
ఐదు కంపెనీలుగా విడదీత
ప్రణాళికకు షేర్‌హోల్డర్లు, రుణదాతల ఆమోదం
ఒక్కో వేదాంత షేరుకు ఒక్కొక్కటి చొప్పున 4 కొత్త కంపెనీల షేర్లు
న్యూఢిల్లీ: షేర్‌హోల్డర్లు, రుణదాతలు ఆమోదముద్ర వేయడంతో డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ విభజనకు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో వ్యాపారాలను అల్యూమినియం, ఆయిల్ తదితర రంగాలవారీగా అయిదు కంపెనీలుగా విడదీస్తారు. డీమెర్జర్ స్కీము ప్రకారం వేదాంత షేర్‌హోల్డర్లకు ఒక్కో షేరుకు గాను కొత్తగా ఏర్పడే నాలుగు సంస్థలకు సంబంధించి అదనంగా ఒక్కొక్క షేరు చొప్పున లభిస్తుంది.
కార్యకలాపాలను క్రమబదీ్ధకరించుకునేందుకు, వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకునేందుకు, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ డీమెర్జర్ ఉపయోగపడుతుందని వేదాంత వెల్లడించింది. అలాగే, ఒక్కో స్వతంత్ర కంపెనీ వేర్వేరుగా ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు సమకూర్చుకునేందుకు, వ్యూహాత్మక భాగస్వాములతో జట్టు కట్టేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొంది. అయిదు కంపెనీలుగా విడదీసే ప్రణాళికకు 99.99 శాతం మంది షేర్‌హోల్డర్లు, 99.59 శాతం మంది సెక్యూర్డ్ రుణదాతలు, 99.95 శాతం మంది అన్‌సెక్యూర్డ్ రుణదాతలు ఆమోదం తెలిపినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది.
గురువారం బీఎస్‌ఈలో వేదాంత షేర్లు దాదాపు 2.40 శాతం పెరిగి రూ. 433.55 వద్ద క్లోజయ్యాయి. ఇంట్రాడేలో సుమారు 3 శాతం పెరిగి రూ. 435.50 స్థాయిని తాకాయి. కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ రూ. 3,969 కోట్లు పెరిగి రూ. 1,69,535 కోట్లకు చేరింది.
ఇవీ కంపెనీలు..
విడదీత అనంతరం వేదాంత లిమిటెడ్ ప్రధానంగా వెండి, జింకు మొదలైన మెటల్స్ ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మిగతా కంపెనీల జాబితాలో వేదాంత అల్యూమినియం, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్, వేదాంత పవర్, వేదాంత ఐరన్ అండ్ స్టీల్ ఉంటాయి. టెక్నాలజీ విభాగాలతో పాటు కొత్త వ్యాపారాలకూ
వేదాంత ఇన్‌క్యుబేటరుగా వ్యవహరిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment