గాంధీ ‘బంధీ’
కలెక్టర్ కార్యాలయం ముందుభాగంలో ఉన్న ఐలాండ్‌లో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటుకు గ్రహణం వీడలేదు. దీంతో మహాత్ముని విగ్రహం జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్ చాంబర్ వెనుక గదిలో బంధీగా ఉండిపోయింది. రెండేళ్ల కిందట ఇస్కాన్ మందిరం వారు అందజేసిన ఈ విగ్రహాన్ని ఐలాండ్‌లో ఏర్పాటు చేయడానికి ఖజానా శాఖ అధికారులు అప్పట్లో అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. ఖజానాకు ఎదురుగా నంది విగ్రహం ఉందని, దానికి అడ్డుగా విగ్రహం ఉంచడం సరికాదని చెప్పడంతో ఏర్పాటు చేయలేదని సమాచారం. ఇక అప్పటి నుంచి విగ్రహం గదికే పరిమితం అయ్యింది. ఆ తరువాత విగ్రహం ఏర్పాటు అంశం పూర్తిగా మరుగునపడింది.