సాక్షి, విజయవాడ: పేదల గుండెచప్పుడు మహానేత వైఎస్సార్ అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. అందరి హృదయాలు గెలిచిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా విజయవాడ పోలీస్ కంట్రోల్ రూం వద్ద వైఎస్సార్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, దేవినేని అవినాష్, కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు, దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు.
ఆరేళ్లలోనే వైఎస్సార్ 60 ఏళ్ల ప్రగతి...
రాజన్న పాలన ఒక స్వర్ణయుగం అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి వైఎస్సార్ బాటలు వేశారన్నారు. ఆరేళ్లలోనే వైఎస్సార్ 60 ఏళ్ల ప్రగతి చూపారన్నారు.
పుట్టపర్తి వైఎస్సార్ సీపీ కార్యాలయంలో
అనంతపురం జిల్లా: పుట్టపర్తి వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మహానేత వైఎస్సార్ 12 వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఓడిసి మండలం గౌనిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. మారాలలో అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే దుద్దు కుంట పాల్గొన్నారు.
వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు మైదుకూరు రోడ్డు లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోరుమామిళ్లలోని వైఎస్సార్ విగ్రహానికి పార్టీ మండల కన్వీనర్ సీఎం భాష, జిల్లా అగ్రి గోల్డ్ బాధితుల బాసట కమిటీ అధ్యక్షుడు చిత్తా విజయ్ ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగార్జున రెడ్డి, పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులు అర్పించాయి.
పశ్చిమగోదావరి జిల్లా: వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఏలూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఆయన విగ్రహానికి పూల మాలలువేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొఠారి అబ్బయ్య చౌదరి, పుప్పాల వాసుబాబు, ఎమ్మెల్సీ కోయ మోషన్ రాజు, మేయర్ షేక్ నూర్జహాన్ , ఇడా చైర్మన్ ఈశ్వరి ,స్మార్ట్ సిటీ చైర్మన్ బొద్దాని అఖిల, సాహిత్య అకాడమీ చైర్మన్ పి. శ్రీలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు,పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మహానేత వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మరణం లేని మహానేత డాక్టర్ వైఎస్సార్ అని, చరిత్రలో నిలిచిపోయేలా పేదలకు సంక్షేమాన్ని అందించారని ఎమ్మెల్యే కాకాణి అన్నారు. ప్రజానేతగా జన హృదయాల్లో నిలిచిపోయారన్నారు. అలాంటి విలువలు, విశ్వసనీయతతో కూడిన పాలనను ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్నారన్నారు. పేదల పెన్నిధిగా ఎదుగుతున్న సీఎం వైఎస్ జగన్‌కి మరో ఇరవై ఏళ్లు తిరుగులేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment