచన ఉంటే కలెక్టర్‌కు తన లెటర్‌ప్యాడ్ పైన రైతుల సమస్యలు పరిష్కారం చేసిన తర్వాతనే విస్తరణ పనులు చేపట్టాలని పర్యావరణ శాఖకు నివేదిక ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న కొమెర్ల సర్పంచ్ జగదీశ్వరరెడ్డి, నవాబు పేట భాస్కర్‌రెడ్డి, హృషికేశవరెడ్డి, బడిగించల జనార్థాన్, గిరిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా పల్లకీ సేవ
రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి పల్లకీ సేవ సోమవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకీలో కొలువుదీర్చారు. ఆలయ మాఢవీధులు, ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు.కార్యక్రమంలో ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుకింగ్ కడపకోటిరెడ్డిసర్కిల్: రిజిస్ట్రేషన్‌శాఖలో క్రయ, విక్రయాలకు స్లాట్ సదుపాయం అందుబాటు లోకి రానుంది. కక్షిదారులకు సులభతర, వేగవంతమైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. జిల్లాలో తొలుత కడప ఆర్ఓ కార్యాలయంలో అమలు కానుంది. పనిదినాల్లో ఉదయం 10–30 గంటల నుంచి సాయంత్రం 5–30 మధ్యలో స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ విధానం వల్ల రోజంతా నిరీక్షించే పనితప్పుతుంది. స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి నిర్ణీత సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి వుంటుంది. ప్రజలకు ఎలాంటి అసౌక ర్యం లేకుండా రిజిస్ట్రేషన్ సులభతరంగా పూర్తవుతుంది. ఈ విధానం విజయవంతం అయితే రాబోవు రోజుల్లో అన్ని సబ్ రిజిస్ట్ట్రార్ కార్యాలయాల్లో ప్రవేశ పెట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. కాగా కడప ఆర్ఓ కార్యాలయంలో ఏప్రిల్ 4 నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.ఈసందర్భంగా జిల్లా రిజిస్టార్ పీవీఎన్.బాబు మాట్లాడుతూ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సమయం వృథా కాదని తెలిపారు. విభజన హామీలు అమలు చేయాలి కడప రూరల్: ఉమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా జై హింద్ పార్టీ, సమాజ్‌వాది పార్టీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవ స్థాపక అధ్యక్షులు ఎస్ దశరథరామిరెడ్డి మాట్లాడుతూ హామీల అమలులో భాగంగా కడపకు స్టీల్ ప్లాంట్, దుగ్గిరాజుపట్నం ఎయిర్పోర్ట్, వైజాగ్–చైన్నె ఇండస్ట్రీయల్ కారిడార్, విమానాశ్రయా లను అంతర్జాతీయ స్ధాయిలో అభివృద్ధి చేయడంతోపాటు నీటి ప్రాజెక్ట్‌లు, విద్యా, పారిశ్రామిక ప్రగతికి చెందిన ఎన్నో అంశాలు అమలు కావాల్సివుందన్నారు. కార్యక్రమంలో సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రి రాజ శ్రీనివాసరావు, చంద్రశేఖర్, సీఆర్వీ ప్రసాద్, ఓబయ్య తదిరులు పాల్గొన్నారు. -
కుమార్తెను ఇంటికి పంపమన్నందుకు మామపై అల్లుడు దాడి
రాయచోటి టౌన్ : తన కుమార్తెను రంజాన్ పండగకు పుట్టింటికి పంపమన్నందుకు మామపై అల్లుడు దాడి చేసిన సంఘటన రాయచోటిలో శనివారం చోటుచేసుకొంది. బాధితుల కథనం మేరకు.. రాయచోటి పట్టణంలోని పాత రాయచోటికి చెందిన అజ్మత్ తన కుమార్తె తంజీమ్‌ను అదే ప్రాంతానికి చెందిన మహబూబ్‌బాషా కుమారుడు జుబేర్‌కు ఇచ్చి ఏడాది కిందట వివాహం చేశారు. పెళ్లిరోజున ఇచ్చిన బంగారు ఆభరణాలు అమ్మే శాడని ఇటీవల భార్య, భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంతలో రంజాన్ పండగ రావడంతో అల్లుడు, కుమార్తె, బంధువులను పండగకు పిలిచేందుకు తన కుమార్తె ఇంటికి అజ్మత్ వెళ్లారు. వారు పంపేందుకు నిరాకరించడమేగాక అజ్మత్తో ఘర్షణ పడ్డారు. వాగ్వాదం పెరిగి అల్లుడి బంధువులు అజ్మత్‌పై దాడి చేసి గాయపరిచారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. రైతు ఆత్మహత్య పుల్లంపేట : వ్యవసాయంలో నష్టాలు వచ్చి అప్పుల పాలైన రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. తిప్పాయిపల్లి హరిజనవాడకు చెందిన దార్ల రఘురామయ్య (52)కు ప్రభుత్వం ఐదు ఎకరాలు భూమిని మంజూరు చేసింది. అరటి తోటన సాగు చేసి జీవనం కొనసాగిస్తున్నాడు. వాతావరణం అనుకూలించగా, ఆశించిన దిగుబడి రాకపోవడంతో అప్పులు పెరుగుతూ వచ్చాయి. దీంతో రూ.7లక్షలు అప్పుచేసి తీర్చలేక మనస్థాపం చెందారు. ఆదివారం విష ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలోకి చేరి సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడికి ముగ్గరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య వరలక్ష్మీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైలు పట్టాలపై మృతదేహంరాజంపేట : నందలూరు–రేణిగుంట రైలు మార్గంలో హస్తవరం రైల్వే స్టేషన్ వద్ద సోమవారం 25 ఏళ్ల వయస్సు కలిగిన యువకుడి మృతదేహం స్థానికులు గుర్తించారు. రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివరాలు తెలియాల్సి ఉంది. వృద్ధులకు గాయాలు ఓబులవారిపల్లె : మద్యం తాగి ఆకతాయిలు రాళ్లు విసరడంతో తేనెటీగలు లేచి ఆశ్రమంలో వృద్ధులపై దాడి చేశాయి. మండలంలోని పాపిరెడ్డిపల్లి గ్రామంలో జీవన జ్యోతి ఆనంద నిలయంలో ఆశ్రయం పొందుతున్న ఏడుగురు వృద్ధులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆశ్రమం ప్రక్కనే చెట్టుపై తేనెపట్టు ఉండడం.. ఆకతాయిలు మద్యం తాగి రాళ్లతో కొట్టడంతో అవి వృద్ధులపై దాడి చేయడంతో దిక్కుతోచక వారంతా ఆందోళనకు గురయ్యారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. -
సీతారాముల కల్యాణానికి పటిష్ట ఏర్పాట్లు
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 11న జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంటిమిట్ట టీటీడీ కల్యాణ మండపం సమీపంలోని పరిపాలన భవన సమావేశ మందిరంలో ఎస్పీ అశోక్ కుమార్, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, డీఆర్ఓ విశ్వేశ్వరనాయుడుతో కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులు, టీటీడీ అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 15 వరకు శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయన్నారు. అందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు లేకుండా జిల్లా, టీటీడీ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పని చేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 11న జరిగే సీతారాముల వారి కల్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులతోపాటు ప్రముఖులు రావచ్చనే అంచనాతో అన్ని రకాల ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. జాగ్రత్తలు తీసుకోవాలిఎక్కడా జనం తొక్కిసలాట జరగకుండా అధికారులు, పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రసాదం కౌంటర్ల వద్ద ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి ఒక్కరికీ తాగునీరు, అన్న ప్రసాదం కొరత లేకుండా అందేలా చూడాలన్నారు. అలాగే కడప, రాజంపేట వైపు నుంచి ఆర్టీసీ బస్సులు పార్కింగ్, అలాగే ఇతర జిల్లాల నుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలుసుకొని పక్కాగా ప్లాన్ రూపొందించుకొని పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని అర్టీసీ అధికారులను ఆదేశించారు. ఒకవేళ పార్కింగ్ దూరంగా ఉంటే అక్కడి నుంచి కల్యాణ వేదిక వద్దకు భక్తులను తీసుకువచ్చేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేయాలని టీటీడీ జేఈఓకు తెలిపారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ టీటీడీ అధికారులు, జిల్లా యంత్రాంగం, పోలీసులు సమషిగ్టా కృషి చేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఆలయ దర్శనం అంతకు మునుపు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ తితిదే అధికారులు, జిల్లా అధికారులతో కలిసి ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అధికారులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం దేవస్థానం సమీపంలోని శ్రీ కోదండరామస్వామి కల్యాణ వేదికను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కడప, జమ్మలమడుగు, పులివెందుల ఆర్డీఓలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చిన్నయ్య, టీటీడీ డిప్యూటీ ఈఓ నగేష్, ఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా ఫైర్ అధికారి ధర్మారావు, డీఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు, సీపీఓ వెంకటరావు, డీపీఓ, పంచాయతీ రాజ్ ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ రమణయ్య, డీటీసీ, ఆర్టీసీ అధికారులు, టీటీడీ, ఈఓిపీఆర్, పీఆర్ఓలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒంటిమిట్టలో 5 నుంచి బ్రహ్మోత్సవాలు 11న వైభవంగా కల్యాణోత్సవం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
రూ.500 దొంగనోటు ఇచ్చి పరారీ
చాపాడు : మండల కేంద్రమైన చాపాడులో గత రెండు రోజులుగా దొంగ నోట్లు ప్రత్యక్షమవుతున్నాయి. ఆదివారం సాయంత్రం స్థానిక కుందూనది వద్ద చాపాడుకు చెందిన శాంతమ్మ దోస పండ్ల వ్యాపారం చేసుకుంటోంది. ఓ వ్యక్తి బైక్‌లో వచ్చి రూ.100లకు దోస పండ్లు కొనుగోలు చేశాడు. రూ.500 నోటు ఇచ్చి రూ.400 చిల్లర తీసుకుని వెళ్లాడు. ఇంతలో పిల్లలు అది దొంగ నోటుగా గుర్తించి వెతికేలోగా బైక్‌లో వచ్చిన వ్యక్తి పరారయ్యాడు. సోమ వారం చాపాడులోని ఓ స్వీట్స్ బేకరిలో స్వీట్లు కొనుగోలు చేసిన వ్యక్తి దొంగనోటు మార్చుకుని పరారైనట్లు తెలిపారు. గత రెండు రోజుల్లో దొంగ నోట్లు చలామణీ కావడంతో చాపాడుకు చెందిన ఎస్.ఓబులేసు ట్రైనీ డీఎస్పీ భవానీకి ఫిర్యాదు చేశారు. -
కనికరించని ప్రభుత్వం
కరువు తాండవం.. జిల్లాలో కరువు కరాళ నృత్యం చేసింది. ఖరీఫ్, రబీ సీజన్లలో తీవ్ర వర్షాభావం వెంటాడింది. వాన జాడలేక పంటలు నిట్టనిలువునా ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. కొంత మంది రైతులు పొలాల్లోనే పంటలు వదిలేసుకుని, సర్వం నష్టపోయారు. పశుగ్రాసం కూడా దక్కలేదు. చివరికి అన్నదాత అప్పుల పాలయ్యాడు. ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం అన్యాయమే చేసింది. ● జిల్లా అంతటా దుర్భిక్ష ఛాయలు ● జాబితాలో 10 మండలాలకే చోటు ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● మిగతా మండలాల మాటేమిటి? ● మహానాడు నేపథ్యంలోమభ్యపెట్టేందుకే కంటితుడుపు ప్రకటన కడప సెవెన్‌రోడ్స్/కడప అగ్రికల్చర్ : రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా జిల్లాలో కరువు మండలాలను ప్రకటించింది. రబీ సీజన్లో 10 మండలాలను కరువు జాబితాలో చేరుస్తూ సోమవారం జీఓ ఎంఎస్ నంబరు 3ను జారీ చేసింది. మైదుకూరు, దువ్వూరు, బ్రహ్మంగారిమఠం, ఖాజీపేట, చాపాడు, కాశినాయన, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, తొండూరు మండలాల్లో కరువు తీవ్రత అధికంగా ఉన్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మైలవరం మండలాన్ని మోడరేట్డ్రాట్ కింద చేర్చింది. మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం మండలాలు కరువు కింద చూపారు. కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలోని మండలాలు ఇందులో అధికంగా ఉండటం గమనార్హం. తీవ్ర వర్షాభావం జిల్లా అంతటా తీవ్ర వర్షాభావం చోటు చేసుకుంది. జిల్లా సాధారణ వర్షపాతంలో 14.1 శాతం లోటు ఏర్పడింది. వరి, పత్తి, జొన్న, మినుము, కంది, తదితర 18 రకాల పంటల సాధారణ సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. తీవ్ర వర్షపాత లోటు, డ్రైస్పెల్స్ కారణంగా సాగు చేసిన పంటలు నిలువునా ఎండిపోయాయి. పెద్దముడియం మండలంలో వర్షపాత లోటుతోపాటు రెండు డ్రైస్పెల్స్ అంటే వరుసగా 42 రోజులు వర్షమే పడలేదు. కలసపాడు, తొండూరు, వేంపల్లె మండలాల్లో కూడా రెండు డ్రైస్పెల్స్ చోటు చేసుకున్నాయి. పోరుమామిళ్ల, గోపవరం, అట్లూరు, సిద్దవటం, ఒంటిమిట్ట మండలాల్లో ఒక్కొక్క డ్రైస్పెల్స్ చొప్పున నమోదయ్యాయి. బద్వేలు మండలంలో మాత్రం డ్రైస్పెల్ లేకపోయినా వర్షపాత లోటు ఏర్పడింది. జూన్ 4 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు రెఫరెన్స్ పిరీయడ్గా తీసుకున్నారు. వర్షపాత లోటు, డ్రైస్పెల్స్లు విపత్తుల నిర్వహణ విభాగం మ్యాండేటరీ ఇండికేటర్స్‌గా పరిగణిస్తుంది. ఒక మండలాన్ని కరువు కింద ప్రకటించాడానికి ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి. పంటల సాగు విస్తీర్ణం, రిమోట్‌సెన్సింగ్ మాయిశ్చర్ అడక్వేట్ ఇండెక్స్, హైడ్రోలాజికల్ ఇండెక్స్‌లను ఇంప్యాక్ట్ ఇండికేటర్స్‌గా తీసుకుంటారు. వీటన్నింటినీ పరినణనలోకి తీసుకొని పరిశీలిస్తే.. జిల్లాలో దాదాపు అన్ని మండలాలను కరువు జాబితా కింద చేర్చాల్సి వుంటుంది. కానీ అప్పట్లో అధికారులు గ్రౌండ్ ట్రూతింగ్ పేరిట ఒక తప్పుడు నివేదికను కమిషనర్ డిజాస్టర్ మేనేజ్మెంట్కు పంపారు. ఆ నివేదిక ఆధారంగా జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా కరువు కింద ప్రకటించలేదు. ఆందోళనల నేపథ్యంలో.. ప్రభుత్వ వైఖరిపై జిల్లా రైతాంగంలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. జిల్లా సమీక్ష కమిటీ సమావేశం ఎదుట సీపీఐ నాయకులు ఆందోళన నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆ తరువాత కాలంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులను నిలదీశారు. కరువు మండలాల ప్రకటన చేయకపోవడంపై జిల్లా అంతటా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజలకు సమాధానం చెప్పలేక జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు తల పట్టుకోవాల్సి వచ్చింది. జిల్లాలో అధిక అసెంబ్లీ స్థానాలను ప్రజలు ఎన్డీఏ కూటమికి కట్టబెట్టినా అభివృద్ధి చేయకపోగా.. కొప్పర్తి ఎంఎస్ఎంఈ, ఏపీజీబీ ప్రధాన కార్యాలయం వంటి వాటిని అమరావతికి ప్రభుత్వం తరలించింది. ఇది కూటమి నేతలను మరింత ఇరకాటంలోకి నెట్టింది. మే నెలలో తెలుగుదేశం పార్టీ కడపలో మహానాడు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో జిల్లాకు ఏమి చేశారని ఇక్కడ మహానాడు జరుపుతున్నారంటూ ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉంది. కనీసం కంటి తుడుపుగా కరువు మండలాలను ప్రకటించాలని భావించే ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 10 మండలాలను మాత్రమే కరువు కింద ప్రకటిస్తే మిగతా మండలాల పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
దాయాదుల మద్య భూ వివాదం
బ్రహ్మంగారిమఠం : భూ వివాదం ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులకు దారి తీసింది. ఆ భూములు తమవేనంటూ ఇరువర్గాల దాయాదులు ఘర్షణకు దిగి కత్తులు, రాడ్లతో దాడులు చేసుకోవడంతో ఒకరు మృతి చెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మండలంలోని సోమిరెడ్డిపల్లె పంచాయతీ మద్దిరెడ్డిపల్లె గ్రామంలో నివాసముంటున్న పెసల నారాయణరెడ్డి, పెసల జయరామిరెడ్డి దాయాదులు. వారికి సోమిరెడ్డిపల్లె పొలం సర్వే నెంబరు 159, 160లో 4.5 ఎకరాల పిత్రార్జిత వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి తమదంటే తమదే అంటూ ఇరువర్గాలు చిన్న చిన్న ఘర్షణ పడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో పెసల నారాయణరెడ్డి బద్వేల్ కోర్టును ఆశ్రయించగా.. నారాయణరెడ్డి పొలంలో సాగు చేసుకునేందుకు అనుమతిచ్చింది. రెండు రోజుల కిందట నారాయణరెడ్డి అయన సోదరులు ట్రాక్టర్‌తో పొలంలో దుక్కులు చేస్తున్నారు. ఇది సహించని జయరామిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు అడ్డుకోవాలనుకుని సోమవారం సాయంత్రం పొలం వద్దకు వచ్చి ఘర్షణపడ్డారు. జయరామిరెడ్డి ఆయన సోదరులు కత్తులు, రాడ్లు పట్టుకుని ఆగ్రహంతో దాడి చేస్తున్నారని, నారాయణరెడ్డి సోదరులకు తెలిసింది. దీంతో వారు బైకుపై పొలం వద్దకు వచ్చారు. అప్పటికే నారాయణరెడ్డి(60) గాయాలతో కింత పడి ఉన్నారు. ఇది చూసిన నారాయణరెడ్డి సోదరులు వాగ్వాదానికి దిగారు. మాటా మాటా పెరిగి ఘర్షణ తలెత్తడంతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. జయరామిరెడ్డి, ఆయన కుమారుడు సాంబశివారెడ్డి, తమ్ముడు మల్లికార్జునరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. నారాయణరెడ్డి మృతిచెందగా ఆయన బంధువులు శివారెడ్డి, ఆదిలక్ష్మమ్మలకు గాయాలయ్యాయి. బైక్‌లకు నిప్పు పెట్టడంతో ఐదు బైకులు దగ్ధమయ్యాయి. బి.మఠం ఎస్ఐ చంద్రశేఖర్, సిబ్బంది వెళ్లి ఘర్షణను అడ్డుకున్నాడు. తీవ్రగాయాలతో ఉన్న వారిని కడప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కత్తులు, రాడ్లతో ఇరువర్గాల దాడులు ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు బైక్‌కు నిప్పు పెట్టడంతో దగ్ధం -
భక్తుల కొంగుబంగారం బలిజపల్లె గంగమ్మ
రాజంపేట టౌన్ : రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని బలిజపల్లెలో స్వయంభువుగా వెలసిన గంగమ్మ ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో ఎంతో విశిష్టత సంతరించుకుంది. రెండు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ జాతరకు ఏటా లక్ష మందికిపైగా భక్తులు హాజరై అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తారు. అమ్మవారికి వరపడితే తమ కష్టాలు తొలగిపోతాయని, కోరిన కోర్కెలు గంగమ్మ నెరవేరుస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే బలిజపల్లె గంగమ్మ భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతుంది. బుధవారం రాత్రి నుంచి జాతర ప్రారంభం కానుంది. సంప్రదాయాల సమ్మేళనం బలిజపల్లె గంగమ్మ జాతర అనేక సంప్రదాయాల సమ్మేళనం. బలిజపల్లె, తుమ్మల అగ్రహారం, నారపురెడ్డిపల్లె గ్రామ ప్రజలు కలిసి అమ్మవారి జాతర నిర్వహిస్తారు. తొలుత బలిజపల్లె వాసులు తేదీ నిర్ణయించి అనంతరం తుమ్మల అగ్రహారం, నారపురెడ్డిపల్లె నిర్వాహకులతో చర్చిస్తారు. అంగీకారం రాగానే జాతర తేదీ ఖరారు చేశారు. ఆదివారం జాతరకు అంకురార్పణ చేసి గురువారం జాతర నిర్వహించనున్నారు. ఆయా గ్రామాల ప్రజలు అమ్మవారికి వివిధ రకాల సాంగ్యలతో జాతర ఘనంగా నిర్వహిస్తారు. బలిజపల్లెలో అమ్మవారి ప్రతిమ జాతరలో కొలువుదీరే గంగమ్మ ప్రతిమను బలిజపల్లెలోని ఓ వేపచెట్టు కింద దాదాపు ఆరు గంటల పాటు కష్టపడి తయారుచేస్తారు. అనంతరం ప్రతిమను నిర్వాహకులు పూల రథంపై ఊరేగిస్తారు. వేపమండలతో తయారు చేసిన గుండిలో తీసుకొచ్చి కొలువుదీర్చుతారు. అమ్మవారు గుడిలోకి వచ్చే సమయంలో భక్తులు పెద్దఎత్తున నైవేద్యాలు ఎదురుగుంభంగా ఇచ్చేందుకు పోటీపడతారు. యాబై అడుగుల దూరంలో ఉండే గుడిలోకి అమ్మవారిని తీసుకురావడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. బలిజపల్లె నిర్వాహకులు విశేషంగా పూజలు నిర్వహించి సాంగ్యలు సమర్పిస్తారు. అమ్మవారు కొలువుదీరగానే జాతర ఊపందుకుంటుంది. తుమ్మల అగ్రహారం నుంచి గండదీయలు బలిజపల్లెలో కొలువైన గంగమ్మకు తుమ్మలఅగ్రహారం పుట్టినిల్లు అని పెద్దలు చెబుతారు. దీంతో గ్రామ మహిళలు బుధవారం రాత్రి బలిజపల్లె గ్రామానికి గండదీయలను తీసుకెళ్తారు. గురువారం వేకువ జామున గుడిలో కొలువుదీరాక మహిళలు తీసుకొచ్చిన గండదీయలను చెల్లిస్తారు. ఈ సమయంలో గంగమ్మను దర్శించుకునేందుకు వేలాది మంది బారులు తీరుతారు. అగ్రహారం మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఇచ్చి చెల్లించే ఏర్పాట్లుచేస్తారు. నారపురెడ్డిపల్లె నుంచి నవధాన్యాలు జాతర సందర్భంగా గంగమ్మ తల్లికి నారపురెడ్డిపల్లెకు చెందిన జాతర నిర్వాహకులు, ప్రజలు బుధవారం రాత్రి నవ ధాన్యాలు తీసుకొస్తారు. గంగమ్మ సోదరుడైన పోతు రాజును తప్పెట్లతో ఉత్సాహంగా బలిజపల్లెకు తీసుకొస్తారు. పోతురాజు ఊరేగుతూ వచ్చే సమయంలో భక్తులు కర్రసాము, ఐదడుగుల వ్యక్తులు నృత్యాలు చేస్తూ కోలాహలంగా బలిజపల్లెకు చేరుకుంటారు. రేపు రాత్రి నుంచి జాతర ప్రారంభం జాతరకు రెండు వందల ఏళ్ళకు పైగా చరిత్ర -
ఉత్కంఠగా బండలాగుడు పోటీలు
బ్రహ్మంగారిమఠం : మండలంలోని సిద్ధయ్యమఠంలో పెద్దపీరయ్యస్వామి ఆరాధన మహోత్సవాలలో భాగంగా సోమవారం ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలను జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి సోమవారం ప్రారంభించారు. ఆద్యంతం పోటీలు ఉత్కంఠగా సాగాయి. నంద్యాలకు చెందిన కేశవరెడ్డి ఎద్దులు ప్రథమ స్థానంలో నిలవగా యజమానికి రూ.1,00,116 నగదు జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి అందజేశారు. ప్రొద్దుటూరుకు చెందిన మార్తల వెంకటరెడి ఎద్దులు ద్వితీయ స్థానంలో నిలవగా యజమానికి రూ.70 వేల నగదు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన ఎద్దుల యజమానులకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వీరనారాయణరెడ్డి, మండల పార్టీ అధ్యక్షడు మేకల రత్నకుమార్యాదవ్, బొగ్గల సుబ్బిరెడ్డి, రామసుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి చిన్న ఓబుల్‌రెడ్డి, నేలటూరు వెంకటరామిరెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, గొడ్లవీడు నాగేశ్వర్‌రెడ్డి, దుగ్గిరెడ్డి, బాలిరెడ్డి, గుండాపురం రమణారెడ్డి, గొడ్లవీడు సిద్దారెడ్డి, జోగయ్య, రామకృష్ణారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు చెన్నుపల్లె సుబ్బారెడ్డి, కానాల మల్లికార్జునరెడ్డి, జౌకుపల్లె రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అక్సానగర్లో కత్తిపోట్ల కలకలం
కమలాపురం : స్థానిక అక్సా నగర్లో ఆదివారం రాత్రి ఇరు వర్గాల యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కత్తి పోట్లకు గురయ్యారు. స్థానికులు, బాధితుల సమాచారం మేరకు..అక్సా నగర్లో గతంలో నివాసమున్న సల్మాన్ ఇటీవల ఇందిరమ్మ కాలనీలో చేరారు. పది రోజుల కిందట అక్సానగర్కు వచ్చి బైక్‌ను ఎక్కువ స్పీడ్‌తో రైడ్ చేస్తున్నారు. అదే కాలనీకి చెందిన సొహెయిల్, షాబాజ్ స్పీడ్‌తో వెళ్లవద్దంటూ మందలించారు. అది మనసులో పెట్టుకున్న సల్మాన్ ఆదివారం రాత్రి అక్సానగర్కు వచ్చి సోహెల్, షాబాజ్లను కత్తితో పొడిచాడు. అడ్డు వచ్చిన రియాజ్పైనా దాడికి దిగాడు. స్థానికులు గుర్తించి వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సొహెయిల్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. షాబాజ్, రియాజ్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఆసుపత్రికి వచ్చి జరిగిన దాడి గురించి ఆరా తీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన సల్మాన్ పరారీలో ఉన్నాడు. -
బ్రౌన్ భవన నిర్మాణ పనులు ప్రారంభించండి
కడప కల్చరల్ : సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం నూతన భవన నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని గ్రంథాలయ సలహా మండలి సభ్యులు జానుమద్ది విజయభాస్కర్ విజ్ఞప్తి చేశారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు విచ్చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కడప నగరంలోని బ్రౌన్ గ్రంథాలయ నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలనిలాయనకోరారు. 2023 డిసెంబర్లో నాటి ప్రభుత్వం రూ.6.87 కోట్ల నిధులు మంజూరు చేసిందని, పలు కారణాలతో ఆగిపోయాయని తెలిపారు. ముఖ్యమంత్రి చొరవచూపి భవన నిర్మాణం ప్రారంభమయ్యేలా చూడాలని కోరారు. కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ తనిఖీ ఒంటిమిట్ట : ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్‌కుమార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉమెన్స్ హెల్ప్ డెస్క్‌పై సిబ్బందికి సూచనలు చేశారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. అనంతరం స్టేషన్ పరిసరాలు పరిశీలించి స్టేషన్ ఆవరణంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పెండింగ్ కేసులు త్వరగా విచారించి పరిష్కరించాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, కోదండరాముడి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయాలని ఆయన ఆదేశించారు. మహిళపై హత్యాయత్నం విఫలంఖాజీపేట : మహిళను హత్య చేసేందుకు వచ్చిన దుండగులు.. ఆమె గట్టిగా కేకలు వేయడం, స్థానికులు రావడంతో పరారయ్యారు. పత్తూరు గ్రామంలో ఒకరిని, రైస్ మిల్లు వద్ద ఒకరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన చోటు సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.పుల్లూరు పంచాయతీ పరిధిలోని బంగ్లా సమీపంలో భాగ్య అనే మహిళ ఉంది.. ఆమె వడ్డీ వ్యాపారాలతో పాటు, రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తోంది. ఆమెను హత్య చేసేందుకు రాత్రి వేళ సుమారు 10 మంది యువకులు ద్విచక్రవాహనాల్లో వచ్చారు. ఇంటి తాళం పగుల కొట్టే ప్రయత్నం చేశారు. వీరిని చూసిన భాగ్య కారు డ్రైవర్‌కు ఫోన్ చేసింది. గట్టిగా కేకలు వేసింది. దీంతో డ్రైవర్ శివ అక్కడికి చేరుకున్నాడు. స్థానికులు కర్రలు తీసుకుని దుండగులపై దాడికి ప్రయత్నిచారు. దీంతో వారు బైక్‌లు అక్కడే వదిలి పరారయ్యారు. డ్రైవర్ శివ ఒకరిని పట్టుకున్నారు. రైస్‌మిల్లు వద్ద మరొకరిని గ్రామస్తులు పట్టుకుని తీసుకొచ్చారు. వచ్చిన వారంతా అక్కడే బైక్‌లను వదిలి పరారైయ్యారు. దేహశుద్ధి పారిపోతున్న వారిలో ఒకరిని పత్తూరు గ్రామంలో, మరొకరిని రైస్ మిల్లు స్థానికులు పట్టుకున్నారు. దొరికిన వారు కత్తులు చూపి భయపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పట్టుకున్న తర్వాత ఎందుకొచ్చారని స్థానికులు ప్రశ్నించారు.చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు.. విషయం పోలీసులకు తెలియజేశారు. సమాచారం తెలుసుకున్న చెట్టుకు కట్టేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అసలు ఎందుకు వచ్చారు.. హత్య కోసమేనా లేక ఇతర పనుల కోసం వచ్చారా అన్న విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.● స్థానికులు రావడంతో పరారీ ● పత్తూరులో దొరికిన నిందితులు ● వారి వద్ద నుంచి కత్తులు స్వాధీనం -
మత సామరస్యానికి ప్రతీక కడప జిల్లా
కడప అర్బన్ : వైఎస్ఆర్ కడప జిల్లాలోని హిందూ, ముస్లిం సోదరులు కలిసిమెలిసి జీవిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా జిల్లాను నిలిపారని జిల్లా ఎస్పీ ఈ.జీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక ఉమేష్ చంద్ర స్మారక కల్యాణ మండపంలో ముస్లింలకు, పోలీస్ శాఖలోని ముస్లిం పోలీస్ అధికారులు, సిబ్బందికి రంజాన్ మాసం పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమీన్ పీర్ దర్గా ఇమామ్ ఇనాయతుల్లా ప్రత్యేక ప్రార్థన చేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇఫ్తార్ విందు మత సామరస్యాన్ని చాటిందన్నారు. గతంలో కడప డీఎస్పీగా విధి నిర్వహణలో ఉన్నప్పుడు వినాయక చవితి, బక్రీద్, ఉగాది, రంజాన్ పండుగల సమయంలో హిందూ, ముస్లిం సోదరులు అందించిన సహకారం మరువలేనిదన్నారు. ఉగాది సందర్భంగా తాను దేవుని కడప ఆలయానికి వెళ్లినప్పుడు ముస్లింలు పూజలు నిర్వహించడం, అమీన్ పీర్ దర్గాను హిందువులు దర్శించుకోవడం కడప జిల్లా మత సామరస్య ఘనతకు నిదర్శనమన్నారు. అనంతపురం జిల్లాలోని గూగూడు కుళ్లాయి స్వామిని దర్శించుకున్నప్పుడు అక్కడ ముస్లిం సోదరులతో పాటు పెద్ద ఎత్తున హిందూ సోదరులు పూజలు చేయడం సామరస్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిందన్నారు. జిల్లాలో సోదరభావం, సమైక్యత భావం మున్ముందు కూడా కొనసాగాలని ఆకాంక్షించారు. జిల్లా అదనపు ఎస్.పి (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు లాంటి కార్యక్రమాలు ప్రజలలో సోదర భావాన్ని పెంపొందిస్తాయన్నారు. ముస్లిం ప్రముఖులు మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం ఉండటం మన దేశ గొప్పతనమని, అందువల్లే ప్రపంచ దేశాలు దేశ కీర్తి ప్రతిష్టలను కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.రమణయ్య, నగరంలోని ముస్లిం ప్రముఖులు, వన్ టౌన్ సి.ఐ రామకృష్ణ, టూ టౌన్ సి.ఐ నాగార్జున, చిన్నచౌకు సి.ఐ ఓబులేసు, ఆర్ఐలు వీరేష్, శ్రీశైల రెడ్డి, శివరాముడు, చిన్నచౌకు ఎస్.ఐ రాజరాజేశ్వర రెడ్డి, టూ టౌన్ ఎస్.ఐ ఎస్.కె.ఎం హుస్సేన్, రిమ్స్ ఎస్.ఐ జయరాముడు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, పోలీస్ సిబ్బంది, నగరంలోని ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ -
శ్రీ సోమేశ్వరుడి సేవలో జిల్లా జడ్జి
కడప కల్చరల్ : కడప నగరం దేవుని కడపలోని శ్రీ సోమేశ్వరస్వామిని ఆదివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి, రామారావు దంపతులు దర్శించుకున్నారు. ఉగాది పండుగ సందర్భంగా వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేశారు. ఆలయ ఏఓ శ్రీధర్ వారికి స్వాగతం పలికారు. ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతికడప అర్బన్ : కడప నగరం అక్కాయపల్లిలో నివాసం ఉంటున్న లక్ష్మిదేవి(32) అనే మహిళ కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తాలూకా సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సీఐ వివరాల మేరకు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బండపల్లి గ్రామానికి చెందిన వడ్డే లక్ష్మీదేవి (32), తన భర్త రాముడుతో కలిసి ఏడాదిన్నర క్రితం జీవనోపాధి కోసం కడపకు వచ్చారు. . ఏడాది నుంచి ఆమె కడుపు నొప్పితో బాధపడుతుండేది. శనివారం రాత్రి కడుపునొప్పి రావడంతో భర్త మాత్రలు తెచ్చేందుకు బయటకు వెళ్లాడు. అంతలోనే ఆమె విషద్రావణం తాగింది. భర్త గమనించి రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. -
ఉన్నత స్థానాలను అధిరోహించాలి
ట్రిపుల్ ఐటీ ఏఓ రవి కుమార్ కమలాపురం : ప్రతి విద్యార్థి గురువులు చెప్పే పాఠాలు విని అవగాహన చేసుకుని మంచి ఫలితాలు సాధించి జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ట్రిపుల్ ఐటీ ఆర్కే వ్యాలీ ఇడుపులపాయ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రవి కుమార్ తెలిపారు. ఆదివారం మండలంలోని భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్)లోని డీఏవీ భారతి విద్యా మందిర్ 6వ వార్షికోత్సవ వేడుకలను బీసీసీపీఎల్ సీఎంఓ సాయి రమేష్ పర్యవేక్షణలో ప్రిన్సిపల్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ట్రిపుల్ ఐటీ ఏఓ మాట్లాడుతూ విద్యార్థులు ముఖ్యంగా ఏరోజు చెప్పిన పాఠాలను అదే రోజు చదివి అవగాహన చేసుకుని అత్యుత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధనకు కృషి చేయాలన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు. వేంపల్లె ఎంఈఓ జాఫర్ సాదిక్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలన్నీ శ్రద్ధగా విని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, అప్పుడే తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామాలకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా, ఇష్టపడి చదవాలన్నారు. కోర్ అడ్వైజరీ సుబ్బులక్ష్మీ సాయి రమేష్ మాట్లాడుతూ డీఏవీ భారతి విద్యా మందిర్ ఇటు విద్యలోనూ, అటు క్రీడా పోటీల్లోనూ రాణిస్తోందని, అందుకు కృషి చేస్తున్న ప్రిన్సిపల్ కిషోర్ కుమార్‌ను అభినందించారు. అలాగే డీఏవీ రీజనల్ ఆఫీసర్ వీఎన్‌ఎన్‌కే శేషాద్రి, చీఫ్ మేనేజర్ గోపాల్‌రెడ్డి, ఐఆర్‌పీఆర్ చీఫ్ భార్గవ్ రెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. -
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉగాది సంబరాలు
కడప అర్బన్ : తెలుగు నూతన సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ ఉగాది పండుగ సంబరాలను కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో జిల్లా ఎస్పీ ఈ.జీ అశోక్ కుమార్, అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు, పోలీస్ అధికారులు, సిబ్బంది విచ్చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉగాది ప్రత్యేక పూజల్లో పాల్గొని ఉగాది పచ్చడి, మిఠాయిలు అందజేశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉత్సాహ భరిత వాతావరణంలో ఉగాది సంబరాలు జరిపారు. జిల్లా ప్రజలకు, సిబ్బందికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్పీ శ్రీ బి. రమణయ్య, ఆర్.ఐ లు ఆనంద్, వీరేష్, శ్రీశైల రెడ్డి, శివరాముడు, ఆర్.ఎస్.ఐ లు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
వైభవంగా బలిజపల్లె గంగమ్మ జాతరకు అంకురార్పణ
రాజంపేట టౌన్ : ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో బలిజపల్లె గంగమ్మ జాతర రెండో పెద్ద జాతరగా ప్రసిద్ధిగాంచింది. ఏప్రిల్ 3వ తేదీ జరగనున్న గంగమ్మ జాతరకు ఆదివారం రాత్రి నిర్వాహకులు అంకురార్పణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అంకురార్పణ వేడుకను తిలకించేందుకు పట్టణ వాసులే కాక వివిధ గ్రామాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో బలిజపల్లెలో స్వయంభుగా వెలసిన గంగమ్మ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. గంటకు పైగా పూజలు గంగమ్మ జాతర అంకురార్పణ వేడుక సందర్భంగా నిర్వాహకులు గంగమ్మ స్వయంభుకు గంటకు పైగా పూజలు నిర్వహించారు. తొలుత అమ్మవారి స్వయంభును పుష్పాలతో అలంకరించారు. ఒకవైపు పూజా కార్యక్రమాలు జరుగుతుండగా, మరోవైపు తప్పెట్ల దరువులు, కొమ్ము ఊదడం, గంగమ్మ ఆవహించిన భక్తులు ఊగిపోవడం చూసి భక్తులు ఆనందపరవశులయ్యారు. జాతర అంకురార్పణకు ప్రధాన ఘట్టమైన పోతు మెడలో దండ పడగానే భక్తులు పెద్దఎత్తున చప్పట్లు చరించి, ఈలలు, కేకలు వేయడంతో బలిజపల్లె గ్రామం దద్దరిల్లింది. ప్రతి ఏడాది అంకురార్పణకు వేలాది మంది భక్తులు తరలి వస్తారు. దీంతో తోపులాటలు జరిగేవి. అయితే ఏఎస్పీ మనోజ్ రామ్‌నాథ్ హెగ్డే చొరవ తీసుకోవడంతో ఈఏడాది తోపులాటలు వంటివి జరగకుండా అర్బన్ సీఐ రాజ, ఎస్ఐ ప్రసాద్‌రెడ్డి చర్యలు తీసుకున్నారు. గంగమ్మ స్వయంభు ప్రాంగణం చుట్టూ రోప్ ఏర్పాటు చేసి తోపులాటలకు చెక్ పెట్టారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు -
సామాజిక అడవిలో మంటలు
కమలాపురం : మండలంలోని రామచంద్రాపురం సమీపంలో ఉన్న సామాజిక అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న తాటి చెట్ల నుంచి తాటి పట్టలు రాలి పోయి ఎండిపోయాయి. గుర్తు తెలియని ఆకతాయిలు వాటికి నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసి పడుతూ చుట్టు పక్కలకు వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైరింజన్‌తో హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
కూటమి ప్రభుత్వంలో దళిత, మైనార్టీలకు రక్షణ లేదు
కడప కార్పొరేషన్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని దళిత ఫోరం జిల్లా చైర్మన్ కిషోర్ బూసిపాటి అన్నారు. ఆదివారం నగరంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద రీతిలో మృతి చెందితే కేసు నమోదు విషయంలోనూ, పోస్టుమార్టం చేసే సమయంలోనూ పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. అతన్ని అత్యంత దారుణంగా హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నప్పటికీ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు వేగంగా చర్యలు తీసుకోవడంలో విఫలయ్యారన్నారు. దీన్నిబట్టే రాష్ట్రంలో క్రిష్టియన్ మైనార్టీలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా తిరిగే పరిస్థితి లేదని అర్థమవుతోందన్నారు. పగడాల ప్రవీణ్ తనకు ప్రాణహాని ఉందని చాలా రోజులుగా చెబుతున్నా ఆయనకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. హత్యపై అన్ని జిల్లాల్లో నిరసనలు వ్యక్తమవుతుంటే సీఎం చంద్రబాబుగానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌గానీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీకి స్తంభాలైన భజరంగ్‌దళ్, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ సిద్ధాంతాలు అమలవుతుండటం వల్ల మైనార్టీలు, క్రిష్టియన్లకు రక్షణ కరువవుతోందన్నారు. ప్రవీణ్ హత్య కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత అంబేడ్కర్ సేన రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు పెంచలయ్య పాల్గొన్నారు. -
ఉగాది పురస్కారాలు అందుకున్న జిల్లా వాసులు
కడప కల్చరల్ : విశ్వావసు నామ సంవత్సర ఉగాది పురస్కారాలను ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు. ఆయనతోపాటు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, అవధాని మాడగుల నాగఫణిశర్మ తదితరులు ఈ పురస్కారాలను కళాకారులకు అందజేశారు. కడప నగరానికి చెందిన డాక్టర్ చింతకుంట శివారెడ్డి, మొగిలిచెండు సురేష్, బద్వేలుకు చెందిన విద్వాన్ గానుగపెంట హనుమంతరావు, ప్రొద్దుటూరు వాసి జింకా సుబ్రమణ్యం, సాహిత్య విభాగంలో ఉగాది పురస్కారాలను అందుకున్నారు. నిర్వాహకులు వారికి తెలుగు తల్లి విగ్రహం, రూ.10 వేలు చెక్కు అందజేసి ఘనంగా సత్కరించారు. రైతు పండింటి కృష్ణమూర్తికి.. కడప అగ్రికల్చర్ : కడప నగర శివార్లలోని ఊటుకూరు కృషి విజ్ఞానకేంద్రం, ఏరువాక కేంద్రం అభ్యుదయ రైతు పండింటి కృష్ణమూర్తి ఉగాది పురస్కారం అందుకున్నారు. వ్యవసాయ సాగులో ఆచరిస్తున్న వినూత్న పద్ధతులకు గుంటూరు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు 2024 సంవత్సరానికి రాయలసీమ ప్రాంతం తరపున ఎంపిక చేశారు. ఉగాది పండుగలను పురస్కరించుకుని ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ఉగాది వేడుకల్లో రైతు పండింటి కృష్ణమూర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు జ్ఞాపిక, ప్రశంసాపత్రంతోపాటు రూ. 5 వేలు నగదు పురస్కారంతో సత్కరించారు. వేంపల్లి షరీఫ్‌కు..వేంపల్లె : వేంపల్లె పట్టణానికి చెందిన ప్రముఖ కథా రచయిత డాక్టర్ వేంపల్లె షరీఫ్ ఆదివారం ఉదయం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. పదివేల రూపాయల నగదు, శాలువా, మెమెంటోతో ముఖ్యమంత్రి ఆయనను సన్మానించారు. షరీఫ్ రెండున్నర దశాబ్దాలుగా సాహిత్య రంగంలో ఉన్నారు. ముఖ్యంగా కథా రచనలో కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నాలుగు కథా సంపుటాలు వెలువరించారు. మరో మూడు కథా సంకలనాలకు సంపాదక బాధ్యతలు నిర్వర్తించారు. శ్రీరామ్‌కుమార్ శర్మకు.. పులివెందుల టౌన్ : ఉగాది సందర్భంగా ఆదివారం కడప కలెక్టరేట్ సభా మండపంలో జరిగిన ఉగాది సంబరాల్లో పులివెందులకు చెందిన వేద పండితుడు, పురోహితుడు, పంచాంగం రామ్‌కుమార్ శర్మకు పురస్కారం ప్రదానం చేశారు. కార్యక్రమంలో శాసన సభ్యులు నంద్యాల వరదరాజులరెడ్డి, పుట్టా సుధాకర్, యాదవ్, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, దేవదాయ శాఖ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు
– కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పులివెందుల : జిల్లాలో ని ముస్లిం సోదరులకు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.నెలరోజులపాటు కఠోర ఉపవాస దీక్షలతో పాటు ప్రత్యేక ప్రార్థనలు, దాతృత్వానికి ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. రంజాన్ పండుగను కలిసికట్టుగా ఆనందంగా జరుపుకోవాలని.. అందరికీ శుభాలు అందాలని మనసారా ఆకాంక్షించారు. రాయచోటి వాసికి అవార్డు రాయచోటి టౌన్ : ఒడిశా పోలీసు శాఖ అందించే ప్రతిష్టాత్మకమైన డీజీపీ డిస్క్ అవార్డును రాయచోటి పట్టణానికి చెందిన గుండాల రెడ్డిరాఘవేంద్ర (ఐపీఎస్) అందుకోనున్నారు.ఆయన ప్రస్తుతం ఒడిశాలోని నౌపాడా జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. 2024–25 సంవత్సరానికి అవార్డును అందుకోవడానికి ఎంపికై న పోలీసు సిబ్బంది పేర్లను ఒడిశా పోలీసు రాష్ట్ర ప్రధాన కార్యాలయం ప్రకటించింది. చలపతిని ఎన్కౌంటర్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలను నియంత్రించడంలో కృషి చేసినందుకు అవార్డు అందుకోనున్నారు. అవార్డు గ్రహీతలను 2025 ఏప్రిల్ 1న పోలీసు నిర్మాణ దినోత్సవం సందర్భంగా సత్కరించనున్నట్లు రెడ్డిరాఘవేంద్ర తెలిపారు. ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? కమలాపురం : ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? అని కమలాపురం మండల పాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభుదాస్ మండిపడ్డారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై కమలాపురం పాస్టర్ అసిసోయేషన్, పట్టణ క్రైస్తవ సంఘాల ఐక్యతతో ఆదివారం శాంతి ర్యాలీ నిర్వహించారు. గ్రామ చావడి నుంచి క్రాస్ రోడ్డు వరకు ర్యాలీ సాగింది. అనంతరం క్రాస్ రోడ్డు వద్ద కొవ్వొతులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగా ప్రభుదాస్ మాట్లాడుతూ ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? అని ప్రశ్నించారు. ముఖ్యంగా పాస్టర్లపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. పాస్టర్లకు ప్రభుత్వాలు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతి వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలన్నారు. కారకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు. సెక్రటరీ సునీల్‌దత్, వివిధ చర్చీల పాస్టర్లు పాల్ కుమార్, డేవిడ్ రాజ్, పి. రాజు, విజయ్, సురేంద్ర పాల్, స్టీఫెన్, శౌరీ, హెప్సిబా, రాజ్ కుమార్, జయరాజ్, పి.సామ్యూల్, టిపిఎం బ్రదర్, మనోహర్, అరుల్ ప్రసాద్, యు. సాల్మన్, ఐక్యతరావ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల జీవితాల్లో కాంతి నింపాలి
కడప సెవెన్‌రోడ్స్ : శ్రీ విశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సరం జిల్లా ప్రజల జీవితాల్లో ఉషస్సు నింపాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆకాంక్షించారు. ఆదివారం కలెక్టరేట్ సభా భవనంలో దేవదాయ ధర్మాదాయశాఖ, పర్యాటక శాఖ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కొత్త సంవత్సరంలో అందరికీ పరిపూర్ణమైన ఆరోగ్యం సిద్ధించాలన్నారు. వర్షాలు సంవృద్ధిగా కురిసి పల్లె సీమలు పాడి పంటలతో సుభిక్షంగా కళకళలాడాలని అభిలషించారు. అన్ని రంగాలకు శుభసూచికం : విద్వాన్ సొట్టు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అన్ని రంగాల వారికి శుభసూచికమని సంస్కృతాంధ్ర సాహితీ పురాణ పండిట్ విద్వాన్ సొట్టు సాంబమూర్తి అన్నారు. ఆయన పంచాగ పఠనం చేస్తూ విశ్వావసు నామ సంవత్సరం అంటే విశ్వానికి సంబంధించిందన్నారు. ఈ ఏడాది కరువు కాటకాలు ఉండవని... పంటలు బాగా పండేలా వాతావరణం అనుకూలిస్తుందన్నారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు జీవితంలో ఎదురయ్యే వివిధ అనుభవాలకు సంకేతాలన్నారు. కొత్త ఏడాదిలో అడుగు పెట్టిన వారంతా మంచి, చెడు ప్రతి అనుభవాన్ని సమానంగా స్వీకరిస్తూ ముందుకు వెళ్లాలన్నదే ఉగాది పచ్చడి తినడం వెనుక ఉన్న పరమార్థమని వివరించారు. అనంతరం రాశిఫలాల గురించి చదివి వినిపించారు. నలుగురు పండితులకు ఉగాది పురస్కారాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది వేద పండితులు, అర్చకులు, కవులకు అందించే ఉగాది పురస్కారాలు ఈ యేడు జిల్లాకు చెందిన నలుగురికి వచ్చాయి. ప్రొద్దుటూరుకు చెందిన శ్రీనివాసాచార్యులు, పులివెందులకు చెందిన కలుబండి రామకుమార్శర్మ, కడపకు చెందిన గోపాలకృష్ణశర్మ, సొట్టుసాంబమూర్తిలకు దేవాదాయశాఖ ద్వారా ఒక్కొక్కరికి రూ. 10,116 పారితోషికం, ప్రశంసాపత్రం అందజేసి కలెక్టర్ శ్రీధర్ ఘనంగా సత్కరించారు. అనంతరం ఉత్తమ అర్చకులు ఎస్.నరసింహా భట్టార్, బి.చంద్రమౌళిశర్మ, ఎన్.శశిధర్‌లకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, దేవదాయశాఖ సహాయ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, పర్యాటకశాఖ అధికారి సురేష్ పాల్గొన్నారు. అలరించిన నృత్య ప్రదర్శనలు ఉగాది వేడుకల సందర్భంగా ముద్ర అకాడమి లహరి బృందం చిన్నారులు ప్రదర్శించిన శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. అనంతరం వారిని కలెక్టర్ సత్కరించారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి అధ్యక్షతన కవి సమ్మేళనం జరిగింది. చిన్నారి నృత్య ప్రదర్శన కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కలెక్టరేట్లో ఘనంగా ఉగాది వేడుకలు -
రోజుకు 4 లీటర్ల నీరు తాగాలి
కలకడ : వేసవిలో వృద్ధులు, చిన్నారులకు, గర్భిణులు, బాలింతలకు ఎక్కువగా వడదెబ్బ తగిలే అవకాశం ఉందని వైద్యులు తెలియజేస్తున్నారు. ఈసమయంలో మంచినీరును అధికంగా తీసుకుని, కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే వేడిమి నుంచి ఉపశమనం పొందొచ్చని కలకడ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున సూచిస్తున్నారు. ప్రతి వ్యక్తి రోజుకు నాలుగు లీటర్ల నీరు తాగడం చాలా అవసరం. ప్రతి 2గంటలకు అరలీటరు నీటిని విధిగా తాగాలి. భోజనం తినే సమయంలో తక్కువగా..అరగంట ఆగిన తర్వాత ఎక్కువ నీరు తాగాలని తెలియజేస్తున్నారు. -
ఎండలు అదరగొడుతున్నాయి. పొగలు కక్కుతున్న భానుడి దెబ్బకు రోడ్లపై సెగలు పుడుతున్నాయి. గతేడాదితో పోలిస్తే సీజన్ ప్రారంభంలోనే ఎండలు చురుక్కుమంటున్నాయి. మార్చి మొదటి వారంలోనే వేడెక్కిన సూరీడు.. నెల దాటేసరికి నిప్పులు కక్కుతున్నాడు. వెరసి జనాలు అల్లాడుతున్నారు.
పులివెందుల రూరల్ : పది రోజులుగా ఎండల ప్రభావం తీవ్రంగా ఉండడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయంతో జంకుతున్నారు. ఎండ తీవ్రతకు గురై చాలా మంది అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఎండలో తిరగడంవల్ల జ్వరాలతోపాటు దగ్గు, జలుబు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా వేసవి కాలంలో కూడా దగ్గు, జలుబు, జ్వరాలు రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వడదెబ్బ నివారణకు అప్రమత్తతే ముఖ్యం ఎర్రగుంట్ల : ఎండ తీవ్రత అధికమైంది, ప్రస్తుతం జిల్లాలో 40–42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ఎండలో ఎక్కవగా గడిపితే డీహైడ్రేషన్(శరీరంలో నీటి శాతం తగ్గడం) డయేరియా(విరేచనాలు) తదితర సమస్యలతో ఇబ్బంది పడే అవకాశముంది. ఈ నేపథ్యంలో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎర్రగుంట్ల, చిలంకూరు పీహెచ్సీ వైద్యాధికారులు తెలియజేశారు. ప్రజలు వేసవిలో వీలైనంతగా పని చేయకుండా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. ఉదయం సాయంత్రం మాత్రమే ప్రజలు పనులు చేసుకోవడం మేలు. ఎండలో ఎక్కువ సేపు పనిచేస్తే చర్మం పొడి బారడం, కళ్లు ఎరుపెక్కడం, ఒళ్లు మంటలు, నొప్పులు వస్తాయి, ఒక్కోసారి అపస్మారక స్థితిలోకి వేళ్లే అవకాశం ఉంది. నిర్మానుష్యంగా కడప కృష్ణా సర్కిల్ వేడెక్కిన సూరీడు.. ‘ఉక్క’రిబిక్కిరవుతున్న జనాలు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు -
బైకును ఢీకొన్న కారు.. దంపతులు మృతి
కొండాపురం : మండల కేంద్రంలోని తాడిపత్రి– కడప జాతీయ రహదారిలో శనివారం ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొనడంతో దంపతులు మృతి చెందారు. ఎస్ఐ విద్యాసాగర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొండాపురం మండలంలోని ముచ్చుమర్రి గ్రామానికి చెందిన తూర్పింటి రామ్మోహన్(45), సరోజ(40) దంపతులు పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవారు. కొండాపురం నుంచి వారు తెల్లవారుజామున తాడిపత్రి వైపు ముచ్చుమర్రి గ్రామానికి ద్విచక్రవాహనంలో వెళ్తుండగా.. కొండాపురంలోని జాతీయ రహదారిలో కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే 108 వాహనంలో తాడిపత్రిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సరోజను వైద్యుడు పరిశీలించి మృతి చెందినట్లు తలిపారు. రామ్మోహన్‌ను మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్యాభర్తలు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు దుఃఖ సాగరంలో మునిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించాలి
కడప కార్పొరేషన్ : ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి కోరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అయినప్పటికీ ఉద్యోగస్థులకు, ఉపాధ్యాయులకు సంబంధించిన 12వ పీఆర్సీ కమిషన్‌ను ఇంకా ఏర్పాటు చేయకపోవడం సరికాదని విమర్శించారు. వెంటనే కమిషన్ ఏర్పాటు చేసి, కొత్త పి.ఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆలోపు ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐఆర్ ను 25% తగ్గకుండా ప్రకటించాలని కోరారు. ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా వెంటనే విడుదల చేయాలన్నారు. ఎస్.ఎస్.సి. పరీక్షలలో రాష్ట్ర వ్యాప్తంగా సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులను తిరిగి విధులలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎవరో చేసిన తప్పులకు ఉపాధ్యా యులను బలి చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం, వల్లూరు, వేంపల్లె (వైఎస్సార్ జిల్లా) ఇతర ప్రాంతాలలో ఎవరో చేసిన తప్పులకు ఉపాధ్యాయులు బలి అయ్యారన్నారు. ప్రభుత్వం అసలైన దోషు లను శిక్షించాలే కాని, ఉపాధ్యాయులను నస్పెండ్ చేసి జైలుకు పంపడం సరియైన పద్ధతి కాదన్నారు. రాబోవు పరీక్షలకై నా ఇలాంటి తప్పిదాలు ఎక్కడా జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పరీక్షల విధుల్లో ఉన్న ఉపాధ్యాయులను వేధించడం తగదు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి -
వైఎస్ కుటుంబ సహకారంతోనే జెడ్పీ చైర్మన్ స్థాయికి..
చక్రాయపేట : వైఎస్ కుటుంబ సహకారంతోనే తాను జెడ్పీ చైర్మన్ స్థాయికి ఎదగానని జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి పేర్కొన్నారు. జెడ్పీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశాక ఆయన కుటుంబ సభ్యులతో కలిసి గండి క్షేత్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ, జెడ్పీటీసీ తాటిగొట్ల శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కేసరి, రాజారమేష్ పూర్ణ కుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ ఆవరణలో భక్తుల సౌకర్యార్థం రూ.2 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓహెచ్ఎస్ఆర్ మంజూరు చేయాలని జెడ్పీ చైర్మన్‌కు ఆలయ చైర్మన్, జెడ్పీటీసీ వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ బాలయ్య, ఏపీ ఆగ్రోస్ మాజీ అధ్యక్షుడు నందారపు చెన్నకృష్ణారెడ్డి, చక్రాయపేట, వీరపునాయునిపల్లె ఎంపీపీలు మాధవీ బాలకృష్ణ, రమణారెడ్డి, వేముల, కమలాపురం జెడ్పీటీసీలు బయపురెడ్డి, సుమిత్ర రాజశేఖరరెడ్డి, ఎంపీటీసీ మోహన్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు సంబటూరు ప్రసాదరెడ్డి, ఈశ్వరరెడ్డి, శంకర్‌రెడ్డి, నరసింహారెడ్డి, సుధాకర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, హరినాథ్, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ రామగోవిందరెడ్డి -
ఉప సర్పంచ్ పదవి కోసం అరాచకం
ప్రొద్దుటూరు : కేవలం గోపవరం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ పదవి కోసం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలు, దౌర్జన్యం, అరాచకాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతిని రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. గోపవరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం, శుక్రవారం జరిగిన సంఘటనలే ఇందుకు సాక్ష్యమని అన్నారు. ఉపసర్పంచ్ ఎన్నిక సందర్భంగా గురువారం తమ వార్డు సభ్యులను కార్యాలయంలోకి వెళ్లకుండా రాళ్లు విసిరి, మారణాయుధాలతో వెంబడించారన్నారు. శుక్రవారం టీడీపీ వార్డు సభ్యులు తమలో తాము కొట్టుకోవడం, కుర్చీలు విసిరేయడం, మినిట్స్ బుక్ చించడం జరిగిందన్నారు. ఫైనల్‌గా ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డికి గుండెపోటు వచ్చినట్లు నటింపజేశారన్నారు. గుండెపోటు వచ్చిన రామాంజనేయరెడ్డికి సంబంధించి అధికారులు ఎందుకు హెల్త్ బులెటెన్ విడుదల చేయలేదని ప్రశ్నించారు. ఇదంతా వరద స్టంట్ అని విమర్శించారు. టీడీపీకి ఒకరే వార్డు సభ్యుడు గత ఎన్నికల సందర్భంగా గోపవరం గ్రామ పంచాయతీలో 20 మంది వార్డు మెంబర్లకుగాను ఒకరే టీడీపీ తరఫున ఎన్నికయ్యారని రాచమల్లు తెలిపారు. నాలుగు రోజుల క్రితం మరో ఐదుగురు వైఎస్సార్సీపీ నుంచి వరద వైపు వెళ్లారన్నారు. ఏవిధంగా చూసినా 14 మంది వార్డు సభ్యులు ఉన్న వైఎస్సార్సీపీకి ఉప సర్పంచ్ పదవి దక్కుతుందా.. ఆరుగురు ఉన్న టీడీపీ సభ్యులకు దక్కుతుందా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలన్నారు. రూ.3–4 లక్షలు ఇస్తామని ప్రలోభపెట్టినా తమ వార్డు సభ్యులెవరూ వరద వైపు వెళ్లలేదన్నారు. జరిగిన గొడవను బట్టి ఇలాంటి వరదరాజులరెడ్డిని ఎమ్మెల్యేగా తాము గెలిపించామా అని ప్రజలు విస్తుపోతున్నారన్నారు. తాను డబ్బు సంపాదించి ఇంటిలో పెట్టుకుంటున్నానని చెప్పిన ఎమ్మెల్యే, ఆయన కుమారుడు సంపాదిస్తున్న డబ్బును గూట్లో పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 1980 నుంచి రాజకీయాల్లో ఉన్నా నేటికీ ఆయనలో ఏమాత్రం మార్పు రాలేదని తెలిపారు. ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా పోలీసు కేసులు నమోదు కాలేదన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, ఎంపీపీ శేఖర్ యాదవ్, రాజుపాళెం మండలం వైఎస్సార్సీపీ కన్వీనర్ బాణ కొండారెడ్డి, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.ఎమ్మెల్యే వరదపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ధ్వజం -
నేటి నుంచి పెద్ద పీరయ్య ఆరాధనోత్సవాలు
బ్రహ్మంగారిమఠం : కాలజ్ఞాన ప్రభోదకర్త శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ప్రథమ శిష్యుడు దూదేకుల సిద్దయ్యస్వామి పెద్ద కుమారుడు పెద్దపీరయ్యస్వామి ఆరాధన మహోత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. ముడుమాలలోని సిద్దయ్యమఠంలో ఏటా ఉగాది సందర్భంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్నాయి. ఇందుకోసం ప్రస్తుత మఠాధిపతులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు పెద్దపీరయ్యస్వామికి పూలపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. బి.మఠం మండలం గొడ్లవీడు గ్రామానికి చెందిన కనపర్తి నాగిరెడ్డి, కనపర్తి సిద్దారెడ్డిల జ్ఞాపకార్థం వారి కుమారులు రాత్రి గ్రామోత్సవం ఏర్పాటు చేస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. భజనలు, డ్రామాలు, చిన్నాయపల్లె గ్రామస్తుల ఆధ్వర్యంలో సినీ పాటకచేరి, కోలాటాలు వంటి కార్యక్రమాలు రాత్రి ఉత్సాహ భరితంగా జరుగుతాయి. 31న బండలాగుడు పోటీలు 31న (సోమవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి బండలాగుడు పోటీలు ఉంటాయి. ప్రథమ బహుమతి జౌకుపల్లెకు చెందిన ముత్యాల పిచ్చిరెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు జెడ్పీ చైర్మన్, బి.మఠం జెడ్పీటీసీ ఎం.రామగోవిందరెడ్డి రూ.1,00,116లు, రెండవ బహుమతి గొడ్లవీడు గ్రామం కనపర్తి రామసుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు, సింగల్ విండో అధ్యక్షుడు నేలటూరు సుబ్బారెడ్డి రూ.70,116లు, మూడవ బహుమతి ముడుమాల గ్రామం కొనకొండు ఆచారి కొండయ్య కుమారులు రూ.45,116లు, నాలుగో బహుమతి బసిరెడ్డి దుగ్గిరెడ్డి రూ.30,116లు, 5వ బహుమతి సిద్దయ్యమఠం నిర్వాహకులు రూ.15,116లు ప్రదానం చేయనున్నా రు. 16 మనుముల గుండు ఎత్తిన వారికి ప్రథమ బహుమతి జౌకుపల్లె గ్రామస్తులు రూ.25,116, రూ.2,016, రూ.1,116, 13 మనుముల గుండు ఎత్తిన వారికి బహుమతులు ఇవ్వనున్నారు. ఉత్సవాలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక నుంచి కూడా భక్తులు రానున్నారు. -
● చంద్రకాంతిలో కలువ సోయగం
సాధారణంగా సూర్యకాంతిలో వికసించే అనేక పువ్వులు మనకు తెలుసు, రాత్రిపూట వికసించే కొన్ని పువ్వులు కూడా ఉన్నాయి. వింతలు, విశేషాలకు ప్రకృతి నెలవు. సిద్దవటంలోని అటవీఽశాఖ కార్యాలయంలో రాత్రిపూట చంద్రకాంతిలో కలువపువ్వు వికసించి అందరినీ అబ్బురపరిచింది. సాధారణంగా కలువ పూలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు వికసిస్తాయి. కానీ ముదురు ఎరుపు లేదా గులాబీ లేదా ఊదా రంగులో ఉండే ఈ నీటి కలువ.. శనివారం సాయంత్రం సంధ్యా సమయంలో వికసించింది. నీటిలో తేలియాడే ఈ అందమైన ప్రకాశవంతమైన పువ్వు చీకటి నేపథ్యంలో చాలా మర్మంగా కనిపిస్తుంది. 6 నెలల కిందట 8 రకాల కలువ పువ్వులను వివిధ ప్రదేశాల నుంచి తెప్చించి కార్యాలయం ఆవరణంలో మూడు తొట్లలో నాటామని సిద్దవటం రేంజన్ కళావతి తెలిపారు. రాత్రి పూట వికసిస్తూ కనువిందు చేస్తోందని ఆమె చెప్పారు. – సిద్దవటం ధూమపాన డ్రైవర్‌పై సస్పెన్షన్ వేటుఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం క్షేమకరమని ప్రజలు భావించి, ఇష్టపడుతుంటారు. ఇటువంటి సందర్భంలో డ్రైవర్లు, కండెక్టర్లు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అయితే శనివారం తెల్లవారుజామున కడప నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సులో.. డ్రైవర్ ఎ.రామమోహన్ విధి నిర్వహణలో ప్రయాణికుల భద్రతను విస్మరించి ధూమపానం చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇలా చేయడం సరికాదని పలువురు ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ డ్రైవర్‌ను విజయవాడలో విధుల నుంచి తప్పించి సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని కడప డిపో మేనేజర్ డిల్లీశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. బస్సును వేరే డ్రైవర్ సాయంతో కడపకు తీసుకొచ్చేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. భవిష్యత్తులో డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. – కడప కోటిరెడ్డిసర్కిల్ -
సమష్టి కృషితోనే నేర నియంత్రణ
కడప అర్బన్ : సమష్టి కృషితో నేరాలు నియంత్రించాలని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తెలిపారు. స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పోలీస్ అధికారులతో నెల వారీ నేర సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు, సైబర్ నేరాలు అరికట్టేందుకు ముమ్మరంగా దాడులు నిర్వహించాలని పేర్కొన్నారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందచేసి అభినందించారు. సమావేశంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.ఎన్టీఆర్ వైద్య సేవా బిల్లులు విడుదల చేయాలికడప కోటిరెడ్డిసర్కిల్ : రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆస్పత్రులకు సంబంధించి ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద పెండింగ్‌లో ఉన్న రూ.3 వేల కోట్లకు పైగా బిల్లులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ కడప జిల్లా శాఖ ప్రతినిధుల బృందం డీఆర్వో, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ బాలాంజనేయులను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఆస్పత్రులు నిరంతర సేవలు అందించడంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తక్షణ సాయంగా రూ.1500 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగే మిగిలిన బిల్లుల కోసం ఒక నిర్దిష్ట చెల్లింపు షెడ్యూల్ ప్రకటించాలని విన్నవించారు. ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకుంటే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆస్పత్రులు నిరాటంకంగా సేవలు అందించగలవన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ కడప జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి, వివిధ ఆస్పత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘లోక్ అదాలత్’ సేవలు సద్వినియోగం చేసుకోండి
కడప అర్బన్ : జిల్లాలోని ప్రజలు శాశ్వత లోక్ అదాలత్, పబ్లిక్ యుటిలిటీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కడప శాశ్వత లోక్ అదాలత్, పబ్లిక్ యుటిలిటీ సేవల చైర్మన్ స్వర్ణ ప్రసాద్ తెలిపారు. శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి, జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబా ఫకృద్దీన్ ఆధ్వర్యంలో కడపలోని జిల్లా కోర్టు ఆవరణలో ‘పారా లీగల్ వలంటీర్లు, పర్మినెంట్ లోక్ అదాలత్ ఉద్యోగులకు శాశ్వత లోక్ అదాలత్, పబ్లిక్ యుటిలిటీ సేవలు, సామర్థ్యం, పెంపుదల, శిక్షణ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ మాట్లాడుతూ ఈ లోక్ అదాలత్‌లు సంబంధిత జిల్లా ప్రధాన కార్యాలయంలో న్యాయసేవాసదన్ భవన సముదాయాలలో పని చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాలిపోయిన కారు.. తప్పిన ప్రమాదం ప్రొద్దుటూరు క్రైం: మండలంలోని తాళ్లమాపురం గ్రామ సమీపంలో కారు దగ్ధమైంది. తాళమాపురం గ్రామానికి చెందిన నాగార్జున శనివారం ఉదయం కారులో పొద్దుటూరుకు వెళ్లాడు. పని ముగించుకుని రాత్రి పొద్దుటూరు నుంచి కారులో తాళ్లమాపురం గ్రామానికి బయలుదేరాడు. గ్రామ సమీపంలోకి రాగానే కారులోని ఏసీ లోంచి పొగలు వచ్చాయి. అప్రమత్తమైన నాగార్జున వెంటనే కారును ఆపి దిగిపోయాడు. అతను కారు దిగి పక్కకు వెళ్లిన క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా కాలిపోయింది. నాగార్జున అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేశారు. -
మాపై అసత్య ఆరోపణలు
పోరుమామిళ్ల : ఈనాడు దినపత్రికలో శనివారం ప్రచురించిన కథనంపై ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘గోవింద.. ఇదీ నీ బామ్మ ర్ది భూదందా!’ శీర్షికతో ఈనాడు లో వచ్చిన కథనంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఇద్దరు బామ్మర్దులు ఉండగా.. ఒకరు శంకర్‌రెడ్డి ప్రమాదంలో మరణించారని, మరొకరు వెంకట్రామిరెడ్డి అన్నా రు. ఆయనకు భూదందాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు, తన బామ్మర్ది వెంకట్రామిరెడ్డికి ఎలాంటి సంబంధం లేని వార్త వండి వైఎస్సార్సీపీకి, మాకు అంటగట్టడం కరెక్టు కాదన్నారు. తమ పై చేసిన ఆరోపణలు అసత్యమని తెలిపారు. ఎవరైనా అక్రమాలు, కబ్జాలకు పాల్పడినపుడు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అడ్డు చెప్పబోమన్నారు. వాస్తవాలు తెలుసుకొని వార్తలు రాయాలని, ఇలా అడ్డదిడ్డంగా వార్తలు రాసి ఈనాడు పరువు దిగజార్చుకోవద్దని ఆయన సూచించారు.ఈనాడు కథనంపై ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఖండన -
అవినీతి మచ్చ లేని జీవితం మాది
● కాంట్రాక్టు వర్కులు చేసిన చరిత్ర మా కుటుంబానికి లేదు ● నా ప్రమేయం లేకుండానే వర్థిని కన్స్ట్రక్షన్ రిజిస్ట్రేషన్ ● వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐఏఎస్‌ను కమిషనర్‌గా తెచ్చాం.... ● మీరు మీ బంధువును కమిషనర్‌గా తెచ్చుకొని ఆటలాడుతున్నారు ● వాసు, మాధవిరెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మేయర్ సురేష్ బాబు కడప కార్పొరేషన్ : కాంట్రాక్టు వర్కులు చేసిన చరిత్ర తమ కుటుంబానికి లేదని కడప మేయర్ కె. సురేష్ బాబు అన్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నోటీసులపై శనివారం కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తన కుమారుడిది అని చెప్తున్న వర్థిని కాంట్రాక్టు సంస్థను తనకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేశారని, అది చేసిన మొత్తం వర్కులు కూడా రూ.30లక్షలలోపే అన్నారు. పనుల్లో ఎక్కడా అవినీ తి జరిగినట్లుగానీ, నాణ్యతలో లోపాలున్నాయనిగా నీ నోటీసుల్లో చెప్పలేదన్నారు. పనులు చేయకుండా బిల్లు లు చేసుకున్నట్లు కూడా ఎక్కడా లేదన్నారు. వర్క్ చేసే విధానంలో, కాంట్రాక్టర్ రిజిస్టర్ చేసే విధానంలో తప్పులున్నాయని చెప్పారన్నారు. రూ.10లక్షలు పైబడిన వర్కులు మాత్రమే తన దృష్టికి వస్తాయని, ఆలోపు వర్కులు కమిషనర్ స్థాయిలోనే జరుగుతాయని అందువల్ల ఈ కాంట్రాక్టు పనుల విషయం తనకు తెలియలేదన్నారు. 40 ఏళ్ల నుంచి తన పెదనాన్న, తాను, తన భార్య చిన్నచౌకు సర్పంచులుగా ఉన్నామని, 2001లో జెడ్పీ చైర్మన్‌గా, రెండు పర్యాయాలు మేయర్‌గా, కాంగ్రెస్, వైఎస్సార్సీపీల్లో 15 ఏళ్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశానని, ఎక్కడా చిన్న అవినీతి మచ్చ లేదన్నారు. వైఎస్సార్, వైఎస్ జగన్ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో జిల్లాల్లో రూ.20 వేలకోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, తాను చేయాలని అనుకుంటే వందలకోట్ల కాంట్రాక్టు పనులు చేసేవాడినన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక తాము ఆస్తులు అమ్ముకున్నామే తప్పా, ఎక్కడా సంపాదించుకోలేదని స్పష్టం చేశారు. నిత్యం ప్రజాసేవలో ఉన్న తనపై నిందలు వేయడం బాధాకరమన్నారు. ట్రెజరీలో భద్రపరచాల్సిన డాక్యుమెంట్లు వారి చేతికి ఎలా వచ్చాయి 2019లో ఎన్నికల్లో నామినేషన్ వేసిన డాక్యుమెంట్లను ట్రెజరీలో భద్రపరచాల్సి ఉండగా, వాటిని అధికారులతో బయటికి తీయించి, ఒరిజినల్స్ లేకపోయినా ఒక డీఈతో అటెస్టేషన్ చేయించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. ఈనెల 28వ తేది సాయంత్రం నోటీసు తనకు అందిందని, ఐదు రోజుల ముందే ఆ నోటీసును ఎమ్మెల్యే మాధవి, శ్రీనివాసులరెడ్డి బహిర్గత పరచడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అన్నారు. 2019లో అఫిడవిట్లో చూపినప్పుడు తన కుమారుడు ఒక మైనర్ అని, ఇప్పుడతను మేజర్ అని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ దాచిన డాక్యుమెంట్లు వారి చేతికి ఎలా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రాగానే అందరినీ భయపెట్టి రెండు బార్లను స్వాధీనం చేసుకున్నారని, అడ్డూ అదుపూ లేకుండా ఇసుక, మట్టి దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. మట్కా సైతం ఆడిస్తున్నారని విమర్శించారు. ●వాసు అవినీతి ఎవరికి తెలీదు... అధికారంలోకి వచ్చాక మాధవిరెడ్డి అక్రమాలకు లెక్కేలేదు సంధ్యా సర్కిల్లో ఉన్న ఆర్ఎస్ఆర్ స్క్వైర్ మాల్లో 0.04 సెంట్లు ప్రభుత్వ భూమిని వాసు ఆక్రమణ చేశారని, దీనిపై కమిషనర్ నోటీసు ఇస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారన్నారు. మధుసూదన్‌రెడ్డి అనే వ్యక్తి తన చెల్లికి పసుపు, కుంకుమ కింద ఇచ్చిన స్థలాన్ని కూడా ఆక్రమించేందుకు వారిని స్టేషన్‌కు పిలిపించి బెదిరించారన్నారు. ఈ 9 నెలల్లోనే ఎమ్మెల్యే మాధవి, శ్రీనివాసులరెడ్డి ఎన్నో అక్రమాలు చేశారని, 15వ ఆర్థిక సంఘం కింద చేపట్టే పనుల టెండర్లలో ఎవరూ పాల్గొనకుండా కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారన్నారు. నగరాన్ని అభివృద్ధి చేసేందుకు మాత్రం ప్రభుత్వం నుంచి ఒక్క పైసా నిధులు తేలేదని ఎద్దేవా చేశారు. తనకిచ్చిన నోటీసుపై ప్రభుత్వానికి వివరణ ఇస్తానని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, కార్పొరేటర్లు పాకా సురేష్, మగ్బూల్ బాషా, కె. బాబు, మల్లికార్జున, చంద్రహాసరెడ్డి, బాలస్వామిరెడ్డి, రామలక్ష్మన్రెడ్డి, శ్రీరంజన్‌రెడ్డి, బసవరాజు పాల్గొన్నారు. 1995లో శ్రీ సాయి కన్స్ట్రక్షన్లో పార్టనర్‌గా ప్రవేశించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి అవతవకలకు పాల్పడితే 2004లో ఈఎన్సీ శివారెడ్డి ఆ సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఆర్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఇంజినీరింగ్ కాంట్రాక్టు సంస్థను కొని దొంగ సర్టిఫికెట్లు పెట్టి కాంట్రాక్టు సంస్థను ఎలా ప్రమోట్ చేసుకున్నారో, ఎంత నల్లధనం వెనకేశారో అందరికీ తెలుసన్నారు. 2014–19లో టీడీపీ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో చేయాల్సిన నీరు–చెట్టు పనులను కడప నగరంలో చేసి...9 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ బిల్లులను చేసుకునేందుకు ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీనివాసులరెడ్డి కుమారుడిని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిని చేయాలని మెజార్టీ లేకపోయినా 8 మంది క్రికెట్ అసోసియేషన్ సభ్యులను బ్లాక్మెయిల్ చేసి 6 గంటలు ఇంట్లో నిర్భంధించి సంతకాలు చేయించుకున్నారని...ఇంత దౌర్జన్యం ఎక్కడా చూడలేదని విమర్శించారు. కడపను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక ఐఏఎస్ అధికారిని తెచ్చి పాలన చేశామని, కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్ స్థాయిని తగ్గించి ఓ కేసులో ఉన్న వాళ్ల బంధువైన గ్రూప్–1 అఽధికారిని కమిషనర్‌గా తెచ్చుకొని ఆటలాడుతున్నారని ధ్వజమెత్తారు. వీళ్లా అవినీతి గురించి మాట్లాడేదని మండిపడ్డారు. -
కొత్త ఉషస్సుల విశ్వావసు
కడప కల్చరల్ : విశ్వావసు నామ నూతన సంవత్సరాదికి తెలుగు లోగిళ్లు నవ శోభను సంతరించుకున్నాయి. పండగ సామగ్రి కొనడానికి వచ్చిన ప్రజలతో శనివారం మార్కెట్లు కళకళలాడాయి. ప్రజలు ఉదాయన్నే తలంటుస్నానాలు చేసి ఇంటి దైవానికి పూజలు నిర్వహిస్తారు. ఇంటిల్లిపాది షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడిని సేవిస్తారు. సాయంత్రం దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకుంటారు. ఆయా దేవాలయాలు ముస్తాబయ్యాయి. జీవితం రుచి తెలిపే పండుగ జీవితాంతం హాయిగా..ఎలాంటి కష్టాలు లేకుండా సాగిపోవాలని అందరూ కోరుకుంటారు. ఎంత వద్దనుకున్నా..ఎంత ధనవంతులకై నా కష్టాలు తప్పవు....జీవితమంటే కష్టసుఖాల కలయిక అని తెలుపుతూ ఉగాది నాడు షడ్రుచులతో ఉగాది పచ్చడి స్వీకరిస్తా రు. జీవితమంటే చేదు, తీపిల కలయిక అని సందేశం ఇవ్వడమే కాకుండా శరీరానికి ఆరోగ్యం చేకూర్చే ఉగాది పచ్చడిని ప్రతి తెలుగింటిలోనూ తప్పక తయారు చేస్తారు. ఈ సీజన్లో వచ్చే ఎన్నో వ్యాధులను ఈ పచ్చడి తినడం ద్వారా నివారించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. కవుల పండుగ ఉగాదిని కవుల పండుగగా చెప్పవచ్చు. పండుగ నాడు కవి సమ్మేళనాలు నిర్వహించి అంతో ఇంతో సంభావన ఇచ్చి కవులను సత్కరించడం పండుగ సంప్రదాయం. వైఎస్సార్ జిల్లాను కవుల గడపగా పేర్కొంటారు. జిల్లా అంతటా స్వచ్ఛంద సేవా సంస్థలు, సమాజానికి సేవ చేస్తున్న వారికి ఉగాది పురస్కారాలు అందజేస్తుండగా, సాహిత్య సంస్థలు కవులను ఆహ్వానించి కవి సమ్మేళనాలు నిర్వహించి వారిని ఘనంగా సత్కరించనున్నారు. మత సామరస్యానికి ప్రతీక మన జిల్లాను మత సామరస్యానికి మారుపేరుగా పేర్కొంటారు. మొన్నటి ముస్లిం ప్రముఖులు హకీమ్ మంజుమియా నుంచి నేటి పెద్దదర్గా వరకు మత సహనానికి గట్టి పునాదులు వేశాయి. ఉగాది సందర్భంగా దేవునికడప ఆలయంలో పలువురు ముస్లింలు ప్రార్థనలు నిర్వహిస్తారు. ఒంటిమిట్ట, రాయచోటిలలో కూడా ఈ ఆచారం ఉంది. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వెలుపల నాటి ముస్లిం ప్రముఖులు తవ్వించిన ఇమామ్ బేగ్ బావి మత సామరస్యానికి మారుపేరుగా నేటికీ నిలిచి ఉంది. కడప బ్రాహ్మణ వీధిలోని జూల ఆంజనేయస్వామి ఆలయాన్ని ముస్లిం సుల్తాన్ నిర్మింపజేసినట్లు తెలుస్తోంది. రుచి తెలిపే పండుగ నేడు ఉగాది -
ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు
పులివెందుల: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జిల్లా ప్రజలకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పండని పేర్కొన్నారు. ఈ ఏడాదంతా జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో వర్థిల్లాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతన్నల ఇంట సిరులు కురవాలని, అలాగే అన్ని వర్గాల ప్రలకు మేలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఐదుగురికి ఉగాది పురస్కారాలు కడప కల్చరల్: ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక విభాగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత హంస (కళారత్న) పురస్కారాలను విశ్వావసు నామ సంవవత్సర ఉగాది సందర్భంగా ఆదివారం అందజేయనుంది. వైఎస్సార్ కడపజిల్లా నుంచి ఈ పురస్కారానికి ఐదుగురు ఎంపికయ్యారు. వారిలో నాటకానికి సంబంధించి కడప నగరం ఓం శాంతినగర్‌లోని సింగంశెట్టి అరుణకుమారి హంస (కళారత్న) పురస్కారం, సాహిత్య విభాగం నుంచి విద్వాన్ గానుగపెంట హనుమంతరావు (బద్వేలు), ప్రొద్దుటూరుకు చెందిన జింకా సుబ్రమణ్యం, కడప నగరం బ్రౌన్ గ్రంథాలయ సహాయ పరిశోధకులు డాక్టర్ చింతకుంట శివారెడ్డి, కడప నగరం ప్రకాశ్‌నగర్‌లోని మొగిలిచెండు సురేష్ ఉగాది పురాస్కరాలకు ఎంపికై నట్లు ఆ విభాగానికి చెందిన అధికారులు శనివారం జాబితాను ప్రకటించారు. నేడు, రేపు రిజిస్ట్రేషన్ సేవలు కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రధాన పండుగలైన ఉగాది, రంజాన్ పండుగ సందర్భంగా ఈనెల 30, 31 తేదీల్లో సెలవు రోజులయినప్పటికీ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేస్తాయని రిజిస్ట్రేషన్‌శాఖ డీఐజీ ప్రసాద్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. భూములు, స్థలాల క్రయ విక్రయదారులు ఈ విషయాన్ని గుర్తించి తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. నేడు, రేపు విద్యుత్ బిల్లుల చెల్లింపునకు అవకాశంకడప కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం ఈ నెల 30, 31వ తేదీల్లో జిల్లా వ్యాప్తంగా విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు యథాతథంగా పనిచేస్తాయని జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీరు ఎస్. రమణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించి సంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎంప్లాయీస్, పెన్షనర్ల విభాగంలో నియామకాలు కడప కార్పొరేషన్ : వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎంప్లాయీస్, పెన్షనర్ల విభాగ అధ్యక్షులను నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. బద్వేల్ ఎంప్లాయీస్ పెన్షనర్ల విభాగం అధ్యక్షుడిగా సింగనమల శ్రీనివాసులరెడ్డి, జమ్మలమడుగు అధ్యక్షుడిగా మల్లు వెంకుట స్వామిరెడ్డి, కడప అధ్యక్షుడిగా షేక్ అబ్దుల్ ఖాదర్, మైదుకూరు అధ్యక్షుడిగా సింగా వీరభద్రుడు, ప్రొద్దుటూరు అధ్యక్షుడిగా లక్కిరెడ్డి వెంకట రమణారెడ్డి, పులివెందుల అధ్యక్షుడిగా బి. వీరారెడ్డి నియమితులయ్యారు. 72 మంది గైర్హాజరు కడప ఎడ్యుకేషన్ : పదో తరగతి పరీక్షల ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1లో భాగంగా శనివారం జరిగిన సంస్కృతం, అరబిక్, పర్షియన్తోపాటు ఒకేషనల్ పరీక్షలకు 72 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 45 పరీక్షా కేంద్రాలకుగాను రెగ్యులర్‌కు సంబంధించి 3915 మంది విద్యార్థులకుగాను 3843 మంది విద్యార్థులు హాజరుకాగా 72 మంది గైర్హారయ్యారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ 9 పరీక్షా కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్ 39 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయని డీఈఓ తెలిపారు. సకాలంలో పన్నులు చెల్లించాలి కడప కోటిరెడ్డిసర్కిల్ : పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ, వీఏటీ/సీఎస్టీ పన్నులు సకాలంలో చెల్లించాలని వాణిజ్యపన్నులశాఖ జాయింట్ కమిషనర్ కల్పన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పన్నులు చెల్లింపునకు ఆన్లైన్ ద్వారా 24 గంటలపాటు వెబ్సైట్ సౌకర్యం ఉందని, వెబ్సైట్లో ఈ–పేమెంట్ గేట్‌వే ద్వారా పన్నులు సులభంగా చెల్లించవచ్చని పేర్కొన్నారు. అలాగే అసిస్టెంట్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్ కార్యాలయాల్లో పన్ను చెల్లింపుదారులకు అవసరమైన సహాయ సహకారాలు, సందేహాల నివృత్తి కోసం సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. పన్ను చెల్లింపుదారులు తమశాఖకు తమవంతుగా సహకరించాలని కోరారు. -
కేజీబీవీల్లో ప్రవేశాలకు పిలుపు
గ్రామీణ ప్రాంత నిరుపేద కుటుంబాల బాలికల చదువుకు కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు) బాసటగా నిలుస్తున్నాయి. ఉచిత వసతితోపాటు నాణ్యమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ ఆదరిస్తున్నాయి. బాలికల ఉజ్వల భవిష్యత్తుకు గట్టిపునాది వేస్తున్నాయి. తాజాగా కేజీబీవీల్లో 6వ తరగతితోపాటు ఇంటర్ ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసిన నేపథ్యంలో ప్రత్యేక కథనం. ● నిరుపేద కుటుంబాల బాలికలకు సదవకాశం ● ప్రారంభమైన ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ● ఆరో తరగతి, ఇంటర్లో ప్రవేశాలకు అవకాశం ● ఏప్రిల్ 11 దరఖాస్తుకు తుది గడువు ● 17 కేజీబీవీల్లో భర్తీకానున్న 1602 సీట్లు కడప ఎడ్యుకేషన్ : జిల్లాలో బాలికల అక్షరాస్యత శాతాన్ని పెంచాలన్న సదాశయంతో బాలికల అక్షరాస్యత తక్కువగా ఉన్న మండలాల పరిధిలో ప్రభుత్వం కేజీబీవీలను ఏర్పాటు చేసింది. ఈ కేజీబీవీలు మొదట్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేది. 10వ తరగతి తరువాత విద్యార్థు లు చదువుకు దూరమవుతున్నట్లు తెలియడంతో మళ్లీ ఇంటర్మీడియట్‌ను ప్రవేశపెట్టారు. 2024–25వ విద్యా సంవత్సరానికి సంబంధించి 17 కేజీబీవీల్లో 6వ తరగతిలో 680, ఇంటర్మీడియట్లో 680 సీట్లను భర్తీ చేయనున్నారు. అలాగే 7వ తరగతిలో ఖాళీగా ఉన్న 23 సీట్లు, 8వ తరగతిలో ఖాళీగా 13 సీట్లు, 9వ తరగతిలో 14 సీట్లు, 10వ తరగతిలో 29 సీట్లు, 12వ తరగతిలో 163 సీట్లు ఇలా మొత్తంగా అన్ని కలిపి 1602 సీట్లు భర్తీకానున్నాయి. అర్హులెవరంటే.. బడిబయటి పిల్లలు, బడి మానేసిన పిల్లలు, అంగవైకల్యం, అనాథలు, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బాలికలకు తొలి ప్రాధాన్యతగా సీట్లు కేటాయిస్తారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణిస్తారు. ఎంపికై న బాలికలకు ఫోన్‌కు మేసేజ్ ద్వారా సమాచారం అందుతుంది. లేదంటే సంబంధింత కేజీబీవీ నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చు. ఏవైనా సమస్యలు సందేహాలు ఉంటే 7075159996, 7075039990 నంబర్లలో సంప్రదించవచ్చు. జిల్లాలో ఇంటర్ ఉన్న కేజీబీవీల వివరాలు జిల్లాలో అట్లూరు, చాపాడు, దువ్వూరు, పెద్దముడియం, పోరుమామిళ్ల, ఎస్ఏ కాశినాయన, సింహాద్రిపురం కేజీబీవీలలో ఎంపీసీ గ్రూపు ఉండగా, బి.కోడూరు, బిమఠం, చక్రాయపేట, ఖాజీపేట, మైదుకూరు, పెండ్లిమర్రి, వల్లూరు, వేముల కేజీబీవీల్లో బైపీసీ, కలసపాడు కేజీబీవీలో హెచ్ఈసీ, జమల్మమడుగు కేజీబీవీలో ఎంపీహెచ్‌డబ్లూ గ్రూపులు ఉన్నాయి. అడ్మిషన్ల కోసం... విద్యార్థిని తల్లి, తండ్రిలకు సంబంధించిన ఆధార్ కార్డు, తల్లిదండ్రులు లేకుంటే సంరక్షకుల ఆధార్‌కార్డు, విద్యార్థినికి సంబంధించి 3 పాస్‌పోర్టు సైజు ఫొటోలు, రేషన్‌కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్, మొబైల్ నెంబర్‌ను ఇవ్వాల్సి ఉంది.ఇందుకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ఈనెల 22 నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 11వ తేదీ వరకు గడువు విధించారు. -
వేలిముద్రలు పడక అవస్థలు
ఈకేవైసీ చేయించుకునేందుకు డీలర్ల వద్దకు వెళుతున్న ప్రజల్లో చాలామందికి వేలిముద్రలు పడకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. అలాంటి వారికి వీఆర్వో లాగిన్‌లో ఫేస్ రికగ్నైజేషన్ వెసలుబాటు ఉందని అధికారులు అంటున్నప్పటికీ వీఆర్వోలు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలిముద్రలు పడకపోతే ఇలాంటి ఆప్షన్ ఉందని తెలియని చాలా మంది నిరక్షరాస్యులు ఇంటికి తిరుగుముఖం పడుతున్నారు. ఇలాంటి వారంతా వచ్చేనెల నుంచి కార్డు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొంత గడువు ఇచ్చి సాంకేతిక పరమైన సమస్యలు లేకుండా చూసి అందరూ ఈకేవైసీ చేయించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – కె.మునెయ్య, రామరాజుపల్లె, కడప -
వరదది దుర్మార్గపు రాజకీయం
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామల్లు శివప్రసాదరెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వైఎస్ఆర్సీపీ జిల్లా నేతలు శుక్రవారం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రొద్దుటూరులో 1985లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనే బలం లేకున్నా తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి.. తన ఇంటిలో పని చేసే మనుషులను ఓటర్లుగా పెట్టిన చరిత్ర ఉందని అన్నారు. అదే తరహాలోనే ప్రస్తుతం గోపవరం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నికలో జరిగిందన్నారు. నకిలీ ఐడీ కార్డులు సృష్టించి తన ఇంటి మనుషులను వార్డు సభ్యులుగా చేర్చి విజయం సాధించేందుకు చేసిన ప్రయత్నం సఫలం కాలేదన్నారు. విజయం సాధించినట్లు ఫలితం ప్రకటించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చినా వీలు కాలేదన్నారు. రెండో రోజు వైఎస్సార్ జిల్లా కలెక్టర్ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించడంతో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా కేవలం ఒక టీడీపీ సభ్యుడు ఎక్కువ ఉన్నా.. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయం చేయలేదన్నారు. ఫేక్ ఐడీల పన్నాగం విఫలం మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ గోపవరం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నికకు సంబంధించి నిన్న పోలీసులు, నేడు కలెక్టర్‌ను అడ్డు పెట్టుకుని ఎన్నికను వాయిదా వేశారన్నారు. ప్రతిపక్ష పార్టీకి అడుగు దూరంలో అధికారం దక్కాల్సి ఉండగా, టీడీపీ వ్యూహం ప్రకారం వాయిదా వేయించిందన్నారు. టీడీపీ వార్డు సభ్యులు వారిలో వారే గొడవ పడటం, మినిట్స్ బుక్ చించడం, కుర్చీలు విసరడం, ఎన్నికల అధికారికి గుండెపోటు రావడం అంతా డ్రామా అన్నారు. గురువారం తమ వార్డు సభ్యులపై రాళ్లతో దాడి, కార్లను ధ్వంసం చేశారన్నారు. తమ వార్డు సభ్యులను రక్షించడంలో పోలీసులు విఫలమయ్యారని తెలిపారు. కనీసం ఎన్నికల కార్యాలయానికి తమ సభ్యులను పోలీసులు తీసుకెళ్లలేకపోయారన్నారు. శుక్రవారం అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి వార్డు సభ్యులందరిని తీసుకెళ్లగా గుండెపోటు డ్రామాతో ఎన్నిక వాయిదా పడిందని తెలిపారు. తమ వార్డు సభ్యులను ఏ ఒక్కరినీ ఆ పార్టీలోకి తీసుకెళ్లలేక పోయారని, దీంతో ఫేక్ ఐడీలతో గెలవాలని చేసిన ప్రయత్నాన్ని తాము అడ్డుకున్నామన్నారు. డీఎస్పీ, ఆర్డీఓ అధికారులు అక్కడే ఉన్నా.. ఎమ్మెల్యే వరద చెప్పినట్టే ఎన్నికను వాయిదా వేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి పదవులు పొందిన వారు, రాజ్యసభ సభ్యులు పార్టీ మారారని, ఎంత ఒత్తిడి చేసినా తమ వార్డు సభ్యులు నిక్కచ్చిగా వ్యహరించారన్నారు. సమావేశంలో బద్వేలు, రాజంపేట ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి, జెడ్పీ వైస్ చైర్పర్సన్ జేష్టాది శారదతోపాటు గోపవరం పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు. అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని కుట్రలు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి -
అప్పులబాధ తాళలేక యువకుడు ఆత్మహత్య
బద్వేలు అర్బన్ : అప్పులబాధ తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం బద్వేలులో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని పెద్ద అగ్రహారం గ్రామానికి చెందిన పగడాల చంద్రకుమార్ (36) బద్వేలులో టీ దుకాణం నిర్వహిస్తుండేవాడు. ఇతనికి భార్య సుమతితో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. టీ దుకాణం ఏర్పాటు చేసుకునే సమయంలో చేసిన అప్పులతో పాటు దుకాణం సక్రమంగా జరగకపోవడంతో చేసిన అప్పులు తడిసి మోపెడయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 26న ఓ పని నిమిత్తం కడపకు వెళుతున్నానని భార్యకు చెప్పి ఇంటి నుండి వచ్చేశాడు. అదే రోజు నెల్లూరు రోడ్డులోని బైపాస్ రోడ్డు సమీపంలో గల ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకుని ఉన్నాడు. అయితే రెండు రోజులుగా లాడ్జిలోని గది తలుపు తీయకపోవడం, గదిలో నుండి దుర్వాసన వస్తుండటంతో లాడ్జి యజమాని పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు వెళ్ళి తలుపులు తెరిచి చూడగా మృతిచెంది ఉన్నాడు. మృతదేహం పక్కన పురుగుల మందు డబ్బా కనిపించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. మృతుని భార్య సుమతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ ఎస్ఐ ఎం.సత్యనారాయణ కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వ్యసనాలకు బానిసై.. ప్రొద్దుటూరు క్రైం : చెడు వ్యసనాలకు లోనైన ప్రేమ్‌సాయిరెడ్డి (23) అనే యువకుడు తెలిసిన వారి దగ్గర సుమారు రూ. 8 లక్షల వరకు అప్పులు చేశాడు. బాకీ ఎలా తీర్చాలో అర్థం కాక తీవ్ర మనస్థాపం చెందిన ఆ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామేశ్వరంలోని కాకనూరు నాగేశ్వరరెడ్డి కిరాణాషాపు పెట్టుకొని జీవనం సాగించేవాడు. ఆయనకు కుమారుడు ప్రేమ్సాయిరెడ్డితో పాటు కుమార్తె ఉన్నారు. కుమారుడు బిటెక్ చదువుతూ మధ్యలో మానేసి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఇటీవలే హైదరాబాద్‌లో ఉద్యోగం మానేసి కడపలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ప్రైవేట్‌గా పని చేసేవాడు. అతను చెడు వ్యసనాలకు లోనై తల్లిదండ్రులకు డబ్బులు పంపమని అడిగేవాడు. అంతేగాక తెలిసిన వారి వద్ద కూడా సుమారు రూ. 8 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పు ఎలా తీర్చాలా తరచూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవాడు. రెండు రోజుల క్రితం ప్రేమ్‌సాయిరెడ్డి ప్రొద్దుటూరుకు వచ్చాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో ఆలోచిస్తూ దిగులుగా ఉండేవాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రేకుల కప్పునకు ఉన్న ఇనుప పైపులకు చీరను కట్టుకొని ఉరేసుకున్నాడు. తర్వాత గుర్తించిన కుటుంబ సభ్యులు ప్రేమ్సాయిరెడ్డిని వెంటనే ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలిపాడు. తండ్రి నాగేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. కడుపునొప్పి తాళలేక డిగ్రీ విద్యార్థి.. కడప అర్బన్ : కడప నగరం రామరాజు పల్లెలోని ఎస్సీ కాలనీకి చెందిన డిగ్రీ బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు తాలూకా సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సీఐ వివరాల మేరకు రామరాజు పల్లెకు చెందిన రాజశేఖర్ (24) గత ఏడాది నుండి కడుపునొప్పితో బాధపడుతుండేవాడని తెలిపారు. కడుపు నొప్పి తగ్గకపోవడంతో తీవ్ర మనస్థాపానికి చెంది శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని రిమ్స్‌కు తరలించారు. మృతుడి బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. -
కార్మికుల పక్షపాతి వైఎస్సార్టీయూసీ
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (వైఎస్ఆర్ టీయూసీ) కార్మికుల పక్షపాతి అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్టీయూసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు జాషువా, నగర అధ్యక్షుడు ఏ1 నాగరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మేయర్ కె. సురేష్ బాబులతో కలిసి ఆయన జెండా ఎగురవేశారు. అనంతరం కార్మికుల మధ్య కేక్ కట్ చేసి, వారికి తినిపించి శుభాకాంక్షలు తె లిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి ఓ చరిత్ర ఉందని, పోరాటాల నుంచి ఆ పార్టీ పుట్టిందన్నారు. ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కో సం వైఎస్సార్టీయూసీ ఆవిర్భవించిందన్నారు. వైఎస్సార్టీయూసీ పోరాటాల ఫలితంగా గత ఐదేళ్లలో కా ర్మికులకు ఎన్నో రకాల మేలు జరిగిందన్నారు. ఏజెన్సీ లు కార్మికులను ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి క్ర మం తప్పకుండా ఒకటోతేది వేతనాలు జమ చేసిన ఘ నత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. అబద్ధాలు, మో సాలతో సాగుతున్న కూటమి ప్రభుత్వంపై పోరాటాని కి ట్రేడ్ యూనియన్ నాయకులు సిద్ధం కావాలన్నారు. ● కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి మాట్లాడుతూ కార్మికుల ఐక్యత, అభివృద్ధి, సంక్షేమం కోసం వైఎస్సార్టీయూసీ ఏర్పడిందన్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 40 శాతం ఓట్లు సాధించడంలో వైఎస్సార్టీయూసీ పాత్ర ఎంతో ఉందన్నారు. కార్మికులకు ఎక్కడ అన్యాయం జరిగినా యూనియన్ నాయకులు ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. ● ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ ఛైర్మెన్ బాలయ్య, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పులి సునీల్, మేసా ప్రసాద్, దాసరి శివప్రసాద్, సీహెచ్ వినోద్, వెంకటేశ్వర్లు, టీపీ వెంకట సుబ్బమ్మ, రత్నకుమారి, మరియలు, క్రిష్ణవేణి, సుశీలమ్మ, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి ఘనంగా వైఎస్సార్టీయూసీ ఆవిర్భావ దినోత్సవం -
● కార్డు లేకపోతే సంక్షేమ పథకాలు లేనట్లే
ప్రతి నెల వీధుల్లోకి వచ్చే ఎండీయూ వాహనం వద్ద బియ్యం, చక్కెర, ఇతర సరుకులు తీసుకోవాలంటే రేషన్‌కార్డు ఉండాలి. అలాగే పెన్షన్, పక్కాగృహం, వైద్య సేవలు, ఫీజు రీయింబర్స్మెంట్లతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్‌కార్డు తప్పనిసరి. దారిద్య్రరేఖకు దిగువ జీవిస్తున్న ప్రజలకు ఎన్నో విషయాల్లో రేషన్‌కార్డు అండగా ఉందన్న విషయం ఎవరూ కాదనలేని సత్యం. అలాంటి రేషన్‌కార్డు రద్దయితే ఆ కుటుంబ జీవనం అల్లకల్లోలంగా మారుతుంది. జిల్లాలో ఇప్పటికీ అనేక మంది రేషన్‌కార్డులేని కుటుంబాలు ఉన్నాయి. అర్హులైన వీరందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయాల్సిన అవసరం ఉంది. అలా జారీ చేయకపోగా ఈకేవైసీ పేరుతో, తక్కువ గడువు ఇవ్వడమంటే ఉన్న కార్డులను తొలగించడానికేన్న విమర్శలు సర్వత్రా వెలువడుతున్నాయి. ఎంతమందికి ఈకేవైసీ లేకపోతే అంతమందికి సంక్షేమ పథకాలు అందకుండా పోయే ప్రమాదం ఉంటుంది. కనుక ప్రభుత్వం ఇప్పటికై నా ఈకేవైసీ గడువు పొడిగించాలని ప్రజలు, రాజకీయ పక్షాలు కోరుతున్నాయి. -
దాల్మియా దరఖాస్తును తిరస్కరించాలి
జమ్మలమడుగు : ‘దాల్మియా ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా రైతుల సమస్యలు, బాధలు కలెక్టర్ స్వయంగా విన్నారు. అయితే విస్తరణ పనుల వల్ల గ్రామాలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయని ప్రశ్నిస్తే దాల్మియా యాజమాన్యం మాత్రం ఎటువంటి సమస్యలు లేవంటూ దరఖాస్తులో తప్పుడు నివేదిక ఇచ్చిందని.. ఈ కారణం చూపుతూ కలెక్టర్ శ్రీధర్ చెరకూరి దాల్మియా పరిశ్రమ విస్తరణ కోసం పెట్టుకున్న దరఖాస్తును వెంటనే తిరస్కరించాలి’ అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడారు. ప్రజాభిప్రాయ సేకరణ బాధిత గ్రామాల్లో కాకుండా దాల్మియా ఫ్యాక్టరీలో నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. అధికారులు దాల్మియా యాజమాన్యంతో లాలూచి పడి ప్రజాభిప్రాయ సేకరణ చేయడం ప్రజలను మోసం చేయడమే అవుతుందన్నారు. నిజంగా దాల్మియా విస్తరణ పనులు చేపట్టాలంటే మొదటి దశలో నిర్మించిన దాల్మియా ఫ్యాక్టరీ వల్ల ఇబ్బందులు పడుతున్న దుగ్గనపల్లి, నవాబుపేట, చిన్నకొమెర్ల, తలమంచిపట్నం గ్రామాల సమస్యలను పూర్తిగా పరిష్కారం చూపించాలన్నారు. దాదాపు 400 ఎకరాల భూమి ప్రతి ఏడాది వరదల వల్ల నాశనం అవుతుందని.. అసలు వ్యవసాయానికి పనికిరాకుండా పోయిందని రైతులు కలెక్టర్ ముందు ఫోటోలతో సహా వివరించారు. అయితే కలెక్టర్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదన్నారు. రైతులకు సంబంధించిన భూములకు పరిహారం ఇస్తామన్న మాట ఎక్కడా పలుకలేదన్నారు. బుధవారం రాత్రే అధికారులు, దాల్మియా యాజమాన్యం గ్రామాల్లోకి వెళ్లి ప్రజాభిప్రాయ సేకరణపై తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. ఉదయం 9 గంటలకు సమావేశాన్ని నిర్వహిస్తామని పర్యావరణ శాఖ చెబితే అధికారులు, దాల్మియా యాజమాన్యం మాత్రం కలెక్టర్ వచ్చే సరికి 12 గంటలు అవుతుంది.. ఆ సమయానికి రావాలంటూ చెప్పడం చూస్తుంటే అధికారు లు ఎవరికి కొమ్ముకాస్తున్నారో తెలుస్తోందన్నా రు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని లోకయుక్తకు వెళితే దుగ్గనపల్లి గ్రామాన్ని మార్చటానికి దాల్మియా విధిలేని పరిస్థితుల్లో ఒప్పుకుందన్నారు. అయితే వారి కి పరిహారం ఇచ్చి వారికి ఇష్టమైన ప్రాంతంలో గ్రామా న్ని నిర్మించేవరకు స్థానిక ప్రజలకు నమ్మకం లేకుండా పోతోందన్నారు. బాధిత గ్రామాలకు కలెక్టర్ న్యాయం చేయాలనుకుంటే విస్తరణ కోసం దాల్మియా పెట్టుకున్న దరఖాస్తును వెంటనే రిజక్టు చేసి ప్రజల సమస్యలు పరిష్కారం చేసి రెండో ఫ్లాంట్ విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న కొమెర్ల సర్పంచ్ జగదీశ్వరరెడ్డి, వినయ్‌రెడ్డి, భాస్కర్ రెడ్డి , మాజీ సర్పంచ్ శివశంకర్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి -
మందక్రిష్ణ మాదిగ చంద్రబాబు తొత్తు
కడప కార్పొరేషన్ : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగ సీఎం చంద్రబాబుకు తొత్తు అని వైఎస్సార్సీపీ నేత, సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ ఛైర్మన్ పులి సునీల్ కుమార్ విమర్శించారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల మందక్రిష్ణ మాదిగ వర్గీకరణ అంశంపై మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని వేలెత్తి చూపేలా మాట్లాడటం సరికాదన్నారు. వర్గీకరణ అంశం ముందుకు పోవడానికి వైఎస్సార్ సహకరించారని, ఆయన అకాల మరణం తర్వాత అది మరుగున పడిందని మాట్లాడిన నోటితోనే రాజకీయ నాయకులను మించి విమర్శలు చేయడం దారుణమన్నారు. వర్గీకరణ చేయమని అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని అడక్కుండా, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్‌ను కోరడం సరికాదన్నారు. సుప్రీం కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వైఎస్సార్సీపీ స్పష్టంగా చెప్పినప్పటికీ మళ్లీ వైఖరి చెప్పాలనడం విచిత్రంగా ఉందన్నారు. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని గతంలో చంద్రబాబు అన్నప్పుడు, ఎస్సీలు స్నానం చేయరు, శుభ్రంగా ఉండరు అని ఆయన మంత్రులు మాట్లాడినప్పుడు మందక్రిష్ణ మాదిగ కనీసం ఖండించలేదన్నారు. ఆయన వర్గీకరణపై తప్పా దళితుల సమస్యలు, వారి ఇబ్బందుల గూర్చి ఏనాడు పోరాడలేదన్నారు. ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెప్పు కోసం వైఎస్ జగన్‌ను ఇరుకునపెట్టేలా మాట్లాడారన్నారు. వైఎస్ జగన్ మాదిగల పక్షపాతిగా ఎస్సీల్లో మూడు వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, మాదిగలకు మంత్రి పదవులు, కార్పొరేషన్ ఛైర్మన్ల పదవులు ఇచ్చారన్నారు. ఇప్పుడు మాదిగలకు చంద్రబాబు ఎన్ని పదవులు ఇచ్చారో బేరీజు వేయాలన్నారు. గతంలో అన్ని ప్రభుత్వాలు మాదిగలను ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నాయని, ఒక్క వైఎస్ జగన్ మాత్రమే వారికి మేలు చేశారని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి త్యాగరాజు, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు, రవి తదితరులు పాల్గొన్నారు. సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ పులి సునీల్ కుమార్ -
నిత్యపూజస్వామి హుండీ ఆదాయం లెక్కింపు
సిద్దవటం: మండలంలోని వంతాటిపల్లె గ్రామ పంచాయతీ లంకమల అడవీ ప్రాంతంలో వెలసిన శ్రీనిత్యపూజ స్వామి హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. రూ. 72,470 వచ్చిందని ఆలయ ఈఓ శ్రీధర్ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి మార్చి 28వరకు భక్తులు స్వామి వారి హుండీలో వేసిన కానుకలను శుక్రవారం దేవదాయశాఖ రాజంపేట ఇన్స్పెక్టర్ జనార్థన్, సిద్దవటం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వారు, పోలీసులు, భక్తుల సమక్షంలో లెక్కించినట్లు ఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఏపీజీబీ ఫీల్డ్ ఆఫీసర్ వెంకట సురేంద్రబాబు, మెసింజర్ సతీష్, పోలీసు రమణయ్య, ఆలయ ఉద్యోగి చంద్ర, అర్చకులు సుబ్రమణ్యం శర్మ, వంతాటిపల్లెవాసి వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పోరాటం
● జిల్లా ఫ్యాప్టో నూతన కార్యవర్గం ఎన్నిక ● జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్‌గా ఇలియాస్ బాష కడప ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తామని జిల్లా నూతన ఫ్యాప్టో చైర్మెన్ ఇలియాస్బాష పేర్కొన్నారు. కడపలోని వీణా విజయరామరాజు ఎస్టీయూ భవన్లో మాదన్ విజయ్‌కుమార్ అధ్యక్షతన ‘ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో)’ వైఎస్ఆర్ కడప జిల్లా నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా జిల్లా ఫ్యాప్టో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య (ఫ్యాప్టో) జిల్లా చైర్మన్‌గా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్.ఎం.డి ఇలియాస్ బాషా(ఎస్టీయూ), సెక్రటరీ జనరల్‌గా ఆర్.అబ్దుల్లా (ఏ.పీ.టీ.ఎఫ్. 1938),ఆర్థిక కార్యదర్శిగా వి.వి శ్రీనివాసులు రెడ్డి (ఏ.పీ.టీ.ఎఫ్. 257), కో చైర్మన్లుగా జి.వి సుబ్బారెడ్డి (హెచ్.ఎమ్.ఏ), జె.రామచంద్రబాబు (బి.టి.ఎ),ఎం.జుబైర్ అహ్మద్ (రూటా) లు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా ఎం.విజయకుమార్ (యూటీఎప్), వి.శ్యామలా దేవి (ఆప్టా)లను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు పరిశీలకులుగా ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లు రఘునాథరెడ్డి వ్యవహరించారు. మల్లు రఘునాథ రెడ్డి మాట్లాడుతూ ఈ నూతన కార్యవర్గం రెండేళ్ల పాటు కొనసాగుతుందని తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన కడప అర్బన్ : సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసు అధికారులు శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ ఆదేశాలతో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మధుమల్లేశ్వర రెడ్డి, చిన్న చౌకు సీఐ ఓబులేసు, ఎస్.ఐ రాజరాజేశ్వర రెడ్డి, సైబర్ క్రైమ్, ఏ.ఆర్ సిబ్బంది నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా విస్తృతంగా అవగాహన కల్పించారు. కడపలోని చిన్న చౌకు పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ర్యాలీ అప్సర సర్కిల్, వై జంక్షన్, డా.అంబెడ్కర్ సర్కిల్ మీదుగా వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. సైబర్ నేరం జరిగిన తక్షణమే 1930 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. -
ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు జిల్లా ప్రజా రవాణాఽధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఆర్ఎం కార్యాలయంలో గోపాల్‌రెడ్డి డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ● గాలివీడుకు చెందిన వెంకట రమణ కదిరి నుంచి తిరుపతికి వయా ఎన్పీ కుంట, గాలివీడు, రాయచోటి మీదుగా బస్సును నడపాలని కోరారు. ● మాధవరానికి చెందిన మునెయ్య కొత్త మాధవరం, మాధవరం–1లో ఎక్స్‌ప్రెస్ బస్సులకు రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలన్నారు. ● అగుడూరుకు చెందిన రమణ, రాజాలు ప్రొద్దుటూరు–సంతకొవ్వూరు మధ్య తిరుగుతున్న సర్వీసును అగడూరు వరకు పొడిగించాలన్నారు. ● బుక్కాయపల్లె రామమునిరెడ్డి దువ్వూరు మండలం బుక్కాయపల్లె గ్రామానికి ప్రొద్దుటూరు లేదా మైదుకూరు డిపో నుంచి బస్సు నడపాలన్నారు. ● జమ్మలమడుగుకు చెందిన సాయిచంద్రారెడ్డి ప్రొద్దుటూరు–జమ్మలమడుగు నాన్‌స్టాప్ బస్సులకు బుకింగ్ కండక్టర్లు త్వరితగతిన టిక్కెట్లు జారీ చేసేలా చూడాలని కోరారు. ఆయా సమస్యలను ఆర్ఎం సంబంధిత డిపో మేనేజర్లకు బదిలీ చేసి వాటి పరిష్కరించాలని చొరవ చూపాలని సూచించారు. -
‘షాన్‌దార్’ రంజాన్ కోసం ‘దిల్దార్’ ఏర్పాట్లు
● వరాల పర్వదినానికి ఎదురుచూపులు ● మార్కెట్లకు రంజాన్ కళ ● కొనుగోలుదారులతో దుకాణాలలో రద్దీ ● ఉట్టిపడుతున్న ఆధ్యాత్మిక వాతావరణం కడప కల్చరల్ : పవిత్ర రంజాన్ మాసం దగ్గరకు వచ్చేసింది. పండుగ నిర్వహణ కోసం వస్తువులు కొనుగోలు చేస్తున్న ముస్లింలతో ప్రధాన మార్కెట్లు సందడిగా మారాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి దాదాపు దుకాణాలన్నీ మహిళలతో నిండిపోతున్నాయి. మార్కెట్ ప్రధాన వీధులు కూడా జనసందోహంతో కనిపిస్తున్నాయి. పవిత్ర మాసం.. మనిషిని ఉన్నతుడిగా తీర్చిదిద్దే మాసం....ఆత్మార్పణతో అల్లాహ్‌కు దగ్గరయ్యే అవకాశం గల మాసం. దివ్య గ్రంథం ఖురాన్ భువికి దిగిన మాసం. ప్రతి ముస్లిం జీవితంలో పట్టలేని ఆనందం కలిగించే మాసం. నెల రోజులపాటు ఆధ్యాత్మిక చింతనతో గడిపే అవకాశం కల్పించిన మాసం రంజాన్. సంవత్సర కాలంపాటు ముస్లింలు ఈ పండుగ కోసం ఎదురుచూస్తారు. అలాంటి ఆనందకరమైన రోజు వరాల వసంతాలను కురిపించే రోజు పవిత్ర రంజాన్ పండుగ కేవలం ఒక్క రోజు తర్వాత రానుంది. దీని కోసం భక్తుల నెల రోజుల నిరీక్షణ ముగియనుంది. ముస్లిం లోకం నెల రోజులపాటు భక్తిశ్రద్ధలతో కఠినంగా ఉపవాస దీక్షలు నిర్వహిస్తున్నారు. మరొక్క రోజు తర్వాత దీక్షలు పూర్తయి ఎదురుచూస్తున్న రంజాన్ పండుగ రానుంది. ఈ పండుగను అత్యంత ఘనంగా నిర్వహించుకోవాలన్న భావనతో ఉన్నంతలో మరువలేని విధంగా గడపాలన్న ఆశతో తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మార్కెట్లలో రద్దీ రంజాన్ పండుగ నిర్వహణ కోసం కొనుగోలు చేసేందుకు వచ్చే వారితో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన కడప నగరంలోని వైవీ స్ట్రీట్‌లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచే కొనుగోలుదారుల రద్దీ కనిపిస్తోంది. ఇటీవల ఎండ తీవ్రత పెరుగుతుండడంతో మధ్యాహ్నం 12.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కొనుగోళ్లు కాస్త పలుచబడుతున్నాయి. సాయంత్రం నుంచి దుకాణదారులు రాత్రి 11 గంటల వరకు కూడా షాపులు తెరిచి పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వైవీస్ట్రీట్ ప్రధాన రోడ్డు పూర్తిగా ముస్లిం మహిళలే కనిపిస్తున్నారు. ముస్లింలు కుటుంబ సభ్యులతోసహా షాపింగ్ చేసేందుకు తరలి వస్తుండడంతో ఆ రోడ్డులో నడిచేందుకు సమయం పడుతోంది. ముఖ్యంగా ఒకవైపు పండుగ నిర్వహణ కోసం ప్రత్యేక సామాగ్రి, మరోవైపు ఇంటిల్లిపాదికి దుస్తులు, పాదరక్షలు కొనుగోలు హడావుడి కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా రెడీమేడ్ దుకాణాలలో జనం కిటకిటలాడుతున్నారు. ముఖ్యంగా సెంటు, అత్తరు దుకాణాలు, మెహందీ విక్రయించే దుకాణాలు, సేమియా దుకాణాల వద్ద సందడిగా ఉంది. పండగ కళ జిల్లాలోని ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలన్నీ క్రమంగా పండుగ కళను సంతరించుకుంటున్నాయి. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని రాయచోటి, రాజంపేటతోపాటు మన జిల్లాలోని కమలాపురం, ప్రొద్దుటూరు, బద్వేలు, జమ్మలమడుగు తదితర ప్రాంతాలలో మసీదులు, ఈద్గాలకు కొత్త కళ కల్పిస్తున్నారు. ముస్లింలలో భక్తిశ్రద్ధలతోపాటు కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ప్రధాన మార్కెట్లతోపాటు ఇతర మెయిన్రోడ్డులోగల దుస్తుల దుకాణాలు కళకళలాడుతున్నాయి. మరోవైపు నిత్యావసర సరుకులు విక్రయించే దుకాణాలలో రద్దీ అలాగే ఉంది. పండ్ల దుకాణాలు, తోపుడు బండ్లపై పండ్లు విక్రయించే ప్రాంతాలలో కూడా రద్దీ కనిపిస్తోంది. హలీం, తదితర ప్రత్యేక ఇస్లామిక్ వంటకాలు విక్రయించే దుకాణాలు రంగురంగుల విద్యుద్దీపాలతో కళకళలాడుతున్నాయి. పలుచోట్ల మసీదులను సైతం విద్యుద్దీపాలతో కనుల పండువగా అలంకరించి ఆరోజున రంగురంగుల కాంతులు వెదజల్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన
కడప ఎడ్యుకేషన్ : పదవ తరగతి గణిత పశ్నాపత్రం లీకేజీ సూత్రధారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డి.ఎం.ఓబులేసు యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా డీఓం ఓబులేసు మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం స్వలాభం కోసం ప్రశ్నాపత్రం లీకేజ్ చేశారని ఆరోపించారు. తక్షణం అధికారులు స్పందించి ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్రంగా విచారణ జరిపి బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నవీన్, జిల్లా కార్యదర్శి రెడ్డి సాయి, నాయకులు సన్నీ, హరి, శశి, భార్గవ్, హరికృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యం
– జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ కడప అర్బన్ : పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు ‘గ్రీవియన్స్ డే’ నిర్వహించా రు. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లు , ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది బదిలీలు, వ్యక్తిగత , స్పౌజ్, చిల్డ్రన్న్, మెడికల్ సమస్యల గురించి ఎస్పీకి స్వయంగా విన్నవించుకున్నారు. ఎస్పీ సిబ్బంది సమస్యలను విని, వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపుతామని భరోసా కల్పించారు. పంచాయతీ కార్యదర్శిపై దాడి అమానుషం ప్రొద్దుటూరు రూరల్ : వీరపునాయునిపల్లె పంచాయతీ కార్యదర్శి నాగభూషణ్‌రెడ్డి ఇంటిపై కొందరు దుండగులు దాడి చేయడం అమానుషమని మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం ఉపాధ్యక్షుడు మస్తాన్ పేర్కొన్నారు. ఈ మేరకు వారు శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు జరగకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఉన్నతాధికారులు భరోసా ఇవ్వాలన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ బాలన్నకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం మహిళా ఉపాధ్యక్షురాలు శిరీష, జనరల్ సెక్రటరీ సుహాసిని, అడిషనల్ సెక్రటరీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కడప వైఎస్ఆర్ సర్కిల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వేణుగోపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని హోచిమన్ భవన్లో ఏపీ ఆశా వర్కర్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాలకు ఇచ్చిన హామీలకు జీవోలు విడుదల చేయాలన్నారు. వేతనాలు పెంచాలని, సాధారణ సెలవులు, ఉద్యోగ భద్రత, మెడికల్ ఉద్యోగులుగా గుర్తించి పెర్మనెంట్ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు, స్మార్ట్ ఫోన్లు, రూ. 10 లక్షల రూపాయల ఉచిత ప్రమాద ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై ఏప్రిల్ 1వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఉద్యమ కార్యచరణ ప్రకటించామన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నగర అధ్యక్షులు సుబ్బరాయుడు, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి బి శాంతమ్మ పాల్గొన్నారు. వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి కడప అర్బన్ : ఉక్కాయిపల్లి సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందినట్లు కడప ట్రాఫిక్ సీఐ జావిద్ తెలిపారు. సీఐ వివరాల మేరకు మృతి చెందిన వృద్ధురాలుకు 65 సంవత్సరాలు వయసు ఉంటుందని, గురువారం రాత్రి నడుచుకుంటూ వెళుతున్న ఆమెను వాహ నం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించినట్లు తెలిపారు. మృతురాలి సంబంధీకులు వివరాలకు 91211 00539 లేదా కడప ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వచ్చి వివరాలు తెలుసుకోవాలని కోరారు. -
1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ అళ్వార్ తిరుమంజనం ఘనంగా జరగనుంది. ఏప్రిల్ 5 నుంచి 15 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో.. ముందుగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చన చేసి, ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో గర్భాలయం, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ గరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 11.30 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతిస్తారు. -
నటించి.. వాయిదా వేయించి..
