కలకత్తా: రాష్ట్ర విభజన కోసం జరిగే ఎలాంటి ప్రయత్నాలనైనా వ్యతిరేకిస్తున్నట్లు వెస్ట్‌బెంగాల్ అసెంబ్లీ సోమవారం(ఆగస్టు5) ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ‘మేం కో ఆపరేటివ్ ఫెడరలిజాన్ని నమ్ముతున్నాం. బెంగాల్ విభజనకు జరిగే ఎలాంటి ప్రయత్నాన్నైనా వ్యతిరేకిస్తాం’అని సీఎం మమతాబెనర్జీ అన్నారు.
ఈ తీర్మానానికి అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి కూడా మద్దతిచ్చారు. తాము కూడా రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఉత్తర వెస్ట్‌బెంగాల్‌ను విభజించి ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న డిమాండ్ల నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి ప్రతిపక్ష బీజేపీ మద్దతివ్వడంతో మూజువాణి ఓటుతో తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment