resolution
-
ఇలా చేస్తే.. ఏడాదంతా సంతోషమే..!
కొత్త సంవత్సరం అనంగానే.. తొలి రోజున మిత్రులకు, పడనివారికి కూడా శుభాకాంక్షలు తెలిపి సంతోషంగా ఉంటాం. ఇలా విషెస్ చెప్పడమే కాదు ఈ ఏడాదంతా తిరుగలేని విజయం పొందేలా ఏ చేయాలో న్యూ ఇయర్(New Year) తొలిరోజే చక్కటి ప్లాన్ లేదా తీర్మానం(Resolutions) చేసుకుంటే సక్సెస్, సంతోషం రెండూ మీ సొంతం అవుతాయని చెబుతున్నారు నిపుణులు. ఆ ఒక్కే రోజుకే సంతోషం పరిమితం కాకుండా ఏడాదంతా సంతోషభరితంగా జీవతం సాగిపోవాలంటే.. ముఖ్యంగా వర్క్‌లైఫ్ బ్యాలెన్స్(Work life Balance) విషయంలో సరైన విధంగా బ్యాలెన్స్ చేయలేక తిప్పలు పడుతుంటారు. అలాంటివాళ్లు ఇంట బయట గెలవాలంటే..కొత్త ఏడాది తొలిరోజు నుంచే చక్కటి తీర్మానాలు సెట్‌చేసుకుని కనీసం పాటించే యత్నం చేస్తే విజయం తధ్యం అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏం చేయాలంటే..వర్క్‌లైఫ్‌లో పై అధికారి ఇచ్చిన పనులు చేయండి. వర్క్‌లో లోపాలు ఎత్తిచూపిన సానుకూలంగా స్పందించండి. రిపీట్ కాకుండా చూసుకోండి. లేదు అవమానించేలా తప్పులను ఎత్తి చూపితే..సీరియస్‌గా తీసుకోండి. వాళ్లు మన తప్పులను పట్టుకునే అవకాశం ఎందుకిచ్చానా.. అని ఆలోచించండి. ఆ ఛాన్స్ ఇచ్చేదే లే..అన్నట్లు పట్టుదలగా వర్క్‌ని మెరుగుపరుచునే యత్నం చేయండి. అలాగే సహోద్యోగులు మీ గురించి బ్యాడ్‌గా మాట్లాడటం లేదా పై అధికారులకు ఫిర్యాదులు చేయడం వంటివి చేస్తే..టెన్షన్ పడొద్దు. మీ వద్దకు ఆ ఇష్యూ తీసుకొచ్చి పై అధికారి మాట్లాడేంత వరకు కూడా సంయమనం పాటించండి. ఒకవేళ ఆ ప్రస్తావన గురించి ప్రశ్నిస్తే..నిజాయితీగా సూటిగా మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఎక్కడ అహానికి తావివ్వద్దు. మీ నిజాయితీ వారు గుర్తించేలా మసులుకోండి. మరో విషయం మిమ్మల్ని రెచ్చగొట్టేలా పరిస్థితులు ఎదురైన సహనంతో వ్యవహరించండి అదే మీకు శ్రీరామ రక్ష. అలాగే ఇతరులు మీ కంటే మంచి విజయాలను అందుకుంటే..ఆనందంగా అభినందించండి. సంకుచిత భావంతో ముభావంగా ఉండకండి.ఇలా చేయడం వల్ల మన కంటే తెలివైన వ్యక్తులతో సాన్నిత్యం ఏర్పడటమేగాక మీరుకూడా విజయం పొందేలా సలహాలు సూచనలు తెలుసుకునే వీలు ఉంటుంది. అలాగే వర్క్‌లో ఒత్తిడి(Stress) ఎదురైనా లేదా పై అధికారుల నుంచి వచ్చినా..పరిస్థితిని సామరస్యంగా వివరించండి. సాధ్యసాధ్యాలు గురించి కూడా మాట్లాడండి. అయినా ప్రయోజనం లేదు వాళ్లు వినరు అంటే..మేనేజ్మెంట్కి దృష్టికి వచ్చేలా ప్రయత్నం చేయండి. ఎక్కడ నొచ్చుకునేలా మౌనంగా ఒత్తిడిని భరించకండిటీం వర్క్‌గా పనిచేస్తున్నప్పుడూ ఎవరో ఒకరి నుంచి సమస్యలు వస్తూనే ఉంటాయి. దాన్ని తేలిగ్గా తీసుకోండి. మొదట మారెలా మెత్తగా చెప్పండి. పరిస్థితిని బట్టి కాస్త గట్టిగా మాట్లాడండి. అప్పుడూ వారే మారొచ్చు. లేదా ఒకవేళ మీపైనా ఫిర్యాదు చేసినా..భయపడాల్సిన పనిలేదు. యజమాన్యానికి వాస్తవాలెంటో కచ్చితంగా తెలుస్తుందనేది గుర్తించుకోండి. దీంతోపాటు మానసిక ఆనందానికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. నచ్చిన సంగీతం లేదా గేమ్‌లు వంటివి ఆడే సమయం కుదుర్చుకోండి. జీవితంలో అన్ని ఉండాలి. అప్పుడే జీవితం కొత్తగా..ఆనందంగా ఆస్వాదించగలుగుతాం. సాధించిన చిన్న చిన్న విజయాలను కూడా గుర్తు తెచ్చుకుని సంతోషంగా ఉండే యత్నం చేయండి. అలాగే వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. కుటుంబం కోసమే కదా ఇంతలా కష్టపడి సంపాదించేది. అప్పడుప్పుడూ తగిన బడ్జెట్లో వెకేషన్లకి తీసుకువెళ్లేలా ప్లాన్ చేసి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంచే ప్రయత్నం చేయండి. నిజానికి ఇంట్లో వాళ్ల కోరికలన్నంటిని నెరవేర్చడం అందరికీ సాధ్యం కాదు. మనం వాళ్లకి ఇవ్వాల్సింది కేవలం మనం ఉన్నామనే భరోసా అని గుర్తుపెట్టుకోండి. కుంటుబమే లేకపోతే మనం లేమనే విషయం గుర్తెరిగా బంధాలను బలోపేతం చేసుకునేలా ప్రవర్తించండి. అవసరమైతే ఓ మెట్టు దిగండి తప్పులేదు. ఇలాంటి మార్పులను జీవితంలో చేసుకుంటే..సులభంగా ఇంట బయట నెగ్గుకురాగలం అంటున్నారు మానసిక నిపుణులు.(చదవండి: న్యూ ఇయర్ పార్టీ జోష్: ఫస్ట్ డే తలెత్తే హ్యాంగోవర్‌ని హ్యాండిల్ చేయండిలా..!) -
Jammu & Kashmir: రాష్ట్ర హోదా పునరుద్దరణకు తీర్మానం ఆమోదం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ నూతన సీఎం ఓమర్ అబ్దుల్లా నేతృత్వంలోని కేబినెట్ రాష్ట్ర హోదా పునరుద్దరణకు తీర్మానాన్ని ఆమోదించింది. గురువారం జరిగిన మొదటి సమావేశంలో జమ్ముకశ్మీర్ మంత్రివర్గం రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి, మంత్రులు సకీనా మసూద్ ఇటూ, జావేద్ అహ్మద్ రాణా, జావైద్ అహ్మద్ దార్, సతీష్ శర్మ హాజరయ్యారు.‘తీర్మానం ముసాయిదా సిద్ధం అయ్యింది. జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ తీర్మానం ముసాయిదాను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేయడానికి ముఖ్యమంత్రి రెండు రోజుల్లో న్యూఢిల్లీకి వెళతారు’ అంటూ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.కాంగ్రెస్ జమ్ముకశ్మీర్ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర హోదాను పునరుద్ధరించకపోతే తమ పార్టీ కేబినెట్లో భాగం అవ్వదని వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదాను కేంద్రం పునరుద్ధరిస్తుందని ఆశిస్తున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విశ్వాసం వ్యక్తం చేశారు."మేము రాజ్యాధికారం గురించి ఇంతకు ముందు కూడా మాట్లాడాము. ఇప్పుడు కూడా అదే కోరుతున్నాం. రెండు నెలల్లో రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషిన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం త్వరలోదీనిని ఖచ్చితంగా పునరుద్ధరిస్తుందని భావిస్తున్నాను’ అని అబ్దుల్లా తెలిపారు. ఇదిలా ఉండగా 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. కాశ్మీర్‌కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా, స్వయంప్రతిపత్తి నికూడా రద్దు చేసింది. దాంతో పాటు, జమ్మూ కాశ్మీరు రాష్ట్ర హోదాను తొలగిస్తూ జమ్ము కశ్మీర్. అలాగే లడఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.. -
జమిలి ఎన్నికల ఆలోచనను విరమించుకోండి: కేరళ తీర్మానం
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించటంపై ఆలోచనను విరమించుకోవాలని కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం కేరళ అసెంబ్లీలో సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం అప్రజాస్వామికం, దేశ సమాఖ్య నిర్మాణానికి హానికరమని తీర్మానంలో పేర్కొన్నారు.Kerala Legislative Assembly passed a resolution urging the central government to withdraw its proposed 'One Nation, One Election' reform, describing it as undemocratic and detrimental to the nation's federal structure.— ANI (@ANI) October 10, 2024కొన్నేళ్ళుగా చెబుతూ వస్తున్న ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ ప్రతిపాదనపై కేంద్రంలోని అధికార బీజేపీ ఇటీవల మరో అడుగు ముందుకు వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ ఈ ప్రతిపాదనపై ఇచ్చిన నివేదికను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం లాంఛనంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనపై ఓ బిల్లును రానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు భోగట్టా.ఈ ప్రతిపాదనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణలు అవసరం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతిపాదనను కేంద్రంతో పాటు రాష్ట్రాలూ ఆమోదించాల్సి ఉంటుంది. వెరసి, రాజ్యాంగపరంగానూ, ఆచరణలోనూ అనేక అవరోధాలున్న ఈ ప్రతిపాదనపై రాగల నెలల్లో పెద్దయెత్తున రచ్చ రేగడం ఖాయం. -
రాష్ట్ర విభజనకు వ్యతిరేకం: బెంగాల్ అసెంబ్లీ తీర్మానం
కలకత్తా: రాష్ట్ర విభజన కోసం జరిగే ఎలాంటి ప్రయత్నాలనైనా వ్యతిరేకిస్తున్నట్లు వెస్ట్‌బెంగాల్ అసెంబ్లీ సోమవారం(ఆగస్టు5) ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ‘మేం కో ఆపరేటివ్ ఫెడరలిజాన్ని నమ్ముతున్నాం. బెంగాల్ విభజనకు జరిగే ఎలాంటి ప్రయత్నాన్నైనా వ్యతిరేకిస్తాం’అని సీఎం మమతాబెనర్జీ అన్నారు. ఈ తీర్మానానికి అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి కూడా మద్దతిచ్చారు. తాము కూడా రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఉత్తర వెస్ట్బెంగాల్ను విభజించి ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న డిమాండ్ల నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి ప్రతిపక్ష బీజేపీ మద్దతివ్వడంతో మూజువాణి ఓటుతో తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం లభించింది. -
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లవి బ్లాక్మెయిల్ పాలిటిక్స్: కిషన్‌రెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానాలు చేయడం బ్లాక్ మెయిల్ చేయడమేనని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో బుధవారం(జులై 25) ఆయన మీడియాతో మాట్లాడారు.‘కేంద్ర బడ్జెట్‌పై ఢిల్లీలో దీక్ష చేద్దాం.. అమరణ దీక్షలు చేద్దామనడం కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆలోచనను స్పష్టం చేస్తోంది. నరేంద్ర మోదీ సర్కారు పదేళ్లుగా తెలంగాణ సంక్షేమం, అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేశాం. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో 35శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ అనేక అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. ఆంధప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేయాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గతంలో కోరాయి. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశ భవిష్యత్తుకు సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలు పొందుపరిచాం. ఈ బడ్జెట్ పట్ల అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందని అడుగుతున్నారు’అని కిషన్‌రెడ్డి విమర్శించారు. -
నీట్‌ను వ్యతిరేకిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీర్మానం!
బెంగళూరు: నీట్ యూజీ- 2024 పేపర్ లీక్, నిర్వహణలో అవకతవకలు దేశంలో దుమారం రేపాయి. అయితే తాజాగా నీట్ పరీక్షను వ్యతిరేకిస్తూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మరో రెండు తీర్మానాలను సోమవారం కర్ణాటక రాష్ట్ర కేబినెట్ ఆమోదించినట్లు సమాచారం. మరో రెండు తీర్మానాలు ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’, లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినట్లు తెలుస్తోంది.నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. నీట్‌ను రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాష్ట్రాలే సొంతంగా తమ పరీక్షలను నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని కోరారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో నీట్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయగా.. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఇదే తరహా తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.మరోవైపు.. కేబినెట్లో ఆమోదం పొందిన ఈ తీర్మానాలను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపట్టనున్నారు. వీటీతోపాటు, గ్రేటర్ బెంగళూరు గవర్నెన్స్ బిల్లు 2024కు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
బిహార్ ప్రత్యేక హోదా.. అసెంబ్లీలో తీర్మానానికి ఆమోదం
పట్నా: బిహార్‌కు ప్రత్యేక హోదా కోరుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. శనివారం రాష్ట్ర అసెంబ్లీలో బిహార్ ముఖ్య మంత్రి నితీష్‌కుమార్ పార్టీ జేడి(యూ) ప్రత్యేక హోదా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది.కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) బిహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌ను మళ్లీ తెరపైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర సీఎం నితీష్‌కుమార్ దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు.హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ.. నితీష్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రి వర్గం గతేడాది ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో తాము ప్రత్యేక హోదా డిమాండ్లను పరిశీలించబోమని కేంద్రం గతంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సైతం ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ కొన్నేళ్ల నుంచి ఉంది. అయితే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో జేడీ(యూ)తో పాటు టీడీపీ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ విషయంలో సీఎం చంద్రబాబుపై కూడా ఒత్తిడి పెరుగుతుందనటంలో సందేహం లేదు. -
నీట్ రద్దు చేయాలంటూ.. తమిళనాడు అసెంబ్లీ తీర్మానం
చెన్నై: వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) పేపర్ లీక్‌పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమతున్న విషయం తెలిసిందే. అటు పార్లమెంట్‌ను సైతం ఈ అంశం కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నీట్ రద్దు చేయాలంటూ ఏకగ్రీవ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. నీట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది.నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మెడికల్ కాలేజీలో తమ విద్యార్థులను చేర్చుకోకుండా రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని, నీట్ అమలుకు ముందు మాదిరిగా 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.నీట్ పరీక్ష నిర్వహణపై అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనలు, పరీక్షపై వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుని కేంద్రం నీట్‌ను రద్దు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్ చట్టాన్ని సముచితంగా సవరించాలని తీర్మానంలో పేర్కొన్నారు.అయితే సభ ఆమోదించినప్పటికీ, దీనిని నిరసిస్తూ బీజేపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. అనూహ్యంగా దాని మిత్రపక్షం పీఎంకే డీఎంకే తీర్మానానికి మద్దతు ఇచ్చింది.కాగా, నీట్-యూజీ 2024 ఎగ్జామ్ పేపర్ లీక్, నీట్-పీజీ 2024 పరీక్షను ఆకస్మికంగా వాయిదా వేయడంపై అభ్యర్థుల్లో గందరగోళం నెలకొన్నది. ఈ తరుణంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం నీట్ రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మణితనేయ మక్కల్ కట్చి, మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం, తమిళగ వెట్రి కజగం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సహా పలు ప్రాంతీయ పార్టీలు ఈ తీర్మానానికి మద్దతు తెలిపాయి. -
Parliament Special Session: కాక రేపిన ఎమర్జెన్సీ తీర్మానం
న్యూఢిల్లీ: స్పీకర్‌గా బాధ్యతలు చేపడుతూనే బుధవారం బిర్లా తీసుకున్న తొట్ట తొలి నిర్ణయమే లోక్‌సభలో కాక రేపింది. విపక్షాల నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి తీవ్ర నిరసనలకు, వ్యతిరేకతకు దారి తీసింది. 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడాన్ని ఖండిస్తూ స్పీకర్ సభలో స్వయంగా తీర్మానం ప్రవేశపెట్టారు! ‘‘భారత్ ఎప్పుడూ ప్రజాస్వామిక విలువలకు పెద్దపీట వేసింది. అలాంటి దేశంలో ఇందిర 50 ఏళ్ల క్రితం ఇదే రోజున ఎమర్జెన్సీ విధించారు. ప్రజాస్వామిక విలువలపై, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపారు. విపక్ష నేతలను జైళ్లలో కుక్కారు. రాజ్యాంగంపై నేరుగా దాడి చేశారు. ఎమర్జెన్సీ విధించిన 1975 జూన్ 26 దేశ చరిత్రలో ఎన్నటికీ చెరగని మచ్చగా మిగిలిపోతుంది’’ అంటూ తీర్మానాన్ని చదవి విన్పించారు. ఇందిర తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ‘‘ఎమర్జెన్సీ కాలంలో ప్రజలపై ఇందిర సర్కారు చెప్పలేనన్ని అకృత్యాలకు పాల్పడింది. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఎమర్జెన్సీ బాధితుందరికీ 18వ లోక్‌సభ సంతాపం తెలుపుతోంది. ఎమర్జెన్సీ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తోంది’’ అన్నారు. ఎమర్జెన్సీకి నిరసనగా నిమిషం పాటు మౌనం పాటించాలని సభ్యులను కోరారు. ఎన్డీఏ సభ్యులంతా నిలబడి మౌనం పాటించగా విపక్షాలన్నీ స్పీకర్ తీరును తీవ్రంగా ఖండించాయి. ఎమర్జెన్సీ ప్రస్తావనను నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దాంతో స్పీకర్‌గా తొలి రోజే సభను బిర్లా వాయిదా వేయాల్సి వచ్చింది. అనంతరం విపక్షాల నిరసనలకు ప్రతిగా బీజేపీ సభ్యులంతా పార్లమెంటు ప్రాంగణంలో ప్రదర్శనకు దిగారు. ఎమర్జెన్సీ విధింపుపై కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ తీరు ప్రశంసనీయం: మోదీ ఎమర్జెన్సీని స్పీకర్ గట్టిగా ఖండించడం హర్షణీయమని మోదీ అన్నారు. ‘‘ఇందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఎమర్జెన్సీ వేళ జరిగిన అకృత్యాలను స్పీకర్ తన తీర్మానంలో ఎత్తి చూపారు. రాజ్యాంగాన్ని తోసిరాజంటే, ప్రజాభిప్రాయాన్ని అణగదొక్కితే, వ్యవస్థలను నాశనం చేస్తే ఏమవుతుందో చెప్పేందుకు ఇందిర తీసుకున్న ఆ తప్పుడు నిర్ణయం ఒక చక్కని ఉదాహరణ’’ అని ఎక్స్‌లో ప్రధాని పేర్కొన్నారు. -
Parliament Special Session: స్పీకర్‌గా బిర్లా.. మోదీ, రాహుల్ అభినందన
న్యూఢిల్లీ: అనూహ్యమేమీ జరగలేదు. అధికార ఎన్డీఏ పక్ష అభ్యర్థి ఓం బిర్లా లోక్‌సభ స్పీకర్‌గా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. బుధవారం లోక్‌సభ సమావేశం కాగానే స్పీకర్ పదవికి బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో పాటు ఏ పార్టీ కూడా ఓటింగ్ కోసం పట్టుబట్టలేదు. దాంతో మూజువాణి ఓటు ద్వారా విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై బిర్లా విజయం సాధించినట్టు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. స్పీకర్ ఎన్నికపై అధికార, విపక్ష కూటముల మధ్య నెలకొన్న రగడకు ఆ విధంగా తెర పడింది. అనంతరం మోదీ, విపక్ష నేత రాహుల్‌గాం«దీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు 61 ఏళ్ల బిర్లాను స్పీకర్ స్థానం వరకు తోడ్కొని వెళ్లారు. పారీ్టలకు అతీతంగా సభ్యులంతా చప్పట్లతో హర్షధ్వానాలు వెలిబుచ్చారు. అఖిలేశ్ యాదవ్ తదితర విపక్ష సభ్యులంతా ఈ సందర్భంగా బిర్లాను అభినందించారు. విధి నిర్వహణలో ఆయన నిష్పాక్షికంగా వ్యవహరిస్తారని, ప్రజల గొంతుక వినిపించేందుకు విపక్షాలకు తగిన అవకాశాలిస్తారని ఆశాభావం వెలిబుచ్చారు. బలరాం జాఖడ్ అనంతరం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుని తిరిగి స్పీకర్‌గా ఎన్నికైన రికార్డును బిర్లా సొంతం చేసుకున్నారు. లోక్‌సభలో ఎన్డీఏ కూటమికి 293, ఇండియా కూటమికి 233 మంది సభ్యుల బలముంది. వయనాడ్ స్థానానికి రాహుల్ రాజీనామాతో సభలో ఒక ఖాళీ ఉంది. మోదీ తొలి ప్రసంగం బిర్లా ఎన్నిక అనంతరం 18వ లోక్‌సభలో మోదీ తొలి ప్రసంగం చేశారు. గత ఐదేళ్లలో సభ హుందాతనాన్ని పరిరక్షించడంలో స్పీకర్‌గా బిర్లా గొప్ప పరిణతి చూపారంటూ ప్రశంసించారు. పలు చరిత్రాత్మక నిర్ణయాలతో లోక్‌సభ చరిత్రలో స్వర్ణయుగానికి సారథ్యం వహించారంటూ కొనియాడారు. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచి్చన సందర్భాల్లోనూ ఆయన చక్కని సంతులనం పాటించారన్నారు. సభ నిర్వహణలో బిర్లా సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతారని విశ్వాసం వెలిబుచ్చారు. పార్లమెంటేరియన్‌గా ఆయన పనితీరును కొత్త సభ్యులంతా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విపక్షాల అభినందనలురాహుల్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా 18వ లోక్‌సభ చక్కగా పని చేస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఈసారి సభలో విపక్షాల బలం పెరిగిందని గుర్తు చేశారు. వాటికి అందుకు తగ్గట్టుగా ప్రజా సమస్యలు లేవనెత్తేందుకు వీలైనన్ని అవకాశాలు లభించాలన్నారు. ఈ సభలో సభ్యుల సస్పెన్షన్ల వంటి సభ హుందాతనాన్ని తగ్గించే చర్యలుండబోవని అఖిలేశ్ ఆశాభావం వెలిబుచ్చారు. సుదీప్ బంధోపాధ్యాయ (టీఎంసీ), టీఆర్ బాలు (డీఎంకే) తదితరులు మాట్లాడారు. నేడు పార్లమెంటు సంయుక్త సమావేశం గురువారం పార్లమెంటు సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. మోదీ 3.0 నూతన సర్కారు ప్రాథమ్యాలను ఈ సందర్భంగా ఆమె పార్లమెంటు ముందుంచే అవకాశముంది. రాజ్యాంగంలోని 87వ ఆరి్టకల్ ప్రకారం లోక్‌సభ ఎన్నిక అనంతరం సమావేశాలు ప్రారంభమయ్యాక ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముర్ము గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్ నుంచి గుర్రపు బగ్గీలో సంప్రదాయ పద్ధతిలో పార్లమెంటు ప్రాంగణానికి చేరుకుంటారు. గజద్వారం వద్ద ప్రధానితో పాటు లోక్‌సభ, రాజ్యసభ ప్రిసైడింగ్ అధికారులు స్వాగతం పలుకుతారు. సంప్రదాయ సెంగోల్ చేబూని ముందు నడుస్తూ రాష్ట్రపతిని లోక్‌సభ చాంబర్లోకి తీసుకెళ్తారు. మోదీ రాహుల్ కరచాలనంస్పీకర్గా ఎన్నికయ్యాక బిర్లాను పోడియం వద్దకు తీసుకెళ్లే సందర్భంలో లోక్‌సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బిర్లాను అభినందించే క్రమంలో మోదీ, రాహుల్ కరచాలనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు నవ్వుతూ మాట్లాడుకోవడం సభ్యులందరినీ ఆకర్షించింది. రాహుల్ నయా లుక్ స్పీకర్ ఎన్నిక సందర్భంగా రాహుల్ సరికొత్త వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. ఆయన తెలుపు రంగు లాల్చీ, పైజామా ధరించి లోక్‌సభకు వచ్చారు. ఆయన కొన్నేళ్లుగా టీ షర్టు, బ్యాగీ ప్యాంటే ధరిస్తున్నారు. భారత్ జోడో యాత్రల్లోనూ, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనూ అదే వస్త్రధారణ కొనసాగించారు. సోమ, మంగళవారాల్లో లోక్‌సభకు వచి్చనప్పుడు, సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు కూడా టీ షర్టు, బ్యాగీ ప్యాంటులోనే కని్పంచారు. రాహుల్ ప్రస్తుతం లోక్‌సభలో విపక్ష నేత కావడంతో అందుకు తగ్గట్టుగా లాల్చీ, పైజామాకు మారినట్టు భావిస్తున్నారు. ‘‘స్పీకర్‌గా ఎన్నికైన మీకు విపక్షం తరఫున, ‘ఇండియా’ కూటమి తరఫున మీకు అభినందనలు. ఉభయ సభలు సజావుగా సవ్యంగా సాగాలని ఆశిస్తున్నాం. విశ్వాసంతోనే సహకారం సాధ్యమవుతుంది. ప్రజావాణి పార్లమెంట్లో ప్రతిధ్వనించాలి. ప్రభుత్వం వెంట అధికార బలం ఉండొచ్చేమోగానీ విపక్షాలు గతంతో పోలిస్తే మరింత గట్టిగా ప్రజావాణిని పార్లమెంట్లో వినిపించనున్నాయి. మమ్మల్ని మాట్లాడేందుకు మీరు అనుమతిస్తారని విశ్వసిస్తున్నాం. విపక్షసభ్యులు మాట్లాడితే ప్రజల గొంతు పార్లమెంట్లో మోగినట్లే. ఈ మేరకు మీరు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించండి’’ ‘‘గత లోక్‌సభ సెషన్లు అత్యంత ఫలవంతమయ్యాయని ప్రభుత్వం ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉంది. విపక్షసభ్యులందరినీ సస్పెండ్ చేసి సభలో మౌనం రాజ్యమేలేలా చేయడం అప్రజాస్వామిక విధానం. సభ అత్యంత ప్రభావవంతంగా నడవడం కంటే ప్రజావాణి ఎంతగా సభలో వినిపించింది అనేదే ముఖ్యం’’ – రాహుల్ గాంధీ‘‘ప్రజాస్వామ్య న్యాయానికి ఓం బిర్లాయే చీఫ్ జస్టిస్. మరెవరి ఆదేశాల ప్రకారమోకాకుండా ఆయన మార్గదర్శకత్వంలోనే సభ సజావుగా సాగాలని ఆశిస్తున్నా. వివక్షలేకుండా ప్రతి రాజకీయ పక్షానికి సమానమైన అవకాశాలు కలి్పంచాలి. నిష్పక్షపాత వైఖరి ప్రదర్శించడం గొప్ప బాధ్యత. సస్పెన్షన్ వంటి సభ గౌరవానికి హాని కల్గించే చర్యలు పునరావృతంకాబోవని భావిస్తున్నా’’ – అఖిలేశ్ యాదవ్ ‘‘ సభలో విపక్షాలు బలం పుంజుకున్నాయి. దీంతో సభ కొత్తరూపు సంతరించుకుందిగానీ బీజేపీ వైఖరి మారలేదు. మెజారిటీ సభ్యులున్న పారీ్టలకు ప్రాధాన్యత దక్కుతోంది. సభకు సారథి అయిన స్పీకర్ చిన్న పార్టీలనూ పట్టించుకోవాలి’’ – అసదుద్దీన్ అడ్డంకులు లేకుండా సాగాలి... ‘‘నన్ను స్పీకర్‌గా ఎన్నుకున్నందుకు సభకు ధన్యవాదాలు. అధికార, విపక్ష సభ్యులు ఒక్కతాటిపై నడిస్తేనే సభ సాగుతుంది. ప్రతి ఒక్కరి గొంతుకనూ వినడమే భారత ప్రజాస్వామ్యపు మూలబలం. ఏకైక సభ్యుడున్న పారీ్టకి కూడా సభలో కావాల్సినంత సమయం లభించాలి. మనల్ని ప్రజలు ఎన్నో ఆశలతో ఎన్నుకున్నారు. కనుక వారి సమస్యల పరిష్కారం కోసం సభ అడ్డంకుల్లేకుండా నడుస్తుందని ఆశిస్తున్నా. విమర్శలుండొచ్చు. కానీ సభను అడ్డుకోవడం సరి కాదు. సభ్యులపై చర్యలు తీసుకోవాలని నాకెప్పుడూ ఉండదు. కానీ ఉన్నత పార్లమెంటరీ సంప్రదాయాలను పరిరక్షించేందుకు కఠిన నిర్ణయాలు తప్పకపోవచ్చు’’ – స్పీకర్‌గా ఎన్నికైన అనంతరం లోక్‌సభనుద్దేశించి ఓం బిర్లా -
మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
నగరంపాలెం: గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా జడ్జి హాల్లో సోమవారం సుప్రీంకోర్టు మీడియేషన్/కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ(ఎంసీపీసీ–న్యూఢిల్లీ), రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ(అమరావతి) ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘మధ్యవర్తిత్వం’పై 40 గంటల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. గుంటూరు జోన్‌లోని గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఏపీ రాష్ట్ర హైకోర్టు ఎంపిక చేసిన న్యాయాధికారులు హాజరు కాగా, ఈ నెల 20 నుంచి 24 వరకు కొనసాగనున్నాయి.శిక్షణ అధికారులుగా ఎంపికైన సుప్రీంకోర్టు మీడియేషన్, కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ ఢిల్లీ నుంచి నిషా సక్సేనా(జిల్లా జడ్జి), నీర్జాభాటియా(జిల్లా జడ్జి) హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి తరగతులను ప్రారంభించారు. వారు మధ్యవర్తిత్వానికి సంబంధించి పలు అంశాలను వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎఫ్ఏసీ చైర్మన్, నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్‌బాబు, సంస్థ టి.లీలావతి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం అని అన్నారు. తక్కువ ఖర్చుతో న్యాయం పొందేందుకు మధ్యవర్తిత్వం అనే సాధనం చక్కగా ఉపకరిస్తుందని వివరించారు. -
Israel-Hamas War: గాజాలో తక్షణమే కాల్పుల విరమణ
ఐక్యరాజ్యసమితి: ఇజ్రాయెల్–హమాస్ మధ్య వివాదం మొదలైన అయిదు నెలల తర్వాత సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత రంజాన్ మాసంలో గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని సంబంధిత వర్గాలను కోరుతూ ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. 15 సభ్యదేశాలతో కూడిన మండలిలోని 10 తాత్కాలిక సభ్యదేశాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. రష్యా, చైనా సహా 14 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. ఎవరూ వ్యతిరేకించనప్పటికీ శాశ్వత సభ్యదేశం అమెరికా ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. ‘గాజా విషయంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న తీర్మానాన్ని భద్రతా మండలి ఆమోదించింది. తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, బేషరతుగా బందీలందరినీ విడుదల చేయాలని కోరింది’అని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ‘ఎక్స్’లో తెలిపారు. అలాగే, గాజాలో చిక్కుకున్న పాలస్తీనియన్ల వైద్య, ఇతర మానవతా అవసరాలను పరిష్కరించాలని, నిర్బంధించిన వారందరికీ అంతర్జాతీయ చట్టాల ప్రకారం కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత వర్గాలపై ఉందని తీర్మానం పేర్కొంది. ‘ఈ తీర్మానాన్ని కచి్చతంగా అమలు చేయాల్సిందే. వైఫల్యం క్షమించరానిది’ అంటూ అని గుటెరస్ వ్యాఖ్యానించారు. మండలి తీర్మానంపై ఇజ్రాయెల్ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని ఐరాస హ్యూమన్ రైట్స్ వాచ్ డైరెక్టర్ ల్యూయిస్ పేర్కొన్నారు. పాలస్తీనా ప్రజల ఆకలిచావులను ఆపేందుకు మానవతా సాయం అందించేందుకు వీలు కల్పించాలని, చట్ట విరుద్ధ దాడులను ఆపాలని ఇజ్రాయెల్‌ను కోరారు. అమెరికా పర్యటనను రద్దు చేసుకున్న నెతన్యాహు ఐరాస తీర్మానానికి నిరసనగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉన్నత స్థాయి బృందంతో తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. పాలస్తీనా శరణార్థుల ఏజెన్సీకి సహకారం నిలిపివేయాలని కూడా ఇజ్రాయెల్ నిర్ణయించింది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు చేయడం, ప్రతిగా గాజాపై ఇజ్రాయెల్ తీవ్రస్థాయి యుద్ధంతో విరుచుకుపడుతుంటం తెలిసిందే. -
ఆరు నెలల్లో 7,877 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల్లోనే 7,877 కేసులను పరిష్కారించామని, ఈ విషయంలో న్యాయమూర్తులు, న్యాయవాదులతో పాటు ఇతర సిబ్బంది కృషి ప్రశంసనీయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే కొనియాడారు. ఆన్లైన్ సేవలను మరింత చేరువ చేయడం, కాగిత రహిత ఫైలింగ్ వంటి అంశాలు కేసుల సత్వర పరిష్కారానికి దోహదం చేస్తున్నాయని చెప్పారు. భవిష్యత్‌లో మరిన్ని సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైకోర్టు ప్రాంగణంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాలు కేటాయించడం హర్షణీయమన్నారు. త్వరలోనే భవన నిర్మాణం ప్రారంభం కానుందని, అందరికీ అన్ని వసతులు, సాంకేతికతతో నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. కొత్త జిల్లాల్లోనూ న్యాయస్థానాల నిర్మాణానికి ప్రభుత్వం భూములు కేటాయించిందన్నారు. ఈ జిల్లాల్లో అన్ని వసతులతో భవన నిర్మాణాలు జరిగేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ.సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్రావు, న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, ఏఏజీలు ఇమ్రాన్‌ఖాన్, తేరా రజనీకాంత్‌రెడ్డి, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమిపూజ.. హైకోర్టు ఆవరణలో అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు సీజే జస్టిస్ అలోక్ అరాధే శుక్రవారం భూమిపూజ చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉన్నదన్నారు. -
కాల్పుల విరమణపై తీర్మానం..అమెరికా వీటో!
న్యూయార్క్: గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి రావాలంటూ శుక్రవారం ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అమెరికా మోకాలడ్డింది యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, బందీలను హమాస్ మిలిటెంట్లు బేషరతుగా వెంటనే విడిచిపెట్టాలంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేసిన ప్రతిపాదనకు ఐరాసలోని 90 సభ్యదేశాలు మద్దతు పలికాయి. ఆ దేశం మండలిలో ప్రవేశపెట్టిన ఆ తీర్మానానికి మొత్తం 15 దేశాలకు గాను 13 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటేశారు. మరో శాశ్వత సభ్యదేశం బ్రిటన్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. గాజాలో మానవతా సంక్షోభ నివారణ నిమిత్తం ఇటీవల ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ అసాధారణ అధికారాన్ని ఉపయోగించారు. తక్షణమే మానవతా కోణంలో కాల్పుల విరమణ జరగాలని, పౌరుల రక్షణ కోసం, అత్యవసర సాయం అందజేయడానికి అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలని మండలి దేశాలకు గుటెరస్ పిలుపునిచ్చారు. యూఎన్ ఛార్టర్‌లోని ఆర్టికల్ 99 కింద ప్రత్యేక అధికారంతో అంతర్జాతీయంగా ఆందోళనలను కలిగించే పరిస్థితుల్లో భద్రతా మండలిని సమావేశ పరచవచ్చు. దీనిలో భాగంగా సమావేశమైన మండలిలో యూఏఈ తీర్మానంపై ఓటింగ్ జరిగింది. మండలిలో శాశ్వత సభ్య దేశమైన అమెరికా తన వీటో అధికారంతో ఆ తీర్మానాన్ని అడ్డుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కాల్పుల విరమణను గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. అది హమాస్ పుంజుకునేందుకు ఉపయోగపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ దేశ ప్రతినిధి రాబర్ట్ వుడ్ మండలిలో మాట్లాడుతూ.. ‘ఈ తీర్మానం వల్ల క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావం ఉండదు. ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజలు శాంతి, భద్రతల మధ్య జీవించాలని అమెరికా బలంగా కోరుకుంటోంది. అయితే, అస్థిరమైన కాల్పుల విరమణకు అంగీకరిస్తే హమాస్ మరో యుద్ధానికి ప్రణాళిక రచిస్తుంది’అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ముసాయిదాలో సవరణలు చేయాలని అమెరికా అంటోంది. మండలిలో తీర్మానాన్ని అమెరికా అడ్డుకోవడంపై యూఏఈ రాయబారి మహ్మద్ అబుషాహబ్ విచారం వ్యక్తం చేశారు. -
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస తీర్మానం.. భారత్ ఆమోదం
న్యూయార్క్: ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఆక్రమిత సిరియన్ గోలన్ హైట్స్ నుండి ఇజ్రాయెల్ వైదొలగాలని పిలుపునిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానానికి అనుకూలంగా 91 దేశాలు ఓటు వేశాయి. ఐరాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. నవంబర్ 28, మంగళవారం నాడు ఓటింగ్ జరిగింది. "ఆక్రమిత సిరియన్ గోలన్ ప్రాంతం నుండి జూన్ 4,1967 నాటి రేఖ వరకు వైదొలగాలని ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస భద్రతా మండలి తీర్మానిస్తోంది' అని పేర్కొంటూ ఐరాస అధికారిక పత్రాన్ని విడుదల చేసింది. 1967 యుద్ధంలో సిరియా నుంచి గోలన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది. భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, చైనా, లెబనాన్, ఇరాన్, ఇరాక్, ఇండోనేషియా సహా 91 దేశాలు ఐక్యరాజ్యసమితిలో తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఈ తీర్మాణానికి 8 దేశాలు-- ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, మైక్రోనేషియా, ఇజ్రాయెల్, కెనడా, మార్షల్ దీవులు దీనికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఉక్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బెల్జియం, జపాన్, కెన్యా, పోలాండ్, ఆస్ట్రియా, స్పెయిన్ సహా 62 దేశాలు గైర్హాజరయ్యాయి. ఇదీ చదవండి: జపాన్ సముద్రంలో కూలిన అమెరికా సైనిక విమానం -
గాజా మానవతా సంధి తీర్మానానికి ఓటేయని భారత్
ఇజ్రాయెల్-హమాస్ వివాదంలో.. తక్షణ మానవతావాద సంధికి పిలుపునిచ్చిన తీర్మానంపై ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యింది. గాజాలో మానవతా దృక్పథంతో సంధి కుదర్చాలనే పలు ప్రతిపాదనలపై ఐరాస జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది. మొత్తం 193 సభ్యదేశాలున్న జనరల్ అసెంబ్లీలో ఓటింగ్‌లో మొత్తం 179 సభ్య దేశాలు పాల్గొన్నాయి. ఈ ప్రతిపాదనలకు అనుకూలంగా 120 దేశాలు ఓటు వేశాయి. 14 దేశాలు వ్యతిరేకించాయి. అయితే 45 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరు కాగా.. అందులో భారత్ కూడా ఉంది. ఐరాస జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్ భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, యూకే దూరంగా ఉన్నాయి. ‘‘పౌరుల రక్షణ, చట్టపరమైన & మానవతా బాధ్యతలను సమర్థించడం’’ పేరిట జోర్దాన్ ఈ తీర్మానం ప్రతిపాదించింది. బంగ్లాదేశ్, మాల్దీవ్స్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, రష్యా సహా 40 దేశాలు మద్దతు తీర్మానానికి ఇచ్చాయి. గాజా స్ట్రిప్‌లో నివసిస్తోన్న వారికి మానవత దృక్పథంతో సహాయం అందించడం, వారికోసం ప్రత్యేకంగా కారిడార్‌ను ఏర్పాటు చేయడం.. వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. అయితే.. ఈ అనూహ్య నిర్ణయానికి గల కారణాల్ని భారత్ వివరించింది. తీర్మానంలో ఎక్కడా హమాస్ గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. ఈ విషయంలో జోర్డాన్ తీరును తప్పు పట్టింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి స్పష్టమైన సందేశం పంపాల్సిన అవసరం ఉందని భారత్ తన నిర్ణయాన్ని వివరించింది. "ఈ అసెంబ్లీ చర్చలు ఉగ్రవాదం, హింసకు వ్యతిరేకంగా స్పష్టమైన సందేశాన్ని పంపుతాయని, దౌత్యం-చర్చల అవకాశాలను విస్తరింపజేస్తాయని మేము ఆశిస్తున్నాము" అని ఐక్యరాజ్యసమితిలో భారతదేశం యొక్క డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజనా పటేల్ అన్నారు. ఓటింగ్‌కు దూరంగా ఉంటూనే కెనడా చేసిన సవరణలను భారత్ సమర్థించింది. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడులు.. అనే వాక్యాన్ని ఈ ప్రతిపాదనల్లో చేర్చాలంటూ కెనడా సవరణలను సూచించగా.. భారత్ సమర్థించింది. ఈ సవరణలు చేయగలిగితే తాము ఓటింగ్‌లో పాల్గొంటామని యోజనా ముందుగానే తెలిపారు. కానీ, అది జరగలేదు. జోర్డాన్ రూపొందించిన తీర్మానంలో హమాస్ గురించి ప్రస్తావన లేకపోవడంపై అమెరికా సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. హమాస్, వారి చెరలో బందీలు.. అనే పదాలను జోర్డాన్ రూపొందించిన డ్రాఫ్ట్‌లో చేర్చాలనేది కెనడా డిమాండ్. కెనడా ప్రతిపాదించిన ఈ సవరణలను ఇందులో చేర్చడానికి ఓటింగ్ సైతం నిర్వహించింది ఐరాస. దీనికి అనుకూలంగా భారత్ సహా 87 దేశాలు ఓటు వేశాయి. అయితే.. మూడింట రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో ఇది ఆమోదం పొందలేకపోయింది. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల్లో మెరుపు దాడులకు దిగింది హమాస్. సరిహద్దులను దాటుకుని ఇజ్రాయెల్ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చి.. పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. దీంతో సైన్యంతో ఎదురుదాడికి దిగిన ఇజ్రాయెల్.. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్ చేపట్టింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వైమానిక దాడులతో నిప్పులు కురిపిస్తోంది. ఫలితంగా.. గాజా ఛిద్రమైపోయింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. ఇజ్రాయెల్- హమాస్ పరస్పర దాడుల్లో ఇప్పటికి 6,700 మందికి పైగా మరణించారు. అదే స్థాయిలో వేలాదిమంది గాయపడ్డారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. దాడులు తీవ్రతరమౌతోన్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. -
‘అసైన్డ్’ రైతులకు యాజమాన్య హక్కులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నిరుపేద రైతులకు వారి అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కేటాయించి 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములపై వాటి యజమానులకు సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పిస్తూ ఏపీ అసైన్డ్ భూముల(ప్రొబిషన్ ట్రాన్స్ఫర్) చట్టం–1977 సవరణ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. దీనితో పాటు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు 10 ఏళ్ల తర్వాత యాజమాన్య హక్కులు బదిలీ చేసుకునే అవకాశాన్నిచ్చింది. సోమవారం శాసన సభ మూడో రోజు సమావేశాల్లో మంత్రులు ప్రవేశపెట్టిన 10 బిల్లులతో పాటు బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ చేసిన తీర్మానానికీ సభ ఆమోదం తెలిపింది. పేద విద్యార్థులకు ఉన్నత విద్య రాష్ట్రంలోని విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రభుత్వం అనేక విద్యా సంస్కరణలు తీసుకొచ్చింది. తాజాగా ప్రైవేటు వర్సిటీలు కూడా అంతర్జాతీయంగా టాప్ 100 వర్సిటీలతో కలిసి సంయుక్త సర్టిఫికేష¯న్ తప్పనిసరిగా అందించేలా ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు (స్థాపన, క్రమబద్ధీకరణ) చట్టం–2016ను సవరించింది. ఇందులో కొత్తగా ఏర్పడే వర్సిటీల్లో 65:35 నిష్పత్తిలో ప్రభుత్వ కోటా (35శాతం సీట్లు) కింద పేద విద్యార్థులకు చదువుకొనే అవకాశాన్ని కల్పిస్తోంది. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లోని అధ్యాపక, మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి రాతపూర్వక పరీక్షలను ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (వర్సిటీల్లో నియామకాలకు అదనపు ఫంక్షన్లు) చట్టం–2023లో సవరణ చేసింది. నిరుపేదలకు భూ పంపిణీ రాష్ట్రంలో భూదాన్–గ్రామదాన్ బోర్డును ప్రభుత్వమే స్వయంగా ఏర్పాటు చేసేలా చట్టాన్ని సవరించింది. భూదాన్ ఉద్యమకర్త వినోభా భావే, ఆయన నిర్దేశించిన వ్యక్తుల సమ్మతి ప్రకారమే భూదాన్ – గ్రామదాన్ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ వినోభా భావే మరణించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది. ఆయన నిర్దేశించిన వ్యక్తులు ఎవరనేది స్పష్టత లేకపోవడంతో బోర్డు ఏర్పాటుకు అవాంతరాలేర్పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వమే బోర్డును ఏర్పాటు చేసి భూదాన్ – గ్రామదాన్లోని భూమిని నిరుపేదలకు కేటాయించేలా చర్యలు చేపట్టేలా చట్టాన్ని సవరించింది. డెఫ్ టెన్నిస్ క్రీడాకారిణి జఫ్రీన్‌కు ఉద్యోగం రాష్ట్రానికి చెందిన డెఫ్ ఒలింపిక్ విజేత, అంతర్జాతీయ డెఫ్ టెన్నిస్ క్రీడాకారిణి షేక్ జఫ్రీన్‌కు వ్యవసాయ, సహకార శాఖలో సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్‌గా గ్రూప్–1 స్థాయి ఉద్యోగాన్ని కల్పిస్తూ ఏపీ పబ్లిక్ సర్వీసుల నియామకాలు క్రమద్ధీకరణ, సిబ్బంది తీరు, వేతన స్వరూపాన్ని హేతు బద్ధీకరించే చట్టం–1994ను సవరించింది. జఫ్రీన్ క్రీడారంగంలో దేశానికి అందించిన విశిష్ట సేవలను గౌరవిస్తూ ఈ ఉద్యోగాన్ని ఇచ్చింది. -
ఇండియా బదులుగా భారత్ అని ముద్రించిన కేంద్రం
-
మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గం
సాక్షి, హైదరాబాద్: న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంలో మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్ పేర్కొన్నారు. కోర్టులు, చట్టాల ద్వారా అందేది కక్షిదారులపై బయటి నుంచి రుద్దిన పరిష్కారమే అవుతుందని.. మనుషులంతా కూర్చుని సంప్రదింపులతో జరిపే మానవీయ పరిష్కారం కాదని చెప్పారు. విద్వేష భావనలు, విద్వేష ప్రసంగాలతో కలుషితం అవుతున్న సమాజంలో సోక్రటీస్ వంటి మహనీయులు ప్రవచించిన జీవన విధానం మంచిదని సూచించారు. శనివారం హైదరాబాద్ షామీర్పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో 20వ స్నాతకోత్సవం జరిగింది. ఇందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ (నల్సా) కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్ ముఖ్య అతిథిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వర్సిటీ చాన్సలర్ అలోక్ అరాధే అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్ మాట్లాడుతూ.. ‘‘మనుషులం కనుకే ఆలోచిస్తాం.. ఒకరికొకరు భిన్నంగా ఆలోచిస్తాం. తర్క, వితర్కాలతో సంభాషించుకుంటూనే శాంతియుతంగా జీవించే సమాజం ఉండాలి. మన రాజ్యాంగ నైతికత కూడా దీన్నే తెలియజేస్తుంది. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే విధానంలో అందరి తర్కం, వాదన విని.. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుంది. నాలుగు మెదళ్ల సంఘర్షణ నుంచి వచ్చే పరిష్కారం మెరుగ్గానే ఉంటుందనడంలో అశ్చర్యం అవసరం లేదు..’’ అని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం అందేలా కృషి చేయాలని న్యాయ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సహకారం మరువలేనిది.. నల్సార్ వర్సిటీలో వసతులు కల్పించడంలో సీఎం కేసీఆర్ సహకారం మరువలేనిదని వర్సిటీ వీసీ శ్రీకృష్ణదేవరావు పేర్కొన్నారు. జ్యుడిషియల్ అకాడమీ కోసం 25 ఎకరాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. 25ఏళ్ల నల్సార్ వర్సిటీ ప్రస్థానంలో ఎన్నో కొత్త కోర్సులను తీసుకొచ్చామని, ఎందరో విద్యార్థులను సమాజానికి అందించామని చెప్పారు. లీగల్ ఎయిడ్‌తోపాటు అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను ప్రోత్సహించడంలో నల్సార్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్డీ, ఎల్ఎల్ఎం, ఎంబీఏ, బీఏ ఎల్ఎల్బీ ఆనర్స్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలతో పాటు 58 మందికి బంగారు పతకాలను అందజేశారు. ప్రొఫెసర్ బాలకృష్ణరెడ్డితోపాటు ఇతరులు రాసిన పుస్తకాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు సీజే ఆవిష్కరించారు. హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యకార్యదర్శి గోవర్థన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పేరు మార్చుకోనున్న కేరళ!
తిరువనంతపురం: కేరళ రాష్ట్రం అధికారికంగా పేరు మార్చుకోనున్నట్లు సీఎం పినరయ్ విజయన్ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టగా.. అది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఆ తీర్మానం ప్రకారం ప్రస్తుతం ఉన్న కేరళ పేరును 'కేరళమ్'గా మారుస్తారు. అసెంబ్లీ మద్దతు లభించడంతో ఈ బిల్లును కేంద్ర ఆమోదానికి పంపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా సీఎం పినరయ్ విజయన్ కేంద్రాన్ని కోరారు. ఇంగ్లీష్‌తో సహా అన్ని భాషల్లో రాష్ట్ర పేరను కేరళమ్‌గా మార్చాలని అన్నారు. సభ్యులు తీర్మాణాన్ని అసెంబ్లీ స్పీకర్ ఏఎన్ శంషీర్ కూడా ఆమోదించారు. కేరళ రాష్ట్ర పేరును మలయాళంలో కేరళమ్ అనే అంటారు. కానీ, మిగిలిన అన్ని భాషల్లో కేరళగానే పిలుస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చేనాటికి మలయాళ భాష మాట్లాడే వారందర్ని కలిపి ఒక రాష్ట్రంగా పరిగణించారు. కానీ రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో రాష్ట్రం పేరును కేరళగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పేరును రాష్ట్ర సర్కార్ మార్చాలని నిర్ణయించింది. ఇదీ చదవండి: మరో వివాదంలో రాహుల్ గాంధీ -
Manipur: మతం రంగు పులమొద్దు
ఢిల్లీ: మణిపూర్ హింసకు మతం రంగును అద్ది.. ఏకంగా పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టింది యూకే. అయితే దీనిపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతర్గత విషయాల్లో జోక్యాన్ని సహించబోమని చెబుతూనే.. వలసవాద బుద్ధిని ప్రదర్శించారంటూ మండిపడింది. తాజాగా ఈ ఎపిసోడ్లో మరో పరిణామం చోటు చేసుకుంది. ఇంఫాల్‌కు చెందిన పౌర సంఘాలన్నీ Coordinating Committee on Manipur Integrity సంయుక్తంగా.. యూరోపియన్ పార్లమెంట్‌కు లేఖలు రాశాయి. మణిపూర్ అల్లర్లు వలస చిన్-కుకీ నార్క్ ఉగ్రవాదులకు, స్థానిక మెయితీ తెగలకు మధ్య జరుగుతోంది. అంతేకాని దానికి మతం రంగు పులమడం సరికాదని పేర్కొన్నాయి. ఈ మేరకు స్ట్రాస్బోర్గ్కు చెందిన యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ రాబర్టా మెట్సోలాకు సీవోసీవోఎంఐ కో-ఆర్డినేటర్ జితేంద్ర నిన్గోంబా లేఖ రాశారు. ‘‘మణిపూర్ అల్లర్లు.. హింసపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనవహించడం సరికాదని, కేంద్రం సత్వరమే జోక్యం చేసుకుని ఉంటే ఉంటే పరిస్థితి ఇలా తయారయ్యేది కాదని.. ఇప్పటికైనా చర్యలు చేపట్టాలంటూ యూరోపియన్ పార్లమెంట్ తొలిసారిగా మణిపూర్ అంశం మీద తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ పరిణామాన్ని స్వాగతించిన సీవోసీవోఎంఐ.. మతం రంగు అద్దడంపై మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మణిపూర్ ఘర్షణలకు ఆజ్యం పోసింది నార్క్-టెర్రరిజం. అలాంటి ప్రధాన సమస్యను మీరు విస్మరించారు. తద్వారా మణిపూర్‌ను మరో న్యూ గోల్డెన్ ట్రయాంగిల్‌గా మారేందుకు అవకాశం కల్పించారు. (చైనా, లావోస్, మయన్మార్, థాయ్‌లాండ్‌లో డ్రగ్ ట్రాఫికింగ్ కారిడార్లను కలిపి ది గోల్డెన్ ట్రయాంగిల్‌గా అభివర్ణిస్తుంటారు.) ఇలాంటి తీర్మానం ప్రవేశపెట్టడం విచారకరం. చిన్-కుకీ ఉగ్ర సంస్థల ప్రచారం వల్లే.. మణిపూర్‌లో క్రైస్తవ మైనారిటీ, మెజారిటీ మెయితీ హిందువుల మధ్య వివాదంగా మీరు తప్పుగా అర్థం చేసుకోగలిగేలా చేసింది. మణిపూర్‌లో మతపరమైన కారణాల వల్ల హింస చెలరేగలేదు. పైగా ఇక్కడెంతో సామరస్యం విరజిల్లుతోంది కూడా. రాజధాని ఇంఫాల్ సహా మెయితీల ప్రాధాన్యం ఉన్న ప్రాంతాల్లోనూ చర్చిల కార్యకలాపాలకు ఎలాంటి విఘాతం కలగలేదని మీరు గమనించాలి. మణిపూర్‌లో లక్షాల డెబ్భై వేల జనాభా ఉన్న మెయితీ తెగ ప్రజలు క్రైస్తవులే. అలాగే.. కుకీ జనాభాలో 35 శాతం క్రైస్తవులు ఉన్నారు. కేవలం గంజాయి, మత్తు పదార్థాల రవాణా(నార్కో టెర్రరిజం), ఆయుధాల అక్రమ రవాణా మీద ఆధారపడి ఉన్న వలస ‘చిన్-కుకీ’ గ్రూప్‌ల వల్లే మణిపూర్‌కు ఈ పరిస్థితి దాపురించింది. వీళ్ల ప్రభావం సరిహద్దు దేశాలైన బంగ్లాదేశ్, మయన్మార్‌కు కూడా తప్పడం లేదు అని లేఖలో స్పష్టం చేసింది సీవోసీవోఎంఐ. ఇదీ చదవండి: మెయితీల వలసబాట.. కారణం ఎవరంటే.. -
అన్నామలైకి వ్యతిరేకంగా అన్నాడీఎంకే తీర్మానం
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే మాజీ చీఫ్ దివంగత జయలలితను ఉద్దేశించి పరోక్షంగా ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అమ్మను తెరపైకి తెచ్చి అవినీతి విమర్శ చేశాడంటూ అన్నామలైపై ఏఐఏడీఎంకే కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో మిత్రధర్మాన్ని బీజేపీ పాతరేస్తోందని మండిపడుతోంది. అదే టైంలో పొత్తు తెగిపోతోందనే ఊహాగానాల నడుమ ఇవాళ(మంగళవారం) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ అన్నామలైకి వ్యతిరేకంగా అన్నాడీఎకేం ఓ తీర్మానం చేసి.. ఆమోదించింది. అన్నామలై చేసిన వ్యాఖ్యలు అనుభవలేమి, బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవంటూ ఆ తీర్మానంలో పేర్కొంది పార్టీ. గత కొంతకాలంగా మిత్రపక్షంతో అన్నామలై తీరు సరిగా ఉండడం లేదని, తన వ్యాఖ్యలకు గానూ ఆయన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో మిత్రపక్షం(బీజేపీ) దృష్టిసారించాల్సిన అవసరం ఉందంటూ అందులో పేర్కొంది. వాస్తవానికి ఇవాళ జరిగిన ఏఐఏడీఎంకే జిల్లా కార్యదర్శలు సమావేశమే. కొత్త సభ్యత్వం నమోదు గురించి చర్చించాల్సి ఉంది. అయితే అన్నామలై వ్యాఖ్యలు మంట పుట్టించిన నేపథ్యంలో అనూహ్యంగా ఇలా ఆయనకు వ్యతిరేక తీర్మానం ఆమోదించింది పార్టీ. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నామలై.. జయలలితపై నమోదు అయిన అక్రమాస్తుల కేసు గురించి పరోక్షంగా ప్రస్తావించాడు. ‘‘ఈ రాష్ట్రంలో(తమిళనాడు) అవినీతి పేరుకుపోయి ఉంది. మాజీ ముఖ్యమంత్రులు సైతం అవినీతి కేసుల్లో దోషులుగా తేలారు. ఈ కారణం వల్లే తమిళనాడు ఇవాళ దేశంలోనే అవినీతి రాష్ట్రాల జాబితాలో నిలిచింది. అలాంటి ప్రభుత్వాలను బీజేపీ నిలదీసి తీరుతుంది’’ అంటూ వ్యాఖ్యానించారాయన. దీంతో ఏఐఏడీఎంకే క్యాడర్ నొచ్చుకుంది. 1998లో బీజేపీ అధికారంలోకి రావడానికి జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే సాయం చేసిన విషయాన్ని మరిచిపోయి ఉంటుందంటూ అన్నామలైకు చరకలు అంటించారు పలువురు నేతలు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై అన్నామలై వెనక్కి తీసుకోకపోతే.. పొత్తు తెంచుకునే విషయంపై ఆలోచన చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది పార్టీ. ఇక ఇవాళ ఏకంగా అన్నామలైకి వ్యతిరేకంగా తీర్మానం చేయడం గమనార్హం. ఇక బీజేపీ కూడా ఈ విషయంలో తగ్గడం లేదు. అన్నామలై వ్యాఖ్యలను అన్నాడీఎంకే తప్పుగా అర్థం చేసుకుందని అంటోంది. మరోవైపు తీవ్ర వ్యాఖ్యలు చేసిన అన్నాడీఎంకే నేత డీ జయకుమార్‌పై బీజేపీ మండిపడింది. అన్నామలై అసలు ఓ పార్టీ చీఫ్‌గా ఉండేందుకు అర్హుడే కాదు. ఆయన మాటలు జారవిడిచి ఉండాల్సింది కాదు. ఆయన తీరు చూస్తుంటే మాతో పొత్తు కొనసాగించేందుకు ఆసక్తితో లేనట్లు కనిపిస్తోంది. లేదంటే.. మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించాలని అనుకోవట్లేదమో అంటూ జయకుమార్ మండిపడ్డారు. ఇక అక్రమాస్తుల కేసులో A1 నిందితురాలుగా జయలలితే ఉన్నారు. అయితే తీర్పు వెలువడడానికి కంటే ముందే జయలలిత కన్నుమూశారు. ఈ కేసులో ఆమె నిచ్చెలి శశికళ, మరొకందరికి జైలు శిక్ష పడింది. జయలలిత అక్రమాస్తుల కేసు.. ఇవీ పూర్తి వివరాలు -
హిందూ ఫోబియాని ఖండించే తీర్మానాన్ని ఆమోదించిన యూఎస్ రాష్ట్రం
హిందూ ఫోబియాను, హిందూ వ్యతిరేక మతోన్మాదాన్ని ఖండిస్తూ యూఎస్‌లోని జార్జియా రాష్ట్రం ఒక తీర్మానాన్ని తీసుకొచ్చి ఆమోదించింది. అటువంటి చట్టబద్ధమైన చర్య తీసుకున్న తొలి అమెరికన్ రాష్ట్రంగా నిలించింది. ఆ తీర్మానంలో.. హిందూఫోబియాను ఖండిస్తూ.. దాదాపు 100 దేశాలలో 1.2 బిలియన్లకు పైగా అనుచరులను కలిగి ఉన్న అతిపెద్ద పురాతన మతాలలో హిందూ మతం ఒకటి. పైగా పరస్పర గౌరవం, శాంతి విలువలతో విభిన్న సంప్రదాయాలు, విశ్వాస వ్యవస్థలను కలిగి ఉన్న మతం అని తీర్మానంలో పేర్కొంది. ఈ తీర్మానాన్ని అట్లాంటా శివారులోని ఫోర్సిత్ కౌంటీకి చెందిన ప్రతినిధులు లారెన్ మెక్‌డొనాల్డ్, టాడ్‌జోన్స్ ప్రవేశపెట్టారు. అంతేగాదు ఈ తీర్మానంలో వైద్యం, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ, ఫైనాన్స్, అకాడెమియా, తయారీ, ఇంధనం, రిటైల్ వాణిజ్యం వంటి విభిన్న రంగాలకు అమెరికన్-హిందూ కమ్యూనిటీ ప్రధాన సహకారాన్ని అందించిందని గుర్తించింది. అలాగే యోగా, ఆయుర్వేదం, ధ్యానం, ఆహారం, సంగీతం, కళలు వంటివి అమెరికా సాంస్కృతికతను సుసంపన్నం చేశాయి. పైగా అమెరికన్ కమ్యూనిటీ వాటిని అడాప్ట్ చేసుకోవడమేగాక మిలియన్ల మంది జీవితాలను మెరుగుపరిచాయని కూడా పేర్కొంది. అలాగే దేశంలోని అనేక ప్రాంతాలలో గత కొన్ని దశాబ్దాలుగా హిందూ-అమెరికన్లపై ద్వేషపూరిత నేరాలు నమోదైన ఘటనలను వివరిస్తూ..హిందూ మతాన్ని విచ్ఛిన్నం చేసేందుకు విద్యారంగానికి చెందిన కొందరు హిందూ-అమెరికన్లపై ద్వేషపూరిత నేరాలకు పాల్పడుతున్నారని ఈ తీర్మానం పేర్కొంది. వాస్తవానికి ఈ నినాదం జార్జియా రాజధానిలో మార్చి 22న తొలిసారిగా హిందూ న్యాయవాద దినోత్సవాన్ని నిర్వహించే ఉత్తర అమెరికా హిందువలు కూటమి(కోహెచ్‌ఎన్‌ఏ) నుంచి వచ్చింది. దీనికి అమెరికాలోని రిపబ్లికన్లు, డెమోక్రాట్లకు సంబంధించి సుమారు 25 మంది చట్టసభ సభ్యులు హాజరయ్యారు. అలాగే హిందూ కమ్యూనిటీలో చేరిన కొందరూ తమ ఆందోళనలు ఆర్థం చేసకుని, ఈ వివక్షకు వ్యతిరేకంగా సమాజాన్ని రక్షించే మార్గాలను రూపొందించడానికి కృషి చేస్తామని హామి ఇచ్చినట్లు కోహెచ్‌ఎన్‌ఏ పేర్కొంది. కాగా, ఈ కౌంటీ రిజల్యూషన్‌ను ఆమోదించే ప్రక్రియలో మాకు మార్గనిర్దేశం చేసిన రెప్ మెక్‌డొనాల్డ్, రెప్ జోన్స్ తోపాటు చట్టసభ సభ్యులతో కలిసి పనిచేయడం నిజమైన గౌరవం అని కోహెచ్‌ఎన్‌ఏ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ మీనన్ అన్నారు. ఇప్పటి వరకు శాసనసభ్యులందరూ ఎజెండాలోని శాసనపరమైన అంశాల ప్రకారం చాలా గంటలు పని చేస్తున్నారని విన్నాం. కానీ ఈ రోజు వారంతా హిందూ సమాజానికి ఎంత విలువ ఇస్తున్నారో చూపించడానికి న్యాయవాద దినోత్సవంలో మాతో చేరడమే గాక దాన్ని నిజం చేసి చూపించారని రాజీవ్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కోహెచ్‌ఎన్‌ఏ ప్రధాన కార్యదర్శి శోభా స్వామి మాట్లాడుతూ..హిందూ అమెరికన్లు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి అసత్య ప్రచారం తోపాటుగా ఈ హిందూ ఫోబిక్ కథనాలు కూడా అమెరికా కమ్యూనిటిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇవి ఒకరకరంగా హిందువులపై విద్వేషాన్ని పెంచేలా చేయడమేగాక భారతీయ అమెరికన్ సంతతికిచెందిన ప్రజలపై వివక్ష చూపేందుకు కారణమవుతోంది. అందువల్ల అటువంటి మతోన్మాదాన్ని ఎదుర్కొనడానికి ప్రత్యేక చట్టాలు, పర్యవేక్షణ అవసరమని చెబుతూ వారి సహాయన్ని కోరినట్లు శోభా వివరించారు. (చదవండి: భారత్ నాటోలో చేరనుందా? యూఎస్ నాటో రాయబారి షాకింగ్ వ్యాఖ్యలు) -
గెయిల్ గూటికి జేబీఎఫ్ పెట్రోకెమికల్స్
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార చర్యల్లో ఉన్న జేబీఎఫ్ పెట్రోకెమికల్స్ కంపెనీని ప్రభుత్వరంగ సంస్థ గెయిల్ కొనుగోలు చేయనుంది. రూ.2,079 కోట్లతో గెయిల్ వేసిన బిడ్‌కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం లభించింది. పెట్రోకెమికల్స్ వ్యాపారాన్ని విస్తరించాలన్న పట్టుదలతో గెయిల్ కొంతకాలంగా ఉంది. ఇప్పుడు జెబీఎఫ్ కొనుగోలుతో కంపెనీ తన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు వీలు పడుతుంది. తాము ఇచ్చిన రుణాలను జేబీఎఫ్ చెల్లించక పోవడంతో రుణదాతలు ఎన్సీఎల్టీ అనుమతితో విక్రయానికి పెట్టారు. దీనికి గెయిల్ సమర్పించిన పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ అహ్మదాబాద్ బెంచ్ ఆమోదం తెలిపినట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. (రిలయన్స్ అధినేత అంబానీ కళ్లు చెదిరే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్) ఇండియన్ ఆయిల్, ఓఎన్జీసీ కర్సార్షియంతో పోటీ పడి మరీ గెయిల్ జేబీఎఫ్ బిడ్డింగ్‌లో విజేతగా నిలిచింది. ఐడీబీఐ బ్యాంక్ రూ.5628 కోట్లను రాబట్టుకునేందుకు జేబీఎఫ్‌ను వేలం వేసింది. కొనుగోలు లావాదేవీ ఇంకా పూర్తి కావాల్సి ఉందని గెయిల్ తెలిపింది. జేబీఎఫ్కు మంగళూరు సెజ్‌లో 1.25 మిలియన్ టన్నుల టెరెఫ్తాలిక్ యాసిడ్ తయారీ ప్లాంట్ ఉంది. గెయిల్‌కు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని పతా వద్ద పెట్రోకెమికల్ ప్లాంట్ ఉంది. ఇక్కడ 8,10,000 టన్నుల వార్షిక పాలీమర్స్ తయారు చేయగలదు. వచ్చే ఏడాదికి మహారాష్ట్రలోని ఉసార్‌లో ప్రొపేన్ డీహైడ్రోజెనేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది (ఇదీ చదవండి: ‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!) -
కులవివక్షను నిషేధించిన సియాటిల్
వాషింగ్టన్: కులవివక్షను నిషేధిస్తూ అమెరికాలోని సియాటిల్ నగరం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అగ్ర రాజ్యంలో ఈ చర్య తీసుకున్న తొలి నగరంగా నిలిచింది. ఈ మేరకు భారత సంతతికి చెందిన నేత, ఆర్థికవేత్త క్షమా సావంత్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్థానిక కౌన్సిల్ భారీ మెజారిటీతో ఆమోదించింది. నగర వివక్ష వ్యతిరేక విధానంలో కులాన్ని కూడా జోడిస్తూ నిర్ణయం తీసుకుంది. అనంతరం సావంత్ మీడియాతో మాట్లాడారు. కులవివక్ష వ్యతిరేక తీర్మానం భారీ మద్దతుతో ఆమోదం పొందిందని హర్షాతిరేకాల నడుమ వెల్లడించారు. ‘‘అమెరికాలో కులవివక్షపై పోరాటంలో ఇదో కీలక ముందడుగు. ఇక దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించేలా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరముంది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది చరిత్మాత్మక నిర్ణయమని సియాటిల్ టైమ్స్ వార్తా పత్రిక కొనియాడింది. ‘‘ఈ రోజు కోసం హత్య, అత్యాచార బెదిరింపులెన్నింటినో తట్టుకుంటూ ముందుకు సాగాం. అంతిమంగా ద్వేషంపై ప్రేమ గెలిచింది’’ అని తాజా నిర్ణయం వెనక కీలకంగా వ్యవహరించిన ఈక్వాలిటీ ల్యాబ్స్ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. భారత్‌లో కులవివక్షను 1948లో నిషేధించారు. 1950లో రాజ్యాంగంలో పొందుపరిచారు. పలు సంస్థల వ్యతిరేకత! సియాటిల్ కౌన్సిల్ నిర్ణయాన్ని హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్) వంటి సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి! ‘‘ఈ విషయంలో కేవలం దక్షిణాసియావాసులను మాత్రమే లక్ష్యం చేసుకున్నారు. ఇలా వివక్ష వ్యతిరేక విధానంలో కులాన్ని జోడించడం అసంబద్ధం’’ అని హెచ్ఏఎఫ్ సహ వ్యవవస్థాపకుడు సుహాగ్ శుక్లా ఆరోపించారు. ‘‘ఈ ముసుగులో దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికావాసులతో మిగతా వారి కంటే భిన్నంగా వ్యవహరించనున్నారు. ఈ కుటిల యత్నాలకు ఈ ఓటింగ్ ద్వారా ఆమోదముద్ర పడింది’’ అంటూ దుయ్యబట్టారు. ఇదో ప్రమాదకరమైన తప్పుడు చర్య అని సంస్థ ఎండీ సమీర్ కల్రా అభిప్రాయపడ్డారు. ఈ చర్య సియాటిల్‌లోని దళిత బహుజనులకు కచ్చితంగా హాని చేసేదేనని అంబేడ్కర్–పూలే నెట్వర్క్ ఆఫ్ అమెరికన్ దళిత్స్ అండ్ బహుజన్స్కు చెందిన టి.మధు ఆరోపించారు. ఇలా కులాన్ని విధాన నిర్ణయంలో భాగం చేయడం స్థానికుల్లో హిందువుల పట్ల ఉన్న భయాన్ని (హిందూఫోబియా)ను మరింత పెంచుతుందని అమెరికాలోని భారత సంతతివారు ఆందోళన చెందుతున్నారు. హిందువులను భయభ్రాంతులను చేసే యత్నాల్లో భాగంగా అమెరికాలో గత మూడేళ్లలో పది హిందూ ఆలయాలు, గాంధీ, శివాజీ వంటి ఐదు విగ్రహాల విధ్వంస చర్యలు చోటుచేసుకున్నాయి. 2018 అమెరికన్ కమ్యూనిటీ సర్వే ప్రకారం అక్కడ ఉంటున్న భారత సంతతి వ్యక్తుల సంఖ్య 42 లక్షల పై చిలుకే. అమెరికా ఎప్పుడూ కులవ్యవస్థను అధికారికంగా గుర్తించకపోయినా అక్కడి దక్షిణాసియావాసులు ఉన్నత విద్యా సంస్థల్లో, పనిచేసే చోట కులవివక్షను ఎదుర్కొన్న ఉదంతాలెన్నో ఉన్నాయి. -
జగిత్యాల, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ల రద్దు! కౌన్సిళ్ల కీలక నిర్ణయం
సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్/ జగిత్యాల: తమ పంట భూములను కాపాడుకునేందుకు రైతులు చేసిన పోరాటం ఫలించింది. కామారెడ్డి, జగిత్యాల పట్టణాల్లో కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాలను రద్దు చేయాలంటూ వారు చేపట్టిన ఆందోళనకు ప్రభుత్వం తలొగ్గింది. ఈ రెండు చోట్ల మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రక్రియలను నిలిపివేస్తూ మున్సిపల్ పాలకవర్గాలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి. రైతుల భూములు ఎక్కడికీ పోవని, ఆవేదన చెందవద్దని ప్రకటించాయి. రైతుల భూములకు నష్టం కలగకుండా ప్రణాళికలను రూపొందిస్తామని అధికారులు తెలిపారు. రైతుల ఉధృత ఉద్యమంతో.. కామారెడ్డి మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్‌కు సంబంధించి డీటీసీపీ, ఢిల్లీకి చెందిన డీడీఎఫ్ సంస్థలు కలిసి ముసాయిదా రూపొందించడం, అందులో పంట భూములను పారిశ్రా మిక, వాణిజ్య జోన్లుగా చూపడాన్ని తప్పుపడుతూ రైతులు ఆందోళనకు దిగడం తెలిసిందే. జెడ్పీ మాజీ చైర్మన్ కె.వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఉద్యమానికి దిగారు. దీనికి వివిధ రాజ కీయ పక్షాలు మద్దతుగా నిలి చాయి. అయితే అడ్లూర్ ఎల్లా రెడ్డికి చెందిన రైతు పయ్యవుల రాములు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనతో పోరాటం ఉధృతమైంది. చివరికి మాస్టర్‌ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తూ శుక్రవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. మరోవైపు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్ కామారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ జితేష్ వి.పాటిల్, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, మున్సిపల్ కమిషనర్ దేవేందర్‌లతో సమీక్షించారు. అనంతరం ముసా యిదా ప్రక్రియను నిలిపివేస్తున్నామని అరవింద్‌కుమార్ ప్రక టించారు. విలీన గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసు కుని కొత్త మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తామని తెలిపారు. రైతుల భూమిని సేకరించే ఉద్దేశంతో మాస్టర్‌ప్లాన్ తయారు చేయ లేదని, రైతుల భూములు ఎక్కడికీ పోవని చెప్పారు. కొత్త రోడ్ల నిర్మాణంలో రైతులకు నష్టం జరగకుండా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు, నేతలు హర్షం వ్యక్తం చేశారు. అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో టపాసులు కాల్చారు. ఉద్యమానికి అండగా నిలిచారంటూ జెడ్పీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డిని అభినందించారు. జగిత్యాల మున్సిపాలిటీలోనూ.. జగిత్యాల మున్సిపాలిటీలోనూ ముసాయిదా మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తూ పాలకవర్గం శుక్రవారం తీర్మానించింది. జగిత్యాల మున్సిపాలిటీలో పట్టణ శివార్లలోని హుస్నాబాద్, తిప్పన్నపేట, మోతె, తిమ్మాపూర్, ధరూర్, నర్సింగాపూర్ గ్రామాలను విలీనం చేస్తూ గత ఏడాది డిసెంబర్లో మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపొందించారు. పలుగ్రామాల్లోని వ్యవసాయ భూములను రిక్రియేషన్, ఇండస్ట్రియల్, కమర్షియల్ జోన్ల పరిధిలో చేర్చారు. దీనిపై ఆయా గ్రామాల ప్రజ లు, రైతులు ఆందోళనలకు దిగారు. ధర్నాలు, రాస్తారో కోలు, కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, వంటావార్పుతో నిరసనలు తెలిపారు. గురువారం జగిత్యాల మున్సిపాలిటీ ముట్టడి, పట్టణ దిగ్బంధం కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ పాలకవర్గం శుక్రవారం అత్యవసరంగా సమావేశమై.. మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేసింది. -
భగ్గుమంటున్న సరిహద్దు వివాదం: తగ్గేదేలే! అన్న బసవరాజ్ బొమ్మై
సరిహద్దు విషయమై మహారాష్ట్ర తీసుకున్న తాజా చర్యపై కర్ణాట ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సీరియస్ అయ్యారు. మహారాష్ట్ర నాయకులు ఆమోదించిన తీర్మానానికి ఎలాంటి అర్థం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని రెచ్చగొట్టి, విభజిస్తామని బెదిరిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. 1956లో తీసుకువచ్చిన రాష్ట్ర పునర్వ్యవస్థికరణ చట్టాన్నిఆమోదించి దశాబ్దాలు గడిచాయన్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారని బొమ్మై అన్నారు. అలాంటి తీర్మానాన్ని ఆమోదించి మహారాష్ట్ర రాజకీయ జిమ్మిక్కులకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు. మేము మా నిర్ణయాలకు కట్టుబడి ఉన్నామని తెగేసి చెప్పారు. అలాగే కర్ణాటకలో ఒక్క అంగుళం కుడా మహారాష్ట్రకు వెళ్లదని కరాఖండీగా చెప్పారు. అయినా సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడూ అలాంటి తీర్మానాన్ని ఎలా ఆమోదించారని గట్టిగా ప్రశ్నించారు. ఇదిలా ఉండగా కర్ణాటక కూడా మహారాష్ట్ర వివాదంపై ఇటీవలే తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో బొమ్మై తమ తీర్మానానికి చాలా భిన్నంగా ఉందంటూ మహారాష్ట్రపై విరుచుకుపడ్డారు. కర్ణాటకలోని కన్నడ ప్రజలు, కన్నడం మాట్లాడే కమ్యూనిటీల ప్రయోజనాలను కాపాడతాం అని నొక్కి చెప్పారు. ఆ తీర్మానంలో మా కర్ణాటకలోని భూమిని లాక్కుంటామని చెబుతున్నారని, కానీ తాము సుప్రీ కోర్టుని విశ్వసిస్తున్నాం కాబట్టి తమ భూమీని కచ్చితంగా కోల్పోమని బొమ్మై ధీమాగా చెప్పారు. (చదవండి: రాజుకుంటున్న సరిహద్దు వివాదం: ప్రతి అంగుళం మహారాష్ట్రకే చెందుతోందంటూ షిండే తీర్మానం) -
ప్రతి అంగుళం మహారాష్ట్రకే చెందుతోందంటూ షిండే తీర్మానం
మహారాష్ట్ర, కర్ణాటకల మధ్య సరిహద్దు వివాదం రోజు రోజుకు మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంగళవారం మరాఠీ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ.. అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు కూడా. వాస్తవానికి మహారాష్ట్రతో ఉన్న సరిహద్దు వివాదంపై కర్ణాటక శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన కొద్దిరోజుల తర్వాత షిండే ఈ తీర్మాన్ని ప్రవేశపెట్టడం గమనార్హం. వచ్చే ఏడాది కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం జోక్యం చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పైగా బీజేపీ పాలిత రెండు రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోందేగానీ తగ్గడం లేదు. ఐతే మహారాష్ట్ర తీర్మానం ప్రకారం.. బెల్గాం, కార్వార్, బీదర్, నిపాని, భాల్కీలోని ప్రతి అంగుళం సహా 865 మరాఠీ మాట్లాడే గ్రామాలు ఉన్నాయని, ఆయా గ్రామాల్లో ప్రతి అంగుళం మహారాష్ట్రకే చెందుతోందని చెబుతోంది. కానీ కర్ణాటక ఈ వాదనను తోసిపుచ్చటమే గాక తీవ్రంగా ఖండించింది. కర్ణాటక నేల, నీరు, భాష, కన్నడిగుల ప్రయోజనాల విషయంలో రాజీ పడేదే లేదని కరాఖండీగా చెప్పింది. ఇది కర్ణాటక ప్రజల భావాలకు సంబంధించినదని, ఈ విషయంలో తాము ఐక్యంగా కట్టుబడి ఉన్నాం అని తేల్చి చెప్పింది. అంతేగాదు రాష్ట్రప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామంటూ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శాసనసభలో ఇటీవలే తీర్మానం కూడా చేశారు. గతంలో బొమ్మై హోం మంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, 1956లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకతో సరిహద్దును పునర్నిర్మించాలని డిమాండ్ చేయడంతోనే ఈ సరిహద్దు వివాదం రాజుకుంది. అంతేగాక బెలగావి, కార్వార్, నిప్పావితో సహా కర్ణాటకకు ఇచ్చిన 865 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఇరువర్గాల రాజకీయ నేతలు పరస్పరం దాడులు చేసుకోవడంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా, ఉథవ్ ఠాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ డిసెంబర్ 21న చైనా సరిహద్దు వివాదాన్ని తెర మీదకు తీసుకువస్తూ..చైనా ప్రవేశించినట్లు కర్ణాటకలో అడుగుపెడతాం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అధికారం కోల్పోయిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంపై దాడి చేస్తూ..కర్ణాటకపై బలమైన వైఖరి అవలంభించ లేదంటూ ఆరోపణలు చేస్తోంది. (చదవండి: భారత్ జలాల్లోకి పాక్ ఫిషింగ్ బోట్..అప్రమత్తమైన అధికారులు) -
ఆ హోదాను తొలగించాలని ఉక్రెయిన్ పిలుపు: షాక్‌లో రష్యా
ఐక్యారాజ్యసమితి నుంచి మొత్తంగా రష్యాను తొలగించాలని ఉక్రెయిన్ మంత్రిత్వ శాఖ సోమవారం పిలుపునిచ్చింది. దురాక్రమణ యుద్ధాలకు దిగుతున్న రష్యా యూఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యుడిగా ఏ విధంగా తీర్మానాన్ని వీటో చేయగలదని ప్రశ్నించింది. అంతేగాదు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో రష్యా ఫెడరేషన్‌కు శాశ్వత సభ్యుడిగా ఉన్న హోదాను తొలగించడమే కాకుండా మొత్తంగా ఐక్యరాజ్యసమితి నుంచే తీసేయాలని యూఎన్‌లోని సభ్యదేశాలకు ఉక్రెయిన్ పిలుపునిచ్చింది. 1991లో సోవియట్ యూనియన్‌తో బ్రేక్అప్ అయిన తర్వాత నుంచే యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో యూఎస్ఎస్ఆర్ స్థానాన్ని చట్టవిరుద్ధంగా ఆక్రమించిందని పేర్కొంది. మాస్కో ఇతర దేశాల భూభాగాలను స్వాధీనం చేసుకుంటూ ఐక్యరాజ్యసమితిలో గత మూడు దశాబ్దాలుగా తన అక్రమ ఉనికిని చాటుకుంటుందంటూ ఉక్రెయిన్ ఆరోపణలు గుప్పించింది. వాస్తవానికి యూఎస్ సెక్యూరిటీ కౌన్సిల్‌లోని 15 సీట్లతో కూడిన ఐదుగురు శాశ్వత సభ్యులకు యూఎన్ తీర్మానాలపై వీటో అధికారం కలిగి ఉన్నారు. (చదవండి: తైవాన్‌కి చుక్కలు చూపించేలా.. జల, వాయు మార్గాల్లో చైనా సైనిక విన్యాసాలు) -
YSRCP Plenary 2022: విద్యా రంగంపై తీర్మానం: హైలైట్స్ ఇవే..
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: మంచి చదువులతో పిల్లలను తీర్చిదిద్దినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధిస్తాయని నమ్మి సీఎం వైఎస్ జగన్ విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యా రంగంలో ప్రభుత్వం తెచి్చన సంస్కరణలు, ఇతర కార్యక్రమాలతో రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి భవిష్యత్తు బంగారుమయం కానుందని చెప్పారు. శుక్రవారం జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీలో విద్యారంగంపై మంత్రి బొత్స తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చించిన అనంతరం సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. విద్య మీద ప్రభుత్వం పెట్టే ఖర్చును దేశాభివృద్ధికి పెట్టుబడిగా చూస్తున్నామన్నారు. చదవండి: వైద్య, ఆరోగ్య రంగంపై తీర్మానంలోని అంశాల్లో హైలైట్స్ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో వేల కోట్ల రూపాయలు విద్యా రంగానికి ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ప్రపంచ దేశాలతో పోటీ పడేలా చదువులు కొనసాగించాలని సీఎం విద్యా సంస్కరణలను యజ్ఞంలా కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. విద్యా సంస్కరణలను ప్రతిపక్షాలు హేళన చేయడంపై మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు, అవగాహన లేని నేతలే విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం విద్యారంగంలో మార్పులు తెచ్చిందన్నారు. ఒకప్పుడు 1 నుంచి 5వ తరగతి వరకు ఒక్క టీచరే ఉండటం వల్ల పిల్లలకు సరైన బోధన అందేది కాదన్నారు. కానీ ఇప్పుడు 3వ తరగతి నుంచే ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్‌తో పిల్లలకు బోధన అందేలా చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర విద్యార్థులు ఏ రాష్ట్రం, ఏ దేశం వెళ్లినా గర్వంగా తలెత్తుకొని తిరిగేటట్టు తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో నాసిరకమైన విద్య.. గత ప్రభుత్వాలు ప్రైవేటు కళాశాలలి్న, స్కూళ్లను ప్రోత్సహించాయని.. పరీక్షలను చూసి రాయించాయని మంత్రి బొత్స తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థులను ఉత్తీర్ణులను చేయించి భారీగా దోచుకున్నారని మండిపడ్డారు. నాసిరకమైన విద్యను అందించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా మన విద్యార్థులకు పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు దొరకని స్థితిని తెచ్చారని నిప్పులు చెరిగారు. ఇలా కాకుండా ఒక కుటుంబంలో విద్యార్థికి మంచి విద్య అందితే ఆ కుటుంబ ఆరి్థక స్థితిగతులు మారిపోతాయన్నారు. ఇది స్నేహపూర్వక ప్రభుత్వమని.. ఉపాధ్యాయులకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తుందన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలన పగ్గాలను చేపట్టిన మొదటి రోజు నుంచే విద్యా సంస్కరణలపై దృష్టి సారించారని గుర్తు చేశారు. నేడు ప్రైవేటు స్కూల్స్‌ను మించి సకల వసతులతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారన్నారు. అమ్మ ఒడి, విద్యాకానుక, జగనన్న గోరుముద్ద తదితర పథకాలతో బడికి వెళ్లే పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడం ద్వారా మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో నెగ్గుకురాగల ఆత్మవిశ్వాసాన్ని కల్పించారని పేర్కొన్నారు. హైలైట్స్ ♦విద్యపై పెట్టే ఖర్చు దేశాభివృద్ధికి పెట్టుబడి ♦రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ప్రపంచ దేశాలతో పోటీ పడేలా చదువులు ♦ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యా రంగంలో సంస్కరణలు ♦ అమ్మ ఒడి జగనన్న మూడో పుత్రిక ♦ఇంగ్లిష్ మీడియం విద్య.. ♦మా హక్కు అనేది ప్రతి విద్యార్థి భావన ♦రాష్ట్ర విద్యార్థులు ఏ రాష్ట్రం, ఏ దేశం వెళ్లినా గర్వంగా తలెత్తుకొని తిరిగేటట్టు తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పం ♦ఒక విద్యార్థికి మంచి చదువు లభిస్తే ఆ కుటుంబ ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి. ♦మనం పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే ♦ ప్రైవేటు వర్సిటీల్లోనూ పేదలకు 35 శాతం సీట్లు ♦గత ప్రభుత్వాల హయాంలో ప్రైవేటు స్కూళ్లకు, కళాశాలలకు ప్రోత్సాహం ♦ కార్పొరేట్‌కు అనుగుణంగానే గత ప్రభుత్వం చట్టాలు పేద పిల్లల పెద్ద చదువులకు అనేక పథకాలు అమ్మ ఒడి జగనన్న మూడో పుత్రిక. పేదల పిల్లలు పెద్ద చదువులు చదివేలా సీఎం వైఎస్ జగన్ అనేక పథకాలతో ప్రోత్సాహం అందిస్తున్నారు. విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ.. దాన్ని పేదలకు మరింత చేరువ చేశారు. విద్యా రంగంలో సంస్కరణల కోసమే రూ.52,676.98 కోట్లు వెచ్చించారు. గత ప్రభుత్వాలు విద్యను నిరీ్వర్యం చేశాయి. పాఠశాలల అభివృద్ధిపై చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదు.. ఆయన తల్లిదండ్రుల కమిటీలను అడిగితే వారే చెబుతారు. – కిలారి రోశయ్య, ఎమ్మెల్యే నాడు–నేడుతో ప్రభుత్వ స్కూళ్లలో సమూల మార్పులు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో విద్యా రంగంలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. గతంలో ఎవరూ ఇలాంటి సంస్కరణలు ప్రవేశపెట్టలేదు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే అని చెప్పి.. మన తలరాతను మారుస్తున్న గొప్ప వ్యక్తి సీఎం వైఎస్ జగన్. అమ్మ ఒడి గొప్ప పథకం. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, ఇంకా అనేక కార్యక్రమాలు, పథకాలతో సీఎం సంఘసంస్కర్తగా నిల్చారు. గత టీడీపీ ప్రభుత్వం కార్పొరేట్ విద్యా రంగానికి కొమ్ము కాసింది. నారాయణ, చైతన్య యాజమాన్యాలకు అనుగుణంగా చట్టాలు కూడా చేసింది. సీఎం వైఎస్ జగన్ ఆ చట్టాలను మార్చి ప్రైవేటు వర్సిటీల్లో కూడా 35 శాతం సీట్లు పేదలకు ఇస్తున్నారు. – ఆదిమూలపు సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అట్టడుగు వర్గాల మేలు కోసమే పథకాలు ఇంగ్లిష్ మీడియం విద్య.. మా హక్కు అని నినదించేలా సీఎం జగన్ పేదల పిల్లలకు ఆంగ్ల మాధ్యమ చదువులను అందిస్తున్నారు. అట్టడుగు వర్గాలకు మేలు చేయాలన్న తపనతోనే వేల కోట్ల రూపాయలు వెచి్చస్తూ విద్యా పథకాలను అమలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారు. రక్తం ధారబోసి అయినా వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంను చేసేందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారు. – సుధాకర్‌బాబు, ఎమ్మెల్యే బడుగుల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం వద్దా? రామోజీరావు, చంద్రబాబుతోపాటు ఇతర టీడీపీ నేతల పిల్లలు, మనవళ్లు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. బడుగుల పిల్లలకు మాత్రం ఇంగ్లిష్ మీడియం అందకూడదన్నట్టు వీరు వ్యవహరిస్తున్నారు. బలహీనవర్గాల పిల్లలు ఇంగ్లిష్ చదువులకు పనికిరారన్నట్లు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. – నాగార్జున యాదవ్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి -
ఐరాస తీర్మానంలో హిందీ
ఐరాస: ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ శుక్రవారం బహుభాషల వినియోగంపై ఆమోదించిన తీర్మానంలో మొదటిసారిగా హిందీని కూడా చేర్చింది. 193 దేశాలతో కూడిన సర్వప్రతినిధి సభలో ఈ ప్రతిపాదనకు భారత్ సహా 80కి పైగా దేశాలు మద్దతిచ్చాయి. ఆరు అధికార భాషలైన ఇంగ్లిష్, ఫ్రెంచి, చైనీస్, స్పానిష్, అరబిక్, రష్యన్ తో´ ాటు అనధికారిక భాషలైన హిందీ, స్వాహిలీ, పర్షియన్, బంగ్లా, ఉర్దూలను కూడా ఐరాస ఉత్తరప్రత్యుత్తరాల్లో వాడాలని తీర్మానం పేర్కొంది. ఐరాస తన కార్యకలాపాల్లో సమగ్రత సాధించేందుకు బహుళ భాషలను సమంగా స్వీకరించాలని భారత్ పేర్కొంది. ఐరాస గ్లోబల్ కమ్యూనికేషన్స్ ఉత్తర ప్రత్యుత్తరాలకు ఈ భాషలను కూడా ఉపయోగించడాన్ని ప్రశంసించింది. -
జెట్ ఎయిర్వేస్ రిజల్యూషన్ ప్లాన్ : ఉద్యోగుల షాక్!
ముంబై: ఎయిర్‌లైన్స్ కోసం జలాన్-కల్రాక్ కన్సార్షియం రిజల్యూషన్ ప్రణాళికను సవాలుచేస్తూ, ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్)లో అప్పీల్ దాఖలు చేసినట్లు ఆల్ ఇండియా జెట్ ఎయిర్వేస్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ గురువారం తెలిపింది. బ్రిటన్‌కు చెందిన కల్రాక్ క్యాపిటల్, యూఏఈకి చెందిన వ్యాపారవేత్త మురారీ లాల్ జలాన్‌ల కన్సార్షియం సమర్పించిన పరిష్కార ప్రణాళికను 2020 అక్టోబర్‌లో జెట్ ఎయిర్వేస్ రుణ దాతల కమిటీ (సీఓసీ) ఆమోదించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ పరిష్కార ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు గత వారం జెట్ ఎయిర్వేస్ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్‌ను ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ తిరిగి ధృవీకరించింది. దీనితో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏప్రిల్ 2019లో ఆగిపోయిన ఎయిర్‌లైన్ పునఃప్రారంభానికి మార్గం సుగమం చేసింది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ దివాలా ప్రక్రియను సవాలు చేస్తూ, ఆ సంస్థ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ తాజాగా ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది. బీకేస్, జెట్ ఎయిర్వేస్ క్యాబిన్ క్రూ అసోసియేషన్, వివిధ సంఘాలు కూడా గత నెలలో ఎన్సీఎల్ఏటీ ముందు అప్పీల్ దాఖలు చేశాయి. రాబోయే నెలల్లో సేవలను పునఃప్రారంభిస్తుందని భావిస్తున్న జెట్ ఎయిర్వేస్ను ప్రస్తుతం మానిటరింగ్ కమిటీ నిర్వహిస్తోంది. అప్పీల్ ఎందుకంటే... జెట్ ఎయిర్వేస్ ఆస్తులు, ఫ్లైట్ స్లాట్లు, మరీ ముఖ్యంగా ఆ సంస్థ కార్మికులు, ఉద్యోగులతో సహా కీలక విభాగాల వినియోగం ఎలా అన్నది రిజల్యూషన్ ప్రణాళికలో ఊహాజనితంగా ఉందని ఆల్ ఇండియా జెట్ ఎయిర్వేస్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ పావస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగానే తాము దీనిని సవాలు చేస్తున్నట్లు తెలిపారు. అసోసియేషన్ గ్రాట్యుటీ, చెల్లించని వేతనాలు, ప్రివిలేజ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఏప్రిల్ 2018 నుండి జూన్ 2019 వరకు బోనస్, కార్మికులు-ఉద్యోగులందరికీ రిట్రెంచ్‌మెంట్ పరిహారం పూర్తి చెల్లింపులపై తగిన పరిష్కారం చూపాలని ఎన్సీఎల్ఏటీ ముందు దాఖలు చేసిన అప్పీల్లో విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. రిజల్యూషన్ దరఖాస్తుదారు లేదా మానిటరింగ్ కమిటీ ద్వారా తిరిగి నియమించబడిన ఏ ఉద్యోగికైనా అప్పటికే రావాల్సిన వారి గ్రాట్యుటీ, చెల్లించని వేతనాలు, ప్రివిలేజ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, బోనస్ రిట్రెంచ్‌మెంట్ పరిహారం చెల్లించాలని కూడా అసోసియేషన్ డిమాండ్ చేస్తోందన్నారు. మినహాయింపులను ఎంతమాత్రం అంగీకరించడం జరగదని కిరణ్ పావస్కర్ స్పష్టం చేశారు. రిజల్యూషన్ ప్రణాళిక అస్పష్టమైన వ్యాపార ప్రణాళికతో ముడివడి ఉందని జెట్ ఎయిర్వేస్ మాజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఉద్యోగుల న్యాయ సలహాదారు నారాయణ్ హరిహరన్ అన్నారు. కార్మికులకు చెల్లించాల్సిన అన్ని చట్టబద్ధమైన హక్కులను, ముఖ్యంగా గ్రాట్యుటీ, ప్రివిలేజ్లీవ్, చెల్లించని జీతం, బోనస్‌లను మాఫీ చేయలని చూస్తున్నట్లు విమర్శించారు. జెట్ ఎయిర్వేస్ ఇంతక్రితం నరేష్ గోయల్, గల్ఫ్ క్యారియర్ ఎతిహాద్ యాజమాన్యంలో ఉండేది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమై ఏప్రిల్ 2019లో కార్యకలాపాలను నిలిపివేసింది. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని రుణదాతల కన్సార్షియం 2019 జూన్‌లో రూ. 8,000 కోట్లకు పైగా బకాయిల కోసం దివాలా పిటిషన్‌ను దాఖలు చేసింది. -
భర్త చనిపోతే.. బొట్టు, గాజులు తీసేయాలా? శుభకార్యాలకు వెళ్లొద్దా?
భర్త అకాల మరణం చెందితే అది భార్య తప్పా?, అందుకు ఆమె జీవితాంతం శిక్ష అనుభవించాల్సిందేనా? ముమ్మాటికీ కాదు. అయితే విధవత్వం విషయంలో మాత్రం కట్టుబాట్లనేవి మాత్రం కచ్చితంగా ప్రస్తావనకు వస్తాయి. భర్త చనిపోతే.. ఆమె మంగళసూత్రం తొలగించి, గాజులు పగలకొట్టి, నుదిటి మీద తిలకం చెరిపేసి.. అప్పటికే పుట్టెడు బాధలో ఉండే స్త్రీ మూర్తికి మరింత శోకం అందిస్తుంటారు. అయితే ఇకపై అలాంటి ఆచారాలు నిషేధించుకుంది ఇక్కడో పల్లె. మహారాష్ట్ర కోల్హాపూర్ జిల్లా షిరోల్ తాలుకా హెర్వాద్(డ్) అనే గ్రామం.. తాజాగా ఓ తీర్మానం చేసింది. భర్త చనిపోయిన ఆడవాళ్లు.. సంప్రదాయాలను పక్కనపెట్టి నచ్చినట్లుగా, సమాజంలో గౌరవంగా జీవించేందుకు స్వేచ్ఛను ప్రసాదిస్తూ తీర్మానంలో పేర్కొంది. ఈ తీర్మానానికి మే 4వ తేదీన గ్రామ పంచాయితీ సైతం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా టైంలో.. కరోనా టైంలో ఈ ఊరిలో మరణాలు చాలానే సంభవించాయట. అందులో పాతికేళ్లలోపు యువకులే ఎక్కువగా ఉన్నారట. దీంతో చిన్నవయసులోనే ఎంతో మంది వితంతువులుగా మారిన పరిస్థితి. బంధువుల ఇళ్లలో శుభకార్యాలకు కూడా వెళ్లకుండా.. వాళ్లు ఎదుర్కొంటున్న అవమానాలను చూసి గ్రామస్తులు భరించలేకపోయారు. ‘‘తమ తప్పు లేకున్నా.. పశ్చాత్తాపంతో కుంగిపోయిన బిడ్డలను చూశాం. తమ మధ్యే ఉంటూ వాళ్లు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూశాం. అందుకే వాళ్ల జీవితాలను మార్చే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింద’’ని గ్రామ సర్పంచ్ శ్రీగోండ పాటిల్ చెప్తున్నారు. అయితే ఈ ప్రయత్నం అంత సులువుగా కావడానికి అంగన్వాడీ సేవికాస్, ఆశా వర్కర్ల కృషి ఎంతో ఉందని అంటున్నాడాయన. ఈ తీర్మానం విషయంలో మహాత్మా ఫూలే సోషల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రమోద్ జింగాడే అందించిన ప్రోత్సాహం మరిచిపోలేమని, ఇది షాహూ మహరాజ్‌కు నివాళి అని అంటున్నారు హెర్వాద్ గ్రామ ప్రజలు. ఇక ఈ నిర్ణయంపై జిల్లా పరిపాలన విభాగం సైతం హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు మంత్రి సతేజ్ పాటిల్ స్పందిస్తూ.. శివాజీ పుట్టిన గడ్డ మీద ఆడవాళ్ల గౌరవానికి భంగం కలగకూడదని, ఈ మేరకు.. ఇలాంటి నిర్ణయం తీసుకున్న హెర్వాద్ ప్రజలకు వందనాలు అని, కొందరికి ఇది చెంపపెట్టులాంటి సమాధానమని వ్యాఖ్యానించారు. మరికొన్ని గ్రామాలు కూడా ఇలాంటి బాటలో వెళ్తే.. మంచిదని అభిప్రాయపడ్డారాయన. :::సాక్షి ప్రత్యేకం -
తుది దశకు రిలయన్స్ క్యాప్ బిడ్డింగ్
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్ రుణదాతలు రుణపరిష్కార(రిజల్యూషన్) ప్రణాళిక అభ్యర్థన పత్రాల(ఆర్‌ఎఫ్‌ఆర్‌పీ)పై నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో తుది అనుమతి కోసం వచ్చే వారం ఆర్ఎఫ్ఆర్పీని రుణదాతల కమిటీ(సీవోసీ) ముందుంచవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రిజల్యూషన్ ప్రణాళిక దాఖలు, విలువ మదింపు తదితర అంశాలలో ఆర్‌ఎఫ్‌ఆర్‌పీ డాక్యుమెంట్ మార్గదర్శకంగా నిలవనుంది. రిజల్యూషన్ ప్రణాళికను రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకి ఆసక్తి వ్యక్తం చేసిన(ఈవోఐ) కంపెనీలన్నిటికీ అందించనున్నారు. తద్వారా తుది బిడ్స్ దాఖలుకు వీలుంటుంది. బుధవారం సమావేశమైన సీవోసీ ఆర్ఎఫ్ఆర్పీని అనుమతించినట్లు తెలుస్తోంది. తుది అనుమతికి వచ్చే వారం దాఖలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కన్సార్షియం క్లస్టర్ బిడ్డర్లు మొత్తం నగదు ప్రాతిపదికన బిడ్ చేయవలసి ఉన్నప్పటికీ ఆర్‌ఎఫ్‌ఆర్‌పీ ప్రకారం వాయిదా పద్ధతిలో చెల్లింపులకు వీలు కల్పించనున్నట్లు తెలిపాయి. రిలయన్స్ క్యాప్ కార్పొరేట్ దివాలా రిజల్యూషన్ ప్రాసెస్ పూర్తిచేసేందుకు సీవోసీ 3 నెలల గడువును కోరవచ్చని వెల్లడించాయి. -
రిలయన్స్ క్యాపిటల్ రిజల్యూషన్ గడువు పెంపు!
