∙అఖిలపక్ష నాయకులు
అనంతపురం సప్తగిరి సర్కిల్: హెచ్చెల్సీకి నీటి కేటాయింపు అన్నది రైతులు సాధించిన నైతిక విజయమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి శరత్‌చంద్రారెడ్డి, ౖరైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకటచౌదరి, ఏపీసీసీ అధికార ప్రతినిధి రమణ తెలిపారు. సోమవారం వారు స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. అఖిలపక్ష నాయకులు, రైతులు ఎగువపల్లి వద్ద నిర్వహించిన డీఈ కార్యాలయ ముట్టడిపై అధికారులు స్పందించారన్నారు.
ఈ నెల 16 నుంచి జనవరి 31 వరకు నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారని వారు తెలిపారు. జిల్లాలో కరువును రూపుమాపేందుకు ఉన్నతా«ధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రైతులకు, అఖిలపక్ష నాయకులకు, వివిధ శాఖల అ«ధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. సీపీఐ రైతు సంఘం కార్యదర్శి కాటమయ్య, రైతు సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
హెచ్చెల్సీకి నీటి సాధన రైతుల విజయం
Published Mon, Nov 7 2016 11:47 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement