రేపటి నుంచి శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్: కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేది నుంచి టైలరింగ్ (31 రోజులు), బ్యూటీ పార్లర్ (35 రోజులు), ఎంబ్రాయిడరీ (31 రోజులు)లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ ఆరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 45 ఏళ్లలోపు మహిళలు ఇందుకు అర్హులన్నారు. గ్రామీణ ప్రాంతాల వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. పూర్తి వివరాలకు 94409 05478, 99856 06866, 94409 33028 నెంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అనుబంధ విభాగ కమిటీల్లో కొందరిని నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా కల్లూరు రుద్రసేనారెడ్డి(జమ్మలమడుగు), జిల్ల రైతు విభాగం కార్యదర్శిగా పి.చెన్నారెడ్డి(బద్వేల్), జిల్లా ఎస్టీ విభాగం ఎగ్యిక్యూటివ్ సభ్యుడిగా వనం చిన్నగంగాధర్(ప్రొద్దుటూరు)లను నియమించారు.
కడప రూరల్: జోనల్ మలేరియా అధికారిగా బి.నిర్మల అలెగ్జాండర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన పదోన్నతిపై టెక్కలి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇన్నాళ్లు ఇంచార్జ్ జెడ్‌ఎంఓ గా శ్రీనివాసులు బాధ్యతలు నిర్వర్తించారు. ఈ స్థానంలోకి నిర్మల అలెగ్జాండర్ వచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ఈ నెల 28 నుంచి 2025–26 అల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి గౌస్ బాషా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ సర్వీ సెస్ విభాగాల ఉద్యోగులకు 19 విభాగాల్లో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, చెస్, హాకీ, టెబుల్ టెన్నిస్, క్రికెట్, కబడ్డీ తదితర క్రీడల్లో ఎంపికలు ఉంటాయన్నారు. ఈటోర్నమెంట్‌లో పాల్గొనే సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు (పురుషులు–మహిళలు) ఈ నెల 27 సాయంత్రం 5 గంటల లోపల తమ డిపార్ట్‌మెంట్ ఐడీ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని కడప డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 5 నుంచి 8 వరకు రాష్ట్ర స్థాయి ఎంపికలు జరుగుతాయని వివరించారు.
సుండుపల్లె: మండల పరిధిలోని పింఛా ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వంకలు, వాగుల ద్వారా ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు రావడంతో అధికారులు మంగళవారం రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల చేశశారు. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతంలోని పింఛా నది, ఎనుపోతుల వంక, తలకోన ఏటితో పాటు సమీపంలోని వంకల ద్వారా వర్షపు నీరు భారీగా చేరింది. ప్రాజెక్టులో నీటిసామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేస్తూ మిగతా నీటిని రెండు గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి విడుదల చేశశారు. మంగళవారం సాయంత్రానికి ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోనికి 1819 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తుండటంతో 1640 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు.
రేపటి నుంచి శిక్షణ