న్యూఢిల్లీ: దివాలా చట్ట(ఐబీసీ) చర్య లలో ఉన్న రిలయన్స్ క్యాపిటల్ రుణ పరిష్కార(రిజల్యూషన్) ప్రణాళికకు మరింత గడువు లభించే వీలుంది. కంపెనీ రిజల్యూషన్ బిడ్స్‌పై బుధవారం(6న) రుణదాతల కమిటీ(సీవోసీ) చర్చించినట్లు తెలుస్తోంది. ఐబీసీ నిబంధనల ప్రకారం పాలనాధికారి 180 రోజుల్లోగా రిజల్యూషన్‌ను ముగించవలసి ఉంటుంది. అంటే 2022 జూన్3 కల్లా పూర్తికావలసి ఉంది. అయితే మరో 90 రోజులు అదనపు గడువునిచ్చేందుకు సీవోసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వెరసి సెప్టెంబర్ 3వరకూ గడువు లభించే వీలుంది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ ఆర్‌క్యాప్ రుణ భారం, చెల్లింపుల వైఫల్యంతో దివాలా చట్ట పరిధికి చేరిన సంగతి తెలిసిందే. కంపెనీ కొనుగోలుకి అదానీ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ లంబార్డ్, టాటా ఏఐజీ, హెచ్డీఎఫ్సీ ఎర్గో, నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ తదితర 54 సంస్థలు బిడ్స్(ఈవోఐ) దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. -
సీఎం భగవంత్ మాన్ మరొకటి.. చండీగఢ్ పంజాబ్‌కే సొంతం
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో సంచలనానికి తెర తీశారు. శుక్రవారం విధాన సభ ప్రత్యేక సమావేశాల్లో ఒక తీర్మానం ప్రవేశపెట్టారాయన. చండీగఢ్ నగరాన్ని పంజాబ్‌కు బదిలీ చేయాలంటూ తీర్మానం చేశారాయన. చండీగఢ్‌పై సర్వహక్కులు తమవేనని, వెంటనే దానిని వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేశారాయన. కేంద్రపాలిత ప్రాంత హోదాలో చండీగఢ్ ప్రస్తుతం పంజాబ్-హర్యానాల సంయుక్త రాజధానిగా ఉన్న సంగతి తెలిసిందే. పరిపాలనాపరంగా 60:40గా పంజాబ్, హర్యానాలు చండీగఢ్‌నును పంచుకుంటున్నాయి. ఈ తరుణంలో చండీగఢ్‌పై సర్వహక్కులు పంజాబ్‌వేనని, అందుకే పూర్తిగా పంజాబ్‌కు బదిలీ చేయాలంటూ ఒక తీర్మానం చేశారు సీఎం భగవంత్ మాన్. దీనికి ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా మద్దతు ప్రకటించగా.. తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇదిలా ఉండగా.. పంజాబ్ సర్వీస్ రూల్స్‌కు బదులు ఛండీగఢ్ ఉద్యోగులకు సెంట్రల్ సర్వీస్ రూల్స్ వర్తిస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ మధ్య ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కౌంటర్‌గా చండీగఢ్.. పంజాబ్‌కే పూర్తి రాజధానిగా ఉండాలంటూ తీర్మానం సీఎం భగవంత్ మాన్ ప్రవేశపెట్టడం విశేషం. తీర్మానం సందర్భంగా.. భగవంత్ మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఛండీగఢ్ నుంచి కాకుండా బయటి వాళ్లను(కేంద్ర సర్వీస్ ఉద్యోగులతో) నియమించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారాయన. అంతేకాదు ఇంతకాలం కొనసాగిన సమతుల్యతను దెబ్బ తీయాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారాయన. భాక్రా బియస్ మేనేజ్మెంట్ బోర్డులో కేంద్ర ఉద్యోగుల్ని నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారాయన. ఛండీగఢ్ పంజాబ్ రాజధానిగా పునరుద్ఘాటించిన సీఎం మాన్.. ఇంతకు ముందు ఇలా రాష్ట్రాలు విడిపోయిన సందర్భాల్లో రాజధాని మాతృరాష్ట్రంతోనే ఉన్న విషయాన్ని సైతం ప్రస్తావించారు. కాబట్టి, చంఢీగఢ్ను పంజాబ్‌కు బదిలీ చేయాలని అన్నారు. గతంలో సభ ఇందుకు సంబంధించి ఎన్నో తీర్మానాలు చేసినా లాభం లేకుండా పోయిందని, ఈసారి దానిని సాధించి తీరతామని చెప్పారాయన. పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 1966 ప్రకారం.. పంజాబ్ రాష్ట్రం ఏర్పడింది. ఆపై పునర్వ్యవస్థీకరణతో హర్యానా పుట్టుకొచ్చింది. ఛండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగా, పంజాబ్‌లో కొంత భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లో కలిసిపోయాయి. అప్పటి నుంచి భాక్రా బియస్ మేనేజ్మెంట్ బోర్డు లాంటి సంయుక్త ఆస్తుల మీద పరిపాలనను పంజాబ్-హర్యానాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. -
రిలయన్స్, ఏసీఆర్‌ఈ చేతికి సింటెక్స్ ఇండస్ట్రీస్!
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, అసెట్ కేర్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఎంటర్ప్రైజ్ (ఏసీఆర్‌ఈ) దాఖలు చేసిన ఉమ్మడి రిజల్యూషన్ ప్రణాళికను సింటెక్స్ ఇండస్ట్రీస్ రుణదాతలు ఏకగ్రీవ (కమిటీ ఆఫ్ క్రెడిటార్స్– సీఓసీ) ఆమోదం తెలిపారు. తీవ్ర రుణ సంక్షోభంలో కూరుకుపోయిన జౌళి ఉత్పత్తి సంస్థ సింటెక్స్ ఇండస్ట్రీస్ కోసం దివాలా పరిష్కా ప్రక్రియ కింద రిలయన్స్, ఏసీఆర్‌ఈలు ఉమ్మడి బిడ్ దాఖలు చేశాయి. శ్రీకాంత్ హిమత్సింకా, దినేష్ కుమార్ హిమత్‌సింకాతో పాటు వెల్స్పన్ గ్రూప్ సంస్థ ఈజీగో టెక్స్టైల్స్, జీహెచ్‌సీఎల్, హిమత్సింకా వెంచర్స్ వచ్చిన బిడ్స్‌ను కూడా కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ పరిశీలించినట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సింటెక్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. బిడ్ విలువ రూ.3,000 కోట్లు? రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఆర్ఐఎల్, ఏసీఆర్‌ఈ ఉమ్మడి బిడ్ల విలువ వివరాలు తెలపనప్పటికీ, ఇది దాదాపు రూ.3,000 కోట్లని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. బకాయిల్లో రుణదాతలు 50 శాతం కంటే ఎక్కువ హెయిర్‌కట్ (రాయితీ) తీసుకున్నట్లు కూడా సమాచారం. పరిష్కార ప్రణాళిక ప్రకారం, కంపెనీ ప్రస్తుత వాటా మూలధనం సున్నాకి తగ్గించడం జరుగుతుంది. అలాగే కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలు, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నుండి డీలిస్ట్ అవుతుంది. సింటెక్స్ ఇండస్ట్రీస్‌పై దివాలా ప్రక్రియను గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభించారు. కంపెనీపై దాదాపు రూ.7,500 కోట్ల క్లెయిమ్‌లు (రుణ బాకీలు) దాఖలయ్యాయి. దివాలా కోడ్ (ఐబీసీ)నిబంధనల ప్రకారం, కంపెనీ ఆర్థిక స్థితి... 2020–21 లో సింటెక్స్ ఇండస్ట్రీస్ ఆదాయం రూ. 1,689.15 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో, కన్సాలిటేడెడ్ నిర్వహణా ఆదాయం 80 శాతం పెరిగి, రూ.942.66 కోట్లకు చేరింది. ఇదే కాలంలో నికర నష్టం రూ.214.99 కోట్ల నుంచి రూ.103.25 కోట్లకు తగ్గింది. సింటెక్స్ ఇండస్ట్రీస్ షేరు ఎన్ఎస్ఈలో సోమవారం 5 శాతం నష్టపోయి రూ.7.80 వద్ద ముగిసింది. -
‘తాలిబన్’ లేకుండానే అఫ్గన్ అనుకూల తీర్మానం
అఫ్గనిస్థాన్‌లో అధికారంలోకి వచ్చాక తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తాలిబన్ ప్రభుత్వానికి శుభవార్త అందించింది ఐక్యరాజ్య సమితి. అఫ్గనిస్థాన్ ప్రభుత్వానికి అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు దక్కేలా ఒక అడుగు ముందుకు వేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో గురువారం ఒక తీర్మానం చేయగా.. ఆమోదం లభించింది. అఫ్గనిస్థాన్ ప్రభుత్వంతో సంబంధాలు కొనసాగించేందుకు ప్రవేశపెట్టిన తీర్మానం అది. ఇక వోటింగ్‌కు రష్యా దూరం కాగా.. 14 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. దీంతో ఈ తీర్మానం తర్వాతి దశకు వెళ్తుంది. ప్రపంచంలోని ఎక్కువ దేశాలు గనుక ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తే(తప్పనిసరేం కాదు!).. ఆపై తాలిబన్లు నడిపిస్తున్న అఫ్గనిస్థాన్ ప్రభుత్వానికి అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు దక్కినట్లు అవుతుంది. తాలిబన్ లేకుండానే.. అయితే ఐరాసలో భద్రతా మండలి ప్రవేశపెట్టిన తీర్మానంలో చిన్నమెలిక ఉంది. ఎక్కడా తాలిబన్ అనే పదాన్ని పేర్కొనలేదు. కాకపోతే.. యూఎన్ పొలిటికల్ మిషన్ ఏడాది పాటు ఉంటుందని, అఫ్గనిస్థాన్‌లో శాంతి స్థాపనకు కృషి చేస్తుందని మాటిచ్చింది. అయితే తాలిబన్ అనే పదం లేకపోవడం సాంకేతికంగా అఫ్గన్ సాయానికి, గుర్తింపునకు ఎలాంటి ఆటంకంగా మారబోదు. కాకపోతే.. తాలిబన్ అనే పదం బదులు.. మరో పదం తీసుకురావాలని ప్రపంచ దేశాలు ఒత్తిడి చేసే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఇక ఈ తీర్మానంలో.. పరస్సర సహకారం, మానవతా కోణంలో సాయం, రాజకీయ అంశాలపై హామీలు ఉన్నాయి. ఉనామా(UNAMA ..the UN mission to Afghanistan)కు ప్రపంచ దేశాలు అన్ని విధాల సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు తీర్మానం ప్రవేశపెట్టిన నార్వే ఐరాస రాయబారి మోనా జుల్ చెప్తున్నారు. -
ఉక్రెయిన్ నుంచి రష్య దళాలు వైదొలగేలా తీర్మానం!
Demanding Moscow Withdraws Its Troops: యూఎన్ జనరల్ అసెంబ్లీ ఉక్రెయిన్ నుంచి రష్యా వైదొగాలని డిమాండ్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. గతవారం నుంచి ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తున్న రష్యా పై ప్రపంచదేశాల నుంచి తీవ్రమైన ఆగ్రహం వెల్లువెత్తుంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అత్యవసర ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన కొన్ని రోజుల్లోనే రష్యా ఉక్రెయిన్ యుద్థం గురించి చర్చించేందుకు సుమారు 100కు పైగా దేశాలు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో మాస్కో తన దళాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కొందరరూ దౌత్యవేత్తలచే ఒక ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. ప్రజాస్వామ్యానికి అగ్నిపరీక్షలా సాగుతున్న నిరుకుశ ప్రభుత్వాలను సరైన మార్గంలో పెట్టేలా ఈ తీర్మానం ఉంటుందని యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశం పేర్కొంది. ఇది రష్యా అధ్యక్షుడు వ్లాదిమన్ పుతిన్‌కి కనువిప్పు కలిగించేలా శక్తివంతమైన మందలింపు చర్యగా అభివర్ణించింది. అయితే ఈ తీర్మానం ఆమెదించాలంటే రెండొంతుల మెజార్టీతో ఆమోదం పొందాలి. అంతేకాదు భద్రతామండలిలో ఈ తీర్మానాన్ని సమర్పించక మునుపే రష్యా వీటో చేసే అవకాశం లేదు. అంతేకాదు ఈ తీర్మానానికి 193 మంది సభ్యులతో కూడిన బలమైన సంస్థల అత్యధిక మెజార్టీ మద్దతు ఇవ్వబడుతుందని స్పష్టం చేసింది. అణ్వాయుధ దళాలను అప్రమత్తంగా ఉంచాలనే పుతిన్ నిర్ణయాన్ని యూఎన్ తీవ్రంగా ఖండించింది. ప్రచ్ఛన్న యుద్ధం వల్ల ఏమి లాభం ఉండదని చైనా కూడా నొక్కి చెబుతోంది. గతవారం రష్యాని కట్టడి చేసే దిశగా పశ్చిమ దేశాలు పలు కఠిన ఆంక్షలు విధించాయి. స్విఫ్ట్ నుంచి డిస్కనెక్టం చేయడం వంటి వాటిని సైతం రష్యా లక్ష్య పెట్టక పోగా ఉక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ముమ్మరంగా యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యాకు అడ్డుకట్టే వేసేందుకు ప్రపంచ దేశాలన్ని ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టి ఓటింగ్ నిర్వహించే యోచన చేస్తోంది. -
రష్యా చర్యలపై ఐరాసా భద్రతా మండలిలో ఓటింగ్.. భారత్ దూరం..
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమయింది. రష్యా చర్యలను ఖండిస్తూ భద్రతా మండలిలో భద్రతా మండలిలో (UNSC) ఓటింగ్ నిర్వహించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ అమెరికా చేసిన ఈ ప్రతిపాదనపై మండలిలోని మొత్తం 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశాయి.కాగా మొదటి నుంచి ఉక్రెయిన్-రష్యా వివాదంలో తటస్థంగా ఉన్న భారత్‌తో పాటు చైనా, యూఏఈలు ఈ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. అయితే భద్రతా మండలిలో అయిదు శాశ్వత దేశాల్లో ఒకటైన రష్యా.. తన విటో అధికారాన్ని ఉపయోగించి తీర్మాణాన్ని వీగిపోయేలా చేసింది. ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉన్న సందర్భంగా ఐరాసలో భారతరాయబారి టీఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో విభేదాలు, వివాదాలను పరిష్కరించడానికి అన్ని సభ్య దేశాలు చర్చలు జరపాలని భద్రతా మండలికి సూచించారు. ఉక్రెయిన్‌లో ఇటీవల జరుగుతున్న పరిణామాలతో భారత్ తీవ్ర ఆందోళనకు గురవుతోందని తెలిపారు. హింసను తక్షణమే నిలిపివేసేందుకు తగిన ప్రయత్నాలు చేయాలని కోరుతున్నామన్నారు. మానవాళి ప్రాణాలను పణంగాపెట్టడం వల్ల ఎలాంటి పరిష్కారం లభించదని తెలిపారు. చదవండి: కమెడియన్ నుంచి అధ్యక్షుడిగా.. జెలెన్స్కీ ప్రస్థానం #IndiainUNSC UNSC’s consideration of the draft resolution on Ukraine 📺Watch: India’s Explanation of Vote by Permanent Representative @AmbTSTirumurti ⤵️@MeaIndia pic.twitter.com/UB2L5JLuyS — India at UN, NY (@IndiaUNNewYork) February 25, 2022 -
విశాఖ రింగు వలల వివాదం పరిష్కారంపై సమావేశం
-
విశాఖ: మత్స్యకార గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేత
సాక్షి, విశాఖపట్నం: రింగు వలల వివాదం పరిష్కారానికి మత్స్యకార సంఘాల నాయకులతో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, సీదిరి అప్పలరాజు ఆదివారం చర్చలు జరిపారు. సంప్రదాయ కారులు, రింగు వలల మత్స్యకార సంఘాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. ఈ నెల 20లోగా నివేదిక ఇవ్వాలని గడువు పెట్టామని తెలిపారు. రేపటి నుంచి సంప్రదాయ మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొచ్చాన్నారు. సముద్రంలో 8 కి.మీ తర్వాత రింగు వలలు వాడొచ్చని పేర్కొన్నారు. అధికారులు, మత్సకార సంఘాల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మత్స్యకార గ్రామాల్లో రేపటి నుంచి 144 సెక్షన్ ఎత్తివేస్తున్నట్లు మంత్రి తెలిపారు. చదవండి: 'ప్రేమపెళ్లి.. జ్యోతుల నెహ్రూ నుంచి ప్రాణహాని ఉంది' ఇటీవల రింగు వలల వినియోగం విషయంపై సముద్రంలో మత్స్యకారుల మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ మేరకు జిల్లా ఇన్చార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో మత్స్యకార సంఘం నాయకులతో భేటీ అయ్యారు. ఇరు వర్గాల నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలను సేకరించారు. వీటిపై అధికారుల నుంచి కూడా వివరణ తీసుకున్నారు ఈ దశలో సాంప్రదాయ మత్స్యకారులు చేపల వేట కొనసాగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అధికారులు తేల్చారు. అలాగే రింగు వలల వినియోగంపై లైసెన్స్ ఉన్న మత్స్యకారులు తీరం నుంచి 8 కిలో మీటర్ల దూరంలో చేపలవేట కొనసాగించవచ్చని కూడా అధికారులు నిర్ణయించారు అయితే ఎనిమిది కిలోమీటర్ల దూరంలో చేపలవేట సాగించినట్లయితే ఎలాంటి మత్స్య సంపద లభించదని రింగు వలల మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు గ్రామాలకు చెందిన మత్స్యకారులు నిర్ణీత ప్రాంతంలో చేపల వేట కొనసాగించడానికి అనుమతి ఇవ్వాలని అధికారులను మత్స్యకారులు కోరారు. అలాంటి అనుమతులు చట్టబద్ధంగా ఇవ్వడానికి అవకాశం లేదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఇరు గ్రామాల పెద్దలు కొందరు అధికారులతో కలిసి కమిటీగా ఏర్పడి ఈ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు. దీంతో ఈ నెల 20వ తేదీలోగా ఈ సమస్యపై గ్రామ పెద్దల మధ్య చర్చలు జరిపి నివేదిక ఇవ్వాలని మంత్రులు సూచించగా.. ఇరు గ్రామాల ప్రజలు కూడా సమ్మతించారు మరోవైపు ఉద్రిక్తతల నడుమ కొనసాగిస్తున్న 144 సెక్షన్ కూడా ఎత్తి వేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ ప్రకటించారు. మత్స్యకారులు సమన్వయంతో చేపల వేటను రేపటినుంచి కొనసాగించవచ్చని మంత్రులు ప్రకటించారు. -
2021 గుణపాఠాలు.. ఇప్పుడైనా కొత్త నిర్ణయాలు తీసుకుందామా..
ఈ ఏడాది ఏం చేయబోతున్నారు? న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏమిటి? ఈ ప్రశ్న చాలా కామన్. ఆ ప్రశ్న ఎదురయ్యేలోపు మీకో నిర్ణయం ఉండి ఉంటే మంచిదే. లేకపోతే ఇలా ఓ నిర్ణయం తీసుకోవచ్చేమో ఆలోచించండి! మనదేశంలో మేధకు కొరతలేదు. విద్యావకాశాలకు కొదువ లేదు. కానీ ఈ రెండింటి మధ్య ఉన్న అంతరం అంతా ఇంతా కాదు. మేధకు విద్యావకాశం సులువుగా అందకపోవడమే మనదేశంలో చురుకైన పిల్లలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. మనచుట్టూ ఉండే కుటుంబాల్లో ఓ కుటుంబాన్ని చూద్దాం. నెలకు లక్షకు పైగా జీతం తీసుకునే ఓ కార్పొరేట్ ఉద్యోగి తన కొడుకు ఇంజనీరింగ్ సీటు కోసం లక్షల ఫీజు కట్టి కోచింగ్ ఇప్పిస్తుంటాడు. అయినప్పటికీ ఆ పిల్లాడు ఎంట్రన్స్ టెస్ట్‌లో ఏ యాభైవేల ర్యాంకుతోనో సరిపెట్టుకుంటాడు. కొడుకు సీటు కోసం డొనేషన్ కట్టడానికి సిద్ధమవుతుంటాడా తండ్రి. అదే ఇంట్లో పాత్రలు కడిగి ఇంటిని శుభ్రం చేసే మహిళ కొడుకు ప్రభుత్వ కాలేజ్‌లో చదివి ఫ్రీ సీటు తెచ్చుకుంటాడు. కానీ ఆ సీటుకు కట్టాల్సిన కనీసపు ఫీజుకు కూడా డబ్బులేక ‘పిల్లాడిని ఏదో ఒక పనిలో పెట్టించండి’ అని ఆ మహిళ యజమాని ఎదుట నిలబడి దీనంగా అడగడమూ జరుగుతుంటుంది. ఇలాంటి క్షణంలో ‘కొంత ఉదారంగా’ ఆలోచించి ఆ పనిమనిషి పిల్లాడిని ఏదో ఒక పనిలో పెట్టించి సంతృప్తి పడడం కూడా ఎప్పుడూ జరిగేదే. సరిగ్గా ఆ క్షణంలోనే ‘మరింత ఉదారంగా’ ఆలోచిస్తే ఎలా ఉంటుంది? ఒక పిల్లాడి భవిష్యత్తుకు బంగారు బాట పడుతుంది. ఫ్రీ సీటుకు కట్టాల్సిన కనీసపు ఫీజు ఈ కార్పొరేట్ ఉద్యోగి కొడుకు చేసే అదనపు ఖర్చుకంటే తక్కువే ఉంటుంది. చదవండి: పట్టులాంటి జుట్టుకోసం.. ఇవి కలిపి జుట్టుకి పట్టించండి.. ఆ మాత్రం ఖర్చు చేయగలిగిన ఆర్థిక స్థితి ఉన్నప్పుడు డొమెస్టిక్ హెల్పర్ పిల్లవాడిని పనిలో పెట్టించడం కంటే చదువుకు ఫీజు కట్టడమే సరైన ఉదారత అవుతుంది. మనం ఖర్చు చేసిన ఆ డబ్బు ఒక కుర్రాడి భవిష్యత్తుకు ఊతం అవుతుందంటే కలిగే సంతృప్తి చిన్నది కాదు. ఆలోచించండి. ఈ ఏడాది కనీసం ఒక్క విద్యార్థికైనా ఫీజు కట్టాలని నిర్ణయం తీసుకోండి. ఈ ఏడాది ఒక పట్టుచీర తగ్గించుకుంటే చాలు ఒక విద్యార్థికి విద్యాప్రదానం జరుగుతుంది. ఏడాదిలో నాలుగు టూర్లలో ఒక టూర్ తగ్గించుకుంటే చాలు ఒక విద్యార్థి అక్షరతోటలో విహారానికి రెక్కలు విచ్చుకుంటాయి. చదవండి: శిథిలావస్థలో సావిత్రిబాయి పూలే పాఠశాల.. కొత్త కళను తీసుకువచ్చేందుకు పెద్ద కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీగా పేద విద్యార్థులను చదివించడానికి ముందుకు వస్తున్నాయి. పెద్ద జీతాలు ఉండి పిల్లల బాధ్యతలు పూర్తయిన వాళ్లు ఒకరిద్దరు స్టూడెంట్స్‌ను ఎడ్యుకేషన్ అడాప్షన్ తీసుకుంటున్నారు. ఎగువ మధ్యతరగతి మహిళల్లో విద్యావంతులు, సామాజిక బాధ్యత భావించేవాళ్లు పేద విద్యార్థుల్లో చురుకైన వాళ్లను గుర్తించి వాళ్లకు పుస్తకాలు కొనిస్తున్నారు. కొంత మంది సంపన్న మహిళలు ఒక బృందంగా ఏర్పడి ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ కోర్సు కోసం మౌలిక వసతులు కల్పిస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది. మనసులో ఆలోచన మెదిలితే ఆచరణకు బీజం పడుతుంది. అందుకే ఈ ఏడాది కనీసం ఒక విద్యార్థికి అయినా విద్యాప్రదానం చేద్దాం. చదవండి: ప్రకృతి అంతా మీ చుట్టూ ఉన్నట్లే.. ఇల్లు సర్దండిలా.. -
అవిశ్వాసంలో ఓడిపోయిన మేయర్ పావని
సాక్షి, కాకినాడ: కాకినాడ మేయర్‌పై టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసంలో మేయర్ పావని, ఉపమేయర్-1 సత్తిబాబు ఓడిపోయారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 33 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్అఫీసియో సభ్యులతో కలిపి మొత్తం 36 ఓట్లు వచ్చాయి. కాకినాడ మున్సిపల్ కౌన్సిల్లో 44 మంది కార్పొరేటర్లు ఉండగా, మరో ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులున్నారు. అవిశ్వాస తీర్మానానికి కోరం 31 మంది ఉండాల్సి నేపథ్యంలో సమావేశానికి 43 మంది కార్పొరేటర్లు, 3 ఎక్స్అఫిషియో సభ్యులు హాజరయ్యారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా మంత్రి కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగా గీత ఓటువేశారు. అయితే కోర్టు కేసు నేపథ్యంలో ఫలితాలను ప్రిసైడింగ్ అధికారి రిజర్వ్ చేశారు. కోర్టు తీర్పు తర్వాత ఫలితాలనుఅధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: (సుంకర పావని టీడీపీని భ్రష్టు పట్టించారు: కార్పొరేటర్లు) -
మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి సర్వం సిద్ధం
సాక్షి, కాకినాడ: నగర మేయర్ సుంకర పావనిపై మెజార్టీ కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం ఓటింగ్ జరగనుంది. కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆధ్వర్యాన నగరపాలక పాలక సంస్థ యంత్రాంగం ఇందుకు ఏర్పాట్లు చేసింది. కార్పొరేషన్ హాలులో ఉదయం 11 గంటలకు మేయర్, 12 గంటలకు డిప్యూటీ మేయర్ సత్తిబాబులపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది. జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. ఓటింగ్ ప్రక్రియ జరిగేది ఇలా.. 44 మంది కార్పొరేటర్లతో పాటు మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితో కలిసి 47 మందికి ఓటు హక్కు ఉంది. మూడింట రెండు వంతుల మంది అంటే 31 మంది హాజరైతేనే కోరం ఉంటుంది. చేతులెత్తే పద్ధతిపై ఓటింగ్ జరుగుతుంది. అవిశ్వాసం నెగ్గాలంటే 31 మంది అనుకూలంగా ఓటు వేయాలి. కార్పొరేటర్లు చేతులెత్తి అభీష్టం తెలిపితే అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టు నిర్ధారిస్తారు. ఈ విషయాన్ని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించాక మేయర్ పదవి నుంచి పావని వైదొలగాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఈ ఎన్నికపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేయర్ పావని కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఫలితాన్ని 22వ తేదీ వరకూ పెండింగ్‌లో పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. 33 మంది సంతకాలు చేసి, ఐక్యతతో ఉన్నందున పావని పదవీచ్యుతురాలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ విప్‌పై గందరగోళం టీడీపీ విప్‌పై గందరగోళం నెలకొంది. వాస్తవానికి మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించగా కేవలం మేయర్ విషయంలోనే విప్ జారీ చేస్తూ టీడీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తీసుకున్న నిర్ణయం కార్పొరేటర్లలో అసహనం రేకెత్తించింది. మేయర్ విషయంలో విప్ జారీ చేసి, బీసీ వర్గానికి చెందిన డిప్యూటీ మేయర్‌పై నిర్లక్ష్యం చేయడాన్ని ఆ పార్టీ కార్పొరేటర్లు ఇప్పటికే టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లారని అంటున్నారు. మరోవైపు పావనిపై అసమ్మతి కార్పొరేటర్లతో పాటు స్వపక్షంలోని 9 మంది అసమ్మతితో రగిలిపోతున్న తరుణంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మేయర్ వ్యతిరేక శిబిరంలో పార్టీలకు అతీతంగా 33 మంది ఉన్నారు. వీరిలో వైఎస్సార్ సీపీ, టీడీపీ, బీజేపీల్లోని అసమ్మతి కార్పొరేటర్లున్నారు. మేయర్‌తో కలిపి టీడీపీకి అనుకూలంగా పది మంది ఉన్నారు. బీజేపీ కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీప్రసన్న ఆ పార్టీ ఆదేశాల మేరకు తటస్థంగా వ్యవహరించనున్నారు. కార్పొరేటర్లపై అధిష్టానానికి ఫిర్యాదు : మేయర్ పావని కాకినాడ సిటీ: టీడీపీ కార్పొరేటర్ల తీరుపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు మేయర్ సుంకర పావని అన్నారు. అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న పరిణామాలను కలెక్టర్‌కు వివరించేందుకు ఆమె సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 22 వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని కోర్టు తెలిపిందని మేయర్ వివరించారు. ఇప్పటికే కార్పొరేటర్లకు టీడీపీ విప్ జారీ చేసిందన్నారు. ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయన్నారు. ప్రస్తుతం తన వెంట 10 మంది కార్పొరేటర్లు ఉన్నారన్నారు. -
కాకినాడ మేయర్‌పై రేపే అవిశ్వాసం
సాక్షి, కాకినాడ: నగర మేయర్ సుంకర పావనిపై పలువురు కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం ఓటింగ్ జరగనుంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ నుంచి మేయర్‌గా ఎన్నికైన పావని నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని, తమకు విలువ ఇవ్వలేదని, మహిళా కార్పొరేటర్లపై వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ పలువురు కార్పొరేటర్లు గత నెల 17న కలెక్టర్ హరికిరణ్‌కు అవిశ్వాసం నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. అవిశ్వాసం నోటీసుపై సంతకాలు చేసిన 33 మంది కార్పొరేటర్లు విశాఖలో ఏర్పాటు చేసిన రాజకీయ శిబిరానికి తరలి వెళ్లారు. వీరిలో చాలామంది కుటుంబ సభ్యులతో అక్కడికి చేరుకున్నారు. వీరందరూ సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయానికి కాకినాడ చేరుకుని ఓటింగ్‌కు హాజరు కానున్నారు. ఇప్పటికే మేయర్‌కు వ్యతిరేకంగా ఉన్న అసమ్మతి కార్పొరేటర్లతో పాటు సొంత టీడీపీకి చెందిన మిగిలిన తొమ్మిది మంది కూడా ఆమెకు దూరమయ్యారు. టీడీపీ జారీ చేసిన విప్‌ను కూడా ధిక్కరించేందుకు వారు సమాయత్తమవుతున్నారని సమాచారం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడును రెండు రోజుల క్రితం ఈ తొమ్మిది మంది కార్పొరేటర్లూ నేరుగా కలిసి తమ వాదన వినిపించినట్టు చెబుతున్నారు. మేయర్ పావని సొంత పార్టీలోని కార్పొరేటర్లను కూడా పట్టించుకోకుండా నియంతృత్వ ధోరణితో వ్యవహరించారని, ఆమెకు అనుకూలంగా ఓటు వేయలేమని చెప్పారని అంటున్నారు. ఓవైపు అసమ్మతి కార్పొరేటర్లు, మరోవైపు సొంత పార్టీలోని కార్పొరేటర్ల నుంచి కూడా అసమ్మతి రాగం వినిపిస్తుండటంతో మేయర్ ఒంటరిగా మిగిలారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ మంగళవారం జరగనున్న ఓటింగ్‌పై పడింది. -
బెంగాల్: మండలి ఏర్పాటు తీర్మానానికి శాసనసభ ఆమోదం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ శాసనసభ కీలక తీర్మానం చేసింది. రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు తీర్మానానికి బెంగాల్ శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. శాసన సభ సమావేశంలో భాగంగా మండలి ఏర్పాటు తీర్మానానికి 196 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. 69 మంది ఎమ్మెల్యేలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. ఇక బెంగాల్లో 1952లో శాసన మండలిని ఏర్పాటు చేశారు. అయితే 1969లో లెఫ్ట్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేసింది. ఇక ఇటీవల జరిగిన రాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తృణముళ్ కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే.. శాసన మండలి ఏర్పాటు చేస్తామని పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశంలో ఆరు రాష్ట్రాల్లో( బిహార్, యూపీ, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, కర్ణాటక) శాసన మండలి అమలులో ఉంది. ఇక మండలి ఏర్పాటు తీర్మానానికి పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. శాసన మండలి ఏర్పాటు తీర్మానాన్ని ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారీ తీవ్రంగా వ్యతిరేకించారు. దేశంలో 23 రాష్ట్రాల్లో విధాన పరిషత్ లేదని, కొంతమంది టీఎంసీ నాయకులు మండలిలో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అందుకోసమే మండలి ఏర్పాటుకు తీర్మానం చేశారని తెలిపారు. -
దీదీ ఎత్తుగడ: ఏకంగా గవర్నర్‌కే గురి!
పశ్చిమ బెంగాల్ పాలనలో కేంద్రం జోక్యానికి చెక్ పెట్టేందుకు, రివెంజ్ దిశగా మమతా బెనర్జీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా గవర్నర్ ధన్‌ఖర్‌ను గద్దెదించేందుకు ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్నట్లు సమాచారం. కోల్‌కతా: పాలనాపరంగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్‌ఖర్‌కు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మొదటి నుంచే పొసగడం లేదు.ఈ క్రమంలో ఆయన బహిరంగంగానే దీదీ తీరును, పాలనను తప్పుబడుతూ వస్తున్నాడు. ఇంకోవైపు అసెంబ్లీ ఎన్నికల టైం నుంచి ఆ విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ తరుణంలో ఆయన్ని గవర్నర్ గిరి నుంచి సాగనంపేందుకు దీదీ పాచికలు కదుపుతోంది. ధన్‌ఖర్‌ను సాగనంపే విషయంపై ఇదివరకే మమతా, బిమన్ బెనర్జీతో చర్చించినట్లు సమాచారం. జులై 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఆ సమావేశాల్లో మొదటి సెషన్లో.. అది కూడా గవర్నర్ స్పీచ్ అనంతరమే తీర్మానం ప్రవేశపెట్టాలని, తద్వారా తమ పవర్ ఏంటో చూపించాలని టీఎంసీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. లోక్‌సభ స్పీకర్‌కీ.. గవర్నర్ ధన్ఖర్ బెంగాల్ అసెంబ్లీ వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నారంటూ స్పీకర్ బిమన్ బెనర్జీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ‘పెండింగ్ బిల్లులు సంతకం చేయకుండా జాప్యం చేస్తున్నాడని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా.. అనైతికంగా గవర్నర్ తీరు ఉందని’ ఫిర్యాదులో బిమన్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక టీఎంసీ సీనియర్ నేతలు కూడా గవర్నర్‌ను దించేయడమే ఎజెండాగా పెట్టుకుని అసెంబ్లీలో అడుగుపెట్టాలని నిర్నయించుకున్నారు. ఒక పార్టీకి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న గవర్నర్ తీరు హేయనీయంగా ఉందంటూ వరుసగా టీవీ ఛానెల్స్ డిబెట్లలో పాల్గొంటున్నారు. ఇక బెంగాల్లో శాంతిభద్రతలు కాపాడుతున్న గవర్నర్‌ను.. తామూ కాపాడుకునేందుకు ప్రయత్నిస్తామని బీజేపీ స్టేట్ ఛీఫ్ దిలీప్ ఘోష్ చెబుతున్నాడు. -
‘ఆమెతో మాట్లాడితే పార్టీ నుంచి బహిష్కరిస్తాం’
చెన్నై: అసెంబ్లీ డిప్యూటీ లీడర్, అసెంబ్లీ విప్‌ను ఎన్నుకునే సమావేశంలో ఓ కొత్త తీర్మానాన్ని అన్నాడీఎంకే పార్టీ ప్రవేశపెట్టింది. ఈ తీర్మానం ప్రకారం.. ఇకపై శశికళతో మాట్లాడే వారిపై కఠిన చర్యలు తప్పవని తమ నేతలను హెచ్చరించింది. సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇటీవల శశికళ మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ బయట పడింది. ఆ వీడియోలో.. తాను తొందరలోనే క్రీయాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లు, తర్వాత అన్నాడీఎంకేపై పార్టీపై పట్టుసాధిస్తానని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలతో మాట్లాడుతుంది. ఈ ఆడియో విన్న తర్వాత పార్టీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా శశికళతో మాట్లాడిన వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని అన్నాడీఎంకే నేతలు తమ పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు. పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపైన కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. కాగా శశికళతో మాట్లాడిన 16 మంది పార్టీ కార్యకర్తలను అన్నాడీఎంకే బహిష్కరించింది. అలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన పార్టీ ప్రతినిధి వీ పుగజేండిని కూడా బహిష్కరించింది. చదవండి: Tamilnadu: ‘అన్నాడీఎంకే’ నా ఊపిరి: శశికళ -
లక్షద్వీప్ దుమారం: ప్రఫుల్ రీకాల్‌కు తీర్మానం
లక్షద్వీప్ అభివృద్ధి పేరుతో అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్.. ఓ డ్రాఫ్ట్‌ను రూపొందించడం, దానికి వ్యతిరేకంగా ‘సేవ్ లక్షద్వీప్’ పేరుతో క్యాంపెయిన్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రఫుల్‌ను రీకాల్ చేయాలంటూ కేరళ ప్రభుత్వం సోమవారం ఏకంగా ఓ తీర్మానం ప్రవేశపెట్టింది. తిరువనంతపురం : లక్షద్వీప్ లో కాషాయ ఎజెండానుఅమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మండిపడ్డారు. ఆ కేంద్రపాలిత ప్రాంతపు అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ల ఖోడా పటేల్ ను రీకాల్ చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఆయన అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి దాదాపు అన్ని పక్షాల నుంచి మద్దతు లభించడంతో ఏకగ్రీవంగా తీర్మానం అసెంబ్లీలో ఆమోదం పొందింది. కాగా, లక్షద్వీప్ అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆ తీర్మానం కోరింది. వివాదాస్పద సంస్కరణలను వెనక్కి తీసుకోవాలని ఆ తీర్మానంలో కేరళ సర్కార్ కోరింది. ప్రఫుల్ ఖోడా పటేల్ తీసుకువచ్చిన డెవలప్మెంట్ అథారిటీ డ్రాప్ట్ రెగ్యులేషన్ గత వారం రోజులుగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందని ఆ తీర్మానం ద్వారా ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు. ఈ రెగ్యులేషన్ వల్ల లక్షద్వీప్ సంస్కృతి, సంప్రదాయాలు నాశనమవుతాయని, దీవి ప్రజల పరిరక్షణకు కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. చెట్లతో మొదలుపెట్టారు ఇక పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేసే పేరుతో లక్షద్వీప్ సంస్కృతి, సంప్రదాయాలను నాశనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. బ్రిటీష్ పాలనలో కంటే ఇప్పుడు ఏర్పడ్డ పరిస్థితులతోనే లక్షద్వీప్ ప్రజలు అణచివేతకు గురవుతున్నారని అన్నారు. లక్షద్వీప్ లో కాషాయ ఎజెండాను అమలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, ముందుగా అక్కడి కొబ్బరి చెట్లకు కాషాయ రంగును వేశారని, ఇప్పుడు ప్రజల జీవితాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీపై ఆయన మండిపడ్డారు.దీవి ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. చదవండి: సేవ్ లక్షదీవ్.. ఆ హీరోకి మద్దతు ఇక ప్రఫుల్ రూపొందించిన డ్రాఫ్ట్ ప్రకారం.. లక్షద్వీప్‌లో మద్య నిషేధాన్ని ఎత్తేశారు. తీర ప్రాంత చట్టాన్ని ఉల్లంఘించారని తీరంలోని మత్స్యకారుల షెడ్లను తొలగించారు. బీఫ్‌పై బ్యాన్ విధించారు. ఈ డ్రాఫ్ట్ తీవ్ర దుమారం రేపింది. కాగా, అక్కడి ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే ఆ డ్రాఫ్ట్‌ను నిలిపివేయాలంటూ అక్కడి ప్రజలు, పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మద్దతు లభిస్తోంది. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం
సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం జరిగింది. పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ తీర్మానం గురువారం శాసనసభ ఆమోదం పొందింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు తెలిపారు. ప్రైవేటీకరణ కాకుండా సీఎం తన లేఖలో అయిదు ప్రత్యామ్నాయాలు సూచించారని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని, స్టీల్‌ప్లాంట్ నష్టాల నుంచి బయట పడేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విశాఖ ఉక్కు తెలుగువారి ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని మరోసారి గుర్తుచేశారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. 32 మంది ప్రాణాల బలిదానంతో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు అయ్యిందని, స్టీల్‌ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ కేంద్రం కేటాయించాలని డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించాలని కోరారు. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఫిబ్రవరిలోనే ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. చదవండి: AP Budget 2021: ఏపీ బడ్జెట్ హైలైట్స్ ఇవే.. -
న్యూయార్క్ అసెంబ్లీలో కశ్మీర్‌పై తీర్మానం
న్యూయార్క్: ఫిబ్రవరి 5వ తేదీని ‘కశ్మీర్ అమెరికన్ డే’గా ప్రకటించాలని గవర్నర్ అండ్రూ క్యుఒమోను కోరుతూ న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ ఒక వివాదాస్పద తీర్మానాన్ని ఆమోదించింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. జమ్మూకశ్మీర్ ఘన సంస్కృతిని, సామాజిక సంప్రదాయాలను తప్పుగా చూపి కశ్మీర్ ప్రజలను విడదీసే చర్యగా ఈ తీర్మానాన్ని అభివర్ణించింది. ఈ తీర్మానం వెనుక స్వార్ధ శక్తులున్నాయని ఆరోపించింది. అసెంబ్లీ సభ్యుడు నాదర్ సాయేఘ్, మరో 12 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ‘కశ్మీరీలు ప్రతికూలతలను అధిగమించారు. పట్టుదలతో కృషి చేసి న్యూయార్క్ వలస ప్రజలకు పునాదిగా నిలిచారు. కశ్మీరీ ప్రజల మత స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛలకు న్యూయార్క్ రాష్ట్రం మద్దతునిస్తుంది’ అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని వాషింగ్టన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. ‘జమ్మూకశ్మీర్ సహా దేశ భిన్న, ఘన సాంస్కృతిక వారసత్వం భారత్‌కు గర్వకారణం. జమ్మూకశ్మీర్ భారత్‌లో విడదీయలేని అంతర్భాగం’ అని స్పష్టం చేశారు. కాగా, కశ్మీర్‌పై న్యూయార్క్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని పాకిస్తాన్ స్వాగతించింది. -
కేరళ ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్యే మద్దతు
తిరువనంతపురం : కేరళ అసెంబ్లీలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ.. కేరళ అసెంబ్లీ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతులు నిరసన తెలుపుతున్న నేపథ్యంలో వాటిని వెంటనే రద్దు చేయాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే ఈ బిల్లుకు అసెంబ్లీలో బీజేపీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక ఎమ్మెల్యే ఓ రాజ్‌గోపాల్ సైతం మద్దతు ప్రకటించడం అధికార పక్షానికి ఆశ్యర్యం కలిగించింది. దీంతో ప్రభుత్వం రూపొందించిన బిల్లుకు సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపిందని సభా స్పీకర్ పీ రామకృష్ణ తెలిపారు. (కేంద్ర చట్టాలపై కేరళ అసెంబ్లీ తీర్మానం) అనంతరం మీడియా పాయింట్ వద్ద రాజ్‌గోపాల్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన నిలిచిన ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. కాగా ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ కూడా మద్దతు ప్రకటించింది. కాగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన ఆందోళన 36వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలోనే బుధవారం నాడు రైతు నేతలతో జరిగిన సమావేశాలు కొంత మేర ఫలించాయి. -
కన్ఫ్యూజన్లో చంద్రబాబు నాయుడు..
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రవర్తనను ఖండిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. చంద్రబాబు వ్యవహారశైలిపై రూల్ 77 ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని పరిశీలనలోకి తీసుకుంటున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని, సభలో దురదృష్టకరమైన పరిణామం నేనెప్పుడూ చూడలేదని స్పీకర్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత కన్ఫ్యూజన్లో ఉన్నారని, రాజ్యాంగ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. (చదవండి: చంద్రబాబు యాక్టర్ అయితే..: సీఎం జగన్) (చదవండి: అసెంబ్లీలో చంద్రబాబు డ్రామా.. సస్పెన్షన్) -
ఆర్థికమంత్రి భరోసా : షేరు రికవరీ
సాక్షి, న్యూఢిల్లీ: యస్‌బ్యాంకు సంక్షోభంపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చారు. ఆర్బీఐ ఆంక్షలు, డిపాజిటట్‌దారుల ఆందోళన నేపథ్యంలోశుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆర్థికమంత్రి డిపాజిట్ దారుల సొమ్ముఎక్కడికీ పోదనీ, పూర్తి భద్రంగా వుంటుందని హామీ ఇచ్చారు. ప్రతి డిపాజిటర్ డబ్బు సురక్షితంగా ఉందనీ, ఈ విషయంలో రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తో తాను నిరంతరం మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. యస్ బ్యాంకు విషయంలో ఆర్బీఐ సరియైన పరిష్కారాన్ని సాధ్యమైనంత త్వరంగా తీసుకుంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ముందుస్తు పరిష్కారంకోసం బ్యాంకింగ్ రెగ్యులేటరీ చాలా త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆర్థికమంత్రి హామీతో యస్ బ్యాంకు షేరు భారీగా కోలుకుంది. ఉదయం ట్రేడింగ్‌లో 85 శాతం కుప్పకూలి రూ.5.65 వద్ద 52 వారాల కనిష్టాన్ని నమోదు చేసింది. అనంతరం పుంజుకుని ప్రస్తుతం రూ. 17 వద్ద కొనసాగుతోంది. చదవండి : చాలా వేగంగా చర్యలు, ఆందోళన వద్దు -
ఆర్‌కామ్ దివాలా ప్రణాళికకు ఆమోదం
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాలా పరిష్కార ప్రణాళికకు ఎస్బీఐ బోర్డు ఆమోదం తెలిపింది. ఆర్‌కామ్ రుణదాతల కమిటీ (సీవోసీ)లోనూ ఎస్బీఐ బోర్డు సానుకూలంగా ఓటు వేయనుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. సీవోసీలో ఆర్‌కామ్ పరిష్కార ప్రణాళికపై ఓటింగ్ మొదలైందని, ఈ నెల 4న ముగుస్తుందని పేర్కొన్నాయి. పరిష్కార ప్రణాళిక కింద బ్యాంకులకు రూ.23,000 కోట్లు వసూలు కానున్నాయి. యూవీ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ రూ.14,700 కోట్లకు బిడ్ వేయగా, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ టవర్, ఫైబర్ ఆస్తుల కోసం రిలయన్స్ జియో రూ.4,700 కోట్ల బిడ్ వేసింది. -
సీఏఏకు వ్యతిరేకంగా జీహెచ్ఎంసీ తీర్మానం
సాక్షి,హైదరాబాద్: సీఏఏకు వ్యతిరేకంగా జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం తీర్మానం చేసింది. మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన జీహెచ్ఎంసీ సమావేశంలో డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అంతకుముందు ఉదయం బడ్జెట్, మధ్యాహ్నం సాధారణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ..తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సీఏఏపై ఇప్పటికే తన నిర్ణయాన్ని తెలిపారని, దానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని కూడా ప్రకటించారని చెప్పారు. సీఎం స్ఫూర్తితో ప్రతిపాదించిన ఈ తీర్మానానికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలపాల్సిందిగా కోరగా, సభ్యులందరూ బల్లలు చరుస్తూ తమ ఆమోదం తెలిపారు. ఫసీయుద్దీన్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో సీఏఏను వ్యతిరేకించారని పేర్కొన్నారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా సీఏఏపై తన వాణిని స్పష్టంగా విన్పించారని చెప్పారు. ఒక వర్గానికి వ్యతిరేకంగా పక్షపాతంతో తీసుకొచ్చిన సీఏఏను అందరూ వ్యతిరేకించాల్సిందేనన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా, లౌకికతత్వాన్ని విచ్ఛిన్నం చేసేలా ఉన్న చట్టమని వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఎంఐఎంకు చెందిన మాజీ మేయర్ మాజిద్‌హుస్సేన్, ఎమ్మెల్సీ జాఫ్రీ, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ ప్రభాకర్, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, సింగిరెడ్డి స్వర్ణలత మద్దతు ప్రకటించారు. సభలో గలాటా.. అంతకుముందు ఉదయం బడ్జెట్‌పై సమావేశం జరుగుతుండగానే సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్‌పీర్‌లను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని మాజిద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. దీనికి సభలో ఉన్న బీజేపీ సభ్యుడు శంకర్‌యాదవ్ అవి ఇప్పుడెందుకు? అంటూ మాజిద్ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఆయనకు, ఎంఐఎం సభ్యులకు మధ్య సభలో కాసేపు వాగ్వాదం జరిగింది. మేయర్ పోడియం దగ్గరకు వెళ్లి కాస్త గలాటా సృష్టించారు. బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ విషయాలు మాత్రమే ప్రస్తావించాలన్న మేయర్.. సాధారణ సమావేశంలో మిగతా విషయాల గురించి చర్చిద్దామన్నారు. మధ్యాహ్నం జరిగిన సాధారణ సమావేశానికి శంకర్‌యాదవ్ గైర్హాజరయ్యారు. డిప్యూటీ మేయర్ సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టగా టీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దేశంలో సీఏఏను వ్యతిరేకిస్తూ తొలి తీర్మానం చేసిన కార్పొరేషన్ జీహెచ్‌ఎంసీయేనని మేయర్ పేర్కొన్నారు. -
సీఏఏకు వ్యతిరేకంగా సియాటెల్ తీర్మానం
వాషింగ్టన్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా భారత్‌లో పెద్ద ఎత్తున నిరసలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు అమెరికాలోని కొన్ని నగరాల్లోని ఎన్ఆర్ఐలు సీఏఏకు మద్దతుగా ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. కానీ.. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను వ్యతిరేకిస్తూ సియాటెల్ నగర కౌన్సిల్ తీర్మానం చేసింది. ఈ చట్టం ముస్లింలు, అణగారిన వర్గాలు, మహిళలు, ఎల్జీబీటీలపై వివక్ష చూపుతోందని పేర్కొంది. భారతీయ అమెరికన్ సిటీ కౌన్సిల్ సభ్యుడు క్షమా సావంత్ సీఏఏ రద్దు తీర్మానాన్ని కౌన్సిల్లో ప్రవేశపెట్టారు. భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సీఏఏను రద్దు చేయడం ద్వారా భారత రాజ్యాంగంపై నమ్మకం పెరుగుతుందని ఆయన అన్నారు. అదేవిధంగా జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ)ను నిలిపివేసి ఐక్యరాజ్యసమితి ఒప్పందాల ప్రకారం శరణార్థులకు సాయం చేయాడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ రద్దు చేయాలని సియాటెల్ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ అధ్యక్షుడు అహ్సాన్ ఖాన్ సమర్ధించారు. ‘మత స్వేచ్చను అణగదొక్కాలని చూసేవారికి ఈ తీర్మానం ఓ సందేశంగా మారుతుంది. ప్రజల పట్ల ద్వేషం, మతోన్మాదంతో ప్రవర్తించకూడదు. కొన్ని చట్టాల విషయంలో అంతర్జాతీయ ఆమోదాన్ని కూడా పొందాలి’ అని ఆయన తెలిపారు. ఇటీవల పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్ కూడా తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించాలనుకున్న విషయం తెలిసిందే. -
సీఏఏపై మమత కీలక నిర్ణయం
కోల్కత్తా : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం సభ దానిని ఆమోదించింది. బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి మమత తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగానే అసెంబ్లీలో ద్వారా సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. వివాదాస్పద చట్టానికి వ్యతిరేకంగా తీర్మానించిన నాలుగో రాష్ట్రంగా బెంగాల్ నిలిచింది. తొలుత కేరళ, రాజస్తాన్, పంజాబ్ రాష్ట్రాలు సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో బిల్లు ఆమోదించాయి. అయితే.. ఇదే విషయంపై కేరళ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టుకు వెళ్లగా సీఏఏపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. (‘పౌరసత్వ’ బిల్లుకు వ్యతిరేకం) -
కేరళ, పంజాబ్ బాటలో రాజస్తాన్..!
జైపూర్: పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు చల్లారడం లేదు. వివాదాస్పద సీఏఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్తాన్ తీర్మానాన్ని ఆమోదించింది. గతంలో సీఏఏకు వ్యతిరేకంగా కేరళ, పంజాబ్ రాష్ట్రాలు కూడా ఇలాగే చేశాయి. అయితే రాజస్తాన్‌లో సభలో తీర్మానం ప్రవేశపెట్టే సమయంలో.. అనేక మంది బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లారు. సీఏఏను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. ఇదే విషయంపై కేరళ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టుకు వెళ్లగా సీఏఏపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. అంతకుముందు రాజస్తాన్ కేబినెట్ సీఏఏ వ్యతిరేక ప్రతిపాదనను ఓ సర్క్యులేషన్ ద్వారా ఆమోదించింది. ఈ చట్టాన్ని తమ ప్రభుత్వం అమలు చేయబోదని సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. సంవిధాన్ బచావో ర్యాలీ పేరిట ఈ చట్టాన్ని నిరసిస్తూ ఈ నెల 22 న జరిగిన ఓ ర్యాలీకి ఆయన నేతృత్వం వహించడం కూడా విశేషం. ('రాహుల్.. దమ్ముంటే సీఏఏపై 10 వాక్యాలు మాట్లాడు') (సీఏఏపై కేరళ సంచలన నిర్ణయం) -
సీఏఏకు తొలి షాక్.. కేరళ అసెంబ్లీలో తీర్మానం
తిరువనంతపురం : కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం అమలును ఉపసంహరించాలని కోరుతూ కేరళ అసెంబ్లీలో చట్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. కేరళలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పౌరసత్వ చట్టాన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. కేరళకు లౌకిక రాష్ట్రమన్న గుర్తింపు ఉందని తెలిపారు. గ్రీకులు, అరబ్బులు, రోమన్లు, క్రైస్తవులు, ముస్లింలు ఇలా ప్రతి ఒక్కరు కేరళలో నివసిస్తున్నారని ఆయన చెప్పారు. కేరళకు కొన్ని సంప్రదాయాలు ఉన్నాయని వాటిని కాలరాసేందుకు ఎవరు ప్రయత్నించినా సహించేదిలేదని సీఎం అసెంబ్లీలో స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు, మతాధిపతులు, సామాజిక నేతలతో జరిగిన ఒక సమావేశంలో వారంతా పౌరసత్వ సవరణ చట్టంను వ్యతిరేకిస్తున్నట్లు తనతో, ప్రతిపక్షనాయకుడితో చెప్పినట్లు విజయన్ ట్వీట్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి పలువురు ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. కాగా.. ఎన్ఆర్సీ, సీఏఏ ఒకే నాణానికి రెండు వైపులా బొమ్మా, బొరుసని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. Thiruvananthapuram: Chief Minister of Kerala Pinarayi Vijayan moves resolution against #CitizenshipAmendmentAct in state Assembly, demanding withdrawal of #CAA. pic.twitter.com/IkkfLCwAyG — ANI (@ANI) December 31, 2019 -
ఏడాది చివర్లో జమ్ము కశ్మీర్ ఎన్నికలు
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది చివర్లో జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రస్తుతం కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్ధితిని కేంద్రం పర్యవేక్షిస్తోందని అన్నారు. జమ్ము కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ తీర్మానాన్ని అమిత్ షా శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు రాష్ట్ర ప్రజలకు మేలు చేకూరుస్తుందని చెప్పారు. కాగా జమ్ము కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ అంతకుముందు కేంద్ర కేబినెట్ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. -
ఎస్సార్ స్టీల్‌పై ఆర్సెలర్ మిట్టల్‌కు లైన్‌క్లియర్?
న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఎస్సార్ స్టీల్ కొనుగోలు చేసే విషయంలో ఆర్సెలర్ మిట్టల్‌కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) పచ్చజెండా ఊపింది. 2017 నుంచి ఎస్సార్ స్టీల్ కొనుగోలు కోసం ఆర్సెలర్ మిట్టల్ చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కింది. పెద్ద ఎత్తున రుణాలను తీర్చలేక దివాలా పరిష్కార ప్రక్రియకు కిందకు వెళ్లిన ఎస్సార్ స్టీల్‌ను రూ.42,000 కోట్లకు కొనుగోలు చేయడానికి ఆసక్తి వ్యక్తీకరిస్తూ ఆర్సెలర్ మిట్టల్ బిడ్ సమర్పించింది. దీనికి రుణదాతల కమిటీ సైతం ఆమోదం తెలిపింది. కొనుగోలు తర్వాత రూ.8,000 కోట్ల నిధులను ఈక్విటీ రూపంలో ఇచ్చేందుకు కూడా ఆర్సెలర్ మిట్టల్ అంగీకరించింది. అయితే, ఎస్సార్ స్టీల్ ప్రమోటర్లయిన రుయాలు మధ్యలో జోక్యం చేసుకుని ఆర్సెలర్ మిట్టల్ బిడ్ కంటే తాము ఎక్కువే చెల్లిస్తామంటూ ముందుకు రావడం, ఎన్సీఎల్టీని ఆశ్రయించడంతో అడ్డంకి ఏర్పడింది. అయితే, ఎట్టకేలకు ఆర్సెలర్ మిట్టల్ బిడ్‌కు ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపినట్టు సమాచారం. -
సంచలన నిర్ణయం తీసుకున్న ఆప్ ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పోలీసులను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలనే తీర్మానాన్ని ఆ రాష్ట్ర శాసనసభ సోమవారం ఆమోదించింది. ఇందుకోసం అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే ఢిల్లీ పోలీసులు కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి జవాబుదారీతనంగా ఉండాలని ఆ తీర్మానంలో పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా హోం మంత్రి సత్యేంద్ర జైన్ ఈ తీర్మానాన్ని సభ ముందు ఉంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ పోలీసులను ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఆధ్వర్యంలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీని ద్వారా జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. ఢిల్లీలో ప్రజలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గతవారం ఢిల్లీ సచివాలయంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై కారం పొడితో దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడికి బీజేపీ, ఢిల్లీ పోలీసులే కారణమని ఆప్ నాయకులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా తమ నాయకులపై బీజేపీ నేతలు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకురావాలనే డిమాండ్ తెరమీదకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో సీపీఎస్ రద్దు: కేజ్రీవాల్ ఢిల్లీలో నూతన పెన్షన్ విధానం(సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులు సోమవారం ఢిల్లీలో కదం తొక్కారు. ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో వేల సంఖ్యలో ఇక్కడి రాంలీలా మైదానంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ధర్నాకు సీఎం కేజ్రీవాల్ వచ్చారు. పాత పెన్షన్ విధానం అమలుకోసం సోమవారమే ప్రత్యేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్నారు. ప్రభుత్వ పథకాలను అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ లేకపోవడం బాధాకరం అన్నారు. అందుకే ఢిల్లీలో సీపీఎస్ రద్దు చేశానన్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఏపీ ప్రభుత్వాలతో మాట్లాడి ఆయా రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దుకు కృషి చేస్తానన్నారు. ఢిల్లీలో సీపీఎస్ రద్దుచేస్తున్నందుకు ఉద్యోగుల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి స్థిత ప్రజ్ఞ... సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో సీపీఎస్‌ను రద్దు చేసే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ధర్నాలో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి సీపీఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంత గ్రేట్ చెప్పండి!
న్యూ ఇయర్లో ఎవరు గ్రేట్? అప్పుడే ఎలా చెప్తాం? రెండు రోజులే కదా అయింది! రెండు రోజులే కావచ్చు. అయినా ఎవరు గ్రేటో చెప్పొచ్చు. పళ్లు నూరడం మానేస్తే ట్రంప్ గ్రేట్. ట్రంప్ వైపు చూసి వెక్కిరించకపోతే కిమ్ గ్రేట్. రెండు వేల నోటును రద్దు చేయకపోతే మోదీ గ్రేట్. రాహుల్‌గాంధీ తన సీరియస్‌నెస్‌ని కంటిన్యూ చేస్తే గ్రేట్. మాట మీద నిలబడి పార్టీ పేరు అనౌన్స్ చేస్తే రజనీకాంత్ గ్రేట్. పెళ్లయ్యాక కూడా సిక్స్‌లు, ఫోర్లు కొడితే విరాట్ కోహ్లీ గ్రేట్. ప్రభాస్, అనుష్క కలసి మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తే.. వాళ్లిద్దరూ గ్రేట్. అయినా.. న్యూ ఇయర్ వచ్చి వన్ వీక్ కూడా గడవందే.. ఇలాంటి గ్రేట్లన్నీ ఎలా సాధ్యం? జరిగేవి ఉంటే చెప్పండి. ఉన్నాయి. న్యూ ఇయర్ రిజల్యూషన్‌కి జనవరి ఫస్ట్‌న రోజురోజంతా కట్టుబడి ఉన్నవారు గ్రేట్. రెండో రోజూ కట్టుబడి ఉంటే ఇంకా గ్రేట్. ఇస్తారా? వాళ్లకైదేనా అవార్డును ఇస్తారా? అకాడమీలు ఇస్తాయా? గవర్నమెంట్ ఇస్తుందా? ఏ గుర్తింపూ లేకుండా ఎవరైనా న్యూ ఇయర్ తీర్మానాలు ఎందుకు తీసుకోవాలి చెప్పండి? తీసుకున్నా ఎందుకు వాటిపై నిలబడాలి చెప్పండి? అందుకే.. రెండు రోజులైనా సరే.. రిజల్యూషన్‌ని పంటిబిగువున పెట్టుకుని జీవితాన్ని లాగించినవాళ్లకు అవార్డు ఇవ్వాలి. వాళ్లచేత కార్పొరేట్ ఆఫీస్‌లలో ఉద్యోగులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్పించాలి. -
వాదించవద్దనే హక్కు ఎవరికీ లేదు: సుప్రీం
న్యూఢిల్లీ: ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన చిన్నారి హత్యకేసులో నిందితుడి తరఫున వాదనలు వినిపించవద్దని గుర్గావ్ డిస్ట్రిక్ బార్ అసోసియేషన్ చేసిన తీర్మానాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఎలాంటి కేసులోనైనా లాయర్లను వాదించవద్దని చెప్పే హక్కు ఎవరికీ లేదని.. అది చట్టవిరుద్ధం అని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎమ్ ఖన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్‌ల ధర్మాసనం సోమవారం వెల్లడించింది. బార్ అసోసియేషన్ తన తీర్మానాన్ని ఉపసంహరించుకుందని సంస్థ తరఫున హాజరైన న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ర్యాన్ గ్రూప్ అధినేత ఫ్రాన్సిస్ థామస్ తరఫున ఎవరూ వాదించవద్దని బార్ అసోసియేషన్ చేసిన తీర్మానం సరికాదని సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ, అడ్వొకేట్ సందీప్ కపూర్ తమ వాదనలు వినిపించారు. ఈ నెల 8న ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండవ తరగతి విద్యార్థి ప్రద్యుమ్న అనే విద్యార్థి కిరాతకంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. -
‘గుడా’ తీర్మానాన్ని ఏకపక్షంగా ఆమోదించాలి
ఎమ్మెల్యేలు మద్దతు లేఖలతో సరిపెట్టకూడదు రాజమహేంద్రవరంలో ఏర్పాటుతో ‘గుడా’ పేరుకు సార్థకత విలేకర్ల సమావేశంలో అఖిలపక్ష నేతలు సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేద్రవరం నగరపాలకసంస్థ పాలక మండలి సాధారణ సమావేశంలో గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గుడా) కార్యాలయం నగరంలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో అజెండాలో పెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించాలని అఖిల పక్ష సభ్యులు డిమాండ్ చేశారు. గోదావరి నది పేరుతో పెట్టిన గుడా కార్యాలయాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసినప్పుడు ఆ పేరుకు సార్థకత ఉంటుందన్నారు. ఇందుకు స్థానిక ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. శనివారం నగరంలోని ఆనం రోటరీ హాల్లో నగరపాలక సంస్థ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష నేతలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా షర్మిలారెడ్డి మాట్లాడుతూ తమ విజ్ఞప్తి మేరకు ‘గుడా’ కార్యాలయం ఏర్పాటు అంశాన్ని అజెండాలో పెట్టినట్టు తెలిపారు. ఇందుకు మద్దతుగా సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు లేఖలు ఇచ్చారని చెప్పారు. మార్చి 25న జరిగిన అఖిలపక్ష సమావేశానికి టీడీపీ నేతలు రాలేదని, రాజకీయాలకు అతీతంగా కౌన్సిల్లో ఈ అంశాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు. వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన లేదన్న విషయం పరిపాలన తీరుతో స్పష్టమవుతోందన్నారు. ఎమ్మెల్యేలు లేఖలు ఇచ్చి సరిపెట్టకుండా కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కొంత మంది నేతలు గుడా కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసినా మద్దతు తెలుపుదామంటున్నారని, గోదావరి తల్లి పేరుతో ఉన్న గుడా కార్యాలయం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయడమే సరైన నిర్ణయమన్నారు. అలాంటి నేతలు తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర బార్‌కౌన్సిల్ సభ్యుడు, రాజమహేంద్రవరం బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఎన్నికలకు ముందు, తర్వాత రాజమహేంద్రవరం అభివృద్ధికి ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదని గుర్తు చేశారు. రాజకీయ నేతలు దృష్టి సారిస్తే ఆ హామీలలో కొన్నయినా కార్యరూపం దాల్చేవని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ సిటీ కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ అన్ని రకాల రవాణా సౌకర్యాలు ఉన్న రాజమహేంద్రవరంలోనే గుడా కార్యాలయం ఏర్పాటు చేయడం సమంజసమన్నారు. గుడా కార్యాలయం ఏర్పాటుకు తమ పార్టీ తరఫున పోరాటాలు చేయడానికైనా సిద్ధమని వైఎస్సార్సీపీ రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు చెప్పారు. ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ లేఖలు ఇచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు కార్యాలయం ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. గుడా కార్యాలయం సాధించే వరకు ఎమ్మెల్యేలు ముందుండాలని సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు కోరారు. ఈ అంశానికి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బూర్లగడ్డ Ðవెంకట సుబ్బారాయుడు తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పిల్లి నిర్మల, ఈతకోట బాపన సుధారాణి, వైఎస్సార్సీపీ నేతలు పెంకే సురేష్, మజ్జి అప్పారావు, వాకచర్ల కృష్ణ, మార్తి లక్ష్మి, మార్తి నాగేశ్వరరావు, కానుబోయిన సాగర్, కాటం రజనీకాంత్, కోడికోట, ఆరీఫ్, కాంగ్రెస్ పార్టీ నేత ఆకుల భాగ్యలక్ష్మి, అధ్యాపకులు విక్టర్‌బాబు, ఆర్ట్‌ఆఫ్ లివింగ్ సునీల్, బీజేపీ నేత మట్టాడి జయప్రకాష్, ఆర్ఎంపీ డాక్టర్ బళ్లా శ్రీనివాస్, మీడియా ఇన్చార్జి ఆర్.నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం
చెన్నై : తమిళనాట రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న ఇవ్వాలని కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ ఆ రాష్ట్ర కేబినెట్ ఓ తీర్మానాన్ని పాస్ చేసింది.. ఈ తీర్మానంతో పాటు రూ.15 కోట్లతో అమ్మ స్మారకమందిరాన్ని నిర్మించాలనే తీర్మానాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది. అమ్మ మరణాంతరం తొలిసారి భేటీ అయిన కొత్త కేబినెట్ ఆ మేరకు నిర్ణయాలు తీసుకుంది. పార్లమెంట్ క్యాంపస్ లోపల కూడా అమ్మ కాంస్య విగ్రహాన్ని కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. మెరీనా బీచ్‌లో నిర్మించిన ఎంజీఆర్ మెమోరియల్ పేరును భారతరత్న డాక్టర్ ఎంజీఆర్‌గా మార్చనున్నట్టు కేబినెట్ తెలిపింది. అక్కడే జయలలిత మెమోరియల్‌ను నిర్మించనున్నట్టు పేర్కొంది. కోలుకుంటుదన్న అమ్మ డిసెంబర్ 5న అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్‌కు గురికావడం, అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై డిసెంబర్ 6న అసువులు బాసిన సంగతి తెలిసిందే. అమ్మ మరణాంతరం వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 31 మంది కొత్త మంత్రులచే కూడా ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రమాణం చేపించారు. పన్నీర్ సెల్వం నేతృత్వంలో తొలిసారి కేబినెట్ శనివారం సచివాలయంలో భేటీ అయింది. ఈ భేటీలో అమ్మ జయలలితకు మంత్రులు శ్రద్ధాంజలి ఘటించి, ఈ మేరకు తీర్మానాలు ఆమోదించారు. -
సుబాబుల్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
విజయవాడ(గాంధీనగర్) : సుబాబుల్, జామాయిల్, సరుగుడు కర్రను ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయాలని, ఎస్పీఎం బకాయిలను సెంట్రల్ మానిటరింగ్ ఫండ్ నుంచి రైతులకు చెల్లించాలని సుబాబుల్, జామాయిల్, సరుగుడు రైతు సంఘ సమావేశం తీర్మానించింది. హనుమాన్‌పేటలోని దాసరి భవన్లో సుబాబుల్, జామాయిల్, సరుగుడు రైతు సంఘం సమావేశం శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న ఏఐకెఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య మాట్లాడుతూ కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలన్నారు. ప్రతి కంపెనీ నుంచి కొనుగోలుకు అవసరమైన బ్యాంక్ గ్యారెంటీ తీసుకోవాలన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి వి.హనుమారెడ్డి మాట్లాడుతూ క్వింటా మద్దతు ధర రూ. 4600 ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లాల వారీగా రేటు నిర్ణయించేందుకు వీలు కల్పిస్తూ రూపొందించిన జీవో 143 ఉపసంహరించుకోవాలన్నారు. కొనుగోలు బకాయిలు చెల్లించని ఎస్పీఎం యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయశాఖా మంత్రి తక్షణమే జోక్యం చేసుకుని ధర అమలుకు రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని, సమస్యల పరిష్కారానికి చొరవచూపాలని హనుమారెడ్డి కోరారు. సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, ఏ వెంకటాచారి, పి నాగభూషణం, ఎన్.అంజిరెడ్డి పాల్గొన్నారు. -
ఫార్మాసిటీకి భూములు రెడీ
♦ నక్కర్తమేడిపల్లి రైతులు ఏకగ్రీవ తీర్మాణం ♦ ఎకరాకు పరిహారం రూ. 8 లక్షలకు మించి ఇవ్వాలని విన్నపం ♦ రేపు తీర్మాణ పత్రాన్ని ఇవ్వనున్న సర్పంచ్, రైతులు ♦ తీర్మాణం పత్రాన్ని ఇవ్వగానే జేసీకి, ఆర్డీఓకు ♦ భూసర్వేకు అనుమతి తీసుకోనున్న తహసీల్దార్ యాచారం: ముచ్చర్ల ఫార్మాసిటీకి నక్కర్తమేడిపల్లి రైతులు భూములు ఇవ్వడానికి రెడీ అయ్యారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారమైన, లేదా ఎకరాకు రూ. 15 లక్షలైన పరిహారం ఇస్తేనే భూములిస్తామని మొదట్లో మొండికేశారు. గత వారం యాచారం ఎంపీడీఓ కార్యాలయంలో నక్కర్తమేడిపల్లి రైతులతో జేసీ రజత్‌కుమార్‌సైనీ, సరూర్‌నగర్ ఆర్డీఓ సుధాకర్‌రావు, తహసీల్దార్ పద్మనాభరావు సమావేశమైనారు. ఈ సమావేశంలో రైతులు మొండిగా వ్యవహరించడంతో జేసీ ఆగ్రహాంతో పక్కనే ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన భూములనైన తీసుకుంటాం కాని మీ నక్కర్తమేడిపల్లి భూములను మాత్రం తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. దీంతో రైతులు కొంచెం మెతకవైఖరి వచ్చింది. ఇన్నాళ్లు ఫార్మాకు భూములు పోతే , వచ్చే డబ్బులతో ఇతర గ్రామాల్లో సాగు యేగ్యంగా ఉన్న భూములు, ప్లాట్లనైన కొనుగోలు చేసుకోవచ్చని కలలకన్న రైతులకు జేసీ హెచ్చరిక మింగుడు పడదనిగా మారింది. అత్యధిక అసైన్‌్డ భూముల్లో రైతులు సగం వరకు సాగు చేసుకోవడం, మిగితా భూములను పశువులు, మేకలు, గొర్రెల మేపకానికి వాడుకోవడం జరుగుతుంది. కాని ఎనాడు కూడ ఆ భూముల్లో పెట్టుబడులు పెట్టడమే కాని ..రూ. లక్షల్లో ఆదాయం పొందిన దాఖాలాలు లేవు. ఈ నేపథ్యంలో ఫార్మాకు తీసుకోవడం వల్ల ఒకేసారి ఎకరాకు రూ. 8 లక్షలు ఇస్తుండడడం వల్ల రైతుల్లో భూములిచ్చేయడానికి సుముఖత ఏర్పడింది. కేవలం నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలోనే 1,954 ఎకరాలను తీసుకుంటుండడం వల్ల దాదాపు 600 మందికి పైగా రైతులు లబ్ధిపొందనున్నారు. నక్కర్తమేడిపల్లి రైతులు భూములు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయడం వల్ల పక్కనే ఉన్న నానక్‌నగర్, తాడిపర్తి రైతులు ఒకే అనే పరిస్థితి మారింది. రేపు తీర్మాణ పత్రాన్ని తహసీల్దార్‌కు ఫార్మాసిటీకి భూములు ఇవ్వడానికి మొదట తీవ్ర వ్యతిరేకత, సీపీఎం నాయకుల పాదయాత్రకు, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల ఆందోళనలకు నక్కర్తమేడిపల్లి గ్రామమే వేదికైంది. మొదట్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న పక్క జిల్లాలోని భూములు తీసుకుంటామని జేసీ తెలియజేయడంతో రైతుల్లో ఒకేసారి మార్పు వచ్చింది. ఒకనోక దశలో గ్రామ సర్పంచ్ పాశ్ఛ భాషా, ఎంపీటీసీ మోటె శ్రీశైలం, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులకు తెలియకుండానే రైతులే స్వయంగా జేసీని కలిసి మా భూములిస్తామని తెలియజేసే అవకాశం వచ్చింది. అధిక శాతం రైతుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న సర్పంచ్ రెండు రోజుల కింద గ్రామస్తులు, రైతులతో సమావేశమై ఫార్మాకు భూములిచ్చే విషయమై చర్చించారు. సమావేశంలో అధిక శాతం మంది రైతులు సుముఖత వ్యక్తం చేయడంతో సంతకాల సేకరణ, తీర్మాణాన్ని చేశారు. తీర్మాణం విషయమై సర్పంచ్ భాషా శుక్రవారం సరూర్‌నగర్ ఆర్డీఓను కలిసి ఫార్మాకు భూములిచ్చే సుముఖతపై తెలియజేశారు. అనంతరం తహసీల్దార్‌ను కూడ కలిశారు. సోమవారం రోజు కూడ రైతులతో సమావేశమైన సర్పంచ్ ఫార్మాకు భూములివ్వడానికి సిద్ధమైనట్లు, కాని ఇచ్చే పరిహారం కన్న కొంచెం పెంచి ఇస్తే న్యాయంగా ఉంటుందనే విషయంలో కూడ జేసీ అలోచన చేయాలని తీర్మాణం చేశారు. గ్రామ పంచాయతీలో చేసిన తీర్మాణ పత్రాన్ని బుధవారం సర్పంచ్ భాషా, తహసీల్దార్‌కు ఇవ్వనున్నారు. తీర్మాణ పత్రాన్ని జేసీకి, ఆర్డీఓకు పంపి భూసర్వేకు తహసీల్దార్ అనుమతి తీసుకోనున్నారు. వారంలో భూసర్వేకు ప్రణాళిక నక్కర్తమేడిపల్లి గ్రామంలో ఫార్మాకు భూములు తీసుకోవడానికి తహసీల్దార్ పద్మనాభరావు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. జేసీ నుంచి అనుమతి రాగానే సర్వేయర్, రెవెన్యూ, టీఎస్ఐఐసీ శాఖల ఆధ్వర్యంలో రైతుల వారిగా భూసర్వే చేయనున్నారు. నక్కర్తమేడిపల్లి గ్రామంలో కేవలం 184, 213, 247 నంబర్లల్లోనే కాక 76,101,118,131,129,219,236,237,245,426,430,448, 454 తదితర సర్వే నంబర్లల్లోని భూములను సైతం ఫార్మాకు తీసుకోవడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. అదే విధంగా తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో పలు సర్వే నంబర్లల్లో మరో వెయ్యి ఎకరాలకు పైగా భూములను తీసుకోవడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. అసైన్‌్డ భూముల సేకరణ అనంతరం ఆయా గ్రామాల్లోని పట్టా భూములను తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇదే విషయమై తహసీల్దార్ పద్మనాభరావును సంప్రదించగా సర్పంచ్ తీర్మాణ పత్రాన్ని ఇవ్వగానే జేసీకి, ఆర్డీఓకు పంపి భూసర్వేకు అనుమతి తీసుకుంటానని అన్నారు. -
మా పిల్లల్ని సర్కార్ బడికే పంపుతాం..
♦ వెంటనే ఇంగ్లీష్ మీడియం ప్రారంభించండి.. ♦ తడ్కపల్లి గ్రామస్తుల తీర్మానం సిద్దిపేట రూరల్: ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే తమ పిల్లల్ని ప్రభుత్వ బడికి పంపిస్తామని మండలంలోని తడ్కపల్లి గ్రామస్తులు తీర్మానం చేశారు. సోమవారం బడిబాటలో భాగంగా గ్రామానికి వెళ్లిన డిప్యూటీ ఈఓ శ్యాంప్రసాద్‌రెడ్డి, ఎంఈఓ ప్రసూనాదేవికి సర్పంచ్ గడ్డం బాల్‌నర్సయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ తడ్కపల్లి గ్రామం నుంచి 5 నుంచి 10సంవత్సరాలోపు సుమారుగా 150మంది విద్యార్థులకు పైగా ఉన్నారన్నారు. వీరంతా ప్రతి రోజూ సిద్దిపేటలోని ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారన్నారు. ఒక్కో విద్యార్థికి వేలల్లో ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని కోరారు. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం బోధిస్తే గ్రామంలోని విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎర్ర యాదయ్య, విద్యా కమిటీ చైర్మన్ ఆగంరెడ్డి, గ్రామ నాయకులు శ్రీనివాస్, కనకయ్య, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘కొత్త’ చిత్రం
♦ నేడు కొలిక్కి రానున్న జిల్లాల పునర్విభజన ♦ సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం ♦ ప్రతిపాదిత జిల్లాలపై సమగ్రంగా చ ర్చించే అవకాశం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాల పునర్విభజనపై మంగళవారం స్పష్టత రానుంది. ఏయే ప్రాంతాలతో కలిపి కొత్త జిల్లాలు ఏర్పడతాయనేది ప్రాథమికంగా తేలనుంది. జిల్లాల విభజనపై ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి నుంచి రెండు రోజులపాటు జిల్లా కలెక్టర్లతో విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాల పునర్విభజనలో కీలకంగా భావిస్తున్న ఈ భేటీలో ప్రతిపాదిత జిల్లాలు, నైసర్గిక స్వరూపం తదితర అంశాలు కొలిక్కివచ్చే అవకాశముంది. మరోవైపు జిల్లాల విభజనలో అనుసరించాల్సిన విధి విధినాలపై రెండు రోజుల క్రితం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల ముసాయిదాలకు సంబంధించి ప్రధానంగా ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా అవసరమైతే గ్రామాలు మొదలు మండలాల వరకు ఏ ప్రాంతాన్నయినా సరే.. సమీప మండలం లేదా డివిజన్లో కలిపేందుకు జిల్లా యంత్రాంగానికి వెసులుబాటు కల్పించింది. అయితే, ఒక మండలాన్ని మరో డివిజన్లో.. ఒక గ్రామాన్ని మరో మండలంలో విలీనం చేయాలని ప్రతిపాదిస్తే.. దానికి సహేతుక కారణం చూపాలని నిర్దేశించింది. ప్రతిపాదిత ప్రాంత విస్తీర్ణం, జనాభా, ఓటర్లు తదితర అంశాలతోపాటు మ్యాపులు తయారు చేయాలని ఆదేశించింది. అదే సమయంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మేళవింపుతో జిల్లాలకు రూపకల్పన చేయాలని సూచించింది. ఈ మేరకు దీనికి అనుగుణంగా ఫార్మెట్‌ను రూపొందించిన జిల్లా యంత్రాంగం సబ్‌కలెక్టర్/ ఆర్డీఓలకు పంపింది. అయితే, ఈ కసరత్తు కొలిక్కి రాకమునుపే.. రాష్ట్ర ప్రభుత్వం అకస్మాత్తుగా జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీంతో జిల్లాల పునర్విభజనకు ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. కాగా, జిల్లా యంత్రాంగం మాత్రం ఇప్పటివరకు తయారుచేసిన ముసాయిదాల ప్రకారం జిల్లాను మూడు ముక్కలు చేయాలని ప్రతిపాదిస్తోంది. వికారాబాద్, రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం పేరిట మూడు జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుత జిల్లా పరిధిని ప్రాతిపదికగా తీసుకోవడం ద్వారా ఈ జిల్లాలను ప్రతిపాదించింది. ఒకవేళ ప్రభుత్వం గనుక సమీప జిల్లాల్లోని ప్రాంతాలను కూడా పరిగణనలోకి తీసుకొని జిల్లాల పునర్విభజన చేపట్టాలంటే మాత్రం జిల్లా యంత్రాంగం ప్రతిపాదనల్లో మార్పులు చేర్పులు జరగవచ్చు. హైదరాబాద్, సికింద్రాబాద్, గోల్కొండ, వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను ప్రకటించే అంశం తాజాగా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంట్లో గ్రామీణ ప్రాంతాలతో సహా మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గాన్ని కూడా వికారాబాద్ పరిధిలోకి తేవడం, శివార్లను గోల్కొండ, సికింద్రాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో కలిపే దిశగా ఆలోచన సాగిస్తున్నట్లు సమాచారం. మండలాలు కొలిక్కివచ్చిన తర్వాతే.. కాగా, జిల్లాల విభజనలో కీలకంగా భావిస్తున్న మండలాల పునర్విభజన పూర్తయిన తర్వాతే కొత్త జిల్లాలపై స్పష్టత వస్తుంది. ఒక జిల్లాకు సగటున 20 మండలాలు ఉండేలా చూడాలని ప్రభుత్వం నిర్దేశించడం, 4 లేదా 5 నియోజకవర్గాల వచ్చేలా ప్రతిపాదించాలని స్పష్టం చేయడంతో జిల్లా యంత్రాంగం గత ప్రతిపాదనలు పూర్తిగా మారిపోయే అవకాశముంది. జిల్లాలో దాదాపు 55 లక్షల జనాభా ఉన్నందున ఆ మేరకు 50 నుంచి 55 మండలాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. దీనికి అనుగుణంగా జిల్లాల విభజన జరుగనుంది. నేడు, రేపు జరిగే సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకు కొత్త జిల్లాల ముఖచిత్రాలు రూపుదిద్దుకున్నాయి. వీటిపై ప్రజల అభ్యంతరాలను కోరుతూ వారం రోజుల్లోపు నోటిఫికేషన్ జారీ చేయనుంది. -
జీహెచ్ఎంసీ మేయర్ పీఠం బీసీలకే
ఎన్నికల కమిషన్‌కు స్పష్టత ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ‘బీసీ-జనరల్’ అభ్యర్థికే దక్కనుంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ అప్పటి ప్రభుత్వం 2014 మార్చి 1న జీవో నెం.94 జారీ చేసింది. అప్పట్లో జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ‘బీసీ-జనరల్’గా రిజర్వు చేశారని... ఆ ఉత్తర్వుల ప్రకారమే జీహెచ్ఎంసీ మేయర్ పదవికి పరోక్ష ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంటూ బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ లేఖ రాసింది. -
కశ్మీర్ ప్రజలకు మా మద్దతు ఉంటుంది: పాక్
ఇస్లామాబాద్: భారత్‌తో ఉన్న కశ్మీర్ వివాదాన్ని వెంటనే పరిష్కరించుకోవాలని భావిస్తున్నామని పాకిస్థాన్ విదేశాంగ వ్యవహారాలశాఖ మంత్రి సర్తాజ్ అజీజ్ అన్నారు. ఒక శాంతియుత తీర్మానం ద్వారా కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఐక్యరాజ్య సమితి ఈ విషయంలో చేసిన తీర్మానాల ఆధారంగానే తమ ఆలోచన ఉందని చెప్పారు. కశ్మీర్ ప్రజలు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే హక్కు పొందేందుకు రాజకీయంగా, నైతికంగా అన్ని రకాలుగా తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఏ స్థాయిలోనైనా భారత్‌తో తాము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. -
రాష్ట్రానికి ప్రత్యేక 'హోదా'కల్పించాలి
♦ కేంద్రాన్ని కోరుతూ శాసనమండలి ఏకగ్రీవ తీర్మానం ♦ కేంద్రం నుంచి రావాల్సిన రాయితీల్ని పొందేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నా: సీఎం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనమండలి గురువారం ఏకగ్రీవంగా తీర్మానిం చింది. 'హోదా'అంశంపై చర్చ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు ప్రతిపాదించిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని, పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపరచిన అన్నిఅంశాల్నీ అమలుచేయాలని, నాటి ప్రధాని మన్మోహన్సింగ్ రాజ్యసభలో ఇచ్చిన వాగ్దానాలు, రాష్ట్ర పారిశ్రామిక , ఆర్థికాభివృద్ధికోసం పన్ను రాయితీలు, నూతన రాజధాని నిర్మాణానికి ప్రత్యేక నిధులు, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, ఆర్థికలోటు భర్తీకి నిధు ల విడుదల, 13వ షెడ్యూల్లోని విద్యాసంస్థల స్థాపన, మౌలిక వసతుల కల్పన, సెక్షన్-8 అమలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సహా అన్ని హామీల్నీ అమ లు చేయాలని కేంద్రాన్ని కోరుతూ సీఎం ప్రతి పాదించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిం చినట్టు మండలి చైర్మన్ చక్రపాణి ప్రకటించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు: సీఎం అంతకుముందు జరిగిన చర్చకు సీఎం చంద్రబాబు సమాధానమిస్తూ.. ప్రత్యేకహోదా రాద ని అధైర్యపడి ఎవరూ అఘాయిత్యాలకు పాల్పడొద్దని, ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలిపారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని ఆయన ఆరోపించారు. అఖిలపక్ష భేటీ అవసరం: ఉమ్మారెడ్డి అంతకుముందు చర్చలో వైఎస్సార్సీపీ మం డలి నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడు తూ.. ప్రత్యేకహోదా విషయంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయన్న సంకేతాలిస్తేనే కేంద్రంనుంచి మన డిమాండ్‌ను సునాయాసంగా సాధించడానికి వీలుంటుందన్నారు. అందుకోసం ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా మాత్రమే కావాలని... ప్యాకేజీ వద్దనే సెంటిమెంట్ ప్రజల్లో నాటుకుపోయిందని గుర్తుచేస్తూ ఢిల్లీ వెళ్లిన సందర్భంగా సీఎం చంద్రబాబు.. ప్రధానమంత్రి మోదీని ఏమి అడిగారనే విషయం ఇప్పటికీ బయటకు రావట్లేదన్నారు. సీపీఐ సభ్యుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రత్యేకహోదా కోసం చేసిన తీర్మానాలు... తీర్మానాల మాదిరిగాక అభ్యర్థన కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా ఉందన్నారు. -
ప్రత్యేకహోదాపై అసెంబ్లీ తీర్మానం
మిగతా ఎజెండా పక్కనపెట్టి తీర్మానం చేయాలన్న వైఎస్సార్సీపీ ప్రశ్నోత్తరాలను చేపట్టాలని అధికారపక్షం బెట్టు పోడియం వద్ద నినాదాలతో హోరెత్తించిన ప్రతిపక్షం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించాలని కోరుతూ మంగళవారం చేసిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రత్యేకహోదా అంశంపై చర్చ అనంతరం సభా నాయకుడు ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ అంశంపై శాసనసభ తీర్మానం చేయాలని రెండు రోజులుగా ప్రతిపక్షం పట్టుబట్టి ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి తీర్మానం ప్రతిపాదించారు. అంతకుముందు ఈ అంశంపై జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేకహోదా వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. ప్యాకేజీకన్నా ప్రత్యేకహోదా ఏ రకంగా రాష్ట్రానికి మేలు చేస్తుందో తెలిపారు. కేంద్రం హోదా ఇవ్వాలనుకుంటే ఎలాంటి అడ్డంకులు లేవని సోదాహరణగా చెప్పారు. హోదా ఇవ్వడానికున్న మార్గాలను తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి ఈ అంశంపై మాట్లాడుతూ, రాష్ట్రానికి రావలసిన నిధుల కోసం కేంద్రం వద్ద తాము చేసిన ప్రయత్నాలను వివరించారు. ఈ చర్చలో అధికార టీడీపీ, మిత్రపక్ష బీజేపీ సభ్యులు మాట్లాడిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. హోదాతోపాటు పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ తీర్మానం ప్రతిపాదించగా శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రెండో రోజూ విపక్ష సభ్యుల నిరసన... ప్రత్యేకహోదాపై తీర్మానం చేయాలని సోమవారం శాసనసభ ప్రారంభమైన తొలిరోజున డిమాండ్ చేసిన వైఎస్సార్సీపీ రెండోరోజు మంగళవారం కూడా అదే అంశంపై సభలో పట్టుబట్టింది. మంగళవారం సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలను ప్రారంభిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ప్రత్యేకహోదా కోరుతూ అప్పటికే ప్లకార్డులు ప్రదర్శిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు నిరసన తెలియజేశారు. ప్రశ్నోత్తరాలు సహా మొత్తం ఎజెండాను పక్కనపెట్టి హోదాపై చర్చించాలని విపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించారు. దాన్ని స్పీకర్ అంగీకరించకపోవడంతో వైఎస్సార్సీపీ సభ్యులు పోడియం ముందు నిలబడి నిరసన తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టాల్సిందేనని అధికార పక్షం కోరింది. ఆ తర్వాత మిగతా అంశాలను తీసుకుందామని స్పీకర్ చెప్పినా, విపక్ష సభ్యులు పట్టువీడలేదు. సోమవారం ప్రశ్నోత్తరాలు జరగలేదని, మంగళవారం కూడా జరగకపోతే ఎలా? అని స్పీకర్ విపక్ష సభ్యులను ప్రశ్నించారు. అంతకంటే ముఖ్యమైన అంశం ఉన్నందున వాయిదా వేయాలని కోరినా, స్పీకర్ సానుకూలంగా స్పందించలేదు. విపక్ష సభ్యులు నిరసనలు కొనసాగించడంతో, ప్రతిపక్ష నేత జగన్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ప్రశ్నోత్తరాలు సహా ఎజెండా మొత్తాన్ని పక్కనబెట్టి ప్రత్యేకహోదా మీద చర్చ చేపడదామని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. 'ప్రత్యేకహోదా అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీని కోసం తాము చేస్తున్న పోరాటం వల్ల అధికార పక్షానికే ప్రయోజనం. రాజకీయాలకు అతీతంగా తాము ముందు వరుసలో నిలబడి ప్రత్యేకహోదా సాధనకు పోరాటం చేస్తున్నాం. సోమవారం మధ్యాహ్నం 1.30గంటలకు చర్చ మొదలుపెట్టి 2గంటలకు ముగిం చారు. సభ్యులకు ఇచ్చిన ప్రతు ల్లో ఉన్న అంశాలు కాకుండా ముఖ్యమంత్రి ఏదేదో మాట్లాడారు. ఇప్పుడే అన్ని అంశాలను పక్కనబెట్టి ముఖ్యమంత్రిని ప్రత్యేకహోదాపై ప్రకటన చేయమనండి. వెంటనే చర్చ చేపడదాం. ఆఖరున అరగంటలో ప్రకటన చేసి, చర్చ లేకుండా చే యాలని చూస్తున్నారు. అన్ని అంశాలను పక్కనబెట్టి నేరుగా ప్రత్యేకహోదాపై చర్చలోకి వెళదామా? లేక సమావేశాలను 15రోజులకు పొడిగిద్దామా? మీరే తేల్చండి' అని స్పష్టంగా చెప్పారు. ప్రతిపక్షం ఒత్తిడితో ఎట్టకేలకు చర్చ ప్రశ్నోత్తరాలు ఉండాల్సిందేనని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, బుచ్చయ్య చౌదరి, బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు. ప్రత్యేకహోదా మీద చర్చ కోసం విపక్ష సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం ముందు నిలబడి నినాదాలతో హోరెత్తించారు. సభ సజావుగా జరిగే అవకాశం లేకపోవడంతో 9.23గంటలకు సభను 15నిమిషాలపాటు స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభం కాగానే మిగతా ఎజెండాను వాయిదా వేసి ప్రత్యేకహోదా అంశంపై చర్చను చేపట్టారు. చర్చ అనంతరం చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రత్యేక హోదాపై తీర్మానం ఇదీ..తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ప్రత్యేకహోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది. ప్రత్యేకహోదాపై శాసనసభలో చర్చ అనంతరం చివరలో సీఎం ఈ తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తీర్మానం... ''ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించాలని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపరిచిన అన్ని అంశాలను అమలు చేయాలని 2014, ఫిబ్రవరి 20న అప్పటి ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన వాగ్దానాలు... రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధి కొరకు పన్ను రాయితీలు, నూతన రాజధాని నిర్మాణానికి ప్రత్యేక నిధులు, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, ఆర్థికలోటు భర్తీకి నిధుల విడుదల, 13వ షెడ్యూల్లోని విద్యాసంస్థల స్థాపన, ఇతర మౌలిక వసతుల కల్పన, చట్టంలోని సెక్షన్-8 అమలు, పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణం సహా అన్ని హామీలను అమలు చేయడం ద్వారా పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే విధంగా రాష్ట్రానికి సహాయం అందించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తోంది.'' -
ప్రత్యేక హోదా తీర్మానానికి సభ ఏకగ్రీవ ఆమోదం
-
తీర్మానంపై వైఎస్ఆర్ సీపీ సభ్యుల పట్టు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభ అయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ కోడెల శివప్రసాదరావు... ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఫ్లకార్డులు చేతపట్టి ....నిరసనకు దిగారు. ప్రత్యేక హోదాపై తీర్మానం చేయాలంటూ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వమే...ప్రత్యేక హోదాపై ప్రకటన చేయబోతుందని, దీనిపై చర్చ, తీర్మానం ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత చర్చ ఉంటుందన్నారు. అయితే వెంటనే తీర్మానం పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది. -
ధోబీ ఘాట్ల ఏర్పాటుకు తీర్మానం హర్షణీయం
మేడ్చల్ (రంగారెడ్డి జిల్లా) : హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో జిల్లాల్లో అధునాతనమైన ధోబీ ఘాట్లను ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం హర్షణీయమని తెలంగాణ రాష్ట్ర రజక జేఏసీ ఫౌండర్ చైర్మన్ పంజగారి ఆంజనేయులు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రజకుల పట్ల అభిమానంతో ఏకగ్రీవంగా ఈ తీర్మానం చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణలోని 10 జిల్లాల రజకులు రుణపడి ఉన్నామని తెలిపారు. ధోబీ ఘాట్లకు ఉచిత కరంట్, వాటి నిర్మాణానికి స్థలాన్ని అందించాలన్నారు. అదే విధంగా చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలని కోరారు. -
విద్యుత్ సమస్యపై తెలంగాణ అసెంబ్లీ తీర్మానం
హైదరాబాద్: విద్యుత్ సమస్యపై తెలంగాణ అసెంబ్లీ సోమవారం తీర్మానం ఆమోదించింది. విభజన చట్ట ప్రకారం తమకు రావాల్సిన 53.89 శాతం విద్యుత్ వాటాను ఇప్పించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి న్యాయపరంగా తమకు రావాల్సిన విద్యుత్ ఇప్పించే బాధ్యత కేంద్రం తీసుకోవాలని తీర్మానంలో తెలంగాణ ప్రభుత్వం కోరింది. 24 గంటల విద్యుత్ పథకంలో తమ రాష్ట్రాన్ని చేర్చాలని విజ్ఞప్తి చేసింది. తీర్మానంలో ఏపీ ప్రభుత్వం పేరు ప్రస్తావించడంపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మొండివైఖరి అనే పదం తీసివేయాలని, విభజన చట్టాన్ని ఉల్లంఘించారని తీర్మానంలో పెట్టాలని జానారెడ్డి సూచించడంతో సీఎం కేసీఆర్ అంగీకరించారు. తర్వాత తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు.