Undavalli Aruna Kumar
-
‘సుప్రీం’ కేసులో ఇంత నిర్లక్ష్యమా..? ‘మార్గదర్శి’పై మరెన్నాళ్లు?
మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్ధిక అవకతవకలపై ఇంకా ఎన్నాళ్లకు కౌంటర్ దాఖలు చేస్తారు? స్వయంగా సుప్రీం కోర్టు విచారణకు పంపిన కేసులో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత మాత్రం సహించరానిది. గత జూన్‌లో విచారణ ప్రారంభించి ఇప్పటి వరకు 13 సార్లు వాయిదాలు వేశాం. కౌంటర్లు దాఖలు చేస్తామని గత విచారణ సమయంలోనే చెప్పారు. అయినా కౌంటర్ దాఖలు చేయపోవడానికి కారణాలేంటో చెప్పండి. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాల్సిందే. ఇదే చివరి అవకాశం. లేకపోతే తదుపరి విచారణకు ఇరు రాష్ట్రాల సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులు కోర్టు ముందు హాజరవ్వాల్సి ఉంటుంది.– ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం⇒ రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. ⇒ 1997లో కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారం హెచ్‌యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషేధం. ⇒ అయినా మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి 2006 మార్చి నాటికి దాదాపు రూ.2,610.38 కోట్లు వసూలు చేసింది. ⇒ ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)ను మార్గదర్శి యథేచ్ఛగా ఉల్లంఘించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పటికే కోర్టుకు తెలిపింది. ⇒ మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారం నిగ్గు తేలాల్సిందేనని సుప్రీంకోర్టు సైతం తేల్చి చెప్పింది. సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్షియర్స్ భారీ ఆర్ధిక అవకతవకలపై కౌంటర్లు దాఖలు చేయాలన్న తమ ఆదేశాలను పట్టించుకోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇంకా ఎన్నాళ్లకు కౌంటర్ దాఖలు చేస్తారని ఇరు ప్రభుత్వాలను నిలదీసింది. స్వయంగా సుప్రీంకోర్టు విచారణకు పంపిన కేసులో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత మాత్రం సహించరానిదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత జూన్‌లో విచారణ ప్రారంభించి ఇప్పటి వరకు 13 సార్లు వాయిదాలు వేశామని గుర్తు చేసింది. కౌంటర్లు దాఖలు చేస్తామని గత విచారణ సమయంలోనే చెప్పారని, అయినప్పటికీ కౌంటర్ దాఖలు చేయపోవడానికి కారణాలేంటో చెప్పాలని నిలదీసింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పింది. లేని పక్షంలో తదుపరి విచారణకు తమ ముందు హాజరు కావాలని ఇరు రాష్ట్రాల సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. అదనపు కౌంటర్ దాఖలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి మూడు వారాల గడువునిచ్చింది. అంతేకాక రిప్లై కాపీని మాజీ ఎంపీ, కోర్టు సహాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్‌కి అందచేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త చెరుకూరి కిరణ్‌లను హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘సుప్రీం’ ఆదేశాలతో హైకోర్టు విచారణ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అ«దీకృత అధికారి నాంపల్లి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును కొట్టేస్తూ 2018 డిసెంబర్ 31న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశాయి. అదే విధంగా హైకోర్టు తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రామోజీ, మార్గదర్శి వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశాయి. ఈ అప్పీళ్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ దాన్ని రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై తిరిగి విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, రిజర్వ్ బ్యాంక్, ఏపీ సర్కార్‌తో సహా అందరి వాదనలు వినాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. గతేడాది నవంబర్ 7న విచారణ సందర్భంగా మార్గదర్శి ఆర్థిక అవకతవకలపై పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేస్తామని ఇరు రాష్ట్ర ప్రభుత్వాల న్యాయవాదులు హైకోర్టుకు నివేదించిన విషయం తెలిసిందే. అయితే ఇరు ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయలేదు. తాజాగా ఈ వ్యాజ్యాలపై జస్టిస్ సుజోయ్ పాల్ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, కోర్టు సహాయకుడిగా మాజీ ఎంపీ అరుణ్‌కుమార్, ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ్ రవిచందర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది (ఎస్‌జీపీ) బి.రాజేశ్వర్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపించారు. 6వ తేదీ కల్లా ఉండవల్లికి ఆ కాపీలు ఇవ్వండి.. ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణన్ రవిచందర్ స్పందిస్తూ 200కిపైగా పేజీలతో మార్గదర్శి ఫైనాన్సియర్స్, చెరుకూరి కిరణ్ గత నెల 19న రిప్లై దాఖలు చేశారని, దీనిపై తాము పూర్తి వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేస్తామని నివేదించారు. ఇందుకు మూడు వారాల గడువునివ్వాలని కోరారు. అయితే కోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటి వరకు కౌంటర్లు దాఖలు చేయలేదని ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందిస్తూ.. కోర్టు ఆదేశించినప్పటికీ మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన రిప్లై కాపీని తనకు ఇవ్వలేదని ధర్మాసనానికి నివేదించారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ ఈ నెల 6వ తేదీలోపు ఆ రిప్లై కాపీని ఉండవల్లి అరుణ్ కుమార్‌కి అందజేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఇలాగేనా అమలు చేసేది? విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఇరు రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకెన్నాళ్లకు కౌంటర్లు దాఖలు చేస్తారని నిలదీసింది. సుప్రీంకోర్టు పంపిన వ్యాజ్యాల్లోనూ ఇలా చేస్తే ఎలా? అంటూ మండిపడింది. కోర్టు ఆదేశాలను అమలు చేసేది ఇలాగేనా? అని నిలదీసింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశించింది. అదనపు కౌంటర్ దాఖలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్‌కి మూడు వారాల గడువునిచ్చేందుకు ఇరుపక్షాలు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో ధర్మాసనం ఉత్తర్వుల జారీకి సిద్ధమైంది. ఈ సమయంలో మార్గదర్శి తరపు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా అడ్డుకుని మాట్లాడటంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. అనంతరం విచారణను ఈ నెల 31కి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ల దాఖలు విషయంలో తమ ఆదేశాల అమలు నిమిత్తం ఉత్తర్వుల కాపీని అడ్వొకేట్ జనరల్ కార్యాలయానికి సోమవారంలోగా పంపాలని హైకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.రూ.వేల కోట్లు కొల్లగొట్టిన మార్గదర్శి ఫైనాన్షియర్స్రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. 1997లో కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం తెచ్చింది. హెచ్‌యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడాన్ని అది నిషేధించింది. అయినప్పటికీ రామోజీరావు నేతృత్వంలోని మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి 2006 మార్చి నాటికి దాదాపు రూ.2,610.38 కోట్లు వసూలు చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా రామోజీరావు ప్రజల నుంచి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. చట్ట విరుద్ధంగా మార్గదర్శి సేకరించిన డిపాజిట్ల వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని ఆర్బీఐ చేతులెత్తేయడంతో డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులపై అప్పటి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది.అక్రమాలను నిర్ధారించిన రంగాచారిమార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలు, అవకతవకలను నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని నియమిస్తూ 2006 డిసెంబర్ 19న జీవో 800 జీవో జారీ అయింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ అధికారి టి.కృష్ణరాజును అదీకృత అధికారిగా నియమిస్తూ అదే రోజు జీవో 800 వెలువడింది. దీంతో తమ అక్రమాలు బయటపడటం ఖాయమని పసిగట్టిన మార్గదర్శి, రామోజీరావులు.. రంగాచారి, కృష్ణరాజు నియామకాలను సవాలు చేస్తూ సుదీర్ఘ కాలం న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే రామోజీరావుకు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఈ క్రమంలో తాము కోరిన వివరాలు మార్గదర్శి ఇవ్వకపోవడంతో రంగాచారి ఆదాయ పన్ను శాఖ నుంచి అవసరమైన డాక్యుమెంట్లను సేకరించి పరిశీలించారు. 2007 ఫిబ్రవరి 19న తన నివేదికను ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం నిజమేనని తేల్చారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన అందులో స్పష్టంగా పేర్కొన్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీరావు తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన విచారణ ద్వారా తేల్చారు.అధీకృత అధికారి ఫిర్యాదు కొట్టేసిన హైకోర్టుచట్ట ఉల్లంఘనలకు పాల్పడిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అధీకృత అధికారి టి.కృష్ణరాజు 2008 జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) చేశారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధమని, అయితే మార్గదర్శి ఫైనాన్షియర్స్ అందుకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి నేరం చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఆర్బీఐ చట్టం సెక్షన్ 58 ప్రకారం శిక్షార్హమని తెలిపారు. దీంతో రామోజీరావు ఈ ఫిర్యాదు విషయంలో మళ్లీ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించారు. చివరకు హైకోర్టు 2018 డిసెంబర్ 31న రామోజీరావుపై అ«దీకృత అధికారి చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టుఈ తీర్పుపై అటు ఉండవల్లి అరుణ్ కుమార్, అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అలాగే హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వీటన్నింటిపై సుప్రీంకోర్టు 2020 నుంచి విచారిస్తూ వచ్చింది. అటు తరువాత ఈ వ్యాజ్యాల్లో ఆర్బీఐని కూడా ప్రతివాదిగా చేర్చింది. విచారణ సందర్భంగా ఆర్బీఐ తరఫు న్యాయవాది కూడా మార్గదర్శి, రామోజీరావు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారని మౌఖికంగా కోర్టుకు తెలిపారు. చివరగా గతేడాది ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇదే సమయంలో డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్ట విరుద్ధంగా సేకరించిన డిపాజిట్లపై నిగ్గు తేలాల్సిందేనని తేల్చి చెప్పింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహిస్తోంది. -
రూ.2,610 కోట్ల అక్రమ డిపాజిట్లు..18 ఏళ్లుగా జిత్తులు!
చట్టపరమైన చర్యల కోసం కింది కోర్టులో అదీకృత అధికారి ఫిర్యాదు చేస్తే దానిపై పిటిషన్..! వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కమిషన్‌ను నియమిస్తే పిటిషన్...! అధీకృత అధికారిని నియమిస్తే పిటిషన్..! కేసు వాదించడానికి స్పెషల్ పీపీని నియమిస్తే పిటిషన్! కింది కోర్టు విచారణకు స్వీకరిస్తే పిటిషన్...! వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తే పిటిషన్..! హైకోర్టు జోక్యానికి నిరాకరిస్తే సుప్రీంకోర్టులో పిటిషన్...!! సాక్షి, అమరావతి: ఇలా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ, స్టేల మీద స్టేలు పొందుతూ మార్గదర్శి, రామోజీరావు కాలం వెళ్లదీస్తూ వచ్చారు. దాని ఫలితంగానే గత 18 ఏళ్లుగా కేసు కొనసాగుతూ వస్తోంది. ప్రజల నుంచి ఏకంగా రూ.2,610 కోట్ల మేర డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు బండారం 2006 నవంబర్ 6న బట్టబయలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ప్రజల ముందు నిలబెట్టిన రోజు అది. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి అడ్డంగా దొరికిపోయిన మార్గదర్శి, రామోజీరావు చట్టం నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు. ప్రతి దశలోనూ విచారణను అడ్డుకుంటూ వచ్చారు. అయితే ఈ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 7వ తేదీన మరోసారి విచారణ జరపనుంది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు స్వీకరించిందా? లేదా? అనే విషయాన్ని తేల్చనుంది. చట్ట విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించినట్లు తేలితే వసూలు చేసిన రూ.2,610 కోట్లకు రెట్టింపు మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అటు అక్రమ డిపాజిట్లు.. ఇటు నష్టాలంటూ రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. 1997 కేంద్ర చట్టం ప్రకారం హెచ్‌యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. అయితే దీన్ని ఖాతరు చేయకుండా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి 1997 నుంచి 2006 మార్చి నాటికి 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి దాదాపు రూ.2,610.38 కోట్లు అక్రమంగా వసూలు చేసింది. ఇంత భారీగా డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఆశ్చర్యకరంగా 2006 మార్చి నాటికి రూ.1,369.47 కోట్లను వృద్ధి చెందుతున్న నష్టాలుగా చూపింది. తద్వారా 50 శాతం మంది డిపాజిటర్లకు డిపాజిట్లు చెల్లించలేని పరిస్థితికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేరింది. డొంక కదిల్చిన ఉండవల్లి... మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా రామోజీ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. మార్గదర్శి అక్రమాల తీరును బహిర్గతం చేశారు. ఇదే సమయంలో ఆ డిపాజిట్ల వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడంతోపాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్ నుంచి వివరణ కోరింది. వాస్తవానికి 1997లోనే డిపాజిట్ల సేకరణపై మార్గదర్శి స్పష్టత కోరగా ప్రజల నుంచి అలా సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్బీఐ అప్పుడే స్పష్టం చేసింది. అయినా సరే పట్టించుకోకుండా మార్గదర్శి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారో అప్పుడు మళ్లీ ఆర్బీఐ దీనిపై స్పందించింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. రంగాచారి, కృష్ణరాజు నియామకం.. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని ఆర్బీఐ చేతులెత్తేయడంతో చట్ట ప్రకారం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముందుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలపై నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని, చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ టి.కృష్ణరాజును అ«దీకృత అధికారిగా నియమిస్తూ జీవో జారీ చేసింది. ఈ నియామకాలను సవాలు చేస్తూ రామోజీ 2006లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం కొట్టివేసింది. అనంతరం 2007లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం సైతం ఆ పిటిషన్‌ను కొట్టేసింది. ఐటీ శాఖ నుంచి సేకరించిన రంగాచారి.. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రంగాచారి నిర్వహించిన విచారణకు రామోజీరావు, మార్గదర్శి సహకరించకుండా కార్యాలయాల్లో తనిఖీలకు అడ్డంకులు సృష్టించారు. తమ పిటిషన్లు కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని, డాక్యుమెంట్లు ఇచ్చేది లేదంటూ మొండికేశారు. దీంతో రంగాచారి ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖ నుంచి తెప్పించుకున్నారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం నిజమేనని పేర్కొంటూ 2007 ఫిబ్రవరి 19న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వడ్డీ చెల్లించే అలవాటే మార్గదర్శికి లేదని, ఒత్తిడి చేస్తేనే చెల్లిస్తుందంటూ ఓ డిపాజిటర్ హైకోర్టుకు నివేదించటాన్ని తన నివేదికలో పొందుపరిచారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. రామోజీ పెట్టుబడి రూపాయైనా లేదు.. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీ తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన విచారణలో తేల్చారు. 2000, ఆ తరువాత బ్యాలెన్స్ షీట్లను గమనిస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో రామోజీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదన్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లతోనే మార్గదర్శిని నడిపారని నిగ్గు తేల్చారు. కోర్టు అనుమతితో తనిఖీలు.. మరోవైపు ఈ కేసులో అదీకృత అధికారిగా నియమితులైన కృష్ణరాజు కోర్టు అనుమతితో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో తనిఖీలు చేశారు. దీన్ని సవాలు చేస్తూ మార్గదర్శి, రామోజీరావు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ 14.3.2007న కోర్టు ఉత్తర్వులిచ్చింది. దీనిపై రామోజీ హైకోర్టును ఆశ్రయించగా కింది కోర్టు ఇచ్చిన సెర్చ్ వారెంట్‌ను నిలుపుదల చేసింది. ఈ క్రమంలో చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి టి.కృష్ణరాజు 2008 జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) చేశారు. దీన్ని కొట్టి వేయాలంటూ అదే ఏడాది రామోజీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ రజనీ స్టేతో మూలపడిన కేసు.. దీంతో దిక్కుతోచని రామోజీ 2010లో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అ«దీకృత అధికారి ఇచ్చిన ఫిర్యాదులో విచారణను సెక్షన్ 45(ఎస్)(1), 45(ఎస్)(2), 58బీ(5ఏ) రెడ్ విత్ సెక్షన్ 58(ఈ)లకే పరిమితం చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చుతూ నాంపల్లి కోర్టు 2011లో ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులపై మార్గదర్శి, రామోజీ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్బీఐ చట్టం పరిధిలోకి మార్గదర్శి ఫైనాన్షియర్స్ రాదంటూ వాదించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ 20.7. 2011న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.‘‘స్టే’’ వల్ల కేసు అప్పటి నుంచి మూలనపడిపోయింది. అటు తరువాత వచ్చిన ప్రభుత్వాలు రామోజీ గుప్పిట్లో ఉండటంతో మార్గదర్శి అక్రమాలను పట్టించుకోలేదు. విచారణ.. తీర్పు.. ఒకే రోజు ఉమ్మడి హైకోర్టు విభజన 1.1.2019న జరిగింది. 31.12.2018 ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు. అటు న్యాయవాదులు ఇటు న్యాయమూర్తులు అందరూ భావోద్వేగ వాతావరణంలో ఉన్నారు. కేసుల విచారణపై దృష్టి సారించలేని పరిస్థితిని రామోజీరావు తనకు అనుకూలంగా మలచుకున్నారు. నాంపల్లి కోర్టులో అ«దీకృత కృష్ణరాజు చేసిన ఫిర్యాదును కొట్టేయాలంటూ 2011లో తాము దాఖలు చేసిన వ్యాజ్యాలను రామోజీ విచారణకు తెప్పించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు. రామోజీరావు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రాను రంగంలోకి దించారు. లూథ్రా వాదనలు విన్న జస్టిస్ రజనీ ఇంత పెద్ద కేసులో అదే రోజు అంటే 31వతేదీన తీర్పు కూడా ఇచ్చేశారు. రామోజీ, మార్గదర్శి వాదనను సమర్ధించారు. హెచ్‌యూఎఫ్.. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రాదని జస్టిస్ రజనీ తన తీర్పులో తేల్చేశారు. మార్గదర్శి, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టులో అధీకృత అధికారి కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చారు. ఇంత పెద్ద కేసులో ఒకే రోజు విచారణ జరిపి అదే రోజు తీర్పునివ్వడం అరుదైన ఘటన. అసలు ఈ కేసు విచారణకు వచ్చినట్లు గానీ, న్యాయమూర్తి ఈ విధంగా తీర్పునిచ్చినట్లుగానీ ఎవరూ గుర్తించలేదు. అటు తరువాత కొద్ది నెలలకు ఈ తీర్పు వెలుగు చూసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. జస్టిస్ రజనీ తీర్పుపై మార్గదర్శి, రామోజీరావు సుప్రీంకోర్టును ఆశ్రయించడం. అటు తరువాత మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణాన్ని బయటపెట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్రమత్తమై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2019 డిసెంబర్ 17న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. హైకోర్టు తీర్పును రద్దు చేసిన సుప్రీం.. హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు 19.9.2020న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం17.8.2022న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అటు ఉండవల్లి అరుణ్ కుమార్, ఏపీ ప్రభుత్వం, ఇటు మార్గదర్శి, రామోజీరావు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు 2020 నుంచి విచారిస్తూ వచ్చింది. మార్గదర్శి, రామోజీరావు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు విచారణ సందర్భంగా ఆర్బీఐ న్యాయవాది మౌఖికంగా కోర్టుకు తెలిపారు. చివరగా ఈ ఏడాది ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అదీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేసుల కొట్టివేతకు సుప్రీం నిరాకరణ.. డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ ఇదే సమయంలో రామోజీ, మార్గర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చట్ట విరుద్ధంగా సేకరించిన డిపాజిట్లపై నిగ్గు తేలాల్సిందేనని.. మార్గదర్శి, రామోజీకి అనుకూలంగా హైకోర్టు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పును పక్కనపెడుతున్నామని స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని, సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. తాజాగా విచారణ జరిపి ఆరు నెలల్లో విచారణను ముగించాలని, సేకరించిన డిపాజిట్లకు సంబంధించి పబ్లిక్ నోటీసు ఇవ్వాలని తెలిపింది. తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది జూన్‌లో తిరిగి విచారణ ప్రారంభించింది. విచారణ జరుగుతుండగానే రామోజీరావు మరణించగా ఆయన స్థానంలో హెచ్‌యూఎఫ్ కర్తగా తనను చేర్చాలని రామోజీ కుమారుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు దఫాలు వాయిదాల అనంతరం పూర్తిస్థాయి వాదనల నిమిత్తం ఈ నెల 7న విచారణ చేపట్టనున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. -
రామోజీ రావు మార్గదర్శి స్కామ్ పై ఉండవల్లి సంచలన విషయాలు
-
మార్గదర్శి డిపాజిట్లు చట్ట విరుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: మార్గదర్శి చిట్ ఫండ్ డిపాజిట్ల వ్యవహారంలో తాము ఎక్కడా చట్ట నిబంధనలను ఉల్లంఘించలేదంటూ ఇన్ని రోజులు బొంకుతూ వచ్చిన రామోజీరావుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గట్టిగా మొట్టికాయ వేసింది. రామోజీరావు నోరు మూయించేలా మంగళవారం సుప్రీంకోర్టు ముందు ఆర్బీఐ అసలు వాస్తవాన్ని బయటపెట్టింది. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) పేరు మీద డిపాజిట్లు సేకరించడం ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్‌కు విరుద్ధమని నివేదించింది. ఈ కేసులో మార్గదర్శి డిపాజిట్ల సేకరణ అలానే జరిగిందని, ఆర్బీఐ తరఫు న్యాయవాది రమేష్ బాబు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వివరాల్లోని తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, పూర్తి వివరాలతో ఓ నోట్‌ను తమ ముందుంచాలని ఆర్బీఐని ఆదేశించింది. అలాగే ఏపీ ప్రభుత్వంతోపాటు పిటిషనర్ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను సైతం మార్గదర్శి చిట్‌ఫండ్ డిపాజిట్ల సేకరణ విషయంలో నోట్‌ను తమ ముందుంచాలని ఆదేశిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇలా.. విభజనకు ఒక్క రోజు ముందు తీర్పు... ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ.2,600 కోట్లను డిపాజిట్ల రూపంలో సేకరించినందుకు గాను చట్ట ప్రకారం మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమాని రామోజీరావును ప్రాసిక్యూట్ చేయాలంటూ 2008లో సీఐడీ అధీకృత అధికారి టి.కృష్ణరాజు నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిని కొట్టేస్తూ ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒక్క రోజు ముందు (2018 డిసెంబర్ 31) అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని (ప్రస్తుతం ఎన్సీఎల్టీ సభ్యురాలు, అమరావతి బెంచ్) తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మార్గదర్శి అక్రమాలను వెలుగులోకి తెచ్చిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2019లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. 2020లో ఇదే వ్యవహారంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఉమ్మడి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలన్నింటిపై మంగళవారం జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. కోర్టు పరిధిలో ఉన్నా కూడా రూ.2వేల కోట్లు సేకరణ ఈ సందర్భంగా మార్గదర్శి, రామోజీరావుల తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, వసూలు చేసిన డిపాజిట్లు చాలా వరకు వెనక్కు ఇచ్చేశామన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకునే ఉమ్మడి హైకోర్టు మార్గదర్శిపై సీఐడీ నమోదు చేసిన ఫిర్యాదును కొట్టేసిందన్నారు. అసలు ఈ కేసుతో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, మార్గదర్శి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసిందని, ఇందుకు సుప్రీంకోర్టు గతంలోనే అనుమతి మంజూరు చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వ్యవహారం కోర్టుకు వచ్చే సమయానికి నిబంధనలకు విరుద్ధంగా రూ.2,600 కోట్లు సేకరించిందని తెలిపారు. కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు కూడా మార్గదర్శి డిపాజిట్ల సేకరణను ఆపలేదని, అప్పుడు కూడా మరో రూ.2 వేల కోట్లు సేకరించిందని వివరించారు. చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారా? లేదా? ఈ కేసులో పిటిషనర్ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ పార్టీ ఇన్ పర్సన్ (కేసు దాఖలు చేసిన వ్యక్తి తన వాదనలను తానే వినిపించడం)గా వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో తానే ఫిర్యాదుదారుడినని తెలిపారు. తీసుకున్న డబ్బు వెనక్కు ఇచ్చేశారా? ఎవరు ఇచ్చారు.. ఎవరికి ఇచ్చారు..? అన్న విషయాలు ముఖ్యం కాదన్నారు. చట్ట నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారా? లేదా? అన్నదే ఇక్కడ చూడాల్సిన అంశమని తెలిపారు. హెచ్యూఎఫ్గా ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్‌కు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించింది నిజమో కాదో తేల్చాలని ఆయన కోర్టును కోరారు. ఆర్బీఐ తరఫు న్యాయవాది కూడా ఇక్కడే ఉన్నారని, ఆయన్ను అడిగితే వాస్తవాలు తెలుస్తాయన్నారు. దీంతో ఆర్బీఐ తరఫు న్యాయవాది ఎంఆర్ రమేష్ బాబు స్పందిస్తూ, హెచ్యూఎఫ్గా సెక్షన్ 45ఎస్ ప్రకారం డిపాజిట్లు సేకరించడం ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధమని కోర్టుకు నివేదించారు. ఈ కేసులో కూడా ఇలాగే డిపాజిట్ల సేకరణ జరిగిందని తేల్చి చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, ఇలా 45ఎస్‌కు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన విషయాన్ని హైకోర్టుకు చెప్పారా? అని ప్రశ్నించింది. హైకోర్టులో మార్గదర్శి దాఖలు చేసిన వ్యాజ్యాల్లో తాము ప్రతివాది కానందున ఈ విషయాలను హైకోర్టు ముందుంచలేదన్నారు. సుప్రీంకోర్టులో ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యంలో తమను ప్రతివాదిగా చేర్చారని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న విస్తృత ధర్మాసనం, అన్నీ వివరాలను నాలుగు పేజీల నోట్ ద్వారా తమ ముందుంచాలని ఇరుపక్షాలను ఆదేశించింది. ఆ వివరాల ఆధారంగా పూర్తి స్థాయి విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. వాదనలు వినిపించేందుకు అందరికీ అవకాశం ఇస్తామంది. తదుపరి విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. ఈ విచారణకు మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్దార్థ లూత్రా, ఉండవల్లి తరఫున న్యాయవాదులు అల్లంకి రమేష్, అరుణా గుప్తాలు హాజరయ్యారు. ఇదీ మార్గదర్శి బాగోతం హిందూ అవిభక్త కుటుంబం పేరిట మార్గదర్శి ఫైనాన్షియర్స్ సాధారణ ప్రజానీకం నుంచి ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా రూ.2,600 కోట్లు సేకరించిందనే విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని ఆధారాలతో ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి తగిన స్పందన లేకపోవడంతో చట్ట ప్రకారం తమ ముందున్న ఆధారాల ఆధారంగా మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్గదర్శి ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు ఎన్.రంగాచారిని నియమిస్తూ 2006లో జీవో 800 జారీ చేసింది. ఇదే సమయంలో సీఐడీ తరఫున సంబంధిత కోర్టుల్లో పిటిషన్లు, దరఖాస్తులు దాఖలు చేసేందుకు అధీకృత అధికారిగా టి.కృష్ణరాజును నియమిస్తూ జీవో 801 జారీ చేసింది. ఈ రెండు జీవోలపై మార్గదర్శి హైకోర్టును ఆశ్రయించగా, జీవోలపై స్టే చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్గదర్శి అక్రమాలపై విచారణ జరిపిన రంగాచారి 2007 ఫిబ్రవరిలో నివేదిక సమర్పించారు. రికార్డుల తనిఖీకి మార్గదర్శి ఏ మాత్రం సహకరించలేదని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. అలాగే మార్గదర్శి ఫైనాన్షియర్స్ భారీ నష్టాల్లో ఉందని, మెచ్యూరిటీ సమయంలో డిపాజిట్లు తిరిగి చెల్లించే పరిస్థితిలో ఆ సంస్థ లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిధులను ఇతర అనుబంధ కంపెనీలకు మళ్లించడమే ఈ పరిస్థితికి కారణమని ఆయన వివరించారు. మార్గదర్శి చట్ట ఉల్లంఘనలపై అధీకృత అధికారి ఫిర్యాదు మార్గదర్శి అక్రమాలు, చట్ట ఉల్లంఘనలపై అధీకృత అధికారి కృష్ణరాజు 2008 జనవరిలో నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) దాఖలు చేశారు. దీనిని కొట్టేయాలని కోరుతూ మార్గదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన సింగిల్ జడ్జి సీసీ 540లో తదుపరి చర్యలను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయగా, సీసీ 540లో తదుపరి చర్యలు కొనసాగించుకునేందుకు అనుమతించింది. ఆ తర్వాత ఇదే సీసీ 540పై మార్గదర్శి మరో రూపంలో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా హైకోర్టు సానుకూల స్టే ఉత్తర్వులిచ్చింది. ఏకంగా ఫిర్యాదు కొట్టేసిన హైకోర్టు 2011లో తిరిగి సీసీ 540ని కొట్టేయాలంటూ సీఆర్పీసీ సెక్షన్ 482 కింద మార్గదర్శి పిటిషన్ దాఖలు చేసింది. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్) కింద తామెలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, అందువల్ల క్రిమినల్ ఫిర్యాదును కొట్టేయాలని కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏదైనా కేసులో స్టే కాల పరిమితి ఆరు నెలలు కావడంతో, హైకోర్టు ఇచ్చిన స్టే గడువు ముగిసింది. స్టే గడువు పెంపు కోసం మార్గదర్శి 2018లో పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇదిలా ఉండగా, సీసీ 540ని కొట్టేయాలంటూ మార్గదర్శి దాఖలు చేసిన పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు. ఉమ్మడి హైకోర్టు విభజనకు చివరి రోజు 2018 డిసెంబర్ 31న మార్గదర్శికి అనుకూలంగా తీర్పు వెలువరించారు. మార్గదర్శి కోరినట్లు సీసీ 540ని కొట్టేశారు. అందరూ హైకోర్టు విభజన హడావుడిలో ఉన్నప్పుడు వెలువడిన ఈ తీర్పును అప్పట్లో ఎవరూ గుర్తించలేదు. తీర్పు వెలువడిన కొంత కాలం తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో అప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2020 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ రజనీ 2021 సెప్టెంబర్‌లో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అమరావతి బెంచ్ సభ్యురాలిగా నియమితులై ప్రస్తుతం ఆ పోస్టులో కొనసాగుతున్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలోనే ఆమెకు ఎన్సీఎల్టీ పోస్టు ఖరారైంది. ఆర్బీఐ తొలిసారి వచ్చింది ఏళ్ల తరబడి మార్గదర్శిపై తాను చేస్తున్న పోరాటంలో కీలక విషయాన్ని తెలపడానికి ఆర్బీఐ తొలిసారిగా కోర్టుకు వచ్చిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు. కోర్టు విచారణ అనంతరం ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి తరఫున పేరు మోసిన సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారని తెలిపారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ఎస్ ప్రకారం డిపాజిట్లు సేకరణ చట్ట విరుద్ధమని న్యాయవాది రమేష్‌బాబు తెలిపారన్నారు. మార్గదర్శి, రామోజీరావు వంటి వారిపై కఠిన చర్యలు ఉంటేనే చిన్న చిన్న చిట్‌ఫండ్ మోసాలు కూడా అరికట్టవచ్చన్నారు. రామోజీరావు అరెస్టు కావాలనేది తన ఉద్దేశం కాదని, ఈ తరహా మోసాలు అరికట్టడమే తన అభిమతమని స్పష్టం చేశారు. తన సొంత జిల్లాలో ఇటీవలే రెండు చిట్ ఫండ్ కంపెనీల మోసాలు వెలుగు చూశాయన్నారు. ఏపీలో ఫైనాన్స్ పేరుతో వసూళ్లు తగ్గుముఖం పట్టాలంటే కోర్టు ఈ కేసులో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఏప్రిల్ 9 నాటి విచారణతో స్పష్టత వస్తుందని, చట్టవిరుద్ధంగా వసూళ్లకు పాల్పడే వారి ముక్కుకు తాడు పడుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. -
సీబీఐకి బాబు కేసు..ఉండవల్లి పిటిషన్ పై విచారణ
-
YSR: నా అనుకున్న వాళ్లకోసం ఎంతవరకైనా
సాక్షి, అమరావతి: ‘నా అనుకున్న వాళ్ల కోసం ఎంతవరకైనా వెళ్లే గొప్ప వ్యక్తిత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిది. అనుకున్నది సాధించడానికి ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కొనే ధైర్యం ఆయన నైజం. ఆయన నవ్వుతూ ఉండేవాడు. మమ్మల్ని కూడా నవ్వుతూ ఉండమనేవారు. ఒక్కోసారి చిన్నపిల్లాడిలా మారిపోయేవారు. నా లాంటి ఎందరికో రాయకీయ పునాదులు వేసిన నాయకుడు’ అంటూ మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్. ‘వైఎస్సార్ కేవలం మంచి వాడే కాదు.. అంతకు మించిన వాడు’ అని ‘సాక్షి’కి చెప్పారు. వైఎస్సార్ తనను ఎంతగానో ప్రోత్సహించేవారని తెలిపారు. చదవండి: Johar ysr: అజేయుడు -
మార్గదర్శి’పై ఈడీ విచారణ చేపట్టాలి
-
దేశంలో రాజకీయ శూన్యతను పూరించాలి.. సీఎం కేసీఆర్–పీకే భేటీలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: దేశంలో నెలకొన్న రాజకీయ శూన్యతను పూరించేందుకు జాతీయస్థాయిలో కీలకపాత్ర పోషించాల్సిందేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కృత నిశ్చయంతో ఉన్నారని.. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా బీజేపీయేతర, కాంగ్రెసేతర పక్షాలతో సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించారని తెలిసింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని త్వరలోనే ఖరారు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 10న జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో వెల్లడైన అభిప్రాయాలకు అనుగుణంగా.. జాతీయ స్థాయిలో రాజకీయ అరంగేట్రంపై సరైన సమయంలో, సరైన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఆదివారం ప్రగతిభవన్‌లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో భేటీ అయిన సీఎం కేసీఆర్.. జాతీయ పార్టీ ప్రకటన, రాష్ట్రపతిఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, రాబోయే ఎన్నికలు, ఎమ్మెల్యేలు– ప్రభుత్వ పనితీరుపై పీకే బృందం చేసిన సర్వే నివేదికలపై చర్చించారు. ప్రగతిభవన్‌లో సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ భేటీలో కేసీఆర్, పీకేతోపాటు మంత్రి హరీశ్‌రావు కూడా పాల్గొన్నారు. జాతీయ పార్టీ కావాలంటే ఎలా..? ‘‘కేంద్రంలో బీజేపీ పాలనలో అశాంతి పెరిగిపోయింది. నియంతృత్వ పోకడలు పెచ్చుమీరాయి. ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైన నేపథ్యంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను పూరించేందుకు జాతీయ రాజకీయాల్లో బలీయమైన శక్తిగా అవతరించడమే మార్గం..’’అని సీఎం కేసీఆర్, పీకే భేటీలో అభిప్రాయానికి వచి్చనట్టు తెలిసింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ను జాతీయ పారీ్టగా మార్చడంపై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న అభిప్రాయాలపైనా చర్చించినట్టు సమాచారం. రాష్ట్రాల వారీగా అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్న పారీ్టలు, ఆయాచోట్ల కొత్త జాతీయ పారీ్టకి ఉన్న అనుకూలతలపై చర్చించినట్టు తెలిసింది. దేశంలో ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పశి్చమబెంగాల్తోపాటు ఇతర రాష్ట్రాలకు విస్తరించే ఆలోచనతో ఉంది. ఢిల్లీలో ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో అధికారాన్ని కైవసం చేసుకొని దేశం వైపు చూస్తోంది. శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయబోయే పార్టీ విధివిధానాలు ఎలా ఉండాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ‘దీదీ’సమావేశానికి వెళ్లాలని నిర్ణయం! రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో విపక్షాల ఉమ్మడి అభ్యరి్థని నిలబెట్టి బీజేపీకి షాకివ్వాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశి్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (దీదీ) ఇప్పటికే నిర్ణయించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సహా 22 మంది వివిధ పార్టీల నేతలకు లేఖలు రాశారు. సీఎం కేసీఆర్‌కు స్వయంగా ఫోన్ చేసి 15న ఢిల్లీలో జరిగే సమావేశానికి రావాలని కోరారు. ఈ నేపథ్యంలోనే గతంలో తృణమూల్ కాంగ్రెస్‌కు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్‌తో ప్రస్తుత పరిణామాలపై సీఎం కేసీఆర్ చర్చించినట్టు సమాచారం. 15న జరిగే సమావేశానికి వెళ్లాడమా, లేదా అన్న అంశంపై అభిప్రాయాలు పంచుకున్నట్టు సమాచారం. కేసీఆర్ వెళ్లలేని పక్షంలో కేటీఆర్నుగానీ, పార్టీ తరఫున మరో ప్రతినిధినిగానీ ఢిల్లీకి పంపాలని నిర్ణయానికి వచి్చనట్టు తెలిసింది. ఇదే సమయంలో జాతీయ రాజకీయాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు సాగాలని భావనకు వచి్చనట్టు సమాచారం. రాష్ట్రంలో ఎన్నికలు, సర్వేలపైనా చర్చ? రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనే అంశాలపై ప్రశాంత్‌కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ బృందం ఇటీవల సర్వే చేసి కేసీఆర్‌కు నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో పీకే భేటీ అయి చర్చించారు కూడా. ఈ నేపథ్యంలో జిల్లాలు, నియోజకవర్గాల వారీగా అనుసరించాల్సిన వ్యూహాలపై వారు మరోసారి చర్చించినట్టు తెలిసింది. పార్టీ బలహీనంగా ఉన్న చోట ఆప్షన్లు ఎలా ఉండాలనే దానిపైనా మంతనాలు సాగించినట్టు సమాచారం. కేసీఆర్‌తో ఉండవల్లి భేటీ – జాతీయ రాజకీయాలపైనే చర్చ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రవేశంపై చర్చ సాగుతున్న నేపథ్యంలో.. ఏపీకి చెందిన ఉండవల్లి ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలకపాత్ర పోషించే అంశం, కొత్త పార్టీ ఏర్పాటు, టీఆర్ఎస్ను జాతీయ పారీ్టగా మార్చడంలో ఉన్న సాంకేతిక ఇబ్బందులపై చర్చించినట్టు తెలిసింది. ప్రశాంత్ కిషోర్‌తో భేటీ ముగిశాక సాయంత్రం 6 గంటల తర్వాత ఈ భేటీ జరిగింది. ఇందులో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. -
‘రివర్స్ టెండరింగ్‌తో మరి ఇంత తేడానా’
సాక్షి, అమరావతి: రివర్స్ టెండరింగ్‌తో ఇంత భారీ తేడా వస్తుందని ఊహించలేదు.. ఆశ్చర్యపోయాను అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. మంగళవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిజాయతీగా పని చేసేందుకు ప్రయత్నిస్తుందని ప్రశంసించారు. ఏ పని ఇచ్చినా జ్యూడిషియల్‌గా ఫాలో అప్ చేసి ఇస్తుండటం మంచి పరిణామం అన్నారు. మేఘా కృష్ణా రెడ్డి కంపెనీ రూ.700 కోట్లు తక్కువకు టెండర్ చేయడానికి ఎలా ముందుకు వచ్చారో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కింది స్థాయిలో అవినీతి ఉంది.. దాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలని ఉండవల్లి కోరారు. అందరు నిజాయతీగా పని చేయక తప్పదనే పరిస్థితి తీసుకురావలన్నారు ఉండవల్లి. పాలనలో పూర్తి పారదర్శకత తీసుకురావడానికి ప్రయత్నించాలని సూచించారు. 57 శాతం పైగా ఓట్లతో అధికారంలోకి వచ్చారు.. అదే శాశ్వతం అనుకోవద్దని ఉండవల్లి హెచ్చరించారు. ప్రజల్లో మంచి పేరుతో పాటు.. తనతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలను సంతృప్తి పరచడం జగన్ విధి అన్నారు. ఎమ్మెల్యేలపై నమ్మకం ఉంచి జాగ్రత్తగా వ్యవహరించమని కోరారు. జగన్ ఒక్కడిగా వచ్చాడు.. ఒక్కడిగా నడిపించాడు.. ఇప్పుడు తేడా రానివ్వొద్దన్నారు. ప్రభుత్వంపై సీరియస్‌గా ఆరోపణలు చేయడానికి ఇంకా సమయం ఉందని తెలిపారు. -
వైఎస్ఆర్తో ఉండవల్లి పుస్తకం పై ఇష్టాగోష్టి
-
‘డేటా ట్రాన్స్ఫర్ చేయడం తప్పే’
సాక్షి, తూర్పుగోదావరి : డేటా చోరీ కేసుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మీడియా సమావేశంలో మంగళవారం మాట్లాడారు. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమాచారం ప్రైవేటు సంస్థలకు ఎలా లభ్యమైందని ప్రశ్నించారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అఫిషియల్‌గా ఐటీగ్రిడ్స్ వంటి సంస్థలకు డేటా ట్రాన్స్ఫర్ చేసినా అది తప్పేనని అన్నారు. అయినా, పోలీసుల ముందుకు రాకుండా అశోక్ ఎందుకు పరారీలో ఉన్నాడని విస్మయం వ్యక్తం చేశారు. ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి ఎన్నో అవకతవకలను బయటపెట్టామని తెలిపారు. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇదే ఆఖరు ప్రెస్ మీట్ అని వెల్లడించారు. ఏప్రిల్ 11న ఏపీలో పోలింగ్ పూర్తయ్యే వరకు ఇక మీడియా ముందుకురానని చెప్పారు. డేటా చోరీపై ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై స్పందించే విధానం ఇదేనా అని టీడీపీని ప్రశ్నించారు. ఎన్నికల స్థాయిని దిగజార్చారని మండిపడ్డారు. టీడీపీ సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలి గాని అనవసర కామెంట్లు చేయడం తగదన్నారు. ఏపీ ప్రజలకు సంబంధించిన పూర్తి డేటా వివరాలు టీడీపీ సేవామిత్రలో ఉన్నాయని అన్నారు. సాధికార మిత్ర పేరుతో సర్వేలు చేసి ఆధార్ నెంబర్ సేకరించి.. ఓటర్ గుర్తింపు కార్డులతో జతచేయడం అక్రమమన్నారు. గడిచిన 40 ఏళ్లలో దేశంలో నిరుద్యోగిత 6.1 శాతం పెరిగిందని చెప్పారు. రాఫెల్ ధర ఎంతో ఇప్పటివరకు కేంద్రం చెప్పకపోవడం దారుణమన్నారు. -
బీజేపీ ప్రతినిధిగా నేను అడ్డుకున్నా
-
పార్టీలన్నీ కలసి పోరాడాలి
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్ర ప్రయోజనాలకోసం అన్ని పార్టీలు కలసిపోరాడాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. జాతీయస్థాయిలో ఐక్యంగా పోరాడితేనే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలమన్నారు. విభజన హామీలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశంపై ఉండవల్లి మంగళవారం విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.లక్ష కోట్లు రావాల్సి ఉందని సూత్రప్రాయంగా లెక్కతేల్చామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలసికట్టుగా పనిచేయాలన్న అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తమైందన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తాయన్నారు. నాలుగున్నరేళ్లలో కేంద్రమేమీ ఇవ్వలేదన్నారు. నిధుల కోసం ఐక్య పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్రంపై పోరాటం చేస్తామని మంత్రి సోమిరెడ్డి చెప్పారు. విభజన హామీల సాధనకోసం సమష్టి పోరాటం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సమావేశంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, బీజేపీ తరఫున ఐవైఆర్ కృష్ణారావు, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించకుండా నాలుగున్నరేళ్ల విలువైన కాలాన్ని వృథా చేసి ప్రజలను మోసగించిన టీడీపీతో కలసి వేదిక పంచుకోమని చెబుతూ వైఎస్సార్సీపీ ఈ భేటీలో పాల్గొనేందుకు నిరాకరించింది. బీజేపీ పాల్గొంటున్నందుకు నిరసనగా సీపీఎం బహిష్కరించింది. కాగా, ఐవైఆర్ కృష్ణారావు విడిగా మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1.16 లక్షల కోట్లు రావాలని రాష్ట్రప్రభుత్వ ప్రతినిధులు చెప్పగా.. తాను వ్యతిరేకించానన్నారు. దీనిపై టీడీపీ నేతలు ప్రజెంటేషన్ ఇస్తామన్నారని, అలాగైతే తాము కూడా కేంద్రమిచ్చిన నిధులపై వివరాలిస్తామనడంతో వారు వెనక్కు తగ్గారన్నారు. -
చంద్రబాబును నమ్మొద్దు ...!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు మరోసారి మోసపూరిత వేషాలు వేస్తున్న సీఎం చంద్రబాబును ఈ రాష్ట్ర ప్రజలు ఎంతమాత్రం నమ్మరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గత ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేసి ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేక మోసం చేశారని ఆయన చంద్రబాబుపై ధ్వజమెత్తారు. దీనికి తోడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణమైన చంద్రబాబు మళ్లీ అఖిలపక్షం అంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టారని దుయ్యబట్టారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టాన్ని వక్రీకరిస్తూ కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు మరో డ్రామాకు తెర లేపారని విమర్శించారు. విభజన హామీలపై ఉండవల్లి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో టీడీపీ, జనసేన సమక్షంలో మేం కూర్చుని చర్చించలేమని ఆయన తేల్చి చెప్పారు. 5% రిజర్వేషన్ పేరుతో కాపులను దగా.. కాపు రిజర్వేషన్లకు చట్టబద్ధత తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నానని, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని బాబు డ్రామాలాడుతున్నారని అంబటి ఫైర్ అయ్యారు. రిజర్వేషన్లు అనుభవించలేని అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోగా అందులో 5 శాతం కాపులకు ఇస్తానని చంద్రబాబు దగా చేస్తున్నారన్నారు. చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు ఇస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే చట్టాలను వక్రీకరించి చట్ట వ్యతిరేకంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. పోస్టు డేటెడ్ చెక్కుల పేరుతో మోసం.. పసుపు–కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చెక్కులు ఎన్నికల సమయంలో చెల్లవని, ఓట్ల కోసం మహిళలను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. గత ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని మాట ఇచ్చి తప్పారన్నారు. ధర్మ పోరాట దీక్షలు కావు.. దగా దీక్షలు ప్రత్యేక హోదా డిమాండ్‌ను నీరుగార్చిన వ్యక్తులే ఇప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామనడం విడ్డూరంగా ఉందని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. సెప్టెంబర్ 8, 2016న ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ అద్భుతంగా ఉందని ఆ రోజు చంద్రబాబు చెప్పి హోదాను పోగొట్టారని, ఇప్పుడు మమ్మల్ని అఖిలపక్షానికి పిలుస్తారా అని నిలదీశారు. చంద్రబాబు డ్రామాలతో నడిచే సమావేశాల్లో వైఎస్సార్సీపీ పాల్గొనదని తేల్చి చెప్పారు. కాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లపోవడానికి కారణాలను అంబటి వివరించారు. రాష్ట్రానికి హోదా రాకుండా సర్వనాశనం చేసిన టీడీపీ, ఆ పార్టీ అధికారంలోకి రావడానికి సపోర్టు చేసిన జనసేన హాజరయ్యే సమావేశానికి తాము వెళ్లలేమన్నారు. ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు తాము వ్యతిరేకం కాదన్నారు. ప్రజల మైండ్ సెట్ మార్చేందుకు.. బోగస్ సర్వేల పేరుతో వైఎస్సార్సీపీని దెబ్బతీయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని అంబటి విమర్శించారు. ప్రజల మైండ్ సెట్ మార్చేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. వీటిని ఎదుర్కునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. లగడపాటి రాజగోపాల్, ఓ పత్రికా చానల్ అధిపతి చంద్రబాబుతో రాత్రి మంతనాలు జరిపారన్నారు. -
‘కేంద్రాన్ని బూచిగా చూపేందుకు టీడీపీ ప్రయత్నం’
సాక్షి, విజయవాడ: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని బూచిగా చూపేందుకు టీడీపీ ప్రయత్నించిందని బీజేపీ నాయకుడు, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. మంగళవారం ఉండవల్లి సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విభజన సందర్భంగా ఏపీకి ఇవాల్సినవన్నీ కేంద్రం ఇచ్చిందని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న టీడీపీ నేతలు కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తే బీజేపీ ప్రతినిధిగా తను అడ్డుకున్నట్టు పేర్కొన్నారు. ‘ఏపీకి కేంద్రం ఇంకా 1.16 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని టీడీపీ చెబుతోంది.. అది అబద్ధం. ఏపీకి కేంద్రం ఎంత ఇచ్చింది, ఎంత ఇవ్వాల్సి ఉందనేదానిపై మా వద్ద లెక్కలు ఉన్నాయి. టీడీపీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తామంటే, మేము కూడా ఇస్తామన్నాం. దాంతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ జరగలేదు. సమావేశంలో హోదా కోసం కలిసి ఉద్యమం చేసే విషయంలో చర్చ జరగలేదు. పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై చర్చ జరగాలనే అంశంపై అందరు సానుకూలంగానే ఉన్నార’ని ఐవైఆర్ తెలిపారు. -
జగన్ పాదయాత్ర చరిత్రాత్మకం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనసాగిస్తున్న ప్రజాసంకల్ప యాత్ర నిజంగా చరిత్రాత్మకమని, ఇలాంటి పాదయాత్రను తాను గతంలో ఎన్నడూ చూడలేదు.. వినలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. వేల కిలోమీటర్లు నడవడం, వందల సభల్లో మాట్లాడడం, కోట్ల మందితో మమేకం కావడం నిజంగా గొప్ప విషయమని అన్నారు. ఇంతటి ప్రజాస్పందన లభిస్తున్న పాదయాత్రను ఇంతవరకు దేశంలో ఏ నాయకుడూ చేయలేదని పేర్కొన్నారు. ఉండవల్లి అరుణ్‌కుమార్ శుక్రవారం విశాఖ జర్నలిస్ట్ ఫోరం(వీజేఎఫ్) ఆధ్వర్యంలో విశాఖపట్నం ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. జగన్ పాదయాత్ర ప్రభావం రానున్న ఎన్నికల్లో కచ్చితంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్సార్సీపీకి అనుకూల వాతావరణం ఉందని స్పష్టం చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై ప్రభుత్వంలోని కొందరు చేసిన అవినీతి ఆరోపణలపై తాను ఇప్పటికీ చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. వారి దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురావాలని, కాదని తాను నిరూపిస్తానని సవాల్ విసిరితే ఎవరూ స్పందించలేదని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును న్యాయస్థానం ఎన్ఐఏకు అప్పగించడంపై ఉండవల్లి స్పందిస్తూ... ఈ కేసులో ‘సిట్’ విచారణ సందేహాలకు తావిచ్చిందని, హైకోర్టు ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించడం ద్వారా వైఎస్సార్సీపీ చేస్తున్న వాదన నిజమని తేలిందని అభిప్రాయపడ్డారు. మేలో నీళ్లిస్తామంటూ అబద్ధాలు పోలవరం ప్రాజెక్టు నుంచి మే నెలలో నీరు ఇస్తామని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందని ఉండవల్లి పేర్కొన్నారు. మేలో గోదావరిలో ఇన్‌ఫ్లో ఉండదని, ఒకవేళ వరదలొచ్చినా గ్రావిటీ ద్వారా నీరివ్వడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని తేల్చిచెప్పారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తారో రారో తెలియదని, అందుకే నోటికొచ్చిన ఆబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలన మొత్తం కుంభకోణాలమయంగా మారిపోయిందని ధ్వజమెత్తారు. మైండ్ గేమ్ ఆడుతున్న చంద్రబాబు పవన్ కల్యాణ్ విషయంలో చంద్రబాబు మైండ్‌గేమ్ ఆడుతున్నారని ఉండవల్లి ఆరోపించారు. నిన్నమొన్నటి వరకు మోదీతో పవన్ జతకట్టాడని ఆరోపించిన ఆయన ఇప్పుడు తనతో కలిసి రావాలని పిలుపునివ్వడం వెనుక మైండ్‌గేమ్ ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత మళ్లీ టీడీపీ–బీజేపీ కలిసిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదన్నారు. అటెండర్‌ను పంపినా చర్చకు సిద్ధం సీఎం చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లో అసత్యాలే ఉన్నాయని ఉండవల్లి విమర్శించారు. ఆ శ్వేతపత్రాలపై చర్చకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ ప్రతినిధిగా అటెండర్‌ను పంపినా తాము చర్చకు సిద్ధమేనని తేల్చిచెప్పారు. రోజుకో సబ్జెక్టుపై చర్చిద్దామని, చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రాల్లో ఉన్నవి వాస్తవాలే అయితే తన తప్పును ఒప్పుకొని క్షమించమని కోరుతానని తెలిపారు. -
ఆ పోర్టల్‌లో ఎందుకు పెట్టలేదు: ఉండవల్లి
రాజమండ్రి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఎన్ఓలో ప్రసంగించిన అంశాన్ని ఏపీ ప్రభుత్వ పోర్టల్‌లో ఎందుకు పెట్టలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ.. జీరో బడ్జెట్ పేరిట నేచురల్ ఫార్మింగ్ గురించి వివరించి, రూ.16 వేల 600 కోట్ల ఎంవోయూను చంద్రబాబు, సిఫ్ సంస్థతో ఎందుకు చేసుకున్నారని సూటిగా అడిగారు. దేశం మొత్తం మీద వచ్చిన పెట్లుబడుల్లో 20 శాతం మనకే వచ్చిందని,18 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలు వచ్చాయని గతంలో చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు. వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం ప్రకటించాలని, ఇప్పటికైనా యదార్థాలు మాట్లాడాలని ఉండవల్లి కోరారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల జనాన్ని పోలవరం ప్రాజెక్టు చూపించటానికి తీసుకు వెళ్లినందుకు 20 కోట్ల రూపాయల వ్యయం చేయటం దారుణమన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్పందించాలని కోరారు. ఇదే విషయం గురించి ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థను ప్రశ్నిస్తే ఆర్టీఐలోని సెక్షన్ 8 ప్రకారం వివరాలు ఇవ్వడం కుదరదని చెప్పారని వెల్లడించారు. రామోజీ మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారం గురించి 2005లో రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి తన ఆత్మకథలో రాసుకున్నారని తెలిపారు. రామోజీరావు శిక్షలకు అతీతుడు అనే పద్ధతిలో అందరూ వ్యవహరించడం దారుణమని వ్యాఖ్యానించారు. -
పోలవరం, పట్టిసీమపై చర్చకు సిద్ధం
సాక్షి, రాజమహేంద్రవరం: పోలవరం, పట్టిసీమ, అమరావతి బాండ్లు, పేదల ఇళ్ల నిర్మాణానికి అధిక ధర, రూ.18 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడున్నాయి.. తదితర అంశాలపై చర్చకు తాను ఎప్పుడు.. ఎక్కడకు రావాలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కోరారు. రాజమహేంద్రవరంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతి బాండ్లలో అవినీతి జరిగిందన్నది తన వాదన కాదని, 10.36 శాతం ఎక్కువ వడ్డీకి ఎందుకు తీసుకున్నారనేదే తన వాదనని పునరుద్ఘాటించారు. వడ్డీ 8 శాతానికి మించి తీసుకోకూడదని జీవో జారీచేసిన ఆరు నెలలకే 10.36 శాతానికి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. చెల్లింపులపై ఆడిట్ అభ్యంతరాలివిగో.. రాజధాని మీటింగ్‌కు మోదీ వచ్చినప్పుడు రూ.4.98 లక్షల ఖర్చవగా.. అందులో కాంట్రాక్టర్ ప్రాఫిట్ అని రూ.70 లక్షలు ఇచ్చినట్టు రాశారని తెలిపారు. బిల్డింగ్లు కట్టడం కోసం రూ.53.74 కోట్లకు షెడ్యూల్ ఆఫ్ రేట్లు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిందని, అయితే పల్లోంజి కంపెనీ రూ.103.42 కోట్లకు, ఎల్ అండ్ టీ అయితే రూ.106 కోట్లు ఇస్తే చేస్తామని చెప్పాయని.. నిబంధనల ప్రకారం ఐదు శాతం ఎక్కువ వస్తే టెండర్లు రద్దు చేయాల్సి ఉందన్నారు. కానీ వాళ్లను బేరానికి పిలిచి 25 శాతం అదనంగా చెల్లించేందుకు రెండు పనులు, 26 శాతం అదనానికి ఒక పని కేటాయించడంపై ఆడిట్ కార్యాలయం ప్రశ్నించిన విషయాన్ని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టులో పనులు చేయకుండా.. చేసినట్లు చూపించి రూ.101 కోట్లు చెల్లించారని 2018 జూలై 10న పోలవరం పే అండ్ అకౌంట్ అధికారి.. ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కు లేఖ రాసిన విషయం నిజం కాదని కుటుంబరావు చెప్పాలన్నారు. -
మందుబాబులు స్ట్రైక్ చేస్తే..
సాక్షి, రాజమండ్రి : మందుబాబులు ఓ వారం రోజులు స్ట్రైక్ చేస్తే ప్రభుత్వాలు అల్లాడిపోతాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.8.50కి తయారయ్యే మద్యంను రూ.50కి అమ్ముతున్నారని, దీంట్లో 37 రూపాయలు ప్రభుత్వం దోచేస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై చాలా మంది తనని సంప్రదిస్తున్నారని, ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వస్తామంటున్నారని పేర్కొన్నారు. అమరావతి బాండ్లు, వడ్డీరేట్లపై చర్చ జరుగుతోందని, ట్యాక్స్ ఎంతో తెలియకుండా బాండ్లు ఎలా జారీ చేస్తారని ఉండవల్లి ప్రశ్నించారు. కండిషన్ల మధ్య రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసే పరిస్థితి నెలకొందన్నారు. పేద, ధనికుల మధ్య అంతరాన్ని తొలగించాలని, పేదల ఆర్థిక స్థితులను మార్చాలని సూచించారు. దేశంలో ఎక్కడాలేని వడ్డీలు ప్రభుత్వం వసూలు చేస్తోందన్నారు. జలయజ్ఞంలో ఇచ్చిన కేటాయింపులు ఏంటని ప్రశ్నించారు. నాలుగేళ్లలో లక్షా 30 వేల కోట్లు అప్పు చేశారని, ఇంత అప్పు చేసి దేనికి ఖర్చు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు నిజం చెప్పి పాలన చేయగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్న వ్యాపారాన్ని స్విట్జర్లాండ్ ఆర్థికవేత్త వ్యతిరేకించారని, ఆయన లెక్కలు చెబితే జైళ్లో పెడతారని చెప్పినట్లు ఉండవల్లి పేర్కొన్నారు. వారానికోసారి ఖర్చు పెట్టిన లెక్కలు ప్రజలకు చెప్పగలరా అని, కనీసం ఈ 9 నెలలకు అయిన ఖర్చు చెప్పగలరా అని ప్రశ్నించారు. అవినీతి చేసి డబ్బులివ్వాల్సి వస్తోందని బాబు చెప్పారని, నంద్యాల ఎన్నికల్లో ఒప్పుకున్నారని ఉండవల్లి గుర్తు చేశారు. -
వారం రోజులు స్ట్రైక్ చేస్తే ప్రభుత్వాలు అల్లాడుతాయి
-
‘ఆ దారుణాలన్నీ అద్వానీకి తెలుసు’
సాక్షి, రాజమహేంద్రవరం : ఏపీ విభజన చట్టం చెల్లుబాటు కాదని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంట్లో పోరాటం చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సూచించారు. రాష్ట్ర విభజనను బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ కూడా సమర్థించలేదని గుర్తుచేశారు. సభ (పార్లమెంట్)లో ఎన్ని దారుణాలు జరిగాయో అద్వానీకి తెలుసునని, ఇప్పుడు ఇందుకు సంబంధించి నోటీసులిస్తే అద్వానీ అన్ని విషయాలు చెబుతారని అన్నారు. రాజమహేంద్రవరంలో ఉండవల్లి గురువారం మీడియాతో మాట్లాడారు. దేశ ప్రధాని సభలో లేవనెత్తిన అంశంపై చర్చ జరగాలన్నారు. ప్రధాని చెప్పిన మాటలపై నేతలు వివరణ కోరాలని పేర్కొన్నారు. ‘సభ తలుపులు మూసి విభజన చట్టాన్ని ఆమోదింపచేశారు. సభ్యులు ఎవరూ లేరని తెలిసి విభజన బిల్లును ఎలా ఆమోదించారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ విడిపోయింది. కనుక లోక్‌సభలో టీడీపీ ఎంపీలు మాట్లాడటానికి వాళ్లకు ఏం అభ్యంతరం ఉంది. సభలో జరిగిన దారుణాలు ఆద్వానీకి తెలుసు. ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్లో రాష్ట్రనేతలు నిలదీయాలి. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిలదీయకుంటే .. ప్రజా ప్రతినిధులుగా ఉండటానికి నేతలు అనర్హులు. ఏపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలి. అవిశ్వాస తీర్మానాన్ని సభ నిర్ణయించాలి. కానీ అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రాకుండా చేస్తున్నారు. పార్లమెంట్లో ఏ నిమిషం ఏం జరిగిందో రికార్డు ఉంటుంది. మీడియాకు పార్లమెంట్ రికార్డులన్నీ నేనే ఇస్తాను. విభజన బిల్లుపై సభలో జరిగిన వాటిపై అందరికీ మెయిల్స్ పంపాను. సభలో కేంద్రం పెద్దలను నిలదీయాలని చెప్పా. కానీ ఎవరూ అలా చేయడం లేదు. ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం నేడు ఏపీ సీఎం చంద్రబాబు (టీడీపీ ఎంపీలు)కు ఉంది. మీకు బాధ్యత ఉందని భావిస్తే దయచేసి ఇప్పుడైనా పార్లమెంట్లో ప్రశ్నించాలని’ ఉండవల్లి చెప్పారు. -
‘వైఎస్ జగన్ ఒక అడుగు ముందుకేశారు’
సాక్షి, రాజమండ్రి : ఏపీ ప్రయోజనాల కోసం పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టించి ఒకడుగు ముందుకేశారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం 25 ఎంపీ సీట్లు ఇస్తే చక్రం తిప్పుతానంటూ లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో బుధవారం ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. ఏపీ విభజన రాజ్యాంగ బద్ధంగా జరగలేదని, విభజన బిల్లును నిబంధనలకు వ్యతిరేకంగా పాస్ చేశారని ఉండవల్లి తెలిపారు. విభజన బిల్లు ఆమోద సమయంలో ప్రత్యక్ష ప్రసారాలు ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు. ‘ఓటింగ్ సరిగా నిర్వహించలేదరి, పార్లమెంట్ తలుపులు మూసేసి ఏపీకి అన్యాయం చేశారు. లైవ్ ప్రసారాలు ఉండి ఉంటే ఏపీ ప్రజలకు వాస్తవాలు తెలిసేవి. కేంద్రం ఇచ్చిన నిధులపై అడిగే హక్కు ఎవరికి ఉందో చంద్రబాబు చెప్పాలి. మీరు నిజయంగా యూసీలు ఇచ్చుంటే ఆన్లైన్లో పొందుపరచండి. అప్పుడే చంద్రబాబుపై ప్రజలకు విశ్వాసం ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీపై జేసీ దివాకర్ రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై బీజేపీ నేతలు స్పందించాలి. ప్రభుత్వ చేతకానితనం వల్లే ఏపీకి అన్యాయం జరుగుతోందంటూ’ ఉండవల్లి ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపితే తప్పేంటని సీఎం చంద్రబాబును ఉండవల్లి ప్రశ్నించారు. 2008 అసెంబ్లీ సమావేశాల్లో టీటీడీ నిర్వహణపై చంద్రబాబు సీబీఐ విచారణ కోరిన విషయాన్ని ఈ సందర్భంగా మాజీ ఎంపీ గుర్తుచేశారు. నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మహారాష్ట్ర బీజేపీ మంత్రి భార్యను టీటీడీ బోర్డులో ఎలా నియమిస్తారో చెప్పాలని చంద్రబాబును ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. -
అమరావతి ఎంపిక వెనుక రహస్య ఎజెండా
-
అమరావతిని దెయ్యాల నగరంగా మార్చకండి
-
అమరావతిని దెయ్యాల సిటీగా మార్చొద్దు
సాక్షి, విజయవాడ : అమరావతి కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన డిజైన్లన్నీ గ్రాఫిక్సేనని.. రాజధాని పేరుతో భారీ మోసానికి పాల్పడుతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు రచించిన ‘ఎవరి రాజధాని అమరావతి?’ పుస్తకావిష్కరణ జరిగింది. విజయవాడ బందరు రోడ్డులోని మాకినేని బసవపున్నయ్య భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉండవల్లి హాజరై ప్రసంగించారు. ‘రాజధాని ఎక్కడ కట్టాలనే దానిపై ముందు శివరామకృష్ణన్ కమిటీ వేశారు. ఆ కమిటీ ఇచ్చిన నిదేదిక నచ్చని చంద్రబాబు టీడీపీ నాయకులతో ప్రత్యేకంగా ఓ కమిటీ వేశారు. రైతుల నుంచి భూముల లాక్కుంటూ.. రైతుల త్యాగాలని సీఎం ప్రచారం చేసుకుంటున్నారు. బాబు చేసేది తప్పని శివరామకృష్ణన్ ఏనాడో చెప్పారు. ఐవైఆర్ నిజాలు మాట్లాడుతున్నారు కాబట్టే చంద్రబాబుకు మండిపోతుంది. దయచేసి అమరావతిని దెయ్యాల నగరంగా మార్చకండి’ అని ఉండవల్లి మాట్లాడారు. అంతకు ముందు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుస్తకాన్ని ఆవిష్కరించగా.. వడ్డే శోభనాద్రీశ్వరరావుకు ఐవైఆర్ అంకితమిచ్చారు. ఇక పుస్తకావిష్కరణలో వడ్డే శోభనాద్రీశ్వరరావు, సీపీఐ రామకృష్ణ, సీపీఎం మధు, పలువురు రిటైర్డ్ అధికారులు పాల్గొని ప్రసంగించారు. అమరావతి ఎక్స్‌క్లూజివ్ రాజధాని అమరావతి ఎంపిక వెనుక రహస్య ఎజెండా ఉందని ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఉద్ఘాటించారు. కొందరికి లబ్ధి చేకూర్చేందుకే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని ఆయన పేర్కొన్నారు. పాలక వర్గ విధేయుల రియల్ ఎస్టేట్.. వాణిజ్య ప్రయోజనాలకు అనుగుణంగా అమరావతిని ఎంచుకున్నారే తప్ప.. ఇది ఎంత మాత్రం ప్రజా రాజధాని కాదని ఆయన స్పష్టం చేశారు. అసలు సారవంతమైన రాజధాని ఎంపిక చేయటం సరికాదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. శోభనాద్రీశ్వరావు రైతుల కోసం పాటుపడుతున్న వ్యక్తి అందుకే ఆయనకు పుస్తకాన్ని అంకితమిచ్చినట్లు ఐవైఆర్ వెల్లడించారు. ఇక పుస్తకంలో ఆయన పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. ‘అమరావతి ఏ రకంగానూ ప్రజా రాజధాని కాదు. ఇది ఎక్లూజివ్ రాజధాని. తన జాతి బలమైన సమర్థన ఉండటం వల్లే చంద్రబాబు అమరావతిని ఎంపిక చేశారు. ప్యూహాలు పన్ని కుటిలనీతి ఉపయోగించారు. మాదాపూర్ హైటెక్ సిటీ రియల్ ఎస్టేట్ తరహా నమునాలా అమరావతిని ఎంపిక చేశారు’ అని పేర్కొన్నారు. బుద్దిపోనిచ్చుకోని టీడీపీ... ఐవైఆర్ కృష్ణారావు పుసక్తకావిష్కరణకు టీడీపీ పోటీనిచ్చింది. ప్రజారాధానిపై కుట్ర పేరిట సీనియర్ నేత వర్ల రామయ్య పుస్తకావిష్కరణ చేపట్టారు. ఈ రెండు ఒకేసమయంలో చేపట్టడంతో బందర్ రోడ్డులో పోలీసులు భారీగా మోహరించారు.