![Officials Check Protection Arrangements At Idupulapaya - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/31/Idupulapaya.jpg.webp?itok=1YHBRTPg)
సాక్షి, వైఎస్ఆర్ కడప: సెప్టెంబర్ 2న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా రేపు సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ హరికిరణ్, జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎస్పీ అన్బురాజన్, సబ్ కలెక్టర్ పృథ్వితేజ్ ఇడుపులపాయలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీ చేశారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలసి సీఎం జగన్ నివాళులు అర్పిస్తారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ ఘాట్, హెలిప్యాడ్ వద్ద ఆటోమేటిక్ శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్‌లను ఏర్పాటు చేశారు. (చదవండి: చెస్ విజేతలకు సీఎం జగన్ అభినందనలు)
ఘాట్ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి కోవిడ్ టెస్ట్ తప్పనిసరి అని.. లేదంటే అనుమతించేది లేదని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవి రెడ్డి శంకర్ రెడ్డి, చక్రాయపేట ఇన్చార్జ్ వైఎస్ కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment