సాక్షి, అమరావతి: రెండు రోజుల వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇడుపులపాయ హెలిప్యాడ్ వద్ద నేతలు, ప్రజలను కలిసిన సీఎం జగన్.. సమస్యలపై వారి నుంచి వినతులు స్వీకరిస్తూ ఆప్యాయంగా పలకరించారు. బుధవారం రాత్రి ఇక్కడి గెస్ట్‌హౌస్‌లో సీఎం వైఎస్ జగన్ బస చేస్తారు. అంతకుముందు కడప విమానాశ్రయంలో సీఎం జగన్‌కు జిల్లా కలెక్టర్ విజయరామ రాజు, ఎస్పీ అన్బురాజన్ ఎమ్మెల్యే లు రవీంద్రనాధ్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రయ్య, అధికారులు స్వాగతం పలికారు.
గురువారం తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని ఉదయం 9.35 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ నివాళులర్పిస్తారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. తార్వత పార్టీ నాయకులతో మాట్లాడి.. తిరిగి అక్కడి నుంచి బయల్దేరి, మధ్యాహ్నం 12.45కు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
చదవండి: విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు అండగా నిలవాలి: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment