
సాక్షి, అమరావతి: ‘నా అనుకున్న వాళ్ల కోసం ఎంతవరకైనా వెళ్లే గొప్ప వ్యక్తిత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిది. అనుకున్నది సాధించడానికి ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కొనే ధైర్యం ఆయన నైజం. ఆయన నవ్వుతూ ఉండేవాడు. మమ్మల్ని కూడా నవ్వుతూ ఉండమనేవారు. ఒక్కోసారి చిన్నపిల్లాడిలా మారిపోయేవారు.
నా లాంటి ఎందరికో రాయకీయ పునాదులు వేసిన నాయకుడు’ అంటూ మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్. ‘వైఎస్సార్ కేవలం మంచి వాడే కాదు.. అంతకు మించిన వాడు’ అని ‘సాక్షి’కి చెప్పారు. వైఎస్సార్ తనను ఎంతగానో ప్రోత్సహించేవారని తెలిపారు.
చదవండి: Johar ysr: అజేయుడు
Comments
Please login to add a commentAdd a comment