అమరావతి ఎంపిక వెనుక రహస్య ఎజెండా ఉందని ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఉద్ఘాటించారు. కొందరికి లబ్ధి చేకూర్చేందుకే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని ఆయన పేర్కొన్నారు. పాలక వర్గ విధేయుల రియల్ ఎస్టేట్.. వాణిజ్య ప్రయోజనాలకు అనుగుణంగా అమరావతిని ఎంచుకున్నారే తప్ప.. ఇది ఎంత మాత్రం ప్రజా రాజధాని కాదని ఆయన స్పష్టం చేశారు.