=నష్టం జరగకుండా చర్యలు
=అందరికీ సత్వర సాయం
=వరద బాధితులకు సీఎం కిరణ్ హామీలు
=ఉరుకులు పరుగులతో పర్యటన
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి : తుఫాన్, వరదల వల్ల రైతులు, ప్రజల పంటలకు, ఆస్తులకు నష్టం సంభవించకుండా శాశ్వత పరిష్కార మార్గాలు చూపుతామని ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చా రు. తుఫాన్ వల్ల దెబ్బ తిన్న ప్రాంతాలను బుధవారం ఆయన పరిశీలించారు. అనకాపల్లిలోని దేవీనగర్, రాంబిల్లి మండలం పంచదార, నారాయణ పురం గ్రామాల్లో ముని గిపోయిన పంటలను, శారద నదికి పడిన గండ్లను ఆయన పరిశీలించారు. నారాయణ పురంలో ఏర్పాటు చేసిన వరద నష్టం ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
రైతులు సమస్యల్లో ఉన్నప్పుడు ఆత్మ స్థైర్యం కోల్పోకుండా పోరాడాలని పిలుపు నిచ్చారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుం టుందని, పంటలు నష్టపోయిన రైతులకు స బ్సిడీ కింది విత్తనాలు అందిస్తామన్నారు. ఉద్యోగులు సమ్మెలో వున్నందువల్ల నీలం తుఫాన్ నష్టపరిహారం పంపిణీ చేయలేక పోయారనీ, జిల్లాకు రూ. 32 కోట్లు రావాల్సి ఉండగా, 22 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఈ పరిహారం త్వరలోనే పంపిణీ చేస్తామని తెలిపారు. వారం రోజులుగా జిల్లాను కుదిపేసిన తుఫాన్ నష్టం అంచనాలు వేయిస్తామనీ, బాధితులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలోసీఎం ముందుంటారని చెప్పారు. నియోజక వర్గంలో రైతులు పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కోసం సీఎం కృషి చేయాలని కన్నబాబు రాజు చెప్పారు. శాశ్వత పరిష్కార మార్గాల కోసం రూ. 110 కోట్లు మంజూరు చేయాలని కోరారు. వరదల వల్ల ప్రజలు నష్టపోకుండా ఉండేందుకు కాలువల ఆక్రమణలను తొలగించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. శాసనసభ్యుడు చింతలపూడి వెంకట్రామయ్య, అవంతి శ్రీనివాసరావు, డీసీసీ అధ్యక్షుడు ధర్మశ్రీ, జిల్లా కలెక్టరు ఆరోఖ్యరాజ్‌తో పాటు పలువురు అధికారులు సీఎం పర్యటనలో పాల్గొన్నారు.
మమ్నల్మి ఆదుకోండి
వరదలు, తుఫాన్ల వల్ల తాము పడుతున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తెచ్చిన దేవీనగర్ వాసులు తమను ఆదుకోవాలని కోరారు. నారాయణ పురం సమీపంలో నీట మునిగిన వరి పొలాలను సీఎం చూశారు. రైతులతో మాట్లాడారు. అనకాపల్లి సమీపంలోని కొండకొప్పాక బ్రిడ్జి మీద నుంచి నీటి ప్రవాహాన్ని చూశారు. ఆక్రమణలు తొలగించి, శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోక పోవడం వల్లే తరచూ తాము ఇబ్బందులు పడుతున్నామని రైతులు సీఎం దృష్టికి తెచ్చారు.
ఆగమేఘాల మీద వరద పర్యటన
సాయంత్రం 4 గంటలకు విశాఖ విమానాశ్ర యం చేరుకున్న సీఎం ఆగమేఘాల మీద వర ద ప్రాంతాల్లో పర్యటనను ముగించారు. రైతు లు, వరద బాధితుల సమస్యలు సావధానంగా వినడానికి ఎక్కడా సమయం కేటాయిం చలేదు. నారాయణపురం లో రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేసినప్పటికీ సమయాభావం పేరుతో దాన్ని రద్దు చేశా రు. సీఎం పర్యటనలో జనం సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ రాష్ట్రం విడిపోకుండా ఉండేలా చూడాలని కోరారు.
నేడు కాకినాడకు సీఎం : గురువారం కాకినాడకు బయల్దేరనున్నారు. ఉదయం 8.30 గంటలకు ప్రభు త్వ అతిథి గృహం నుంచి బయల్దేరి జైలు రోడ్డు ప్రాంతంలో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం ఉదయం 9.05 గంటలకు హెలికాప్టర్‌లో కాకినాడకు వె ళతారు.