- వేల్పూరుకు చేరుకున్న కేసీఆర్
- జిల్లాలో నేడు సుడిగాలి పర్యటన
- ఎమ్మెల్యే బాజిరెడ్డి ఇంట్లో భోజనం
- 'మోతె' నుంచి కామారెడ్డి వరకు హరితహారంలో బిజీగా గడపనున్న సీఎం
- నగరంలో జరిగే సభకు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేవకర్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్:
ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ హరితహారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన ఆదివారం రాత్రి వే ల్పూరుకు చేరుకున్నారు. బాల్కొండ ఎమ్మెల్యే వే ముల ప్రశాంత్‌రెడ్డి ఇంట్లో బస చేశారు. సోమవారం సీఎం పాల్గొనే కార్యక్రమాల కోసం జిల్లా అధికార యంత్రాంగం పటి ష్ట ఏర్పాట్లు చేసింది. ముందుగా అనుకు న్న షెడ్యూల్‌లో కొద్దిపాటి మార్పులు చే స్తూ సీఎం కేసీఆర్ పర్యటన వి వరాలను కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆదివారం రాత్రి ప్రకటించారు. నిజామాబాద్ రఘునాథ చెరువుతో పాటు తెలంగాణ యూనివర్సిటీలో సీఎం మొక్కలు నాటే కార్యక్రమా లు రద్దయ్యాయి. ఉదయం మోతెలో మొదలయ్యే సీఎం పర్యటన కామారెడ్డిలోని రవాణాశాఖ యూనిట్ ఆవరణ లో మొక్కలు నాటే వరకు బిజీబిజీగా సాగనుంది. నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌం డ్, కామారెడ్డిలోని ఆర్డ్స్‌అండ్‌సైన్స్ కళాశాలలో జరిగే రెండు బహిరంగసభలలో కేసీఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌం డ్స్‌లో జరిగే బహిరంగ సభకు కేంద్ర అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేవకర్ హాజరుకానున్నారు. జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్న సీఎం మధ్యాహ్నం మహా లక్ష్మినగర్‌లోని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇంటిలో భోజనం చేసిన అనంతరం తిరిగి పర్యటనను కొనసాగించనున్నారు.
సీఎం పర్యటన సందర్భంగా మూడు రోజులుగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ రోస్, ఎస్‌పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇతర అధికారులు, ఎమ్మెల్యేలతో కలిసి ఏర్పాట్ల ను పర్య వేక్షించారు. పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి శ్రీ నివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం పరిశీలించారు.