ప్రొద్దుటూరు: మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం పోలీసు బందోబస్తు ఏర్పాటులో విమర్శలు వెల్లువెత్తడంతో రెండో రోజు పటిష్టంగా నిర్వహించేలా చేశారు. ఉదయం 9 గంటల నుంచే డీఎస్పీ భావన ఆధ్వర్యంలో 144 సెక్షన్, పోలీసు 30 యాక్టు అమలు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి కొర్రపాడు రోడ్డులో ట్రాఫిక్‌ను మళ్లించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం చుట్టూ అల్లరిమూకలు లేకుండా తరిమేశారు. ముందుగా టీడీపీ వార్డు సభ్యులు ఏడుగురు ఎన్నికలు నిర్వహించే గోపవరం గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి కోరిక మేరకు.. రెండు వాహనాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి దొరసానిపల్లె నుంచి సర్పంచ్ గద్దా మోషాతోపాటు 13 మంది వైఎస్సార్సీపీ వార్డు సభ్యులను గ్రామ పంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పోలీసు బందోబస్తు ఉన్నా.. టీడీపీ నాయకులు బచ్చల వీరప్రతాప్, ఈవీ సుధాకర్‌రెడ్డి తదితరులు గ్రామ పంచాయతీ కార్యాలయంలోనికి వెళతామని దగ్గరికి వచ్చారు. లోపలికి వెళ్లేందుకు కుదరదని డీఎస్పీ వెనక్కి పంపారు. మీడియాను అనుమతించకుండా.. ఇంతలోనే ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి తనకు గుండెపోటు వచ్చిందని గుండె పట్టుకున్నారు. గోపవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ ఆయనను తీసుకొచ్చి తన చాంబర్లో కూర్చోబెట్టారు. ఆ సమయంలో ఎన్నికల అధికారి ప్రశాంతంగా కూర్చున్నట్లు లోపల ఉన్న అధికారులే చెబుతున్నారు. అంతలోనే అంబులెన్స్‌ను పిలిపించడం.. ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డిని లోపలి నుంచి నడిపించుకుంటూ బయటికి తెచ్చి అంబులెన్స్ ఎక్కించారు. స్థానికంగా అయితే ఎక్కడ అసలు విషయం బటయపడుతుందని భావించి.. ఎన్నికల అధికారిని కడపలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించినట్లు చెబుతున్నారు. కొంత సేపటి తర్వాత పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ.. ఎన్నికల అధికారికి గుండెపోటు రావడంతో ఎన్నిక వాయిదా పడిందని, కలెక్టర్ ఆదేశాల తర్వాత మళ్లీ ఎన్నిక ఉంటుందని మీడియాకు తెలిపారు. కార్యాలయంలోనికి మాత్రం మీడియాను అనుమతించలేదు. కార్యాలయ ప్రాంగణంలో డీఎస్పీ భావన, ఆర్డీఓ సాయిశ్రీ, తహసీల్దార్ గంగయ్య మాట్లాడుకుంటూ ఉండగానే ఈ వ్యవహారమంతా జరిగింది. తర్వాత పోలీసు బందోబస్తుతో టీడీపీ వార్డు సభ్యులు, అనంతరం వైఎస్సార్సీపీ వార్డు సభ్యులను తమ ప్రాంతాలకు పంపించారు. గుండెపోటు రాజకీయం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆదేశాల మేరకు గుండెపోటు రాజకీయం జరిగిందని స్థానిక ప్రజలు చెప్పుకొంటున్నారు. గతంలో మున్సిపల్ మాజీ ఇన్చార్జి చైర్మన్ వీఎస్ ముక్తియార్ వైఎస్సార్సీపీలో ఉండగా.. ఆయనను మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చేసేందుకు అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న రాచమల్లు శివప్రసాదరెడ్డి మద్దతు ఇచ్చారు. ఆ సమయంలో కూడా వరదరాజులరెడ్డి వ్యూహం ప్రకారం.. ఇలాగే వ్యవహరించి ఎన్నికను వాయిదా వేయించారు. ప్రస్తుతం అదే తరహాలో ఉప సర్పంచ్ ఎన్నికను వాయిదా వేయించారని ప్రజలు చర్చించుకుంటున్నారు. వ్యూహం ప్రకారం గొడవ ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎన్నిక జరగాల్సి ఉండగా ఒక వ్యూహం ప్రకారం ఎన్నికల కార్యాలయంలో టీడీపీకి చెందిన 7వ వార్డు సభ్యురాలు కాచన రామలక్షుమ్మ, ఉపసర్పంచ్ అభ్యర్థి మండ్ల రమాదేవి వాగ్వాదానికి దిగారు. ఒకరినొకరు దూషించుకున్నారు. వీరు గొడవ పడుతుండగానే 8వ వార్డు సభ్యురాలు గాయత్రి ఎన్నికల అధికారి వద్ద ఉన్న మినిట్స్ బుక్‌ను చేతిలోకి తీసుకుని చించి వేశారు. ఈ సందర్భంగానే 5వ వార్డు సభ్యుడు ఆదినారాయణరెడ్డి కుర్చీలు విసిరేశాడు. టీడీపీ సభ్యులైన వీరంతా పరిస్థితి ఉద్రిక్తతంగా ఉందనుకునేలా నటించారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు హౌస్ అరెస్టు గోపవరం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక సందర్భంగా పోలీసులు వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు పాతకోట బంగారు మునిరెడ్డి, ఆయిల్ మిల్ ఖాజా తదితరులకు పోలీసులు ముందస్తు నోటీసులను ఇచ్చి.. ఇంటి నుంచి బయటికి రాకుండా కాపలా ఉంచారు. గురువారం ఎన్నికల కార్యాలయంలోకి దౌర్జన్యంగా వెళ్లిన టీడీపీ నాయకులు బచ్చల వీరప్రతాప్, ఈవీ సుధాకర్‌రెడ్డి తదితరులు శుక్రవారం కూడా యథావిధిగా అక్కడికి రావడం గమనార్హం. గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక మళ్లీ వాయిదా వారిలో వారే గొడవకు దిగిన టీడీపీ వార్డు సభ్యులు మినిట్స్ బుక్ చించివేత వంత పాడిన అధికారులు -
పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ
జమ్మలమడుగు : మైలవరం మండలం తలమంచిపట్నం పోలీస్ స్టేషన్లో ఎస్పీ జి.అశోక్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. గురువారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆయన రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, సబ్ డివిజన్లో చోరీలు, ఇతర నేరాలు జరగకుండా గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. ఉమెన్ హెల్ప్ డెస్క్‌పై అవగాహన కల్పించి మహిళలు, చిన్నారులపై ఆఘాయిత్యాలు జరగకుండా నిరోధించాలని సూచించారు. పోలీసులు గ్రామాలకు వెళ్లి ముఖాముఖిగా మాట్లాడి సమస్యలు తెలుసు కోవాల న్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐలు గోపాల్‌రెడ్డి, లింగప్ప ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్.సుశీలమ్మ కుటుంబీకుల దాతృత్వం
పులివెందుల టౌన్ : పట్టణంలోని చవ్వా సుభాకర్‌రెడ్డి కాలనీలోని వైఎస్.సుశీలమ్మ నేత్రాలను దానం చేసి ఆమె కుటుంబీకులు దాతృత్వం చాటుకున్నారు. బుధవారం సుశీలమ్మ మృతి చెందడంతో ఆమె నేత్రాలు దానం చేసేందుకు భర్త వైఎస్.ఆనంద్ రెడ్డి, కుమారుడు వైఎస్.రాజేష్‌రెడ్డి, కుమార్తెలు వైఎస్.సునీత, సాధన అంగీకరిస్తూ జిల్లా అంధత్వ నివారణ సంస్థ సభ్యుడు రాజుకు సమాచారం ఇచ్చారు. టెక్నీషియన్ హరీష్‌తో కలిసి రాజు మృతురాలి ఇంటికి వెళ్లి వైఎస్.సుశీలమ్మ కార్నియాలు సేకరించి హైదరాబాద్‌లోని డాక్టర్ అగర్వాల్ నేత్ర నిధికి పంపారు. రాజు మాట్లాడుతూ మనిషి మరణానంతరం మట్టిలో కలిసి పోయే నేత్రాలు దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. కుటుంబంలోని వ్యక్తి లేదా సన్నిహితులు, బంధువులు మరణించిన సమయంలో దుఃఖంలో ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు సమయ స్ఫూర్తితో నేత్రదానానికి అంగీకరించి 9866727534, 7093204537 అనే ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. వైఎస్.సుశీలమ్మకు ఎంపీ నివాళి పులివెందుల రూరల్ : పట్టణంలోని చవ్వాసుభాకర్రెడ్డి కాలనీలో నివాసముంటున్న వైఎస్.ఆనంద్‌రెడ్డి సతీమణి వైఎస్.సుశీలమ్మ బుధవారం మృతి చెందారు. కడప ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డి మృతురాలి ఇంటికి వెళ్లి సుశీలమ్మ భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సుశీలమ్మ భర్త వైఎస్.ఆనంద్‌రెడ్డి, కుమారుడు వైఎస్.రాజేష్‌రెడ్డి, కుమార్తెలు సునీత, సాధనలను ఎంపీ పరామర్శించారు. అనంతరం పట్టణంలోని డిగ్రీ కళాశాల రోడ్డులోని వైఎస్ సమాధుల తోటలో జరిగిన వైఎస్.సుశీలమ్మ అంత్యక్రియలు జరిగాయి. వైఎస్.ప్రకాష్‌రెడ్డి, వైఎస్.ప్రతాప్‌రెడ్డి, వైఎస్.జోసెఫ్‌రెడ్డి, వైఎస్.మనోహర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ వైఎస్.ప్రమీలమ్మ, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ చిన్నప్ప, వైఎస్ కుటుంబసభ్యులు జగదీశ్వరరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, బంధువులు పాల్గొన్నారు.నేత్ర దానంతో ఇద్దరు అంధులకు చూపు -
టీడీపీ గూండాల దాష్టీకం
పులివెందుల : పులివెందులలో టీడీపీ గూండాల అరాచకాలు హెచ్చుమీరుతున్నాయి. అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని యథేచ్ఛగా అక్రమాలు చేస్తున్న టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారు. గురువారం ఉదయం భాకరాపురంలోని తన ఇంటిలో టిఫిన్ చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ మైనింగ్ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డిని బయటకు లాక్కొచ్చి దాడి చేశారు. దాదాపు 30మంది యువకులు బైకులపై ప్రతాప్‌రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి దాడి చేసినట్లు తెలుస్తోంది. బీటెక్ రవిపై పోస్టులు పెట్టే మగాడివా అంటూ దూషించారని, తనకు అసలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే తెలియదని చెబుతున్నా దాడి చేశారని ప్రతాప్‌రెడ్డి తెలిపారు. దాడి దృశ్యాలు ప్రతాప్‌రెడ్డి ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. వైఎస్సార్సీపీ కార్యకర్త కోసం వెళ్లినందుకే.. బుధవారం టీడీపీకి చెందిన ఓ నాయకుడు వైఎస్సార్సీపీ నాయకుడు ప్రతాప్‌రెడ్డిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీన్ని వైఎస్సార్సీపీ కార్యకర్త చిన్న అనే యువకుడు సోషల్ మీడియాలోనే టీడీపీ నాయకుడు పెట్టిన పోస్టును ట్యాగ్ చేస్తూ కౌంటర్ పోస్టు పెట్టాడు. దీంతో అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు చిన్నాను పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకుని అర్బన్ పోలీస్ ష్టేషన్లో ఉంచి అతనిపై నాటు సారా కేసు కట్టేందుకు ప్రయత్నించసాగారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు ప్రతాప్‌రెడ్డి పోలీస్‌స్టేషన్ వద్దకు వెళ్లి అక్కడ ఎస్ఐ, డీఎస్పీలతో చర్చించారు. చిన్నాపై అక్రమ కేసు బనాయించడం అన్యాయమని ప్రతాప్‌రెడ్డి డీఎస్పీ దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న టీడీపీ నాయకులు గురువారం తనపై దాడి చేశారని ప్రతాప్‌రెడ్డి ఆరోపిస్తున్నాడు. ఎలాగైతేనేమి వైఎస్సార్సీపీ కార్యకర్త చిన్నాపై గురువారం నాటు సారా కేసు పోలీసులు నమోదు చేశారు. ప్రతాప్‌రెడ్డిపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు ఆయన ఇంటి వద్దకు వెళ్లి సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించి ప్రతాప్‌రెడ్డి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఎస్పీకి ఫోన్ చేసిన ఎంపీ ప్రతాప్‌రెడ్డిపై టీడీపీ గూండాలు దాడి చేసిన విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌కు ఫోన్ చేశారు. జిల్లాలో సర్పంచ్, ఎంపీపీల ఎన్నికల సందర్భంగా గోపవరంతోపాటు ఇతర ప్రాంతాలలో టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను ఆయన దృష్టికి తెచ్చారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ప్రతాప్‌రెడ్డిపై దాడి చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని కోరారు. వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడి ఇంటి వద్దకు వెళ్లి లాక్కొచ్చి దౌర్జన్యం -
చాలెంజర్స్ ట్రోఫీలో చరణి భేష్
కడప ఎడ్యుకేషన్ : వైఎస్సార్ కడప జిల్లా క్రీడాకారిణి ఎన్.శ్రీచరణి బీసీసీఐ సీనియర్ ఉమెన్స్ చాలెంజర్స్ ట్రోఫీలో భళా అనిపించారు. డెహ్రాడూన్‌లో నిర్వహిస్తున్న బీసీసీఐ సీనియర్ ఉమెన్స్ చాలెంజర్స్ ట్రోఫీలో యర్రగుంట్ల మండటం యర్రంపల్లె గ్రామానికి చెందిన నల్లపురెడ్డి శ్రీచరణి ఆరు వికెట్లతో ప్రత్యర్థి జట్టును ఇరుకున పెట్టింది. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిర్వహిస్తున్న మల్టీ డేస్ మ్యాచ్‌లో టీం–ఎ, టీం–బి జట్లు తలపడగా, టీం–బీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీచరణి 32 ఓవర్లలో 8 మెయిడిన్ ఓవర్లు వేయడంతోపాటు 6 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేసింది. శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.55 లక్షలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు ఎం.భరత్‌రెడ్డి, కార్యదర్శి ఎ. రెడ్డిప్రసాద్, ఉమెన్ క్రికెట్ సమన్వయకర్త కల్యాణదుర్గం విష్ణుమోహనరావు, తదితరులు శ్రీచరణికి అభినందనలు తెలిపారు. -
ఎంపీటీసీ నుంచి జెడ్పీ చైర్మన్ దాకా..
బ్రహ్మంగారిమఠం : మైదుకూరు నియోజకవర్గంలో వెనుకబడిన బ్రహ్మంగారిమఠం మండలం నుంచి రాజకీయాల్లో రాణిస్తున్నారు రామగోవిందరెడ్డి. ఎంపీటీసీగా ఎన్నికై రాజకీయాల్లో పట్టు సాధించిన ఆయన నేడు జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మండలంలోని పలుగురాళ్లపల్లె పంచాయతీ జౌకుపల్లె గ్రామానికి చెందిన ముత్యాల పిచ్చిరెడ్డి మునుసూబుకు 1962 ఫిబ్రవరి, ఒకటో తేదీన ముత్యాల రామగోవిందరెడ్డి జన్మించారు. ఆయన విద్యాభ్యాసం ఒక టి నుంచి ఐదో తరగతి వరకు జౌకుపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఆరు నుంచి పదో తరగతి వరకు పలుగురాళ్లపల్లె జెడ్పీ హైస్కూల్లో కొత్తపల్లెకు చెందిన పుట్టా సుధాకర్‌యాదవ్ (ఎమ్మెల్యే)తో కలిసి ఆయన చదువుకున్నారు. ప్రస్తుతం పుట్టా పెద్ద కుమారుడుడు వేలూరు ఎంపీగా ఉన్నారు. పోరుమామిళ్లలో ఇంటర్మీడియట్ చదివి తరువాత 1984లో 23 ఏళ్లలో క్లాస్–1 కాంట్రాక్టర్‌గా పనులు చేపట్టారు. 2006లో అప్పటి కాంగ్రెస్ పార్టీ తరపున పలుగురాళ్లపల్లె ఎంపీటీసీగా ఏకగ్రీవమయ్యారు. మాజీ సీఎం జగన్, ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డిల ఆధ్వర్యంలో 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు, బి.మఠం జెడ్పీటీసీగా పొటీచేసి టీడీపీ అభ్యర్థి చెంచయ్యగారిపల్లెకు చెందిన పోలిరెడ్డిపై 5000 మెజార్టీతో గెలిచాడు, అప్పుడే జెడ్పీ చైర్మన్ కోసం ప్రయత్నాలు చేసినా దక్కలేదు. 2019లో మళ్లీ జెడ్పీటీసీగా పొటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. రాజకీయ సమీకణాలతో అప్పటి సీఎం జగన్ రాజంపేటకు అవకాశం ఇచ్చారు. అనంతరం నేడు ఆయన జెడ్పీ చైర్మన్‌గా అవకాశం దక్కింది. ఇదే పంచాయతీలో మరొరు ఎమ్మెల్యేగా ఉంటే ఈయన జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికవడం విశేషం. 40మంది జెడ్పీటీసీల సభ్యుల ఆమోదంతో జెడ్పీ చైర్మన్ పీఠం ఎక్కారు. రామగోవిందరెడ్డికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉండగా అందరికీ వివాహమైంది.పట్టు సాధించిన ముత్యాల రామగోవిందరెడ్డి -
గంజాయి విక్రేతల అరెస్టు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడప నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఇరువురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ కృష్ణకుమార్ తెలిపారు. నగరంలోని కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలోని చిన్న చౌక్ సంజన్న సర్కిల్ వద్ద ఎండు గంజాయి కలిగి ఉన్న దూదేకుల సిద్దు, తాటి నాగసురేశ్కుమార్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి 1250 గ్రాముల గంజాయి, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి సరఫరా చేసిన గిద్దలూరు వాసి దాసరి నాని పరారీలో ఉన్నారన్నారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ అధికారులు నీలకంటేశ్వరరెడ్డి, టి.మహేంద్ర, కె.నరసింహారావు, టి.సతీష్ పాల్గొన్నారు. -
గండి హుండీల ఆదాయం రూ.9.07లక్షలు
చక్రాయపేట : మండలంలోని మారెళ్లమడక గ్రామంలోని గండి వీరాంజనేయస్వామి ఆలయంలో హుండీల లెక్కింపు ద్వారా రూ.9,07,554 ఆదాయం వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. గండి వీరాంజనేయస్వామి క్షేత్రంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ హుండీల ద్వారా రూ.9,07,554ల నగదు, 005.00గ్రాముల బంగారు, 320.00 గ్రాముల వెండి, అన్నప్రసాద వితరణ హుండీ ద్వారా రూ.14,407ల ఆదాయం వచ్చిందన్నారు. మధ్యాహ్నం బహిరంగ వేలం ద్వారా ఆలయంలో పాలు, పెరుగు, మజ్జిగ ప్యాకెట్ల సరఫరా వేంపల్లెకు చెందిన సుధీర్ దక్కించుకున్నారన్నారు. దేవస్థాన భూములు, షాపింగ్ కాంప్లెక్స్ గదుల లీజు హక్కులకు, ఖాళీ నెయ్యి డబ్బాలు, నిరూపయోగ వస్తువుల విక్రయాలు, కూరగాయల సరఫరా హక్కులకు ఎవరూ డిపాజిట్ కట్టి పాల్గొనకపోవడంతో వాయిదా పడిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కేసరి, రాజా రమేష్, దేవస్థాన చైర్మన్ కావలి కృష్ణ, బోర్డు సభ్యులు, ఏపీజీబీ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
బాధితులకు సరైన న్యాయం చేస్తాం: కలెక్టర్
దాల్మియా పరిశ్రమతో నష్టపోతున్న ప్రజలకు న్యాయం చే స్తామని జిల్లా కలెక్టర్ శ్రీధర్చెరకూరి పేర్కొన్నారు. ప్రజాభిప్రాయం సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రెండు, మూడు సార్లు ఆర్డీఓ గ్రామాల్లో పర్యటించి తనకు నివేదిక ఇచ్చారని, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పలుమార్లు సమస్యను తన దృష్టికి తెచ్చారని అన్నారు. దుగ్గనపల్లి గ్రామ ప్రజలను తాము కోరుకున్న ప్రాంతానికి తరలించటానికి యాజమాన్యం ఒప్పుకుందని, పంట భూములకు సైతం పరిహారం ఇప్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఒప్పుకున్న మేరకు పరిశ్రమ యాజమన్యాం నడుచుకోకపోతే లైసన్సు రద్దు చేయడానికి వెనుకాడబోమన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సాయిశ్రీ, పర్యావరణశాఖ అధికారి సుధ కురుబ, చీఫ్ ఇంజినీర్ మునిస్వామినాయుడు, దాల్మియా డైరెక్టర్ నిపున్ భార్గవ్, తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమ నా కుమారుడు, కోడలిని చంపేసింది
దాల్మియా పరిశ్రమతో వెలువడే బూడిద, కెమికల్ వాసనతో నా కోడలికి క్యాన్సర్ సోకి మరణించింది. మా మిరప పంట దిగుబడుల్లో నాణ్యత లేదని గిట్టుబాటు ధర లభించలేదు. అప్పులు తీర్చలేక నా కుమారుడు మోషే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణం ఫ్యాక్టరీ యాజమాన్యమే. ఇప్పుడు ఇద్దరి పిల్లల బాధ్యత నాపై పడింది. – స్వామిదాసు, దుగ్గనపల్లి, మైలవరం మండలం గ్రామంలో ప్రతిఒక్కరూ అనారోగ్యంతో ఉన్నారు పరిశ్రమ నుంచి వెలువడే ధూమ్ము, ధూళి, కెమికల్ వాసనతో ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి. మా సమస్యలు దాల్మియా యాజమాన్యం, అధికారులకు వివరించినా ఎవరూ స్పందించలేదు. ఇళ్లలో బూడిద పడడంతో మా ఇళ్లకు బంధువులు రావడం మానేశారు. అదికారులు మా సమస్యలకు పరిష్కారం చూపకపోతే దాల్మియా పరిశ్రమ ఎదుట ఆత్మహత్య చేసుకుంటాం. – మేరి, దుగ్గనపల్లి, మైలవరం మండలం -
దాల్మియా పరిశ్రమ యాజమాన్యంపై ప్రజాగ్రహం
జమ్మలమడుగు/మైలవరం : దాల్మియా సిమెంట్ పరిశ్రమ 4.6 టన్నుల సామర్థ్యంతో 2006లో వంక స్థలంలో కడుతుండగా.. తాము ఇబ్బంది పడతామని చెప్పేందుకు వచ్చిన తమను గేట్లవద్దే అడ్డుకున్నారని దుగ్గనపల్లి, నవాబుపేట, చిన్న కొమెర్ల , పెద్దకొమెర్ల గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో ఆరోపించారు. అప్పట్లో ప్రజాభిప్రాయ సేకరణకు రాకుండా తమను అడ్డుకుని పరిశ్రమను స్థాపించేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. మైలవరం మండలం నవాబుపేట సమీపంలో ఉన్న దాల్మియా పరిశ్రమను విస్తరింరు నేపత్యంలో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గురువారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. 15 ఏళ్లుగా తాము దాల్మియా పరిశ్రమ వల్ల ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు కలెక్టర్‌కు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించిన తర్వాతే విస్తరించాలని, లేనిపక్షంలో తాము అడ్డుకుంటామని ఆయా గ్రామాల ప్రజలు, బాధితులు అధికారులకు విన్నవించారు. వారి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అధికారులకు బాధితుల ఫిర్యాదు -
నా కుమారుడు క్యాన్సర్‌తో చనిపోయాడు
దాల్మియా పరిశ్రమతో వెలువడే బూడిత, కెమికల్ వాసన పీల్చడంతో నా కుమారుడికి క్యాన్సర్ వచ్చి మరణించినాడు. 1.75 ఎకరాల భూమిని సాగుచేసుకుందామంటే పొలాల్లో నీరు వచ్చి చేరుతోంది. అప్పులు పెరిగిపోవడంతో బయట పనులకు పోతున్నాం. వంకలకు అడ్డంగా దాల్మియా పరిశ్రమ గోడలు కట్టడంతో మా పొలాలకు నీరు చేరుతోంది. నా కుమారుడి మరణానికి పరిశ్రమ యజమానులే కారణం. – శాంతమ్మ, దుగ్గనపల్లి, మైలవరం మండలం ముందు మా సమస్యలు పరిష్కరించాలి 2007లో దాల్మియా పరిశ్రమ ఎర్పడినప్పటి నుంచి నవాబుపేట, దుగ్గనపల్లి రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. వంకల్లో పరిశ్రమ కట్టడంతోపాటు ప్రహరీ నిర్మాణం చేపట్టారు. వంకలో చేరాల్సిన 33 వేల క్యూసెక్కుల నీరు మా గ్రామాలను ముంచేస్తున్నాయి. బ్లాస్టింగ్‌తో ఇళ్లు దెబ్బతిన్నాయి. గతంలో ఏడుగురు ఇంటిపై నుంచి పడి మరణించారు. మా సమస్యల పరిష్కరించిన తర్వాత విస్తరించాలి. – భాస్కర్‌రెడ్డి, నవాబుపేట, మైలవరంర మండలం -
మత సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగలను జరుపుకోవాలి
జిల్లా శాంతి కమిటీ సమావేశంలో జేసీ అదితి సింగ్ కడప సెవెన్‌రోడ్స్ : మత సంప్రదాయాలను గౌరవిస్తూ శాంతియుత, ఆహ్లాదకర వాతావరణంలో భక్తి భావంతో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగలను నిర్వహించుకునేలా జిల్లా శాంతి కమిటీ సభ్యులు సమన్వయ సహకారాలు అందించాలని జేసీ అదితిసింగ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగల నిర్వహణపై జేసీ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు, కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప, పులివెందుల ఆర్డీఓలు జాన్ ఇర్విన్, చిన్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ శాంతియుత ఆనంద వాతావరణంలో ఒకరి మతాచారాలను మరొకరు గౌరవించుకుంటూ భక్తి శ్రద్ధలతో రంజాన్, ఉగాది, శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించుకోవాలని శాంతి కమిటీ సంఘం సభ్యులను ఆదేశించారు. పండుగ వేడుకల సమయంలో ఆలయా లు, మజీద్ల వద్ద అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని సంబంధిత అధికారులను జేసీ ఆదేశించారు. ఎక్కడైనా ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే అధికారులకు, పోలీసు సిబ్బందికి సమాచారమివ్వాలన్నారు. అనవసరమైన విషయాలను అత్యుత్సాహంతో సోషల్ మీడియాలలో పోస్టు చేయడం వంటి చర్యలను అరికట్టేలా శాంతి కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో శాంతి కమిటీ సభ్యులు, పోలీసు శాఖ, వివిధ శాఖల అధికారులు, మైనారిటీ దేవదాయ శాఖ అధికారులు, పలువురు అలయ అర్చకులు, మౌజన్లు తదితరులు పాల్గొన్నారు. -
జగన్మోహన్రెడ్డి దృష్టికి జ్యోతి క్షేత్రం సమస్య
పోరుమామిళ్ల : ఇటీవల అత్యంత చర్చనీయాంశంగా మారిన కాశినాయన జ్యోతి క్షేత్రంలో నిర్మాణాల కూల్చివేత గురించి బుధవారం మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తీసుకెళ్లి వివరించారు. ఆయన వెంట నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్‌రెడ్డి, బి.కోడూరు మాజీ జెడ్పీటీసీ, మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రాళ్లపల్లె నరసింహులు, కాశినాయన మండల కన్వీనర్ హనుమంతరెడ్డి, గంటా రమణారెడ్డి, మేరెడ్డి రమణారెడ్డి తదితరులున్నారు. మూడు దశాబ్దాలకు పైగా కాశినాయన క్షేత్రంలో జరిగిన అభివృద్ధి, ఆగిపోయిన ఆలయ పనులు వివరిస్తూ.. హఠాత్తుగా ఫారెస్టు అధికారులు, పోలీసులు అక్కడ నిర్మాణాలు అడ్డంగా కూలగొట్టడం, భక్తుల మనోభావాలు దెబ్బతినడం తదితర అంశాలు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాజీ సీఎంకు వివరించారు. వైయస్ జగన్ సానుకూలంగా స్పందించి త్వరలో ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలసి మాట్లాడతానని చెప్పినట్లు డీసీ గోవిందరెడ్డి తెలిపారు. వైఎస్ జగన్ కూడా కాశినాయన క్షేత్రాన్ని సందర్శిస్తానని చెప్పారన్నారు. -
● తెలుగుదేశం పార్టీ ద్వంద్వనీతి
జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ ద్వంద్వనీతి ప్రదర్శించింది. సంఖ్యాబలం లేని కారణంగా ప్రజాతీర్పుకు గౌరవించి చైర్మన్ ఎన్నికలో పోటీలో లేమంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే అందుకు విరుద్ధమైన సంకేతాలు తెరపైకి వచ్చాయి. జిల్లా అధ్యక్షుడు పోటీలో లేమంటూనే మరోవైపు టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి ద్వారా ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. బరిలో నిలిచే శక్తి లేకపోవడంతో చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు కుట్రలు పన్నారు. టీడీపీ జెడ్పీటీసీతోపాటు మరో 7మంది తెలుగుదేశం పార్టీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు. చైర్మన్ ఎన్నిక అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. స్టేటస్ కో తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు, స్టేటస్కో ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం విశేషం. సమయం లభిస్తే జెడ్పీటీసీ సభ్యులను వశపర్చుకోవాలనే దుర్భుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. కాగా చైర్మన్ ఎన్నికకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశిస్తూనే తుది ఫలితం హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండాలని ప్రకటించింది. -
మత సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగలను జరుపుకోవాలి
జిల్లా శాంతి కమిటీ సమావేశంలో జేసీ అదితి సింగ్ కడప సెవెన్‌రోడ్స్ : మత సంప్రదాయాలను గౌరవిస్తూ శాంతియుత, ఆహ్లాదకర వాతావరణంలో భక్తి భావంతో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగలను నిర్వహించుకునేలా జిల్లా శాంతి కమిటీ సభ్యులు సమన్వయ సహకారాలు అందించాలని జేసీ అదితిసింగ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగల నిర్వహణపై జేసీ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు, కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప, పులివెందుల ఆర్డీఓలు జాన్ ఇర్విన్, చిన్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ శాంతియుత ఆనంద వాతావరణంలో ఒకరి మతాచారాలను మరొకరు గౌరవించుకుంటూ భక్తి శ్రద్ధలతో రంజాన్, ఉగాది, శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించుకోవాలని శాంతి కమిటీ సంఘం సభ్యులను ఆదేశించారు. పండుగ వేడుకల సమయంలో ఆలయా లు, మజీద్ల వద్ద అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని సంబంధిత అధికారులను జేసీ ఆదేశించారు. ఎక్కడైనా ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే అధికారులకు, పోలీసు సిబ్బందికి సమాచారమివ్వాలన్నారు. అనవసరమైన విషయాలను అత్యుత్సాహంతో సోషల్ మీడియాలలో పోస్టు చేయడం వంటి చర్యలను అరికట్టేలా శాంతి కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో శాంతి కమిటీ సభ్యులు, పోలీసు శాఖ, వివిధ శాఖల అధికారులు, మైనారిటీ దేవదాయ శాఖ అధికారులు, పలువురు అలయ అర్చకులు, మౌజన్లు తదితరులు పాల్గొన్నారు. -
అన్నమయ్యపై టీటీడీ చిన్నచూపు!
రాజంపేట: ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు జిల్లా విభజనసెగ వెంటాడుతోంది.అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్టలోని కోదండరామాలయం వైఎస్సార్‌జిల్లాలో ఉన్న తరుణంలో అన్నమయ్య జిల్లా పరంగా తిరుమల తిరుపతి దేవస్ధానం(టీటీడీ) చిన్నచూపు చూస్తోందన్న విమర్శలు ఉన్నాయి.పేరుకే రాజంపేట నియోజకవర్గం అని, బ్రహ్మోత్సవాల్లో వైఎస్సార్ జిల్లా యంత్రాంగానికి టీటీడీ పెద్దపీట వేస్తోందని ఇక్కడి వారి భావన. వైఎస్సార్ జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీని భాగస్వాములను చేయకుండా టీటీడీ వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా వాసులు పెదవి విరుస్తున్నారు. టీటీడీలో విలీనం కాకముందునుంచి.. ఒంటిమిట్ట కోదండరామాలయం టీటీడీలో విలీనం కాకముందు నుంచి బ్రహ్మోత్సవాలను రాజంపేట నియోజకవర్గ యంత్రాంగమే విజయవంతంగా నిర్వహిస్తోంది. కొత్త జిల్లా ఏర్పాటు క్రమంలో నందలూరు ఒంటిమిట్ట మండలాలు వైఎస్సార్ జిల్లాలో విలీనమయ్యాయి.దీంతో టీటీడీ కూడా తన దిశను మార్చుకుందన్న అపవాదును మూటకట్టుకుంది. స్థానికులతో పాటు రాజంపేట నియోజకవర్గంలోని ఆరుమండలాల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు బ్రహ్మోత్సవాల్లో చోటు లేకుండా చేశారు. ఉభయ వైఎస్సార్ జిల్లాకు చెందిన వారి భాగస్వామ్యంతో చేస్తే ఎలాంటి బేధాభిప్రాయాలు రావన్న వాదన బలంగా వినిపిస్తోంది. రాములోరి కల్యాణోత్సవం సమయంలో పాసులు, ఇతర అనుమతులు విషయంలో అన్నమయ్య జిల్లాకు టీటీడీ మొండిచెయ్యి చూపిస్తోంది. ఇది సరైన విధానం కాదని, రామాలయం మాది.. పెత్తనం వారిదా అన్న అభిప్రాయం అధికారులు, భక్తులలో కూడా వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా టీటీడీ ఒంటిమిట్ట రామాలయం ఉత్సవాల నిర్వహణ విషయంలో వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. ఏప్రిల్ 6 నుంచి 14 వరకు జరిగే శ్రీ కోదంరామస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణలో లా అండ్ అర్డర్ పగ్గాలు కడప పోలీసులకే టీటీడీ , ప్రభుత్వం అప్పగిస్తోంది. ఉభయ వైఎస్సార్ జిల్లాలకు ఒంటిమిట్ట రామాలయం ప్రధానమైనప్పటికీ లా అండ్ ఆర్డర్ విషయంలో అన్నమయ్య జిల్లా ఖాకీ పెద్దల భాగస్వామ్యం ఉండకపోవడం గమనార్హం. టీటీడీ కడప పోలీసువ్యవస్ధకే ప్రాధాన్యత ఇవ్వడంపై జిల్లా పోలీసువర్గాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. పేరుకే రాజంపేట నియోజకవర్గం రామయ్య బ్రహ్మోత్సవాల్లో వైఎస్సార్ జిల్లా యంత్రాగానికి పెద్దపీట ఈసారైనా టీటీడీ తన వైఖరి మార్చుకోవాలంటున్న రాజంపేట వాసులు జిల్లా యంత్రాంగానికి భాగస్వామ్యం కల్పించాలి ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో టీటీడీ అన్నమయ్య జిల్లాపై చిన్నచూపు చూపుతోంది. రాములోరి కల్యాణోత్సవంలో అన్నమయ్య జిల్లా యంత్రాంగానికి భాగస్వామ్యం కల్పించాలి. ఆలయం రాజంపేట నియోజకవర్గంలో ఉంటే, ఉత్సవాల నిర్వహణ విషయంలో జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం సరికాదు. – కెఎంఎల్ నరసింహా, కన్వీనర్, ఆల్ ఇండియానేషనల్ బీసీ ఫ్రంట్ పూర్వ సంప్రదాయాన్ని కొనసాగించాలి పూర్వం నుంచి ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాల్లో రాజంపేటకు చోటు కల్పించేవారు. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా యంత్రాంగానికి కల్యాణోత్సవం నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. స్థానికులనే పదం లేకుండా చేయడం సరికాదు. ఈ సారి జరిగే కల్యాణోత్సవంలో పూర్వ సంప్రదాయాన్ని టీటీడీ కొనసాగించాలి. – మర్రి కళ్యాణ్, ఎన్ఆర్ఐ, రాజంపేట -
శుభాల రేయి కోసం ఎదురుచూపు
కడప కల్చరల్ : పవిత్ర రంజాన్ మాసం చివరి పది రోజుల్లో ఐదు బేసి రాత్రులను తాఖ్ రాత్‌లు (పవిత్రమైన రాత్రులు)గా భావిస్తారు. ఇందులో భాగంగా ఇప్పటికే మూడు తాఖ్ రాత్‌లు గడిచిపోయాయి. ఇక రంజాన్ పర్వదినానికి మూడు రోజులే గడువు ఉంది. నాల్గవ తాఖ్ రాత్ గురువారం రానుంది. దీనిని ముస్లింలు ‘లైలతుల్ ఖద్ర్’ (పెద్దరాత్రి)గా వ్యవహరిస్తారు. ఈ రోజునే ముస్లిం ప్రపంచానికి ఆరాధ్యమైన, అత్యంత పవిత్రమైన దివ్య గ్రంథం ఖురాన్ అల్లాహ్ కృప మేరకు భూమిపై అవతరించిందని పవిత్ర గ్రంథాల ద్వారా తెలియవస్తోంది. అందుకే బడీరాత్ను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ సందర్భంగా రాత్రంతా పశ్చాత్తాప భావనతో దైవ సన్నిధిలో గడిపి ధన్యత పొందేందుకు ప్రయత్నిస్తారు. దైవం పాపలన్నింటినీ క్షమిస్తాడని పెద్దలు పేర్కొంటారు. బడీరాత్ రోజున నిండైన ప్రార్థనలు నిర్వహిస్తే 70 రాత్రుల్లో చేసే పుణ్యఫలాలు లభిస్తాయని విశ్వాసం ఉంది. అందుకే ఆ పవిత్రమైన రోజు కోసం పది రోజులపాటు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ పది రోజుల్లోని బేసి రాత్రులలో జాగరణ చేస్తూ ప్రార్థనలు చేస్తే అధిక పుణ్యం లభిస్తుందని ఆశిస్తారు. ఈ రోజుల్లో మసీదులు, ఇళ్లలో కూడా రాత్రంతా నవాజ్ చదవడం, పవిత్ర ఖురాన్ పఠించడం, జికర్ చేయడం, ఇతర ఆధ్యాత్మిక ప్రసంగాలతో తెల్లవారుజామున సెహరి సమయం వరకు గడుపుతారు. ఈ ప్రత్యేకమైన ప్రార్థనల సందర్భంగా మసీదు కమిటీలు విశేష ఏర్పాట్లు చేశాయి. నేడు లైలతుల్ ఖద్ర్ ఏర్పాట్లలో మసీదు కమిటీలు -
గొర్రెల యజమాని ఆత్మహత్య
కలసపాడు : మండలంలోని కొండపేటకు చెందిన జోసెఫ్ (42) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు జోసెఫ్ గొర్రెలను మేపుకుంటుండేవాడు. కొంత మంది వద్ద అప్పు చేసి గొర్రెలను కొనుగోలు చేసేవాడు. నెలకు, రెండు నెలలకు గొర్రెలు చనిపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. దీంతో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య సునీత, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి కలసపాడు : మండలంలోని లింగారెడ్డిపల్లె గ్రామానికి చెందిన కొత్తపల్లె రాజారెడ్డి (45) మంగళవారం రాత్రి శంఖవరం, లింగారెడ్డిపల్లె గ్రామాల మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు రాజారెడ్డి తన సొంత పని నిమిత్తం పోరుమామిళ్లకు తన ద్విచక్ర వాహనంలో వెళుతుండగా టేకూరుపేటకు చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై లింగారెడ్డిపల్లెకు వెళుతూ శంఖవరం, లింగారెడ్డిపల్లె గ్రామాల మధ్యలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రాజారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతునికి భార్య సుధాదేవి, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోసారి కూలిన చౌదరివారిపల్లె వంతెన బ్రహ్మంగారిమఠం : మండలంలో చౌదరివారిపల్లె నుంచి పలుగురాళ్లపల్లె మీదుగా సిద్దయ్యమఠం– పోరుమామిళ్లకు వెళ్లే ఆర్అండ్ బీ రహదారి చౌదరివారిపల్లె దగ్గర ఉన్న వంతెన మళ్లీ కూలింది. మూడు నెలల క్రితం వంతెన కూలడంతో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేయించారు. వాహనాల రాకపోకలు అధికం కావడంతో బుధవారం మళ్లీ వంతెన కూలింది. దీంతో ఎర్రంపల్లె, బొగ్గులవారిపల్లె, బాకరాపేట, పలుగురాళ్లపల్లె, కొత్తపల్లె, జౌకుపల్లె, ముడుమాల, సిద్దయ్యమఠం తదితర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వంతెన నిర్మాణం కోసం రూ.4.50 లక్షలు మంజూరు వంతెన నిర్మాణం కోసం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆర్అండ్బీ అధికారుల ద్వారా రూ.4.50 లక్షల నిధులు మంజూరు చేయించారని టీడీపీ మండల అధ్యక్షడు చెన్నుపల్లె సుబ్బారెడ్డి తెలిపారు. త్వరలోనే వంతెన నిర్మాణ పనులు చేపడతారన్నారు. -
టీడీపీ కౌన్సిలర్ మురళీధర్‌రెడ్డిపై పోక్సో కేసు
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు టీడీపీ కౌన్సిలర్ మురళీధర్‌రెడ్డిపై రూరల్ పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇదే కేసులో మరో ముగ్గురిపై కూడా పోక్సో కేసు నమోదైంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆర్టీపీపీకి చెందిన మైనర్ బాలుడు ప్రొద్దుటూరులోని పూజా ఇంటర్నేషనల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అతను ఐదుగురు అమ్మాయిల ఇన్‌స్ట్రాగామ్ ఐడీలను హ్యాక్ చేసి 9, 10వ తరగతి అబ్బాయిలకు అమ్మాయిల వ్యక్తిగత మొబైల్ నంబర్లను పంపించేవాడు. ఆడ పిల్లల ఫొటోలతో కొన్ని కొత్త ఇన్‌స్ట్రాగామ్ ఐడీలను తయారు చేసి అదే పాఠశాలలో చదువుతున్న అమ్మాయిలకు మెసేజ్‌లు చేస్తూ తనను ప్రేమించాలని, లేదంటే వారి మొబైల్ నంబర్లను మగపిల్లలకు ఇస్తానని బెదిరించేవాడు. ఇలా 32 ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి ప్రేమించకుంటే వీడియోలు, ఫొటోలను అందరికీ పంపిస్తానని అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసేవాడు. ఇలా అతను అమ్మాయిలను ఇబ్బందులు పెడుతున్న విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు కొందరు తల్లిదండ్రులు తెలియచేశారు. అయితే బాలుడి తల్లిదండ్రులు అతన్ని దండించలేదు. బాలుడికి అడిగినంత డబ్బులిస్తూ అమ్మాయిలను బెదిరించమని ప్రోత్సహించేవారు. తమ అబ్బాయి తప్పులు బయటపడతాయేమోనని. తమ అబ్బాయి తప్పులు ఎక్కడ బయటపడతాయోననే భయంతో బాలుడి తల్లి ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ కౌన్సిలర్ మురళి, కొందరు రౌడీలను పాఠశాలకు తీసుకువచ్చింది. తమ కుమారుడి విషయాలు బయటపెడితే స్కూల్లో అనాథ పిల్లలను చంపేస్తానని భయపెట్టారు. మైనర్ బాలుడి ప్రవర్తన వల్ల 10వ తరగతి అమ్మాయిలు ఆత్మహత్య చేసుకునేందుకు కూడా సిద్ధపడ్డారు. దయచేసి ఆడపిల్లలను కాపాడాలని బాలికల తల్లులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు ముఖ్య కారణమైన బాలుడి తల్లిదండ్రులు కొండమ్మ, మాధవరెడ్డిలతో పిల్లలకు ప్రాణహాని ఉందన్నారు. బాలికల తల్లుల ఫిర్యాదు మేరకు 78, 351 (2), రెడ్‌విత్ 3(5) బీఎన్ఎస్, సెక్షన్ 11 రెడ్‌విత్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్ కింద మైనర్ బాలుడితో పాటు తల్లిదండ్రులు మూలయ్య కొండమ్మ, మూలయ్య మాధవరెడ్డి, మురళీపై బుధవారం కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. -
మున్సిపాలిటీల్లో 24 గంటల్లో ప్లాన్ అప్రూవల్
కడప కార్పొరేషన్: మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇళ్ల నిర్మాణం చేసే వారికి 24 గంటల్లోపే ప్లాన్ అప్రూవల్స్ ఇస్తామని టౌన్‌ప్లానింగ్ ఆర్డీడీ టి.విజయ్ భాస్కర్ అన్నారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో పుర, నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే భవన నిర్మాణాలకు ప్రభుత్వం జారీ చేసిన నూతన ఉత్తర్వులపై వైఎస్సార్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లా ఎల్టీపీ, ప్రణాళిక సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ రంగంలో నిబంధనలను సరళీకరిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ జీవో జారీ చేసిందని తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలు చేపట్టేవారు స్వీయ ధ్రువీకరణతో ఎల్టీపీల ద్వారా 24 గంటల్లోపే ప్లాన్ అప్రూవల్ పొందవచ్చన్నారు. ప్రణాళికా సిబ్బంది భవన నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని చెప్పారు. 300 చదరపు మీటర్ల లోపు భవనాలకు యజమానులే ప్లాన్ ధ్రువీకరించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆర్కిటెక్చర్లు, ఇంజినీర్లు, టౌన్ ప్లానర్లు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. లేఅవుట్ కు తప్పకుండా అనుమతులు ఉండాలన్నారు. సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీం క్రింద భవన నిర్మాణ అనుమతులను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జారీ చేస్తూ ఉండేదని, ఇకపై పట్టణ స్థానిక సంస్థలు జారీ చేస్తాయని తెలిపారు. ’కుడా’పీఓ శైలజ, అన్నమయ్య పీఓ సంధ్య, సీపీ రమణ, ఏసీపీలు మునిరత్నం, మునిలక్ష్మి, టీపీఓ రత్నరాజు, టౌన్ ప్లానింగ్, వార్డ్ ప్లానింగ్ సెక్రటరీలు, ఎల్టీపీలు పాల్గొన్నారు. -
కూలీల పొట్ట కొడుతున్నారు
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పరిధిలో ఏపీ స్టేట్ వేర్ హౌస్‌కు సంబంధించి రామేశ్వరం, వైఎంఆర్ కాలనీ, కానపల్లె గ్రామం వద్ద మూడు గోడౌన్లను నిర్మించారు. ప్రస్తుతం సత్యసాయి, అనంతపురం జిల్లాల పరిధిలో నాఫెడ్ ద్వారా ప్రభుత్వం కందులు కొనుగోలు చేసి ప్రొద్దుటూరుకు పంపిస్తున్నారు. స్థానిక గోడౌన్లలో వీటిని భద్రపరుస్తున్నారు. ప్రస్తుతం వైఎఆర్ కాలనీలోని గోడౌన్ నిండటంతో కానపల్లె గ్రామం వద్ద ఉన్న గోడౌన్లో కందుల బస్తాలను నింపుతున్నారు. కాగా కందుల బస్తాల అన్‌లోడింగ్‌కు సంబంధించి ప్రభుత్వం చెల్లించే హమాలి చార్జెస్లో అధికారులు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. బస్తాకు ఎంత కూలి ఇస్తారన్న విషయం రహస్యంగా ఉంచారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం 50 కిలోల బస్తాకు రూ.8 చొప్పున కూలి చెల్లిస్తోంది. ఈ ప్రకారం రోజు సుమారు వంద మంది కూలీలు వేల బస్తాలను వచ్చిన లారీల నుంచి దించి గోడౌన్లో నింపుతున్నారు. రోజు 5 నుంచి 10వేల బస్తాల వరకు సరుకును దింపుతున్నారు. కూలీలకిచ్చే దాంట్లోనే కాకుండా.. ప్రతి లారీ యజమాని నుంచి అదనంగా మామూళ్లు కూడా అందుకుంటున్నారని తెలు స్తోంది. పేదల ఆకలిని ఆసరాగా తీసుకున్న అధికారులు, కాంట్రాక్టర్లు వీరి కూలి చెల్లింపులో మోసం చేస్తున్నారు. తద్వారా రోజుకు అటు కాంట్రాక్టర్, ఇటు అధికారులు కలిపి సుమారు రూ.20వేలు లబ్ధి పొందుతున్నట్లు సమాచారం. సుమారు నెల రోజులుగా ప్రొద్దుటూరులో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. కూలి చెల్లింపు విషయమై అనేక మంది హమాలీలను ‘సాక్షి’ వివరణ కోరగా తాము చుట్టుపక్కల గ్రామాల నుంచి పొట్ట కూటి కోసం ఇక్కడికి వస్తున్నామన్నారు. బస్తాకు కూలి ఎంత వేస్తారనే విషయం తమకు తెలియదని, అడిగితే మరుసటి రోజు ఈ పని కూడా ఉండదన్నారు. పేదలమైన తమకు తప్పనిసరిగా పని ఉంటే తప్ప పొట్ట పోసుకోలేమన్నారు. ప్రతి రోజు సాయంత్రం అవుతూనే ఆ రోజుకు సంబంధించి కూలి ఎంత అనేది లెక్క వేసి చెల్లిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పలువురు కూలీలు మాట్లాడుతూ శనివారం రూ.1200, ఆదివారం రూ.1340, సోమవారం రూ.700 కూలి చెల్లించాలని తెలిపారు. కూలీలకు సంబంధించి మేస్త్రి వెంకటయ్యను ప్రశ్నించగా.. బస్తాకు ఎంత కూలి అన్న విషయం తనకు కూడా తెలియదని తప్పించుకున్నారు. ఇంత వరకు ప్రభుత్వం నుంచి బిల్లు రాలేదని, బిల్లు వస్తేనే ఎంత కూలి అనేది తేలుతుందన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఏ మేరకు చెల్లించాల్సి ఉందనేది కూడా ఆయన చెప్పలేదు. ఇదే విషయమై గోడౌన్‌కు సంబంధించిన టెక్నికల్ అసిస్టెంట్ కోటేశ్వరరావును వివరణ కోరగా హమాలీల కూలి చెల్లింపు తమకు సంబంధం లేదన్నారు. కందులు నాణ్యతగా ఉన్నాయా లేదా అనేది మాత్రమే తాను పరిశీలిస్తానన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ రామకృష్ణ కూలీల కాంట్రాక్టును తాత్కాలికంగా దక్కించుకున్నారని తెలిపారు. ఉన్నతాధికారులు విచారణ చేసి కూలీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి ఆ కార్మికులది. రోజూ ఒళ్లొంచి శ్రమటోడ్చి పనిచేస్తే కానీ వీరికి కూలి రాదు... ఆ డబ్బులొస్తేగానీ పూట గడవదు. వారి శ్రమను కళ్లార చూసిన వారెవరైనా అయ్యో పాపం అనాల్సిందే. రోజూ పల్లెల నుంచి అన్నం తెచ్చుకుని కండలు కరిగించి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కూలీలకు సాయం చేయాల్సిన కాంట్రాక్లర్లు వారి శ్రమను దోపిడీ చేస్తున్నారు. అండగా నిలబడాల్సిన అధికారులే వారి పొట్ట కొడుతున్నారు. కూలి చెల్లింపులో చేతి వాటం రోజు రూ.20వేల వరకు అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదాయం వేర్ హౌసింగ్ గోడౌన్లలో ఇదీ.. పరిస్థితి -
ఫౌంటైన్లా మారి.. వృథాగా పారి..
నేలను చిమ్ముకుంటూ .. నింగి వైపు ఎగసిపడుతున్న ఈ నీటి జోరును చూసి ఫౌంటైన్ అనుకుంటే పొరపాటే. బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి గోపవరం మండలం పి.పి.కుంట సమీపంలోని సెంచురీ పానెల్స్ పరిశ్రమ నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన పైపులైను లీకై న దృశ్యమిది. నెల్లూరు రోడ్డులోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఉన్న పైపులైను గేట్‌వాల్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో నీరు దాదాపు 20 అడుగుల పైకి చిమ్ముతూ ఇదిగో ఇలా ఫౌంటైన్‌ను తలపించింది. సుమారు గంట పాటు నీరు వృథాగా పోయింది. విషయం తెలుసుకున్న సెంచురీ పానెల్స్ ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అప్రమత్తమై బ్రహ్మంసాగర్‌లో మోటారు నిలుపుదల చేయడంతో నీటి ఉధృతి తగ్గింది. అప్పటికే చుట్టుపక్కల ప్రాంతమంతా భారీగా నీరు నిలిచింది. కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. –బద్వేలు అర్బన్ -
రేపు మైదుకూరులో జాబ్‌మేళా
కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లా ఉపాధి కార్యాలయం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు మైదుకూరు పట్టణంలోని పోరుమామిళ్లరోడ్డులో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పేటీఎం సంస్థలో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో డిప్యూటీ ఆఫీసర్, ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకు, ఛానల్ ప్లే లిమిటెడ్ సంస్థలో అసెంబుల్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. అభ్యర్థులు టెన్త్, ఇంటర్మీడియేట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ చేసి ఉండాలన్నారు. 18–35 మధ్య వయస్సుగల వారు అర్హులని, ఎంపికై న వారికి హోదాను బట్టి రూ.10–18 వేల వరకు వేతనం ఉటుందన్నారు. ఆసక్తి, అర్హగతగల అభ్యర్థులు విద్యార్హతల ధృవపత్రాలు, ఫోటోలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. ఇరువురిపై కేసు నమోదు పులివెందుల రూరల్ : పులివెందుల మండలం కొత్తపల్లె గ్రామంలో భూ తగాదాల విషయమై జయరామిరెడ్డి, శివప్రసాద్‌రెడ్డిలు గొడవ పడ్డారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వీరిరువురికి గ్రామంలో భూ తగాదాల కారణంగా పాత కక్షలను మనస్సులో పెట్టుకుని బుధవారం మాట మాటా పెరిగి గొడవపడ్డారని పోలీసులు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నారాయణ తెలిపారు. వివాహిత అదృశ్యం కొండాపురం : మండల పరిధిలోని చౌటిపల్లె గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి కనిపించడం లేదని కొండాపురం ఎస్ఐ విద్యాసాగర్ తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు వివాహిత మహిళ ఆదిలక్ష్మి ఈ నెల 23 వతేదీన ఇంటిలో తాడిపత్రికి వెళుతున్నా అని చెప్పి వెళ్లింది. ఇప్పటి వరకు కనిపించలేదని ఆమె మామ వి. ఓబులేసు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఫెలోగా డాక్టర్ బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి కడప ఎడ్యుకేషన్ : కడప ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), భౌతిక శాస్త్ర విభాగంలోని మెటీరియల్ ఫిజిక్స్ ప్రొఫెసర్ బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఫెలోగా ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రవీంద్రనాథ్ తెలిపారు. ఆయన పరిశోధనకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), రాష్ట్రీయ ఉత్చతార్ శిక్షా అభియాన్ (ఆర్యుఎస్ఏ) వంటి అత్యున్నత ప్రభుత్వ నిధుల సంస్థల నుంచి మద్దతు లభించిందన్నారు. ఈ సందర్భంగా, ప్రిన్సిపాల్‌తో పాటు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రమేష్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ బి. రామచంద్ర, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ వెంకట సుబ్బయ్య, బోధన, బోధనేతర సిబ్బంది డాక్టర్ బి. సుధాకర్ రెడ్డిని అభినందించారు. పది భౌతికశాస్త్రం పరీక్షకు 27730 మంది హాజరు కడప ఎడ్యుకేషన్ : పదవ తరగతి పరీక్షల్లో భాగంగా బుధవారం నిర్వహించిన భౌతికశాస్త్ర పరీక్షకు 27730 మంది హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 161 పరీక్షా కేంద్రాల్లో రెగ్యులర్లకు సంబంధించి 27877 మంది విద్యార్థులకుగాను 27730 మంది విద్యార్థులు హాజరుకాగా 147 మంది గైర్హాజరయ్యారు. అలాగే ప్రైవేటుకు సంబంధించి 191 మందికి 172 మంది హాజరుకాగా 19 మంది గైర్హాజరయ్యారు. 13 మంది ప్లైౖయింగ్ స్వాడ్ బృందాలు 70 పరీక్షా కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్ 88 పరీక్షా కే ంద్రాలను తనిఖీ చేసినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. అలాగే డీఈఓ షేక్ షంషుద్దీన్ నాలుగు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా, కడప జిల్లా అబ్జర్వర్ మధుసూదన్‌రావు 5 పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పాఠశాల విద్య ఆర్జేడీ కాగిత శ్యాముల్ కడప నగరంలో రెండు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. లక్ష గృహాలకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటే లక్ష్యం – జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఎస్.రమణ కడప కార్పొరేషన్ : ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం ద్వారా వైఎస్సార్ కడప జిల్లాలో లక్షమంది వినియోగదారులకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఎస్. రమణ అన్నారు. బుధవారం కడప విద్యుత్ భవన్‌లోని తన ఛాంబర్లో సంస్థాపన వెండర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కిలోవాట్ సామర్థ్యానికి రూ. 30 వేలు, రెండు కిలోవాట్స్ సామర్థ్యానికి రూ. 60 వేలు, 3 కిలోవాట్ సామర్థ్యానికి రూ.78వేలు చొప్పున ప్రభుత్వం రాయితీ అందిస్తుందన్నారు. రాయితీ పోను మిగిలిన మొత్తానికి బ్యాంకులు తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తాయన్నారు. బీ, సీ కేటగిరీ వారికి సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు అదనంగా మరో రూ.20వేలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ గృహాలపై సోలార్ రూఫ్ టాప్ అమర్చుకోవాలన్నారు. ఈ సమావేశంలో నెడ్ క్యాప్ డెవలప్మెంట్ ఆఫీసర్ యల్లారెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మోహన్, జూనియర్ ఇంజినీర్ సుధీర్, సంస్థాపక వెండర్స్ పాల్గొన్నారు. -
●రామగోవిందురెడ్డిని వరించనున్న చైర్మన్ పీఠం
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. గురువారం కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ నేతృత్వంలో ఎన్నిక ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 10గంటలకు నామినేషన్ స్వీకరణ, 12గంటలకు నామినేషన్లు పరిశీలన పూర్తి, అనంతరం తుది జాబితా విడుదల చేయనున్నారు. 1గంటలకు నామినేషన్ ఉపసంహరణ చేపట్టనున్నారు. ఆపై పోటీలో ఉన్న అభ్యర్థుల మధ్య చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగించనున్నారు. జిల్లాలో 50 మంది జెడ్పీటీసీ సభ్యులుండగా వారిలో పులివెందుల జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి ఓ ప్రమాదంలో చనిపోయారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఆకేపాటి అమర్నాథరెడ్డి జెడ్పీ చైర్మన్‌గా కొనసాగుతూ రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జెడ్పీకి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం జిల్లా పరిషత్‌లో 48 మంది జెడ్పీటీసీ సభ్యులున్నారు. వారిలో గోపవరం మండల జెడ్పీటీసీ జయరామిరెడ్డి మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారు. మిగతా అందరూ వైఎస్సార్సీపీ నుంచి ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులే కావడం విశేషం. వైఎస్సార్సీపీ సభ్యులకు విప్ జారీ... జిల్లా పరిషత్‌లో 47మంది జెడ్పీటీసీలకు వైఎస్సార్సీపీ విప్ జారీ చేసింది. జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి సూచన మేరకు వేముల జెడ్పీటీసీ బయపురెడ్డి ద్వారా సభ్యులకు విప్ జారీ చేశారు. విప్ జారీ చేసిన రిసిప్ట్ కాపీలు ఎన్నికల అధికారికి అందజేయనున్నారు. విప్ అందుకున్న సభ్యులంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. విప్ ధిక్కరిస్తే ఆయా సభ్యులు సభ్యుత్వం కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం సభ్యులంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ముక్తకంఠంతో వెల్లడిస్తున్నారని సమాచారం. దాంతో వైఎస్సార్సీపీ ఆత్మవిశ్వాసంతో ఉంది. చైర్మన్‌గిరిని పార్టీ ఖాతాలో జమ చేసుకునేందుకు సన్నద్ధంగా ఉంది. నేడే ఎన్నిక ఎన్నికలను నిలిపేయాలంటూ స్టేటస్కో కోసం టీడీపీ యత్నం చైర్మన్ ఎన్నికలు నిర్వహించుకోవాలని ఆదేశించిన హైకోర్టు పోటీలో లేమంటూనే అడ్డగించేప్రక్రియకు ‘పచ్చ’ పన్నాగం 47మంది జెడ్పీటీసీలు వైఎస్సార్సీపీ ప్రతినిధులే...విప్ జారీ బ్రహ్మంగారిమఠం మండల జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందురెడ్డికి జెడ్పీ చైర్మన్ పీఠం దక్కనుంది. వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థిగా ఆపార్టీ ప్రకటించింది. రెండు పర్యాయాలుగా బి.మఠం జెడ్పీటీసీగా ఆయన ప్రాతినిఽథ్యం వహిస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రామగోవిందురెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేశారు. అధినేత సూచనలు మేరకు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులు చైర్మన్ ఎన్నిక కోసం కంకణబద్ధులై ఉన్నారు. కలిసికట్టుగా ఎన్నిక ప్రక్రియ వ్యవహారం నడిపించేందుకు సన్నాహాలు చేస్తుండడం విశేషం. -
చెడు వ్యసనాలకు బానిసై.. గొలుసు చోరీకి యత్నం
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణం ప్రకాశ్‌నగర్ కాలనీకి చెందిన సంగటి ప్రణయ్‌కుమార్ అనే యువకుడు చెడు వ్యసనాలకు బానిసై మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును దొంగిలించేందుకు ప్రయత్నించాడు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ నరేష్‌బాబు తెలిపారు. బుధవారం విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు. ప్రణయ్‌కుమార్ అనే యువకుడు, చిలంకూరు గ్రామానికి చెందిన మరో మైనర్ బాలుడు చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. అవసరాలకు, ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో దొంగతనాలకు అలవాటుపడ్డారు. ఇళ్లల్లో ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని మాటల్లో పెట్టి వారిలో మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లి డబ్బులు సంపాదించాలనుకున్నారు. ఈ తరుణంలోనే ఈ నెల 24వ తేదీన కడప రోడ్డులోని మహేశ్వర్‌నగర్ కాలనీలో లక్ష్మిదేవి అనే మహిళ నిర్వహిస్తున్న చిల్లర అంగడి వద్దకు వెళ్లారు. వీరిద్దరూ సిగరెట్లు, నీళ్ల ప్యాకెట్లు కావాలని అడిగారు. ఆ వస్తువులను ఇచ్చేందుకు ఆమె వెనక్కు తిరగగానే ప్రణయ్‌కుమార్ లక్ష్మిదేవి మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. లక్ష్మీదేవి గట్టిగా కేకలు వేయడంతో ఇంటిలో ఉన్న ఆమె భర్త ఈశ్వర్‌రెడ్డి బయటకు వచ్చాడు. అలాగే అక్కడున్న మరికొంత మంది వ్యక్తులు రాగానే వారు ఇద్దరు పారిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. -
సమస్యలు అలా.. విస్తరణ ఎలా !
మైలవరం : మైలవరం మండలం నవాబు పేట గ్రామం వద్ద నిర్మించిన దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ కోసం గురువారం మూడు గ్రామాల ప్రజలతో ప్రజాభిప్రాయసేకరణకు అధికారుల సిద్ధం చేశారు. ప్రస్తుతం దాల్మియా పరిశ్రమ 4.6 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం దాని పరిధిని 12.6 మెట్రిక్ టన్నులకు విస్తరణ చేయాలని దాల్మియా యాజమాన్యం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ , పర్యావరణశాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. అయితే దాల్మియా బాధిత గ్రామాలైన నవాబుపేట, దుగ్గనపల్లి ,చిన్న కొమెర్ల గ్రామస్తులు తమ సమస్యలను పరిష్కరించకుండానే ప్రజాభిప్రాయ సేకరణ చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే సిమెంటు రాయి కోసం బ్లాస్టింగ్ చేస్తున్న దాల్మియా యాజమాన్యం నిబంధనలు పాటించకుండా భారీగా పేలుడుతో రాయిని వెలికి తీస్తున్నారు. దీంతో ఆ పేలుడు ధాటికి తమ ఇళ్లు దెబ్బతింటున్నాయని నవాబుపేట గ్రామస్తులు వాపోతున్నారు. అలాగే ఫ్యాక్టరీ నుంచి వస్తున్న బూడిద కారణంగా పరిసర పంట పొలాలు దెబ్బతినడంతోపాటు దిగుబడి కూడా రావడంలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. చిన్న కొమెర్లనుంచి నవాబుపేట వరకు రైల్వే ట్రాక్‌వద్ద నుంచి భారీగా మట్టి కట్ట వేశారు. గతంలో వర్షాలు వచ్చినప్పుడు కిలోమీటరు వెడల్పుతో రెండు మూడు వంకల ద్వారా నీరు ప్రవహించేది. అయితే ఈ మట్టి కట్ట వేయడం వల్ల ఒక వంక నుంచే నీరు ప్రవహించి నీరు రోజుల తరబడి పొలాల్లో నిలిచిపోతోంది. గతంలో 33 వేల క్యూసెక్కుల వర్షపు నీరు వంక ద్వారా ప్రవహించేది. ప్రస్తుతం ఉన్న 8వేల క్యూసెక్కులకు మించి ప్రవాహానికి అనువుగా లేనందున దుగ్గనపల్లి, నవాబుపేట గ్రామాలకు చెందిన పొలాల్లో రోజుల తరబడి నాలుగు నుంచి ఆరు అడుగుల వరకు నీరు ఉండటంతో పొలాలు సాగుకు అనుకూలంగా లేకుండాపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ ఇంకా విస్తరిస్తే తమ గ్రామాలకు నష్టాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని బాధిత గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. 20 రోజుల క్రితం దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే బుడిద వల్ల దిగుబడి తగ్గి, నాణ్యత లేక, పంట అమ్ముకోలేక మోషే అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో దాల్మియా యాజమాన్యం తమ సమస్యలు పరిష్కరించకుండా విస్తరణ పనులు చేపట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు దాల్మియా పరిశ్రమ విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ మెజార్టీ ప్రజల్లో వ్యతిరేకత -
కేసీ కెనాల్ నీటి విడుదలకు చర్యలు
కడప సెవెన్‌రోడ్స్: కేసీ కెనాల్ ఆయకట్టుకు ఏప్రిల్ 15వ తేది వరకు నీరు అవసరమని జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీలో కోరడంతో ఆ విషయాన్ని తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లామని కేసీ కెనాల్ (స్పెషల్) సబ్ డివిజన్ మైదుకూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎస్.పుల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అందుకు తగు చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారని వెల్లడించారు. ఈనెల 22న సాక్షి దినపత్రికలో ‘ఇటు కేసీ చూడండి’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. జిల్లాలోని కేసీ కాలువ పరిధిలో ఉన్న పంటలకు ఇప్పటివరకు నీరు అందిస్తూనే ఉన్నామని తెలిపారు. అలాగే మైలవరం నుంచి కూడా ఆయకట్టుకు నీరందించే అంశాన్ని మైలవరం జలాశయ ఇంజనీరింగ్ అధికారులను సంప్రదిస్తామని పేర్కొన్నారు. సేవా దృక్పథం అలవరచుకోవాలి పులివెందుల రూరల్: ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం అలవరచుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళశారం కడప విద్యుత్ ఉద్యోగుల సామాజిక సేవా సంఘం తరపున వేంపల్లెలోని అమ్మ ఆశ్రమం, లింగాల సమీపంలోని దీనబంధు మానసిక వికలాంగుల ఆశ్రమానికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగుల సామాజిక సేవా సంఘం అధ్యక్షుడు కె.రమేష్ కార్యదర్శి జి.నాగశేషారెడ్డి, కోశాధికారి ఎన్.నరసింహులు, వేంపల్లె సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకట నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా శనగల కొనుగోలు కడప సెవెన్‌రోడ్స్: ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా జిల్లాలో శనగ, మిను ములు కొనుగోలు కోసం ఈనెల 19 నుంచి కేంద్రాలు ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ–క్రాప్ నమోదు చేయించుకున్న రైతుల నుంచి శనగ క్వింటాలుకు రూ. 5650, మినుములు క్వింటాలుకు రూ.7400 చొప్పున కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. ఈనెల 11 నుంచి సీఎం యాప్‌లో రిజిస్ట్రేషన్లకు అనుమతులు ఇచ్చామన్నారు. రైతులు ఇంకా ఎవరైనా తమ పేర్లు నమోదు చేసుకోకుంటే వెంటనే రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్లి నమోదు చేసుకోవాలన్నారు. ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతుల నుంచి మాత్రమే శనగ, మినుములు కొనుగోలు చేస్తామన్నారు. పంట నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలన్నారు. జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం, ముద్దనూరు, ఎర్రగుంట్ల, పెండ్లిమర్రి, పోరుమామిళ్ల, వీఎన్ పల్లె, వల్లూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, పులివెందుల, వేంపల్లె, వేముల, సింహాద్రిపురం, తొండూరు, కమలాపురంలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముగిసిన వేలం పాట ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని దినసరి కూరగాయల మార్కెట్‌తోపాటు వాహనాల పార్కింగ్‌కు సంబంధించి కమిషనర్ మల్లికార్జున మంగళవారం బహిరంగ వేలం పాట నిర్వహించారు. ఈ నెల 22న నిర్వహించాల్సిన వేలం పాట వాయిదా పడటంతో మంగళవారం నిర్వహించారు. దినసరి కూరగాయల మార్కెట్, వాహనాల పార్కింగ్‌కు మున్సిపాలిటీ రూ.1.29 కోట్లతో వేలం పాట ప్రారంభించగా షేక్ ముత్యాలపాడు గౌస్ బాషా రూ.1,60,80,000 పాట దక్కించుకున్నారు. జీఎస్టీతో కలిపి సదరు వ్యాపారి రూ.1,92,96,000 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే వేలం పాట రూ.1,33,75,415 పలికింది. అలాగే మాంసం, చేపల మార్కెట్‌కు సంబంధించి వేలం పాటను రూ.6,50,000 ప్రారంభించగా బి.నవీన్‌కుమార్ రెడ్డి రూ.6,66,000 పాటను దక్కించుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు వీరికి రుసుం వసూలు చేసుకునే హక్కు ఉంటుంది. రెవెన్యూ ఆఫీసర్ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాచుర్యం శూన్యం
భక్తకన్నప్ప గ్రామం..ఽభక్తకన్నప్ప విగ్రహం ● కన్నప్ప జన్మస్థలం ఇలా.. అరవై ముగ్గురు మహాశివభక్తులలో కన్నప్ప ఒకరు. తండ్రి నాగుడు, తల్లి తంచె. కన్నప్ప ద్వాపరయుగంలో అర్జునడే. ఆ యుగంలో శివుని అనుగ్రహం కోసం తపస్సు చేసి.. పాశుపాతాస్త్రం పొందారు. కలియుగంలో తిన్నడు (కన్నప్ప)గా ఉడుమూరులో జన్మించారు. కాలక్రమంలో ఉడుమూరు ఊటుకూరుగా మారింది. కన్నప్ప ప్రతిష్టించిన శివలింగం.. తన జన్మస్థలమైన ఊటుకూరులో ఉంది. అక్కడ శివాలయం వెలసింది. రాజంపేట: భక్త కన్నప్ప గొప్ప శివభక్తుడు. తెలుగు వాడు. ఆయనను మొదట్లో తిన్నడు అనే పేరుతో పిలిచే వారు. బోయ వంశస్తుడు. ఒక బోయరాజు కుమారుడు.ఒకనాడు అడవిదారి గుండా వెళ్తుండగా.. శివలింగం కనిపించింది. అప్పటి నుంచి ఆ శివలింగాన్ని తిన్నడు భక్తి శ్రద్ధలతో పూజిస్తూ.. తాను వేటాడి తెచ్చిన మాంసాన్నే నైవేద్యంగా సమర్పించే వాడు. ఒక సారి శివుడు తిన్నడు భక్తిని పరీక్షించ దలచి.. ఆయన పూజ చేయడానికి వచ్చినపుడు శివలింగంలోని ఒక కంటి నుంచి రక్తం కార్చడం మొదలు పెట్టారు. విగ్రహం కంటిలో నుంచి నీరు కారడం భరించలేని తిన్నడు బాణపు మొనతో తన కంటిని తీసి విగ్రహానికి అమర్చాడు. వెంటనే విగ్రహం రెండో కంటి నుంచి కూడా రక్తం కారడం ఆరంభమైంది. కాలి బొటనవేలును గుర్తుగా ఉంచి తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు. తిన్నడి నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు అతనికి ముక్తిని ప్రసాదించారు. నిన్ను దర్శించినా, చరిత్ర విన్నా.. పఠించినా సర్వపాపాలు తొలిగి.. అంత్యకాలంలో కై లాసప్రాప్తి పొందుతారని పలికి పరమశివుడు అంతర్థానమయ్యారు. అందువల్లనే తిన్నడికి.. కన్నప్ప అనే పేరు వచ్చింది. తిన్నడు దేవుడికి కన్ను ఇచ్చినందుకే కన్నప్ప అయ్యారు. ఆయన భక్తిని మెచ్చిన ప్రజలు.. భక్తకన్నప్పగా పిలుస్తున్నారు. ఆ శివలింగం ఉన్న ప్రాంతంలోనే శ్రీ కాళహస్తి క్షేత్రం వెలసినట్లు చరిత్ర చెబుతోంది. కన్నప్ప పుట్టిన ఊరు ఎక్కడా.. రాజంపేట పట్టణం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో కడప–రేణిగుంట జాతీయ రహదరిలో భక్తకన్నప్ప జన్మస్థలం అయిన ఊటుకూరు ఉంది. హైవే రోడ్డు పక్కనే కన్నప్ప ప్రతిష్టించిన శివలింగం ఉన్న పురాతన ఆలయం ఉంది. తిరుపతి, చైన్నెకు వెళ్లే ఏ వాహనంలో అయినా ఊటుకూరు (ఉడుమూరు)కు చేరుకోవచ్చు. వెలుగులోకి తీసుకొచ్చిన తమిళ వాసి.. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన పళనిస్వామి పెరియపురాణం ద్వారా భక్తకన్నప్ప జన్మస్థలం.. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మండలం ఊటుకూరు అని వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి విదితమే. అప్పటి నుంచి గ్రామస్తులు దాతల సహకారంతో.. గ్రామంలోని శివాలయం అభివృద్ధికి నడుంబిగించారు. భక్తకన్నప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అధికారిక గుర్తింపు కోసం ఎదురు చూపులు భక్తకన్నప్ప జన్మస్థలం అధికారిక గుర్తింపు కోసం ఎదురు చూస్తోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనమతులు ఎప్పుడు వస్తాయని ఇక్కడి ప్రాంతీయులు వేచి చూస్తున్నారు. భక్తకన్నప్ప జన్మస్థలం అభివృద్ధికి సహకరించాలని గతంలో శ్రీకాళహస్తి దేవస్థానం దృష్టికి వారు తీసుకెళ్లారు. అన్నమయ్యతో కన్నప్ప జన్మస్థలానికి అనుబంధం తాళ్లపాక అన్నమాచార్యులు తాత నారాయణయ్య చదువుకోవడానికి ఊటుకూరు(ఉడుమూరు)కు వచ్చారు. చదువు అబ్బక గురువు పెట్టే శిక్షలు భరించలేక చింతాలమ్మ గుడిలోని పుట్టలో చేయిపెట్టారు. పాము కరవలేదు కానీ, చింతాలమ్మ ప్రత్యక్షమైంది. ‘శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం వల్ల పరమభక్తుడు నీకు మనవునిగా పుడతారు’ అని ఆశీర్వదించింది. ఆ నారాయణయ్య మనువడే అన్నమాచార్యులు. అన్నమయ్య తండ్రి నారాయణసూరి, తల్లి లక్కమాంబ. అన్నమయ్య కూడా ఊటుకూరులో చిన్నతనంలో విద్యాభాస్యం చేశాడు. కలియుగ దైవం వెంకటేశ్వరునిపై 32 వేల కీర్తనలు రచించి, పద కవితా పితామహడుపేరు తెచ్చుకొని ధన్యుడయ్యారు. చింతాలమ్మ అమ్మవారి విగ్రహం ఇప్పటికీ ఊటుకూరు శివాలయంలో ఉంది. కన్నప్ప.. కాళహస్తికి ఎలా వెళ్లాడుతిన్నడు(కన్నప్ప) ఒకనాడు అడవిలో పందిని వేటాడుతూ ఊటుకూరు నుంచి అటవీ ప్రాంతంలో స్వర్ణముఖినది వరకు వెళ్లాడు. అక్కడ నేటి శ్రీకాళహస్తి దగ్గర శివలింగాన్ని దర్శించి, శివుని భక్తునిగా మారారు. తర్వాత తన రెండు కళ్లను సమర్పించి భక్తిని చాటుకున్నారు. ఆనాటి నుంచి శ్రీకాళహస్తిలో భక్తకన్నప్పకు.. స్వామివారి కన్న ముందే పూజ చేయడం ఆచారంగా వస్తోంది. ఏటా స్వామి వారి బ్రహ్మోత్సవాల సమయంలోనూ.. భక్తకన్నప్ప కొండపై తొలుత ధ్వజారోహణం చేసిన తర్వాత మరుసటి రోజు స్వామివారి ధ్వజారోహణ చేసి ఉత్సవాలు ప్రారంభిస్తారు. భక్తకన్నప్ప జన్మస్థలికి ఇప్పటి వరకు అధికార ముద్ర పడలేదు. కూటమి ప్రభుత్వం అయినా చొరవ చూపుతుందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. భక్తకన్నప్ప సినిమా తీస్తున్న మంచువిష్ణు బృందం సందర్శించిన క్రమంలో.. ఊటుకూరు మరోసారి తెరపైకి వచ్చింది. పెరియ పురాణం ద్వారా వెలుగులోకి జన్మస్థలి పట్టించుకోని ప్రభుత్వం కన్నెత్తి చూడని శ్రీకాళహస్తి దేవస్థానం భక్తుల ఆవేదన అరణ్య రోదన భక్తకన్నప్ప నడయాడిన ప్రదేశం గామంలో కన్నప్ప పూజించిన శివాలయం ఉంది. అలాగే ఊటుకూరు పరిసరాలు కన్నప్ప నడయాడిన ప్రాంతాలు. భక్తకన్నప్పకు శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో తొలిపూజ అనే సంప్రదాయం తరతరాలుగా వస్తోంది. –నాగా ఫృథ్వీపతిరెడ్డి, గ్రామపెద్ద, ఊటుకూరు చారిత్రక ఆధారాలు ఉన్నాయి కన్నప్ప ఇక్కడి వాడేనని అన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి శ్రీకాళహస్తికి అటవీ మార్గంలో చేరుకున్నారు. శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో తొలిపూజ మా గ్రామానికి చెందిన భక్తకన్నప్పకు అంటే మాలో ఎక్కడ లేని భక్తి ఉప్పొంగి వస్తుంది. –ఆర్.శ్రీనువాసురాజు, ఎంపీటీసీ, ఊటుకూరు -
క్షయ వ్యాధిగ్రస్తులపై వివక్ష తగదు
రాయచోటి అర్బన్: క్షయ వ్యాధిగ్రస్తులపై ఎవరూ వివక్ష చూపరాదని జాతీయ మానవ హక్కుల కమిషన్ కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, మానసిక ఆరోగ్యశాఖ, ఇతర శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం వర్చువల్‌గా రైల్వేకోడూరు జ్యోతికాలనీలో ఉన్న కుష్టు వ్యాధిగ్రస్తులతో మాట్లాడి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మరింత మెరుగ్గా కుష్టువ్యాధి నివారణ కార్యక్రమం అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ దేవసాగర్, డీఎంహెచ్ఓ కొండయ్య, అదనపు డీఎంహెచ్ఓ శైలజ, జిల్లా న్యూక్లిప్ మెడికల్ ఆఫీసర్ విష్ణువర్దన్‌రెడ్డి, జిల్లా ఆర్బీఎస్కే కో ఆర్డినేటర్ డాక్టర్ శివప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు
రాజంపేట: పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు 522 వర్ధంతి ఉత్సవాలను బుధవారం నుంచి నిర్వహించనున్నారు. టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. తాళ్లపాక, 108 అన్నమయ్య అడుగుల విగ్రహం వద్ద చలువ పందిళ్లు, స్వాగతతోరణాలు, కళాకారుల కోసం కళావేదికను సిద్ధం చేశారు. ఈ ఉత్సవాలు 29 వరకు కొనసాగనున్నాయి. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే ఆధ్యాత్మిక, సంగీత కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తాళ్లపాకను అభివృద్ధి చేయాలి తాళ్లపాక వైపు టీటీడీ అధికారులు కన్నెత్తి చూడటం లేదని తాళ్లపాక గ్రామస్తులు అదృష్టదీపుడు, మోహనరావు, నారయణ, బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగోతు రమేష్‌నాయుడులు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు మంగళవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిశారు. తిరుమలలో హుండీలో వచ్చిన ఆదాయం ఒక శాతం తాళ్లపాక అభివృద్ధి కోసం వ్యయం చేయాలన్నారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల నేపథ్యంలో ఈ నెల 5న తాళ్లపాకకు వస్తానని, అభివృద్ధి చేసే అంశంపై చర్చిస్తానని చైర్మన్ హామీ ఇచ్చారని తెలిపారు. తాళ్లపాక వైపు కన్నెత్తి చూడని టీటీడీ అధికారులు చైర్మన్‌కు ఫిర్యాదు చేసిన తాళ్లపాక గ్రామస్తులు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
చింతకొమ్మదిన్నె : కడప–చిత్తూరు జాతీయ రహదారిపై మండల పరిధిలోని మద్దిమడుగు బిడికి గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మేకల ఆదినారాయణ, కోర్ణ సూర్యనారాయణ అనే వ్యక్తులు మృతి చెందినట్లు చింతకొమ్మదిన్నె సీఐ శివశంకర్ నాయక్ తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం తెల్లవారుజామున రాయచోటి నుంచి కడపకు రాతి స్తంభాలు వేసుకుని ఏపీ04 బీఎక్స్7660 నెంబర్ గల ట్రాక్టరులో డ్రైవర్ వెంకట చలపతి, సహాయకుడు మేకల ఆదినారాయణ వస్తుండగా మద్దిమడుగు సుగాలి బిడికి గ్రామ సమీపంలో ఉదయం 5.45 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ట్రాక్టర్ ట్రాలీ వెనుక ఎడమవైపు గల టైరు పేలి ట్రాక్టర్ అదుపు తప్పింది. ఈ ఘటనతో ట్రాక్టర్ ఒక్కసారిగా వేగం తగ్గడంతో వెనుక ఏపీ05 టీడీ 6549 నెంబరుగల కంకర లోడుతో వస్తున్న టిప్పర్ డ్రైవర్ వేగాన్ని అదుపు చేసుకోలేక ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో గాయపడిన ట్రాక్టర్ డ్రైవర్ వెంకట చలపతి, టిప్పర్ డ్రైవర్ కోర్న సూర్యనారాయణ, ట్రాక్టర్ సహాయకుడు ఆదినారాయణను రోడ్డు పక్కకు తీసుకెళ్లి నీరు తాగిస్తుండగా కొద్దిసేపటికే ఎన్ఎల్02 బి 7879 నెంబరుగల శివాజీ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు డ్రైవర్ తురక శివరామకృష్ణ కడప నుంచి రాయచోటి వైపు అతివేగంగా నడుపుకుంటూ వచ్చి టిప్పర్ డ్రైవర్ కోన సూర్యనారాయణను ఢీకొట్టాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ట్రాక్టర్‌లోని సహాయకుడు, టిప్పర్ డ్రైవర్‌ను రిమ్స్‌కు తరలించారు. ఉదయం 7.36 గంటలకు ట్రాక్టర్ సహాయకుడు మేకల ఆదినారాయణ, ఉదయం 9.11 గంటలకు టిప్పర్ డ్రైవర్ కోర్న సూర్యనారాయణ మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసినట్లు చింతకొమ్మదిన్నె సీఐ తెలిపారు. -
గ్రామాల్లో నీటి సమస్య లేకుండా చూడాలి
కొండాపురం: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని జెడ్పీ సీఈఓ ఓబుళమ్మ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం గండికోట జలాశయం వద్ద ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సీపీ డబ్ల్యూ స్కీం నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గండికోట జలాశయం నుంచి కొండాపురం మండలంలోని తొమ్మిది గ్రామాలకు వెళ్లే సీపీడబ్ల్యూ స్కీం ద్వారా తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. ప్రస్తుతం నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా సీపీడబ్ల్యూ స్కీం పైపులైన్ డ్యామేజ్ కావడంతో ఆరు గ్రామాలకు తాగునీటి సౌకర్యం నిలిచిపోయిందని అధికారులు ఆమె దృష్టికి తీసికెళ్లారు. ప్రస్తుతం మండలంలోని కొండాపురం, గండ్లూరు, చౌటిపల్లె గ్రామాలకు ఈస్కీం నడుస్తున్నట్లు ఆమెకు వివరించారు. పునరావాస కేంద్రాలల్లో తాగునీటిసమస్య లేకుండా చూడాలన్నారు. ఎంపీడీఓ నాగప్రసాద్ ఆర్డబ్ల్యూఎస్ డీఈ మోహన్, ఏఈ ప్రసాద్, శంకర్‌రెడ్డి,పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. వైద్య సేవలు కొనసాగాయి కడప రూరల్: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో పేదల వైద్యానికి ఎలాంటి ఆటంకం కలగలేదని ఆ సంస్థ జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ బాల ఆంజనేయులు తెలిపారు. కాగా ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న వైద్యమిత్రలు సోమవారం విధులను బహిష్కరించి తమ సమస్యల పరిష్కారానికి నిరసనలు తెలిపిన విషయం విదితమే. జెడ్పీ సీఈఓ ఓబుళమ్మ -
బేకరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్
వేంపల్లె : స్థానిక వేంపల్లె నాలుగు రోడ్ల కూడలిలోని కడప రోడ్డులో ఉన్న బెంగళూరు బేకరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. దీంతో స్వీట్లకు సంబంధించిన మెటీరియల్, మిషనరీ దగ్ధమైంది. సంతోష్ కుమార్ అనే వ్యక్తి బతుకు దెరువు కోసం వృషభాచలేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన వాణిజ్య గదుల్లో బెంగళూరు బేకరీని నిర్వహిస్తున్నారు. రోజూ లాగే షాపునకు బీగాలు వేసి ఇంటికి వెళ్లారు. అయితే మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో బేకరీలో నుంచి దట్టమైన పొగలు రావడంతో సమీపంలో ఉన్న దుకాణఱదారుడు నాగ సుబ్బారావు చూసి బేకరీ యాజమాని సంతోష్ కుమార్ కు సమాచారమిచ్చారు. అలాగే అగ్నిమాపక శాఖకు ఫోన్ ద్వారా సమాచారమివ్వడంతో హుటాహుటిన అగ్నిమాపక శాఖాధికారి శివరామిరెడ్డి సంఘటన స్థలం వద్దకు తన సిబ్బందితో చేరుకుని మంటలను అదుపు చేశారు. బేకరీలోనే స్వీట్లు తయారీ చేస్తుండడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వచ్చినట్లు ఫైర్ అధికారి తెలిపారు. అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. -
డ్రైవర్‌పై దాడి చేసి.. కారును దొంగిలించారు
కడప అర్బన్ : హైదరాబాదు నుంచి కడపకు ఇన్నోవా కారును బాడుగకు తీసుకుని వచ్చి డ్రైవర్‌పై దాడి చేసి.. కారును దొంగిలించిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో మైనర్ బాలుడు ఉన్నాడు. మంగళవారం కడప డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు చిన్న చౌక్ సీఐ ఓబులేసు, ఎస్ఐలు రాజరాజేశ్వర్ రెడ్డి, రవికుమార్‌లతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. కడపకు చెందిన నూరుల్లా అలియాస్ నూర్, తాజుద్దీన్ అలియాస్ తాజ్ హైదరాబాదుకు వెళ్లి ఈనెల 15న రాత్రి ఇన్నోవా కారును కడపకు బాడుగకు మాట్లాడుకొని వచ్చారు. ఈనెల 16వ తేదీన కడప రింగ్ రోడ్డు వద్దకు రాగానే కారు డ్రైవర్‌పై దాడి చేసి అతని మెడలోని బంగారు గొలుసు, వెండి ఉంగరాలను దోచుకుని కారుతో నిందితులు పరారయ్యారు. కారు డ్రైవర్ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కడప చిన్నచౌక్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో కడపకు చెందిన పఠాన్ మర్ఫాద్ ఖాన్ అలియాస్ హోంవర్కర్ అలియాస్ లడ్డు మరో బాల నేరస్తునితో కలిసి డ్రైవర్ శ్రీకాంత్‌ను కొట్టి అతని వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు, మెడలో ఉన్న బంగారు గొలుసు, వెండి ఉంగరాలు తీసుకొని కారుతో పరారైనట్లు గుర్తించారు. జిల్లా ఎస్పీ ఈ.జీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు సీఐ ఓబులేసు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులపై నిఘా ఉంచారు. వాటర్ గండి రోడ్డులో కడప నకాష్‌కు చెందిన పఠాన్ మర్ఫాద్ ఖాన్ అలియాస్ హోంవర్కర్ అలియాస్ లడ్డును అరెస్ట్ చేశారు. మరో మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు నూరుల్లా అలియాస్ నూర్, తాజుద్దీన్ అలియాస్ తాజ్‌లు పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు ఒకరిని రిమాండ్‌కు తరలించారు. మరొకరిని పరిశీలనకు పంపించారు. ఇద్దరి అరెస్టు.. నిందితుల్లో ఒకరు మైనర్ పరారీలో ఇరువురు ప్రధాన నిందితులు వివరాలు వెల్లడించిన కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు -
అనుమానంతో భార్యను హతమార్చిన భర్త
● ఆపై తానూ ఆత్మహత్య ● వైఎస్సార్ జిల్లాలో ఘటన వల్లూరు : మద్యం మత్తులో అనుమానంతో భర్తే భార్యను హత్య చేసి ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వల్లూరు మండల పరిధిలోని అంబవరం ఎస్సీ కాలనీలో మంగళవా రం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు..అంబవరం ఎస్సీ కాలనీలో యర్రగుడిపాడుకు చెందిన చెన్న కేశవ, సుజాత దంపతులు నివసిస్తున్నారు. వీరికి సంతోష్ కుమార్ అనే వివాహమైన కుమారుడితో బాటు వరుణ్ కుమార్ (13) అనే కుమారుడు, స్వర్ణలత (8) అనే కుమార్తె ఉంది. చెన్న కేశవ (45) తాగుడుకు బానిసగా మారి మద్యం మత్తులో భార్య సుజాత (40)ను వేధిస్తుండేవాడు. సుజాతపై చెన్నకేశవ అనుమానం పెంచుకోవడంతో ఆమె 2 నెలల క్రితం తన పుట్టింటికి వెళ్లిపోయింది. నెల క్రితం ఆమె పెద్ద కుమారుని వివాహం జరగడంతో దాని కోసం ఆమె అంబవరం వచ్చింది. వివాహం జరిగిన తరువాత మళ్లీ తన అమ్మగారి ఇంటికి వెళ్లిపోయింది. కొడుకు అత్తగారి ఇంటి నుంచి కోడలికి ఉగాది సాంగ్యం తెస్తుండటంతో..తన కుమారుడు ఆమెను అంబవరానికి తీసుకువచ్చాడు. మంగళవారం మద్యం తాగిన చెన్న కేశవ ఇంటి ఆవరణలో సుజాతపై కొడవలితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చెన్న కేశవ కొడవలి పట్టుకుని క్రిష్ణాపురం, గంగాయపల్లె రైల్వేస్టేషన్ల మధ్య నల్లపురెడ్డిపల్లె రైల్వే గేటుకు కొద్ది దూరంలో గూడ్సు రైలు కింద ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
దంపతుల మృతికి కారకుడిని ఎలా వదిలేస్తారు?
ఎర్రగుంట్ల : దంపతుల మృతికి కారణమైన ఓమ్నీ వాహన డ్రైవర్‌ను పోలీసులు వదిలి పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున గ్రామస్తులు కలమల్ల పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వివరాలు ఇలా.. కలమల్ల గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం ఓమ్నీ వాహనం ఢీకొన్న సంఘటనలో వెంకటరాజారెడ్డి అనే ఆర్టీపీపీ కాంట్రాక్టు కార్మికుడు దుర్మరణం చెందగా అతని భార్య సుజాత తీవ్ర గాయాలతో కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ప్రమాదానికి కారణమైన ఓమ్నీ వాహన డ్రైవర్ వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రాత్రికి రాత్రే నిందితుడిని కూటమి పార్టీకి చెందిన ఆర్టీపీపీ ఉద్యోగి నారాయణస్వామి వచ్చి స్టేషన్ నుంచి విడిపించుకుని తీసుకెళ్లారు. ఇద్దరి మృతికి కారణమైన వాహన డ్రైవర్‌ను కలమల్ల ఎస్ఐ తిమోతి కూటమి నాయకుడి వెంట పంపించడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం కలమల్ల పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్ఐను కోరితే ఆయన తమను బెదిరించాడంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎస్ఐ తీరు ముందు నుంచి వివాదాస్పదంగా ఉందని, ఎవరు డబ్బులు ఇస్తే వారికి ఎస్ఐ వత్తాసు పలుకుతాడని ఆరోపించారు. గ్రామస్తులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి పోలీసు స్టేషన్ వద్దకు చేరుకుని గ్రామస్తులకు సంఘీభావం ప్రకటించారు. నిందితుడిని ఎలా వదిలేస్తారంటూ ఆయన మండిపడ్డారు. మృతుల కుటుంబానికి న్యాయం జరగకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న దంపతుల మృతదేహాలను సందర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాకు న్యాయం చేయండి.. తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఇద్దరు కుమార్తెలు తీవ్ర వేదనతో స్టేషన్ బయట బైఠాయించారు. తమకు న్యాయం చేయండి అంటూ బోరున విలపించారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన తమకు దిక్కు ఎవరు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఒకానొక దశలో గ్రామస్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో స్టేషన్ ఆవరణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిందితుడు వెంకటరమణ, అతన్ని విడిపించుకుని వెళ్లిన ఆర్టీపీపీ ఉద్యోగి నారాయణస్వామిపై చర్యలు తీసుకోవాలని మృతుల సమీప బంధువు లింగారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తిమోతి తెలిపారు. కలమల్లకు చేరుకున్న పోలీసు బలగాలు.. ఎస్ఐ తీరును నిరసిస్తూ కలమల్ల గ్రామస్తులు స్టేషన్ బయట బైఠాయించడంతో ఎస్ఐ తిమోతి స్టేషన్లోనే ఉండిపోయారు. వెంటనే కొండాపురం ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నుంచి సీఐలు మహమ్మద్ రఫీ, లింగప్ప, నరేష్‌బాబు, గోవిందరెడ్డి, గోపాల్‌రెడ్డి, దస్తగిరిలు, ఎస్ఐలు విద్యాసాగర్, ధనుంజయుడు, హృషికేశవరెడ్డి, పోలీసు సిబ్బంది స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితి అదుపు చేసేందుకు ప్రయత్నించారు. తర్వాత జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వర్లు కూడా స్టేషన్‌కు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. రోడ్డు ప్రమాదం ఘటనలో నిందితుడిని విడిపించుకుని వెళ్లిన కూటమి నాయకుడు కలమల్ల ఎస్ఐ తీరుపై గ్రామస్తుల మండిపాటు పోలీసు స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన గ్రామస్తులకు మద్దతు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి -
ఘనంగా గోవిందమాంబ ఆరాధన ఉత్సవాలు
బ్రహ్మంగారిమఠం : కాలజ్ఞాన ప్రభోదకర్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ధర్మపత్ని మాతా గోవిందమాంబ ఆరాధన మహోత్సవం సోమవారం బ్రహ్మంగారిమఠంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రామస్వామి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది మహిళలు అమ్మవారికి చీరె, సారెను అందించారు. ప్రత్యేక భజనలు, అన్నదానం కార్యక్రమాలు చేపట్టారు. రాత్రి వీరబ్రహ్మేంద్ర, గోవిందమాంబ సమేత ఉత్సవ గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ ఆధ్వర్యంలో మేనేజర్ ఈశ్వరాచారి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వపు మఠాధిపతి కుమారులు వెంకటాద్రిస్వామి, వీరభద్రస్వామి, దత్తస్వామి, మఠాధిపతి తమ్ముడు వీరభద్రస్వామి, దేవస్థాన సిబ్బంది, పుర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ముందస్తు ప్రణాళికతో వేసవి తాపాన్ని అధిగమిద్దాం
కడప సెవెన్‌రోడ్స్ : ముందస్తు చర్యలు చేపట్టి అధిక ఉష్ణోగ్రత, వేడిగాలుల కారణంగా వచ్చే వడదెబ్బ (సన్ స్ట్రోక్), డీహైడ్రేషన్ వంటి సమస్యలను అధిగమించాలని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో తాగునీటి కొరత, వేసవి వడగాడ్పులు, వడదెబ్బ, ముందస్తు జాగ్రత్త చర్యలపై జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, జిల్లా అదనపు వైద్యాధికారి ఉమామహేశ్వర కుమార్‌లతో కలిసి డీఆర్వో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ముందస్తుగానే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో దీనిపై ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు వేసవిలో అనవసరంగా బయటకు రాకూడదని.. అత్యవసర పనులు ఉంటే ఉదయం పూటనే పూర్తి చేసుకోవాలన్నారు. వడదెబ్బ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా గొడుగు వాడటం, తెలుపు రంగు, పలుచటి చేనేత వస్త్రాలను ధరించడం, తలకు టోపీ లేదా రుమాలు వాడటం, వేడిగాలులు తగలకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పక పాటించాలన్నారు. అన్ని మండలాల్లో ఎక్కడా కూడా తాగునీటి కొరత లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు స్థానిక ఏఎన్ఎంలతో సమన్వయం చేసుకుని వడగాడ్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతంలో షెడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించడంతో పాటు తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని డ్వామా అధికారులను ఆదేశించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వడగాడ్పులపై సీడీపీఓ, సూపర్వైజర్లు, అంగన్వాడీ వర్కర్ల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. అటవీ పరిసర ప్రాంతాల్లో వన్యప్రాణులు, పశు పక్ష్యాదులకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు కలగకుండా.. అక్కడక్కడా నీటి తొట్టెలు ఏర్పటు చేసి.. నీరు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలని.. అటవీశాఖాధికారులను ఆదేశించారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో వేసవి వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు మొదలైన జీవాలకు వడదెబ్బ తగలకుండా జాగ్రత్త చర్యలతో పాటు.. అన్ని పశు ఆరోగ్య కేంద్రాల వద్ద పశువులకు నీటి తొట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి, డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, అనుబంధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు -
బ్యాడ్మింటన్ చాంపియన్లుగా నాగరాజు– నితిన్ జోడీ
కడప అర్బన్ : న్యాయశాఖ ఉద్యోగుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేతలుగా నాగరాజు – నితిన్ జోడి నిలిచింది. కడప నగరం పక్కీరుపల్లెలోని పీవీఆర్ ఇండోర్ స్టేడియంలో న్యాయశాఖ ఉద్యోగుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు న్యాయమూర్తి రామారావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్. బాబా ఫక్రుద్దీన్ హాజరై విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్రీడాకారులు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని చక్కటి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారని అభినందించారు. కాగా టోర్నీలో రన్నరప్‌గా నరసింహారెడ్డి – ప్రభాకర్ రెడ్డి జోడీ నిలిచింది.రన్నరప్‌గా నరసింహారెడ్డి – ప్రభాకర్ రెడ్డి -
వెంకటేశ్వర డిగ్రీ కళాశాలపై దుష్ప్రచారం తగదు
ప్రొద్దుటూరు : స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమంలో నిర్వహిస్తున్న శ్రీవెంకటేశ్వర డిగ్రీ కళాశాలపై దుష్ప్రచారం చేయడం తగదని కళాశాల కరస్పాండెంట్ అరకటవేముల హరినారాయణ తెలిపారు. ఆయన సోమవారం తమ కళాశాలలో విలేకరులతో మాట్లాడుతూ కొంత మంది ఉద్దేశ పూర్వకంగా కళాశాలకు ఉన్న మంచి పేరును చెడగొడుతూ మూడో వ్యక్తికి లాభం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. విద్యాప్రమాణాల్లో మెరుగైన విధానాలను అవలంబిస్తున్నందుకు న్యాక్ బీ ప్లస్ గుర్తింపు వచ్చిందన్నారు. వీటి కారణంగానే ప్రభుత్వం తమ కళాశాలకు అటానమస్ హోదాను ఇచ్చిందని తెలిపారు. అడ్మిషన్లు చేసుకునే సమయంలో తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. నిబంధనల ప్రకారమే తమ కళాశాలకు ప్రత్యేక గుర్తింపు దక్కిందన్నారు. ఈ సందర్భంగా ఆయన అటానమస్, న్యాక్‌తోపాటు ఇతర సర్టిఫికెట్లను చూపించారు. ఇటీవలి కాలంలో విద్యార్థులకు ప్లేస్మెంట్ సెల్ ద్వారా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఉద్యోగాలు ఇప్పిస్తున్నామన్నారు. -
తమిళనాడులో రోడ్డు ప్రమాదం
జమ్మలమడుగు : ద్విచక్రవాహనాల్లో అరుణాచలం బయలుదేరిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన నలుగురు యువకులు ప్రముఖ శైవ క్షేత్రమైన తమిళనాడులోని తిరునామలై అరుణాచలానికి ద్విచక్ర వాహనాల్లో బయలుదేరారు. తమిళనాడులోని రాణికోట పట్టణ సమీపంలో వీరి ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన కంటైనర్ ఢీకొనడంతో గంజికుంట శేషాచలం(29) బడిగించల నాగేంద్ర(31) కిందపడ్డారు. అదే సమయంలో వెనుకవైపు నుంచి వచ్చిన కారు వీరిద్దరిపై నుంచి వెళ్లడంతో శేషాచలం, నాగేంద్ర అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గంజికుంట శేషాచలంకు వివాహమై ఒక కుమార్తె ఉంది. సోమవారం సాయంత్రం మృతదేహాలు స్వగ్రామమైన వేపరాలకు చేరాయి.వేపరాలకు చెందిన ఇద్దరి మృతి -
అరటి తోటలను పరిశీలించిన మంత్రి సవిత
లింగాల : లింగాల మండలం పార్నపల్లె గ్రామంలో శనివారం రాత్రి భారీ ఈదురు గాలులు, వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్న అరటి తోటలను సోమవారం రాష్ట్ర మంత్రి సవిత పరిశీలించారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నేర్జాంపల్లె గ్రామంలో పర్యటించి అక్కడ తీవ్రంగా దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి రైతులతో చర్చించారు. అనంతరం పార్నపల్లె గ్రామంలో దెబ్బతిన్న అరటి పంటలను, తమలపాకు తోటలను పరిశీలించారు. తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆమె రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్కేవ్యాలీ క్యాంపస్‌లో పోటాపోటీగా క్రికెట్ పోటీలు వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో పోటాపోటీగా క్రికెట్ పోటీలు జరిగాయి. సోమవారం ఆర్కేవ్యాలీ క్యాంపస్‌లోని ఆట స్థలంలో స్పోర్ట్స్ మీట్ క్రీడా పోటీలు నిర్వహించారు. దీంతో టీచింగ్, నాన్ టీచింగ్ మధ్య జరిగిన క్రికెట్ పోటీల్లో టెక్నికల్ టైగర్స్ జుట్టు విజయం సాధించింది. మొదట టాస్ గెలిచిన ఆర్కేవీ రైడర్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 10 ఓవర్లలో 78 పరుగులు చేయగా.. బ్యాటింగ్‌కు దిగిన టెక్నికల్ టైగర్స్ జుట్టు ఒక ఓవర్ మిగిలి ఉండగానే 79 పరుగులు చేసి విజయం సాధించింది. క్రీడా పోటీలలో గెలుపొందిన జట్టు సభ్యులను డైరెక్టర్ కుమార స్వామి గుప్తా, పరిపాలన అధికారి డాక్టర్ రవికుమార్ అభినందించారు. అలాగే గెలుపొందిన జట్టు సభ్యులకు బహుమతులు అందజేశారు. మత్తుపదార్థాలు సేవించే వారిపై డ్రోన్ కెమెరాలతో నిఘా కడప అర్బన్ : గంజాయి, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. జిల్లా ఎస్.పి. ఈ.జి. అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కడప నగరం, శివారులో గంజాయి తీసుకోవడం, అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది అత్యాధునిక డ్రోన్ కెమెరాల సాయంతో నిఘా ఉంచేలా చర్యలు చేపట్టారు. ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అనుమానాస్పదంగా సంచరించే వారిపై నిఘా ఉంచడంతో పాటు గంజాయిని సేవించే వారిని గుర్తించేందుకు విస్తత చర్యలు చేపట్టారు. సోమవారం నగరంలోని నకాష్, సాయిపేట, ఉక్కాయపల్లి, మార్కెట్‌యార్డ్, పాత కడప, మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న స్మశాన వాటిక, పరిసర ప్రాంతాలు, బుగ్గవంక పరివాహక ప్రాంతాలలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా విచారిస్తున్నారు. ఫ్యాక్షన్ జోన్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, స్పెషల్ పార్టీ సిబ్బంది, డ్రోన్ ఆపరేటర్ పాల్గొన్నారు. -
నూతన వధూవరులకు ఆశీర్వాదం
● అడుగడుగునా కన్నీటిగాథలే.. సాక్షి కడప : పచ్చని ఫలం చూస్తుండగానే నేలవాలింది.. కొండంత కష్టం నేలపాలైంది. ప్రకృతి దెబ్బకు గెలలతో కళకళలాడుతున్న అరటి అల నిలువునా ఒరిగిపోయింది. రెండు,మూడు రోజుల్లో కోత కోద్దామనుకున్న రైతుల ఆశల్ని గాలివాన తుంచేసింది. వారి కాయాకష్టాన్ని నేలపాలు చేస్తూ వారి జీవితాల్లో కోత విధించింది. రెండు రోజుల క్రితం వీచిన గాలివానకు పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో అరటి తోటలు ధ్వంసమయ్యాయి. నిండు కాపుతో ఉన్న చెట్లన్ని నేలపాలు కావడంతో రైతుల వేదన అరణ్య రోదనగా మారింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోకపోవడం మరింత బాధ కలిగిస్తోందని రైతులు వాపోయారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై వైఎస్ జగన్ ధ్వజం గాలులు, వర్షాలకు లింగాల మండలంలోని తాతిరెడ్డిపల్లె, కోమన్నూతలతోపాటు అనేక గ్రామాల రైతులు విలవిలలాడుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. దెబ్బతిన్న తోటలను పరిశీలించారు. వారి బా ధలను ఆలకించారు. అండగా ఉంటామని ధైర్యం నింపారు. ప్రభుత్వం మెడలు వంచైనా పరిహారం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని రైతులలో భరోసా నింపారు. కూటమి ప్రభుత్వ పాలన ఏడాద వుతోంది.. మరో మూడేళ్లలో తమ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే ఇన్సూరెన్స్‌తోపాటు పూర్తిస్థాయిలో ఇన్‌ఫుట్ సబ్సిడీ..గతంలో ఇచ్చిన రూ.50వేల తరహా లోనే నెల రోజుల్లోనే అందిస్తామని రైతన్నల్లో భరోసా నింపారు. తోటలను పరిశీలించిన మాజీ సీఎంఅకాల వర్షాలకుతోడు పెనుగాలులతో లింగాల మండలంలో దెబ్బతిన్న అరటి తోటలను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డిలతో కలిసి పరిశీలించారు. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల గ్రామాల్లో సూర్య నారాయణరెడ్డి, కేశవయ్య పొలాలతోపాటు దారి పొడవునా అరటి తోటలను పరిశీలించారు. తోటల పరిస్థితిని చూసి మాజీ సీఎం చలించిపోయారు. కూటమి సర్కారుపై కన్నెర్రలింగాల మండల పర్యటనలో రైతులు పడుతున్న బాధలను దగ్గరగా చూసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తుత కూటమి సర్కార్ నిరంకుశ వైఖరిని తప్పుబట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో ఉన్న ఉచిత పంటల భీమా విధానాన్ని రద్దు చేసి కొత్తగా బీమా ప్రీమియం చెల్లించకపోవడంతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ సీఎం దుయ్య బట్టారు. రైతులకు సంబంధించి సున్నా వడ్డీ లేదు, కనీసం రైతు భరోసా లాంటిది అందించడంలేదని ధ్వజమెత్తారు. కనీసం ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మండిపడ్డారు. మండు వేసవిలో ఎండలు అదరగొడుతున్నా.. మిట్ట మధ్యాహ్న సమయంలోనే రైతులతో మమేకమయ్యారు. రైతుల బాధలను పంచుకుంటూ.. పొలాల మధ్యనే రైతులతో మాట్లాడుతూ కదిలారు. వైఎస్ జగన్ పర్యటన విజయవంతంమాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటన విజయవంతమైంది. సోమవారం మధ్యాహ్నం ఇడుపులపాయ నుంచి తాడేపల్లికి బయలుదేరే సమయంలో హెలీప్యాడ్ వద్ద వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ లింగాల మీదుగా తాతిరెడ్డిపల్లెకు వెళుతుండగా రైతులు అడుగడుగునా ఆపి తమ పొలాలను చూపించారు. సూర్యనారాయణరెడ్డి తోట వద్దకు రాగానే ఇంద్రావతి, రాగమణి, లక్ష్మిదేవి, ఎం.లక్ష్మిదేవి, రాజేశ్వరి, వాలమ్మ తదితరులు జగన్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకుంటూ... ‘పంటంతా పోయింది.. రేపో మన్నాడో కోస్తామనుకునేలోపే పోయింది. ఉన్నఫలంగా గాలులు దెబ్బతీశాయి. మాకు దిక్కెవరంటూ’విలపించారు. కొందరు మహిళలు ‘మాకు ఇద్దరు ఆడబిడ్డలు అని ఒకరు, మాకు ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు ఎలా చదివించాలి, ఎలా బతికి బట్టకట్టాలంటూ బోరుమన్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి తీరా కోసే సమయంలో ఇలా పడిపోయిందని.. చివరకు కూలీ లు దొరకడం లేదు.. ఆలస్యం కావడంతో దళారులు రేట్లు తగ్గిస్తున్నారు.. ఈ వ్యవస్థను మార్చండి.. మమ్ములను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండని’జగన్ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. వారితోపాటు ఉన్న కొంతమంది తాతిరెడ్డిపల్లె రైతులు కూడా తమ బాధను మాజీ సీఎంకు వివరించారు. దళారుల రాజ్యం అధికంగా ఉందని.. ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదని.. ఇన్‌ఫుట్ సబ్సిడీ కూడా ఇవ్వకపోతే పెట్టుబడులు కూడా దక్కవని వాపోయారు. దీనికి స్పందించిన వైఎస్ జగన్.. ప్రభుత్వం ఇన్సూరెన్స్‌కు ప్రీమియం చెల్లించలేదు.. కనీసం రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మీకు న్యాయం జరిగేలా పోరాడుతామన్నారు. అంతేకాకుండా అక్కడే ఉన్న ఉద్యాన శాఖ అధికారులతోపాటు రెవెన్యూ, ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులను కూడా మాజీ సీఎం గట్టిగా ప్రశ్నించారు. చిన్నకుడాల క్రాస్ నుంచి లింగాల, తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల వరకు పొలాలను పరిశీలిస్తున్న సందర్భంలో ప్రతి రైతు కంట కన్నీరు కనిపించింది. ఈదురు గాలులకు నిలువునా నేలవాలిన తోటలు ప్రకృతి దెబ్బతీసినా..పట్టించుకోని ప్రభుత్వం లింగాల మండలంలో దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించిన వైఎస్ జగన్ వేంపల్లె : వేంపల్లె జెడ్పీటీసీ మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి కుమారుడికి వివాహమైన నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జెడ్పీటీసీ స్వగృహానికి వెళ్లి నూతన వధూవరులను ఆశ్వీరదించారు. ఇటీవల శ్రీలంకలో జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి కుమారుడైన సాయి భైరవ ప్రీతం కుమార్ రెడ్డి, వైష్ణవిల వివాహం జరిగింది. జిల్లా పర్యటనలో పులివెందులకు విచ్చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లింగాల మండలంలో పర్యటించి అక్కడి అరటి రైతులను పరామర్శించిన అనంతరం రోడ్డు మార్గాన పులివెందుల నుంచి వేంపల్లెకు విచ్చేశారు. అలాగే రవికుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పలకరించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, సుఽధీర్ కుమార్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, మేయర్ సురేష్ బాబు, వేంపల్లె వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు చంద్ర ఓబుల్ రెడ్డి, ఉపాధ్యక్షులు మునీర్‌బాషా, రవిశంకర్ గౌడ్, సర్పంచ్ ఆర్.శ్రీనివాసులు పాల్గొన్నారు. -
రేపు ప్రత్యేక విద్యుత్ అదాలత్
కడప కార్పొరేషన్ : ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్)లో వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈనెల 26వ తేది ఒంటిమిట్టలోని పారెస్ట్ గెస్ట్ హౌస్‌లో ఉదయం 11.30 గంటల నుంచి 1.30 గంటల వరకూ ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు కడప డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరిసేవ్యా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ న్యాయమూర్తి వి. శ్రీనివాస ఆంజనేయమూర్తి, సభ్యులు కె. రామమోహన్‌రావు, ఎస్.ఎల్ అంజనీ కుమార్, డబ్ల్యు. విజయలక్ష్మిలు హాజరై విద్యుత్ వినియోగదారుల నంంచి ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. వినియోగదారులు తమ దీర్ఘకాలిక సమస్యలను రాతమూలకంగా తెలిపి పరిష్కారం పొందాలని కోరారు. జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేయం – టీడీజీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి కడప రూరల్ : వైఎస్సార్ కడప జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి అన్నారు. సోమవారం స్థానిక తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమకు సంఖ్యా బలం లేదన్నారు. అందువలన తాము జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని స్పష్టం చేశారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, మాధవి రెడ్డి పాల్గొన్నారు. రాములోరి బ్రహ్మోత్సవాల బుక్లెట్ ఆవిష్కరణ ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం బోర్డు సమావేశం అనంతరం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఏప్రిల్ 6 నుంచి 14వ తేది వరకు శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఏప్రిల్ 9న హనుమంత వాహనం, 10న గరుడవాహనం, 11న సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణ జరుగుతుందని చెప్పారు. ఇందుకోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. -
ఏపీపీఎస్సీ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలోని ఐదు పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఏపీపీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే నాలుగు వివిధ రకాల నోటిఫికేషన్ సంబంధించిన పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్లోని డీఆర్వో ఛాంబర్లో ఏపీపీఎస్సీ పరీక్షల జిల్లా ప్రత్యేక అధికారులైన శ్రీనివాసులు(సెక్షన్ ఆఫీసర్), షేక్ ఖాసిం వల్లి తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో వివిధ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 25, 27 తేదీల్లో ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు , మధ్యాహ్నం 02.30 నుంచి సాయంత్రం 05.00 గంటల వరకు నిర్వహించనున్న పరీక్షలను పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. పరీక్ష కేంద్రాలలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కార్యకలాపాలకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. లైజెన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్ల, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేసి పరీక్షలను సజావుగా, ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా జరిగేలా చూడాలని సూచించారు. జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండల పరిధిలో 3, చాపాడు మండల పరిధిలో 1, ప్రొద్దుటూరు పట్టణ పరిధిలో 1 పరీక్షా కేంద్రంతో కలిపి మొత్తం 5 కేంద్రాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఏపీపీఎస్సీ, లైజెన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, లైన్ అఫ్ డిపార్టుమెంట్లు(పోలీస్, మెడికల్, ఏపీఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ పీడీసీఎల్ శాఖలు) సంబందిత అధికారులు పాల్గొన్నారు. డీఆర్వో విశ్వేశ్వర నాయుడు -
వైద్య మిత్రల బంద్.. రోగులకు ఇబ్బందులు
కడప రూరల్ : డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న వైద్య మిత్రలు, ఇతర సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం విధులను బహిష్కరించారు. స్ధానిక ఆ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వైద్య మిత్రలు విధులను బహిష్కరించడంతో ఉచిత వైద్యం కోసం నెట్వర్క్ ఆసుపత్రులకు వచ్చిన నిరుపేద రోగులు ఇబ్బందులు పడ్డారు. ‘వైద్యమిత్ర’లు లేక రోగుల అవస్ధలు.. జిల్లా వ్యాప్తంగా ‘వైద్య సేవ’ పరిధిలో మొత్తం 108 నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. ఈ ఆసుపత్రులకు ఒక రోజు దాదాపు 2 వేల మందికి పైగా వివిధ అనారోగ్య సమస్యలతో వస్తుంటారు. ఈ ఆసుపత్రుల్లో 105 మంది వైద్య మిత్రలు, ఐదుగురు టీఎల్ (టీమ్ లీడర్లు) పనిచేస్తున్నారు. ఆసుపత్రులకు వచ్చే రోగులు ముందుగా వైద్య మిత్రలను సంప్రదిస్తే, వారు ఆ వ్యక్తి వివరాలను పరిగణనలోకి తీసుకొని ఉచిత వైద్య సేవ కోసం రిజిస్ట్రేషన్ చేసి వైద్యుల వద్దకు తీసుకెళతారు. అక్కడ రోగిని డాక్టర్ పరీక్షించి వ్యాధిని నిర్ధారిస్తారు. అనంతరం సర్జరీ లాంటివి అవసరమైతే ఇన్ పేషెంట్‌గా అడ్మిట్ చేస్తారు. అవసరం లేకపోతే ఓపీ (ఔట్ పేషెంట్) కింద మందులు రాసిస్తారు. కాగా ఇన్ పేషెంట్‌గా చేరిన రోగి డిశ్చార్జ్ అయ్యే వరకు వారి బాధ్యతలను వైద్య మిత్రలు పర్యవేక్షిస్తారు. ఈ సిబ్బంది విధులను బహిష్కరించడంతో వైద్య మిత్రల ‘రోల్’ను ఆసుపత్రులకే అప్పగించారు. అయితే ఆసుపత్రుల వారు కొంత వరకు అత్యవసర కేసులను మాత్రమే తీసుకున్నారు. మిగతా వారిని పరీక్షించకుండా ఈ రోజు వైద్య సేవలు లేవు. ‘రేపు రండి’ అని చెప్పి పంపించేశారు. దీంతో అనారోగ్యం నుంచి కొంచైమెనా ఉపశమనం పొందుతామనే వారికి నిరాశ ఎదురైంది. ప్రధానంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాధిగ్రస్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కొంత మంది డాక్టర్‌కు ఫీజు చెల్లించి చూపించుకొని.. రాసిచ్చిన మందులు కొని వెళ్లారు. గత సోమవారం ఒక వారం క్రితం వైద్య మిత్రలు విధులను బహిష్కరించినప్పుడు కూడా పేదలు ఇబ్బందులు పడ్డారు. ఇంత జరుగుతున్నా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏమా త్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఎప్పుడూ ఇలాంటి సమస్యలు ఎదురు కాలేదు. ఇప్పుడెందుకు మాకీ ఇబ్బందులు అని పేదలు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌లో పనిచేస్తున్న వైద్య మిత్రలు, ఇతర సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని సోమవారం స్థానిక ఆ సంస్థ కార్యాలయం ఎదుట ఆరోగ్యమిత్ర కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు విజయ్ మాట్లాడుతూ వైద్య సేవ విభాగంలో తామంతా కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజీ కల్పించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించాలని పలు మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా తమకు న్యాయం జరగలేదన్నారు. కార్యక్రమంలో నాగార్జున రెడ్డి, సుబ్బరాజు, కవిత, భవిత, నాగరత్న పాల్గొన్నారు. ‘డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ’ సిబ్బంది విధుల బహిష్కరణ నిరుపేద రోగులకు తప్పని అవస్థలుచాలా మంది వెనక్కి వెళ్లారు.. నాకు ఇది వరకే గుండె ఆపరేషన్ జరిగింది. చెకప్‌కు వచ్చాను. నన్ను డాక్టర్లు చెకప్ చేశారు. ఇక్కడికి చాలా మంది వచ్చారు. బంద్ అని చెప్పడంతో వారంతా వెళ్లిపోయారు. అలాగే గతంలో ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు పొంది డిశ్చార్జ్ కాగానే ‘ఆసరా’ పథకం కింద కొంత డబ్బును ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పథకం లేదంటున్నారు. ప్రభుత్వం ‘ఆసరా’ను ఇవ్వడంతో పాటు పేదల వైద్యానికి ఇబ్బందులు లేకుండా చూడాలి. – వెంకటేష్, పులివెందులవైద్య సేవలు బంద్ అని చెప్పారు.. నరాల సమస్యతో బాధపడుతున్నాను. వైద్యం కోసం కడపకు వచ్చాను. ఈ రోజు వైద్య సేవలు లేవు బంద్, రేపు రమ్మని చెప్పారు వైద్య సేవలను నిలుపుదల చేస్తే మా లాంటి వారి పరిస్థితి ఏమి కావాలి. – కొండయ్య, పోరుమామిళ్ల -
నిత్యకల్యాణానికి విరాళాలు
బ్రహ్మంగారిమఠం : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, గోవింద మాంబల నిత్య కళ్యాణానికి భక్తులు విరాళాలు ఇస్తున్నారు. సోమవారం రాజుపాళెం మండలం అరకటవేముల గ్రామానికి చెందిన రాచంరెడ్డి లక్ష్మీనారాయణరెడ్డి, ధర్మపత్ని వెంకటసుబ్బమ్మ కుటుంబ సభ్యులతో స్వామి మాస కళ్యాణంకు కార్తిక శుద్ద ద్వాదశ రోజున జరిపే ఈ కళ్యాణంకు రూ.1,00,150లు నగదు అందజేశారు. ఇదే క్రమంలో దువ్వూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన మాబుషరీఫ్ ధర్మపత్ని రేష్మి రూ.1,00,116లు అందించారు. వీరికి స్థానిక పిట్ పర్సన్ శంకర్‌బాలాజీ,మఠం మేనేజర్ ఈశ్వరాచారిలు ప్రత్యేక పూజలు చేయించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా పిట్ పర్సన్ మాట్లాడుతూ.. నూతనంగా తలపెట్టిన వీరబ్రహ్మేంద్ర, గోవిందమాంబల మాస కార్తిక శుద్ద ద్వాదశ రోజున జరిపే కళ్యాణానికి భక్తులకు వారికి తోచిన విధంగా విరాళాలు ఇస్తుండటం హర్షనీయమన్నారు. -
సమస్యలకు పరిష్కారమేదీ ?
కడప సెవెన్‌రోడ్స్ : కలెక్టరేట్‌తోపాటు మండల తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు ప్రజల నుంచి కుప్పలు తెప్పలుగా అర్జీలు వస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 36,468 ఫిర్యాదులు అందాయి. ఈ ఒక్కరోజులోనే కలెక్టరేట్‌కు 221 ఫిర్యాదులు వచ్చాయి. కానీ సమస్యల పరిష్కారం కాగితాలకే పరిమితమైంది. క్షేత్ర స్థాయిలో ఏదో చిన్నపాటి సమస్యలు మినహా ఎక్కువ భాగం అపరిష్కృతంగానే ఉన్నాయి. అర్జీదారునికి ఎండార్స్మెంట్ జారీ చేసి సమస్యను పరిష్కరించామంటూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. జిల్లాలో గుర్తించిన టాప్–10 ప్రభుత్వశాఖలకు సంబంధించి వస్తున్న అర్జీలను పరిశీలిస్తే ఎక్కువ భాగం రెవెన్యూ, సర్వే విభాగాలకు సంబంఽధించిన సమస్యలే ఉన్నాయి. ఆ తర్వాత పంచాయతీరాజ్, పౌరసరఫరాలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, గృహ నిర్మాణం, పాఠశాల విద్యశాఖలకు సంబంధించిన ఫిర్యాదులు అధిక సంఖ్యలో వస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పనితీరు కారణంగా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వచ్చిన వాళ్లే మళ్లీమళ్లీ గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. సోమవారం వచ్చిన అర్జీలలో మచ్చుకు కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి. దారి లేక ఇక్కట్లు దళితులమైన మాకు స్మశానానికి వెళ్లే దారి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. మృతదేహాన్ని తీసుకు వెళ్లాలంటే మోకాళ్లలోతు దిగుబడే పంట పొలాల్లో నుంచి స్మశానానికి వెళ్లాల్సి వస్తోంది. ఊరికి 2 కిలోమీటర్ల దూరంలోని స్మశానానికి పంట పొలాలను దాటుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ విషయాన్ని తహసీల్దార్, ఆర్డీఓ, డీఆర్వోల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ప్రయోజనం కనిపించలేదు. కొంతమంది స్మశాన స్థలాన్ని కబ్జా చేసేందుకు వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసే ప్రయత్నాలు సాగిస్తున్నారు. మాకు దారి కల్పించడంతోపాటు చుట్టూ ప్రహారీ, షెల్టరు నిర్మించి బోరు వేయాలని కోరుతున్నాం. – లెనిన్ ప్రసాద్, తుమ్మలూరు, పెండ్లిమర్రి మండలం పెన్షన్ నిలిపివేశారు వేలిముద్రలు, ఐరిస్ నమోదు కాలేదని నాకు పెన్షన్ నిలిపివేశారు. ఎన్టీ రామారావు హయాం నుంచి పెన్షన్ పొందుతున్నాను. ప్రస్తుతం నా వయస్సు 92 సంవత్సరాలు. ఈ విషయాన్ని పలుమార్లు మండల, గ్రామ స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల ఆసరాతో కలెక్టర్‌కు చెప్పుకుంటే పెన్షన్ దక్కుతుందనే ఆశతో వచ్చాను. నా గోడు ఆలకించి పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నాను. – మద్దిక రంగమ్మ, దత్తాపురం, కొండాపురం మండలం నా భూమిని ఇతరుల పేరిట ఆన్లైన్ చేశారు మా పెద్దవాళ్ల నుంచి గ్రామ సర్వే నెంబరు 118/1, 118/3లో 7.56 ఎకరాల భూమి వారసత్వంగా సంక్రమించింది. మా నాయనమ్మ ఆ భూమిని 1950 జూన్ 23న మల్లెపల్లె వెంకట సుబ్బమ్మ వద్ద కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ భూమిని మేము ఎవరికీ విక్రయించలేదు. ఆ భూమిపై మాకు ఉన్న హక్కులను తెలియజేసే ఒరిజినల్ దస్తావేజులు, ఆర్‌హెచ్ నకలు, ఈసీలు, 1బీ, అడంగల్, పాసు పుస్తకాలు, పన్ను రశీదులు వంటి అన్ని ఆధారాలు మా వద్ద ఉన్నాయి. అయితే అందులో 68 సెంట్ల భూమిని గ్రామ సచివాలయ సర్వేయర్, వీఆర్వో కలిసి చల్లా రమాదేవి పేరిట ఆన్లైన్ చేశారు. హక్కుదారులమైన మా పేరిట ఆన్లైన్ చేయాలని తహసీల్దార్‌ను కోరాం. ఆయన స్పందించకపోవడంతో ఇక్కడికి వచ్చాం. – వేమిరెడ్డి సురేష్‌రెడ్డి, లేటపల్లె, కమలాపురం మండలం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న ప్రజలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న అర్జీలు పరిష్కారంలో అధికారుల కాకిలెక్కలు అర్జీదారులకు తప్పని అగచాట్లు -
ఆలయ భూముల ఆక్రమణదారులకు నోటీసులు
మైదుకూరు : స్థానిక శ్రీ పార్వతీ సమేత భీమేశ్వరస్వామి ఆలయ భూములను ఆక్రమించిన వారికి నోటీసులు ఇచ్చినట్టు దేవదాయశాఖ మైదుకూరు ఈఓ ఎంఎస్ ప్రసాదరావు సోమవారం తెలిపారు. స్థానిక ప్రొద్దుటూరు రోడ్డులో గత బుధవారం దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో పలు సర్వే నంబర్లలోని ఆలయ భూములను సర్వే చేసిన విషయం తెలిసిందే. దేవాలయం పేరుతో ఉన్న సర్వే నంబర్లు 1052/ఏ, 1052/బీ, 1052/సీలోని 4.46 ఎకరాల భూమికి హద్దులు నిర్ణయించినట్టు ఈఓ ప్రసాద్‌రావు తెలిపారు. ఈ భూములను 17 మంది ఆక్రమించినట్టు గుర్తించామని పేర్కొన్నారు. వారిలో సోమవారం సహాయ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ ఆదేశాలతో ప్రొద్దుటూరు ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో 15 మందికి నోటీసులు ఇచ్చామన్నారు. మిగిలిన ఇద్దరూ అందుబాటులో లేనందున వారికి మంగళవారం అందజేస్తామని చెప్పారు. నోటీసులు అందుకున్న వారు ఏడు రోజుల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాల్సి ఉందని, లేదంటే తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
9న బిషప్ పట్టాభిషేక ఉత్సవం
కడప కల్చరల్ : ఆర్సీఎం నూతన బిషప్ పట్టాభిషేక ఉత్సవాన్ని ఏప్రిల్ 9న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు కడప అపోస్తలిక పాలన అధికారి బిషప్ డాక్టర్ గాలి బాలి తెలిపారు. సోమవారం స్థానిక బిషప్ హౌస్‌లో వికర్ జనరల్ తలారి బాలరాజు అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో బిషప్ గాలి బాలి మాట్లాడుతూ కడప మరియాపురంలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్ గ్రౌండ్లో నూతన బిషప్ సగినాల పాల్ ప్రకాశ్ పట్టాభిషేక ఉత్సవం నిర్వహిస్తున్నామని, ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 30 మంది బిషప్‌లు పాల్గొంటారన్నారు, అంతేకాకుండా ఢిల్లీ నుంచి కథోలిగా ముఖ్య ప్రతినిధులు పాల్గొంటారని వివరించారు. ఉత్సవం నాడు ఉదయం 8 గంటలకు మరియాపురంలోని పాత చర్చి నుంచి బిషప్ ఊరేగింపు ప్రారంభమై, బిల్డప్ మీదుగా సెయింట్ జోసఫ్ హైస్కూల్ వేదిక వద్దకు చేరుతుందని వివరించారు. జిల్లాలోని ప్రతి విచారణల నుండి కథోలిక విశ్వాసులు మహోత్సవానికి తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మహోత్సవాన్ని క్రమశిక్షణ, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహిస్తామని, అందరూ భక్తి విశ్వాసాలతో పాల్గొని నూతన బిషప్‌ను సంపూర్ణ విశ్వాసంతో ఆహ్వానించి కార్యక్రమాన్నిజయప్రదం చేయాలని కోరారు.