Gade Venkata Reddy
-
వైఎస్సార్సీపీలో చేరిన మాజీ మంత్రి వెంకటరెడ్డి
సాక్షి, తాడేపల్లి : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, ఆయన కుమారుడు గాదె మధుసూదన్‌రెడ్డిలు సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వారు వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం గాదె వెంకటరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తమను నమ్మించి పార్టీలో చేర్చుకుని.. ఆ తర్వాత గౌరవం లేకుండా చేశారని మండిపడ్డారు. టీడీపీలో చాలా అవమానాలు భరించామని తెలిపారు. చంద్రబాబు నైజం అర్థమైందని.. ఆయనది మోసం చేసే వ్యక్తిత్వం అని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్‌పై అభిమానంతో వైఎస్సార్సీపీలో చేరామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వైఎస్సార్సీపీలో చేరుతున్నట్టు చెప్పారు. గాదె మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. 6 నెలల్లోనే హామీలన్ని పూర్తి చేసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని అన్నారు. అందుకే స్వచ్ఛందంగా వైఎస్సార్సీపీలో చేరానని వెల్లడించారు. జీవితాంతం వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని చెప్పారు. వైఎస్సార్సీపీలో చేరిన శిద్దా హనుమంతరావు, ప్రకాశ్‌రావు టీడీపీ నేతలు శిద్దా హనుమంతరావు, సూర్యప్రకాశ్ రావులు సోమవారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. అనంతరం శిద్దా హనుమంతరావు మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధిలో పాలపంచుకుంటామని అన్నారు. ప్రకాశ్‌రావు మాట్లాడుతూ.. ఇకపై తాము సీఎం జగన్ బాటలో నడుస్తామని తెలిపారు. -
వీర విధేయులకు...దక్కలేదు
నిన్న మొన్నటి వరకు వాళ్లిద్దరూ కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు. తమ సహచరులు చాలామంది ఇతర పార్టీల్లోకి జంప్ అయినా.. వారు మాత్రం కాంగ్రెస్‌నే నమ్ముకున్నారు. అయినా అలాంటి వీర విధేయులకు కూడా ఆ పార్టీ మొండిచేయి చూపింది. సిట్టింగులైనా సరే.. టిక్కెట్ ఇవ్వకుండా దాదాపు నెట్టేసినంత పని చేసింది. దీంతో ఇద్దరూ తీవ్ర అవమాన భారంతో ఆవేదన చెందుతున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు నేతలెవరు ? ఎక్కడి వారు ? ఏమా కథ.... ఒకరు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గాదె వెంకటరెడ్డి కాగా.. మరొకరు తాజా మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్. ఇద్దరూ ఇప్పటి వరకు కాంగ్రెస్‌నే నమ్ముకున్నారు. పార్టీ కోసమే పని చేస్తూ వచ్చారు. కానీ.. ఏరు దాటాక బోడ మల్లన్న.. అయిన్నట్టు మారింది వీరిద్దరి పరిస్థితి. పార్టీనే నమ్ముకుని.. ఎంతో కాలంగా పని చేస్తూ వస్తున్న ఈ ఇద్దరు నేతలకు రిక్త హస్తం చూపించింది. సీమాంధ్రలో పార్టీ పరిస్థితి అస్సలు బాగా లేకపోయినా.. ఎలాగైనా గెలుస్తామని ధీమా వ్యక్తం చేసినా ఆ మాట పార్టీ అధిష్టానానికి చెప్పినా టికెట్లు మాత్రం దక్కలేదు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న గాదె వెంకటరెడ్డి.. ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి మూడు సార్లు, గుంటూరు జిల్లా బాపట్ల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి ఆయనకు టికెట్ నిరాకరించింది పార్టీ. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన పాపానికి ఆ పార్టీ గాదెపై అలా వేటు వేసింది. ఇదే కాకుండా మరో కారణం కూడా వినిపిస్తోంది. తన వియ్యంకుడైన కడప జిల్లా నేత డీఎల్ రవీంద్రారెడ్డితో కలిసి టీడీపీలోకి వెళ్లాలని గాదె కొద్ది కాలంగా ప్రయత్నిస్తున్నారు. అటు వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావటంతో ఇక సైకిల్ ఎక్కటం లాంఛనమని అంతా భావించారు. దీంతో ఎటూ పార్టీ వీడే మనిషే కదా..? అని కాంగ్రెస్ అధిష్టానం గాదె గురించి పట్టించుకోవటం మానేసింది. అయితే పచ్చ పార్టీతో డీల్ కుదరక పోవటంతో గాదె సైలెంట్ అయ్యారు. బాపట్ల నుంచి మళ్లీ పోటీకి సిద్ధమయ్యారు. అయితే హైకమాండ్ మాత్రం ఈ పెద్దాయనను పట్టించుకోలేదు. టికెట్ కాస్తా చేజారింది. ఇక తాడికొండ నుంచి గెలవటమే కాదు.. మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కు కూడా ఆశాభంగమే కలిగింది. ఈ తాజా మాజీ మంత్రికి కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. డొక్కాకు రాజకీయ గురువైన రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్‌ను వదిలి సైకిల్ ఎక్కారు. ఇప్పుడాయన నరసరావుపేట నుంచి పార్లమెంట్ కు పోటీ చేస్తున్నారు. అయితే రాయపాటి తనతోపాటు తన శిష్యుడు డొక్కా కూడా పచ్చపార్టీలో చేరుతాడంటూ మొదట్లో చెప్పుకొచ్చారు. కానీ డొక్కా మాత్రం తాను కాంగ్రెస్ ను వీడేదిలేదంటూ భీష్మించుక్కూర్చున్నారు. ఆయన గారి విధేయత చూసిన కాంగ్రెస్ సీమాంధ్ర ప్రచార కమిటీ సహ కన్వీనర్ బాధ్యతలు అప్పగించింది. అలాంటి పెద్ద పదవి పొందిన డొక్కాకు ఎమ్మెల్యే టికెట్ చాలా ఈజీ అనుకున్నారంతా. అదే సమయంలో సొంత నియోజకవర్గమైన తాడికొండ నుంచి కాకుండా వేమూరు నుంచి పోటీ చేయాలని డొక్కా ఆశించారు. అయితే చాప కింద నీరులా కేంద్ర మంత్రి పనబాక ప్రవేశించారు. డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు వేమూరు టికెట్ దక్కకుండా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు. జిల్లాలో ఇద్దరు సీనియర్ నేతలకు కాంగ్రెస్ టికెట్లు ఇవ్వకపోవడం ఇప్పుడు గుంటూరులో హాట్ టాపిక్‌గా మారింది. అయితే కాంగ్రెస్ గురించి బాగా తెలిసిన వాళ్ళు మాత్రం.. ఇది కామన్ అంటున్నారు. -
అధిష్టానం తీరుపై గాదె కన్నీరు
బాపట్ల : 'సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నేనెప్పుడూ ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. అసెంబ్లీలో బిల్లును వ్యతిరేకించి తీర్మానం చేస్తే ఆ బిల్లును పార్లమెంట్లో పెట్టుకుని ఆమోదించాలని చూస్తున్నారు. ఇది అప్రజాస్వామిక నిర్ణయం. ఈ విధమైన నిర్ణయాలు అమలు చేసేవారు ఎంతటివారైనా కష్టాలు కొనితెచ్చుకున్నట్లే' అని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి భావోద్వేగాలనికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని సవరిస్తే గానీ అసెంబ్లీలో వ్యతిరేకించిన బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు వీలు లేదన్నారు. శాసనసభ తిరస్కరించిన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడం అప్రజాస్వామిక విధానమన్నారు. అదే విధంగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ఉంచడాన్ని రాజ్యంగం ఒప్పుకోదన్నారు. తెలంగాణ కావాలని కోరుతున్న వారి సంఖ్య చాలా తక్కువని చెప్పారు. ఈ వ్యవహారంపై ఎన్ని నివేదికలు సేకరించినా అవి మొత్తం రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని సూచించాయని గాదె వివరించారు. వాటిని తుంగలో తొక్కిన కాంగ్రెస్ పార్టీ విభజన వ్యవహారం తెరపైకి తీసుకు రావటం భావ్యం కాదన్నారు. -
గాదె- మహిళా మంత్రుల సంవాదం
హైదరాబాద్: తెలంగాణ మహిళా మంత్రులతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మధ్య శాసనసభ ప్రాంగణంలో ఆసక్తికర సంవాదం నడిచింది. కేబినెట్ సమావేశానికి ఎందుకు రాలేదని మంత్రులు డీకే అరుణ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను గాదె వెంకటరెడ్డి ప్రశ్నించారు. మంత్రి పదవులకు రాజీనామా చేసి నిరసన తెలపొచ్చు కదా అని అడిగారు. అయితే వెంకటరెడ్డి వ్యాఖ్యలకు మహిళా మంత్రులు దీటుగా స్పందించారు. ఢిల్లీలో సమైక్య నిరసన తెలిపేందుకు ముందు మీరెందుకు రాజీనామా చేయలేదని వారు ఎదురు ప్రశ్నించారు. విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా చూడాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎంపీలు బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మౌనదీక్ష చేసిన సంగతి తెలిసిందే. -
విజయమ్మతో గాదె వెంకటరెడ్డి భేటీ
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి శుక్రవారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో భేటీ అయ్యారు. శాసనసభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత అయిన గాదె.. విజయమ్మను కలిసి చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం పట్ల అసంతృప్తితో ఉన్న గాదె వెంకటరెడ్డి.. సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిని కలిసి చర్చించడం పలు ఊహాగానాలకు కూడా తావిచ్చింది. -
నా చొక్కా పట్టుకుంటారా
-
'టీఆర్ఎస్ సభ్యులు నా చొక్కా పట్టుకుంటారా'
హైదరాబాద్ : టీఆర్ఎస్ సభ్యులు నా చొక్కా పట్టుకుంటారా అని.. సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యులు, మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా ద్రోణంరాజు శ్రీనివాస్‌పైకి దూసుకొచ్చిన టీఆర్ఎస్ సభ్యులను అడ్డుకున్నందుకు.. గాదె వెంకటరెడ్డి చొక్కాను టీఆర్ఎస్ సభ్యులు పట్టుకున్నారు. అనంతరం సభలో మాట్లాడిన గాదె.. టీఆర్ఎస్ దౌర్జన్యాలకు పాల్పడితే ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు తమకున్నాయని చెప్పారు. టీఆర్ఎస్తో క్షమాపణ చెప్పించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. సభ్యత, సంస్కారం లేకుండా సభలో ఇలా వ్యవహరించడం తగదని గాదె మండిపడ్డారు. తమ సభ్యుల తీరుపై చింతిస్తున్నామని.. ఆ తరువాత టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఈటెల రాజేందర్ అన్నారు. -
'సమైక్యాంధ్ర కోసం పోరాడుతోంది వైఎస్ఆర్ సీపీ మాత్రమే'
సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేస్తోంది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు అన్ని పార్టీలు కలసి రావాలని కోరారు. పార్టీలకు అతీతంగా నాన్ పొలిటికల్ జేఏసీగా ఏర్పడాలని గాదె వెంకటరెడ్డి పేర్కొన్నారు. అందరూ కలసి కట్టుగా ఉద్యమం కొనసాగిస్తే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
విభజనపై కేంద్రానిది నిరంకుశ ధోరణి : గాదె
హైదరాబాద్ : రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి బుధవారమిక్కడ అన్నారు. ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో 'రాష్ట్రంలో రాజకీయ గందరగోళ పరిస్థితులకు..పరిష్కార మార్గాలపై చర్చ' అనే అంశంపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం రాష్ట్ర విభజనకు ఒక పద్ధతి పాటించటం లేదన్నారు. విభజనపై కేంద్ర నిర్ణయం నిరంకుశ ధోరణికి నిదర్శనమన్నారు. విభజన బిల్లు.. అసెంబ్లీ తీర్మానానికి రావాలని గాదె వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లు రవి, వినోద్, రాజయ్య, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. -
విభజనకు టీడీపీనే అఖిలపక్షానికి నివేదిక ఇచ్చింది
హైదరాబాద్ : రాష్ట్రాన్ని విభజించమని ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అఖిలపక్షంలో నివేదిక ఇచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి అన్నారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం పంపుతామన్న హైకమాండ్.... ఇప్పుడు కేవలం డ్రాప్ట్ బిల్లు వస్తుందనటం సమంజసం కాదన్నారు. ఇలా గందరగోళం సృష్టించటం ప్రజలను మోసం చేయటమేనన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పష్టత ఇవ్వాలని గాదె వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ముసాయిదా బిల్లుపై ఓటింగ్ లేకపోయినా అభిప్రాయాలు ఉంటాయన్నారు. అసెంబ్లీ అభిప్రాయాన్ని కాదని రాష్ట్రాన్ని విభజిస్తే అది అప్రజాస్వామికమేనని గాదె అన్నారు. విభజనపై వ్యవహరిస్తున్న తీరుతో సీమాంధ్రలో కాంగ్రెస్ ఓటమి చెందడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. -
జగన్ నాయకత్వంలో రాష్ట్ర సమైక్యత: గాదె
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నానని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి పేర్కొన్నారు. జగన్ రాకతో సమైక్యోద్యమం మరింత బలపడుతుందని, ఆయన తన శక్తియుక్తులన్నిటినీ ధారపోసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రం సమైక్యంగా ఉంటుందన్న నమ్మకముందన్నారు. గాదె మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డే కారణమన్న కొందరి విమర్శలు అవాస్తవమన్నారు. ఆయన పూర్తిగా సమైక్యవాది అని, తొలి నుంచీ సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నారని గుర్తు చేశారు. 2001లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాష్ట్ర విభజన కోసం సోనియాకు లేఖ ఇప్పించింది వైఎస్సే అనడం కూడా శుద్ధ అబద్ధమన్నారు. ‘‘వైఎస్ ఉండి ఉంటే రాష్ట్రానికి ఈ దుర్గతి వచ్చేది కాదు’’ అని ఆవేదన వ్యక్తపరిచారు. జగన్ బెయిల్‌పై కొందరు దుర్మార్గమైన విమర్శలు చేస్తుండటం బాధాకరమన్నారు. ‘‘కాంగ్రెస్‌తో కుమ్మక్కైనందుకో, ప్రలోభపడ్డందుకో బెయిల్ వచ్చిందని కొన్ని పార్టీలు సత్యదూరమైన విమర్శలు చేస్తున్నాయి. జగన్‌కు అర్హత ప్రకారం బెయిల్ వచ్చిందే తప్ప మరోటి కాదు. ఆయనపై పెట్టిన క్విడ్ ప్రో కో కేసులు నిరాధారం’’ అని పేర్కొన్నారు. -
జగన్‌పై కేసు నిలువదని గతంలోనే చెప్పా: గాదె
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్‌సభ సభ్యుడు జగన్మోహన రెడ్డిపై కేసు నిలవదని తాను గతంలోనే చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తెలిపారు. వైఎస్ జగన్‌కు బెయిల్ రావడం సంతోషం అన్నారు. మెరిట్స్ ఆధారంగానే బెయిల్ వచ్చినట్లు చెప్పారు. ఇందులో కాంగ్రెస్ ప్రమేయం ఏమీలేదన్నారు. క్విడ్‌ప్రోకో కేసులో ఆధారాలు లేవని, కేసు నిలువదని గతంలోనే చెప్పానన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సమైక్యవాదని, ఏనాడు ప్రత్యేక వాదాన్ని ప్రోత్సహించలేదని చెప్పారు. జగన్ కూడ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పార్లమెంట్లో ప్లర్డ్ పట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. సమైక్యరాష్ట్రం కోసం పోరాడుతున్న జగన్‌కు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానని గాదె చెప్పారు. -
సీమాంధ్ర, తెలంగాణ నేతల భేటీకి గాదె దూరం
-
సీమాంధ్ర, తెలంగాణ నేతల భేటీకి గాదె దూరం
హైదరాబాద్ : విభజన సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామన్న సీమాంధ్ర ప్రాంత మంత్రులు చేసిన ప్రతిపాదనకు తెలంగాణ ప్రాంతం మంత్రులు కొందరు సానుకూలంగా స్పందించారు. సీఎల్పీలో గురువారం జరిగిన ప్రత్యేక భేటీలో తెలంగాణ మంత్రులు జానారెడ్డి, శ్రీధర్ బాబు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్ రెడ్డితో సీమాంధ్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎల్పీ కార్యాలయంలోనే ఉన్నప్పటికీ సీనియర్ కాంగ్రెస్ నేత గాదె వెంకటరెడ్డి ఈ భేటీకి దూరంగా ఉన్నారు. సీమాంధ్ర, తెలంగాణ నేతల భేటీ అనంతరం జానారెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి.... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశం అయ్యారు. -
వైఎస్ ఉంటే తెలంగాణ ఉద్యమమే వచ్చేది కాదు: గాదె
సాక్షి, హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే తెలంగాణ ఉద్యమమే వచ్చేది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం గతంలోనే రాష్ట్రాన్ని విభజించాలని భావించినప్పటికీ గట్టిగా ఎదిరించి, సమైక్యంగా ఉంచాలని వాదించిన నాయకుడు వైఎస్ అని చెప్పారు. సోమవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ నాలుగో వర్ధంతి సందర్భంగా గాదె ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు, వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు వైఎస్చేసిన కృషిని ఆయన స్మరించుకున్నారు. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం రాజశేఖరరెడ్డికి అస్సలు ఇష్టం లేదని, అదే విషయాన్ని అప్పట్లో కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించిన ప్రణబ్‌ముఖర్జీ తమకు చె ప్పినట్లు తెలిపారు. ‘‘2010లో ఒకసారి, 2011లో మరోసారి 80, 90 మంది ఎమ్మెల్యేలం కలిసి ప్రణబ్‌ముఖర్జీ వద్దకు వెళ్లాం. అప్పుడు.. ‘టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి వైఎస్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. మేమే బలవంతంగా ఒప్పించి పొత్తు కుదిర్చాం. మీ వాళ్లెవరూ ఆ మాట అప్పట్లో ఎందుకు చెప్పలేదు’ అని ప్రణబ్ మమ్మల్ని అడిగారు. నిజంగా వైఎస్ బతికి ఉంటే తెలంగాణ ఉద్యమమే వచ్చేది కాదు’’ అని గాదె పేర్కొన్నారు. వ్యవసాయ కనెక్షన్లపై ఆధారపడిన వారు తెలంగాణలోనే చాలా ఎక్కువైనప్పటికీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేసి అమలు చేశారని తెలిపారు. ఆ విధంగా దీనివల్ల తెలంగాణ రైతులే ఎక్కువగా లాభపడ్డారని చెప్పారు. ‘ప్రణాళికా సంఘం రాష్ట్రంలో 2.5 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని పేర్కొంటే.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకంగా 1.5 కోట్ల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో జలయజ్ఞం కింద 86 సాగునీటి ప్రాజెక్టులను నిర్మించేందుకు వైఎస్ కృషి చేశారు’ అని చెప్పారు. అది మెజారిటీ అభిప్రాయం కాదు: 545 మంది లోక్‌సభ ఎంపీలకు గాను యూపీఏకు 226 సీట్ల బలం మాత్రమే ఉందని, అలాంటప్పుడు విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయం మెజారిటీ అభిప్రాయం ఎలా అవుతుందని అంతకుముందు మీడియాతో మాట్లాడినప్పుడు గాదె ప్రశ్నించారు. కాంగ్రెస్ గతంలో ఎన్నడూ తెలంగాణ ఇస్తామని హామీ ఇవ్వలేదన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు విషయంలో రెండో ఎస్సార్సీ వేయాలని 2001లో సీడబ్ల్యూసీ తీర్మానించిందని, అది ఇప్పటికీ సజీవంగా ఉందన్నారు. 2004, 2009 ఎన్నికల్లో కూడా తెలంగాణ ఇస్తామని హామీ ఇవ్వలేదన్నారు. 2009 ఫిబ్రవరి 12న అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా తెలంగాణకు అభ్యంతరం లేనప్పటికీ స్టేక్ హోల్డర్ల (వాటాదారుల) అభిప్రాయాలను తీసుకోవాల్సి ఉంద ని చెప్పారే తప్ప ఎవరితో పనిలేకుండా, ఎవరితో చర్చించకుండా విభజించాలని అనలేదని గుర్తుచేశారు. 2009 డిసెంబర్ 7న జరిగిన సీఎల్పీ సమావేశంలోనూ ఆనాడు వైఎస్ చేసిన ప్రకటననే ప్రస్తావిస్తూ తీర్మానం చేశామన్నారు. ఇవేమీ పట్టించుకోకుండా విభజన నిర్ణయం తీసుకోవడమంటే తెలుగు జాతిపై వివక్ష చూపడమేనని గాదె పేర్కొన్నారు. ఇప్పటికైనా హైకమాండ్ పెద్దలు పార్టీ నిర్ణయాన్ని పునః పరిశీలించడంతోపాటు రెండో ఎస్సార్సీ వేయడమే శరణ్యమని సూచించారు. అది సాధ్యం కాకపోతే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలోనూ అత్యుత్తమమైన ఆరో సిఫారసును అమలు చేసి తెలంగాణ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలని కోరారు. -
సీడబ్ల్యూసీది తప్పుడు నిర్ణయం: శైలజానాథ్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న తప్పుడు నిర్ణయం దేశానికి, రాష్ట్రానికి, కాంగ్రెస్‌కు కీడు చేస్తుంది కనుక వెనక్కు తీసుకోవాలని మంత్రి సాకే శైలజానాథ్, సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. విభజనపై కాంగ్రెస్ మాత్రమే తప్ప ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదంటూనే మెజార్టీలేని యూపీఏ పక్షాలు చేసే తీర్మానానికి ప్రాధాన్యత ఉండదని స్పష్టంచేశారు. సీమాంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున సాగుతున్న సమైక్య ఉద్యమానికి తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. వారు గురువారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంత ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని తాము కూడా ఉద్యమిస్తామని శైలజానాథ్ చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగా తాము హైదరాబాద్‌లో దీక్షలు చేయనున్నామని తెలిపారు. వచ్చేనెలలో ఏ తేదీన దీన్ని నిర్వహించాలి? ఎక్కడ పెట్టాలి? అన్న అంశాలపై అందరితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తొలినుంచి పోరాడుతున్నది కేవలం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలేనన్నారు. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికైనా మనసు మార్చుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానాలు చేయాలని సూచించారు. చంద్రబాబునాయుడు వంటి అసమర్థుణ్ని ఎక్కడా చూడలేదని, స్థాయికి మించి ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై అనుచిత, కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందే: గాదె ఒకప్రాంతానికి న్యాయం, మరో ప్రాంతానికి అన్యా యం చేసే విభజన సరైనది కాదని, దీన్ని వెనక్కు తీసుకోవలసిందేనని గాదె వెంకటరెడ్డి స్పష్టంచేశారు. సమైక్యమనే మాట టీడీపీ, వైఎస్సార్సీపీలనుంచి రాకపోవడం విచారకరమన్నారు. చంద్రబాబు విభజనకు లేఖ ఇచ్చి ఇప్పుడు ఆత్మగౌరవ యాత్ర అని వెళ్తే ప్రజలు చెవుల్లో పువ్వులు పెట్టుకొని లేరని దుయ్యబట్టారు. విభజనపై కాంగ్రెస్ వెనక్కు వెళ్లకుంటే ఆపార్టీలో ఉండాలో, వద్దో తరువాత ఆలోచిస్తామని గాదె ఒకప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ప్రజలను మభ్య పెట్టలేం: శైలజానాథ్
ప్రజలే నాయకులుగా సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగుతోందని మంత్రి శైలజానాథ్ తెలిపారు. ఇకనైనా రాష్ట్ర విభజన నిర్ణయం వెనక్కు తీసుకోవాలని కోరారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చూసైనా చంద్రబాబు పునరాలోచించుకోవాలి విజ్ఞప్తి చేశారు. ఓట్ల రాజకీయాలను పక్కనపెట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని పార్టీలు కృషి చేయాలన్నారు. గాదె వెంకటరెడ్డితో కలిసి సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని శైలజానాథ్ తెలిపారు. ప్రజలను మభ్య పెట్టే పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. మహోగ్రంగా సాగుతున్న సమైక్య ఉద్యమానికి మద్దతు పలకడమే తప్పా మభ్యపెట్టలేమన్నారు. ప్రజల ఆకాంక్షను గుర్తించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. సమైక్యాంధ్ర కోసం తాము మాత్రమే చిత్తశుధ్దితో ప్రయత్నిస్తున్నామని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ నిర్ణయమని, యూపీఏ ప్రభుత్వ నిర్ణయం కాదని స్పష్టం చేశారు. విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని తమ పార్టీపై ఒత్తిడి తెస్తూనేవుంటామన్నారు. -
గాదె వెంకట రెడ్డితో న్యూస్ మేకర్