మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని బూచిగా చూపేందుకు టీడీపీ ప్రయత్నించిందని బీజేపీ నాయకుడు, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. మంగళవారం ఉండవల్లి సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విభజన సందర్భంగా ఏపీకి ఇవాల్సినవన్నీ కేంద్రం ఇచ్చిందని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న టీడీపీ నేతలు కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తే బీజేపీ ప్రతినిధిగా తను అడ్డుకున్నట్టు పేర్కొన్నారు.