రాష్ట్ర విభజనను నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు శాసనసభా నాయకుడైన సీఎం నేతృత్వంలో కృషి చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గురువారమిక్కడ చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు శాసనసభా నాయకుడైన సీఎం నేతృత్వంలో కృషి చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గురువారమిక్కడ చెప్పారు. కేంద్రం నుంచి తెలంగాణ ఏర్పాటు బిల్లు వచ్చే ముందే అసెంబ్లీలో సమైక్యం కోరుతూ తీర్మానం చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు.
విభజన జరుగుతున్న ఈ తరుణంలో గాకుండా ఇంతకుముందే తీర్మానం చేస్తే ఫలితం ఉండేదేమోనన్న ప్రశ్నపై ఆయన స్పందిస్తూ, ‘‘కొందరికి లాభం చేకూరుతుందని ఆ సమయంలో చేయలేదు’’ అని చెప్పారు. కాగా రాష్ట్రాన్ని కొబ్బరికాయలా సమంగా విభజించాలన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సిద్ధాంతం విభజనవాదాన్ని స్పష్టం చేస్తోందని ధ్వజమెత్తారు.