
సాక్షి, వైఎస్సార్ కడప : దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్, వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వారితో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌డ్డి, వైఎస్సార్ అభిమానులు నివాళులర్పించారు.
వివేకానందరెడ్డి విగ్రహావిష్కరణ
ఇడుపులపాయ నుంచి బయల్దేరిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ భాకరాపురం చేరుకుని వైఎస్ వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. సొంత నియోజకవర్గం పులివెందుల అభివృద్ధిపై మధ్యాహ్నం 12 గంటలకు సీఎం సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం పులివెందుల నియోజకవర్గంలో నిర్వహించే వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment