
‘‘అన్నా ఎప్పుడొస్తున్నవే..? మన ప్రచారం ఎప్పుడు షురువైతది.. మన అనుచరులు ఒక్కొక్కరు ఇంకో పార్టీ వైపు వెళుతున్నరు..’’ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగాలని భావిస్తున్న ఓ నేతకు గ్రామాల్లోని వారి అనుచరవర్గం నుంచి వస్తున్న ఒత్తిడి ఇది. టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాల్లో మునిగితేలుతున్న కాంగ్రెస్ పార్టీ ఆశావహులు ఇప్పుడు గ్రామాల్లో కేడర్‌ను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఇటు టికెట్ ప్రయత్నాల్లో మునిగి తేలుతూనే.. గ్రామాల్లోని తమ అనుచరవర్గం ప్రత్యర్థి పార్టీ వైపు వెళ్లకుండా తంటాలు పడుతున్నారు.
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ఉమ్మడి జిల్లాలో కేవలం మూడు నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విష యంలో స్పష్టత వచ్చింది. బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గాలు మినహాయిస్తే.. మిగిలిన ఆరు చోట్ల అభ్యర్థులెవరో ఇంకా తేలలేదు. దీంతో ఈ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారానికి శ్రీకారం చుట్టలేదు. మరోవైపు టీఆర్‌ఎస్ అభ్యర్థులు మొత్తం తొమ్మిది నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాలు, డివిజన్లను చుట్టి వస్తున్నారు. రోజుకు రెండు, మూడు గ్రామాల చొప్పున తిరిగి ప్రచారాన్ని ము మ్మరం చేశారు.
ఇప్పటి వరకు ఆయా గ్రా మాలకు చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూనే., మరో మారు అవకాశం కల్పిస్తే.. చేయనున్న అభివృద్ధి పనులపై హామీలు ఇస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టోలోని అంశాలను క్షేత్ర స్థాయి లోని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటి ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో ఇటు కాంగ్రెస్ అభ్యర్థుల హడావుడి కనిపించకపోవడం తో వారి అనుచరులు నిరుత్సాహానికి గురవుతున్నారు. రెండు, మూడు రోజుల్లో టికెట్ ఖరారవుతుందని.. వెంటనే గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేద్దామని నేతలు కేడర్‌కు సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పొత్తు స్థానాలపై మరింత అయోమయం..
మహాకూటమి పొత్తులో భాగంగా జిల్లాలో రెండు, మూడు స్థానాలను భాగస్వామ్య పక్షాలు ఆశిస్తున్నాయి. బాల్కొండ, నిజామాబాద్ రూరల్ స్థానాలపై టీడీపీ కన్నేయగా, ఎల్లారెడ్డి స్థానాన్ని టీజేఎస్ ఆశిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ మూడింటిలో కనీసం ఒక స్థానం కూటమిలోని పార్టీకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కేడర్‌లో అయోమయం నెలకొంది. తమ నేతకే టికెట్ దక్కుతుందా? తీరా ఈ స్థానం టీడీపీకి గానీ, టీజేఎస్‌కు గానీ కేటాయిస్తే మన పరిస్థితి ఏంటని కాంగ్రెస్ నేతల అనుచరులు అయోమయానికి గురవుతున్నారు. ఈ స్థానాల్లో కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్న నేతలు తమకే టికెట్ వస్తుందని, టీడీపీ, టీజేఎస్‌కు కేటాయించే అవకాశాలు లేవంటూ సర్ది చెప్పుకుంటున్నారు. కేడర్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇద్దరు, ముగ్గురు ఆశావహులున్న చోట..
ఆయా నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు నేతలు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఒక్కో గ్రామాల్లో రెండు మూడు వర్గాలుగా కాంగ్రెస్ శ్రేణలు విడిపోయాయి. ఈ ఇద్దరు, ము గ్గురు నేతల్లో టికెట్ ఎవరి వరిస్తుందోననే అయోమయం వారి వారి అనుచరుల్లో నెలకొంది. టికెట్ ఆశిస్తున్న ఇద్దరు నేతలు కూడా తమదే టికెట్ అంటూ ధీమా వ్యక్తం చేస్తూ కా ర్యకర్తలు, అనుచరులను కాపాడుకునేందుకు తంటాలు ప డుతున్నారు. అభ్యర్థుల ప్రకటన వరకు కాంగ్రెస్‌లో ఈ అ యోమయం కొనసాగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment