visiting
-
Kumbh Mela: కుంభమేళాకు వెళితే వీటిని తప్పక చూడండి
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత వైభవంగా కుంభమేళా జరుగుతోంది. కోట్లాదిమంది త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. హిందూ పురాణాల ప్రకారం ప్రయాగ్‌రాజ్‌ను తీర్థరాజం అని అంటారు.ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమ తీరం నుండి అక్షయ వాటిక వరకు పలు మతపరమైన కట్టడాలు ఉన్నాయి. మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్ మరింత అందంగా ముస్తాబయ్యింది. నగరంలో పలు సాంస్కృతిక, చారిత్రక వారసత్వ కట్టడాలు కనిపిస్తాయి. ఇక్కడ కొలువుదీరిన శయన హనుమంతుడు, నాగవాసుకి, అలోపి ఆలయం, అక్షయ వాటికలు సందర్శకులను ఎంతగానో అలరిస్తాయి. ప్రయాగ్‌రాజ్‌లో ప్రసిద్ధ చారిత్రక ప్రదేశాలు కూడా ఉన్నాయి.ఖుస్రో బాగ్ఖుస్రో బాగ్.. ఇది ప్రయాగ్జార్లోని ఒక ప్రధాన చారిత్రక ప్రదేశం. ఇక్కడ జహంగీర్ కుమారుడు ఖుస్రో, సుల్తాన్ బేగం సమాధులు ఉన్నాయి. ఈ సమాధులు ఇసుకరాయితో నిర్మించిన మొఘల్ నిర్మాణ శైలికి చక్కని ఉదాహరణలు. ఈ తోటను జహంగీర్ ఆస్థాన కళాకారుడు అకా రజా తీర్చిదిద్దారు.అలహాబాద్ కోటఅలహాబాద్ కోటను మొఘల్ చక్రవర్తి అక్బర్ 1583లో నిర్మించాడు. ఈ కోట గంగా సంగమం దగ్గర యమునా నది ఒడ్డున నిర్మించారు. అక్బర్ ఈ కోటకు ఇలాహాబాద్ అని పేరు పెట్టాడు. అంటే అల్లా అనుగ్రహించినదని అర్థం. తరువాత ఇది అలహాబాద్‌గా మారింది. ఈ కోట అక్బర్ నిర్మించిన కోటలలో అతిపెద్దది.ఆనంద్ భవన్ఆనంద్ భవన్ అనేది నెహ్రూ కుటుంబపు నివాస గృహం. ఇది ఇప్పుడు మ్యూజియంగా మారింది. దీనిని మోతీలాల్ నెహ్రూ నిర్మించారు. తరువాత కాంగ్రెస్ కార్యకలాపాలకు స్థానిక ప్రధాన కార్యాలయంగా ఉండేది.భరద్వాజ ఆశ్రమంఇక్కడున్న ఒక ఆశ్రమాన్ని భరద్వాజ మహర్షి ఆశ్రమం అని చెబుతారు. పురాణాల ప్రకారం ఈ ఆశ్రమంలోనే భరద్వాజ మహర్షి పుష్పక విమానాన్ని నిర్మించారు.చంద్రశేఖర్ పార్క్1931లో ఇక్కడి ఒక పార్కులో స్వాతంత్య్ర సమరయోధుడు చంద్ర శేఖర్ ఆజాద్ బ్రిటిష్ వారి కాల్పుల్లో అమరుడయ్యాడు. ఆ సమయంలో ఆజాద్ వయసు కేవలం 24 ఏళ్లు. అప్పటి నుంచి ఈ పార్కును చంద్రశేఖర్ పార్కు అని అంటారు. ఇది కూడా చదవండి: Kumbh Mela: ప్రముఖుల రాక.. మరిన్ని మార్గదర్శకాలు జారీ -
Dussehra 2024 : అద్భుత దసరా వేడుక చూడాలంటే, కోరిక నెరవేరాలంటే!
దసరా వచ్చిందంటే ప్రపంచంలో ఎక్కడున్నా ఆగమేఘాల మీద సొంతూర్లకు చేరిపోతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా వేడుక చేసుకుంటారు. ఏమూలన ఉన్నా భారతీయులు అత్యంత ఉత్సాహంగా చేసుకునే ప్రముఖమైన పండుగ దసరా. మనలోని శక్తిని, శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన శక్తిని జాగృత పరిచే, దైవ అనుగ్రహంతో, మంత్ర శక్తితో, నియమబద్ధమైన జీవితంతో జాగృత పరిచే ఒక వ్రతం ఈ నవరాత్ర వ్రతం. తొమ్మిది రోజులు, తొమ్మిది రూపాల్లో జగన్మాతను ఆరాధిస్తారు. దేశవ్యాప్తంగా దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దసరా ఉత్సవాలు అనగానే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని బెజవాడ, వరంగల్‌తో పాటు కోల్‌కతా, మైసూరు, ఢిల్లీ, కులు ప్రాంతాలు గుర్తుకొస్తాయి. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవుల సందడి ఉండనే ఉంటుంది. అందుకే కోరిన కోర్కెలను నెరవేర్చే జగన్మాతను దర్శనంతో తరించే పుణ్యక్షేత్రాలను చూద్దాం.ఇంద్రకీలాద్రివిజయవాడలోని ఇంద్ర కీలాద్రిఫై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఉంటాయి. వివిధ రూపాల్లో అత్యంత మనోహరంగా అలంకరించే అమ్మవారిని దర్శించుకునేందుకు జనం క్యూ కడతారు. చివరి రోజు నిర్వహించే సంబరాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి ఆలయంలో కూడా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతాయి. ఇంకా శ్రీశైలం, తిరుపతి లాంటి పుణ్య క్షేత్రాలు దసరా పదిరోజులూ ప్రత్యేక సందడి ఉంటుంది.బతుకమ్మతెలంగాణాలో పూల పండగు బతుకమ్మ సంబరాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. మహాలయ అమావాస్య నుంచి మహర్నవమి వరకు గౌరీమాతను ఆరాధిస్తారు. బతుకమ్మ ఆటపాటలతో ఊరూ వాడా మార్మోగిపోతాయి. గునుగు, తంగేడు, బంతి, గుమ్మడి ఇలా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి అందంగా ముస్తాబైన ఆడబిడ్డలు ఆడిపాడతారు. రోజొక్క తీరు తొమ్మిదిరోజుల పాటు గౌరమ్మకుమొక్కి చివరి రోజు గంగలో నిమజ్జనం చేస్తారు.కోల్‌కతా దుర్గాపూజపశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో దుర్గా పూజ వేడుకలతో శరన్నవరాత్రులను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. . అమ్మవారు స్వయంగా ఇలకు దిగివస్తుందని ఇక్కడి వారి నమ్మకం. అందుకే పుట్టింటికి వచ్చి ఆడబిడ్డలా అపురూపంగా భావిస్తారు.సిలిగురి, జల్పైగురి, బీర్భూమ్ , బంకురా వంటి ప్రసిద్ధ ప్రదేశాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపు చూడాలంటే రెండు కళ్లూ చాలవు. మైసూర్ దసరా ఊరేగింపుకర్ణాటక రాష్ట్రంలో నవరాత్రి వేడుకలను విజయ దశమితో కలిపి పది రోజుల పాటు నిర్వహిస్తారు. ముఖ్యంగా 500 ఏళ్ల చరిత్ర గల మైసూరు దసరా వేడుకలు చాలా ప్రత్యేకం. మైసూర్ ప్యాలెస్ నుంచి బన్నీ మంటపా వరకు నిర్వహించే ఈ ఊరేగింపు అద్భుతంగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి కూడా పర్యటకులు భారీ సంఖ్యలో తరలివస్తారు. దసరా వేడుకలు కేవలం అమ్మవారి పూజలు మాత్రమే కాదు, నవరాత్రుల్లో తొమ్మిదో రోజున ఈ రాచఖడ్గాన్ని ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో కలిపి ఊరేగింపుగా తీసుకువచ్చి, పూజలు చేస్తారు.అహ్మదాబాద్దుర్గాపూజతో పాటు రాముడు, రావణుడిపై సంహరించిన సందర్భాన్ని పురస్కరించుకుని వైభవంగా దసరా నిర్వహిస్తారు. ప్రధానంగా లక్ష్మీ విలాస్ ప్యాలెస్ , నవ్లాఖీ మైదానంలో వేడుకులను ప్రధానంగా చెప్పుకోవచ్చు. దాండియా నృత్యాలు, సాంస్కతిక కార్యక్రమాలు ఘనంగా ఉంటాయి ముగింపు రోజు భారీ రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయడం ఇక్కడి ప్రత్యేకత.ఢిల్లీ, వారణాసిదేశ రాజధాని నగరం ఢిల్లీలోని రాంలీలా మైదాన్, ఎర్రకోట , సుభాష్ మైదాన్ వంటి ప్రదేశాల్లో దసరా వేడుకలు కన్నులపండువగా ఉంటాయి. రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఢిల్లీ, వారణాసి నగరాల్లో దుర్గాదేవిని ఆరాధిస్తారు. రాంలీలా మైదానంలో రావణుడి బొమ్మను దహనం చేస్తారు. వారణాసి నగరంలో చిన్నారులంతా పౌరాణిక పాత్రల వేషధారణలో అలరిస్తారు.వైష్ణో దేవి ఆలయ ఉత్సవాలుజమ్మూ కశ్మీర్ కత్రాలో ఉన్న వైష్ణో దేవి ఆలయంలో శరన్నవరాత్రులను చూసి తరించాల్సిందే. విద్యుద్దీప కాంతులతో సంబరాలు అంబరాన్నంటు తాయి. ఇక్కడ తొమ్మిదిరోజుల పాటు జగన్మాత ఆరాధనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంగ ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. హిమాచల్ ప్రదేశ్: హిమాచల్ ప్రదేశ్ కులు పట్టణంలో అట్టహాసంగా జరుగుతాయి దసరా వేడుకలు. అయితే ఇక్కడ వేడుస దసరా రోజు మొదలై ఏడు రోజుల పాటూ సాగుతుంది. రాజస్తాన్ : రాజస్థాన్‌లో రాజభవనంలో మొదలై, రాజకుటుంబ సభ్యులు జాతరగా మైదానానికి ఊరేగింపుగా తరలివస్తారు. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి బొమ్మలు దహనం చేసి బాణసంచా పేల్చుతారు. బస్తర్ దసరా: ఛత్తీస్ గఢ్ లో నిర్వహించే దసరానే ఉత్సవాలనే బస్తర్ దసరాగా ప్రసిద్ధి చెందింది. బస్తర్‌లోని గిరిజన ప్రాంత రక్షణ దేవత దంతేశ్వరి దేవిని ఆరాధిస్తారు. ఈ ప్రాంతంలో రథాల ఉరేగింపు చూసి తీరాల్సిందే.దేవభూమి, రఘునాధుని రథయాత్రహిమాచల్ ప్రదేశ్‌లో కులు దసరా వేడుకల గురించి తెలుసుకోవాలి. ఈ సంవత్సరం,అంతర్జాతీయ కులు దసరా అక్టోబర్ 13 నుండి 19 వరకుజరుగుతుంది. 7 రోజుల పండుగలో రథయాత్ర ప్రత్యేకం. మహాకుంభ్ పేరుతో నిర్వహించే రఘునాథుని రథయాత్ర వేలాది మంది భక్తులు తరలివస్తారు స్థానిక జానపద నృత్యాలతో పాటు వివిధ దేశాల సంస్కృతిని కూడా ప్రదర్శించేలా కార్యక్రమంలో ప్రతి సంవత్సరంలాగే అంతర్జాతీయ నృత్యోత్సవం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దాదాపు 365 స్థానిక దేవతలు, దేవతలు కులులో నివసిస్తున్నారని భూమిని దేవభూమి అని పిలుస్తారు. -
TG: బస్ భవన్‌ను సందర్శించిన ట్రైనీ ఐఏఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో అమలు చేస్తోన్న పలు కార్యక్రమాలను అధ్యయనం చేయడానికి ట్రైనీ ఐఏఎస్‌లు బస్ భవన్ని శుక్రవారం సందర్శించారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్యక్రమాలను వారికి వివరించారు. ఆర్టీసీ పనితీరు, ఉద్యోగుల సంక్షేమం, మహాలక్ష్మి పథకం అమలు, ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలపై అవగాహన కల్పించారు.తెలంగాణ కేడర్‌కి చెందిన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్‌లు ప్రస్తుతం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్-హెచ్ఆర్డీ)లో ప్రాక్టీకల్ ట్రైనింగ్ ప్రోగ్రాం శిక్షణ తీసుకుంటున్నారు. బస్ భవన్‌ను సందర్శించిన వారిలో ట్రైనీ ఐఏఎస్‌లు ఉమా హారతి, గరిమా నరులా, మనోజ్, మృణాల్, శంకేత్, అభిజ్ఞాన్, అజయ్‌లు ఉన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ముని శేఖర్, కృష్ణకాంత్‌లతో పాటు ఎంసీఆర్ హెచ్ఆర్డీ సీడీఎస్ సెంటర్ హెడ్ డాక్టర్ కందుకూరి ఉషారాణి, నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో డిజిటల్ బోధన సూపర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యావిధానం అద్భుతంగా ఉందని మెక్సికో దేశానికి చెందిన ఐబీ ప్రతినిధి ఆల్డో ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారియేట్) అమలులో భాగంగా ఐబీ ప్రతినిధులు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని వసతులు, పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆల్డో మంగళవారం కృష్ణా జిల్లాలోని పలు పాఠశాలలను సందర్శించారు. విజయవాడలోని ఎంకే బేగ్ మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్లోని గదులను, ఉపాధ్యాయులు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్ల వినియోగం, బోధనా విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్‌ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. బోధనా అంశాలపై విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు విన్నారు. అనంతరం ‘జగనన్న గోరుముద్ద’ను రుచి చూసి మధ్యాహ్న భోజనం వంట కార్మికులను అభినందించారు. అనంతరం కంకిపాడు మండలం పునాదిపాడు, ఈడుపుగల్లు జెడ్పీ హైసూ్కళ్లను సందర్శించారు. పునాదిపాడులో భౌతిక, జీవశాస్త్ర ప్రయోగశాలలు, ఇంగ్లిష్ ల్యాబ్, ఈడుపుగల్లులో డ్రాయింగ్ ప్రదర్శన, సైన్స్ ల్యాబ్‌ను పరిశీలించి ఉపాధ్యాయులను ప్రశంసించారు. పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన ‘ఇండియన్ యోగా’ ప్రత్యేక ప్రదర్శనకు ఆల్డో ముగ్దులయ్యారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి, అడ్మిషన్ విధానంపై ప్రిన్సిపల్‌ను ఆరా తీశారు. విద్యార్థి నుల వివరాలు, వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులకు వెళ్లి బోధనా అభ్యసన పద్ధతులను పరిశీలించారు. అక్కడ గిరిజన సంప్రదాయ నృత్యమైన థింసాను విద్యార్థినులు ప్రదర్శించారు. స్కూళ్ల సందర్శన అనంతరం ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దిందని, వసతుల కల్పనలో ఉన్నతమైన ప్రమాణాలు పాటించిందని ఆల్డో అభినందించారు. ఈ పర్యటనలో ఐబీ ప్రతినిధి వెంటఎన్టీఆర్, కృష్ణా జిల్లాల విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా, ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్ వై.గిరిబాబు యాదవ్, డీసీఈబీ సెక్రటరీ ఉమర్ అలీ ఉన్నారు. -
తుపాను, కరువు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందానికి సీఎం జగన్ విజ్ఞప్తి
-
ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే మరెన్నో చేస్తాం
సాక్షి, హైదరాబాద్: అంధులకు చారిత్రక ప్రదేశాల సందర్శన అనుభూతిని కలిగించాలన్న ఆలోచన ఆ హిస్టోరియన్లకు వచ్చింది. దీంతో పలువురు అంధులను ఒక చోటచేర్చి చార్మినార్‌కు దగ్గరలోని పైగా టూంబ్స్కు తీసుకువెళ్లి వారికి టూంబ్స్‌లోని అద్భుత కట్టడాలను పరిచయం చేశారు. వారంతా నిజాం కాలం నాటి పైగా టూంబ్స్ కట్టడాలను తాకుతూ అప్పటి నిర్మాణశైలి గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ వీడియోను మహ్మద్ హసీబ్ అహ్మద్ అనే చరిత్రకారుడు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తమకు ప్రభుత్వం సహకారం అందిస్తే ఇలాంటి ఈవెంట్లను మరిన్ని ఆర్గనైజ్ చేస్తామని మంత్రి కేటీఆర్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను కోరారు. చార్మినార్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉండే పైగా టూంబ్స్ నిజాం కాలం నాటి పైగా కుటుంబం పవిత్రతను తెలియజేస్తాయి. పైగా కుటుంబీకులు అప్పట్లో నిజాంకు అత్యంత విధేయులుగా వ్యవహరించారు. నిజాంకు మంత్రులుగా కూడా ఉన్నారు. హైదరాబాద్‌లో ఉన్న చారిత్రక ప్రదేశాల్లో ఆర్కిటెక్చర్ వండర్‌గా పైగా టూంబ్స్ ఖ్యాతికెక్కింది. Heritage Walk for Visually Impaired Individuals at Paigah Tombs. Small initiative by our team Beyond Hyderabad. @KTRBRS @arvindkumar_ias @Ravi_1836 @sselvan @tstourism spreading happiness. Looking for Govt support to implement more such events in coming days. @PaigahsofDeccan pic.twitter.com/ZLLeog3Ilu — Mohd haseeb ahmed (@historianhaseeb) November 27, 2023 -
మనుష్యులు చూడని ప్రాంతాలివే
-
విజయవాడలో సీఎం జగన్ పర్యటన
-
విజిటింగ్ ప్రొఫెసర్‌గా ‘అలీబాబా’ జాక్ మా
టోక్యో: చైనా ఈ–కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా కాలేజీ ప్రొఫెసర్‌గా మారనున్నారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకు చెందిన పరిశోధన సంస్థ టోక్యో కాలేజీలో విజిటింగ్ ప్రొఫెసర్ కానున్నారు. సుస్థిర వ్యవసాయం, ఆహారోత్పత్తి అంశంపై ఆయన పరిశోధనలు చేస్తారని వర్సిటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎంట్రప్రెన్యూర్షిప్, కార్పొరేట్ మేనేజ్మెంట్ తదితర రంగాల్లో తన అనుభవాన్ని విద్యార్థులు, అధ్యాపకులతో జాక్ మా పంచుకుంటారని తెలిపింది. 1990ల్లో ఈ– కామర్స్ సంస్థ అలీబాబాను స్థాపించిన జాక్ మా ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడు. -
జైలుకు పోవాలన్న ఆతృత వాళ్లకెందుకు?
సంగారెడ్డి టౌన్: జైలు.. ఈ పేరు వింటే అందరికీ గుర్తొచ్చేది ఖైదీలు. తెల్లని చొక్కా, దాని మీద నెంబరు.. తెల్ల నిక్కర్.. తెల్ల టోపీ. అయితే జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే వారికోసం తెలంగాణ ప్రభుత్వం 2016లో ‘ఫీల్ ది జైల్’ పేరుతో సంగారెడ్డిలో ప్రత్యేక కారాగారం ఏర్పాటు చేసింది. దేశంలోనే మొదటి మ్యూజియం, జైలు కూడా ఇదే. నిజాం కాలంలో.. నిజాం కాలంలో మొదట సంగారెడ్డి జైలు ఏరియాలో గుర్రపుశాల నిర్మించారు. ఆ తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం అదే ఏరియాలో 1.5 ఎకరాల్లో జైలు ఏర్పాటు చేశారు. ఇందులో పదుల సంఖ్యలో బ్యారక్‌లు ఉన్నాయి. ఒక్కోదానికి తెలంగాణ, మొఘల్, నిజాం చరిత్ర, భారత స్వాతంత్య్ర ఉద్యమ సంఘటనల పెయింటింగ్ వేయించారు. బ్రిటీష్ కాలం నాటి ఫొటోలు కూడా గదుల్లో ఏర్పాటు చేయించారు. టైపు రైటర్లు, అప్పటి రేడియోలు, పెన్నులు, వాల్ క్లాక్ లు, గంటలు.. ఇలా ప్రతీ వస్తువు ప్రదర్శన కోసం ఉంచారు. జైలు జీవితం అనుభవించాలనుకునే వారికి.. జైలు మ్యూజియమే కాదు.. జైలు జీవితాన్ని అనుభవించాలనుకునేవారికి అధికారులు సంగారెడ్డి జైలులో అవకాశం కల్పించారు. ఇందుకోసం రోజుకు రూ. 500 చెల్లించాలి. వారికి సాధారణ ఖైదీలాగే ఖాదీ దుస్తులు, చొక్కా, నిక్కర్ లేదా ప్యాంట్, ప్లేట్, గ్లాస్, మగ్గు, సబ్బు, మంచి భోజనం, నిద్రించేందుకు దుప్పట్లు తదితర సౌకర్యాలు కల్పించారు. టీ, టిఫిన్ ఇచ్చేవారు. యోగా, క్రమశిక్షణ నేర్పించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లాకప్‌లో ఉంచేవారు. గతంలో ఇక్కడ సినిమా షూటింగ్‌లు కూడా జరిగేవి. జాతిరత్నాలు సినిమాతో పాటు ఇతర సినిమాల్లో జైళ్ల్ల సీన్ల షుటింగ్ కూడా ఇక్కడే జరిగాయి. ఉదయం 6.30 నుంచే.. ఉదయం 6.30 గంటల నుంచి వ్యాయామం, యోగా శిక్షణ ఉండేది. 7.30 గంటలకు టీతో పాటు టిఫిన్, తర్వాత పరేడ్ 8 గంటల నుంచి 9.30 గంటల వరకు విద్యాదానం ఉండేది. 9.30 గంటలకు మ్యూజియం సూపర్వైజర్ రౌండ్‌కు వచ్చేవారు. ఉదయం 10:30 నుంచి 11:00 గంటల వరకు మధ్యాహ్న భోజనం వడ్డించేవారు. 11 గంటల నుంచి తిరిగి విద్యాదానం కొనసాగేది. మధ్యాహ్నం 12.30 గంటలకు టీ, 12.35 నుంచి 1.30 గంటల వరకు విశ్రాంతి. 1.30 నుంచి సాయంత్రం 4 గంట ల వరకు కంప్యూటర్ విద్య, ఇతర అంశాలపై అవ గాహన కల్పించేవారు. సాయంత్రం 4 నుంచి 4.30 గంటల వరకు యోగా, 4.30 గంటల నుంచి బ్యారక్‌ను శుభ్రం చేయడం వంటి ట్రైనింగ్ ఉండేది. సాయంత్రం 5.30 గంటలకు భోజనం ముగిసిన తర్వాత 6 గంటలకు లాకప్‌లో ఉంచేవారు. ఇలా ఇక్కడ సుమారు 50 మంది వరకు జైలు జీవితం కూడా గడిపారు. ఇదంతా గతం. కరోనా ఎఫెక్ట్‌తో జైలు మూతబడింది. ప్రస్తుతం భవనం శిథిలావస్థకు చేరింది. భారీ వర్షాలకు కాంపౌండ్ వాల్ పడిపోయింది. ప్రభుత్వం స్పందించి ఫీల్ ది జైల్‌ను పునరుద్ధరించాలని పర్యాటకులు కోరుతున్నారు. ఫీల్ ది జైల్ ప్రారంభించాలి శిథిలమైన ఫీల్ ది జైల్‌కు రిపేర్ చేయించాలి. పర్యాటకశాఖ స్పందించి చర్యలు తీసుకోవాలి. జైలు జీవితం అనుభవించాలనుకునే వారికి అవకాశం కల్పించాలి. ఈతరం వారికి జైలు అంటే ఎలా ఉంటుందో తెలియజేయాలి. – అఖిల్ యాదవ్, సంగారెడ్డి ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి సంగారెడ్డిలోని మ్యూజియం జైలును పునరుద్ధరించేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి. జైలు జీవితంపై యువతకు అవగాహన కల్పించాలి. చెడుమార్గంలో నడవకుండా, నిజజీవితంలో జైలు జీవితమంటే ఎంత నరకమో తెలియజేయాలి. – కూన వేణు, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు -
చంద్రబాబు ఎన్ని పర్యటనలు చేసిన ప్రజలు నమ్మరు: వైవీ సుబ్బారెడ్డి
-
హుజూరాబాద్ లో పర్యటించిన వైస్ షర్మిల
-
ఇడుపులపాయలో భద్రతా ఏర్పాట్లు పరిశీలన
సాక్షి, వైఎస్ఆర్ కడప: సెప్టెంబర్ 2న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా రేపు సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ హరికిరణ్, జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎస్పీ అన్బురాజన్, సబ్ కలెక్టర్ పృథ్వితేజ్ ఇడుపులపాయలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీ చేశారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలసి సీఎం జగన్ నివాళులు అర్పిస్తారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ ఘాట్, హెలిప్యాడ్ వద్ద ఆటోమేటిక్ శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్‌లను ఏర్పాటు చేశారు. (చదవండి: చెస్ విజేతలకు సీఎం జగన్ అభినందనలు) ఘాట్ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి కోవిడ్ టెస్ట్ తప్పనిసరి అని.. లేదంటే అనుమతించేది లేదని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవి రెడ్డి శంకర్ రెడ్డి, చక్రాయపేట ఇన్చార్జ్ వైఎస్ కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు, ఎల్లుండి(రెండు రోజులు) వైఎస్సార్ కడప జిల్లాను పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ నివాళులు అర్పించనున్నారు.(భూమనను ఫోన్లో పరామర్శించిన సీఎం జగన్) సీఎం వైఎస్ జగన్ జిల్లా పర్యటన షెడ్యూల్.. మొదటి రోజు: 01-09-2020 (మంగళవారం): సాయంత్రం 4 గంటలకు సీఎం వైఎస్ జగన్ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కడప బయలుదేరనున్నారు. సాయంత్రం 4. 45 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. సాయంత్రం 5.15 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్ ఎస్టేట్ చేరుకోని సీఎం జగన్ అక్కడే రాత్రి బస చేస్తారు. రెండో రోజు: 02.09.2020 (బుధవారం): ఉదయం 09.45 గంటల నుంచి 10.30 వరకూ వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం చేరుకోనున్నారు. తాడేపల్లి: సెప్టెంబర్ 2వ తేదీన స్వర్గీయ డా.వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి పార్టీ శ్రేణులు ఘన నివాళులు అర్పించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. దివంగత మహానేత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి జ్ఞాపకాలను అన్ని వర్గాల ప్రజలు స్మరించుకునే విధంగా సెప్టెంబర్ 2న నియోజకవర్గ పరిధిలోని అన్ని స్థాయిలలో ఉదయం 9గంటలకు నివాళులు అర్పించాలని సూచించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులని సమన్వయ పరుచుకొని పలు సేవా కార్యక్రమములు నిర్వహించాలని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని డా.వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు నూతనంగా రంగులు వేయించి, పూలతో అలంకరించాలన్నారు. కరోనా నిబంధనలు పాటించి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. పార్లమెంట్, జిల్లా పార్టీ అధ్యక్షులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నాయకులకు ఆయన సూచనలు ఇచ్చారు. -
'పాకిస్తాన్లో క్రికెట్ కంటే నాకు ప్రాణం ముఖ్యం'
పాకిస్తాన్లో క్రికెట్ ఆడటం కన్నా తనకు తన ప్రాణాలు ముఖ్యం అంటూ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు లేఖ రాశాడు. దీంతో అతని లేఖ క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. పాకిస్తాన్లో శ్రీలంక క్రికెటర్లపై దాడి తరువాత ఆ దేశంలో పర్యటించేందుకు ఏ జట్టు ముందుకు రావడం లేదు. ఆ ఘటన జరిగి 10 ఏళ్లు కావస్తున్నా భద్రతా పరమైన కారణాలు చూపుతూ ఏ దేశం కూడా పాక్‌లో పర్యటించడం లేదు. దీంతో తమ దేశంలో జరగాల్సిన మ్యాచులను ఇప్పటి వరకు పాకిస్తాన్ తటస్థ వేదికలపై నిర్వహిస్తూ వస్తోంది. ఇటీవల శ్రీలంక జట్టు పాక్‌లో పర్యటించింది. అయితే ఆ పర్యటనకు శ్రీలంక సీనియర్ క్రికెటర్లు దూరంగా ఉండడంతో జూనియర్ జట్టునే పాక్‌కు పంపించింది. జనవరి 14 నుంచి మూడు టీ20లు, ఒక వన్డే, రెండు టెస్టుల సిరీస్‌ని పాకిస్తాన్లో బంగ్లా, పాక్ జట్లు ఆడేలా షెడ్యూల్ రూపొందించారు. అయితే తాజాగా ముష్ఫికర్ తీసుకున్న నిర్ణయంతో అతని దారిలోనే మరికొంతమంది క్రికెటర్లు పయనించే అవకాశం ఉంది. ముష్ఫికర్ రహీమ్ మరో అడుగు కూడా ముందుకేసి బీసీబీ(బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు)కి లేఖ రాసి మరీ తాను వెళ్లడం కుదరదని స్పష్టం చేశారు. చదవండి: నువ్వు లేకుండా క్రికెట్ ఎలా ఆడాలి? 'పాకిస్తాన్లో భద్రతపై మా ఫ్యామిలీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకే నేను పాక్ పర్యటనకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. గతంలో కంటే పాక్‌లో ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గానే ఉంది. కానీ.. క్రికెట్ కంటే జీవితం ముఖ్యం కదా..? పాక్‌లో పిచ్‌లు బ్యాటింగ్‌కి బాగా అనుకూలిస్తుంటాయి. సిరీస్ జరుగుతుంటే.. ఇంట్లో కూర్చోవడం కష్టమే. కానీ.. తప్పట్లేదు' అని రహీమ్ ఆలేఖలో పేర్కొన్నాడు. ఇక రహీమ్ బాటలోనే మరికొంతమంది క్రికెటర్లు నడిచే అవకాశం ఉంది. చదవండి: సచిన్, ద్రవిడ్‌ల తర్వాత ముష్ఫికర్.. గతంలో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై పాక్‌లో ఉగ్రదాడి జరిగింది. అప్పుడు ఆ జట్టులోని చాలా మంది క్రికెటర్లకి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ ఘటన తర్వాత ఏ క్రికెట్ జట్టు కూడా పాక్ గడ్డపై పర్యటించేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. గత ఏడాది చివర్లో మళ్లీ శ్రీలంక జట్టు పాక్‌లో పర్యటించింది. అయినా బంగ్లాదేశ్ క్రికెటర్లు మాత్రం వెనుకంజ వేస్తున్నారు. దీంతో పాకిస్తాన్లో బంగ్లాదేశ్ పర్యటించడం అనుమానంగా మారింది. బీసీబీ పాకిస్థాన్ సిరీస్‌పై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. -
మెడికల్ కాలేజీలకు విజిటింగ్ ఫ్యాకల్టీ
సాక్షి, హైదరాబాద్: ► డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి.. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ) చైర్మన్‌గా ఉన్నారు. అనేక అంతర్జాతీయ మెడికల్ సంస్థల్లో సభ్యులుగా, డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. నిత్యం అంతర్జాతీయ వైద్య వేదికలపై ప్రసంగిస్తుంటారు. అధునాతన వైద్యరంగంలో నూతన పంథాలను ప్రవేశపెట్టారు. ► డాక్టర్ సోమరాజు.. కేర్ వ్యవస్థాపకుడు. వైద్య రంగంలో ఎంతో అనుభవం గడించారు. ప్రొఫెసర్‌గా సేవలందించారు. అధునాతన వైద్య పరిజ్ఞానాన్ని అందించారు. అంతర్జాతీయస్థాయిలో వైద్య వేదికలపై సెమినార్లు ఇచ్చారు. ► డాక్టర్ గురువారెడ్డి.. సన్‌షైన్ వ్యవస్థాపకుడు. వైద్యరంగంలో వచ్చిన అనేక మార్పులను అందిపుచ్చుకొని ఆసుపత్రిని తీర్చిదిద్దారు. దేశవిదేశాల్లో వైద్యరంగంలో వచ్చిన మార్పులు ఒడిసిపట్టుకున్నారు. ఇలాంటి ప్రముఖులు తెలంగాణలో చాలామంది ఉన్నారు. అధునాతన వైద్య పరిజ్ఞానా న్ని, పరికరాలను తమ ఆసుపత్రుల్లో ప్రవేశపెట్టారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. కొత్తగా వచ్చే ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులకు విజిటింగ్ ఫ్యాకల్టీగా వీరే బోధిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ఆలోచనను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)కు చెందిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (బీవోజీ) ఆచరణలోకి తెచి్చంది. ఈ మేరకు తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ప్రైవేటు రంగంలో సేవలందిస్తున్న ప్రముఖ వైద్యులను ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు ‘విజిటింగ్ ఫ్యాకలీ్ట’గా నియమించుకునే వెసులుబాటు కలి్పస్తూ నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉండే ప్రముఖ వైద్యులను కూడా నియమించుకోవడానికి అనుమతించింది. ప్రస్తుతం దేశంలో మెడికల్ కాలేజీల్లో విజిటింగ్ ఫ్యాకల్టీ అనే అంశం లేదు. 30 ఏళ్ల క్రితం విజిటింగ్ ఫ్యాకల్టీ వ్యవస్థ ఉండగా, దాన్ని ఇప్పుడు తిరిగి ప్రవేశపెట్టారు. ప్రైవేట్ లేదా ప్రభుత్వ మెడికల్ కాలేజీ విజిటింగ్ ఫ్యాకలీ్టని నియమించుకోవచ్చు, కానీ ఈ నియామకం ప్రస్తుతం ఉన్న అధ్యాపకుల సంఖ్యలో 50 శాతానికి మించకూడదు. పెరగనున్న ప్రతిష్ట.. రాష్ట్రంలో 21 ప్రైవేటు మెడికల్ కాలేజీలు, 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయి. వాటిల్లో ఎంబీబీఎస్ సీట్లు 4,790 ఉండగా, పీజీ మెడికల్ సీట్లు 1,400 ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2,358 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండాల్సి ఉండగా, 1,051 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 1,307 ఖాళీలున్నాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చాలాచోట్ల బోధనా సిబ్బంది సామర్థ్యంపై విమర్శలున్నాయి. రోజువారీ వైద్యరంగంలో వస్తున్న మార్పులను, అధునాతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవట్లేదన్న విమర్శలున్నాయి. దీంతో వైద్య విద్య నాసిరకంగా ఉంటోందన్న ఆరోపణలున్నాయి. దీంతో కొన్ని మెడికల్ కాలేజీల్లో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపట్లేదు. దీంతో ప్రముఖ ప్రైవేటు వైద్యులను విజిటింగ్ ఫ్యాకలీ్టగా తీసుకుంటే ఆయా కాలేజీల్లో వైద్య బోధన మెరుగుపడుతుందని ఎంసీఐ ఉద్దేశంగా చెబుతున్నారు. ప్రముఖ వైద్యుల పేర్లను ఆయా కాలేజీల వెబ్సైట్లలో పెట్టడం ద్వారా వాటి ప్రతిష్ట పెరుగుతుందని భావిస్తున్నారు. నెలకు నాలుగు క్లాసులు, ఒక్కో క్లాసు మూడు గంటలు ఉండేలా చేయాలని బీవోజీ నిర్ణయించింది. విజిటింగ్ ఫ్యాకలీ్టకి ఎంత పారితోíÙకం ఇవ్వాలనేది ఆయా కాలేజీల ఇష్టానికే వదిలేశారు. విజిటింగ్ ఫ్యాకల్టీ తప్పనిసరిగా పీజీ పూర్తి చేసి, సంబంధిత స్పెషాలిటీలో కనీసం 8 ఏళ్లు అనుభవం కలిగి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 70 సంవత్సరాలుగా నిర్ధారించారు. విజిటింగ్ ఫ్యాకల్టీని మొదట ఏడాది కాలానికి నియమిస్తారు. తర్వాత మరో ఏడాది పొడిగించుకోవచ్చు. మెడికల్ కాలేజీ సీట్లను కాపాడుకోవడంలో విజిటింగ్ ఫ్యాకలీ్టని పరిగణనలోకి తీసుకోరు. వైద్యవిద్య ప్రమాణాలు పెరుగుతాయి ప్రైవేటు రంగంలో ప్రముఖులైన దేశ విదేశీ వైద్యులను మెడికల్ కాలేజీల్లో విజిటింగ్ ఫ్యాకలీ్టగా నియమించడం వల్ల వైద్యవిద్య నాణ్యత పెరుగుతుంది. అధునాతన పరిజ్ఞానాన్ని విద్యార్థులు, రెగ్యులర్ ఫ్యాకలీ్టకి కూడా అందించడానికి వీలవుతుంది. ఆయా మెడికల్ కాలేజీల ప్రతిష్ట కూడా పెరుగుతుంది. – డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎంతోమంది ప్రముఖులున్నారు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో వైద్య విద్య నాణ్యత మరింత పెరుగుతుంది. డాక్టర్ సోమరాజు, డాక్టర్ శాంతారాం, డాక్టర్ మానస్ పాణిగ్రాహి, డాక్టర్ బాలాంబ వంటి ప్రముఖ వైద్యులు విజిటింగ్ ఫ్యాకల్టీగా వస్తే ఆయా స్పెషాలిటీల్లో విద్యార్థులకు అత్యంత నాణ్యమైన వైద్య విద్య అందించడానికి వీలు కలుగుతుంది. – డాక్టర్ పుట్టా శ్రీనివాస్, డైరెక్టర్, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ -
ఈ 10 దేశాలు, నగరాలు తప్పక చూడాల్సిందే!
న్యూఢిల్లీ: 2020 సంవత్సరంలో ప్రపంచంలో తిరగాల్సిన పది దేశాలు, పది ప్రాంతాలు, పది నగరాల జాబితాను ‘లోన్లీ ప్లానెట్’ పుస్తకం విడుదల చేసింది. తప్పకుండా సందర్శించాల్సిన పది దేశాల్లో మొదటి స్థానం భూటాన్‌కు దక్కగా రెండో స్థానం ఇంగ్లండ్‌కు, మూడోస్థానం మెర్సిడోనియా దక్కింది. అరూబా, ఎస్వాటిని, కోస్టారికా, నెదర్లాండ్స్, లైబీరియా, మొరాకో, ఉరుగ్వే దేశాలు వరుసగా ఆ తర్వాత స్థానాలకు ఆక్రమించాయి. ఆ తర్వాత పర్యటించాల్సిన ప్రాంతాల్లో సెంట్రల్ ఆసియాలోని సిల్క్ రోడ్, ఇటలీలోని లే మార్షే, జపాన్‌లోని తొహొకు, అమెరికాలోని మెయిన్, బఫలో, ఇండోనేసియాలోని టెంగారా, భారత్‌లోని మధ్యప్రదేశ్, హంగేరిలోని బుడాపేస్ట్ తదితరాలు ఉన్నాయి. తప్పక చూడాల్సిన పది నగరాల్లో సాల్ట్‌బర్గ్, వాషింఘ్టన్ డీసీ, కైరో మొదటి స్థానాల్లో ఉన్నాయి. జర్మనీలో బాన్, బొలీవియాలోని లా పాజ్, వాంకోవర్, భారత్‌లోని కోచి, యూఏయీలోని దుబాయ్, కొలరాడోని డెన్వర్ నగరాన్ని ‘లోన్లీ ప్లానెట్’ ఎంపిక చేసింది. కొండలు, గుట్టలు, పచ్చని వాతావరణంతో రమణీయంగా కనిపించే భూటాన్‌ను చూడాల్సిన మొదటి దేశంగా, ‘టైమ్‌లెస్ ట్రెజర్’గా ప్రసిద్ధి చెందిన ఇంగ్లండ్‌లో చారిత్రక కట్టడాలు, చర్చులు చూడ ముచ్చటగా ఉంటాయని పేర్కొంది. అలాగే తాము ఎంపిక చేసిన ఇతర దేశాలు, ప్రాంతాలు, నగరాలు వేటికి ప్రసిద్ధో, వాటిని ఎందుకు చూడాలో ‘లోన్లీ ప్లానెట్’ పుస్తకంలో వివరించింది. -
తీహార్ జైలుకు వెళ్లాలనుకుంటున్నారా..!
న్యూఢిల్లీ: జైలు జీవితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. కారాగారంలో ఖైదీల జీవనం ఎలా ఉంటుంది? కరుడుగట్టిన తీవ్రవాదులు జైలులో ఎలా ఉంటారు? వీటన్నింటినీ తెలుసుకోవడంతోపాటు నేరగాళ్లను ప్రత్యేక్షంగా చూడటానికి ఆసియాలోనే అతిపెద్దదైన తీహార్ జైలు సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. ‘తీహార్ టూరిజం’ పేరుతో జైలు చూడాలనే ఆసక్తి ఉన్న సందర్శకులకు అనుమతి ఇవ్వనుంది. దీంతో సందర్శకులు జైలులో ఉండే ఖైదీలను, వారు రోజువారిగా చేసే పనులను, జైలు పరిసరాలను ప్రత్యక్షంగా చూడవచ్చని తీహార్ జైలు అధికారులు తెలిపారు. జైలును సందర్శించి,అక్కడే ఒక రోజుకు పాటు ఖైదీలతో ఉండాలనే ఆసక్తి ఉన్న సందర్శకులకు రూ.500 సాధారణ ఫీజుతో అనుమతి ఇవ్వడానికి కారాగార ఉన్నతాధికారులు నియమ నిబంధనలను రూపొందిస్తున్నారు. ‘సందర్శకులు జైల్లో ఇతర ఖైదీలు ఉన్నట్టుగానే సాధారణంగా ఒక రోజు వారితో జైలు గదిలో ఉండాలి. నేలపైనే నిద్రించాలి. ఉదయాన్నే లేచి వంట చేసుకోవాలి. తమ ప్రాంగణాన్ని శుభ్రపరచాలి. యోగా, ధ్యానం, పెయింటింగ్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. సందర్శకులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జైలు లోపలికి సెల్ఫోన్లను అనుమతించబోమని’ తీహార్ జైలు ఉన్నతాధికారి తెలిపారు. కాగా ఖైదీల ప్రవర్తన ఆధారంగా మంచి వారిని మాత్రమే సందర్శకులతో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అదే విధంగా ఖైదీలకు ఎటువంటి ఇబ్బందులు కలించరనే నమ్మకం ఉన్న సందర్శకులకు మాత్రమే జైలును సందర్శించే అనుమతి కల్పిస్తామని అధికారులు వెల్లడించారు. సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో 16వేల మంది ఖైదీలున్న తీహార్ జైలు దేశంలో ఉన్నపెద్ద కారాగారం అన్న విషయం తెలిసిందే. ఇటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో ‘ఫీల్ ద జైల్’ పేరుతో కారాగాన్ని సందర్శించి అక్కడే ఒక రోజుపాటు ఖైదీలతో ఉండే అవకాశాన్ని జైలు ఉన్నతాధికారులు కల్పిస్తున్న విషయం తెలిసిందే. -
14న సీఎం కేసీఆర్ రాక..?
సాక్షి,చొప్పదండి(కరీంనగర్) : కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రామడుగు మండలం లక్ష్మీపూర్ పంప్‌హౌస్(గాయత్రి) బాహుబలి మోటార్ల వెట్‌రన్‌ను అధికారికంగా ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఈ నెల 14న రానున్నట్లు సమాచారం. బాహుబలి విద్యుత్‌మోటార్ల ద్వారా నీటిని వెట్‌రన్ నిర్వహించేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం 14న రానిపక్షంలో 16న వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కాగా.. బాహుబలి 5వ మోటార్ వెట్‌రన్‌ను రెండోసారి సోమవారం మధ్యాహ్నం 1.45గంటలకు అధికారులు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం 5వ మోటారును దాదాపు 40 నిమిషాలు వెట్‌రన్ విజయవంతంగా నిర్వహించి నిలిపివేశారు. మళ్లీ సోమవారం దాదాపు గంటా 12 నిమిషాలు వెట్‌రన్ నిర్వహించారు. భారీగా నీటి ప్రవాహం గ్రావిటీ కాలువలో ప్రవహిస్తుండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి నీటి ప్రవాహాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. వెట్‌రన్ కోసం నీటిని వదిలిన తర్వాత ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్‌ను గ్రావిటీ కాలువ(5.77 కిలోమీటర్లు)ను పరిశీలించారు. లక్ష్మీపూర్ నుంచి శ్రీరాములపల్లి గ్రామ పరిధిలోని వరద కాలువ వరకు నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. గ్రావిటీ కాలువ ద్వారా శ్రీరాములపల్లి గ్రామ శివారులో వరదకాలువలో కాళేశ్వరం ప్రాజెక్టు నీరు చేరుతున్న దృశ్యాలను పరిశీలించారు. 5వ విద్యుత్ మోటారు వెట్‌రన్ విజయవంతం కావడంతో రాష్ట్ర సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్, డీఈఈ గోపాలక్రిష్ణ, ఏఈఈలు సురేష్, రమేష్, శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. నాలుగో మోటార్.. లక్ష్మీపూర్ పంపుహౌస్(గాయత్రి)లో అధికారులు సోమవారం రాత్రి 9.15 గంటలకు 4వ బాహుబలి విద్యుత్ మోటారు వెట్‌రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం 4వ మోటారు వెట్‌రన్‌కు ఏర్పాట్లు చేసుకున్న అధికారులు కొంత సాంకేతిక సమస్యలు రావడంతో వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించి రాత్రి వెట్‌రన్ నిర్వహించారు. మోటారును రాష్ట్ర సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి స్విఛ్‌ఆన్ చేసి ప్రారంభించారు. ఈ వెట్‌రన్‌ను దాదాపుగా గంటపాటు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పంపుహౌస్‌ను పరిశీలించిన సీపీ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ పరిధిలో ఉన్న లక్ష్మీపూర్ పంపుహౌస్(గాయత్రి)ను సోమవారం కరీంనగర్ సీపీ వీబీ.కమలాసన్‌రెడ్డి పరిశీలించారు. సర్జిపూల్‌తోపాటుగా నీటి పంపింగ్ చేసే ప్రదేశాలు, పార్కింగ్ స్థలాలను సందర్శించారు. సీపీ వెంట ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్, ఏసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషావిశ్వనాథ్, చొప్పదండి సీఐ రమేష్, రామడుగు ఎస్సై వి.రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సిక్కోలు పర్యటనకు అమిత్ షా
సాక్షి, అమరావతి: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్డుకు చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి విజయనగరంలో జరిగే శక్తి కేంద్ర ప్రముక్ కార్యక్రమంలో షా పాల్గొననున్నారు. మధ్యాహ్నాం రెండు గంటలకు శ్రీకాకుళం జిల్లా పలాస చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు నిర్వహించనున్న బస్సు యాత్రను అమిత్‌షా ప్రారంభించనున్నారు. షా పర్యటన నేపథ్యంలో ఏపీ బీజేపీ శాఖ ఏర్పాట్లును ముమ్మరం చేసింది. -
తెలంగాణలో రాహుల్ పర్యటన
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణలో పర్యటించునున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా రాహుల్‌తో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రంజాన్ అనంతరం సభను ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ సభలో జేఏసీ నేతలు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధినేతలు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని ఉత్తమ్ తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్గా ఆర్సీ కుంతియా స్థానంలో పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌ను నియమించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. కాగా రాహుల్ పర్యటన తేదీ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాళులు అర్పించారు. ‘సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చింది. తెరాస పుట్టకముందే తెలంగాణ ఇవ్వాలని కోరాము. మొదలు పెట్టింది, ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే. అనేక కారణాలతో దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు కోల్పోయాం.బాధ్యత గల ప్రతిపక్షంగా పని చేశాం. మా డిమాండ్ మీదనే రుణమాఫీ మీద వడ్డీమాఫీ చేస్తా అని కేసీఆర్ మాట తప్పారు. రైతులకు అండగా ఉద్యమాలు, పోరాటాలు చేసి వారికి మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు ముందున్నారు. రైతులను కేసీఆర్ ఆదుకోలేదు. నేరెళ్ల ఘటన, ఖమ్మం రైతులకు భేడీలు, గిరిజన మహిళలను చెట్లకు కట్టి కొట్టారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. వందల కోట్లు పెట్టి ప్రకటనలు ఇచ్చారు. అన్నీ అబద్ధాలే. ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా అమలు చేయలేదు. దళిత సీఎం, దళిత, గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఏది? ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలోనే అబద్దాలు ఉన్నాయి. ఒక్క గిరిజన వ్యక్తికి అయినా ఒక్క ఎకరం భూమి ఇచ్చారా?. కేజీ టు పీజీ ఏమైంది. అన్ని వ్యవస్థలను తొక్కేసే ప్రయత్నం చేశారు. మేము, మా కుటుంబం బాగుపడితే చాలు అని పని చేసారు. ఆ నలుగురికి తప్ప మిగిలిన తెలంగాణకు దుఃఖమే మిగిలింది.నిరుద్యోగ యువత పూర్తిగా నైరాశ్యం లో ఉన్నారు.తెలంగాణా ప్రజల పక్షాన కాంగ్రెస్ ఉంటుంది.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. వచ్చే జూన్ రెండున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది.’ అని ఉత్తమ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. -
నియోజకవర్గాలవారీగా ప్రత్యేక ప్రణాళిక
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ప్రత్యేక ప్రణాళికలు రచించి వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. సోమవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన జరిగిన అన్ని రాష్ట్రాల అధ్యక్షుల సమావేశంలో లక్ష్మణ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, త్వరలోనే అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారని, అంతకంటే ముందు జాతీయ సంఘటన్ ప్రధాన కార్యదర్శి సతీష్జీ ఈనెల 18, 19 తేదీల్లో హైదరాబాద్‌లో పర్యటించి నియోజకవర్గాల వారీగా పార్టీ స్థితిగతులపై, గత ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతంపై నివేదికలు సిద్ధం చేస్తారని అన్నారు. ముఖ్యంగా తెలంగాణలోని 31 ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందని, పార్టీ సీనియర్ నేతలు ఇంద్రసేనారెడ్డి, చంద్రశేఖర్రెడ్డిలు ఇప్పటికే కార్యాచరణ అమలు చేస్తున్నారని తెలిపారు. దళిత్ అదాలత్, గిరిజన గర్జన పేరుతో కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికీ తీసుకెళ్తున్నారని అన్నారు. ఈనెల 26వ తేదీ నాటికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తికానున్న సందర్భంగా 15 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ప్రధాని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. పార్టీని బూత్ లెవెల్లో బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అమిత్‌షా తన పర్యటన సందర్భంగా దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. ఇక నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తదితరులు నెలకు రెండుసార్లు చొప్పున తెలంగాణలో పర్యటిస్తారని ఆయన తెలిపారు. పీయూష్ గోయల్‌తో భేటీ అమిత్ షాతో సమావేశం అనంతరం లక్ష్మణ్ కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు రైల్వే ప్రతిపాదనలను అందించారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ ఫేజ్–2లో మౌలాలి–సనత్‌నగర్ లైన్లో డిఫెన్స్‌కు చెందిన భూముల అప్పగింత అనుమతులు మంజూరయ్యేలా చూడాలని కోరారు. అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి, లింగంపల్లిలో ప్యాసింజర్ టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ నుంచి ఉదయ్ రైళ్లు నడపాలని, కాచిగూడ–గుంతకల్లు, బీబీనగర్–నడికుడి, సికింద్రాబాద్–ముద్ఖేడ్ లైన్లను విద్యుదీకరించాలని వినతిపత్రాన్ని ఇచ్చారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో వివిధ ప్రజా సంక్షేమ పథకాలను కేంద్రమే నేరుగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అమిత్ షాతో భేటీ సందర్భంగా లక్ష్మణ్ కోరారు. -
నీలమణిదుర్గ సన్నిధిలో సంగీత దర్శకుడు కోటి
పాతపట్నం : పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారిని సినీ సంగీత దర్శకుడు కోటి దంపతులు, సినీ నటుడు భానుచందర్ ఆదివారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ సిబ్బంది గౌరవ స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. అర్చకుడు రాజేష్ ఆచార్యులు అష్టోత్తర గోత్రాలతోపాటు, కుంకుమపూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అక్కందర సన్యాసిరావు, ఈవో డకర రమణయ్య, మోహనరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉత్సవంలా అమరావతి ఫెస్టివల్
విజయవాడ సెంట్రల్ : అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌ను ఉత్సవంలా నిర్వహించాలని కమిషనర్ జి.వీరపాండియన్ అధికారులకు సూచించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం, పీడబ్లు్యడీ గ్రౌండ్లో జరుగుతున్న పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయడంలో భాగంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు. పూల కుండీలను, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాల్సిందిగా పేర్కొన్నారు. పీడబ్లు్యడీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. చెత్తను డంపర్‌బిన్స్‌లోనే ఏర్పాటు చేసేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. షాపింగ్ ఫెస్టివల్‌కు వచ్చే ప్రజలకు మంచినీరు, మరుగుదొడ్లను అందుబాటులో ఉంచాలన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తరుచు కార్యక్రమాలు జరుగుతున్న దృష్ట్యా పారిశుధ్య సిబ్బందిని అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం ఒన్‌టౌన్ పంజాసెంటర్ రైల్వే స్టేషన్ వద్ద ముసాఫర్‌ఖానాను తొలగించి ఉర్దూఘర్‌కం షాదీఖానా షాపింగ్ కాంప్లెక్స్‌గా అభివృద్ధి చేయడంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. రోడ్ల విస్తరణ అనంతరం రైల్వే సరిహద్దు గోడ నిర్మాణ పనుల్ని పరిశీలించారు. చీఫ్ ఇంజనీర్ ఎంఏ.షుకూర్, ఈఈ ఉదయ్‌కుమార్, ఎస్టేట్ ఆఫీసర్ కృష్ణమూర్తి, యూసీడీ పీవో ఎం.వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మో ఇన్ని నీళ్లా..?
సింగూరు నీరు చూసి ఆశ్చర్యపోయిన మంత్రి హరీశ్‌రావు జోగిపేట: సింగూరు ప్రాజెక్టులో నీటి ప్రవాహాన్ని పరిశీలించేందుకు వచ్చిన రాష్ట్రీ నీటి పారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు నిండుకుండలా కనిపించిన సింగూరును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బుధవారం మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు బాబూమోహన్, చింతా ప్రభాకర్‌తో కలిసి సింగూరు ప్రాజెక్టును సందర్శించారు. మంత్రి తన వాహనం దిగుతూనే ప్రాజెక్టు రీడింగ్ ఉండే ప్రదేశంలోని మెట్ల వద్దకు వెళ్లి ఆశ్చర్యపోతూ అలాగే నిలబడి పోయారు. కొన్ని నిమిషాల పాటు దూరంగా ఉన్న నీటిని పరిశీలిస్తూ ఉండిపోయారు. నెల రోజుల కింద వచ్చినప్పుడు ప్రాజెక్టులో నీళ్లే లేవని , ఇప్పుడేమో ఇన్ని నీళ్లు వచ్చాయని, వీటిని చూస్తుంటే ఒక్క బొట్టు కూడా బయటకు పంపకూడదనిపిస్తోందని నవ్వుతూ అన్నారు. దేవుడు కరుణించడం వల్ల 15 రోజుల్లో ప్రాజెక్టు నిండిపోయిందని నిండిపోవడమే కాకుండా 41 టీఎంసీల నీరు మంజీర నదిలోకి వృధాగా పోయిందని మంత్రి అన్నారు. ప్రాజెక్టులో నీరు ఎండిపోయిన విషయాన్ని ఎమ్మెల్యే బాబూమోహన్ మంత్రి దృష్టికి తీసుకుపోయారు. మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, డిప్యూటీ స్పీకర్లు ప్రాజెక్టు వద్ద పూజలు నిర్వహించారు. ప్రాజెక్టును పరిశీలించేందుకు వచ్చిన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కూడా నీటిని చూసి అనందం వ్యక్తం చేశారు.