
ఈ ఆదివారం చిన్న పెద్ద అంతా ఇంట్లోనే సందడిగా ఉంటారు. ఆదివారం అంటే ఆటవిడుపులా అనిపిస్తుంది అందరికి. అమ్మపై భారం వేయకుండా..అందరూ తలో చేయి వేసి ఈ సండే ఇలా వెరైటీ వంటకాలు ట్రై చేసి మరింత ఖుషీగా ఉండండి. ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసేయాలో చూసేయండి మరీ..!.
రొయ్యల దోసెలు
కావలసినవి:
సోయా పాలు– 1 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్– 2 టీ స్పూన్లు
ఉల్లిపాయ ముక్కలు– 2 లేదా 3 టేబుల్ స్పూన్లు
జీలకర్ర పొడి– అర టీ స్పూన్
పసుపు– కొద్దిగా ఉప్పు– తగినంత
రొయ్యలు– 250 గ్రాములు (శుభ్రం చేసుకుని హాఫ్ బాయిల్ చేసుకుని, పక్కన పెట్టుకోవాలి)
మిరియాల పొడి– పావు స్పూన్
కొత్తిమీర తురుము– కొద్దిగా
కరివేపాకు– కొద్దిగా
పచ్చిమిర్చి– 2 (చిన్నగా తరగాలి)
గరం మసాలా– 1 టీ స్పూన్
దోసెల పిండి– రెండు మూడు కప్పులు
గుడ్లు– రెండు లేదా మూడు (అభిరుచిని బట్టి)
నూనె– సరిపడా
తయారీ: ముందుగా కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుని, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు, కొద్దిగా ఉప్పు, కారం వేసుకుని దోరగా వేయించుకోవాలి. అనంతరం దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, గరిటెతో తిప్పుతూ అర నిమిషం పాటు వేయించాలి. తర్వాత మిరియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, మరికొద్దిగా కారం వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు సోయా పాలు పోసి మూత పెట్టి, చిన్న మంట మీద ఉడికించాలి.
మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి. కాస్త దగ్గరపడుతున్న సమయంలో రొయ్యలు వేసుకుని, ఒకసారి రుచి చూసి, సరిపడా ఉప్పు వేసుకుని గరిటెతో తిప్పుకోవాలి. ఆ మిశ్రమం మరింత దగ్గర పడిన తర్వాత ఆ కళాయి దించి పక్కన పెట్టుకుని, స్టవ్ మీద దోసెల పెనం పెట్టుకోవాలి. దానిపై దోసెలు వేసుకుని, ఒక్కో దోసెపై ఒక్కో గుడ్డు కొట్టి, అభిరుచిని బట్టి పసుపు సొనను కదిలించకుండా ఉడికించి, ఆపైన కొద్దికొద్దిగా రొయ్యల కర్రీ, కొత్తిమీర తురుము వేసుకుని, దోసెను ఫోల్డ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.
కాజు రవ్వ వడ..
కావలసినవి:
జీడిపప్పు– అర కప్పు
రవ్వ– కప్పు
అల్లం తురుము– టేబుల్ స్పూన్
కొత్తిమీర తురుము– 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి– 1 (చిన్నగా తరగాలి)
ఉప్పు– తగినంత కరివేపాకు– 1 రెమ్మ (చిన్నచిన్నగా తుంచి వేసుకోవాలి)
కుకింగ్ సోడా– అర టీ స్పూన్
డ్రై ఫ్రూట్స్ తరుగు– కొద్దిగా
పెరుగు– అర కప్పు పైనే
నూనె– డీప్ ఫ్రైౖ కి సరిపడా
తయారీ: ముందుగా జీడిపప్పును పొడిపొడిగా మిక్సీ పట్టుకోవాలి. దానిలో రవ్వ, అల్లం తురుము, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కరివేపాకు, కుకింగ్ సోడా, డ్రై ఫ్రూట్స్ తరుగు వేసుకుని, బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు దానిలో పెరుగు కొద్దికొద్దిగా పోసుకుంటూ, ముద్దలా చేసుకోవాలి. అనంతరం చేతికి నెయ్యి లేదా నూనె రాసుకుని, వడల్లా ఒత్తుకుని, నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి చట్నీలో లేదా సాస్‌లో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment