విజయమ్మతో గాదె వెంకటరెడ్డి భేటీ
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి శుక్రవారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో భేటీ అయ్యారు. శాసనసభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత అయిన గాదె.. విజయమ్మను కలిసి చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం పట్ల అసంతృప్తితో ఉన్న గాదె వెంకటరెడ్డి.. సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిని కలిసి చర్చించడం పలు ఊహాగానాలకు కూడా తావిచ్చింది.