
'ఇబ్రహీంపట్నంను జిల్లా కేంద్రం చేయండి'
ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం ఆందోళనకు దిగారు. బెంగుళూరు చౌరస్తా వద్ద వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రాస్తారోకోకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నాయకులను అడ్డుకున్నారు. ఇబ్రహీపట్నాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు వారిని శాంతపరచి... రహదారిపై నిలిచిన వాహనాలను పునరుద్ధరించారు.