ప్రతి మది మందిరమే! | - | Sakshi
Sakshi News home page

ప్రతి మది మందిరమే!

Sep 2 2023 1:48 AM | Updated on Sep 2 2023 12:55 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ప్రభుత్వ పథకాలు ఇప్పటికీ, ఎప్పటికీ మరువరానివి. ఫీజురీయింబర్స్‌మెంటు పథకం పేదల తలరాతలు మార్చివేసింది. అనారోగ్యపాలైతే వల్లకాడే దిక్కుగా ఉన్న పేదలకు ఆరోగ్యశ్రీ పథకంతో పునర్జన్మ కల్పించింది. ఇళ్లు లేని నిరుపేదలందరీకి గూడు కల్పించి వైఎస్సార్‌ వారి పాలిట కల్పవృక్షంలా నీడనిచ్చారు.

అణగారిన వర్గాల ఉన్నతి కోసం రిజర్వేషన్లు కల్పించి చరిత్రను తిరగరాశారు. అరుగాలం శ్రమించినా ఫలితం దక్కని రైతన్నకు దన్నుగా నిలిచారు. వృద్ధులకు పెద్దకొడుకుగా, వితంతువులకు సోదరుడిగా... ఇలా చెప్పుకుంటూపోతే ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాలకు ఏదో ప్రయోజనం కల్పించిన ఘనత ఆయన సొంతమైంది. ఓవైపు పన్నులు లేకుండా మరోవైపు సంక్షేమ పాలన చేపట్టి, ప్రభుత్వ పాలనంటే ఇలా ఉండాలని భవిష్యత్‌ తరాలకు ఆయన ఆదర్శప్రాయుడుగా నిలిచారు. వెరసి ప్రతి హృదయము మందిరమే అయ్యిందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.

అరుదైన నాయకుడు....
అచ్చతెలుగుదనం ఉట్టిపడే పంచెకట్టు, నడకలో ఠీవి, నమ్ముకున్న వారిని ఆదరించేగుణం, మాట తప్పని.. మడమ తిప్పని నైజం, అన్నదాతలు, కార్మిక, కర్షకుల కోసం పరితపించే గుణం, వీటన్నీంటికీ మించి మోముపై చిరునవ్వు... ఈ లక్షణాలన్నీ కలగలిపి పుణికి పుచ్చకున్న నాయకుడు దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి. అనంతపురం నుంచి అదిలాబాద్‌ వరకూ, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఆ పేరు ఉచ్ఛరిస్తేనే మనస్సు పులికిస్తుంది.

అందుకు కారణం రాజకీయాలకు అతీతంగా పేదలను ప్రేమించడం, వర్గాలకు, పార్టీలకు, ప్రాంతాలకతీతంగా సమగ్రాభివృద్ధి చేయాలనే తపన ఉండ డం. ప్రజల కోసం, ఎంతటి కష్టాన్నైనా భరించి సంక్షేమ పాలన చేపట్టడం. దాంతో మరుపురాని జ్ఞాప కంగా ప్రజానీకం గుండెలోతుల్లో కొలువయ్యారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతి శనివారం ప్రజానీకం ఘనంగా చేపట్టేందుకు సన్నహాలు చేసుకున్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు.

తండ్రిని మించి ఆరోగ్యశ్రీ అమలు...
పేదల మదిలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సుస్థిర స్థానం సంపాదించారు. నేను సైతం పేదల పక్షపాతినేని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రుజువు చేశారు. తండ్రి కంటే రెండు అడుగులు ముందుంటానని స్వతహాగా వెల్లడించిన ఆయన ఆరోగ్యశ్రీని మరింత పటిష్టం చేసే దిశగా చర్యలు చేపట్టారు. 3,255 రోగాలను వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పరిఽధిలోకి తీసుకొచ్చారు. రూ.5లక్షల వరకు ఆదాయం ఉన్న కుటుంబాలను సైతం ఆరోగ్యశ్రీ పథకంలోకి వర్తించేలా పథకాన్ని రూపొందించారు. మరోవైపు ఆరోగ్య ఆసరా పథకాన్ని తీసుకొచ్చారు. జబ్బుల బారిన పడిన వారి జీవనానికి ఎలాంటి ఆటంకం తలెత్తకుండా రోజుకు రూ.225 చెల్లించేలా పథక రచన చేశారు. ఇప్పటి వరకూ జిల్లాలో రూ.550 కోట్లు వ్యయం భరించి 2.6లక్షల మందికి వివిధ వైద్య సేవలు ఉచితంగా అందించారు. ఆరోగ్య ఆసరా ద్వారా 1.2లక్షల మందికి సుమారు రూ.58 కోట్లు పైగా అందజేశారు.

జిల్లా సమగ్రాభివృద్ధికి విశేష కృషి
డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు పాలకుల వివక్షతతో అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయిన కడప జిల్లా ఐదేళ్ల వైఎస్‌ హయాంలో సమగ్రాభివృద్ధి సాధించింది. ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకొచ్చేందుకు యోగి వేమన యూనివరిర్సటీ, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌, పశువైద్య విద్య కళాశాలలను నెలకొల్పారు. జిల్లా కేంద్రంలో రిమ్స్‌ వైద్య కళాశాల, 750 పడకల రిమ్స్‌ ఆస్పత్రి, దంత వైద్యశాల నిర్మించారు. ట్రిపుల్‌ ఐటీ, ఐజీ కార్ల్‌ (పశు పరిశోధన కేంద్రం), దాల్మియా సిమెంటు కర్మాగారం, గోవిందరాజా స్పిన్నింగ్‌ మిల్స్‌, భారతి సిమెంటు కర్మాగారం, సజ్జల పాలిమర్స్‌ లాంటి పరిశ్రమలను నెలకొల్పారు. జలయజ్ఞం ద్వారా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను పరుగులు పెట్టించారు.

సుమారు రూ. 12 వేల కోట్లతో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేశారు. గాలేరు– నగరి సుజల స్రవంతి, గండికోట కెనాల్‌, టన్నల్‌, గండికోట వరద కాల్వ, గండికోట ఎత్తిపోతల పథకాలను వైఎస్సార్‌ హయాంలో రూపొందించినవే. మైలవరం ఆదునీకరణ, సర్వరా యసాగర్‌, వామికొండ ప్రాజెక్టు, సీబీఆర్‌, పీబీసీ, పైడిపాళెం, వెలిగల్లు, తెలుగుగంగ ప్రాజెక్టు పనులు చకచకా సాగించారు. అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాదే తెలుగుగంగ పనులను పూర్తి చేసి కృష్ణా జిల్లాలతో బ్రహ్మంసాగర్‌లో నింపి ఘనత సాధించారు. మెట్ట ప్రాంతాలల్లో కృష్ణా జలాలు పారుతున్నాయంటే అది ఆనాటి వైఎస్సార్‌ చలువే. ఎవరు ఏది అడిగినా కాదనకుండా అభయమిచ్చారని జిల్లావాసులు ఇప్పటికీ కొనియాడుతున్నారు.

ప్రొద్దుటూరులోని శ్రీనివాసనగర్‌లో నివాసం ఉంటున్న పెనుగొండ రామశేషయ్య లారీ డ్రైవర్‌. ముగ్గురు కుమార్తెలు, అందరూ పనికి వెళ్తేగానీ పూట గడవని పరిస్థితి. 2008లో రామశేషయ్యకు గుండె నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. ప్రయివేట్‌ ఆస్పత్రికి వెళ్లగా గుండెపోటు అని ని ర్ధారించారు.ఆపరేషన్‌ చేయించాలన్నారు. చే తిలో చిల్లిగవ్వకూడా లేకపోవడంతో ఏమి చే యాలో పాలుపోలేని స్థితి.వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కింద తిరుపతి లోని స్విమ్స్‌ ఆస్పత్రిలో ఉచితంగా గుండె ఆపరేషన్‌ చేశారు. ఎన్ని జన్మలెత్తినా వైఎస్సార్‌ రుణం తీర్చుకోలేమని రామశేషయ్య అంటున్నారు.

ప్రొద్దుటూరులోని సంజీవనగర్‌లో నివాసం ఉంటున్న చౌటపల్లె ఆదినారాయణరెడ్డి దంపతులకు 2008లో ఒకే నెలలో ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌ చేశారు. ఏప్రిల్‌లో ఆయనకు గుండెపోటు రావడంతో స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక వైద్యం చేసి వెంటనే హైదరాబాద్‌కు రెఫర్‌ చేశారు. అక్కడి మెడిసిటి హాస్పిటల్‌లో ఆపరేషన్‌ చేసి స్టంట్‌ వేశారు. నేను ఆరోగ్యంగా ఉన్నానంటే ౖవైఎస్సార్‌ పెట్టిన భిక్షేనని ఆదినారాయణరెడ్డి చెబుతున్నారు. అదే నెలలో వెంకటసుబ్బమ్మకు ఆరోగ్యశ్రీ కింద థైరాయిడ్‌ ఆపరేషన్‌ జరిగింది. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌ చేయడంతో భార్యాభర్తలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement