
సాక్షి, విజయవాడ: పరిపాలనలో పారదర్శకత చూపి పేదల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఎమ్మెల్యే మల్లాది విష్టు అన్నారు. వైఎస్సార్ పదో వర్దంతి సందర్భంగా సోమవారం ఆయన వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరిగ్గా పదేళ్ల కిందట ఇదే రోజు రాష్ట్రం ఓ గొప్ప నేతను కోల్పోయిందన్నారు. బతికినంత కాలం ప్రజా సంక్షేమం కోసమే పరితపించిన గొప్ప వ్యక్తి వైఎస్సార్ అని కొనియాడారు.
కాగా, చంద్రబాబు పాలనకు వైఎస్సార్ పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించారని, అందుకే రాజన్న తనయుడికి మళ్లీ అధికారం ఇచ్చారన్నారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ ఆశయాల సాధనకు కృషి చేస్తామని విష్టు తెలిపారు.జననేత దార్శనికత ప్రతినిత్యం ప్రజల కళ్లకు కనిపించేందుకు వైఎస్సార్ పార్కులో రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పునః ప్రతిష్టింస్తున్నామని తెలిపారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు వైఎస్సార్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ ఆశయాల సాధనకు కృషి చేస్తామని విష్టు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎమ్యెల్యేతోపాటు, పలువురు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.