All party leaders
-
‘ఇండియా’ భేటీ ప్రారంభం
ముంబై: దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే తామంతా చేతులు కలిపామని విపక్ష ‘ఇండియా’ కూటమి నాయకులు స్పష్టం చేశారు. కూటమి సమావేశం గురువారం సాయంత్రం ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో ప్రారంభమైంది. కూటమిలోని వివిధ పారీ్టల అగ్రనేతలు హాజరయ్యారు. తొలిరోజు సాధారణ సమావేశమే జరిగింది. రెండో రోజు నాటి అజెండాపై చర్చించారు. అనంతరం కూటమి నాయకులకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(ఉద్ధవ్) పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే విందు ఇచ్చారు. కీలక సమావేశం శుక్రవారం జరుగనుంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయేను ఓడించడమే ధ్యేయంగా స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయనున్నారు. మొదటి రోజు భేటీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నాయకులు సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్, పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పంజాబ్ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భగవంత్ మాన్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జమ్మూకశీ్మర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రా్రïÙ్టయ లోక్‌దళ్ చీఫ్ జయంత్ చౌదరి, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ తదితరులు పాల్గొన్నారు. దేశ ఐక్యతను, సార్వభౌమత్వాన్ని వెంటనే బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని లాలూ ప్రసాద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. దేశ సమస్యలను పరిష్కరించడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా సీట్ల పంపకంపై తేల్చాలని ఆప్ డిమాండ్ చేసినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. -
ఎన్నికలకు ముందే బలమైన విపక్ష కూటమి: పవార్
ముంబై: సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఒక కూటమిని ఏర్పాటు చేస్తాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బుధవారం చెప్పారు. జాతి ప్రయోజనాల కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీతో తనకున్న విభేదాలను పక్కన పెట్టి చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో జట్టు కట్టడానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకి కూడా అభ్యంతరాలు లేవన్నారు. విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధం విపక్ష నేతలను అరెస్ట్చేయడం, కేసులు పెట్టించడంలోనే మోదీ సర్కార్ బిజీగా ఉందని పవార్ విమర్శించారు. ‘‘కేంద్ర ప్రాయోజిక ప్రధాన పథకం ఇదేనేమో. పాత్రా చాల్ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. నా పాత్ర లేదని తేలితే నాపై ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై ఏం చర్యలు తీసుకుంటారు’’ అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: అందరూ కోరితే రెడీ.. అధ్యక్ష పదవికి పోటీపై గెహ్లాట్ వ్యాఖ్యలు -
అఖిలపక్ష నేతలతో ప్రధాని మోదీ సమావేశం
సాక్షి, ఢిల్లీ: అఖిలపక్ష నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్‌పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, కరోనా వ్యాక్సిన్ల పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలో నాలుగు వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. వీటితోపాటు మరో వ్యాక్సిన్ ప్రీ క్లినికల్ దశలో ఉందని వెల్లడించింది. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా విజ్ఞాన మరియు సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం చెప్పారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ల పరిశోధన, అభివృద్ధి నిమిత్తం కేంద్రం ప్రకటించిన మూడో ఉద్దీపన ప్యాకేజీ 'ఆత్మనీభర్ భారత్ 3.0' లో భాగంగా 'మిషన్ కోవిడ్ సురక్ష - ఇండియన్ కోవిడ్ -19 వ్యాక్సిన్ డెవలప్మెంట్ మిషన్' ప్రకటించినట్లు సింగ్ తెలిపారు. -
కాళేశ్వరం కోసం అన్నింటినీ పక్కనపెట్టారు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్రంలో నిర్మాణం చివరి దశలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పక్కనపెట్టారని అఖిలపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం భారీగా పెరగడంతో మిగతా ప్రాజెక్టులన్నీ వెనకబడ్డాయన్నారు. ఇప్పటికైనా కృష్ణాబేసిన్‌లో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. గురువారం టీ–జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఓ హోటల్లో ‘కృష్ణా నది–తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులు’అనే అంశంపై అఖిలపక్ష భేటీ నిర్వహించారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, వామపక్ష పార్టీల నేతలు అజీజ్‌పాషా, గోవర్ధన్, కాంగ్రెస్ నేతలు వంశీచంద్‌రెడ్డి, ఇందిరా శోభన్, కత్తి వెంకటస్వామి, రిటైర్డ్ ఇంజనీర్లు దొంతు లక్ష్మీనారాయణ, శ్యాం ప్రసాద్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రేవంత్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కొడంగల్–నారాయణపేట పథకాన్ని పూర్తిగా పక్కన పడేసిందని దుయ్యబట్టారు. కృష్ణా బేసిన్లో తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టే ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ఐక్య ఉద్యమాల నిర్మాణం చేయాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఏపీ నిర్మిస్తున్న సం గమేశ్వర ప్రా జెక్టు పూర్తయితే పాలమూరు ఎడారిగా మారుతుందన్నారు. ఈ సమావేశంలో రిటైర్డ్æ ఇంజనీర్లు లక్ష్మీనారాయణ, శ్యాం ప్రసాద్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొందరు రిటైర్డ్ ఇం జనీర్లు సీఎం కేసీఆర్‌తో అంటకాగుతున్నారని, ఒక్క డిండి ప్రాజెక్టు కోసమే ఏడుసార్లు సర్వే చేశారని లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలకు శ్యాంప్రసాద్‌రెడ్డి అడ్డుచెప్పారు. -
హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి
హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం కల్పించాలని, రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. సోమవారం అఖిలపక్ష నేతలు కోదండరాం, ఎల్.రమణ, చాడ వెంకట్‌రెడ్డి తదితరులు కింగ్‌కోఠి కోవిడ్ ఆసుపత్రిని సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఆసుపత్రిలో కోవిడ్ చికిత్సలపై సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కింగ్‌కోఠి ఆసుపత్రిలో సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ఆసుపత్రిలో 200 బెడ్లు ఖాళీగా ఉన్నాయని, అయినా అధికారులు బెడ్లు ఖాళీ లేవని రోగులను వెనక్కి పంపిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలతో ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పోతోందన్నారు. ప్రజా ప్రతినిధులు సైతం చికిత్సకోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరాలని ఆయన సూచించారు. టీటీడీపీ నేత ఎల్.రమణ మాట్లాడుతూ.. ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్లనే ప్రజలు సర్కారు ఆసుపత్రులపై నమ్మకం కోల్పోయారన్నారు. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజలను దోచుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలన్నారు. -
సీఎం స్పందించకపోతే ఉమ్మడి కార్యాచరణ ఉధృతం
సాక్షి, హైదరాబాద్: కరోనా కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్న ప్రజల్ని ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు అఖిలపక్ష నేతలు ప్రకటించారు. కరోనా కట్టడి, చికిత్సతోపాటు విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలని, కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని వారు కోరారు. అలాగే, నవంబర్ దాకా పేదలకు నెలకు రూ.7,500 చొప్పున ఆర్థిక సాయం, పట్టణ పేదలకు ఉపాధి హామీ పథకం అమలు, తొలగించిన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, సీఎం సహాయనిధికి చేరిన నిధుల లెక్కలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై సీఎం కేసీఆర్ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో హామీలివ్వకపోతే ఈ నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం ప్రొ.కోదండరాం, శ్రీశైల్‌రెడ్డి (టీజేఎస్), చాడ వెంకట్‌రెడ్డి (సీపీఐ), జూలకంటి రంగారెడ్డి, డీజీ నరసింహారావు (సీపీఎం), ఎల్.రమణ (టీటీడీపీ), కె.గోవర్ధన్, వెంకట్రాములు (న్యూ డెమోక్రసీ), సీహెచ్.మురారి (ఎస్‌యూసీఐ–సీ) మీడియాతో మాట్లాడారు. కరోనాతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వివిధ రూపాల్లో ఉమ్మడి కార్యాచరణ చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోకపోగా, ఆగస్ట్ 7న అఖిలపక్ష నేతలను అరెస్ట్ చేసి దుర్మార్గంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో సీఎం ఇచ్చే హామీలను బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. -
ప్రజలు అల్లాడుతుంటే పట్టదా?
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: అటు దేశం లో, ఇటు రాష్ట్రంలో కరోనా కోరల్లో చిక్కి ప్రజలు అల్లాడుతుంటే పాలకులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని అఖిల పక్ష నేతలు మండిపడ్డారు. కరోనా సంక్షోభ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా చేతులెత్తేశాయని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్.కృష్ణయ్య, తెలంగా ణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ విమర్శించారు. సోమవారం సుందరయ్య వి జ్ఞాన కేంద్రంలో జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబు ల్ సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణలో తీవ్రస్థాయిలో కోవిడ్ మరణాలు పెరి గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహా ర భద్రత, వైద్య సేవలు ప్రజలకు అందడం లేదన్నారు. 30న కలెక్టరేట్ల వద్ద నిరసన ఇక ఈనెల 30న అన్ని జిల్లా కేంద్రాల్లో వామపక్షాలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల వేదిక (టీఎల్పీఎంఎఫ్) ద్వారా జిల్లాల కలెక్టరేట్లకు నల్ల జెండాలతో నిరసనగా వెళ్లి వినతి పత్రం అందజేస్తామని అఖిల పక్ష నేతలు తెలిపారు. కోవిడ్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఆగస్టు 2న వర్చురల్ రచ్చబండ బహిరంగ సభ నిర్వహిస్తామన్నా రు. జూలై 28 నుంచి ఆగస్టు 4 వరకు (ఆగస్టు 2 మినహా) ప్రతిరోజూ ఒక అంశంపై వెబినార్/సెమినార్లు ఉంటాయన్నారు. రోజూ సాయంత్రం 5 నుంచి 7 గంటల దాకా ఈ కార్యక్రమాలుంటాయని వెల్లడించారు. జూలై 28న కోవిడ్‌పై ప్రభుత్వ నిర్లక్ష్యం–న్యాయపోరాటం, 29న అసంఘటిత రంగం, వలస కూలీలపై కోవిడ్ ప్రభావం, 30న కొరవడుతున్న ప్రజారోగ్యం, 31న విద్యారంగంపై కోవిడ్ ప్రభావం, ఆగస్టు 1న కోవిడ్ బాధితులు–సహాయక చర్య లు, 3న ఉద్ధీపన పథకాల డొల్లతనం, 4న కోవిడ్ ప్రజాందోళనపై ప్రభుత్వ నిర్బంధం, ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు, నల్ల జెండాలతో, నల్ల బెలూన్లు ఎగరేసి మహానిరసన తెలుపుతామని వివరించారు. -
రిజర్వేషన్లు తగ్గిస్తే ‘పంచాయితే’
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గిస్తే ఊరుకోబోమని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు. తక్షణమే బీసీల రిజర్వేషన్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు యథావిధిగా 34 శాతంగా అమలు చేస్తూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండాలంటే రాష్ట్ర కేబినెట్ తీర్మానం ప్రకారం వెంటనే బీసీ జనగణన నిర్వహించి బీసీల జనాభా లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషిని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కాంగ్రెస్ మాజీ ఎంపీ వీహెచ్, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య, కాసాని జ్ఞానేశ్వర్, లెఫ్ట్, ఇంటిపార్టీ నేతలు కలసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి బీసీలను రాజకీయంగా అణచివేసే ప్రక్రియను టీఆర్ఎస్ ప్రభుత్వం మొదలు పెట్టిందని ఆరోపించారు. బీసీ జనగణన లెక్కలు లేకపోవడంతో కోర్టు తీర్పులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వస్తున్నాయని, సీఎంకు చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లను యథావిధిగా అమలు చేయాలని అన్నారు. ఎల్.రమణ మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు రావడంతో తెలంగాణలో దొరల, పటేళ్ల రాజ్యం తగ్గిందని, ఇప్పుడు ఆ రిజర్వేషన్లు తగ్గించి మళ్లీ పెత్తందారీ వ్యవస్థ పెరిగేలా చూస్తున్నారని వాపోయారు. దీనిపై తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. రిజర్వేషన్లు తగ్గిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బీసీల రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారు... పొన్నాల, వీహెచ్ మాట్లాడుతూ బీసీలపై టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఎవరికీ రిజర్వేషన్లు తగ్గించకుండా బీసీల మాత్రమే ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. గొర్రెలు, బర్రెలు కాయడానికే బీసీలుండాలని కేసీఆర్ భావిస్తున్నారా.. అని ప్రశ్నించారు. కలెక్టరేట్ల ముట్టడికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ మద్దతు ప్రకటించారని తెలిపారు. జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ రెండో సారి సీఎం అయ్యాక ప్రధాని నరేంద్రమోదీని కలసి 16 డిమాండ్లు అడిగినప్పుడు బీసీల రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. దీనిపై కనీసం చర్చకు రాకపోవడం బీసీలను మోసం చేయడమేనన్నారు. శనివారం జరిగే రాష్ట్రవ్యాప్త కలెక్టరేట్ల ముట్టడి యథా తథంగా ఉంటుందన్నారు. జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు దామాషా ప్రకారం పెంచేదిపోయి తగ్గించడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు పాండురంగాచారి, టీజేపీ నేత ప్రకాశ్, బీసీ నేతలు ఎస్. దుర్గయ్య, తాటికొండ విక్రంగౌడ్, గొడుగు మహేశ్, కొటికే రాము, కొప్పుల చందు, లక్ష్మణ్, రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
2 కోట్ల మందితో ఉద్యమిస్తాం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే రెండు కోట్ల మందితో ఉద్యమిస్తామని అఖిలపక్ష నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 23 శాతానికి కుదించడాన్ని తప్పుపడుతూ ఆదివారం ఇందిరాపార్క్ వద్ద బీసీ సంక్షేమ సంఘం మహా ధర్నా నిర్వహించింది. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రే య, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తదితరులు ఇం దులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో బీసీలు 50 శాతానికి పైగా ఉన్నారని, ఆ మేరకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనన్నారు. గత ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయగా.. ఈ దఫా వాటిని 23 శాతానికి కుదిస్తూ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ను తక్షణమే రద్దు చేసి బీసీ రిజర్వేషన్లను పెంచాలన్నారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిందే జనాభా దామాషా ప్రకారం బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఏళ్లుగా ఉద్యమించి సాధించుకున్న బీసీ రిజ ర్వేషన్లను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తగ్గించినట్లు కనిపిస్తోందన్నారు. బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే సహిం చేది లేదని, రాష్ట్రంలోని 2 కోట్ల మందితో ఉద్యమా న్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు జనాభా ప్రకారం ఇవ్వాలని, ఇందుకు చట్టబద్ధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నా రు. పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు ద్వారా రిజ ర్వేషన్లపై నిర్ణయం తీసుకోవచ్చన్నారు. అప్పటివరకు పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలన్నారు. ఈ ధర్నాకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, టీజేఏస్ అధ్యక్షుడు కోదండరాం సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, జనార్దన్, నీల వెంకటేశ్, జి.మల్లేశ్, జైపాల్, అనంతయ్య, బీఆర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అన్నా.. మన ప్రచారమెప్పుడే!
‘‘అన్నా ఎప్పుడొస్తున్నవే..? మన ప్రచారం ఎప్పుడు షురువైతది.. మన అనుచరులు ఒక్కొక్కరు ఇంకో పార్టీ వైపు వెళుతున్నరు..’’ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగాలని భావిస్తున్న ఓ నేతకు గ్రామాల్లోని వారి అనుచరవర్గం నుంచి వస్తున్న ఒత్తిడి ఇది. టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాల్లో మునిగితేలుతున్న కాంగ్రెస్ పార్టీ ఆశావహులు ఇప్పుడు గ్రామాల్లో కేడర్‌ను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఇటు టికెట్ ప్రయత్నాల్లో మునిగి తేలుతూనే.. గ్రామాల్లోని తమ అనుచరవర్గం ప్రత్యర్థి పార్టీ వైపు వెళ్లకుండా తంటాలు పడుతున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ఉమ్మడి జిల్లాలో కేవలం మూడు నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విష యంలో స్పష్టత వచ్చింది. బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గాలు మినహాయిస్తే.. మిగిలిన ఆరు చోట్ల అభ్యర్థులెవరో ఇంకా తేలలేదు. దీంతో ఈ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారానికి శ్రీకారం చుట్టలేదు. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థులు మొత్తం తొమ్మిది నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాలు, డివిజన్లను చుట్టి వస్తున్నారు. రోజుకు రెండు, మూడు గ్రామాల చొప్పున తిరిగి ప్రచారాన్ని ము మ్మరం చేశారు. ఇప్పటి వరకు ఆయా గ్రా మాలకు చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూనే., మరో మారు అవకాశం కల్పిస్తే.. చేయనున్న అభివృద్ధి పనులపై హామీలు ఇస్తున్నారు. టీఆర్ఎస్ ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టోలోని అంశాలను క్షేత్ర స్థాయి లోని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటి ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో ఇటు కాంగ్రెస్ అభ్యర్థుల హడావుడి కనిపించకపోవడం తో వారి అనుచరులు నిరుత్సాహానికి గురవుతున్నారు. రెండు, మూడు రోజుల్లో టికెట్ ఖరారవుతుందని.. వెంటనే గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేద్దామని నేతలు కేడర్‌కు సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొత్తు స్థానాలపై మరింత అయోమయం.. మహాకూటమి పొత్తులో భాగంగా జిల్లాలో రెండు, మూడు స్థానాలను భాగస్వామ్య పక్షాలు ఆశిస్తున్నాయి. బాల్కొండ, నిజామాబాద్ రూరల్ స్థానాలపై టీడీపీ కన్నేయగా, ఎల్లారెడ్డి స్థానాన్ని టీజేఎస్ ఆశిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ మూడింటిలో కనీసం ఒక స్థానం కూటమిలోని పార్టీకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కేడర్‌లో అయోమయం నెలకొంది. తమ నేతకే టికెట్ దక్కుతుందా? తీరా ఈ స్థానం టీడీపీకి గానీ, టీజేఎస్‌కు గానీ కేటాయిస్తే మన పరిస్థితి ఏంటని కాంగ్రెస్ నేతల అనుచరులు అయోమయానికి గురవుతున్నారు. ఈ స్థానాల్లో కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్న నేతలు తమకే టికెట్ వస్తుందని, టీడీపీ, టీజేఎస్‌కు కేటాయించే అవకాశాలు లేవంటూ సర్ది చెప్పుకుంటున్నారు. కేడర్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు ఆశావహులున్న చోట.. ఆయా నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు నేతలు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఒక్కో గ్రామాల్లో రెండు మూడు వర్గాలుగా కాంగ్రెస్ శ్రేణలు విడిపోయాయి. ఈ ఇద్దరు, ము గ్గురు నేతల్లో టికెట్ ఎవరి వరిస్తుందోననే అయోమయం వారి వారి అనుచరుల్లో నెలకొంది. టికెట్ ఆశిస్తున్న ఇద్దరు నేతలు కూడా తమదే టికెట్ అంటూ ధీమా వ్యక్తం చేస్తూ కా ర్యకర్తలు, అనుచరులను కాపాడుకునేందుకు తంటాలు ప డుతున్నారు. అభ్యర్థుల ప్రకటన వరకు కాంగ్రెస్‌లో ఈ అ యోమయం కొనసాగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ధర్నాచౌక్.. ప్రజల హక్కు
- ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ అఖిలపక్ష సమావేశంలో వక్తలు - 12న అమరవీరుల స్థూపం వద్ద మౌన దీక్షకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేకుండా చేయడం.. ప్రజాస్వామ్యానికే ప్రమాదమని అఖిలపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ నిర్వహించింది. ధర్నాచౌక్ పరరిక్షణ అనేది ఒక స్థలాన్ని కాపాడుకోవడానికి కాకుండా ప్రజల హక్కును కాపాడుకునే అంశంగా చూడాలని ఈ సమావేశం అభిప్రాయపడింది. దీనికోసం ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటం చేయాల్సిందేనని నిర్ణయించింది. ఈనెల 8న జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు, 9న డీజీపీకి వినతి పత్రం, 10న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం, 12న అసెంబ్లీ ఎదురుగా తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో మౌన దీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. శాంతిభద్రతలు, సామాజిక భద్రతలు ప్రభుత్వ బాధ్యత అని, వీటి పేరిట నిరసన హక్కును హరించడం సరికాదని గతంలో ముద్రగడ పద్మనాభం దీక్ష సందర్భంగా కోర్టు గుర్తుచేసిందని తెలిపారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం: భట్టి ప్రజల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసించడం ప్రజల హక్కు. రాజరికం, నియంతల కాలంలోనూ ప్రజల సమస్యలను వినడం కోసం ప్రజా దర్బారులను నిర్వహించేవారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యానికి స్థానం లేకుండా చేశారు. ధర్నాలు, నిరసనలను ఒక పార్టీ కార్యాలయంలో తలుపులు పెట్టుకుని చేయాల్సిన దుస్థితి ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి అవమానం. అబ్సెంటీ సీఎం అనేది సీఎం కేసీఆర్‌ను చూసి అనుకోవాల్సి వస్తోంది. అణచేస్తున్నారు : ఎల్.రమణ అడ్డగోలు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ వాటిని అమలు చేయ లేక ప్రజలను అయోమయానికి గురిచేసే కుట్రలో భాగంగానే ధర్నాచౌక్‌ను ఎత్తివేశారు. ధర్నాలు, నిరసనలకు అవకాశం ఇస్తే సీఎం కేసీఆర్ అసమర్థత, అవినీతి, కేసీఆర్ కుటుంబ సభ్యుల అరాచకాలు ప్రజలకు అర్థమవుతాయని భయపడుతున్నారు. ఆత్మగౌరవం కోసం పోరాడితే..: చాడ ఆత్మగౌరవం, అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ కావాలని సబ్బండ వర్గాలు ఉద్యమించాయి. ఇప్పుడేమో అధికారంలోకి వచ్చిన పాలకులు ఆత్మవంచన చేసుకుని పాలిస్తున్నారు. ఇది ఎక్కువకాలం సాగదు. తెలంగాణ కోసం పోరాడినట్టే హక్కుల పరిరక్షణ కోసం కూడా ఉద్యమిస్తాం. -
హెచ్చెల్సీకి నీటి సాధన రైతుల విజయం
∙అఖిలపక్ష నాయకులు అనంతపురం సప్తగిరి సర్కిల్: హెచ్చెల్సీకి నీటి కేటాయింపు అన్నది రైతులు సాధించిన నైతిక విజయమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి శరత్‌చంద్రారెడ్డి, ౖరైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకటచౌదరి, ఏపీసీసీ అధికార ప్రతినిధి రమణ తెలిపారు. సోమవారం వారు స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. అఖిలపక్ష నాయకులు, రైతులు ఎగువపల్లి వద్ద నిర్వహించిన డీఈ కార్యాలయ ముట్టడిపై అధికారులు స్పందించారన్నారు. ఈ నెల 16 నుంచి జనవరి 31 వరకు నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారని వారు తెలిపారు. జిల్లాలో కరువును రూపుమాపేందుకు ఉన్నతా«ధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రైతులకు, అఖిలపక్ష నాయకులకు, వివిధ శాఖల అ«ధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. సీపీఐ రైతు సంఘం కార్యదర్శి కాటమయ్య, రైతు సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
గుండుపాలెంలో అఖిలపక్ష నేతల పర్యటన
విజయవాడ : మచిలీపట్నం పోర్టు కోసం తమ నుంచి బలవంతపు భూసేకరణ చేస్తున్నారని రైతులు ఆరోపించారు. మంగళవారం మచిలీపట్నం మండలం గుండుపాలెం గ్రామంలో భూపరిరక్షణ పోరాట సమితి నేతలతోపాటు అఖిలపక్ష నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణపై సదరు నేతలకు రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రైతులతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతోపాటు భూపరిరక్షణ పోరాట సమితి నేతలు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకుడు పేర్ని నాని కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. -
సేవా కార్యక్రమాలతో మహాత్ముడికి నీరాజనం
అనంతపురం కల్చరల్ : కొత్తూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గోపా మచ్చా నరసింహులు నేతృత్వంలో గాంధీ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక టవర్‌క్లాక్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహానికి పూలమాలలు పలువురు రాజకీయ పార్టీల నేతలు నివాళులర్పించారు. అనంతరం నిరుపేద మహిళలకు నూతన వస్త్రాలనందించారు. అలాగే అమ్మవారిశాలలో జరిగిన సన్మాన కార్యక్రమంలో అన్ని పార్టీల వారు ఒకే వేదికపై సందడి చేశారు. ఎంపీ దివాకరరెడ్డి, మేయర్ స్వరూప, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి, చవ్వా రాజశేఖరరెడ్డి తదితరులను ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు సత్కరించారు. అలాగే పాతూరు అమ్మవారి శాల, హరిశ్చంద్ర ఘాట్, యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తాడిపత్రి బస్టాండు సమీపంలోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం కన్యకా పరమేశ్వరి ఆలయం అధ్యక్షులు ముత్యాల రంగయ్య నేతృత్వంలో 500 మంది పేదలకు వస్త్రదానం చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
'జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా లేదు'
-
'జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా లేదు'
హైదరాబాద్ : ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే జిల్లాల విభజన చేయాలని తెలంగాణ వైఎస్సార్సీపీ నేత శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికారాబాద్‌ను జిల్లా కేంద్రం చేయాలంటూ వివిధ పార్టీల నేతలను ఆదివారం అఖిలపక్ష నేతలు కలిశారు. అందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ...జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరగడం లేదన్నారు. ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో మార్పులు చేసిన తర్వాత మరోసారి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని సూచించారు. -
ఆంధ్రుల గుండెచప్పుడు ప్రత్యేక హోదా
ప్రత్యేక హోదా కోరుతూ ఆకాశవాణి కేంద్రం ఎదుట ధర్నా హాజరైన వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం ముఖ్య నాయకులు ముగ్గురు మోసగాళ్లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం విజయవాడ (లబ్బీపేట) : ఆంధ్రుల గుండెచప్పుడు ప్రత్యేక హోదా అని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్రమోదీ, ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు.. పదేళ్లు కాదు 15 ఏళ్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రులను నట్టేట ముంచుతున్నారన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్యాకేజీ.. హోదా.. అంటూ పూటకో మాట చెబుతూ చంద్రబాబు గారడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చడంతో వైఎస్సార్ సీపీతోపాటు వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యాన గురువారం స్థానిక మహాత్మాగాంధీ రోడ్డులోని ఆకాశవాణి కేంద్రం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్ర విభజన సమయం నుంచి డ్రామాలు ఆడుతున్నారన్నారు. ఒకవైపు విభజన చేయాలని లేఖ ఇచ్చి, మరోవైపు సమైక్యాంధ్రా పేరుతో ఉద్యమం చేయించారని విమర్శించారు. ఇప్పుడు హోదా సంజీవిని కాదని మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. చివరకు హోదా లేదు.. ప్యాకేజీ లేదని, ఐదు కోట్ల మంది ఆంధ్రుల నోట్లో మట్టికొట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షడు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం దున్నపోతుపై వర్షం పడిన చందంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకూ తాము పోరాటం చేస్తామన్నారు. అరుణ్ జైట్లీ ప్రకటనలో కొత్తదనం లేదు : మధు అరుణ్ జైట్లీ ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించిన అంశాల్లో కొత్తదనమేమీ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ప్రత్యేక హోదాను నిరాకరిస్తున్నట్లు ప్రకటించడమే కొత్త విషయమన్నారు. పోలవరానికి జాతీయ హోదాను ఎప్పడో ప్రకటిస్తే, దాన్ని మళ్లీ ప్రస్తావించారని పేర్కొన్నారు. కడప ఉక్కు కర్మాగారం, విశాఖ రైల్వే జోన్ల ప్రస్తావనే లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో సైతం స్పష్టత లేదని, సహాయం చేస్తామని మాత్రమే చెబుతున్నారన్నారు. -
ముఖ్యమంత్రివి పిచ్చిమాటలు
కడప కార్పొరేషన్: రాయల సీమలో కరువు నివారణకు నియోజకవర్గాలకు ఐపీఎస్ అధికారులు, మండలాలకు గ్రూప్–1 ఆఫీసర్లను నియమిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు. ఇంకా ఎవరిని మభ్యపెట్టడానికి ఈ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఇక్కడి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రాయలసీమ కార్మిక, కర్షక సేవా సమితి అధ్యక్షులు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అ«ధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, ఆమ్ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ పెద్దన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సీమలో పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం రెయిన్గన్లు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. నాలుగు రోజుల దాటితే ఆర్టీపీపీ విద్యుదుత్పత్తికి నీళ్లు ఉండవని, బ్రహ్మంసాగర్, మైలవరంలో కూడా నీళ్లు లేవన్నారు. దీనికి ఏరకమైన గన్లు ఉపయోగిస్తారని ఎద్దేవా చేశారు. విభజనతో సీమ సర్వనాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర కరువు ప్రాంతమైన రాయలసీమ పట్ల ప్రభుత్వానికి సరైన ఆలోచన లేదని, పుష్కరాలకు ఇచ్చిన ప్రాముఖ్యత కూడా సీమ కరువు పట్ల లేకపోవడం దురదృష్టకరమన్నారు. రాయలసీమలోని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపతికన పూర్తి చేయాలని, ఉక్కుపరిశ్రమను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ జిల్లా రైతాంగం ఆవేదన, ఆగ్రహాన్ని ఈ ధర్నా ద్వారా తెలియజెప్పాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ రాయలసీమ పట్ల ముఖ్యమంత్రి వైఖరి అత్యంత దారుణంగా ఉందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ తరతరాలుగా రాయలసీమకు అన్యాయమే జరుగుతోందని, సీమ సమస్యలపై అసెంబ్లీలో గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్ఆర్సీపీ ధర్నా నిర్వహించడం శుభపరిణామమన్నారు. కాంగ్రెస్ నాయకుడు ఎస్ఏ సత్తార్ మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధి కోసం ఎలాంటి ఉద్యమానికైనా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఆమ్ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ పెద్దన్న మాట్లాడుతూ కోస్తాలో టీడీపీకి ఓట్లు వేశారు కాబట్టే ముఖ్యమంత్రి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారని ఇది మంచి విధానం కాదని తెలిపారు. -
సబ్‌స్టేషన్ నిర్మాణంపై మొదలైన ఉద్యమం
తణుకు : సజ్జాపురం శ్మశాన వాటికలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని ఆపేయాలని కోరుతూ వామపక్షాలతో పాటు, జై సమైక్యాంధ్ర పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమం ప్రారంభమైంది. ‘శ్మశానంలో సబ్‌స్టేషన్’ శీర్షికతో ఈనెల 6న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయా వర్గాల నుంచి స్పందన మొదలైంది. నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పలు పార్టీల నాయకులు రోడ్డెక్కారు. ఈ మేరకు గురువారం సజ్జాపురం శ్మశాన వాటికను పరిశీలించిన నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డెప్యూటీ తహసీల్దార్ వర్మకు వినతి పత్రం అంజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కేతా గోపాలన్ మాట్లాడుతూ సజ్జాపురం శ్మశానానికి గతంలో సుమారు 2.78 ఎకరాలు స్థలాన్ని కేటాయించారన్నారు. అయితే ప్రస్తుతం 1200 గజాల్లో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ ం చేస్తున్నారని ఆరోపించారు. తణుకు పట్టణంలో జనాభా లక్షకు పైగా ఉండగా కేవలం రెండు శ్మశాన వాటికలు మాత్రమే ఉన్నాయన్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, న్యాయవాది అనుకుల రమేష్ మాట్లాడుతూ శ్మశాన వాటికకు ఉన్న స్థలమే తక్కువగా ఉంటే ఈ ప్రాంతంలోనే విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించాలనుకోవడం బా«ధాకరమన్నారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి పీవీ ప్రతాప్, గార రంగారావు, గుబ్బల గోపి, డీవీఎన్ వేణు, డి.జగన్నాథం, దానయ్య, బసవా శ్రీను, ఎం.మైఖేల్ తదితరులు పాల్గొన్నారు. -
'ఇబ్రహీంపట్నంను జిల్లా కేంద్రం చేయండి'
ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం ఆందోళనకు దిగారు. బెంగుళూరు చౌరస్తా వద్ద వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రాస్తారోకోకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నాయకులను అడ్డుకున్నారు. ఇబ్రహీపట్నాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు వారిని శాంతపరచి... రహదారిపై నిలిచిన వాహనాలను పునరుద్ధరించారు. -
'ప్రాణహితను పాత డిజైన్లోనే కొనసాగించాలి'
హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్ట్‌ను పాత డిజైన్లోనే కొనసాగించాలని అఖిలపక్ష సమావేశంలో నాయకులు అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ నుంచి తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, వంశీచంద్ రెడ్డి పాల్గొనగా... టీడీపీ తరపున ఎల్. రమణ, సీపీఐ పార్టీ నుంచి చాడ వెంకటరెడ్డి, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రంతో పాటు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... 'ప్రాజెక్టుల ప్రణాళికా సమయంలో అవినీతి ప్రారంభమౌతుంది. ప్రాజెక్టుల నిర్మాణం పై జేఏసీ ఏర్పాటు అవసరం. ప్రజలను చైతన్యవంతం చేసి ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుదాం' : జస్టిస్ చంద్రకుమార్ 'ప్రాజెక్టులపై రిటైర్డ్ ఇంజినీర్లతో చర్చించి నాలెడ్జ్ అవేర్నెస్ పెంచుకోవాల్సిన అవసరముంది. తెలంగాణ ప్రజల జీవితాలను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఇది తెలంగాణ భవిష్యత్తుకు మంచిదికాదు' : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ 'అసెంబ్లీలో టీఆర్ఎస్ వాదన తొండి వాదన. ప్రాణహితకు 1800 ఎకరాల ముంపు ప్రాంతంపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోవడం కేసీఆర్ ప్రభుత్వానికి సిగ్గుచేటు. శాసన సభలో ప్రాజెక్టులపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో ప్రతిపక్షం విఫలం. ప్రాజెక్టుల రీడిజైన్‌పై ప్రజల్లోకి వెళ్తాం' : తమ్మినేని వీరభద్రం -
గ్రావిటీని కాదని ఎత్తిపోతలెందుకు?
* కాళేశ్వరం ప్రతిపాదనపై అఖిలపక్ష నేతలు, ఉద్యమకారుల మండిపాటు * గజ్వేల్, సిద్దిపేట కోసం రాష్ట్ర ప్రయోజనాలను సమాధి చేశారని విమర్శ సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చి కాళేశ్వరం దగ్గర్లోని మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించి నీటిని మళ్లించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను అఖిలపక్ష నేతలు, జలసాధన సమితి, ప్రాజెక్టు పరిరక్షణ సమితి సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల లబ్ధికోసం మొత్తం తెలంగాణ ప్రయోజనాలకు ప్రభుత్వం సమాధి కడుతోందని విమర్శించారు. ప్రాణహితకు అనుమతులన్నీ లభించి జాతీయ హోదా దక్కే సమయంలో డిజైన్ మార్పుతో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.80 వేల కోట్లకు పెంచేయడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడమేనని అన్నారు. ఇప్పటికే జరిగిన ఒప్పందాలను విస్మరించి కొత్తగా రాష్ట్రానికి నష్టం కలిగేలా మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడం రాష్ట్ర ప్రయోజనాలకు తాకట్టు పెట్టడమే అని ధ్వజమెత్తారు. గురువారం ప్రాణహిత-చేవెళ్ల-కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదనలపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష నేతలు, జల సాధన సమితి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉపనేత టి.జీవన్‌రెడ్డి, తెలంగాణ బచావో మిషన్ నేత యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి రాజారాం యాదవ్, జల సాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్, ప్రాణహిత పరిరక్షణ సమితి కన్వీనర్ ప్రతాప్, నీటి పారుదల రంగ నిపుణుడు సారంపల్లి మల్లారెడ్డిలు ఇందులో పాల్గొన్నారు. పరీవాహక జిల్లాలకే మొదటి హక్కు : టి.జీవన్‌రెడ్డి ‘తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే సుమారు 80 కిలోమీటర్ల మేర గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశం ఉంది. దీనిపై 2012లో రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడే మహారాష్ట్రతో ఒప్పందం కుదిరింది. కానీ గత ఏడాది మహారా్రష్ట్ర గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ తర్వాత కాళేశ్వరాన్ని తెరపైకి తెచ్చారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా నిర్ణయాలు చేశారు. నిజానికి గోదావరి పరీవాహకం ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు గోదావరిపై మొదటి హక్కుంది. ఆ జిల్లాల అవసరాలు తీరాకే మెదక్‌కు నీటిని తరలించాలి. మెదక్ జిల్లాలో నిర్మించే రిజర్వాయర్లను ఆదిలాబాద్ జిల్లాలోనే నిర్మించాలి. అలా కాకుండా ప్రతిపక్షాలు, మేధావుల సూచనలను పక్కనపెట్టి ఇష్టారీతి నిర్ణయాలు చేస్తే చూస్తూ ఊరుకోం’. గ్రావిటీ వదిలి ఎత్తిపోతలా..: నైనాల గోవర్ధన్ ‘మహారాష్ట్రతో తాజాగా కుదుర్చుకున్న ఒప్పందంవల్ల గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని రాష్ట్రం కోల్పోతుంది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయాలన్న నిర్ణయంతో అదనపు ఖర్చుతో పాటు అధిక విద్యుత్తు అవసరం. అదీగాక 152 మీటర్ల వద్ద మహారాష్ట్ర భూభాగంలో 1,852 ఎకరాలు మాత్రమే ముంపు ఉండగా, మేడిగడ్డ వద్ద 103 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే 3,075 ఎకరాల ముంపు ఉంటుంది. మహారాష్ట్ర అంత ముంపును ఎలా అంగీకరించిందో ప్రభుత్వం చెప్పాలి’. కమీషన్ల కోసమే : యెన్నం ‘కేవలం కమీషన్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైన్ అంటున్నారు. ఆ డబ్బుతోనే జీహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాజకీయాలు చేశారు’. నాటకాలు ఆడుతున్నారు: రాజారాం యాదవ్ ‘అధికారం రాకముందు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు ఇప్పుడు కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు కూడబెట్టుకునేందుకు నాటకాలు ఆడుతున్నారు’. -
గవర్నర్‌తో సీపీ మహేందర్ రెడ్డి భేటీ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో సీపీ మహేందర్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పాతబస్తీలో జరిగిన గొడవలపై తీసుకున్నచర్యల గురించి గవర్నర్‌కు మహేందర్ రెడ్డి వివరించారు. బుధవారం తెలంగాణ అఖిల పక్ష నాయకులు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో దాడులపై పోలీస్ కమిషనర్‌ను గవర్నర్ వివరణ కోరారు. పాతబస్తీ మీర్ చౌక్ ఘటనతో పాటు అజంపురాలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కుమారుడిపై దాడి ఘటనలపై సీపీ వివరించారు. వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నామని... త్వరలో నిందితులందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పినట్లు సమాచారం. మీర్ చౌక్‌లో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీపై దాడి కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
వైఎస్ షర్మిలను కలిసిన అఖిలపక్ష నేతలు
వరంగల్ : వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ కొనసాగుతోంది. బుధవారం ఉదయం గూడూరు నుంచి ఆమె యాత్రను ప్రారంభించారు. యాత్రలో భాగంగా షర్మిల ఐదు కుటుంబాలను పరామర్శించనున్నారు. ముందుగా నెక్కొండ మండలం వెంకటాపురానికి చేరుకుంటారు. అక్కడ సూరం ఐలయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం దీక్షకుంట్లలో చేతం చంద్రయ్య, కొమ్ముల మల్లమ్మ కుటుంబాన్ని, అక్కడ నుంచి చెన్నారావుపేట మండలం జీజీఆర్పల్లికి చేరుకుని బూస నర్సయ్య కుటుంబానికి భరోసా కల్పిస్తారు. చివరగా మూలుగు నియోజకవర్గం కొత్తగూడ మండలం ఓటాయితండలోని బానోత్ మంగళి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఈ క్రమంలో 144 కిలోమీటర్ల దూరం మేరకు యాత్ర సాగుతుంది. మరోవైపు గూడూరులో పరామర్శ యాత్రలో ఉన్న వైఎస్ షర్మిలను అఖిలపక్ష నేతలు కలిశారు. మహబూబాబాద్‌ను జిల్లాగా ప్రకటించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా కొత్త జిల్లా ఏర్పాటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని వైఎస్ షర్మిల ప్రకటించారు. అఖిలపక్ష నేతలకు సంఘీభావం తెలిపారు. -
సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించాలి
అఖిలపక్ష నేతల డిమాండ్ హైదరాబాద్: మూతపడ్డ సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించాలని, 10 నెలల వేతన బకాయిలు ఇప్పిం చాలని, కార్మికులకు శాశ్వత ఉద్యోగభద్రత కల్పిం చాలని పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే అసెంబ్లీ సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఏకమై వాయిదా తీర్మానమిచ్చి సభను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. సిర్పూరు పేపర్ మిల్లును ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సిర్పూరు పేపర్ మిల్లు సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఇందిరాపా ర్కు వద్ద కుటంబసభ్యులతో కలసి కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు 4 వేల మంది కార్మికులకు ప్రత్యక్షంగా, 25 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఈ మిల్లు తెలంగాణ ఏర్పడిన కొద్దిమాసాలకే మూతపడడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. సిర్పూరు పేపర్ మిల్లు యూనియన్ నాయకుడైన కార్మిక, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెంటనే సీఎంతో మాట్లాడి మిల్లును తెరిపించాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటే కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభించడమేనా అని ప్రశ్నించారు. మిల్లును తెరిపించడానికి కేంద్ర సహాయం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సీపీఎం నేత వెంకటేష్, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు శ్రావణ్‌కుమార్, శ్రీనివాస్ యాదవ్, సీపీఐ నేత గుండా మల్లేశ్, టీడీపీ నేత రమేష్ రాథోడ్, మాజీమంత్రి బోడ జనార్దన్, ఐఎఫ్టీయూ నాయకులు ఎస్ఎల్ పద్మ, సిర్పూరు పేపరు మిల్లు సంరక్షణ సమితి కన్వీనర్ శ్రీనివాసు పాల్గొన్నారు. -
ఆ రెండు జిల్లాలపై కేసీఆర్ కక్ష కట్టారు
హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల రీజైన్కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమయ్యాయి. ప్రాజెక్టు మార్పుపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ గవర్నర్ నరసింహన్‌కు రంగారెడ్డి జిల్లా అఖిలపక్షం నేతలు శనివారం ఫిర్యాదు చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పుపై కొద్దిరోజులుగా రంగారెడ్డి జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, సీపీఐ నేతలు నేతలు గవర్నర్‌ను కలిశారు. భేటీ అనంతరం అఖిలపక్ష నేతలు మీడియాతో మాట్లాడుతూ ప్రాణహిత - చేవెళ్ల డిజైన్ మార్పు వల్ల హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు జరిగే నష్టాన్ని గవర్నర్ నరసింహన్‌కి వివరించామని వెల్లడించారు. ప్రాణహిత - చేవెళ్ల అంశంలో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై వారు మండిపడ్డారు. ఈ ప్రాజెక్ట్ డిజైన్ మారుస్తున్నామంటూ కేసీఆర్ మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపై కేసీఆర్ కక్ష కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హైదరాబాద్, రంగారెడ్డికి తాగునీరు కోసం చేపట్టిన ప్రాజెక్టులకు వెయ్యి కోట్లు కేటాయించారన్నారు. ఇప్పుడు డిజైన్ మారిస్తే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. డిజైన్ మార్పు వల్ల అంతర్ జిల్లాల మధ్య విబేధాలు తలెత్తి ప్రజాయుద్ధానికి దారి తీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. డిజైన్ మార్పుకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని అఖిలపక్ష బృందం నేతలు హెచ్చరించారు. అఖిలపక్ష బృందంలో టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్ సీపీ, సీపీఐ నేతలు పాల్గొన్నారు. అంతుకు ముందు గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద అఖిలపక్ష నేతలు నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా గవర్నర్ వద్దకు వెళ్లారు. -
హుజూరాబాద్‌లో అఖిలపక్షం ధర్నా
కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ చాంబర్ ఎదుట ధర్నాకు దిగిన అఖిలపక్ష నాయకులను అరెస్టు చేయడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి. అందులోభాగంగా అఖిలపక్షం నాయకులు శనివారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో రాస్తారోకా నిర్వహించారు. రహదారిపై బైఠాయించి... కేసీఆర్ ప్రభుత్వాన్నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి అఖిలపక్షం నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. -
రైతులను మోసగిస్తే సహించం
- రైతు సదస్సులో అఖిల పక్ష జిల్లా నేతలు - కీలక నిర్ణయూలకు ఏకగ్రీవ ఆమోదం ఉరవకొండ: హంద్రీ నీవా మొదటి దశ కింద జిల్లాలోని 1.18లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వకుండా నీటిని అక్రమంగా చిత్తూరుకు తరలించి ఆయుుకట్టు రైతుల మధ్య చిచ్చు పెట్టాలని యత్నిస్తే సహించేది లేదని అఖిల పక్ష నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక వీరశైవ కళ్యాణ వుండపంలో సోవువారం ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన రైతు సదస్సులో రాష్ట్ర, జిల్లా నేతలు హాజరయ్యారు. సదస్సులో ఆమోదించిన తీర్మానాల్లో ముఖ్యమైనవి.. - జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రావుం లో హం ద్రీనీవా ఆయుకట్టు సాధన క మిటీల ఏర్పాటు - లక్ష సంతకాల సేకరణతో ఉద్యవుం ఉధృతం - హంద్రీ నీవా డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాలువల వద్ద రైతు నిద్ర - పంప్‌హౌస్‌ల దిగ్బంధం, అక్కడే జాగరణ -
చంద్రబాబు దిగొచ్చే వరకు పోరాటం
- అఖిలపక్ష నేతల అల్టిమేటం - కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం - కార్మిక నాయకల అరెస్టు.. కర్నూలు(హస్పిటల్): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగొచ్చే వరకు పోరాటం ఆపబోమని అఖిలపక్ష నేతలు, మున్సిపల్ జేఏసీ నాయకులు హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం మున్సిపల్ కార్మికులు కలెక్టరేట్‌ను మట్టడించారు. మున్సిపల్ జేఏసీ జిల్లా కన్వీనర్ వైవీ రమణ ఆధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ, వామపక్షాల నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ 14 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం కనీసం చర్చలకు పిలువకపోవడం దారుణమన్నారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్త బంద్‌కు సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లాలోని 11 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని, వారంతా ఆమరణ నిరాహారదీక్షలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. చెత్తాచెదారంతో కర్నూలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చెత్తను తీసుకుపోయి అధికార పార్టీ నాయకుల ఇళ్ల వద్ద పడేస్తే సమస్య ఏమిటో తెలుస్తుందన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు కంపుకొడుతున్నా ప్రభుత్వానికి చెవికెక్కడంలేదన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల సమయంలో ఊదరగొట్టి.. అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని ఎద్దేవా చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే గఫూర్ మాట్లాడుతూ కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడును వెంటనే గద్దెదిగాలన్నారు. స్వచ్ఛాంద్రప్రదేశ్ను చెత్తంద్రాప్రదేశ్గా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి , ఎఐటీయూసీ రాష్ట్ర నాయకుడు మనోహర్ మాణిక్యం, ఐద్వా రాష్ట్ర నాయకురాలు నిర్మల, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, మునెప్ప తదితరులు మద్దతు ప్రకటించారు. ఏఐటీయూసీ నాయకులు రామకృష్ణారెడ్డి, ప్రభాకర్, సీపీఎం నాయకులు పుల్లారెడ్డి, రాముడు, అంజిబాబు, ఆనంద్, వైఎస్ఆర్టీయూసీ నగర అధ్యక్షులు నరసింహులు యాదవ్, ఎస్సీ సెల్ నాయకులు కిషన్, ట్రేడ్ యూనియన్ నాయకులు రమణ, పులి జాకోబ్, రాఘవేంద్రనాయుడు, సహదేవుడు, సలీం, నాయకులు రాధాకృష్ణా, స్వాములు పాల్గొన్నారు. అరగంట సేపు తోపులాట.. కలెక్టరేట్ ముట్టడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ జేఏసీ నాయకులు, కార్మికులు కలెక్టరేట్ ప్రధాన గేట్లను తోచుకుని లోపలికి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. స్పెషల్ పార్టీ పోలీసులు వీరిని అడ్డుకున్నారు. అరగంట సేపు కార్మికులు, పోలీసుల మధ్య తీవ్రంగా తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కార్మిక నాయకులను అరెస్ట్ చేసి మూడో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలియడంతో కార్మికులు అక్కడికి చేరుకుని పోలీస్ స్టేషన్ ఆవరణంలోనే ధర్నా చే పట్టారు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసిన వారిని విడుదల చేశారు. -
అబద్దాలు చెప్పడంలో పోటీపడుతున్న మోడీ-బాబు
అనంతపురం: అబద్దాలు చెప్పడంలో దేశ ప్రధాని నరేంద్రమోడి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒకరికొకరు పోటీపడ్డారని అఖిల పక్ష నాయకులు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన కేంద్ర కార్యాలయాల ముట్టడి సమయంలో పోలీసులు అరెస్ట్‌లు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆందోళనకారులపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో గురువారం ఉదయం అఖిల పక్ష నాయకులు టూటౌన్ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. ఆందోళనకారులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర విభజన సమయంలో గత యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందన్నారు. తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ తొమ్మిది నెలలవుతున్నా ఎంతమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. వీటి గురించి మాట్లాడితే దాటవేసే ధోరణి అవలంభిస్తూ దోబూచులాడుతున్నారని ధ్వజవమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరూ పోరాటాలు చేసిన వైఎస్సార్సీపీ పూర్తి మద్ధతు ఇస్తుందని ప్రకటించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి గత ప్రధాని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే గతంలో చెప్పిన హామీలపై కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంపై ఒత్తిడి తె చ్చే అంశంలో ముఖ్యమంత్రి తమతో కలిసి రావాలని లేదంటే గతంలో పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. అఖిలపక్ష బృందాన్ని ప్రధానమంత్రి వద్దకు పిలుచుకెళ్లాలని ముఖ్యమంత్రికి సూచించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఇంతియాజ్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని ఆందోళన చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రధాని నరేంద్రమోడి తన భార్యతో సహజీవనం చేయలేదు కాని ఆయనకూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మాట్లాడుతున్నారన్నారు. మరోవైపు వీలైనంతమంది పిల్లలను కనాలని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మహిళల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఆందోళనకారులను భయబ్రాంతులకు గురి చేయడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు దాదాగాంధీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం పూర్తిగా విస్మరించిందన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై చర్యలు తీసుకోకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, నాయకులు ఎంవీ రమణ, నారాయణస్వామి, జాఫర్, వైఎస్సార్సీపీ ముఖ్యనేత ఎర్రిస్వామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, ఎల్ఎం మోహన్‌రెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి, ధనుంజయయాదవ్, కాంగ్రెస్ నాయకులు జాన్‌వెస్లీ తదితరులు పాల్గొన్నారు. -
ఎంసెట్‌పై ఢిల్లీ బయల్దేరిన అఖిలపక్షం
హైదరాబాద్ : అఖిలపక్ష నేతలు బుధవారం ఢిల్లీ బయల్దేరారు. ఇంజినీరింగ్, మెడికల్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడిగా ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించటంపై కేంద్రం జోక్యం కోరుతూ ఈ బందృం హస్తినకు పయనం అయ్యింది. అఖిలపక్ష నేతలతో పాటు మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ కూడా ఢిల్లీ వెళ్లిన వారిలో ఉన్నారు. -
సీడబ్ల్యూసీతో అధ్యయనం
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై తాము జోక్యం చేసుకోలేమని కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయూన్ని వివరించిన రాష్ట్ర అఖిలపక్ష బృందానికి ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్ర జలవనరుల మంత్రి హరీష్ రావత్‌ల నుంచి గట్టి హామీలేవీ లభించలేదు. అరుుతే ‘‘డిపెండబిలిటీని 75 శాతం నుంచి 65 శాతానికి తగ్గించిన విషయంలో మీరు చెబుతున్నది సరైనదేనని నేను అర్థం చేసుకున్నాను. ఈ అంశంపై అధ్యయనం చేయమని కేంద్ర జలసంఘాన్ని(సీడబ్ల్యూసీ) కోరతాను’’ అని మాత్రం ప్రధాని చెప్పారు. సుప్రీంలో పెండింగ్‌లో ఉన్న కేసులో కేంద్రం ఇంప్లీడ్ కావాలని అఖిలపక్షం అర్థించినప్పుడు ఏమీ మాట్లాడకుండా తలాడించారు. ట్రిబ్యునల్ తుది తీర్పును నోటిఫై చేయవద్దని ఒకటికి రెండుసార్లు విన్నవించినప్పుడు.. ‘‘ఇప్పటికే సుప్రీంకోర్టు స్టే ఉంది కదా... అది తొలగించేలోపు మీ ప్రయత్నాలు మీరు చేయండి. మీ వాదనలేవో అక్కడ వినిపించండి’’ అని సూచించారు. పక్కనే ఉన్న హరీష్ రావత్.. ‘‘ఇదంతా సుప్రీంకోర్టు పరిధిలోనిది. కేసులో మేం ఎంతవరకు జోక్యం చేసుకోవడానికి వీలుంటుందో చూస్తాం. ఇందుకు న్యాయపరమైన కొన్ని పరిమితులున్నాయి..’’ అని అన్నారు. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర అఖిలపక్ష ప్రతినిధి బృందం శుక్రవారం ఉదయం ప్రధానిని ఆయన నివాసంలో కలిసింది. అరగంటపాటు జరిగిన భేటీలో సీఎం, వివిధ పక్షాల నేతలు ట్రిబ్యునల్ తుదితీర్పు రాష్ట్రానికి చేసిన చేటును వివరించారు. సీఎంతో పాటు ప్రభుత్వం, కాంగ్రెస్ తరఫున భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మంత్రులు కె.జానారెడ్డి, పితాని సత్యనారాయణ, కె.పార్థసారథి, వైఎస్సార్సీపీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, బీజేపీ నుంచి నాగం జనార్ధన్‌రెడ్డి, శేషగిరిరావు, టీఆర్ఎస్ నుంచి వినోద్‌కుమార్, విద్యాసాగరరావు, టీడీపీ నుంచి కోడెల శివప్రసాదరావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఐ నుంచి కె.నారాయణ, గుండా మల్లేశ్, సీపీఎం తరఫున బి.వి.రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, లోక్‌సత్తా తరఫున డి.రామారావు, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఒవైసీ ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అనారోగ్య కారణాలరీత్యా ఈ భేటీలో పాల్గొనలేకపోయారు. సమావేశం ఆరంభం కాగానే సీఎం కిరణ్ అఖిలపక్షం తరఫున 11 పేజీల నివేదనను ప్రధానికి అందజేశారు. తీర్పు ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉండనున్నదీ వివరించారు. ఆ తర్వాత ఆయూ పార్టీల తరఫున ఒక్కొక్కరుగా వాదనలను వినిపించారు. ‘‘రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోంది. మీరు వెంటనే జోక్యం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయండి’’ అని వారు అర్థించారు. అందరు చెప్పిందీ ప్రధాని సావధానంగా విన్నారు. ‘ట్రిబ్యునల్ తుది తీర్పును పరిశీలించాల్సి ఉంది.. అధ్యయనం చేశాక ఏం చేయాలో ఆలోచిస్తాం.. సీడబ్ల్యూసీతో అధ్యయనం చేయిస్తా..’ అని చెప్పారు. భేటీ చివర్లో సీపీఐ రాష్ట్ర నేత నారాయణ, బీజేపీ నాయకుడు నాగం, టీఆర్ఎస్ ప్రతినిధి వినోద్ విడివిడిగా వినతిపత్రాలను ప్రధానికి అందజేసినట్లు సమాచారం. భేటీ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి మీడియూతో మాట్లాడకుండా వెళ్లిపోయూరు. ప్రధానితో భేటీకి ముందు ఏపీ భవన్లో సీఎం సమక్షంలో అఖిలపక్ష నేతలు కూర్చుని ఏయే అంశాలను గట్టిగా చెప్పాలనేది చర్చించారు. దయూర్ద్ర వైఖరి చూపండి ‘‘బ్రిజే శ్‌కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర గాయాన్ని చేసేదిగా ఉన్నందున రాష్ట్రానికి న్యాయం జరిగేలా దయార్ద్ర వైఖరిని చూపండి’’ అని ప్రధానికి సమర్పించిన వినతిపత్రంలో అఖిలపక్ష నేతలు కోరారు. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఎగువ రాష్ట్రాలు విడుదల చేసే జలాలపైనే గణనీయంగా ఆధారపడుతోందని విన్నవించారు. ట్రిబ్యునల్ తీర్పు యావత్ దేశంలో ప్రతికూల పర్యవసానాలకు దారితీస్తుందని తెలిపారు. రాష్ట్ర రైతాంగం యావత్తూ తీవ్ర ఆందోళన చెందుతోందని, రైతులు, ప్రజలు, రాజకీయ పార్టీల నిరసనలు నిత్యకృత్యమయ్యాయని వివరించారు. వినతిపత్రం, నేతల వాదనల్లో ముఖ్యాంశాలు... + డిపెండబిలిటీని 75% నుంచి 65 శాతానికి తగ్గించడం అంతర్జాతీయ, జాతీయ నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఈ నిర్ణయం దేశంలోని అన్ని ప్రాజెక్టులనూ ప్రభావితం చేస్తుంది. విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి. + కేంద్ర జలసంఘం ప్రాజెక్టులన్నింటినీ 75% డిపెండబిలిటీ ఆధారంగానే క్లియర్ చేస్తోంది. ప్రస్తుతమిది జాతీ య నిబంధనగా ఉంది. దేశంలోని మరే ఇతర ట్రిబ్యునల్ నదీజలాలను భిన్న డిపెండబిలిటీల వద్ద పంచలేదు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అన్ని నదీ జలాల పంపకాల విషయంలోనూ వివాదాలను సృష్టిస్తుంది. + బచావత్ ట్రిబ్యునల్ మిగులు జలాలపై పూర్తి హక్కును అత్యంత దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తే బ్రిజేశ్ ట్రిబ్యునల్ వాటిని మూడు రాష్ట్రాలకు పంచింది. మిగులు జలాలపై పూర్తి హక్కులు ఎప్పుడైనా సరే అత్యంత కింది రాష్ట్రానికే చెందుతాయి. దీన్ని తోసిరాజని ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు రాష్ట్రంలోని తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లోని ఆరు ప్రాజెక్టులపై పెను ప్రభావం చూపుతుంది. మిగులు జలాలపై ఆధారపడి చేపట్టిన ఆరు ప్రాజెక్టులకు నీళ్లు కరువయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఈ రెండు ప్రాంతాల్లోని ఆయకట్టు మొత్తం ఎడారిగా మారుతుంది. కృష్ణానది ప్రవాహానికున్న విచిత్ర స్వభావం రీత్యా వరదలు, కరువు.. తరచూ తలెత్తే ప్రకృతి విపత్తులుగా మారాయి. మిగులు జలాలను కుదించడంతో రాష్ట్ర రైతులకున్న అవకాశాలు మృగ్యమై పంటల పరిస్థితి అగమ్యగోచరమైంది. రాష్ట్ర ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసే ఈ నిర్ణయం అత్యంత ఆందోళన కలిగిస్తోన్న అంశం. + నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ తదితర ప్రాజెక్టులకు 70 టీఎంసీల మేరకు నీటిని కేటాయించాలని కోరినప్పటికీ ఒక్క టీఎంసీని సైతం కేటాయించకపోవడం శోచనీయం. నల్లగొండ, మహబూబ్‌నగర్, ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు తాగు, సాగునీరు అందించే ప్రాజెక్టులకు ట్రిబ్యునల్ తీర్పు శరాఘాతమే. ఆయా ప్రాజెక్టులపై చేసిన వ్యయమంతా ఇప్పుడు వృథా కానుంది. + డిపెండబిలిటీల ఆధారంగా నీటిని పంచడంతో ప్రాజెక్టుల నిర్వహణ దుస్సాధ్యమవుతుంది. ఈ పంపిణీ విధానం ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ అనేక సమస్యలకు దారితీస్తుంది. ప్రాజెక్టుల ఆపరేషన్ షెడ్యూలును ఈ పంపిణీ విధానం దుర్లభం చేస్తుంది. ఫలితంగా ప్రాంతీయ, అంతర్ ప్రాంతీయ అసంతృప్తులు, వివాదాలు తలెత్తుతాయి. + {బిజేశ్ ట్రిబ్యునల్ అపరిష్కృత అంశాలను పరిష్కరించాల్సిందిపోయి ఇప్పటికే పరిష్కారమై ఉన్న అంశాలను కూడా తిరగదోడి అపరిష్కృత జాబితాలోకి నెట్టింది. సీమ సమస్యలతో ఇంప్లీడ్ పిటిషన్ రాయలసీమ అభివృద్ధి, హక్కుల ఫోరం నిర్ణయం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసే పిటిషన్లో రాయలసీమ సమస్యలను ప్రత్యేకంగా పేర్కొంటూ ఇంప్లీడ్ కావాలని రాయలసీమ అభివృద్ధి, హక్కుల ఫోరం నిర్ణయించింది. ఈ మేరకు దాఖలు చేసే పిటిషన్లో రాజకీయ పార్టీలకతీతంగా సీమ ప్రాంతంలోని అందరి ప్రజా ప్రతినిధుల సంతకాలను సేకరించాలని తీర్మానించారు. సీమ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ మిగలుజలాల మీదే ఆధారపడి ఉన్నాయనే విషయాన్ని, తీర్పు కారణంగా ఆ ప్రాంతానికి జరిగే నష్టాన్ని పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఫోరం ఆధ్వర్యంలో రాయలసీమ ప్రాంత ప్రజా ప్రతినిధుల సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. మంత్రి సి.రామచంద్రయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, బీజేపీ నాయకురాలు శాంతారెడ్డి హాజరయ్యారు. ఫోరం నేతలు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి, ఎస్. రమణయ్య, వై.నాగిరెడ్డి, బొజ్జా దశరథ రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం తర్వాత ఫోరం నేత చంద్రశేఖరరెడ్డి మాట్లాడారు. ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అపాయింట్మెంట్ కోరుతున్నట్టు తెలిపారు. అపాయింట్మెంట్ దొరికితే హైదరాబాద్‌లోనే కలుస్తామన్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో పాటు వివిధ జాతీయ పార్టీల నేతలను కలిసి తమ ప్రాంత వెనుకబాటుతనం గురించి వివరిస్తామని చెప్పారు. -
బిజేశ్ తీర్పుపై నేడు ప్రధానితో అఖిలపక్షం భేటీ
-
బిజేశ్ తీర్పుపై నేడు ప్రధానితో అఖిలపక్షం భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి అన్యాయం జరిగేలా కృష్ణా జలాలపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అమలును నిలిపేయాలని కోరేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష ప్రతినిధి బృందం శుక్రవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీకానుంది. ఈ మేరకు పలువురు కాంగ్రెస్ మంత్రులు, వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, బీజేపీ నేతలు గురువారమే హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. వీరందరూ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆయన నివాసంలో కలుస్తారు. ఢిల్లీకి వెళ్లిన వారిలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మరో ముగ్గురు మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటే శ్వర్లు, ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, టీడీపీ నుంచి కోడెల శివప్రసాదరావు, రావుల చంద్రశేఖరరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, శాసనసభాపక్ష నాయకుడు గుండా మల్లేశ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, శాసనసభాపక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి, బీజేపీ నేత, మా జీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, పార్టీ నేత ప్రొఫెసర్ శేషగిరిరావు తదితరులున్నారు. రాష్ట్రానికి కృష్ణా నీటిని కేటాయించే విషయంలో ట్రిబ్యునల్ వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోలేదనే అంశాన్ని ప్రధాని దృష్టికి తెస్తామని, శుక్రవారం ఉదయం 10 గంటలకు అన్ని పక్షాల నేతలతో మన్మోహన్సింగ్ను కలుస్తామని నాగిరెడ్డి తెలిపా రు. మిగులు జలాల కేటాయింపు సక్రమంగా లేదని, ఈ విషయాన్నే ప్రధాని దృష్టికి తీసుకువస్తామని జూలకంటి చెప్పారు. మిగులు జలాల ఆధారంగా నిర్మించే ప్రాజెక్టుల భవిష్యత్‌ను ఏమి చేస్తారనేదాన్ని ప్రశ్నిస్తామని గుండా మల్లేశ్ తెలిపారు. -
అన్ని పార్టీల నేతలు సమైక్యాంధ్ర ఎజెండాగా ఉద్యమించాలి
రాష్ట్ర విభజనపై అన్ని పార్టీలు ఒకే మాట మీద నిలబడితే సమైక్యాంధ్ర సాధ్యమని సీమాంధ్ర సచివాలయ ఉద్యోగస్థుల ఫోరం అధ్యక్షడు మురళీకృష్ణ వెల్లడించారు. ఆదివారం ఆయన ప్రకాశంజిల్లా ముఖ్య కేంద్రం ఒంగోలు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. అన్ని పార్టీల నేతలు జెండాలను పక్కన పెట్టి సమైక్యాంధ్ర ఎజెండాగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆరు కోట్ల సీమాంధ్ర తెలుగు ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం గుడ్డిగా వ్యవహారించిందని మురళీకృష్ణ ఆక్షేపించారు.