హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్ట్‌ను పాత డిజైన్‌లోనే కొనసాగించాలని అఖిలపక్ష సమావేశంలో నాయకులు అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్లో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ నుంచి తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, వంశీచంద్ రెడ్డి పాల్గొనగా... టీడీపీ తరపున ఎల్. రమణ, సీపీఐ పార్టీ నుంచి చాడ వెంకటరెడ్డి, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రంతో పాటు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ...
'ప్రాజెక్టుల ప్రణాళికా సమయంలో అవినీతి ప్రారంభమౌతుంది. ప్రాజెక్టుల నిర్మాణం పై జేఏసీ ఏర్పాటు అవసరం. ప్రజలను చైతన్యవంతం చేసి ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుదాం' : జస్టిస్ చంద్రకుమార్
'ప్రాజెక్టులపై రిటైర్డ్ ఇంజినీర్లతో చర్చించి నాలెడ్జ్ అవేర్‌నెస్ పెంచుకోవాల్సిన అవసరముంది. తెలంగాణ ప్రజల జీవితాలను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఇది తెలంగాణ భవిష్యత్తుకు మంచిదికాదు' : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
'అసెంబ్లీలో టీఆర్ఎస్ వాదన తొండి వాదన. ప్రాణహితకు 1800 ఎకరాల ముంపు ప్రాంతంపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోవడం కేసీఆర్ ప్రభుత్వానికి సిగ్గుచేటు. శాసన సభలో ప్రాజెక్టులపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో ప్రతిపక్షం విఫలం. ప్రాజెక్టుల రీడిజైన్పై ప్రజల్లోకి వెళ్తాం' : తమ్మినేని వీరభద్రం
'ప్రాణహితను పాత డిజైన్‌లోనే కొనసాగించాలి'
Published Sat, Mar 26 2016 9:01 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement