
'డివిజన్' ఎందుకు వద్దు?
పార్లమెంట్‌లో ఏం జరిగింది-7
ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన ఫిబ్రవరి 18, 2014న లోక్ సభలో జరిగిన చర్చ వివరాలు మరి కొన్ని...
15.37: శరద్ యాదవ్, మరికొం దరు సభ్యులూ సభ నుంచి నిష్ర్కమించారు.
ప్రొ॥సౌగత్‌రాయ్: తెలుగు వారికి ఒక రాష్ట్రం ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద రాష్ట్రాన్ని విడగొడ్తున్నారు? భాషా ప్రయుక్త రాష్ట్రాల పునాదులనే నాశనం చేస్తున్నారా? అందుకే మేము చర్చ కావాలన్నాం. మీరు చర్చ పూర్తి చేసేశారు. ఇప్పుడు సవరణల మీద తలలు లెక్కపెడ్తున్నారు. సరైన చర్చ జరిపించండి. రూల్స్ ప్రకారం సవరణల మీద నిర్ణయం ప్రకటించండి. మీకు ఎవరో ఏదో చెప్తుంటే, ఆ ప్రకారం నడుచుకోవటం సరికాదు.
స్పీకర్: ది క్వశ్చన్ ఈజ్: 41వ సవరణ, సౌగత్‌రాయ్ ప్రతి పాదించినది, ఆమోదించబడిందా.
సవరణ వీగిపోయింది.
ప్రొ॥సౌగత్‌రాయ్: నాకు 'డివిజన్' కావాలి.
స్పీకర్: శ్రీసౌగత్‌రాయ్, రూల్ 367 సబ్ రూల్ (3) ప్రకారం ఇది సరిగ్గా చేస్తున్నాం. ఏ రూలూ అతిక్రమించటం లేదు. రూల్ ప్రకారమే చేస్తున్నాం.
... అంతరాయం...
స్పీకర్: నాకు తెలుసు. ఇది రూల్ ప్రకారమే జరుగుతోంది.
సౌగత్‌రాయ్: ఇది పద్ధతి కాదు. మీకు తప్పుడు సలహాలిస్తు న్నారు. మేము గొర్రెలం కాదు తలలు లెక్క పెట్టడానికి.
స్పీకర్: 45వ సవరణ, 7వ క్లాజ్‌కి అసదుద్దీన్ ఒవైసీ ప్రవేశ పెడ్తున్నారా?
అసదుద్దీన్ ఒవైసీ: పేజీ 3లో 5 నుండి 7వ లైన్లు 'ఎప్పాయింటెడ్ డే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గవర్నర్, తెలంగాణ రాష్ట్రానికి మరో గవర్నర్ ఉండాలి'.
స్పీకర్: 66 సంవత్సరాలలో, మన రాజ్యాంగం ప్రకారం ఏనాడూ రెండు రాష్ట్రాలకి ఒక గవర్నర్ అంటూ లేరు. ఒక రాష్ట్ర గవర్నర్ మరో రాష్ట్రానికి ఇన్‌చార్జిగా ఉన్నారు. ఇది చట్టవిరుద్ధం. రాజ్యాంగ విరుద్ధం. ఒక సూపర్ గవర్నర్ తయారు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు వాళ్ల సొంత గవర్నర్ ఎందుకుండకూడదు? మీరెందుకు తెలంగాణ ప్రజల్ని నమ్మటంలేదు? తెలంగాణను పరి పాలించే వారిని మీరెందుకు నమ్మరు? ఒక గవర్నర్ రెండు రాష్ట్రా లకెలా ఉంటారు? అందుకే నేనో సవరణ ప్రతిపాదిస్తున్నాను.
15.41: (ఈ దశలో శ్రీ సంసుమ కునగ్గర్ బిశ్వమూర్తి తన స్థానంకి వెళ్లారు)
స్పీకర్: శ్రీ అసదుద్దీన్ ఒవైసీ సవరణ ఓటు కోసం సభ ముందుంచుతున్నాను.
అసదుద్దీన్ ఒవైసీ: మేడమ్ నాకు డివిజన్ కావాలి. తలలు లెక్క పెట్టండి.
15.42: (సంసుమ కునగ్గర్ బిశ్వమూర్తి మళ్లీ స్పీకర్ టేబుల్ దగ్గరకొచ్చారు)
స్పీకర్: తలలు లెక్క తీసుకుందాం.
... అంతరాయం...
ది క్వశ్చన్ ఈజ్:
ఎప్పాయింటెడ్ డే నుండి ప్రస్తుత గవర్నర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గానూ, తెలంగాణ రాష్ట్రానికి వేరే గవర్నరూ ఉంటారు.
ఇప్పుడు అనుకూలురు తమ స్థానాల్లో నిలబడండి.
ఇప్పుడు వ్యతిరేకులు తమ స్థానాల్లో నిలబడండి.
వ్యతిరేకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆయ్= 24 నో 169 సవరణ వీగిపోయింది.
ది క్వశ్చన్ ఈజ్
క్లాజ్ 7 బిల్లులో భాగమవుతుంది
ఆమోదించబడింది.
క్లాజ్ 7 బిల్లులో భాగమయింది.
... అంతరాయం...
స్పీకర్: సౌగత్‌రాయ్, 42వ సవరణ, క్లాజు 8కి ప్రతిపాదిస్తు న్నారా?
ప్రొ॥సౌగత్‌రాయ్: ప్రతిపాదన అభ్యర్థిస్తున్నాను.
"8వ లైన్ గవర్నర్ బాధ్యత, 'లా' చూసుకోవాలి" మేడమ్, ఈ సవరణ ప్రతిపాదిస్తూనే, రూల్ 367(3) మరొక సారి ప్రస్తావిస్తాను. "క్వశ్చన్ విషయంలో స్పీకర్ నిర్ణయం సవాల్ చేయబడితే 'లాబీ'లు క్లియర్ చేయమని ఆదేశించాలి" అప్పుడు మళ్లీ ఆ క్వశ్చన్ అడగాలి. మేము మీ నిర్ణయాన్ని చాలెంజ్ చేస్తున్నాం. అందుకే ఓటింగ్ కావాలంటున్నాం. మా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తున్నాం. ఈ విభజన, దేశవ్యాప్తంగా వేర్పాటువాదాన్ని పెంచుతుంది. ఈ రోజు ఈ చర్య ఇండియా ప్రయోజనాలకే ఆటంకం. ఒక పెద్ద రాష్ట్రాన్ని విభజించటం ద్వారా ఈ ప్రభుత్వం, ఇండియా అనే ఆలోచననే సవాలు చేసే చర్యలు చేపడుతోంది.
'యూ షట్ అప్' ... అంతరాయం...
ఇండియా అఖండతే సవాల్ చేయబడ్తోంది. అందుకే సవరణ ప్రతిపాదిస్తున్నాను.
15.44: సంసుమ కునగ్గర్ బిశ్వమూర్తి, మళ్లీ తన స్థానంకి వెళ్లారు.
స్పీకర్: ది క్వశ్చన్ ఈజ్
గవర్నర్ బాధ్యత చట్టబద్ధ పాలనను చూసుకోవాలి.
... అంతరాయం...
ప్రొ॥సౌగత్‌రాయ్: డివిజన్ కోరుతున్నాం.
ఒవైసీ: నో-మేడమ్ - మాకు డివిజన్ కావాలి.
స్పీకర్: ఆల్ రైట్, లెక్క పెడదాం.
గౌరవ సభ్యులారా, నా ఉద్దేశంలో అనవసరంగా డివిజన్ అడగబడుతోంది. అందువల్ల రూల్ 367 సబ్ రూల్ 3 అనుబం ధాన్ని అనుసరించి, 'ఆయ్' అనేవారు, 'నో' అనేవారు తమ స్థానాల్లో నిలబడితే లెక్క తీసుకుని సభ నిర్ణయాన్ని ప్రకటిస్తాను. తమ స్థానాల్లో లేని సభ్యులు లెక్కలోకి రారు.
15.46: సంసుమ కునగ్గర్ బిశ్వమూర్తి స్పీకర్ టేబుల్ దగ్గర నిల్చున్నారు.
స్పీకర్: ఇప్పుడు 'అనుకూలురు' నిలబడండి.
వ్యతిరేకులు నిలబడండి.
వ్యతిరేకులు ఎక్కువ ఉన్నారు. సవరణ వీగిపోయింది.
-ఉండవల్లి అరుణ్‌కుమార్
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు