విభజనకు టీడీపీనే అఖిలపక్షానికి నివేదిక ఇచ్చింది | TDP gave report to all party for State bifurcation | Sakshi
Sakshi News home page

విభజనకు టీడీపీనే అఖిలపక్షానికి నివేదిక ఇచ్చింది

Published Sat, Oct 12 2013 2:38 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

విభజనకు టీడీపీనే అఖిలపక్షానికి నివేదిక ఇచ్చింది - Sakshi

విభజనకు టీడీపీనే అఖిలపక్షానికి నివేదిక ఇచ్చింది

హైదరాబాద్ : రాష్ట్రాన్ని విభజించమని ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అఖిలపక్షంలో నివేదిక ఇచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి అన్నారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం పంపుతామన్న హైకమాండ్.... ఇప్పుడు కేవలం డ్రాప్ట్ బిల్లు వస్తుందనటం సమంజసం కాదన్నారు.

ఇలా గందరగోళం సృష్టించటం ప్రజలను మోసం చేయటమేనన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పష్టత ఇవ్వాలని గాదె వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ముసాయిదా బిల్లుపై ఓటింగ్ లేకపోయినా అభిప్రాయాలు ఉంటాయన్నారు. అసెంబ్లీ అభిప్రాయాన్ని కాదని రాష్ట్రాన్ని విభజిస్తే అది అప్రజాస్వామికమేనని గాదె అన్నారు.  విభజనపై వ్యవహరిస్తున్న తీరుతో సీమాంధ్రలో కాంగ్రెస్ ఓటమి చెందడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement