అనంతపురం కల్చరల్ : కొత్తూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గోపా మచ్చా నరసింహులు నేతృత్వంలో గాంధీ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక టవర్‌క్లాక్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహానికి పూలమాలలు పలువురు రాజకీయ పార్టీల నేతలు నివాళులర్పించారు. అనంతరం నిరుపేద మహిళలకు నూతన వస్త్రాలనందించారు.
అలాగే అమ్మవారిశాలలో జరిగిన సన్మాన కార్యక్రమంలో అన్ని పార్టీల వారు ఒకే వేదికపై సందడి చేశారు. ఎంపీ దివాకరరెడ్డి, మేయర్ స్వరూప, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి, చవ్వా రాజశేఖరరెడ్డి తదితరులను ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు సత్కరించారు.
అలాగే పాతూరు అమ్మవారి శాల, హరిశ్చంద్ర ఘాట్, యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తాడిపత్రి బస్టాండు సమీపంలోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం కన్యకా పరమేశ్వరి ఆలయం అధ్యక్షులు ముత్యాల రంగయ్య నేతృత్వంలో 500 మంది పేదలకు వస్త్రదానం చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సేవా కార్యక్రమాలతో మహాత్ముడికి నీరాజనం
Published Mon, Oct 3 2016 12:23 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement