వైఎస్సార్ కోసం చెప్పాలంటే...కొన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు
ఆయన కోసం మాట్లాడుకుంటే..ఆయన్ను అభిమానించే వారికి కొన్ని గంటల సమయం సరిపోదు
ఎందుకంటే...వైఎస్సార్...ఓ లెజెండ్
భారతదేశ రాజకీయాల్లోనే ఓ ధ్రువ తార
రాజకీయానికే రాజసం నేర్పిన మహానేత
రాజనీతికి విశ్వసనీయతను నేర్పిన ప్రజానేత
పేదల తలరాతలను మార్చిన విధాత
ఒక్క మాటలో చెప్పాలంటే...వైఎస్సార్...అంటే పేరు కాదు....బ్రాండ్
ఆ బ్రాండ్ ఎంత గొప్పదంటే....ఈరోజు ఆయన మరణించి పదమూడేళ్లయినా...
ఆయన కోసం తల్చుకోగానే మనందరి కళ్లల్లో కన్నీళ్ల సుడులు తిరుగుతాయి...అంత గొప్ప బ్రాండ్. వైఎస్సార్
అసలు వైఎస్సార్ ని ఎందుకు ప్రజలు ఇలా గుండెల్లో పెట్టుకుని దేవుడిలా పూజిస్తున్నారో...మనం ఆలోచిస్తే...ఆయన ఆదర్శవంతమైన ప్రస్థానమే అందుకు కారణం అని నేను చెప్పగలను
2004 వరకు ఈ రాష్ట్రంలోని...హిందువులు...క్రైస్తవులు...ముస్లింలు...
ఇలా అన్ని మతాల వాళ్లు...రోజూ తమ దేవుళ్లకు పూజిస్తునే ఉండే వారు..
దేవుడా నా బిడ్డకు చదువునివ్వు...నా బిడ్డకు ఆరోగ్యాన్నివ్వు...
ఈ ఏడాది నా పొలాన్ని పండించు...
అని అన్ని మతాల పేదలు, రైతులు, ప్రజలు చేయని పూజలు లేవు...
వాళ్ల పూజలన్నింటినీ విన్న దేవుళ్లు అందరూ కలిసి...తమ ప్రతినిధిగా వైఎస్సార్ ని పంపారేమో...అన్నట్టుగా..ఆయన పాలన సాగించారు...
దేవుడు పాలన...రాముడి పాలన కోసం...చరిత్రలో విన్నాం...కానీ వై ఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే...ప్రత్యక్షంగా చూశాం..
ప్రతీ గడపకి...ప్రతీ గుండెకి తన పాలనను అందించిన ముఖ్యమంత్రి వైఎస్సార్ కనుకనే..
అందుకే దేవుడిలాంటి పాలన వైఎస్సార్...పాలన...అని ఇప్పటికీ...మనం చెప్పుకుంటాం...
వైఎస్సార్...అంటే తెలుగు ప్రజల ఎమోషన్...
వైఎస్సార్ అంటే తెలుగు ప్రజలకి ఎఫెక్షన్..
సెప్టెంబర్ 2....2009 న...
తెలుగు ప్రజలకు...అభివ్రుద్ధి, సంక్షేమం అన్న కథను చెబుతూ...చెబుతూ...శాశ్వత నిద్రలోకి వై ఎస్సార్ వెళ్లిపోయారు...
10 కోట్ల మంది తెలుగు వాళ్లు...కట్టుకున్న ఆశల సౌధం...క్షణాల్లో కుప్పకూలిపోయింది....
ఈ దేశ చరిత్రలో....ఓ పెద్ద రాజకీయ విషాదం ....వై ఎస్సార్ మరణం...
దేశంలోని ప్రతిపక్ష నాయకులను సైతం...కన్నీళ్లు పెట్టించిన గొప్ప యుగపురుషుడు...వైెఎస్సార్
వైఎస్సార్ కి మరణం లేదు...
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే
పేదోడికి జబ్బు చేస్తే.
డబ్బు లేకుండా వైద్యం చేశారు
రూపాయి డాక్టరున్నంత వరకు...
ఒక్క రూపాయి అవసరం లేదని నిరూపించారు
ఆరోగ్యశ్రీ తో కోట్ల మందికి ఆయుష్సు పోశారు
చిల్లుపడ్డ చిన్నారుల గుండెలకు ప్రాణం పోశారు
చావుతో పోరాడే ప్రతీ పేదోడిని గెలిపించారు
గంజి నీళ్లకు గతిలేనోళ్ల గడపల్లో గ్రాడ్యువేట్లను ఇచ్చారు
ఉన్నోడికే సొంతమైన ఉన్నత విద్యను ఊరందరికీ ఉచితంగా ఇచ్చారు
ఆసరా లేని అవ్వా తాతలకు ఆదుకునేలా ఫించనిచ్చారు
గుడిసెల్లో జీవితాన్ని గడిపేవాళ్లకి ఇందిరమ్మ ఇళ్లిచ్చారు
పావలా వడ్డీ తో అక్క చెల్లెల్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు
గడప గడపను...గుండె గుండెకు తన పథకాలతో పలకరించారు
అంత గొప్ప ప్రజా నాయకుడికి మరణం ఉంటుందా...? ఆయన ప్రజల గుండెల్లో మాత్రం శాశ్వతంగా జీవించే ఉంటారని గర్వంగా చెప్పగలను
ఇంత గొప్పగా పాలించి...పేదల తలరాతలను మార్చారు కాబట్టే వైఎస్సార్ మరణించారన్న వార్త వినగానే...
కోట్లాది మంది ప్రజల ఊపిరి బరువైపోయింది...
వైఎస్సార్ ని అభిమానించే గుండెలు పగిలిపోయాయి..
వైఎస్సార్ ఉన్నారులే అని ధీమాగా ఉన్న ప్రజల నమ్మకం నేలకొరిగిపోయింది...
ఆంధ్రప్రదేశ్ని అగ్రగామి రాష్ట్రంగా నడిపిస్తున్న వై ఎస్సార్ ప్రయాణం ఆగిపోయింది...
కానీ ఆ గుండెల్లో ధైర్యం నింపుతూ....మన నాయకుడు జగనన్న...తెలుగు ప్రజలకు అండగా నేనుంటాను అని ముందుకొచ్చారు
పులి కడుపున పులే పుడుతుంది,...అన్నట్టు
వైఎస్సార్ బిడ్డ...వైఎస్సార్ బ్లడ్...మన పులివెందుల పులి...జగనన్న మనందరి కోసం అండగా నిలబడ్డాడు
తన తండ్రి ఆశయ సాధాన కోసం...ఎన్నో కష్టాలను, కక్ష సాధింపులను ఎదుర్కొన్నాడు
వైఎస్సార్ మరణించాక....ఆ కుటుంబాన్ని సోనియా గాంధీ...నడి రోడ్డున పడేయాలని చూసింది...
కానీ ఈ రోజు అదే కుటుంబం....అదే సోనియా గాంధీ...కళ్ల ముందే
మళ్లీ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద మూడు రంగుల జెండాను ఎగరేసి...ఇది గో వై ఎస్సార్ పాలన అని....తలెత్తుకుని నిలబడ్డాడు మన జగనన్న...
ఢిల్లీ పెద్దలు....ఆంధ్రా గెద్దలు....కలిసి కుమ్మక్కై కుట్రలు చేసి...జగనన్నను అక్రమంగా జైలులో పెట్టారు...
ఆ రోజే చెప్పాం.....జైలు గోడలు బద్దలు కొట్టి మరీ...వైఎస్సార్ పాలన తెచ్చుకుంటామని...
ఈ రోజు...ఆ అక్రమ నిర్భంధాలను ఛేదించి....అక్రమంగా కేసులు పెట్టిన వాళ్లకు గూబ గుయ్యి మనేలా
రీ సౌండ్ విక్టరీ ని సాధించి చూపించారు మన జగనన్న
కాంగ్రెస్ పార్టీ కుట్రలు...సోనియా గాంధీ కక్ష సాధింపులు...పరాకాష్టకు చేరిన సందర్భంలో..
అప్పుడు జగనన్న....ఒక మాట చెప్పారు...
వైఎస్సార్ ని అభిమానించే ప్రతీ గుండె చప్పుడు ఒక్కటవుతుంది...
ఓ ఉప్పెన పుడుతుంది...ఆ ఉప్పెనలో కొట్టుకుపోతారు....వీళ్లంతా....అని చాలా ఎమోషనల్ గా మాట్లాడారు...
నిజంగానే....ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదేళ్ల తరువాత...వై ఎస్సార్ ని అభిమానించే గుండెల చప్పుడు ఒక్కటయ్యింది...
గత ఎన్నికల్లో ఓ రాజకీయ ఉప్పెన పుట్టించాయి....
అందుకే 151 ఎమ్మెల్యే సీట్లు...22 ఎంపీ సీట్లతో విజయ ఢంకా మోగించారు
జాతీయ పార్టీలు కు సింగిల్ సీటు కూడా రాలేదు..
40 ఏళ్ల రాజకీయ అనుభవానికి ి40 సీట్లు కూడా రానివ్వలేదు..
ప్యాకేజీ పార్టీల అధ్యక్షులకు సైతం అడ్రస్ లేకుండా చేశారు...
దేశమంతా మోడీ గాలి వీస్తే...ఆంధ్రా లో మాత్రం...జగనన్న ఫ్యాన్ గాలి వీచింది...
అదీ జగన్మోహన్ రెడ్డి పవర్....వైఎస్సార్ అభిమానుల పవర్...
అందుకే గర్వంగా చెప్తున్నా....వైఎస్సార్ పాలన మళ్లీ వచ్చింది అని...
వైఎస్సార్ మనమధ్య లేకపోయినా....వైఎస్సార్ వారసుడు మనతో ఉన్నాడు
వైఎస్సార్ ప్రాణం మనతో లేకపోయినా...వైఎస్సార్ పాలన మనతో ఉంది
స్వర్గంలో ఉన్న వైఎస్సార్ సైతం...గర్వపడేలా ఈరోజు జగనన్న 50 నెలల పాలన సాగింది
వైఎస్సార్ మరణించినా...ఆయన ఆశయం..ఆయన సంకల్పం జగనన్న ఉన్నంత వరకు మరణించదని ఈ నాలుగున్నారేళ్ల పాలనతో నిరూపించారు మన జగనన్న
One and only...
Ysr....Forever
ఇట్లు..
నిద్దాన సతీష్,
వై ఎస్సార్ అభిమాని
గాజులరేగ, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment