statements
-
సంధ్య థియేటర్ ఘటనపై కీలకం కానున్న అల్లు అర్జున్ స్టేట్ మెంట్
-
ఆధారాల్లేకుండా అరెస్టులా?
సాక్షి, అమరావతి : పోలీసులు ఆయా కేసుల్లో నిందితులు ఇచ్చే వాంగ్మూలాలను సాక్ష్యంగా పరిగణించాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కేసుల దర్యాప్తు విషయంలో రాష్ట్ర వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని తెలిపింది. వాంగ్మూలాలను అడ్డం పెట్టుకుని నిందితులను నెలల తరబడి జైళ్లలో ఉంచాలంటే సాధ్యం కాదని తేల్చి చెప్పింది. వాంగ్మూలాలను సాక్ష్యాలుగా పరిగణించాలన్న ప్రభుత్వ వాదనను సైతం తోసిపుచ్చుతున్నట్లు తెలిపింది. ఈ వాదనతో ఏ మాత్రం ఏకీభవించలేమంది. సహ నిందితుల వాంగ్మూలాలను తమను (కోర్టులను) కూడా పరిగణనలోకి తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారని, ఇది ఎంత మాత్రం సాధ్యం కాని పని అని స్పష్టం చేసింది. ఆధారాలు సేకరించకుండా వాంగ్మూలాలపై ఆధార పడాలంటే ఎలా? అంటూ పోలీసులపై అసహనం వ్యక్తం చేసింది. వాంగ్మూలాల ఆధారంగా ఇతరులను నిందితులుగా చేర్చి, అరెస్ట్ చేస్తున్న పోలీసులు.. ఆ తర్వాత ఎలాంటి దర్యాప్తు చేయకుండా, ఎలాంటి ఆధారాలు సేకరించకుండా నెలల తరబడి నిందితులను జైళ్లలో ఉంచుతున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. వాంగ్మూలాలు కేవలం దర్యాప్తునకు ఓ దారి చూపుతాయే తప్ప, వాటిని సాక్ష్యంగా తీసుకోజాలమంది. దర్యాప్తు చేయనప్పుడు నిందితులను జైళ్లలో ఉంచడం అనవసరమంది. వాళ్లను ఊరికే జైళ్లలో ఉంచి, ప్రజల డబ్బును ఎందుకు వృథా చేస్తున్నారని ప్రశ్నించింది. పేపర్ ఖాళీగా ఉందని వాంగ్మూలాల పేరుతో ఏది పడితే అది రాసేస్తామంటే ఎలా అంటూ నిలదీసింది. వాంగ్మూలాలను చూస్తుంటే నిందితులంతా రాష్ట్రానికి విశ్వాస పాత్రులుగా కనిపిస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేనప్పుడు ఏ కారణంతో బెయిల్ ఇవ్వొద్దని కోర్టులను కోరుతారని పోలీసులను నిలదీసింది. చాలా కేసుల్లో ఇంతే.. ఆయా కేసుల్లో రాష్ట్రం తీరు ఎంత మాత్రం సరిగా లేదని హైకోర్టు స్పష్టం చేసింది. బెయిల్ పిటిషన్ల విషయంలో రాష్ట్రం చాలా రొటీన్‌గా వ్యవహరిస్తోందని, దీంతో హైకోర్టులో పుంఖాను పుంఖాలుగా బెయిల్ పిటిషన్లు దాఖలవుతున్నాయని తెలిపింది. వీటి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నో వందల కిలోమీటర్ల నుంచి న్యాయం కోసం ఎంతో మంది హైకోర్టును ఆశ్రయిస్తున్నారని చెప్పింది. వీళ్లంతా నవ్వులాటకు ఈ బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని అనుకుంటున్నారా? అంటూ తీవ్ర స్వరంతో పోలీసులను ప్రశి్నంచింది. గంజాయి కేసులో విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం ఒడ్డిమిట్ట గ్రామం వద్ద పట్టుబడిన లారీ డ్రైవర్ వాంగ్మూలం ఆధారంగా హనుమంతరావు అనే వ్యక్తిని నిందితునిగా చేర్చి, అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలను సేకరించకుండా అతన్ని నాలుగు నెలలుగా జైల్లో ఉంచడంపై మండి పడింది. అతనికి బెయిల్ ఇవ్వొద్దని కోరడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. హనుమంతరావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హనుమంతరావు నుంచి ఎలాంటి గంజాయిని స్వాదీనం చేసుకోలేదని తెలిపింది. అతనికి వ్యతిరేకంగా పోలీసులు ఒక్క కాగితం ముక్కను కూడా ఆధారంగా చూపలేకపోయారని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ రాష్ట్రం తీరును తీవ్రంగా గర్హించారు. పీపీ వాదనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ దానిని తన ఉత్తర్వుల్లో రికార్డ్ చేశారు. -
మనీలాండరింగ్ కేసైనా బెయిల్ ఇవ్వాల్సిందే : సుప్రీం కోర్టు
ఢిల్లీ: మనీలాండరింగ్ కేసుల్లోను బెయిల్ అనేది ఒక రూల్ అని, జైలు మినహాయింపుగానే ఉండాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. బుధవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అనుచరుడి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మనీలాండరింగ్ కేసులో కస్టడీలో ఉన్నప్పుడు నిందితుడు దర్యాప్తు అధికారికి ఇచ్చిన నేరారోపణ ప్రకటన సాక్ష్యంగా అంగీకరించేందుకు వీలుకాదని పేర్కొంది. మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అనుచరుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రేమ్ ప్రకాష్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.మనీష్ సిసోడియా బెయిల్ తీర్పు విషయంలో కూడా.. పీఎంఎల్ఎ (మనీలాండరింగ్ నిరోధక చట్టం)లో బెయిల్ ఒక నియమం, జైలు మినహాయింపు అని తాము చెప్పినట్లు జస్టిస్ బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం గుర్తు చేసింది.ఇక.. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో నిందితురాలు కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన మరుసటి రోజు ప్రేమ్ ప్రశాష్ బెయిల్ మంజూరు అయింది. మరోవైపు.. ఈ నెల ప్రారంభంలో మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు కూడా సుప్రీం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. -
సనాతన దినోత్సవంగా సెప్టెంబర్ 3
న్యూయార్క్: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ నేత ప్రియాంక ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. అయితే.. భారత్‌లో సనాతన ధర్మంపై ఇలాంటి వివాదాస్పద పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికాలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 3ని సనాతన ధర్మ దినోత్సవంగా జరుపుకోవాలని కెంటకీలోని లూయిస్విల్లే నగర మేయర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేశారు. US city declares September 3 as Sanatana Dharma Day https://t.co/YCCgNFK5Q9 — IndiaToday (@IndiaToday) September 6, 2023 లూయిస్‌విల్లేలోని హిందూ దేవాలయంలో జరిగిన మహా కుంభాభిషేకం వేడుకలో డిప్యూటీ మేయర్ బార్బరా సెక్స్టన్ స్మిత్ అధికారిక ప్రకటనను అందరికి చదివి వినిపించారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 3న సనాతన ధర్మం రోజుగా జరుపుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువులు చిదానంద సరస్వతి, పరమార్థ నికేతన్ అధ్యక్షుడు రిషికేశ్, శ్రీశ్రీ రవిశంకర్, భగవతీ సరస్వతి, లెఫ్టినెంట్ గవర్నర్ జాక్వెలిన్ కోల్మన్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కైషా డోర్సీ, పలువురు ఆధ్యాత్మిక నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సనాతన ధర్మంపై డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా, కరోనా వంటి రోగాలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడం కాదు.. పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. ఈ పరిణామాల అనంతరం కర్ణాటక నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీనిపై సనాతనీయుల మారణహోమానికి పిలుపునిస్తున్నారని బీజేపీ ఆరోపించడంతో దేశస్థాయిలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. ఇదీ చదవండి: మరో వివాదం: ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ 'భారత్' వంతు -
జనం అసలే మన దగ్గరకు రావడం లేదు.. మధ్యలో ఈ స్టేట్మెంట్లొకటి..!
జనం అసలే మన దగ్గరకు రావడం లేదు.. మధ్యలో ఈ స్టేట్మెంట్లొకటి..! -
చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే: మంత్రి అంబటి
సాక్షి, అమరావతి :శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల నుంచే కృష్ణా జలాలను తరలించేలా 2015లో అనుమతి లేకుండా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టి, కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రాయలసీమ రైతుల హక్కుల ప్రయోజనాలను తెలంగాణ సర్కారు కాలరాస్తుంటే నాటి సీఎం, నేటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నోరెత్తలేదని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబేనని నిప్పులు చెరిగారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి తెలంగాణ సర్కార్‌కు రాయలసీమ రైతుల హక్కులను తాకట్టు పెట్టిన చంద్రబాబుకు సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే నైతిక హక్కే లేదన్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులపై మంగళ, బుధవారాల్లో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలు, అవాస్తవాలేనని తిప్పికొట్టారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేసిన పోలవరం కుడి కాలువలోకి పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా చెంబుడు గోదావరి జలాలను ఎత్తిపోసి.. గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేసినట్లు చంద్రబాబు చంకలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గత నాలుగేళ్లలో పట్టిసీమ ఎత్తిపోతల పంపులను పది రోజులు కూడా నడిపించలేదని.. అదో వృథా ఎత్తిపోతల అని చెప్పారు. అలాంటి దానికి చంద్రబాబు రూ.2,047 కోట్లు ఖర్చు చేశారన్నారు. దాన్ని గడువులోగా పూర్తి చేసినందుకు కాంట్రాక్టర్‌కు బహుమానంగా రూ.257 కోట్లను ఇచ్చినట్లు చూపి గుటకాయ స్వాహా చేశారని ఎత్తిచూపారు. గోదావరి కుడిగట్టుపై పర్యావరణ అనుమతి తీసుకోకుండా రూ.1,697 కోట్లు వ్యయం చేసి.. పురుషోత్తపట్నం ఎత్తిపోతలను నిర్మించిన చంద్రబాబు.. దాని ద్వారా ఒక్క ఎకరాకూ నీళ్లందించలేదని గుర్తు చేశారు. ఆ ఎత్తిపోతలపై కూడా టీడీపీ నేతలు ఎన్జీటీలో కేసులు వేయడంతో పనికి రాకుండా పోయిందన్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పేరుతో రూ.3,744 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిన చంద్రబాబు ప్రజాద్రోహి అని ధ్వజమెత్తారు. మీడియాతో మంత్రి అంబటి ఇంకా ఏం చెప్పారంటే.. రూ.68 వేల కోట్లు తినేశానని చెప్పుకో టచంద్రబాబు, కరవు కవల పిల్లలు. 2014–19 మధ్య టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు ఏటా సగటున 300 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక.. సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రం సుభిక్షంగా మారింది. ♦ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు 54. కానీ.. 198 ప్రాజెక్టులను ప్రీక్లోజర్ చేసినట్లు చంద్రబాబు చెబుతున్నాడు. 198 ప్రాజెక్టులు కాదు.. ప్యాకేజీలు. ప్రాజెక్టులకూ ప్యాకేజీలకు తేడా తెలియదా బాబూ? దశాబ్దాల క్రితం చేపట్టిన ప్రాజెక్టుల పనుల్లో సులభంగా ఉండే పనులు చేసి, క్లిష్టమైన పనులు చేయకుండా కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. దాంతో వాటిని ప్రీక్లోజ్ చేసి, ప్రభుత్వ అనుమతితో వాటికి మళ్లీ టెండర్లు పిలిచి.. పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే, వాటిని ఆపేశారని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. ♦ ప్రాజెక్టులపై 2014–19 మధ్య రూ.68,293.94 కోట్లు ఖర్చు చేసిన టీడీపీ సర్కార్.. కేవలం 3.4 లక్షల ఎకరాల పాత, కొత్త ఆయకట్టుకు మాత్రమే నీళ్లందించగలిగింది. 2019 మే 30 నుంచి ఇప్పటి వరకు సాగునీటి ప్రాజెక్టులపై రూ.27,394 కోట్లు వ్యయం చేసి, 5.03 లక్షల ఎకరాలకు నీళ్లందించాం. దీన్ని బట్టి ప్రాజెక్టు పనుల పేరుతో చంద్రబాబు వేలాది కోట్ల రూపాయలను దోచేసినట్లు స్పష్టమవుతోంది. ♦ పోలవరం ప్రాజెక్టుకు వ్యయం చేసిన రూ.10,860 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేసింది. నీరు–చెట్టు పేరుతో రూ.12,400 కోట్లను టీడీపీ నేతలకు చంద్రబాబు దోచిపెట్టారు. ప్రాజెక్టులపై రూ.68,293 కోట్లను వ్యయం చేశామని కాకుండా తిన్నామని చంద్రబాబు చెప్పుకుంటే సరిపోతుంది. ప్రాజెక్టులకూ వెన్నుపోటు ♦ ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు చెబుతున్నట్లు ఎన్టీఆర్ డిజైన్ చేసిన తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవాలను 1995 నుంచి 2004 వరకు చేపట్టకుండా రాయలసీమ ప్రజలకూ వెన్నుపోటు పొడిచారు. ♦ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచి.. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా చేపట్టాలని రాయలసీమలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేశారు. అప్పట్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచాలని.. ఆ ప్రాజెక్టుల పనులు ప్రారంభించాలని ఎన్టీఆర్‌ను ఎప్పుడైనా కోరావా చంద్రబాబూ? ♦ 2004లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. సముద్రం పాలవుతోన్న నదీ జలాలను మళ్లించి, రాష్ట్రాన్ని సుభిక్షం చేయడమే లక్ష్యంగా జలయజ్ఞం కింద ప్రాజెక్టులు చేపట్టారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచడంతోపాటు గాలేరు–నగరి, హంద్రీ–నీవాలను చేపట్టి సింహభాగం పూర్తి చేశారు. తెలుగుగంగ, ఎస్సార్బీసీలను సింహభాగం పూర్తి చేశారు. ♦ పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచడం ద్వారా రాయలసీమకు మహానేత వైఎస్ న్యాయం చేస్తుంటే.. దాన్ని నిరసిస్తూ మహబూబ్‌నగర్‌లో నాగంతో విజయవాడలో దేవినేని ఉమాతో ధర్నాలు చేయించిన చంద్రబాబును రాయలసీమ ద్రోహి అనక ఇంకేమనాలి? నాలుగేళ్లుగా సువర్ణ అధ్యాయం ♦ మహానేత వైఎస్సార్ జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులను ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ పూర్తి చేస్తూ జాతికి అంకితం చేస్తున్నారు. పెన్నా బ్యారేజ్, సంగం బ్యారేజ్‌లను జాతికి అంకితం చేయడం ద్వారా చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని సీఎం వైఎస్ జగన్ లిఖించారు. ఆ బ్యారేజ్‌లను పూర్తి చేశానని చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదా చంద్రబాబూ? ♦ గండికోట నిర్వాసితులకు సీఎం వైఎస్ జగన్ పునరావాసం కల్పించడంతో పూర్తి స్థాయిలో 26.85 టీఎంసీలను నిల్వ చేస్తున్నాం. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10 టీఎంసీలు నిల్వ చేస్తున్నాం. సోమశిల, కండలేరులలోనూ పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశాం. తెలుగుగంగ కెనాల్‌ను ఆధునికీకరించడం ద్వారా ప్రవాహ సామర్థ్యాన్ని పెంచి.. వెలిగోడు, బ్రహ్మంసాగర్ రిజర్వాయర్లను సకాలంలో నింపి.. ఆయకట్టుకు నీళ్లందిస్తున్నాం. బ్రహ్మంసాగర్ మట్టికట్ట, లీకేజీలకు అడ్డు్డకట్ట కూడా వేయలేక చంద్రబాబు చేతులెత్తేశారు. సీఎం వైఎస్ జగన్ డయాఫ్రమ్ వాల్ నిర్మించి ఆ ప్రాజెక్టులో 17.85 టీఎంసీల నిల్వకు మార్గం సుగమం చేశారు. ♦ గాలేరు–నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగాన్ని పూర్తి చేశాం. ఇప్పుడు 20 వేల క్యూసెక్కులను ఆ కాలువ ద్వారా తరలిస్తాం. వెలిగొండ, వంశధార స్టేజ్–2 ఫేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం సహా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ♦ అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే 30–40 రోజుల్లోనే దాన్ని ఒడిసిపట్టి రాయలసీమ ప్రాజెక్టులను నింపేలా రూ.40,880 కోట్లతో రాయలసీమ కరవు నివారణ ప్రణాళిక కింద కాలువల సామర్థ్యం పెంచడం, రిజర్వాయర్ల నిర్మాణాన్ని సీఎం వైఎస్ జగన్ చేపట్టారు. ♦ శ్రీశైలంలో 800 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉన్నప్పుడు కూడా కేటాయింపుల మేరకు రాయలసీమకు జలాలను తరలించడానికి వీలుగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కాలువలోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా సీఎం వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టి ఆ ప్రాంతానికి న్యాయం చేస్తున్నారు. దీనిపై ఎన్జీటీలో కేసులు వేయించి ఆ ప్రాంతానికి చంద్రబాబు ద్రోహం చేస్తున్నారు. ఆవులపల్లి, ముదివేడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్ల నిర్మాణంపై కూడా టీడీపీ నేతలతో ఎన్జీటీలో కేసులు వేయించడం ద్వారా వాటిని అడ్డుకుని రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. బాబూ.. ఈ ప్రశ్నలకు బదులివ్వు ప్రాజెక్టు ప్రొటోకాల్స్‌ను తుంగలో తొక్కి.. సులభంగా చేయగలిగి, అధికంగా లాభాలు వచ్చే పనులే చేపట్టి, కమీషన్లు కాజేసిన చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులను అస్తవ్యస్తంగా మార్చి.. రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం పోలవరమే. శుక్రవారం పోలవరంపై మాట్లాడతానని చెప్పిన చంద్రబాబుకు సిగ్గు, లజ్జా, చీము, నెత్తురు ఉంటే ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాకే పోలవరంపై మాట్లాడు. 1.విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ఎందుకు తీసుకున్నావు? 2.కాఫర్ డ్యామ్‌లు నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్‌ను ఎందుకు నిర్మించావు? 3.పోలవరాన్ని 2018 నాటికే పూర్తి చేస్తానని శాసనసభలో శపథం చేసి.. ఎందుకు పూర్తి చేయలేకపోయావు? ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పగలవా? దాదాపు 30 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకెళ్లలేని చంద్రబాబుకు సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హతే లేదు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు.. నువ్వే డిజైన్ చేసి, టెండర్లు పిలిచి, పూర్తి చేసి, జాతికి అంకితం చేసిన ఒక్క ప్రాజెక్టు అయినా ఉందా? మహానేత వైఎస్సార్ ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞం కింద ఒకేసారి రూ.లక్ష కోట్ల వ్యయంతో 84 ప్రాజెక్టులు చేపట్టి 2009 నాటికే 23 ప్రాజెక్టులు పూర్తి చేశారు. మిగిలిన ప్రాజెక్టులను సీఎం వైఎస్ జగన్ పూర్తి చేస్తూ.. జాతికి అంకితం చేస్తూ.. రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తుండటం కన్పించడం లేదా చంద్రబాబూ? ఇదీ చదవండి: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు జమ చేసిన సీఎం జగన్ -
బ్యాంకుల ఎస్ఎఫ్టీ నివేదికల్లో వైరుధ్యాలు
న్యూఢిల్లీ: అధిక విలువ కలిగిన లావాదేవీలకు సంబంధించి కొన్ని బ్యాంకులు సమరి్పంచిన ‘స్టేట్మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ (ఎస్ఎఫ్టీ)’ విషయంలో వైరుధ్యాలు ఉన్నట్టు ఆదాయన్ను శాఖ గుర్తించింది. ఆదాయపన్ను శాఖ నిర్ధేశించిన లావాదేవీల వివరాలను ఎస్ఎఫ్టీ కింద ఏటా బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్, వివిధ సంస్థలు ఆదాయపన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్ఎఫ్టీని మే 31 నాటికి దాఖలు చేయాలి. ఫారెక్స్ డీలర్లు, బ్యాంక్‌లు, సబ్ రిజి్రస్టార్, ఎన్బీఎఫ్సీ, పోస్టాఫీసులు, బాండ్లు/డిబెంచర్లు జారీ చేసిన సంస్థలు, మ్యూచువల్ ఫండ్ ట్రస్టీలు, షేర్ల బైబ్యాక్ చేసిన కంపెనీలు, డివిడెండ్ చెల్లించిన కంపెనీలు ఎస్ఎఫ్టీ పరిధిలోకి వస్తాయి. తమిళనాడుకు చెందిన ప్రముఖ బ్యాంక్ నివేదించిన ఎఫ్ఎఫ్టీలో వ్యత్యాసాలను గుర్తించినట్టు ఆదాయపన్ను శాఖ అత్యున్నత విభాగం సీబీడీటీ ప్రకటించింది. కొన్ని లావాదేవీలను అసలుకే వెల్లడించకపోగా, కొన్ని లావాదేవీల సమాచారం కచి్చతంగా పేర్కొనలేదని వెల్లడించింది. ఉత్తరాఖండ్‌లో రెండు కోపరేటివ్ బ్యాంకుల్లో తనిఖీలు నిర్వహించగా, వేలాది కోట్ల రూపాయల లావాదేవీలను రిపోర్ట్ చేయాలేదని బయటపడినట్టు తెలిపింది. వివిధ సంస్థలు ఎస్ఎఫ్టీ ద్వారా ఆదాయపన్ను శాఖకు వివరాలు తెలియజేస్తే.. ఆయా సమాచారాన్ని పన్ను చెల్లింపుదారుల వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో చేరుస్తారు. దీంతో పన్ను చెల్లింపుదారులు తమ ఏఐఎస్‌ను పరిశీలించుకుని రిటర్నులు దాఖలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎస్ఎఫ్టీల్లో వ్యత్యాసాలు గుర్తించినట్టు ప్రకటించిన సీబీడీటీ, తీసుకున్న చర్యలపై సమాచారం తెలియజేయలేదు. -
ఎయిర్ ఇండియా ఘటన: పశ్చాత్తాపం లేకుండా ఆరోపణలా!
ఎయిర్ ఇండియా మూత్ర విసర్జన ఘటనలో నిందితుడు శంకర్ మిశ్రా మాటమార్చి బాధితురాలిపైనే సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సదరు వృద్ధ మహిళ ఆ వ్యాఖ్యలకు స్పందించి..అవన్నీ కల్పితాలంటూ కొట్టిపారేసింది. తాను చేసిన అనుచిత పనికి పశ్చాత్తాపం చెందకుండా తనపైనే ఆరోపణలా అంటూ మిశ్రాపై సీరియస్ అయ్యారు. తనకు ఎదురైన భయంకరమైన అనుభవం ఏ వ్యక్తి కూడా అనుభవించకుండా ఉండేలా సంస్థాగత మార్పులు జరిగేలా చూడటమే తన ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. తాను చేసిన అసహ్యకరమైన పనికి సిగ్గుపడకుండా తనపైన అసత్య ఆరోపణలు చేసి మరింత వేధిస్తున్నాడని వాపోయారు. కాగా నవంబర్ 26న ఎయిర్ ఇండియాలో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన ఘటన సదరు బాధిత మహిళ ఫిర్యాదుతో చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నిందితుడిని అరెస్టు చేయడం, కోర్టు నోటీసులు జారీ చేయడం తదితరాలు జరిగాయి. అంతేగాదు కోర్టు అతని కస్టడీని నిరాకరించి, బెయిల్ పిటీషన్ని సైతం తిరస్కరించింది. ఐతే కోర్టు నోటీసుల నిమిత్తం విచారణ చేయగా... నిందితుడు మిశ్రా వృద్ధురాలు అనారోగ్య కారణాల రీత్యా ఆమెనే మూత్ర విసర్జన చేసిందని ఆరోపణలు చేశాడు (చదవండి: ఎయిర్ ఇండియా ‘మూత్ర విసర్జన’ ఘటనలో కొత్త కోణం.. ‘నేను అసలు ఆ పని చేయలేదు’) -
ధరల మంట.. పరిశ్రమలకు సెగ!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి బుధవారం వెలువడిన అధికారిక గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా తొమ్మిదవ నెల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న ఆరు శాతం వద్ద కట్టడి పరిధి దాటి నమోదయ్యింది. పైగా ఆగస్టులో 7% ఉంటే, సెప్టెంబర్‌లో 7.41%కి (2021 ఇదే నెల ధరలతో పోల్చి) పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.35 శాతమే. ఇక ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో వృద్ధిలేకపోగా 0.8 శాతం క్షీణించింది. సామాన్యునిపై ధరల భారం రిటైల్ ద్రవ్యోల్బణ బాస్కెట్లో కీలక ఆహార విభాగం ధరలు సెప్టెంబర్‌లో తీవ్రంగా పెరిగాయి. మొత్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టం... 7.41 శాతం పెరగ్గా, ఒక్క ఫుడ్ బాస్కెట్ ఇన్ఫ్లెషన్ 8.60 ( ఆగస్టులో 7.62 శాతం) శాతానికి చేరింది. కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా నాలుగుసార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) ఈ నాలుగు దఫాల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగి, ఏకంగా 5.9 శాతానికి (2019 ఏప్రిల్ తర్వాత) చేరింది. మరింత పెరగవచ్చనీ ఆర్బీఐ సంకేతాలు ఇచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5%, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనావేసింది. అక్టోబర్, నవంబర్‌ల్లోనూ ద్రవ్యోల్బణం ఎగువబాటనే పయనిస్తే, తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 5 నుంచి 7 సమయంలో ఆర్బీఐ రెపో రేటును మరో అరశాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన తొమ్మిది నెలలుగా ద్రవ్యోల్బణం కట్టడిలో ఎందుకు లేదన్న అంశంపై కేంద్రానికి ఆర్బీఐ త్వరలో ఒక నివేదిక సమర్పిస్తుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. 18 నెలల కనిష్టానికి పారిశ్రామిక రంగం ఇక ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి గడచిన 18 నెలల్లో ఎన్నడూ లేని తీవ్ర పతన స్థాయి 0.8 శాతం క్షీణతను చూసింది. 2021 ఫిబ్రవరిలో ఐఐపీలో 3.2 శాతం క్షీణత నమోదయ్యింది. తాజా సమీక్షా నెల్లో సూచీలో దాదాపు 60 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం కూడా 0.7% క్షీణతను (2021 ఇదే నెలతో పోల్చి) చూసింది. గత ఏడాది ఇదే కాలంలో తయారీ ఉత్పత్తి వృద్ధి రేటు 11.1%. మైనింగ్ ఉత్పాదకత 23.3 శాతం వృద్ధి నుంచి 3.9% క్షీణతలోకి జారింది. విద్యుత్ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు 16% నుంచి 1.4 శాతానికి పడిపోయింది. క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి రేటు 20% నుంచి 5%కి పడిపోయింది. -
బ్యాంకు లావాదేవీలు సమర్పించిన పూరి జగన్నాథ్
Tollywood Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈడీ ముందు హాజరైన విషయం తెలిసిందే. ఆగస్టు31న ఉదయం 10.05నిమిషాలకు ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో 2015-2021వరకు గత ఆరేళ్లలో జరిపిన బ్యాంకు లావాదేవీలు కావాలని ఈడీ నోటీసులో పేర్కొంది. దీంతో చార్టెడ్ అకౌంటెంట్‌తో కలిసి బ్యాంకు లావాదేవీల వివరాలను పూరి.. అధికారులకు సమర్పించారు. మూడు అకౌంట్లకు సంబంధించి గత ఆరేళ్లలో జరిపిన బ్యాంకు లావాదేవీల వివరాలను అందించారు. 2017లో నమోదైన కేసుల ఆధారంగా పలు కీలక విషయాలపై ఈడీ అధికారులు ఆయన్ను ఆరా తీస్తున్నట్లు సమాచారం. అలాగే విదేశీ లావాదేవిలపై కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది. దాదాపు 5 గంటల విచారణ తర్వాత భోజన విరామం ఇచ్చారు. అనంతరం మళ్లీ విచారణ ప్రారంభించిన అధికారులు... కేసుకు సంబంధించి కీలక వివరాలను రాబట్టినట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ విచారణ కొనసాగనుంది. గతంలో జరిపిన ఎక్సైజ్ సిట్ విచారణకు భిన్నంగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ సిట్ నుండి వివరాలు సేకరించిన ఈడీ 12మంది సినీ తారలకు బ్యాంకు వివరాలు సమర్పించాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. చదవండి : డ్రగ్స్ కేసు: ఈడీ విచారణకు హాజరైన పూరి జగన్నాథ్ -
కుట్రకు ముందు టీడీపీ నేతలు కలిశారు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కుట్రకు ముందు రేవంత్‌రెడ్డిని పలువురు టీడీపీ కీలక నేతలు కలిశారని, తర్వాత వారంతా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసానికి వెళ్లారని కేసులో ప్రధాన నిందితుడు, మల్కాజిగిరి ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒకప్పటి గన్మెన్లు వివరించారు. ఈ మేరకు గన్మెన్లు రాజ్‌కుమార్, వెంకటకుమార్‌లు మంగళవారం ఏసీబీ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ‘2015 మే నెలలో తెలుగుదేశం పార్టీ మహానాడు జరిగింది. మహానాడులోనే ఈ కుట్రకు బీజం పడింది. మహానాడులో పాల్గొన్న తర్వాత వేం నరేందర్‌రెడ్డి, ఎల్.రమణ, ప్రస్తుతం టీఆర్ఎస్ మంత్రిగా ఉన్న ఒకప్పటి టీడీపీ ముఖ్యనేతలతో రేవంత్‌రెడ్డి చర్చించారు. తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అనంతరం స్టీఫెన్సన్ ఇంటికి వచ్చారు’అని వారు వివరించారు. మరో గన్‌మన్ మహ్మద్ అమీరుద్దీన్, రేవంత్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి వాంగ్మూలాల నమోదు కోసం తదుపరి విచారణను న్యాయమూర్తి ఈనెల 8కి వాయిదా వేశారు. -
భరోసా కేంద్రంలో వాంగ్మూలాల నమోదు
సాక్షి, హైదరాబాద్: యాదాద్రిలో వ్యభిచారకూపంలో చిక్కుకున్న చిన్నారులు సాక్షులుగా ఇచ్చే వాంగ్మూ లాలను హైదరాబాద్‌లో ఉన్న భరోసా కేంద్రంలోని న్యాయస్థానంలో నమోదు చేయాలని, దీనికి తగిన చర్యలు తీసుకోవాలని దర్యాప్తు అధికారులను మంగ ళవారం హైకోర్టు ఆదేశించింది. వాంగ్మూలం ఇచ్చే చిన్నారులకు నైతిక స్థైర్యాన్ని ఇచ్చేందుకు ఆ న్యాయ స్థానంలో ప్రాక్టీస్ చేసే ముగ్గురు మహిళా న్యాయవా దులతో కమిటీ ఏర్పాటు చేయాలని మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది. వారి వాంగ్మూలాల నమోదును వీడి యో తీయాలని చెప్పింది. భరోసా కేంద్రం పిల్లలు, మహిళలకు ఉద్దేశించిందని, ఈ కేంద్రంలో వాంగ్మూ లాలు నమోదు చేస్తే ఆ చిన్నారులకు స్నేహపూరిత వాతావరణంలో ఉన్నట్లు ఉంటుందని పేర్కొంది. వాంగ్మూలాల నమోదు సమయంలో ఆ వ్యవహారం తో సంబంధం లేని వ్యక్తులెవరినీ అనుమతించరాద ని స్పష్టం చేసింది. ఆ చిన్నారుల శరీరాల్లో హార్మోన్ల అవశేషాలు ఉన్నాయో లేదో అన్న అంశంపై వచ్చే వారానికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 6కు వాయిదా వేసిం ది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ టీబీరాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. డీఎన్ఏ పరీక్షలు పూర్తి.. యాదాద్రిలో చిన్నారులను వ్యభిచార వృత్తిలోకి దింపిన వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను హైకోర్టు పిల్‌గా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవా రం సీజే నేతృత్వంలో ని ధర్మాసనం మరో సారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ స్పందిస్తూ.. చిన్నారుల శరీరాల్లో హార్మోన్ల అవశేషాలపై నివేదిక ఇచ్చేందుకు గడువు కావాలని కోరారు. ఇప్పటికే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి, చిన్నారుల అసలు తల్లిదండ్రులను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న ట్లు చెప్పారు. స్వచ్ఛంద సంస్థ ప్రజ్వల తరఫు సీనియర్ న్యాయవాది రవిచందర్ స్పందిస్తూ.. సీఆర్పీసీ సెక్షన్ 164 కింద ఆ చిన్నారుల వాంగ్మూ లాలను నమోదును భరోసా కేంద్రంలోని న్యాయ స్థానంలో చేపడితే బాగుంటుందని ప్రతిపాదించారు. ఇందుకు ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. సెక్షన్ 164 కింద వాంగ్మూలాలను నమోదు చేసేందుకు ఎంత సమయం పడుతుందని ధర్మా సనం ప్రశ్నించగా, ఇది సంబంధిత న్యాయస్థానం నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని శరత్ తెలిపారు. వాంగ్మూలాల నమోదుకు భరోసా కేంద్రంలోని కోర్టులో నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలని దర్యాప్తు అధికారులకు స్పష్టం చేసిం ది. ఇందుకు సంబంధించిన వివరాలను తదుపరి విచారణ నాటికి తమ ముందుంచాలని ఆదేశించిం ది. హార్మోన్ల విషయంలో ఎండ్రోకైనాలజీ వైద్యుల నివేదికనూ తమ ముందుంచాలని పేర్కొంది. -
మీడియాకి మనమే ‘మసాలా’ ఇస్తున్నాం
న్యూఢిల్లీ: బాధ్యతారాహిత్యంగా, నోటికొచ్చింది మీడియా ముందు మాట్లాడవద్దని, మీడియాకు మనమే మసాలా ఇస్తున్నామని బీజేపీ చట్టసభ్యులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం హెచ్చరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ వ్యక్తులను ఉద్దేశించి మోదీ తన మొబైల్ యాప్ ద్వారా సంభాషించారు. ‘కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర పార్టీ నేతలు మీడియాతో మాట్లాడటానికి తెగ ఉవ్విళ్లూరుతుంటారు. ఏదో ఒక వివాదంలో చిక్కుకుని చివరకు పార్టీకే కాకుండా తమకూ చెడ్డపేరు తెచ్చుకుంటారు. ఈ విషయంలో మీడియాను నిందించాల్సిన అవసరం లేదు.దాని పని అది చేస్తోంది. కెమెరా ముందు నిలబడి ప్రతి విషయంలోకి దూరి, దేశానికి మార్గదర్శనం చేయాల్సిన అవసరం మనకు లేదు. మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నవారే మీడియాతో మాట్లాడుతారు’ అని మోదీ అన్నారు. ‘మీడియా అది చేస్తోంది, ఇది చేస్తోందంటూ మన కార్యకర్తలు ఎన్నో మాటలంటుంటారు. కానీ మన తప్పులతో మనమే మీడియాకు వివాదాలను అందిస్తున్నామని ఎప్పుడైనా ఆలోచించారా? కెమెరా పట్టుకున్న వ్యక్తిని చూడగానే మనమేదో దేశంలోని ప్రతి సమస్యనూ విశ్లేషించగలిగే శాస్త్రవేత్తలమో, పరిశోధకులమో అని ఫీల్ అయిపోతాం. మనం మాట్లాడిన దాంట్లో నుంచి వారికి ఏది అవసరమో దానినే మీడియా ప్రతినిధులు తీసుకుంటారు. మనల్ని మనమే నియంత్రించుకోవాలి’ అని మోదీ హెచ్చరించారు. ‘అన్ని వర్గాల్లోనూ మన మద్దతుదారులు పెరుగుతున్నారు. బీజేపీలో అత్యధిక మంది చట్టసభ్యులు ఓబీసీలు, దళితులు, గిరిజనులే ఉన్నారు. వెనుకబడిన వర్గాల మద్దతు మనకు లభించిదనడానికి ఇది ఉదాహరణ’ అని మోదీ పేర్కొన్నారు. -
నీలోని గుడికి... 18 మెట్లు
మనిషి మనసులో దైవత్వం ఉంటే... మనిషి ఉనికి ఆలయం అవుతుంది. 2018లో ఈ 18 మెట్లను అధిరోహించి... మీలోని దైవత్వాన్ని చాటి చెప్పండి. మీలోని సుగుణాలతో... సమాజంలోపరివర్తనకు దారులు వేయండి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల నుంచి జల్లెడ పట్టి... మీ కోసం అల్లిన విశిష్ఠ సుమమాల ఇది. సృష్టిలో ఎదుటివారు చెప్పినది విని దాంట్లోని నిజానిజాలు తర్కించే శక్తి మానవుడి కొక్కడికే ఉన్నది. కానీ దురదృష్టం ఏమంటే నేటిరోజుల్లో నేను నమ్మిందే కరెక్టు, నా ఇష్టం వచ్చిందే నేను చేస్తాను అనడమే గొప్ప విషయంగా చలామణి అవుతోంది. మహాభారతంలో దుర్యోధనుని వెంట భీష్మద్రోణ కృపాచార్యులున్నా ఎందుచేత మట్టుపెట్టబడ్డాడనేదానికి ఒకటే కారణం చెబుతారు పెద్దలు. దుర్యోధనుడితో మహర్షులందరూ చెప్పారు... ‘‘నీవు చేస్తున్నది తప్పు. నీ పనివల్ల పాడైపోతావు. మా మాట విను. ఇలా చెయ్యకు’’ అన్నారు. అందుకాయన– ‘‘మీరు చెప్పేది మంచని తెలిసినా నేను పాటించను, మీరు చెప్పేది చెడని తెలిసినా నేను పాటించకుండా ఉండలేను’’ అన్నాడు. ఆ తత్వం పశువు కన్నా హీనం, అత్యంత ప్రమాదకరం. 1 . సంస్కారబలం ఉండాలి సంస్కారమనే మాట గొప్పది. చదువు దేనికోసం? సంస్కారబలం కోసం. చదువుకు సంస్కారం తోడయితే మీరు లోకానికి ఏ హితకార్యమైనా చేయగలరు. యుక్తాయుక్త విచక్షణ ఏర్పడుతుంది. సంస్కారబలంతో మీకు తెలియకుండానే గొప్ప వ్యక్తిత్వం ఏర్పడుతుంది. 2 . మోహాన్ని పోగొట్టుకోవాలి మిమ్మల్ని పొగుడుతూ మాట్లాడేవాళ్లు ఎక్కడికెళ్ళినా దొరుకుతారు. మీ క్షేమం కోరి, మీతో కఠినంగా మాట్లాడేవ్యక్తి దొరకడం కష్టం. దొరికినా అటువంటి మాట వినేవారు ఉండరు. ఒకవేళ అలా ఇద్దరూ దొరికితే జన్మ సార్థకమౌతుంది. మోహంలో పడిన అర్జునుడికి భగవద్గీతంతా చెప్పాడు కృష్ణ పరమాత్మ. చివరన ‘నీకేం అర్థమయింది’ అని అడిగాడు. ‘‘నాకు మోహం పోయింది. స్మృతి కలిగింది. నేను యుద్ధానికి బయల్దేరుతున్నా’’ అన్నాడు అర్జునుడు. 3 . తప్పొప్పుల కూడిక ఈప్రపంచంలో ఎవరూ ఒప్పులకుప్ప కాదు. నాలో దోషం తెలుసుకుంటే క్షమార్పణ అడుగుతా. మారీచుడు చెప్పాడు రావణుడికి... ‘‘నీకేంలోటు, ఇంతమంది భార్యలున్నారు. కాంచనలంక ఉంది, భటులున్నారు. రాముడి జోలికి వెళ్ళకు. వెళ్ళావా, అన్నీపోతాయి’’ అన్నాడు. అన్నీ విన్న రావణుడు ‘‘నువు చెప్పేది అయిపోయిందా. అయితే విను. నువ్వు చచ్చిపోవడానికి ఎలాగూ సిద్ధం. నామాట వింటే రాముడిచేతిలో చచ్చిపోతావు. వినకపోతే నా చేతిలో చస్తావు. ఎలా చచ్చిపోతావో చెప్పు’’ అన్నాడు. అంతేతప్ప నేను వింటానని అనలేదు. అలా అననందుకు అంత తపశ్శక్తి ఉన్న రావణాసురుడు చివరకు ఏమయిపోయాడు? 4. మాట వినడమన్నది తెలుసుకోవాలి మహాభారతం సమస్తసారాంశం ఇదే. దుర్యోధనుడి దగ్గరకెళ్ళి మహర్షులందరూ చెప్పారు, కొన్ని గంటలపాటూ చెప్పారు... అన్నీ విన్నాడు. అన్నీ విని వెటకారమైన మాటొకటన్నాడు. అహంకారబలం అది – ‘‘నాకు ధర్మం తెలియదా! తెలుసు. కానీ అలా చెయ్యాలనిపించడం లేదు. అయినా నేను తప్పులు చెయ్యడమేమిటి! నాకు చెబుతారెందుకు’’ అన్నాడు. మహర్షులు మాట్లాడుతుంటే సరిగా వినకుండా తొడలుకొట్టాడు, చివరకు తొడలు విరిగి పడి పోయాడు. 5 . పెద్దలమాట శిరోధార్యంగా స్వీకరించు తల్లి, తండ్రి, గురువులు, అనుభవజ్ఞులు, సమాజంలోని పెద్దలు చెప్పేది శ్రద్ధగా వినాలి. అయితే వారెప్పుడూ నీ దగ్గరే ఉండి ఇలా చెప్పడం సాధ్యపడుతుందా ? సాధ్యమే, ఎలానో తెలుసా? నేను చంద్రశేఖరేంద్ర భారతీ స్వామివారి అనుగ్రహభాషణం చదువుతుంటే, నా పక్కనే వచ్చి కూర్చుని స్వామి నాతో మాట్లాడుతుంటాడు. పరమాచార్య ప్రసంగాలు చదవండి, భారతీతీర్థస్వామి వారి ప్రసంగాలు చదవండి. పీఠాధిపత్యం వహించిన వారి వాక్కులు చదవండి. రామకృష్ణ పరమహంస, ఎపిజె అబ్దుల్ కలాం గారి మాటలు చదవండి. 6 .బాగుపడినా, పాడయిపోయినా కారణం–జడత్వమే జడమనే మాట ఒకటుంది. జడం–అంటే చైతన్యముంటుంది, కానీ ప్రతిస్పందన ఉండదు. ఒక రాతిలో చైతన్యం లేదని చెప్పలేం. కానీ దానిలో ప్రతిస్పందన ఉండదు. మీరు వెళ్ళి ఒక చెట్టును కొట్టారనుకోండి. మీకు వినబడకపోవచ్చు కానీ, దానిలో ప్రతిస్పందన ఉంటుంది. ఈ ప్రతిస్పందించగల శక్తి జడత్వానికి విరోధి. జడత్వం–అంటే చైతన్యం ఉండి కూడా ప్రతిస్పందించలేని బతుకు. ఒక మాటంటే ప్రతిస్పందన ఉండదు. అలాంటి ప్రతిస్పందనలేని లక్షణంలో నుంచి జడత్వం ఆవహిస్తుంది. అసలు లోకంలో ఒక వ్యక్తి వృద్ధిలోకి వచ్చినా, ఒక వ్యక్తి పాడయిపోయినా కారణమేమిటని అడిగింది శాస్త్రం. అందుకు జడత్వమే కారణం. 7. ఆదర్శాలు చెప్పడమే కాదు... ఆదర్శంగా మారాలి ఎప్పుడు ఏం చేస్తున్నా శ్రీరామాయణంలో చెప్పిన విషయాలను ఆదర్శంగా తీసుకుని ఆచరణలోకి తీసుకు వచ్చే ఒక కార్యశీలిని ‘నడిచే రామాయణం’ అంటారు. తాను చెప్పడం వేరు, తానే ఆ వస్తువుగా మారడం వేరు. చెప్పడం అందరూ చెప్తారు. ‘‘సర్వోపదేవ ఉపదేశాయ సర్వే వ్యాసపరాశరః:’’. ఇంకొకడికి చెప్పమంటే ప్రతివాడూ వ్యాసుడే, ప్రతివాడూ పరాశరుడే. కానీ నీవు చెప్పినదాంట్లో నీవెంత ఆచరిస్తావన్నదాన్నిబట్టి నీవు ఆదర్శంగా మారడమనే వస్తువు సిద్ధిస్తుంది. 8. ఎవరిలోపాన్ని వారే దిద్దుకోవాలి నాకు ఇలా ఉండటం తప్ప ఇంకోలా రాదనుకోవడం చాలా భయంకరమైన స్థితి. అది దిద్దుకోవలసిన స్థితి. మనిషి తాను తనలో ఉండకూడని లోపాన్ని దిద్దుకుంటే పదిమందికీ అతను పనికొస్తాడు. పదిమంది మీతో మాట్లాడటానికి అవకాశం ఇస్తే, మీరేమీ చేయాలో మీరు నిర్ణయం చేసుకోగలరు. మీ అభిప్రాయానికి ఒక స్పష్టత వస్తుంది. అసలు అందరూ మీ దగ్గరికి రావడానికి భయపడిపోయే స్థితిని కలిగిస్తే, ‘‘మీరు ఎక్కడ ఎలా ఉండి ఏం ప్రయోజనం’’ చెప్పండి. 9. కోపాన్ని తగ్గించుకోవాలి మీ కోపాన్ని మీకు మీరుగా పరిశీలించి దిద్దుకోవాలి తప్ప. నాకు కోపం వచ్చేసిందండీ. నేను కోపిష్టివాడినండీ అన్న తరువాత మీ ఆ కోపాన్ని తగ్గించగలిగే వాడు ఉండడు. దానికన్నా శత్రువు లేడు. నేను ఇలా ఉండవచ్చా? ఇంతటి కోపమేమిటి నాకు. ఈ కోపం వల్ల నేను సాధించేదేమిటి? అని కోపం వచ్చినప్పుడు మీరు కాసేపు ఏకాంతంలో కూర్చుని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మీకు వచ్చిన కోపాన్ని మీరు పరిశీలనం చేసుకొని కోపాన్ని విడిచిపెట్టగలిగిన వాడెవరో వాడు దేశానికి, సమాజానికి పనికొచ్చి తీరుతాడు. 10. జీవితం ప్రణాళికా బద్ధంగా ఉండాలి అధికారులు కింది వారిని సంప్రదించాలి. పని చేయడంలోని సాధకబాధకాలను తెలుసుకోవాలి. అధికారి చేతిలో వేలకోట్ల రూపాయల నిధులు విడుదల చేసే అధికారం ఉంటుంది. అవి సక్రమంగా ఖర్చుకావాలి. ప్రజలకు ఉపయోగపడాలి. అందుకు సరైన ప్రణాళిక ఉండాలి. రేపు మీరే ఆ అధికారి అయితే? అందుకే కత్తికి రెండు వైపులనూ అర్థం చేసుకుని ప్రణాళిక రచన చేయడానికి తగిన నైపుణ్యాన్ని అలవరుచుకోవాలి. 11. వినండి, వినడం నేర్చుకోండి ఒక సమస్యను బాగా పరిశీలించి, అవసరం అయితే కిందికి వచ్చి విని దానిని విశ్లేషణం చేసే నైపుణ్యం ఉండాలి. ఎవరైనా మాట్లాడటం మొదలు పెట్టేటప్పటికి రంధ్రాన్వేషణ చేయడం అన్నది జీవితంలో అలవాటు అయిపోయిందనుకోండి. అంతకన్నా ప్రమాదకరమైన అలవాటు ఇంకోటి లేదు. మీ జీవితంలో పైకి రావాల్సిన మార్గాలన్నీ మూసేసుకున్నట్టే. ఎవరు మాట్లాడుతున్నారన్నది కాదు. ఆ మాటలలో మనకు ఏమైనా సారాంశం అందుతుందా? అని ఎదురు చూసి, అందులో ఒక్క మంచి మాటను పట్టుకుని జీవితాన్ని మార్చుకోగలిగితే... వారి జీవితం చక్కబడుతుంది. 12. మీరు ఏది ఎందుకు చేస్తున్నారో స్పష్టమైన అభిప్రాయంతో ఉండండి నేను ఒక మాట చెబుతాను. మహాపురుషుడు వేరు, ఆ మహాపురుషుడు రాసిన పుస్తకం వేరు కాదు. వాల్మీకి వేరు, వాల్మీకి రామాయణం వేరు కాదు. ఇవి కలిసే ఉంటాయి. ఒక చంద్రశేఖరేంద్రస్వామివారు ఎప్పుడూ మీ పక్కన ఉండాలంటే ఆయన సందేశాల పుస్తకం మీ దగ్గర ఉండాలి. 13. మృత్పిండంలా కాదు... రబ్బరు బంతిలా ఉండాలి పదిమందికి ఉపయోగపడకుండా ఎప్పుడు పోతారో తెలుసాండి. మీలో తట్టుకునే శక్తి లేనప్పుడు. మట్టి ముద్దను మీరు ఇలా పట్టుకుంటే పొరపాటున మీ చేతిలోంచి జారికిందపడిపోయిందనుకోండి. ఇహ అది పైకి లేవదు. అదే రబ్బరు బంతి అయితే ఎంత కిందపడిందో అంతపైకి లేస్తుంది. చిన్న పొరపాటు కూడా జరగకుండా మీ జీవితం ముందుకు సాగదు. మీరు ఎంత గొప్పవాళ్లయినా మీకు వంక పెట్టకుండా ఉండలేరు. ఎవరో ఒకరు వంకపెట్టారని మీరు మృత్పిండమై పాడైపోకండి. మీవల్ల ఏదో ఒకనాడు పొరపాటు జరగవచ్చు. జరిగిననాడు మట్టి ముద్దలా కిందపడిపోకండి. 14. నిరాశను దరిచేరనివ్వకండి అబ్దుల్ కలాంగారి కెరీర్ ఎక్కడ నుండి ప్రారంభం. ఆయన కోరుకున్న ఉద్యోగం ఒకటి. ఆయనకు వచ్చిన ఉద్యోగం ఒకటి ఆయన నిరాశతో ఋషికేశ్‌లోని ఒక స్వామిజీ దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. స్వామిజీ అలా వెళుతూ నీరసంగా కూర్చున్న కలాంగారిని పిలిచి అడిగారు. ఏం ఎందుకలా కూర్చున్నావని. ఈయనన్నారు. ‘‘నేను ఫలానా ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్లాను, అది పొందడం నాకిష్టం. కాని నేను సెలెక్ట్ అవ్వలేదు. ఏదో ఈ ఇంటర్వ్యూ అని మరో దానికి వెళ్లాను, సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు నాకీ ఉద్యోగం చేయాలని లేదు. నాకిష్టంలేదు’’ ఆ స్వామీజీ ఒక చిరునవ్వు నవ్వి అన్నారు. ‘‘నీవు కోరుకుంటున్నదే దొరకాలని ఎందుకనుకుంటున్నావు. ఏమో ఈశ్వరుడు నీ ద్వారా ఈ జాతికి యేం చేయించాలనుకుంటున్నాడో’’ ఆ మాట ఆయన మీద పనిచేసింది. అంతే ఈ దేశానికి ఉపగ్రహాలు తయారు చేసుకోవడానికి సత్తానిచ్చిన మహాపురుషుడయ్యాడు. 15. మంచి మంచి పుస్తకాలు చదవండి ఏ పుస్తకం పడితే అది చదవకండి. వివేకానందుని ఉపన్యాసాలు చదవండి. మీకెంతో ధైర్యం వస్తుంది. పేడలో పురుగుపుట్టి పెరిగినట్లు బ్రతకకూడదు. మంచిగా బ్రతకడానికి కలేజా కావాలి. రామకృష్ణ పరమహంస కథలు చదవండి. చాలామందిలో తెలుగు మాట్లాడాలా? ఇంగ్లిషు మాట్లాడాలా అన్న సందిగ్ధం మొదలైంది. ఇంగ్లిషు బాగా చదువుకుని పాసవండి. చక్కగా తెలుగులో మాట్లాడండి. మీరు పెద్దయ్యాక రామాయణ గ్రంథప్రతుల్ని వేయి ముద్రించి పంచిపెట్టండి. ఆదివారాలు సాహితీ సభలకు వెళితే చక్కగా తెలుగులో మాట్లాడండి. పోతన గారి నాలుగు పద్యాలు చెబుతూ ప్రసంగం చేయండి. గురువుల పట్ల, పెద్దల పట్ల మర్యాదను సంతరించుకోండి. 16. ఆరాధించడం కాదు... ఆదర్శంగా తీసుకోవాలి ప్రపంచ ప్రఖ్యాత బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌కు ఉత్థాన పతనాలున్నాయి. ఎంత కిందకి పడిపోయాడో అంతపైకి లేచాడు. టెండూల్కర్ క్రికెట్ చూడటం కాదు. టెండూల్కర్ వెనుక ఆ స్థాయికి ఎదగడానికి ఉన్న కారణం చూడండి. ఒక బాల్ వస్తున్నప్పుడు గ్రద్ద ఆకాశంలో ఉండి కోడిపిల్లను చూస్తున్నట్టు చూస్తూ ఉంటాను. బంతి ఎక్కడ పడుతుంది. దీన్ని ఏ డైరెక్షన్లో కొట్టాలి? అని... అంతే! స్ట్రోక్ అప్లై చేస్తాను అన్నాడు. అలా మీరు కూడా మీ గురువుల గురించి చెప్పేటటువంటి శీలాన్ని అలవాటు చేసుకోండి. 17. విజయాన్నీ, వైఫల్యాన్నీ సమానంగా తీసుకోవాలి మనం చేసే ప్రతి ప్రయత్నంలో విజయం, వైఫల్యం ఉంటుంటాయి. ఒక చోట విజయం వరిస్తే ఇక నా అంతటి వాడు లేడని రొమ్మువిరుచుకుని తిరగకూడదు, అక్కరలేని భేషజాలకు పోయి పాడయి పోకూడదు. అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయత్నం ఫెయిల్ అయినట్లు కనబడుతుంటుంది. అలా ఫెయిలవడం నీ జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం కావాలి. కాబట్టి ఎప్పుడైనా ఎవరికైనా వైఫల్యం సంభవిస్తే బెంగపెట్టుకుని స్తంభించి పోకూడదు. మళ్ళీ ఉత్సాహంగా పూనికతో వృద్ధిలోకి రావాలి. 18. పొగడ్తకు పొంగిపోకండి ఎప్పుడైనా సరే పొగడ్తకు మించిన మత్తు ఉండదు. పొగడ్తకు మించి లోకంలో పాడవడానికి మరొక కారణం కూడా కనిపించదు. జీవితంలో పొగడ్త అన్నది ఎంతమోతాదులో పుచ్చుకోవాలో అంతే మోతాదులో పుచ్చుకోవాలి. మందులే కదా అని మోతాదుకు మించి తీసుకుంటే విషమై చచ్చిపోతారు. అలాగే నీవు వృద్ధిలోకి రావడానికి పొగడ్త కూడా ఎంతవాడాలో అంతే వాడాలి. - నిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
హెచ్చెల్సీకి నీటి సాధన రైతుల విజయం
∙అఖిలపక్ష నాయకులు అనంతపురం సప్తగిరి సర్కిల్: హెచ్చెల్సీకి నీటి కేటాయింపు అన్నది రైతులు సాధించిన నైతిక విజయమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి శరత్‌చంద్రారెడ్డి, ౖరైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకటచౌదరి, ఏపీసీసీ అధికార ప్రతినిధి రమణ తెలిపారు. సోమవారం వారు స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. అఖిలపక్ష నాయకులు, రైతులు ఎగువపల్లి వద్ద నిర్వహించిన డీఈ కార్యాలయ ముట్టడిపై అధికారులు స్పందించారన్నారు. ఈ నెల 16 నుంచి జనవరి 31 వరకు నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారని వారు తెలిపారు. జిల్లాలో కరువును రూపుమాపేందుకు ఉన్నతా«ధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రైతులకు, అఖిలపక్ష నాయకులకు, వివిధ శాఖల అ«ధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. సీపీఐ రైతు సంఘం కార్యదర్శి కాటమయ్య, రైతు సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
యూకే వెబ్సైట్ సంచలన ప్రకటన
లండన్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోయాడంటూ అమెరికాకు చెందిన ఓ వెబ్ సైట్ సంచలన ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన సాక్ష్యాలను వెల్లండించింది. భారత స్వాతంత్ర్య సమరయోధుడు బోస్ తైవాన్ విమాన ప్రమాదంలోమరణించారని నిక్కచ్చిగా తేల్చి చెబుతోంది. తమ ప్రకటనకు మద్దతుగా నేతాజీ సన్నిహిత సహచరుడు, ఇద్దరు జపాన్ వైద్యులు, నర్స్ ఒక జర్నలిస్టు, ఇలా అయిదుగురి సాక్షులను అధికారికంగా ప్రకటించింది. దీంతో నేతాజీ డెత్ మిస్టరీపై మరింత చర్చకు తెరలేచింది. భారత జాతీయ సైన్యం యొక్క స్థాపకుడైన బోస్ 1945 ఆగస్టు 18 న మరణించాడని ధృవీకరిస్తోంది. విమానం ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అదే రోజు అర్ధరాత్రి మరణించారంటోంది. దీంతో పాటు నేతాజీ చనిపోతూ భారత ప్రజలకు ఒక సందేశానిచ్చినట్టుగా పేర్కొంది. ఆనాటి విమాన ప్రమాదంనుంచి ప్రాణాలతో బైటపడిన బోస్ అంగరక్షకుడు , కల్నల్ హబాబుర్ రెహమాన్ 1 945 ఆగస్టు 24న ఒక ప్రకటన చేశారంటోంది. అది నేతాజీ చివరి మాటలతో కూడిన ప్రకటన అని పేర్కొంది. "తన మరణానికి ముందు ఆయన (బోస్) తన ముగింపు సమీపంలో ఒక సందేశాన్ని ఇచ్చారు. తాను భారతదేశం యొక్క స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న క్రమంలో తన ప్రాణాలనుకూడా ధారపోస్తున్నాని చెప్పారు. భారతదేశ ప్రజలు తమ స్వాతంత్ర్యం పోరాటం కొనసాగించాలని ఆకాంక్షించారు. లాంగ్ లివ్ ఆజాద్ హింద్ అంటూ కన్నుమూశారని కల్నల్ ప్రకటించాడంటోంది. 1945 సెప్టెంబర్‌లో ఫిన్నె , డేవిస్ ల ఆధ్వర్యంలో భారతదేశ రెండు ఇంటిలిజెన్స్ బృందాలు బ్యాంకాంక్ , సైగాన్, తాయ్ పే లలో పర్యటించి విచారించాయంటోంది. అనంతరం విమానం ప్రమాదంలో బోస్ మరణించినట్టుగా ఒక అంచనాకు వచ్చారని తెలిపింది. దీంతోపాటుగా నేతాజీకి చికిత్సచేసిన ఇద్దరు డాక్టర్లు, నర్సు అందించిన వివరాలను ఉటంకింస్తోంది. ఈ కేసులో పరిశోధనకు వెళ్లిన ముంబై జర్నలిస్టు హరీన్ షా కు బోస్‌కు చికిత్స అందించిన నర్స్ చెప్పిన వివరాలను ఈ వెబ్సైట్లో ప్రచురించారు. -
ప్రవచనాలు నాకు ఇంత కీర్తి తెస్తాయనుకోలేదు
చాగంటి కోటేశ్వరరావు సాక్షి, న్యూఢిల్లీ: ప్రవచనాలు చేయడం ఇంత కీర్తిని సంపాదించి పెడుతుందని ఏనాడూ అనుకోలేదని ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. సంపాదన ఆశించి ఏనాడూ ప్రవచనాలు చెప్పలేదని, ఇప్పటివరకు వాటిపై ఒక్క పైసా సంపాదించలేదని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం స్థానికఏపీభవన్‌లో ఢిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో నిర్విహ ంచిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ప్రతి రోజూ రెండు గంటల పాటు ప్రవచనం చేయడం ఒక తపస్సు అవుతుంది. ఈ వ్యాపకాన్ని అలవాటు చేసుకున్నా. దీనిపై ఏనాడూ సంపాదన ఆశించలేదు. నా ఆత్మ ఉద్ధరణ కోసమే ప్రవచనాలు చెబుతున్నా’ అని అన్నారు. ఢిల్లీలోని తెలుగువారు చూపిన ప్రేమకు ఆనందంగా ఉందని చెప్పారు. తనను ఎంతో గొప్పగా ఉపమానాలతో పోల్చడం అమ్మ మనసును తెలియజేస్తుందని తెలిపారు. ప్రవచనాలు చెప్పగ లగడం తన ప్రతిభ కాదని, ఈశ్వరుడి అనుగ్రహమని అన్నారు. ధిక్కార భావ జీవితం ఎప్పటికీ పూర్ణత్వాన్ని సాధించలేదని, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుంటూ పనులు చేయాలని సూచించారు. ఎవరికో ఒకరికి లోబడి పనిచేయాలని, మావటికి లొంగితేనే ఏనుగుకు వేంకటాచల క్షేత్రంలోని మాడ వీధుల్లో తిరిగే అర్హత ఉంటుందని ఉదహరించారు. మన్మధనామ సంవత్సరాన్ని పురస్కరించుకుని కూచిబొట్ల సూర్యనారాయణ శర్మ పంచాగశ్రవణాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జీవీజీ కృష్ణమూర్తి, ఎఫ్‌సీఐ సీఎండీ సి. విశ్వనాథన్, డీటీఏ కార్యవర్గ సభ్యులు, ఢిల్లీలోని తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
కోరుట్లా..? జగిత్యాలా..?
‘తెలంగాణ రాష్ట్రాన్ని 23 జిల్లాలుగా పునర్విభజన చేస్తం.. జగిత్యాలను జిల్లాగా మారుస్తం.. మొదటి ప్రాధాన్యం జగిత్యాలకే ఇస్తం..’ - ఎన్నికల ప్రచారంలో, ఆ తర్వాత సీఎం కేసీఆర్ ప్రకటన. ‘కోరుట్ల జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తాం..’ - కోరుట్ల జిల్లా సాధన సమితి నేతలకు ఎంపీ కవిత హామీ కోరుట్ల: తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తెరపైకి రాకముందే.. కొత్త జిల్లా ఏర్పాటు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. జగిత్యాలను జిల్లాగా మార్చాలన్న ప్రతిపాదన ప్రస్తుతం కాగితాల్లో ఉండగా.. కోరుట్ల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ ఉద్యమం ఊపందుకుంది. గతంలోనే జగిత్యాలను జిల్లా కేంద్రంగా మార్చుతామని సీఎం కేసీఆర్ ప్రకటించగా.. కోరుట్ల జిల్లా ఏర్పాటు కోరుతూ శనివారం అఖిలపక్ష నాయకులకు ఎంపీ కవితను కలిశారు. ఈ ప్రతిపాదనను పరిశీలించి మద్దతు ఇస్తామని ఆమె చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒకే డివిజన్లోని రెండు ప్రాంతాల్లో జిల్లా కేంద్రం ఎవరికి దక్కుతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. గతంలో కోరుట్ల సెగ్మెంట్ కోసం ఉద్యమం నిర్వహించి సక్సెస్ అయిన కోరుట్ల వాసులు ఈసారి జిల్లా సాధనకు ఉద్యమానికి పూనుకున్నారు. కోరుట్లను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతున్న సాధన సమితి ప్రతినిధులు అందుకు అనుకూలంగా పలు అంశాలను ఎత్తిచూపుతున్నారు. కరీంనగర్-నిజామాబాద్ జిల్లాలకు మధ్యభాగంలో ఉండటంతో మూడు జిల్లాల్లోని సుమారు 25 మండలాలకు అందుబాటులో ఉండి భౌగోళిక సౌలభ్యతను కలిగి ఉంది. దీనికితోడు కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్ తర్వాత కోరుట్ల మండలంలోనే ప్రభుత్వ భూములు అత్యధికంగా ఉన్నాయి. సుమారు 1400 ఎకరాల ప్రభుత్వ భూములు ఉండటంతో జిల్లా కేంద్రం ఏర్పాటుకు అవసరమైన అన్ని కార్యాలయాలకు ఎలాంటి స్థల సమస్య ఉండబోదని వాదిస్తున్నారు. ఇప్పటికే సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న కోరుట్ల ప్రస్తుతం ఫస్ట్‌గ్రేడ్ మున్సిపాలిటీకి ఉండాల్సిన ఆర్థిక పరిపుష్టితో పాటు జనాభా వంటి అర్హతలు కలిగి ఉంది. దీంతోపాటు జిల్లా కేంద్రంలో ఉండే వెటర్నరీ యూనివర్సిటీ కోరుట్లలోనే ఉంది. ఈ నేపథ్యంలో కోరుట్ల జిల్లా కేంద్రంగా కావాలని కోరుతూ స్థానిక అఖిలపక్ష నాయకులు ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఓ అడుగు ముందుకేశారు. 38 రోజుల దీక్షలు.. జిల్లా సాధన కోరుతూ ఉద్యమించిన కోరుట్ల అఖిలపక్ష నాయకులు, స్థానిక యువజన, కుల, కార్మిక సంఘాల మద్దతుతో ముందుకు కదిలారు. మొదట ధర్నాలు, రాస్తారోకోలతో జిల్లా సాధన ఆకాంక్షను చాటి చెప్పిన అఖిలపక్ష నాయకులు తదనంతర కాలంలో ఉద్యమాన్ని రిలే దీక్షల రూపంలోకి మార్చా రు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, వివిధ పక్షాల నాయకులను ఉద్యమంలో భాగస్వాములను చేశారు. ప్రతీ రోజు ఓ సంఘానికి చెందిన ప్రతినిధులు దీక్షల్లో కూర్చుని కోరుట్ల వాసుల ఆకాంక్షను చాటిచెప్పారు. 38రోజుల పాటు దీక్ష కొనసాగించిన అఖిలపక్ష నాయకులు ఎంపీ కవిత హామీతో సోమవారం దీక్షలను విరమించారు. జిల్లా రూపకల్పనకు సంబంధించి ఎలాం టి ప్రతిపాదనలు తె రపైకి వచ్చినా.. మళ్లీ ఉద్యమానికి సిద్ధంగా ఉంటామని ప్రకటించడం గమనార్హం. దశలవారీగా ఉద్యమం సాగుతుంది కోరుట్లకు జిల్లా కేంద్రంగా ఉండాల్సిన అర్హతలు అన్ని ఉన్నాయి. ప్రస్తుతం ఎంపీ కవిత హామీతో రిలే దీక్షలు విరమిస్తున్నాం. జిల్లా ఏర్పాటు ప్రతిపాదనలను ఉన్నత శ్రేణి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తాం. జిల్లా కేంద్రం కోసం విడుతల వారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. - చెన్న విశ్వనాథం, జిల్లా సాధన ఉద్యమ సమతి కన్వీనర్ అనుకూల అంశాలు ఎన్నో.. జిల్లా కేంద్రంగా మార్చడానికి అవసరమైన అన్ని హంగులు కోరుట్లకు ఉన్నాయి. కోరుట్ల చుట్టుపక్కల ఉన్న మండలాల ప్రజలు సైతం ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తే ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది. - వాసాల గణేష్, యవజన సంఘాల నాయకులు, కోరుట్ల ఎల్లవేళలా ముందుంటాం కోరుట్లను జిల్లా కేంద్రంగా మార్చడానికి జరిగే ఉద్యమానికి స్థానిక కుల సంఘాలు ఎల్లవేళలా మద్దతుగా ఉంటాయి. అన్ని కులసంఘాలు చురుకుగా ఉద్యమంలో పాల్గొన్నాయి. నాయకులు అందరూ కలిసిరావడం ఆశించదగ్గ పరిణామం. - దేవయ్య, నాయీబ్రహ్మణ సంఘ నాయకులు -
సీల్డ్ కవర్లో వాంగ్మూలాలు
బొగ్గు కుంభకోణం కేసులో దర్యాప్తు పురోగతి నివేదికను ప్రత్యేక కోర్టుకు సమర్పించిన సీబీఐ సీల్డ్ కవర్ తెరిచి పరిశీలించిన న్యాయమూర్తి రెండు వారాల్లో దర్యాప్తు పూర్తిచేస్తామన్న సీబీఐ న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కుంభకోణం కేసులో కొనసాగుతున్న దర్యాప్తులో ప్రగతిపై నివేదికను, ఈ కేసుకు సంబంధించి తాజాగా సీబీఐ అధికారులు ప్రశ్నించిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, నాటి పీఎంఓ ఉన్నతాధికారుల వాంగ్మూలాలను.. కేంద్ర దర్యాప్తు సంస్థ మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు సీల్డ్కవర్లో సమర్పించింది. ఈ కేసులో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను కూడా ప్రశ్నించాల్సిందిగా సీబీఐని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. బొగ్గు మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్, పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా తదితరులు నిందితులుగా ఉన్న ఈ బొగ్గు కుంభకోణం కేసులో దర్యాప్తును పూర్తిచేసేందుకు మరో రెండు వారాల గడువును సీబీఐ కోరింది. విచారణ సందర్భంగా సీల్డ్ కవర్‌ను తెరచి.. సీబీఐ సమర్పించిన వాంగ్మూలాలు, ఇతర పత్రాలను ప్రత్యేక న్యాయమూర్తి భరత్‌పరాశర్ పరిశీలించారు. అయితే.. ఈ వాంగ్మూలాలు, పత్రాలను తదుపరి దర్యాప్తు పూర్తయ్యేవరకూ సీల్డ్ కవర్లోనే ఉంచాలని, వాటిని పరిశీలించేందుకు అనుమతించరాదని సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.కె.శర్మ కోర్టుకు విజ్ఞప్తిచేశారు. ఈ నేపధ్యంలో ఆయా పత్రాలన్నిటినీ మళ్లీ సీల్డ్ కవర్లో ఉంచి, కోర్టు సీల్‌తో సీల్ చేయాలని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు. దర్యాప్తును రెండు వారాల్లో పూర్తిచేస్తామని సీబీఐ పేర్కొనడంతో.. కేసు విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేశారు. బొగ్గు స్కాం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, అప్పటి ప్రధానమంత్రి కార్యాలయంలోని ఉన్నతస్థాయి అధికారులైన మన్మోహన్ ముఖ్య కార్యదర్శి టి.కె.ఎ.నాయర్, వ్యక్తిగత కార్యదర్శి బి.వి.ఆర్.సుబ్రమణ్యం తదితరులను కూడా ప్రశ్నించాల్సిందిగా ప్రత్యేక కోర్టు గత డిసెంబర్ 16వ తేదీన ఆదేశించటంతో.. సీబీఐ ఆ మేరకు వారిని ప్రశ్నించి తాజాగా పురోగతి నివేదికను, వాంగ్మూలాల పత్రాలను కోర్టుకు సమర్పించింది. ఒడిశాలోని తాలాబిరా-2 బొగ్గు క్షేత్రాన్ని 2005 సంవత్సరంలో హిందాల్కో సంస్థకు కేటాయించటంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. హిందాల్కోకు అనుకూలంగా వ్యవహరించలేదన్న మన్మోహన్! తాలాబిరా-2 కేటాయింపులో హిందాల్కోకు ఏ విధంగానూ అనుకూలంగా వ్యవహరించలేదని.. నిర్దిష్ట విధివిధానాల ప్రకారమే కేటాయింపు జరిగిందని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సీబీఐకి స్పష్టంచేసినట్లు తెలిసింది. ఈ కేసులో కోర్టు ఉత్తర్వుల మేరకు 10 రోజుల కిందట తనను ప్రశ్నించిన సీబీఐ అధికారులకు ఆయన పై విధంగా వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. తాలాబిరా-2 బొగ్గు క్షేత్రం కేటాయింపు జరిగినపుడు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ నాటి ప్రధాని మన్మోహన్ పర్యవేక్షణలోనే ఉన్న విషయం తెలిసిందే. హిందాల్కో సంస్థకు తాలాబిరా-2 బొగ్గు క్షేత్రాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా 2005 మే 7, జూన్ 17 తేదీల్లో ప్రధానికి రెండు లేఖలు రాసిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలో చోటుచేసుకున్న పరిణామాల గురించి.. సీబీఐ అధికారులు కొద్ది రోజుల కిందట మన్మోహన్‌ను ప్రశ్నించినట్లు అభిజ్ఞవర్గాలు తెలిపాయి.