కొత్త సంవత్సరం అనంగానే.. తొలి రోజున మిత్రులకు, పడనివారికి కూడా శుభాకాంక్షలు తెలిపి సంతోషంగా ఉంటాం. ఇలా విషెస్ చెప్పడమే కాదు ఈ ఏడాదంతా తిరుగలేని విజయం పొందేలా ఏ చేయాలో న్యూ ఇయర్(New Year) తొలిరోజే చక్కటి ప్లాన్ లేదా తీర్మానం(Resolutions) చేసుకుంటే సక్సెస్, సంతోషం రెండూ మీ సొంతం అవుతాయని చెబుతున్నారు నిపుణులు. ఆ ఒక్కే రోజుకే సంతోషం పరిమితం కాకుండా ఏడాదంతా సంతోషభరితంగా జీవతం సాగిపోవాలంటే..
ముఖ్యంగా వర్క్‌లైఫ్ బ్యాలెన్స్(Work life Balance) విషయంలో సరైన విధంగా బ్యాలెన్స్ చేయలేక తిప్పలు పడుతుంటారు. అలాంటివాళ్లు ఇంట బయట గెలవాలంటే..కొత్త ఏడాది తొలిరోజు నుంచే చక్కటి తీర్మానాలు సెట్‌చేసుకుని కనీసం పాటించే యత్నం చేస్తే విజయం తధ్యం అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏం చేయాలంటే..
వర్క్‌లైఫ్‌లో పై అధికారి ఇచ్చిన పనులు చేయండి. వర్క్‌లో లోపాలు ఎత్తిచూపిన సానుకూలంగా స్పందించండి. రిపీట్ కాకుండా చూసుకోండి. లేదు అవమానించేలా తప్పులను ఎత్తి చూపితే..సీరియస్‌గా తీసుకోండి. వాళ్లు మన తప్పులను పట్టుకునే అవకాశం ఎందుకిచ్చానా.. అని ఆలోచించండి. ఆ ఛాన్స్ ఇచ్చేదే లే..అన్నట్లు పట్టుదలగా వర్క్‌ని మెరుగుపరుచునే యత్నం చేయండి.
అలాగే సహోద్యోగులు మీ గురించి బ్యాడ్‌గా మాట్లాడటం లేదా పై అధికారులకు ఫిర్యాదులు చేయడం వంటివి చేస్తే..టెన్షన్ పడొద్దు. మీ వద్దకు ఆ ఇష్యూ తీసుకొచ్చి పై అధికారి మాట్లాడేంత వరకు కూడా సంయమనం పాటించండి. ఒకవేళ ఆ ప్రస్తావన గురించి ప్రశ్నిస్తే..నిజాయితీగా సూటిగా మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఎక్కడ అహానికి తావివ్వద్దు. మీ నిజాయితీ వారు గుర్తించేలా మసులుకోండి.
మరో విషయం మిమ్మల్ని రెచ్చగొట్టేలా పరిస్థితులు ఎదురైన సహనంతో వ్యవహరించండి అదే మీకు శ్రీరామ రక్ష. అలాగే ఇతరులు మీ కంటే మంచి విజయాలను అందుకుంటే..ఆనందంగా అభినందించండి. సంకుచిత భావంతో ముభావంగా ఉండకండి.ఇలా చేయడం వల్ల మన కంటే తెలివైన వ్యక్తులతో సాన్నిత్యం ఏర్పడటమేగాక మీరుకూడా విజయం పొందేలా సలహాలు సూచనలు తెలుసుకునే వీలు ఉంటుంది.
అలాగే వర్క్‌లో ఒత్తిడి(Stress) ఎదురైనా లేదా పై అధికారుల నుంచి వచ్చినా..పరిస్థితిని సామరస్యంగా వివరించండి. సాధ్యసాధ్యాలు గురించి కూడా మాట్లాడండి. అయినా ప్రయోజనం లేదు వాళ్లు వినరు అంటే..మేనేజ్‌మెంట్‌కి దృష్టికి వచ్చేలా ప్రయత్నం చేయండి. ఎక్కడ నొచ్చుకునేలా మౌనంగా ఒత్తిడిని భరించకండి
టీం వర్క్‌గా పనిచేస్తున్నప్పుడూ ఎవరో ఒకరి నుంచి సమస్యలు వస్తూనే ఉంటాయి. దాన్ని తేలిగ్గా తీసుకోండి. మొదట మారెలా మెత్తగా చెప్పండి. పరిస్థితిని బట్టి కాస్త గట్టిగా మాట్లాడండి. అప్పుడూ వారే మారొచ్చు. లేదా ఒకవేళ మీపైనా ఫిర్యాదు చేసినా..భయపడాల్సిన పనిలేదు. యజమాన్యానికి వాస్తవాలెంటో కచ్చితంగా తెలుస్తుందనేది గుర్తించుకోండి.
దీంతోపాటు మానసిక ఆనందానికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. నచ్చిన సంగీతం లేదా గేమ్‌లు వంటివి ఆడే సమయం కుదుర్చుకోండి. జీవితంలో అన్ని ఉండాలి. అప్పుడే జీవితం కొత్తగా..ఆనందంగా ఆస్వాదించగలుగుతాం. సాధించిన చిన్న చిన్న విజయాలను కూడా గుర్తు తెచ్చుకుని సంతోషంగా ఉండే యత్నం చేయండి.
అలాగే వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. కుటుంబం కోసమే కదా ఇంతలా కష్టపడి సంపాదించేది. అప్పడుప్పుడూ తగిన బడ్జెట్‌లో వెకేషన్‌లకి తీసుకువెళ్లేలా ప్లాన్ చేసి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంచే ప్రయత్నం చేయండి. నిజానికి ఇంట్లో వాళ్ల కోరికలన్నంటిని నెరవేర్చడం అందరికీ సాధ్యం కాదు. మనం వాళ్లకి ఇవ్వాల్సింది కేవలం మనం ఉన్నామనే భరోసా అని గుర్తుపెట్టుకోండి.
కుంటుబమే లేకపోతే మనం లేమనే విషయం గుర్తెరిగా బంధాలను బలోపేతం చేసుకునేలా ప్రవర్తించండి. అవసరమైతే ఓ మెట్టు దిగండి తప్పులేదు. ఇలాంటి మార్పులను జీవితంలో చేసుకుంటే..సులభంగా ఇంట బయట నెగ్గుకురాగలం అంటున్నారు మానసిక నిపుణులు.
(చదవండి: న్యూ ఇయర్ పార్టీ జోష్: ఫస్ట్ డే తలెత్తే హ్యాంగోవర్‌ని హ్యాండిల్ చేయండిలా..!)
Comments
Please login to add a commentAdd a comment