ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయత్త సంత్రస్థులై
ఆరంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహస్య మానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై
ప్రారబ్దార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్
భర్తృహరి నీతిశతకంలోని ఈ సుభాషితం (తెలుగు: ఏనుగు లక్ష్మణ కవి) వైఎస్‌కు ఇష్టమైన శ్లోకం. దీని అర్థం: ఆటంకాలు ఎదురవుతాయేమోనన్న భయంతో అధములు అసలు పనే మొదలుపెట్టరు. మధ్యములు పని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురుకాగానే వదిలేస్తారు. ఇక ధీరులు ఎన్నెన్ని ఆటంకాలు ఎదురైనా మొదలుపెట్టిన పనిని పూర్తిచేసేదాకా వదిలిపెట్టరు.
Comments
Please login to add a commentAdd a comment