ఉత్సవంలా అమరావతి ఫెస్టివల్
ఉత్సవంలా అమరావతి ఫెస్టివల్
Published Thu, Oct 6 2016 9:28 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
విజయవాడ సెంట్రల్ : అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌ను ఉత్సవంలా నిర్వహించాలని కమిషనర్ జి.వీరపాండియన్ అధికారులకు సూచించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం, పీడబ్లు్యడీ గ్రౌండ్‌లో జరుగుతున్న పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయడంలో భాగంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు. పూల కుండీలను, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాల్సిందిగా పేర్కొన్నారు. పీడబ్లు్యడీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. చెత్తను డంపర్‌బిన్స్‌లోనే ఏర్పాటు చేసేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. షాపింగ్ ఫెస్టివల్‌కు వచ్చే ప్రజలకు మంచినీరు, మరుగుదొడ్లను అందుబాటులో ఉంచాలన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తరుచు కార్యక్రమాలు జరుగుతున్న దృష్ట్యా పారిశుధ్య సిబ్బందిని అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం ఒన్‌టౌన్ పంజాసెంటర్ రైల్వే స్టేషన్ వద్ద ముసాఫర్‌ఖానాను తొలగించి ఉర్దూఘర్‌కం షాదీఖానా షాపింగ్ కాంప్లెక్స్‌గా అభివృద్ధి చేయడంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. రోడ్ల విస్తరణ అనంతరం రైల్వే సరిహద్దు గోడ నిర్మాణ పనుల్ని పరిశీలించారు. చీఫ్ ఇంజనీర్ ఎంఏ.షుకూర్, ఈఈ ఉదయ్‌కుమార్, ఎస్టేట్ ఆఫీసర్ కృష్ణమూర్తి, యూసీడీ పీవో ఎం.వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement